Jump to content

Amaravati


Recommended Posts

200 ft adhi. About 60m. National highway meedha oka lane 3.5m vuntundhi. 60m lo both sides greenery, madhyalo greenery penchina easy ga 8 lines padathayi

2 lane brts ki pothe Inka migilindhi 6 lane.. So 10 years taruvata saripothai Antara ?? 10 years ani endhuku antunnanu ante full pledge ga start avadaniki min 10 years patudhi

Link to comment
Share on other sites

2 lane brts ki pothe Inka migilindhi 6 lane.. So 10 years taruvata saripothai Antara ?? 10 years ani endhuku antunnanu ante full pledge ga start avadaniki min 10 years patudhi

10-15 years ki saripothayi. Appatiki population ippati vijayawada antha avthundhi. Ee lopu metro lantidhi vasthe no problem. Excessive width vunna roads valla heat ekkuva vuntundhi. Asale humidity ekkuva
Link to comment
Share on other sites

అమరావతిలో బిజినెస్‌ స్కూల్‌!

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తరహా సంస్థ కూడా ఏర్పాటు

200 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మాణం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను తలదన్నేలా ప్రపంచశ్రేణి ప్రమాణాలతో అమరావతిలో ఒక బిజినెస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) తరహాలో ఇక్కడ కూడా ఒక అత్యున్నత వేదికను నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో వీటిని నెలకొల్పనున్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేస్తుంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆయన అమరావతిలో కూడా అంతకంటే మించి ఉత్తమంగా ఉండేలా, దానికంటే పెద్ద స్థాయిలో ఐఎస్‌బీని ఏర్పాటుచేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇందులో మామూలుగా అందించే ఎంబీఏ కోర్సులతో పాటు కార్పొరేట్‌, పొలిటికల్‌, ఉన్నతాధికారుల పాలన (బ్యూరోక్రటిక్‌ గవర్నెన్స్‌) లాంటి వాటిలో ప్రత్యేక కోర్సులు అందిస్తారు. 300 నుంచి 500 మందికి ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. అలాగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తరహాలో ఇక్కడ ప్రత్యేక ఫోరాన్ని ఏర్పాటుచేసి దానికి గుర్తింపు తీసుకురావాలనే తలంపుతో ఉన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిధుల కోసం ఇబ్బందులు లేకుండా కార్పొరేట్‌ సంస్థల సహకారంతో సీఐఐ భాగస్వామ్యంతో నిర్మించాలనేది ప్రతిపాదన. పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను నాలుగు కార్పొరేట్‌ సంస్థల విరాళాలతో నిర్మించారు. ఒక్కో సంస్థ రూ.50 కోట్లు ఇచ్చింది. ఇదే తరహాలో అమరావతిలో నిర్మించబోయే బిజినెస్‌ స్కూలుకు పది కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాలు సేకరించనున్నారు. రూ.400 కోట్లు సేకరించడంతో పాటు రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్‌తో దీన్ని నిర్వహించనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో బిజినెస్‌ స్కూలు నిర్మిస్తారు. పది ఎకరాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. మిగిలిన 90 ఎకరాల్లో జర్మనీలోని హానోవర్‌లో ఉన్నట్లు భారీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని సీఐఐ భరిస్తుంది. 2018-19కల్లా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలనేది లక్ష్యం.

వచ్చే నెల నుంచి చర్చలు: అమరావతిలో బిజినెస్‌ స్కూలుకు సంబంధించి సీఐఐ ప్రతినిధులతో వచ్చే నెల నుంచి ప్రభుత్వం చర్చించనుంది. ఆర్థికాభివృద్ధి మండలి సీఐఐ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాక బిజినెస్‌ స్కూల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనుంది. బిజినెస్‌ స్కూలును ఎలా చేపట్టాలి? నిర్మాణం తదితర అనేక అంశాలను ఈ సందర్భంగా సీఐఐతో చర్చించి ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం ముందుకెళ్లనున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి సహకరించడానికి ప్రమోద్‌ సింగ్‌ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. హైదరాబాద్‌లో ఐఎస్‌బీని తీసుకురావడంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఎంతో సహకరించారు. ఇప్పుడు కూడా అమరావతిలో ఆయన సేవలు వినియోగించుకుంటే ప్రయోజనకరమని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

