Jump to content

Amaravati


Recommended Posts

Amaravati to have a rational, intelligent transport system

 

 

Electric mobility is an important component of the plan

 

The Andhra Pradesh capital region is going to have a Mega City Transport Plan (MCTP) covering Amaravati, which is an Urban Notified Area, Vijayawada city, and Mangalagiri and Tadepalli towns in the coming months. It is being drafted by the Japan International Cooperation Agency (JICA) in tune with the State Government’s vision to put in place an eco-friendly and sustainable transport system.

 

Besides, the Comprehensive Traffic and Transportation Study (CTTS) in the new capital region, being done by the JICA, of which the MCTP is a major component, has a regional transport plan and separate plans for the nine urban local Modies, namely, Guntur, Vuyyuru, Ponnuru, Tenali, Sattenapalli, Gudivada, Nandigama, Nuzvid, and Jaggaiahpeta.

 

In all, the CTTS comprises a blueprint for the entire capital region that spans 8,603 square kilometres, including 217 square kilometres capital city area and 16.94 square kilometres of the seed capital. According to official sources, the CTTS, also called Comprehensive Mobility Plan (CMP), will mainly have high-speed sub-urban railways (can be a metro railway or a cost-effective alternative) and electric buses. It is in the area of electric mobility that the A.P. Government is keen on and, to some extent, succeeded in catching the attention of companies like Tesla and Google, which promised to share the latest technologies.

 

But, for these grand plans to fructify, a senior official in the government said the existing road network has to be vastly improved.

The transport system is to be a combination of roads and railways, to save on time and costs.

 

Signal system

 

An elevated busway can be a solution for the time-being as it is cheaper compared to a full-service metro railway, but it should be scalable.

The signal system proposed in Vijayawada by Nippon Signal is a step towards giving the MCTP a tangible shape. The Japanese company has already devised a mechanism for it on the basis of a survey done at 105 traffic intersections in the city.

 

Capacity-building is also a part of the CTTS, whose objective is to draft a Smart Transport Master Plan (STMP) for the capital region. Basically, JICA is going to ensure that the STMP is intelligent and rational, requiring the government to get its plans and execution part right.

Link to comment
Share on other sites

చదువుల కొలువు!
 
 
636357657279326098.jpg
  • నాలెడ్జ్‌ హబ్‌గా నవ్యాంధ్ర.. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభోత్సవంలో సీఎం
  • మరో 10 వర్సిటీలొస్తున్నాయ్‌.. మన కీర్తి చిహ్నం అమరావతి
  • 250 ఎకరాల్లో ‘కొండవీటి’ పార్క్‌ నిర్మిస్తాం: చంద్రబాబు
  • విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలి: వెంకయ్య
 
రాజధానిని ‘చదువుల నిలయం’ చేయాలన్న ఆకాంక్షలో తొలి అడుగు విజయవంతంగా పడింది. ఉత్తమ విద్యా సంస్థలను రప్పించాలన్న ప్రభుత్వ కృషి ఫలితంగా... ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో కొలువు తీరింది. ఇదేకాదు... త్వరలో రాజధాని ప్రాంతానికి మరో పది విశ్వవిద్యాలయాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కీర్తి చిహ్నం ‘అమరావతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి రైతులు 33,500 ఎకరాలను ఇవ్వడం ఓ చరిత్ర అని పునరుద్ఘాటించారు. దూరదృష్టితో వారు చూపిన చొరవను తన జీవితంలో మర్చిపోలేనన్నారు. అమరావతిలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల
అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నారు. మరో 10 విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధానిలో ఏర్పాటైన తొలి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఎస్‌ఆర్‌ఎంకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన శనివారమిక్కడ ప్రారంభోత్సవం చేశారు.
 
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ భవిష్యత్తులో 50 వేల మంది విద్యార్థులకు నిలయంగా మారనుందని సీఎం పేర్కొన్నారు. అమరావతి పరిపాలనా రాజధానిగా, నాలెడ్జ్‌ హబ్‌గా తయారుకావాలన్నారు. నాలెడ్జ్‌ హబ్‌గా రూపుదిద్దుకునే ప్రక్రియలో ఎస్‌ఆర్‌ఎం తొలి మెట్టు అవుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన, ఉన్నతమైన కోర్సులను అందించాలని వర్సిటీ అధికారులను కోరారు.
 
