Jump to content

Recommended Posts

Posted

Ee rajakeeyanakulaki enduku saami illu.

Elaagu vaallu akkada undi chachedi undadu. Vaalla thoththugallaki mandu ki, vindu ki tappa enduku vaadaru vatini. Anavasaram ga jaaga bokka. Malli eetiki security Ani thokka ani extra kharchu.

 

Ippudu dabbu leni rajakeeyanakudu evadunnadu asalu

Vunnaadu !! Hamara (bajaj kaadu)Leader Compaq I say   :run_dog:  :run_dog:

Posted

need to pull in more people to stay in pooling area and spend. then only buisinesses will grow. Nothing wrong in constructing multi storied apartment complexes. But they should not be given at free of cost to secretariat employees.

Posted

need to pull in more people to stay in pooling area and spend. then only buisinesses will grow. Nothing wrong in constructing multi storied apartment complexes. But they should not be given at free of cost to secretariat employees.

 

:iagree:

Posted

రాజధానిలో 8 స్టార్‌ హోటళ్లు!

ఎకరం రూ.3 కోట్లు చొప్పున కేటాయింపు

టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తొలి దశలో ఎనిమిది స్టార్‌ హోటళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో మూడు పరిపాలన నగరంలో రానున్నాయి. రాజధానిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి దరఖాస్తులు (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌-ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానిస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) శుక్రవారం టెండరు ప్రకటన విడుదల చేసింది. 2 ఐదు నక్షత్రాలు(ఫైవ్‌ స్టార్‌), 2 నాలుగు నక్షత్రాలు, 4 మూడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఐదు నక్షత్రాల హోటల్‌కి 4 ఎకరాలు, నాలుగు నక్షత్రాల హోటల్‌కి 2 ఎకరాలు, మూడు నక్షత్రాల హోటల్‌కి ఎకరం చొప్పున కేటాయిస్తామని తెలిపింది. ఎకరం ధరను రూ.3 కోట్లుగా నిర్ణయించింది.

అర్హత నిబంధనలు.. రాజధానిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ గతంలో టెండర్లు పిలిచింది. అప్పట్లో భూమి ధరను ముందే నిర్ణయించకుండా.. ఎవరు ఎక్కువ ధరకు కోట్‌ చేస్తే వారికి భూమి కేటాయించే ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానించింది. స్పందన పెద్దగా లేకపోవడంతో స్టార్‌ హోటళ్లకు భూ కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఈసారి భూమి ధరను ముందే నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం, నిర్వహణల పరంగా ఆయా సంస్థలకు ఉన్న అనుభవం, ఏ సంస్థలతో వారికి అవగాహన(బ్రాండింగ్‌) ఉంది... అన్న అంశాల్ని అర్హతలుగా నిర్ణయించింది. టెండరు దరఖాస్తులు దాఖలు చేసిన సంస్థలకు ఈ మూడు అంశాల వారీగా మార్కులు వేస్తుంది. ఎక్కువ మార్కులు వచ్చిన సంస్థలకు స్థలాలు కేటాయిస్తుంది. ఇప్పుడు టెండర్లు పిలిచిన 8 స్టార్‌హోటళ్లలో మూడు పరిపాలన నగరంలో నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి కేటగిరీలో ఒకటి చొప్పున మూడు స్టార్‌ హోటళ్లను ఏర్పాటుచేయనున్నారు. మిగతా ఐదు స్టార్‌హోటళ్లకు రాజధానిలో వేర్వేరుచోట్ల స్థలాలు కేటాయిస్తారు.

 
Posted
కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేలా చూడండి

ఈనాడు అమరావతి: ఆకర్షణీయ నగరంగా ఎంపికైన అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.500 కోట్లు త్వరగా విడుదలయ్యేలా కృషి చేయడంతో పాటు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రుణాల ద్వారా మరో రూ.874 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ కోరారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు ఐదో దశలో మంజూరైన విజయవాడ బైపాస్‌ రోడ్డుని ప్రస్తుత రాజధాని అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న వివిధ విద్యా సంస్థలన్ని పరిశీలించారు. విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రత్యేక కమిషనర్‌ రామమనోహరరావు తదితరులతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణ పురోగతిని శ్రీధర్‌ వివరించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాల్సి ఉందని, వివిధ సంస్థలతో సంప్రదించి నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు.

Posted
వినోదపు హరివిల్లుగా శాఖమూరు

ఈనాడు-అమరావతి: రాజధాని ప్రాంతంలోని శాఖమూరును వినోదపు హరివిల్లుగా తీర్చిదిద్దడమే కాకుండా రిసార్ట్స్‌, కాటేజీలు, ఫౌంటెన్లు, విల్లాస్‌, క్రాప్ట్‌ బజార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి తెలిపారు. విజయవాడలో శుక్రవారం జరిగిన కార్యశాలలో స్నోవరల్డ్‌, హెచ్‌యుఎస్‌ఎస్‌పార్క్‌ అట్రాక్షన్‌, క్లాసిక్‌ ఫౌంటెన్స్‌, వైట్‌వాటర్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్లొన్నారు.

సుందరంగా కృష్ణా నదీ ముఖద్వారం: అమరావతికి దారితీసే కృష్ణానదీ ముఖద్వారాన్ని, విజయవాడ నగరంలోని కాలువలను సుందరీకరించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి వివరించారు. ఏడీసీ చేపట్టే ప్రాజెక్టులపై జలనవరుశాఖ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. ఇబ్రహీంపట్నం నుంచి రాజధాని స్టార్టప్‌ ప్రాంతం వరకు కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనపై ఈ సందర్భంగా మాట్లాడారు. నిర్మాణ పరంగా ఉన్న ఇబ్బందులపై వివరాలు తీసుకున్నారు. సంగమం వద్ద జలవనరులశాఖ భూమిని ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధత తెలిపారు.