మంగళగిరిలో జపాన్‌ బృందం పర్యటన
 
 
636376024681816631.jpg
మంగళగిరి టౌన్‌: రాజధాని ప్రాంతంలో ప్రధాన పట్టణంగా వున్న మంగళగిరిలో భవిష్యత్‌ అవసరాల మేరకు ట్రాఫిక్‌ను ఎలా క్రమబద్దీకరించాలని అనే విషయమై సమగ్ర సర్వే నిర్వహించేందుకు జపాన్‌ ప్రతినిధి బృందం శనివారం పట్టణంలో పర్యటించింది. సీఆర్‌డీఏ పరిధిలోని అన్ని పట్టణాల్లో భవిష్యత్‌ అవసరాలపై సర్వే నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ సొసైటీకి బాధ్యతలను అప్పగించింది. 2050 నాటికి జనాభా ఎంతవరకు పెరగొచ్చు, అలాంటి పరిస్థితులలో ఇప్పుడున్న ఇరుకు రోడ్లను ఎంత మేరకు విస్తరించాలి, ఏయే ప్రాంతాలను విస్తరిస్తే అనుకూలంగా వుంటుంది అనే అంశాలను ఈ సొసైటీ పరిశీలిస్తుంది. ఈ సొసైటీకి రాష్ట్రానికి చెందిన ఆర్వీ అసోసియేట్స్‌ సహకారం అందించనుంది. సొసైటీ ప్రతినిధి టొనోహిరో టకాతి, ఆర్‌వీ అసోసియేట్స్‌ మేనేజరు కే జగదీష్‌లు అధికారులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదార్లను పరిశీలించారు. వైష్ణవి కల్యాణ మండపం వద్ద నుంచి మిద్దె సెంటరు మీదుగా వడ్లపూడి సెంటరు వరకు తిరిగారు.
 
 అనంతరం పట్టణం నుంచి బైపాస్‌ను చేరుకునేందుకు మరోమార్గంగా వున్న ఆత్మకూరు రోడ్డును సందర్శించారు. మునిసిపల్‌ కమిషనరు ఎన్వీ నాగేశ్వరరావు బృందానికి కావలసిన వివరాలను వెల్లడించారు. ట్రాఫిక్‌తోపాటు మోటరైజ్డ్‌, నాన్‌మోటరైజ్డ్‌ వాహనాలు, ఇతర అంశాలను సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. మరో వారం పదిరోజుల్లో సర్వే ప్రారంభమవుతుందని, అధ్యయనం అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలిపారు. బృందం వెంట మునిసిపల్‌ డీఈ పంచుమర్తి ఏడుకొండలు, ఏఈ రాము, ప్రణాళికా విభాగం అధికారి మల్లికార్జునరావు, కౌన్సిలర్లు నరేంద్ర, గోలి నాగశ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు వున్నారు.
Link to comment
Share on other sites

Naidu to Re-Create ISB Magic in Amaravati It is not new for Chandrababu Naidu to make master pieces out of trash. The Chief Minister, who has brought the ISB to Hyderabad back then, is now going to set-up a Business School in Amaravati with super standards. It was Naidu in the past brought ISB to Hyderabad when the city didn’t have any infra lobbied. It was supposed to go to another state but he changed everything in the last minute with his intellect. Having done that, this business school in Amaravati is expected to be the most sophisticated Institute. The institute has been proposed to be built on 100 acres with a budget of Rs 500 crore as the reports say. The dean of ISB has been involved in assisting the project. A blue print would be submitted to the CM and his call would be final for the setup. This project is part of the Sunrise Vision 2029 and is going to pool in London School of Economics, Harvard Kennedy School, the National University of Singapore for the collaboration. That is an insanely great news!

