sonykongara Posted August 4, 2017 Author Posted August 4, 2017 అమరావతిలో ‘మైస్ హబ్’! మెగా కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్లు, హోటళ్లు వాణిజ్య కలాపాలకు ఊపు అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి సౌకర్యాలతో, అమరావతిని అగ్రశ్రేణి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక అడుగుపడింది. ‘మైస్ హబ్’ నిర్మాణం కోసం ‘ఆర్‌ఎఫ్‌క్యూ’లను(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) ఆహ్వానిస్తూ, ఏపీసీఆర్డీయే బిడ్లను పిలిచింది. ‘మీటింగ్స్-ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్’ అనే పదబంధానికి సంక్షిప్త నామధేయమే ‘మైస్’. మెగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, హోటళ్లు, వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ తదితరాల సమాహారంగా.. మైస్ హబ్ రూపుదిద్దుకోనుంది. దీనికోసం రాజధానిలోని కీలక ప్రదేశంలో 42 ఎకరాలను కేటాయించారు. పీపీపీ విధానంలో ప్రీ క్వాలిఫికేషన్ బిడ్లను సీఆర్‌డీఏ పిలిచింది. దరఖాస్తులను సమర్పించేందుకు సెప్టెంబరు 25 వరకు గడువు ఇచ్చింది.
KaNTRhi Posted August 4, 2017 Posted August 4, 2017 Identi.. APCRDA centre.. inka Lenin centre lo ne undaaa ???? velagapudi ki shift avva ledaa
Guest Urban Legend Posted August 4, 2017 Posted August 4, 2017 Identi.. APCRDA centre.. inka Lenin centre lo ne undaaa ???? velagapudi ki shift avva ledaa ma bezawada lo emi vundanichey la levu ga
sonykongara Posted August 4, 2017 Author Posted August 4, 2017 ‘కొండవీటి’కి కొత్త కళ! అంతర్జాతీయ స్థాయి జల రవాణా మార్గంగా వాగుకు సరికొత్త రూపు రాజధానికి ముంపు బెడద నుంచి విముక్తి ఏడీసీ ప్రణాళికకు సీఎం చంద్రబాబు ఆమోదం ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాజెక్టు అమలు అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాజధానికి కొండవీటి వాగు ముప్పును శాశ్వతంగా తొలగించే దిశగా తొలి అడుగు పడింది. వాగును అభివృద్ధి చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రఖ్యాత కన్సల్టెంట్లతో కలిసి ఓ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఓపక్క వరద ముప్పును తప్పిస్తూనే, మరోపక్క రాజధానిలో పర్యావరణహితమైన జలరవాణా వ్యవస్థను అభివృద్ధి పరచడం, అత్యద్భుత పర్యాటక ప్రదేశంగా వాగు, దాని పరీవాహక ప్రాంతాలను తీర్చి దిద్దడం లక్ష్యాలుగా ఈ ప్రణాళికను రూపొందించారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన జాతీయ జలమార్గాల్లో ఒకటైన కృష్ణానదికి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించడమనే మరో ప్రధాన ప్రయోజనాన్ని కూడా ఈ ప్రాజెక్టు నెరవేర్చబోతోంది. దీనికి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో చేపట్టనున్న ఈ బహుళ ప్రయోజనకర పథకానికి