ప్రపంచాన్ని శాసించే శక్తి అమరావతికి రావాలంటూ, ఆ క్రమంలో ఎస్‌ఆర్‌ఎం తన వంతు పాత్ర పోషించాలన్నారు. పిల్లలను ప్రయోజకులుగా చేస్తే కోట్లు సంపాదిస్తారని, విజ్ఞానానికి ఉన్న శక్తి అదేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అడ్డుకునేందుకు కొందరు పయ్రత్నిస్తున్నారని, ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అమరావతిలో 250 ఎకరాల్లో కొండవీటి వాగు చెంత భారీ పార్కు ఏర్పాటుచేసి.. దానికి మాజీ మంత్రి ఎంఎ్‌సఎస్‌ కోటేశ్వరరావు పేరు పెడతామని ప్రకటించారు. రాజధాని నగరాన్ని స్మార్ట్‌ సిటీగా ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
Link to comment
Share on other sites

అమరావతి.. విజ్ఞాన కాంతి

జ్ఞాన కేంద్రంగా రాజధానిని అభివృద్ధి చేస్తాం

ఎస్‌ఆర్‌ఎం ఏర్పాటుతో తొలి అడుగు పడింది

ముఖ్యమంత్రి చంద్రబాబు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రారంభం

ఈనాడు - అమరావతి

15ap-main1a.jpg

మరపురాని రోజులు

ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైనది. ఆ రోజులు మరుపు రానివి. ముఖ్యమంత్రి అయినప్పటికంటే విద్యార్థిగా ఉన్న రోజులే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చాయి.
- చంద్రబాబు

అమరావతి నగరాన్ని విజ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, దేశ, విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అభ్యసించే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ‘అమరావతి పేరు చెప్పగానే గుర్తింపు వచ్చేలా... కీర్తి చిహ్నంగా ఉండాలి. ప్రపంచంలో పేరుపొందిన విద్య, వైద్య సంస్థలు, కళాశాలలు, హోటళ్లు, పర్యటకం ఇక్కడికి రావాలి. ఒక వైపు కృష్ణానది... మరో వైపు అందమైన అడవులు ఇక్కడి ప్రత్యేకత. కృష్ణానది పక్కన ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. దసరా రోజున పరిపాలనా నగరానికి పునాది వేస్తామని...’ ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన రాజధానిలో నీరుకొండ వద్ద నిర్మించిన ఎస్‌ఆర్‌ఎం ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని విజ్ఞాన నగరంగా తీర్చిదిద్దడంలో ఎస్‌ఆర్‌ఎం ఏర్పాటుతో తొలి అడుగు పడిందని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. ప్రస్తుతం 226 మంది విద్యార్థులతో ప్రారంభమై రాబోయే రోజుల్లో 50వేల మంది చదువుకునే స్థాయికి ఎదిగి కీలకం కానుందన్నారు. రూ.3024 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి నాంది పలికారని చెప్పారు. ఇక్కడ నూతన కోర్సులు ప్రవేశపెట్టి వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక్కడే ఆస్పత్రి నిర్మాణానికి రెండో దశలో వంద ఎకరాలు ఇస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి ముప్పవరపు సంజీవమ్మ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని గుర్తు చేస్తూ అమరావతి నిర్మాణంలో 5 కోట్ల మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొండవీటి వాగుపై 250 ఎకరాల్లో అతిపెద్ద ఉద్యానవనం నిర్మించి దానికి మాజీ మంత్రి ఎంఎస్‌ కోటేశ్వరరావు పేరు పెడతామని ప్రకటించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఎస్‌ఆర్‌ఎం పరిపాలనా భవనం, తరగతి గదులను ఆయన ప్రారంభించారు.

15ap-main1b.jpg

అమరావతి అభివృద్ధికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

అమరావతి నగరం అన్ని హంగులతో చక్కటి పరిపాలనా, పర్యటక, ఉపాధి, ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఇందుకు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంతో నాంది పలికామన్నారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారని, భవిష్యత్తులో అమరావతి క్యాంపస్‌లో కూడా ఆ పరిస్థితి రావాలని ఆకాక్షించారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలో మోదీ అగ్రగామిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలో దేశం ముందుకెళ్తొందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదవారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే ఈ ఏడాదే 20వేల ఇళ్లయినా మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

13 మంది విద్యార్థులకు ఉచిత విద్య

ఎస్‌ఆర్‌ఎం వ్యవస్థాపక ఉపకులపతి పచ్చముత్తు మాట్లాడుతూ తాజ్‌మహల్‌ నిర్మించిన షాజహాన్‌ చర్రితలో నిలిచిపోయినట్లు అమరావతి నిర్మాణం చేపట్టిన చంద్రబాబు కూడా చర్రితలో నిలిచిపోతారన్నారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం స్థాయిలో అమరావతిలో ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి కలెక్టర్లు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక బాలికను ఎంపిక చేసి పంపితే 13 మందికి ఉచితంగా విద్యను, ఏటా క్రీడల్లో రాణిస్తున్న 100 మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని వెల్లడించారు. ఈ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల ప్రజల కోసం ఆస్పత్రి నిర్మించి వైద్యం అందిస్తామన్నారు. సభాపతి కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

‘ప్రభుత్వ నగరి’కి రూ.16వేల కోట్లు!
 