 

Link to comment
Share on other sites

రాచబాటలు శరవేగం...
07-08-2017 07:21:57
 
అమరావతి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో మొత్తం 11 రోడ్లను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థల సిబ్బంది పరుగులు పెడుతున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ (ప్యాకేజ్‌్‌ -1)తోపాటు ఫేజ్‌-1 రోడ్లలో భాగమైన 7 రహదారులు 2018, తొలి మాసాల్లోపే పూర్తి చేయడం ద్వారా రాజధానిలోని ఇతర రోడ్లు, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులతోపాటు నిర్మాణాలూ వేగంగా జరిగేందుకు ఏడీసీ ప్రణాళికలు రూపొందించింది.
 
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలోని దాదాపు అన్ని గ్రామాలతోపాటు వాటికి సంబంధించిన ఎల్పీఎస్‌ లేఅవుట్లను సైతం పరస్పరం అనుసంధానించడమే కాకుండా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో కలిపేందుకు ఉద్దేశించిన 11 ప్రయారిటీ రోడ్లలో 8 వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తవనున్నాయి. వీటిల్లో.. కొన్ని నెలల క్రితమే ప్రారంభమై, చకచకా పనులు జరుగుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ (ప్యాకేజ్‌్‌ - 1)తోపాటు ఫేజ్‌-1 రోడ్లలో భాగమైన 7 రహదారులున్నాయి. 2018, తొలి మాసాల్లోపే వీటిని పూర్తి చేయడం ద్వారా రాజధానిలోని ఇతర రోడ్లు, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులతోపాటు నిర్మాణాలూ వేగంగా జరిగేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు రూపొందించింది. ఇవి కాకుండా.. ఫేజ్‌-2లో ఉండి, ఈమధ్యనే టెండర్లు పిలిచిన మరో 3 రహదారులు కూడా 12 నుంచి 14 నెలల్లో సిద్ధమవనున్నాయి. రాజధానిలో రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టిన ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి నిరంతర పర్యవేక్షణలో పైన పేర్కొన్న మొత్తం 11 రోడ్లనూ నిర్దిష్ట గడువుల్లోగా పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థల సిబ్బంది పరుగులు పెడుతున్నారు.
 
అధిక ప్రయోజనం..
అమరావతిలో వేయదలచిన మొత్తం 34 కీలక రోడ్లలో పైన ప్రస్తావించిన ఈ 11 పొడవైనవి, అత్యంత ప్రయోజనకరమైనవి. వీటిల్లో అన్నింటికంటే పొడవైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సుమారు 21.40 కిలోమీటర్లుండగా, అన్నింటికంటే చిన్నదైన ఈ-12 రోడ్డు పొడవు 6.8 కిలోమీటర్లు. వీటిల్లో కొన్ని 60 మీటర్ల వెడల్పు, 6 వరుసలవి కాగా, మిగిలినవి 40 నుంచి 50 మీటర్ల వెడల్పుతో 4 లేన్లుగా భారీఎత్తున నిర్మితమవుతున్నాయి. అందువల్ల తొలుత వీటిని పూర్తి చేయడంపై ఏడీసీ తన దృష్టిని కేంద్రీకరించింది. మిగిలిన 23 రహదారుల పొడవు సగటున 5.50 కిలోమీటర్లకు కాస్త అటూఇటూగా ఉండవచ్చునని తెలుస్తోంది. పైగా వీటిల్లో అత్యధికం ‘కలెక్టర్‌ రోడ్లే’. వివిధ గ్రామాల పరిధిలోని ఎల్పీఎస్‌ లేఅవుట్లు, ప్రస్తుత గ్రామాలను ప్రధాన రహదారులతో కలిపే ఇవి 2 వరుసలవే కావడంతో వెడల్పూ తక్కువే ఉంటుంది. దీంతో వీటి నిర్మాణానికి స్వల్ప సమయమే పడుతుంది. 11 ప్రయారిటీ రహదారుల పనులు జరుగుతుండగానే ఈ 23 రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ఏడీసీ చురుగ్గా చేపడుతోంది. నిధుల లభ్యతనుబట్టి వీటికి కూడా ప్రాధాన్యతాక్రమంలో టెండర్లు ఆహ్వానించి, పనులను అప్పగించేందుకు సన్నద్ధమవుతోంది.
 
