Jump to content

Recommended Posts

Posted
నేడు చంద్రబాబుతో భేటీ కానున్న నార్మన్ ఫోస్టర్స్‌ ప్రతినిధులు
 
 
 
అమరావతి: ప్రభుత్వ భవనాల డిజైన్లపై ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో నార్మన్ ఫోస్టర్స్‌ ప్రతినిధులు భేటీ కానున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఇంటీరియర్ డిజైన్లు, మాస్టర్ ప్లాన్, సచివాలయం డిజైన్లపై చర్చించనున్నారు. హైకోర్టు సీజే సూచనలపై నార్మన్ ఫోస్టర్స్‌ సీఎంతో ప్రతినిధుల చర్చ జరగనుంది.
Posted
రాజధాని ప్రాజెక్టుల్లో వేగం పెంచుదాం
 
 
636356185639052936.jpg
అమరావతి అభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతోపాటు ప్రతిపాదిత ప్రాజెక్టు లన్నింటినీ త్వరగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు వడివడిగా తీసుకోవాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) బోర్డు 11వ సమావేశంలో నిర్ణయించారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జరిగిన ఈ భేటీలో ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి మద్దాలి రవిచంద్ర, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొని, రాజధాని నిర్మాణ ప్రక్రియ ను మరింత చురుగ్గా సాగించే చర్యలపై చర్చించారు.
 
ఈ సందర్భంగా రాజధానిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానిస్తూ కనకదుర్గమ్మ వారధి నుంచి రాజధాని ప్రాంతంలోని దొండపాడు వరకు ఏడీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు జరుగుతున్న క్రమం గురించి అధికారులు వివరించారు. 7 ప్రాధాన్యతా రహదారుల (ఫేజ్‌-1) నిర్మాణ పురోగతిని కూడా తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటూ, నిర్దేశిత గడువ ుల్లోగా పూర్తయ్యేందుకు సమాయత్త మవుతున్నాయని, కొద్దిచోట్ల మాత్రం వాటికి అవస రమైన భూమిని పూలింగ్‌ కింద ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రానందున జాప్యం అవుతోందన్నారు. ఆయా భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ ముగిసి, అవి అందిన వెంటనే ఆగిన భాగాల్లోనూ పనులు జరిపి, రోడ్లను సంపూర్ణంగా సిద్ధపరుస్తామని చెప్పారు. వర్షాల వల్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వరకూ అంతగా ఇబ్బందులు ఎదురవనప్పటికీ ఈ మధ్యనే నిర్మాణం మొదలైన 7 ప్రయారిటీ రోడ్లకు మాత్రం ఆటంకాలు కలుగుతున్నట్లు చెప్పారు.
 
ఫేజ్‌-2 రోడ్లలో భాగంగా నిర్మించనున్న 11 రోడ్లలో 3 రహదారులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. మిగిలిన 8 రోడ్లకు సాధ్యమైనంత త్వరగా టెండర్లను ఆహ్వానించేందుకు సన్నద్ధ మవుతున్నామన్నారు. సీడ్‌ యాక్సెస్‌, 7 ప్రాధాన్య రహ దారుల వెంబడి పెద్దఎత్తున పచ్చదనం పెంచేందుకు ఏడీ సీలోని అటవీ- పర్యావరణ విభాగం రూపొందించిన ప్రణా ళికల గురించి వివరించారు. ఏయే రోడ్డు పక్కన ఎంతెంత వెడల్పున గ్రీన్‌ బెల్ట్‌లను అభివృద్ధి పరచబోతోందీ, వాటి ల్లో ఎన్నెన్ని, ఏయే రకాల మొ క్కలను పెంచేందుకు నిర్ణయి ంచిందీ విశదీకరించారు. ఏడీసీ ఆధ్వర్యంలో రూపు దిద్దుకోనున్న శాఖమూరు రీజియనల్‌ పార్కు, జలవనరులు, నదీతీరం వెంబడి అభివృద్ధి పరచాలనుకుంటున్న పర్యాటక ఆకర్షణలు వంటి వాటి గురించి చర్చ జరిగింది. వీటితోపాటు రాజధానిలో కల్పించా లనుకుంటున్న ప్రపంచస్థాయి మౌలిక వసతుల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)పై సైతం విపులంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.నాగరాజ, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.వి.గణేష్‌బాబు, ఆర్కిటెక్చర్‌ విభాగాధిపతి పి.సురేష్‌బాబు, సంస్థ కార్యదర్శి జె.వీర్రాజు, సలహాదారుడు డి.రాజు తదితరులు పాల్గొన్నారు.
Posted
సెప్టెంబర్ 15 నాటికి సెక్రటేరియేట్ కాన్సెప్ట్ ప్లాన్ పూర్తి: నారాయణ