సంబంధించిన టెండర్లను కొద్ది రోజుల్లో పిలిచేందుకు ఏడీసీ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రుణసహాయాన్ని అందించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రపంచ బ్యాంకు కొద్ది రోజుల్లో తుది పరిశీలనకు తన బృందాన్ని రాజధానికి పంపనుంది. కొండవీటి వాగు ప్రాజెక్టు ప్రధాన విశేషాలు ఇవీ కొండవీటి వాగు రాజధానిలోని వివిధ ప్రదేశాలను తాకుతూ ప్రవహిస్తున్నప్పటికీ దాని వల్ల ముంపు బెడద తీవ్రంగా ఉండే నీరుకొండ వద్ద నుంచి కృష్ణాయపాలెం మీదుగా కృష్ణానదిలో కలిసే ఉండవల్లి వరకూ అంటే సుమారు 11 కిలోమీటర్ల పొడవునా ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. (వాగు కట్టడికి మిగిలిన చోట్ల కూడా దాని వెడల్పు, లోతు పెంచుతారు). ఈ 11 కిలోమీటర్ల మేర కొండవీటి వాగును మొత్తం 175 మీటర్ల వెడల్పున విస్తరిస్తారు. ఇందులో 115 మీటర్ల (సుమారు 350 అడుగులు)లో వాగు ప్రవహిస్తుంది. వాగుకు ఇరువైపులా 30 మీటర్ల చొప్పున పచ్చదనాన్ని అభివృద్ధి పరుస్తారు. జాతీయ జలరవాణా మార్గాల్లో కీలకమైన కృష్ణానదిని అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో దేశంలోని కాకినాడ, చెన్నై తదితర ప్రదేశాలతో జలమార్గం ద్వారా రాజధానికి సరకుల రవాణా పెద్దఎత్తున జరిగేలా ఈ వాటర్ వే దోహదపడనుంది. కొండవీటి వాగు కట్టడికి ఉద్దేశించిన పలు చర్యల్లో భాగంగా నిర్మించనున్న నీరుకొండ రిజర్వాయర్ (0.4 టీఎంసీలు), కృష్ణాయపాలెం జలాశయం (0.1 టీఎంసీ)ల సాయంతో ఈ మార్గంలో నిరంతరం తగినంత నీరుండేలా చూస్తారు. భారీ వెడల్పు, లోతుతో రూపుదిద్దుకుంటున్నందున ఇందులో 100 టన్నుల సరకు రవాణా సామర్ధ్యముండే బోట్లు సులభంగా ప్రయాణం సాగించగలుగుతాయి. వీటికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఈ మార్గంలో నిర్మించనున్న రోడ్డు వంతెనలను తగినంత ఎత్తున నిర్మిస్తారు. రాజధానిలోని పలు ప్రదేశాలకు అనుసంధానమై ఉండే ఈ జలమార్గం ద్వారా సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా వాటర్ ట్యాక్సీలను నడుపుతారు.
KaNTRhi Posted August 4, 2017 Posted August 4, 2017 ma bezawada lo emi vundanichey la levu ga CRDA HQ kada... Velagapudi lo untene melu
sonykongara Posted August 5, 2017 Author Posted August 5, 2017 మనసు దోచే ‘మైస్’ వెంకటపాలెం వద్ద 42 ఎకరాల్లో, రూ.1220 కోట్లతో నిర్మాణం 6,000- 10,000 సీటింగ్‌తో భారీ కన్వెన్షన సెంటర్, మల్టీప్లెక్స్, దుకాణాలు ఏసీ ఎగ్జిబిషన హాల్స్, వీఐపీ, వీవీఐపీ లాంజ్‌లు, కమర్షియల్ ప్లేసెస్ కల్చరల్ ఎరీనా, 24-7 హైసీ్ట్రట్, జెట్టీలతో రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్మార్ట్‌గా, కాలుష్యరహితంగా నిర్మాణానికి ఏపీసీఆర్డీయే చర్యలు (ఆంధ్రజ్యోతి, అమరావతి): ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్యరంగాల త్రివేణిసంగమంగా రాజధానిని మార్చి, ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో దానిని ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతిలో ప్రతిపాదించిన ‘మైస్ హబ్’ పలు ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకోనుంది. మరొక మాటలో చెప్పాలంటే.. దేశ, విదేశాలకు చెందిన వారిని సూదంటురాయిలా ఆకర్షించే ప్రముఖ సందర్శనీయస్థలంగా, నిరంతరం జీవచైతన్యంతో తొణికిసలాడే ప్రదేశంగా వెలుగొందనుంది. తద్వారా అటు అమరావతిని నిజమైన ‘ప్రజా రాజధాని నగరం’గా చేస్తూనే ఇటు దాని అభివృద్ధికి ఎంతో అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలు పెద్దఎత్తున సాగేందుకు తోడ్పడి, భారీ ఆదాయవనరుగా నిలవబోతోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన, గుజరాతలోని మహాత్మా మందిర్, హైదరాబాద్‌లోని హైటెక్స్ వంటి ఇలాంటి నిర్మాణాలు పెక్కింటిని పరిశీలించిన అనంతరం ఏపీసీఆర్డీయే అమరావతికి ఉన్న ప్రత్యేకతలను జతకలిపి, మన ‘మైస్’ను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం వద్ద కృష్ణానది కరకట్టకు, సీడ్‌యాక్సెస్ రోడ్డుకు మధ్యన 42 ఎకరాల్లో ఈ ‘మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స అనే ఆంగ్లపదాల్లోని తొలి అక్షరాల కూడిక)’ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి రూ.1220 కోట్లు అవసరమని ఏపీసీఆర్డీయే అంచనా వేసింది. 2 దశలుగా రూపొందనున్న మైస్‌లో ముందుగా ఫేజ్-1 (రూ.535 కోట్లు), అది పూర్తయిన తర్వాత ఫేజ్-2 (రూ.685 కోట్లు)కు సంబంధించిన పనులను పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేపట్టనున్నారు. కొన్ని నెలల్లోనే ఫేజ్-1 పనులను ప్రారంభించాలనుకుంటున్న సీఆర్డీయే ఈ రంగంలో అనుభవం, నైపుణ్యమున్న ప్రఖ్యాత సంస్థలను గుర్తించేందుకు ఇప్పటికే ‘ఆర్.ఎఫ్.క్యు. (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన)’లను కూడా ఆహ్వానించింది. డిజైన రూపకల్పన, నిధుల సమీకరణ, నిర్మాణం, నిర్వహణ, అనంతరం బదిలీ (డి.ఎఫ్.బి.ఒ.టి.) ప్రాతిపదికన ఆ రంగంలో పేరొందిన సంస్థలు లేదా కన్సార్షియానికి అప్పగించేందుకు ప్రి- క్వాలిఫికేషన బిడ్లను పిలిచింది. ఐకానిక్ డిజైన్లు.. అన్నింటా స్మార్ట్..! మైస్‌లో భాగంగా రూపొందబోయే కన్వెన్షన సెంటర్, ఎగ్జిబిషన హాల్ భవనాల డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండాలని సీఆర్డీయే భావిస్తోంది. పైగా ఈ ప్రాంగణం మొత్తాన్ని పూర్తిగా ‘స్మార్ట్’గా (పూర్తిగా వ్యర్థరహితం, స్మార్ట్ భవనాలు, విద్యుత్తుకాంతులు తదితర) రూపొందించడం ద్వారా దీనిని ప్రపంచంలోనే అతి మేలైన స్మార్ట్ ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటోంది. ‘నో ట్రాఫిక్ జోన’గా ఉండబోయే ఇందులో మోటారు వాహనాలను అనుమతించకుండా బ్యాటరీ కార్లను వినియోగిస్తారు. ‘మైస్’లో ఏమేం ఉంటాయంటే.. మెగా ఇంటర్నేషనల్ కన్వెన్షన సెంటర్ (ఎన.ఐ.సి.