11 రోడ్లు.. 109.45 కిలోమీటర్ల పొడవు..
ప్రస్తుతం పనులు చేపట్టిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (18.20 కిలోమీటర్లు), ఫేజ్‌-1లోని 7 ప్రయారిటీ రోడ్ల (మొత్తం 66 కి.మీ.) పొడవు 84.20 కి.మీ. కాగా 45 రోజుల నుంచి 2 నెలల్లో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్న మిగిలిన 3 రోడ్ల పొడవు 25.25 కి.మీ. అన్నీ కలిపితే మొత్తం 109.45 కి.మీ.
 
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు..
అమరావతికి జీవనాడిగా అభివర్ణితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మొత్తం పొడవు సుమారు 21.40 కిలోమీటర్లు అయినప్పటికీ ప్రస్తుతం తొలి ప్యాకేజీ కింద 18.20 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరుగుతున్నాయి. చెన్నై- కోల్‌కతా హైవేలోని కనకదుర్గమ్మ వారధి నుంచి రాజధాని ప్రాంతంలోని దొండపాడు వరకు నిర్మించే ఈ రహదారిని 2 ప్యాకేజీలుగా విభజించారు. భూసమీకరణ, భూసేకరణల్లో సమస్యల కారణంగా వారధి నుంచి ఉండవల్లి వరకూ ఉన్న సుమారు 3.20 కిలోమీటర్లలో పనులను ప్రస్తుతానికి పక్కన పెట్టి, ఉండవల్లి - దొండపాడుల మధ్య 18.20 కి.మీ.ల మేర నిర్మాణం చేపట్టారు. దాదాపు తుదిదశకు చేరిన ఈ భాగంలోనూ రాయపూడి వద్ద సుమారు 950 మీటర్ల పొడవున బ్రేక్‌ పడింది. అక్కడ రోడ్డుకు అడ్డుగా ఒక ప్రార్థనాలయం, కొన్ని గృహాలుండడం ఇందుకు కారణం. వీటికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపడం ద్వారా ఖాళీ చేయించి, ఆ భాగంలోనూ రోడ్డును సాధ్యమైనంత త్వరగా నిర్మించేందుకు సీఆర్డీయే అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరొకపక్క.. వారఽధి- ఉండవల్లి మధ్య భాగానికి సంబంధించిన ఇబ్బందులను తొలగించి, ప్యాకేజీ-2 నిర్మాణ పనులు కూడా సత్వరమే ప్రారంభమయ్యేలా అఽధికారులు కృషి చేస్తున్నారు.
 