అమరావతి: సెప్టెంబర్ 15 నాటికి సెక్రటేరియేట్ కాన్సెప్ట్ ప్లాన్ పూర్తి అవుతుందని మంత్రి నారాయణ తెలపారు. శుక్రవారం అమరావతిలో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షించామన్నారు. అమరావతి నగరానికి ఇరువైపులా ఎన్టీఆర్, అంబేద్కర్ భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని మొత్తం కన్పించేలా 500 మీటర్ల ఎత్తులో ఐకానిక్‌ టవర్ నిర్మిస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్, సెప్టెంబర్ 30 నుంచి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. ఆగస్టు 30 నాటికి హైకోర్టు కాన్సెప్ట్ ప్లాన్ సిద్దమన్నారు. అక్టోబర్ 15 నుంచి హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. సెప్టెంబర్ 15నాటికి సెక్రటేరియేట్ కాన్సెప్ట్ ప్లాన్ పూర్తి చేసి నవంబర్ రెండోవారం నుంచి శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు చేపడుతామన్నారు. 10 అంతస్థులుగా శాశ్వత సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఒకే క్యాంపస్‌లో సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు ఉంటాయన్నారు. 40 లక్షల చ.అడుగుల్లో సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీసులు ఉంటాయన్నారు. 900 ఎకరాల్లో అసెంబ్లీ, సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీసులు.. మంత్రులు, ఐఏఎస్, అధికారుల నివాసాలు 450 ఎకరాల్లో హైకోర్టు, జడ్జిలు, న్యాయవాదుల నివాసాలు ఉంటాయని వివరించారు.

Posted

దసరాకు పనులు ప్రారంభం: చంద్రబాబు

14brk120a.jpg

అమ‌రావ‌తి: ప్రతి విజయదశమి సందర్భంగా ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి విజయదశమికి అందుకుతగ్గ కార్యచరణను సిద్ధంచేసుకుంది. 2015 విజయదశమిరోజు రాజధానిగా అమరావతికి శంకుస్థాపనచేయగా.. ఆ మరుసటి విజయదశమికి అమరావతి నుంచే సచివాలయ పాలన ప్రారంభించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. సీఆర్డీయే అధికారులతో అమరావతి సచివాలయంలో రాజధాని నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన వ‌చ్చే విజయదశమి నాటికి అమరావతి పరిపాలన నగరం నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు అంతిమంగా సౌభాగ్యం, సంతోషాలకు సూచికలుగా నిల‌వాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.  శుక్రవారం అమరావతిలో నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణం ‘సింబల్‌ ఆఫ్‌ ప్రైడ్‌’ అని, అలాగే పోలవరం నిర్మాణం ‘సింబల్‌ఆఫ్‌ ప్రోగ్రెస్‌’ అని అన్నారు.  ఈ ఆగస్టు 15లోగా సవివరమైన ఆకృతులు అందించాలని ఫోస్టర్స్‌ బృందానికి సూచించారు. నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు అందించే తుది ఆకృతులు కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

Posted

దసరాకు శుభారంభం

సెప్టెంబరు 30 నుంచి శాసనసభ భవన నిర్మాణం

అక్టోబరు 15న హైకోర్టు పనులకు శ్రీకారం

పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక ఖరారు

తుది ప్రణాళికలు వచ్చాక రాష్ట్రపతి, ప్రధానికి ప్రదర్శన

అమరావతి ‘గర్వకారణ చిహ్నం’

పోలవరం ‘పురోగతికి చిహ్నం’

ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు - అమరావతి

రాజధాని పరిపాలన నగర ప్రణాళికలు, వివిధ భవనాల ఆకృతులు ప్రజలకు తెలిసేలా, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేయండి. వివిధ భవనాల నమూనాలు ప్రజలు తిలకించేలా ప్రత్యేక ప్రదర్శన కేంద్రం (గ్యాలరీ) నెలకొల్పండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం

14ap-main1a.jpg ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో శాసనసభ భవన నిర్మాణాన్ని వచ్చే విజయదశమి రోజున (సెప్టెంబరు 30) ప్రారంభించనున్నారు. దీంతో పరిపాలన నగర నిర్మాణ పనులు మొదలవుతాయి. హైకోర్టు నిర్మాణ పనుల్ని అక్టోబరు 15న ప్రారంభిస్తారు. ఈ రెండు భవనాలను మకుటాయమానంగా (ఐకానిక్‌) నిర్మిస్తారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, దానికి కొనసాగింపుగా మరో 465 ఎకరాల్లో నిర్మించే న్యాయ నగరాల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. శాసనసభ, హైకోర్టు ఆకృతులపైనా స్పష్టత వచ్చింది. వీటి ఆకృతులు రూపొందించిన లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మరో దఫా సమావేశమయ్యారు. తుది ఆకృతులు, స్ట్రక్చరల్‌ డిజైన్లు ఎప్పటికి పూర్తి చేయాలో, నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలో స్పష్టంగా నిర్దేశించారు. అమరావతిని రాష్ట్రానికి గర్వకారణ చిహ్నం (సింబల్‌ ఆఫ్‌ ప్రైడ్‌)గా, పోలవరం ప్రాజెక్టుని ‘పురోగతికి చిహ్నం (సింబల్‌ ఆఫ్‌ ప్రోగ్రెస్‌)’గా సీఎం చంద్రబాబునాయుడు అభివర్ణించారు. నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ శాసనసభ, హైకోర్టు తుది ఆకృతులు అందజేసిన తర్వాత, వాటిని రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవీ...!

* శాసనసభ భవనం కోహినూర్‌ వజ్రం ఆకృతిలో ఉంటుంది. ఆగస్టు 15కి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తుది ఆకృతులు అందజేస్తుంది. ఆగస్టు 30 నాటికి స్ట్రక్చరల్‌ డిజైన్లు ఇస్తుంది. సెప్టెంబరు 23, 24 తేదీల నాటికి టెండర్లు ఖరారు చేస్తారు. సెప్టెంబరు 30న నిర్మాణ పనులు మొదలవుతాయి.

* హైకోర్టు భవనం స్థూపాకృతిలో ఉంటుంది. ఆగస్టు నెలాఖరుకి తుది ఆకృతి అందజేస్తుంది. సెప్టెంబరు 15కి స్ట్రక్చరల్‌ డిజైన్లు ఇస్తుంది. అక్టోబరు 15న నిర్మాణం మొదలవుతుంది.

* సచివాలయం భవనం ఆకృతి సెప్టెంబరు 15కి సిద్ధమవుతుంది. ఆ నెలాఖరుకి స్ట్రక్చరల్‌ డిజైన్లు ఇస్తారు. నెల రోజుల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభిస్తారు.

* సచివాలయ భవనాలు 10 అంతస్తుల్లో ఉంటాయి. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు కలిసే ఉంటాయి. ఒక శాఖకు సంబంధించిన మంత్రి, కార్యదర్శులు, విభాగాధిపతులతో పాటు, మొత్తం ఉద్యోగులంతా ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్ని భవనాలు వస్తాయన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. మొత్తం మీద 40-50 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది.

* పరిపాలన నగరం మధ్యలో 500 అడుగుల ఎత్తులో ఐకానిక్‌ టవర్‌ నిర్మిస్తారు. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఇది వ్యూయింగ్‌ టవర్‌. దీనిపై నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది.

పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక ఇలా...!

* పరిపాలన, న్యాయ నగరాలు ఉత్తర దిక్కున కృష్ణా నదీ తీరం నుంచి మొదలై దక్షిణం వైపునకు విస్తరించి ఉంటాయి. దీని వెడల్పు కిలో మీటరు, పొడవు 7-8 కి.మీ.లు ఉంటుంది. దీన్ని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌, జి, హెచ్‌ అని 8 బ్లాకులుగా విభజించారు. నదికి, కరకట్టకు మధ్యనున్న బ్లాకు (ఎ) విస్తీర్ణం 24 ఎకరాలు. దీనిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తారు.