సి.).. ఎగ్జిబిషన హాల్స్.. భారీ సమావేశాలు, సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను జరుపుకునేందుకు వీలుగా ఇందులో 6,000 సీటింగ్ సామర్ధ్యంతో ఒక ప్రధాన ప్లీనరీ కన్వెన్షన హాలును నిర్మిస్తారు. అవసరమైతే దీనిని చిన్న చిన్న హాళ్లుగా విడగొట్టుకునే వీలు కల్పిస్తారు. ఈ హాలును పక్కనే రాబోయే ఏసీ ఎగ్జిబిషన హాల్స్‌కు అనుసంధానించడం ద్వారా ఒకే చోట 10,000 మంది ఆసీనులయ్యేలా చూస్తారు. కళలు, వ్యాపారాలకు సంబంధించిన ప్రదర్శనలకు నెలవుగా ఉండే ఎగ్జిబిషన హాల్స్ (2) తొలిదశలో ఒక్కొక్కటి 4,500 చదరపు మీటర్లలో వస్తాయి. అవసరమైతే మరో 4,500 చ.మీ.ల చొప్పున వీటిని విస్తరించుకునే వీలుంటుంది. తాత్కాలిక, ఓపెన ఎయిర్ ఎగ్జిబిషన్లు నిర్వహించుకునేందుకు వీలుగా వీటికి చేరువలోనే అదనపు స్థలాలనూ కేటాయిస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ హాల్స్ ఉంటాయి. కావాలనుకుంటే వాటిని విడగొట్టుకుని, చిన్నపాటి సమావేశగదులుగా మార్చుకునే వీలు కల్పిస్తారు. వీటికి అనుసంధానించి బిజినెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. సువిశాల వీఐపీ, వీవీఐపీ లాంజ్‌లను నిర్మిస్తారు. వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశమార్గాలను కల్పిస్తారు. ఫ సుమారు 5,000 చ.అ.లలో భారీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తారు. 5 లక్షల చదరపుటడుగుల్లో వినోదకేంద్రం.. మనోల్లాసానికి ఉద్దేశించిన మల్టీ ఎంటర్‌టైనమెంట్ కాంప్లెక్స్‌ను 5 లక్షల చదరపుటడుగుల్లో నిర్మిస్తారు. ఇందులో మల్టీప్లెక్స్, వివిధ వాణిజ్య దుకాణాలు, ఫుడ్ కోర్టులు ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చిన వారు ఒకే ప్రాంగణంలో అటు వినోదాన్ని, ఇటు చవులూరించే పలు ప్రదేశాల ఆహారాన్ని పొందుతారన్న మాట. పర్యాటకాభివృద్ధికినదీతీర ఆకర్షణలు..అమరావతికి అభిముఖంగా ఉన్న కృష్ణానదీ తీరాన్ని ప్రఖ్యాత రివర్‌ఫ్రంట్ టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి పరచడంలోనూ ఈ మైస్ కీలక పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగా దీనిలో కళా, సాంస్కృతికరంగాలకు అద్దం పట్టే కల్చరల్ ఎరీనాను నిర్మించి, ఎక్కడెక్కడి కళాభిమానులనూ ఆకర్షిస్తారు. రేయింబవళ్లూ కళకళలాడే ‘హై- సీ్ట్రట్’ను, నదీవిహారానికి, సాహస జలక్రీడలకు అవకాశం కల్పించే జెట్టీని నిర్మిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, అమరావతిలో కొన్ని రోజులు ఉండాలనుకునే సందర్శకుల కోసం స్టార్ హోటళ్లను నిర్మిస్తారు. 250 గదుల 5 స్టార్, 300 గదులతో 3 స్టార్ హోటళ్లను నిర్మించాలని భావిస్తున్నారు. ఫ ఇవి కాకుండా.. నేత్రపర్వం గొలిపే జలవనరులు, పచ్చదనం అడుగడుగునా సాక్షాత్కరించేలా చూడడం ద్వారా అమరావతిని నిర్మించనున్న ‘బ్లూ- గ్రీన కాన్సెప్ట్’నకు ఇందులో పెద్దపీట వేస్తారు. ఫ ప్రతి భవనానికి అనుబంధంగా మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించి, పార్కింగ్ ఇక్కట్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడనున్నారు.