ఫేజ్‌-1 లోని 7 రహదారులు..
ఈ-8, ఈ-10, ఈ-14, ఎన్‌-4, ఎన్‌-9, ఎన్‌-14, ఎన్‌-16గా వ్యవహరిస్తున్న ఈ 7 రోడ్లకు అవసరమైన భూమిలో దాదాపు అంతా సీఆర్డీయేకు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా దఖలు పడింది. కొద్ది చోట్ల మాత్రమే చిన్న చిన్న సమస్యలుండగా, వాటిని కూడా శీఘ్రంగా పరిష్కరించేందుకు సీఆర్డీయే ప్రయత్నిస్తోంది. చకచకా సాగుతున్న ఈ రోడ్ల నిర్మాణం ఈ ఏడాది మార్చిలో ప్రారంభమవగా, 2018, మార్చికల్లా పూర్తి కానుంది. వర్షాల కారణంగా పనులకు కొంత అంతరాయం కలుగుతున్నప్పటికీ అవి కురవని సమయాల్లో పనుల్లో వేగం పెంచడం ద్వారా కోల్పోయిన సమయాన్ని పూడ్చుకునేందుకు ఏడీసీ కసరత్తు చేస్తోంది. ఈ రహదారుల పొడవు, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మితమవుతున్నాయంటే..
ఫ ఈ-8: 15 కిలోమీటర్లు. నెక్కల్లు- కృష్ణాయపాలెంల మధ్య.
ఫ ఈ-10: 7.8 కి.మీ. ఐనవోలు- పెనుమాకల మధ్య.
ఫ ఈ-14: 7.4 కి.మీ. నీరుకొండ- మంగళగిరి.
ఫ ఎన్‌-4: 7.2 కి.మీ. నవులూరు- వెంకటపాలెం.
ఫ ఎన్‌-9: 12.5 కి.మీ. ఉద్ధండరాయునిపాలెం- నిడమర్రు.
ఫ ఎన్‌-14: 8.3 కి.మీ. శాఖమూరు- అబ్బరాజుపాలెం.
ఫ ఎన్‌-16: 8.8 కిలోమీటర్లు. నెక్కల్లు- దొండపాడుల మధ్య.
 
ఫేజ్‌-2 లోని 3 రోడ్లు..
ఫేజ్‌-2 ప్రయారిటీ రోడ్లలో భాగమైన 3 రహదారులకు కొద్ది రోజుల క్రితమే ఏడీసీ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లను అది పరిశీలించి, అర్హమైన సంస్థలకు పనులు అప్పగించేందుకు 45 రోజుల నుంచి 2 నెలలు పడుతుందని తెలుస్తోంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి 9 నెలలు- ఏడాది మధ్య వాటిని పూర్తి చేయించాలన్నది ఏడీసీ లక్ష్యం. అంటే ఈ సంవత్సరం అక్టోబరులో ఈ రోడ్ల నిర్మాణం మొదలవుతుందనుకుంటే వచ్చే ఏడాది వానాకాలం ప్రారంభమయ్యేసరికి చాలావరకూ పూర్తవుతుంది. తద్వారా వర్షాల కారణంగా వీటి పనులకు అంతరాయం ఏర్పడి, కాలహరణం చోటు చేసుకోవడాన్ని నివారించవచ్చునని ఏడీసీ భావిస్తోంది.
 
ఈ రోడ్లు ఎలా నిర్మితమవుతాయంటే..
  • ఈ-6: 9.8 కిలోమీటర్లు. మందడం- అనంతవరంల మధ్య.
  •  ఈ-12: 6.8 కి.మీ. యర్రబాలెం- నీరుకొండ.
  •  ఎన్‌-11: 8.65 కి.మీ.లింగాయపాలెం- ఐనవోలుల మధ్య.
Link to comment
Share on other sites

రాజధానిలో పేదలకు ఇళ్లు!
 
 
636378405109060172.jpg
  • బహుళ అంతస్థులలో కేటాయింపు
  • ఏపీటిడ్‌కోకు నిర్మాణ బాధ్యత
  • సుమారు 30 ఎకరాల కేటాయింపు
  • రైతులకు సింగపూర్‌ పర్యటన చాన్స్‌
  • 100 మందిని పంపాలని యోచన
  • నేటి సీఆర్డీయే భేటీలో కీలక నిర్ణయం
 
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): అమరావతి... ప్రజల రాజధాని! అంటే అన్ని వర్గాల ప్రజలకు రాజధాని! నినాదంలోనే కాదూ... దీన్ని ఆచరణలోనూ చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది! రాజధానిలో కేవలం సంపన్న, ఎగువ మధ్య తరగతి వర్గాల ప్రజలే కాకుండా దిగువ మధ్యతరగతి, పేదలు కూడా మంచి సౌకర్యవంతమైన వసతులు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వీరికి రాజధానిలో అపార్టుమెంట్లు కట్టించి, అందులో ఫ్లాట్లను కేటాయించనుంది. మరోవైపు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు... భవిష్యత్తులో అమరావతి ఎలా ఉంటుందో కూడా కళ్లకు కట్టనుంది. ఎంపిక చేసిన రైతులను సింగపూర్‌ తీసుకెళ్లి... అక్కడి పాలనా వ్యవస్థలను ప్రత్యక్షంగా చూపాలనుకుంటోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగే సీఆర్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం!
 