* రెండో బ్లాకు (బి) విస్తీర్ణం సుమారు 125 ఎకరాలు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ అధికారిక నివాసాలు ఉంటాయి. తూర్పు దిశలో గవర్నర్‌ బంగళా, పడమర దిక్కున సీఎం నివాస గృహాలు ఉంటాయి. సిటీస్క్వేర్‌ ఉంటుంది. రెండు ఐకానిక్‌ టవర్లు, స్పోర్ట్స్‌ ఎరీనా, సంప్రదాయ నృత్యశాల, ఒపేరా హౌస్‌, కన్వెన్షన్‌ సెంటర్లు, ఆర్ట్‌ గ్యాలరీ, పెర్ఫార్మెన్స్‌ ఆర్ట్స్‌ సెంటర్‌ వంటివన్నీ దీనిలో ప్రతిపాదించారు.

* సి నుంచి హెచ్‌ వరకు ఉన్న బ్లాకుల్లో... ఒక్కో బ్లాకు విస్తీర్ణం 240-250 ఎకరాలు ఉంటుంది.

* సి బ్లాకులో బహుళ ప్రయోజనకర భవనాలు ఉంటాయి. మధ్యలో పెద్ద పార్కు వస్తుంది. తూర్పు, పడమర దిక్కుల్లో నివాస, వాణిజ్య భవనాలు వస్తాయి. హోటళ్లు, వినోద కేంద్రాలు, పబ్లిక్‌ స్క్వేర్‌లు వంటివన్నీ దీనిలో ఉంటాయి.

* డి బ్లాకులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారులు వంటి ప్రముఖుల నివాస గృహాలు ఉంటాయి. మంత్రులకు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు వ్యక్తిగత గృహాలు నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు, జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు.

* ఇ బ్లాకులో దక్షిణం వైపు మధ్య భాగంలో శాసనసభ భవనం నిర్మిస్తారు. దానికెదురుగా సెరిమోనియల్‌ స్క్వేర్‌ వంటివి వస్తాయి. శాసనసభ భవనానికి, సెరిమోనియల్‌ స్క్వేర్‌కి మధ్యలో కల్చరల్‌ సెంటర్‌ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఈ బ్లాకులో పడమర వైపు సచివాలయ భవనాలు వస్తాయి. ఉత్తరం పక్క కన్వెన్షన్‌ సెంటర్లు, శాసన సభాపతి, శాసన మండలి ఛైర్మన్ల నివాస గృహాలు ఉంటాయి. సచివాలయం పక్కనే 8 అంతస్తుల మల్టీలెవెల్‌ పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

* ఎఫ్‌ బ్లాక్‌లో వాయవ్యంలో హైకోర్టు భవనం వస్తుంది. అదే బ్లాకులో ట్రైబ్యునళ్లు, ఇతర కోర్టుల సముదాయం, న్యాయమూర్తులు, సిబ్బంది నివాస గృహాలు వంటివి వస్తాయి.

* జి, హెచ్‌ బ్లాకుల్లో బహుళ ప్రయోజనకర భవనాలు, ఇతర కార్యకలాపాల కోసం కేటాయించారు.

* హెచ్‌ బ్లాక్‌ తర్వాత 250 ఎకరాల్లో శాకమూరు పార్కుని అభివృద్ధి చేస్తారు. ఇక్కడే 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు.

* పరిపాలన, న్యాయ నగరాలకు ఒక పక్కన ఎన్టీఆర్‌, మరో పక్కన అంబేద్కర్‌ విగ్రహలు, మధ్యలో 500 అడుగుల ఎత్తైన ఐకానిక్‌ టవర్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

* 1365 ఎకరాల్లో 50 శాతం విస్తీర్ణంలో పార్కులు, జలాశయాలు, కాలువలు ఉంటాయి.

* కాలువల్లో నిత్యం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో వాటర్‌ ట్యాక్సీలు వంటివి నడుపుతారు

Posted

ఏడాదిన్నరలో నిర్మాణాలు

14ap-main6a.jpg

పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న అంచనాలు ఇంకా రూపొందించలేదని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. స్ట్రక్చరల్‌ డిజైన్లు సిద్ధమైన తర్వాతే అంచనాలు రూపొందించగలమని, ఆ తర్వాతే నిర్మాణ వ్యయంపై ఒక స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. హైకోర్టు భవనంలో కోర్టు హాళ్లు చుట్టూ పెట్టి, మధ్యలో జడ్జిల ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సూచించారని, దానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని తెలిపారు.