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 main roads 6 lane roads vesthe best.. inko 10 years agithe ee roads emi saripothai ?? hyd lo traffic ki 10 lane roads kuda saripovadam ledhu.. inka manam 100 years capital ani cheppukuntu inka ee 4 lane roads enti
swarnandhra Posted August 5, 2017 Posted August 5, 2017 main roads 6 lane roads vesthe best.. inko 10 years agithe ee roads emi saripothai ?? hyd lo traffic ki 10 lane roads kuda saripovadam ledhu.. inka manam 100 years capital ani cheppukuntu inka ee 4 lane roads enti ippudu vestundi 4 lanes ye ayina 8 lanes ki space vundi kada all major roads ki
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 ippudu vestundi 4 lanes ye ayina 8 lanes ki space vundi kada all major roads ki Ippudu vesindhi 190-200 feets width roads bro.. 200 feets width lo enni Lanes vasthai bro including Divider ??
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 Madhyalo BRTS roads waste.. Okesari ekkadikakkada flyovers n subways veyyadam best n Metro or Light metro lanti vatiki place vodhilithe best.. future lo Malli Road expansion ani Penta pettakunda vunte best..
swarnandhra Posted August 5, 2017 Posted August 5, 2017 Ippudu vesindhi 190-200 M width roads bro.. 200M width lo enni Lanes vasthai bro including Divider ?? bro, you mean feet or meters? 200 meters is very wide. I just measured NH5 opposite to Manipal Hospital. It is about 70 meters. That road is 3+3 with divider in between and another 4 lane service roads with two more dividers/empty space in between. empty space between service roads and main highway is huge. so, looks like 200 ft is good enough for 8 lanes with divider.
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 bro, you mean feet or meters? 200 meters is very wide. I just measured NH5 opposite to Manipal Hospital. It is about 70 meters. That road is 3+3 with divider in between and another 4 lane service roads with two more dividers/empty space in between. empty space between service roads and main highway is huge. so, looks like 200 ft is good enough for 8 lanes with divider. Paina vesa plan lo 6 lane chupinchadu including BRTS. 8 lane chance ledhu bro. bcoz idhivaraku NH valu 200 feets Acquire chesi 4 lane purpose ki use chesthamu annaru.. future purpose kosam 6 lane pedatamu annaru.. So Including Divider 200 feets ante 6 lane padudhi.. But paina vunna plane lo 2 lane brts ke pothundhi.. Other vehicles ki only 4 lane road in the city ante future lo horrible ee
mahesh1987 Posted August 5, 2017 Posted August 5, 2017 Paina vesa plan lo 6 lane chupinchadu including BRTS. 8 lane chance ledhu bro. bcoz idhivaraku NH valu 200 M Acquire chesi 4 lane purpose ki use chesthamu annaru.. future purpose kosam 6 lane pedatamu annaru.. So Including Divider 200 meters ante 6 lane padudhi.. But paina vunna plane lo 2 lane brts ke pothundhi.. Other vehicles ki only 4 lane road in the city ante future lo horrible ee meters kaadu feets
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 Ippudu poooing area lo vesina E8 road width 190 feets 4 lane vesaru.
Raaz@NBK Posted August 5, 2017 Posted August 5, 2017 meters kaadu feets sorry feets Thanks for correcting me
Dravidict Posted August 5, 2017 Posted August 5, 2017 Paina vesa plan lo 6 lane chupinchadu including BRTS. 8 lane chance ledhu bro. bcoz idhivaraku NH valu 200 M Acquire chesi 4 lane purpose ki use chesthamu annaru.. future purpose kosam 6 lane pedatamu annaru.. So Including Divider 200 meters ante 6 lane padudhi.. But paina vunna plane lo 2 lane brts ke pothundhi.. Other vehicles ki only 4 lane road in the city ante future lo horrible ee 200 ft adhi. About 60m. National highway meedha oka lane 3.5m vuntundhi. 60m lo both sides greenery, madhyalo greenery penchina easy ga 8 lines padathayi
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now