ఏపీటిడ్‌కోకు 30 ఎకరాలు
పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహవసతి కల్పించే ధ్యేయంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)- ఎన్టీఆర్‌ నగర్‌’ పథకం కింద అన్ని నగరాలు, పట్టణాల్లో బహుళ అంతస్థుల నివాస సముదాయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ఏపీ టిడ్‌కో’ సంస్థ ద్వారా నిర్మించే ఈ భవనాలను సంపన్నులు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీల మాదిరిగా ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అప్పుడే ప్రకటించారు.
 
అమరావతిలోనూ ఇదే తరహాలో అల్పాదాయవర్గాలు, పేదల కోసం నాణ్యమైన, బహుళ అంతస్థుల భవంతులను నిర్మించి అందజేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ బాధ్యతను కూడా ఏపీ టిడ్‌కో సంస్థకే అప్పగించబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం అమరావతిలో ఆ సంస్థకు సుమారు 30 ఎకరాలను కేటాయించబోతున్నారని సమాచారం. అయితే ఈ స్థలమంతా ఒక్కచోటనే ఉంటుందా లేదా రాజధానిలోని వేర్వేరు ప్రదేశాల్లో అక్కడక్కడ కొంత చొప్పున కేటాయిస్తారా అనే విషయమై స్పష్టత రాలేదు.
 
3 బృందాలుగా సింగపూర్‌కు..
అమరావతిని సింగపూర్‌ మాదిరిగా అభివృద్ధి పరుస్తామని సీఎంతో సహా పలువురు మంత్రులు, సీఆర్డీయే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌ ప్రభుత్వంతోపాటు అక్కడి కొన్ని సుప్రసిద్ధ సంస్థలే రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాయి. స్టార్టప్‌ ఏరియాను సైతం అభివృద్ధి పరచనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సింగపూర్‌ ఎలా ఉంటుంది? అక్కడి రహదారులు, భవనాలు, ఉద్యానవనాలు, రవాణా వ్యవస్థ, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలు, నీటిశుద్ధి- పునర్వినియోగం, ఘనవ్యర్ధాల సమర్థ నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలెలా ఉంటాయనే దానిపై రాజధాని రైతుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.
 
ఈ నేపథ్యంలో రాజధాని రైతుల్లో సుమారు 100 మందిని మూడు బృందాలుగా సింగపూర్‌కు తీసుకుని వెళ్లి, అక్కడి వివిధ వ్యవస్థలను ప్రత్యక్షంగా చూపించాలని సీఆర్డీయే అనుకుంటోంది. కాగా, రాజధాని ప్రాంతంలో పేరుప్రఖ్యాతులున్న దివంగత డాక్టర్‌ ఎం.ఎ్‌స.ఎ్‌స.కోటేశ్వరరావు పేరును శాఖమూరు రీజినల్‌ పార్కుకుగానీ, లేదా అందులో ఏదైనా నిర్మాణానికిగానీ పెట్టాలన్న ప్రతిపాదన కూడా బుధవారం నాటి సీఆర్డీయే సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్‌పూలింగ్‌ సమయంలో నీరుకొండ, పరిసర గ్రామాల వాసులు అమరావతిలో ఏదైనా ఒక ప్రముఖ ప్రదేశానికో లేదా నిర్మాణానికో డాక్టర్‌ ఎంఎ్‌సఎస్‌ పేరును పెట్టాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. దానిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...