Posted
దసరా ముహూర్తం
 
 
636356804834728766.jpg
  • అదే రోజు అమరావతి నిర్మాణానికి శ్రీకారం
  • పరిపాలన, న్యాయ నగరాలకు సీఎం ఓకే
  • 1350 ఎకరాల్లో ప్రారంభంకానున్న పనులు
  • రెండేళ్లలోగా నిర్మాణాల పూర్తికి ఆదేశం
  • ఆంధ్రులకు గర్వకారణంగా అమరావతి
  • పది అంతస్థుల్లో సచివాలయ సముదాయం
  • ఒకే అంతస్థులో మంత్రులు, కార్యదర్శులు
  • రాజధాని మొత్తం కనిపించేలా వాచ్‌టవర్‌
  • ఓవైపు ఎన్టీఆర్‌.. మరోవైపు అంబేడ్కర్‌ విగ్రహాలు
  • డిజైన్లను రాష్ట్రపతి, ప్రధానికి చూపనున్న సీఎం
 
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణ పనులను విజయదశమి(సెప్టెంబరు30న) రోజున ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్‌, చంద్రశేఖర్‌ అండ్‌ కన్సల్టెంట్‌ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో.. 1350 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌కు సీఎం తుది ఆమోదం తెలిపారు. వాటిల్లో వివిధ నిర్మాణాలను ప్రారంభించేందుకు, పూర్తి చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించారు. అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం (సింబల్‌ ఆఫ్‌ ప్రైడ్‌)గా, పోలవరం ప్రాజెక్టును ప్రగతి చిహ్నం (సింబల్‌ ఆఫ్‌ ప్రోగ్రె్‌స)గా సీఎం అభివర్ణించారు. అమరావతి పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను, వాటిల్లో ఐకానిక్‌ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ డిజైన్లను సీఎం త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చూపుతారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రెండు నగరాల నిర్మాణ పనులను ఈ ఏడాది సెప్టెంబరు 30 - అక్టోబరు 31 మధ్య ప్రారంభించి ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
 
రాజధాని నిర్మాణ విశేషాలు
  •  కృష్ణా నదీ తీరం నుంచి ప్రారంభమై శాఖమూరు రీజనల్‌ పార్కు వరకూ ఉండనున్న పరిపాలన, న్యాయ నగరాలు మొత్తం 1350 ఎకరాల్లో నిర్మితమవుతాయి.
  •  900 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలన నగరంలో శాసనసభ, సచివాలయం, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, ఇతర సిబ్బంది నివాస భవనాలు రానున్నాయి.
  •  450 ఎకరాల్లో నిర్మితమవనున్న జస్టిస్‌ సిటీలో హైకో ర్టు, న్యాయమూర్తులు, నివాస భవనాలు ఉంటాయి.
  •  250 ఎకరాలు ఒక బ్లాక్‌ చొప్పున నిర్మితమయ్యే ఈ రెండు నగరాల్లో ప్రతి బ్లాక్‌లోనూ అధికారిక కార్యాలయాలు, నివాస సముదాయాలు, పార్కులు, బహుళ ప్రయోజన భవన నిర్మాణాలను ఏర్పాటు చేస్తారు.
  •  మొత్తం విస్తీర్ణంలో 50 శాతాన్ని జల వనరులు, పచ్చదనానికి కేటాయించారు.
  •  శాసనసభ కోహినూర్‌ డైమండ్‌ ఆకృతిలో, హైకోర్టు స్థూపాకారంలో ఉంటాయి.
  •  నదీ తీరాన దివంగత సీఎం ఎన్టీఆర్‌ విగ్రహం, శాఖమూరు పార్కులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు.
  •  నదీ తీరాన అటూ ఇటూ రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి అధికార నివాసాలు నిర్మిస్తారు. వీటికి చేరువలోనే 2 ఐకానిక్‌ టవర్లను నిర్మించనున్నారు.
  •  ఈ రెండు నగరాల పొడవునా ఆహ్లాదాన్ని పంచే కాల్వలు, కొలనులు, పార్కులు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌, రెస్టారెంట్లు, మైదానాలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తారు.
  •  సచివాలయం 10 అంతస్థుల భవన సముదాయంగా రూపుదిద్దుకుంటుంది.
  •  అధికారిక కార్యకలాపాలు వేగంగా సాగడంతోపాటు వివిధ పనులపై వచ్చే ప్రజల సౌకర్యార్ధం సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, సెక్రటరీల చాంబర్లు, హెచ్‌వోడీల కార్యాలయాలన్నీ ఒకే అంతస్థులో వచ్చేలా నిర్మిస్తారు.
  •  పరిపాలనా నగరం మధ్యలో 500 అడుగుల ఎత్తున వాచ్‌టవర్‌ను నిర్మిస్తారు. 217 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే రాజధాని నగర మొత్తాన్ని దీనిపై నుంచి వీక్షించవచ్చు. దీనిని అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు.
  •  కృష్ణానది పక్కన ప్రజోపయోగకర కార్యకలాపాల కోసం కొంత స్థలం వదిలారు. ఇందులో ప్రజల మనోల్లాసానికి, అమరావతికి వచ్చే సందర్శకులను ఆకర్షించేందుకు పలు ప్రత్యేకతలను ఏర్పాటు చేయనున్నారు.
నిర్మాణ పనుల షెడ్యూల్‌ ఇదీ..9crda5454545.jpg
  •  అసెంబ్లీ కాన్సెప్ట్‌ డిజైన్‌ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీకల్లా స్ట్రక్చరల్‌ డిజైన్లను సిద్ధం చేస్తారు. సెప్టెంబరు 23- 25 తేదీల మధ్య టెండర్లను ఖరారు చేసి, 30న దసరా రోజుల్లో ప్రారంభిస్తారు.
  •  హైకోర్టు కాన్సెప్ట్‌ డిజైన్‌ ఈ ఏడాది ఆగస్టు 30 కల్లా అందుతుంది. సెప్టెంబరు 15కి దాని స్ట్రక్చరల్‌ డిజైన్లు సిద్ధమవుతాయి. అక్టోబరు 15కి టెండర్లను ఖరారు చేసి, ఆ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
  •  సెక్రటేరియట్‌ కాన్సెప్ట్‌ డిజైన్‌ సెప్టెంబరు 15కి సిద్ధమవుతుంది. 30 కల్లా స్ట్రక్చరల్‌ డిజైన్లు వస్తాయి. అక్టోబరు నెలాఖరుకల్లా నిర్మాణం ప్రారంభిస్తారు.
  •  అన్ని నిర్మాణాలూ ప్రారంభించిన తర్వాత ఏడాదిన్నర నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తవుతాయి.
Posted
కోహినూర్‌ వజ్రం ఆకారంలో అసెంబ్లీని నిర్మిస్తాం: బాబు
 