 
636360279569920268.jpg
  • ఇది నిర్మాణ వ్యయంపై అంచనా
  • కోటి చదరపు అడుగుల నిర్మాణాలు
  • విజయ దశమికి శంకుస్థాపన
  • సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ వెల్లడి
 
 
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ నగరి నిర్మాణానికి సుమారుగా రూ.15 వేల నుంచి 16 వేల కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. పూర్తి స్థాయి అంచనాలు ఇంకా తమకు అందలేదన్నారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన కొంత మంది విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సముదాయాలు ఉండే కోర్‌ సిటీ నిర్మాణ పనులను విజయదశమి రోజు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ముఖ్యమంత్రి, గవర్నర్‌, మంత్రులు, అధికారుల నివాసాలు, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు ఉంటాయి. తొలి దశలో వీటిని చేపడుతున్నామని, సుమారుగా కోటి చదరపు అడుగుల మేర భవనాలను నిర్మిస్తామని శ్రీధర్‌ చెప్పారు. శంకుస్థాపన నుంచి 18 నెలల్లోనూ పనులు పూర్తి కావాలని సీఎం గడువు నిర్దేశించారని చెప్పారు. దీని ప్రకారం ప్రణాళిక రూపొందించుకొంటున్నామన్నారు. నిధుల సమీకరణ కూడా ఒక కొలిక్కి వచ్చిందని, 80 శాతం నిధులకు సంబంధించి సమీకరణ ఒప్పందాలు కుదిరాయని వివరించారు. సింగపూర్‌ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూమిలో నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. త్వరలో ఆ సంస్థలు విజయవాడలో ఒక కార్యాలయం ప్రారంభించబోతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి పెట్టుబడుల సమీకరణపై కూడా ఆ దేశానికి సంబంధించిన సంస్థలు కొంత ప్రయ త్నం చేస్తున్నాయని, ఇటీవల జపాన్‌ నుంచి వచ్చిన ప్రతినిధి బృందంతో అవి కలిసి పనిచేస్తున్నాయని వివరించారు.
Link to comment
Share on other sites

250 ఎకరాల్లో శాఖమురు పార్కు నిర్మాణం: నారాయణ
 
 
636360885122140459.jpg
 
అమరావతి: రాజధానిలో 250 ఎకరాల్లో శాఖమురు పార్కు నిర్మాణం జరుగుతుందని, పార్కును నాలుగు జోన్లగా విభజన చేయడం జరుగుతుందని, మొదటి జోన్ 85 ఎకరాలు, రెండవ జోన్ 34 ఎకరాలు, మూడవ జోన్ 49 ఎకరాలు, నాల్గవ జోన్ లో 73 ఎకరాలు...మొత్తం కలిపి 241 ఎకరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అంబేద్కర్ పార్క్‌ నాలుగు జోన్‌లలో ఉండనుందని తెలిపారు. మొదటి జోన్ 46 ఎకరాల్లో అమ్యూజిమెంట్ పార్క్, ఇందులోనే జల క్రీడలు, క్రాఫ్ట్ బజార్ ఏర్పాటవుతుందని, ఏరినా యాంఫీ ధియేటర్‌కు 6 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. మొదటి 23ఎకరాల్లో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని, మొదటి జోన్ లొనే మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో ఉంటాయని మంత్రి చెప్పారు.
 
రెండవ జోన్ పూర్తిగా చిల్డ్రన్ జోన్‌గా ఏర్పాటు చేయడం జరుగుతుందని, 27 ఎకరాల్లో అడ్వాంచర్ పార్క్ ఏర్పాటవుతుందని, ఒక ఏకరంలో అవుట్ డోర్ జిమ్, మూడవజోన్లో నక్షత్ర వనం, చరక్ వనం, రాసి వనం, పుష్ప వనం, ఏర్పాటు చేస్తామని నారాయణ చెప్పారు. మూడవ జోన్‌లో 3.6 ఎకరాల్లో డక్ పౌండ్, నాల్గవ జోన్లో ఈవెంట్ లాన్, ప్రదర్శన శాలలు, 5 స్టార్ హోటల్స్, ఇండోర్ అథ్లెటిక్, ఏరినాతో కూడిన క్లబ్ హౌస్ ఉంటాయన్నారు. 12 ఎకరాల్లో కల్చర్ మ్యూజియం, ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తామని, ఈ పార్క్ 2018 జనవరి సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...