 
636357219507353434.jpg
అమరావతి: కోహినూర్‌ వజ్రం ఆకారంలో అసెంబ్లీని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... కొండవీటివాగు దగ్గర 250 కోట్లతో నిర్మించే అతిపెద్ద పార్క్‌కు ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు పేరు పెడతామన్నారు. అలాగే అమరావతిని స్మార్ట్‌సిటీగా ప్రకటించిన వెంకయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భారత్‌లో ఉండే అన్ని విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఏపీకి రావాలని, కృష్ణానది పక్కన ఎన్టీఆర్‌, అంబేద్కర్‌ విగ్రహాలు పెడతామని, దసరా రోజున పరిపాలన నగరం పనులు ప్రారంభిస్తామని, విలువలతో కూడిన విద్యకు అమరావతి కేంద్రంగా మారుతుందని, చదువుతో పాటు సంపాదన అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
 
 
 
విభజన చేసినవారు అసూయపడేలా అమరావతి నిర్మాణం: బాబు
15-07-2017 13:01:01
 
636357204824671823.jpg
అమరావతి: రాష్ట్ర విభజన చేసినవారు అసూయపడేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని కేంద్రమంత్రి వెంక్యనాయుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని, రైతులు చూపిన చొరవ జీవితంలో మరచిపోలేనన్నారు. అలాగే అమరావతిలో మొదట ప్రారంభమైన పెద్ద సంస్థ ఎస్‌ఆర్‌ఎందేనన్నారు. మూడు విడతల్లో రూ.3,400కోట్ల పెట్టుబడితో 50వేల మంది విద్యార్థులు లక్ష్యంగా ఎస్‌ఆర్‌ఎం నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఎస్‌ఆర్‌ఎంలో కొత్త రకం కోర్సులు అందుబాటులో ఉంటాయని, ఐటీలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారని, అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఎక్కువమంది యువకులు ఉన్న దేశం భారతేనని, ఎక్కువ అభివృద్ధి జరగబోయే దేశం కూడా భారతేనన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...