Posted

ఎమ్మెల్యేలు, అధికారులకు బహుళ అంతస్తుల భవనాలు

మొత్తం 68 టవర్ల నిర్మాణం

అధికారులు, ఉద్యోగుల హోదాను బట్టి ఫ్లాట్‌ విస్తీర్ణం

రూ.1991 కోట్లతో 3864 ఫ్లాట్లు

68.49 ఎకరాల్లో నిర్మాణం

మూడు ప్యాకేజీలుగా టెండర్లు

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఇతర ఉద్యోగులకు గృహనిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) శుక్రవారం టెండర్లు పిలిచింది. రూ.1991 కోట్ల అంచనా వ్యయంతో 3864 ఫ్లాట్లు నిర్మించనున్నారు. సెప్టెంబరు 30న పనులు ప్రారంభించి, 2018 డిసెంబరు నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలన్నది లక్ష్యం. వీరి కోసం మొత్తం 68 బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. ప్రతి భవనంలో స్టిల్ట్‌+12 అంతస్తులుంటాయి. అధికారుల హోదాని బట్టి ఫ్లాట్‌లో నిర్మిత ప్రాంతాన్ని నిర్ణయించారు. మొత్తం భవనాల్ని మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. పరిపాలనా నగరంలో సెంట్రల్‌ స్పైన్‌(మధ్యలో ఉన్న రహదారి)కి అటూఇటూ ఈ నిర్మాణాలు వస్తాయి.

‘షియర్‌వాల్‌ టెక్నాలజీ’తో నిర్మాణం.. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి షియర్‌వాల్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు. 3500 చ.అడుగుల కేటగిరీ భవనాలన్నీ ఒక ప్యాకేజీగా, 1800, 1500, 900 చ.అడుగుల కేటగిరీ భవనాలన్నీ మరొక ప్యాకేజీగా, 1200 చ.అడుగుల కేటగిరీ భవనాలు వేరొక ప్యాకేజీగా చేసి టెండర్లు పిలిచారు. ప్రతి కాలనీలో క్లబ్‌ హౌస్‌, రిక్రియేషన్‌ సెంటర్‌, ఈతకొలను, ఫంక్షన్‌ హాల్‌, సూపర్‌మార్కెట్‌, వెయిటింగ్‌ హాల్‌, పార్కులు, క్రీడా సదుపాయాలు వంటివి కల్పించనున్నారు. ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసుల అధికారులకు కొంత విలాసవంతమైన ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీరికి నిర్మించే భవనాల్లో ఒక్కో అంతస్తులో రెండు ఫ్లాట్లే ఉంటాయి.

18ap-politics5a.jpg

Posted

విద్యా సంస్థలకు ఎకరం రూ.50 లక్షలకే..!

రాజధానిలో భూమి కేటాయింపులపై ప్రభుత్వ నిర్ణయం

అమరావతికి రావాలని ప్రముఖ సంస్థలకు లేఖలు

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు ఏర్పాటుకు ఎకరం రూ.50 లక్షలకు కేటాయించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఏర్పాటయ్యే ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలకు కూడా దాదాపుగా ఇదే విధానం వర్తించనుంది. రాజధానిలో ఎస్‌ఆర్‌ఎం, విట్‌, అమృత వంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి ప్రభుత్వం ఎకరం రూ.50 లక్షల చొప్పున భూములు కేటాయించింది. రాజధానిలో మొదట వస్తున్న సంస్థలు కాబట్టి, వీటిని ప్రత్యేకంగా పరిగణించి తక్కువధరలకు భూములు కేటాయించింది. జాతీయ, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకి మాత్రం బిడ్‌లు ఆహ్వానించి, అర్హత నిబంధనలు సరిపోవడంతో పాటు, ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన విద్యా సంస్థలకు భూములు కేటాయించాలని ప్రభుత్వం మొదట భావించింది. బిడ్‌లు ఆహ్వానిస్తూ ప్రకటన కూడా జారీ చేసింది. కానీ పేరెన్నికగన్న విద్యాసంస్థలు ముందుకి రాకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. పాఠశాలల నిర్వహణలో దేశంలోనే మొదటి 20 స్థానాల్లో ఉన్న సంస్థల్ని రాజధానికి ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాలలకు భూ కేటాయింపుల విధానంలోను మార్పులు చేశారు. పాఠశాలలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున భూములు కేటాయించాలని సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఇటీవల నిర్ణయించారు.

పరిశీలనలో యూనివర్సిటీల ప్రతిపాదనలు..!: గీతం, సవితా, పీఈఎస్‌ వంటి యూనివర్సిటీలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలోఉన్నాయి. సవితా 250 ఎకరాలు, గతం 125 ఎకరాల వరకు భూములు ఇవ్వాలని కోరాయి. వాటికి ఎన్ని ఎకరాలు కేటాయించాలన్న దానిపై ఆయా సంస్థల ప్రతిపాదనలు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పీఈఎస్‌ సంస్థ స్థలమైతే కోరిందిగానీ పూర్తి ప్రతిపాదనలు అందజేయలేదని సమాచారం.

ఇంత వరకు స్థలాలు పొందిన సంస్థలు..!: రాజధానిలో ఇంత వరకు ఎస్‌ఆర్‌ఎం, విట్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ), అమృత, బీఆర్‌ షెట్టి, ఐయూఐహెచ్‌ సంస్థలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ సంస్థలకు 200 ఎకరాల చొప్పున ఇచ్చింది. ఈ రెండు సంస్థలకు మొదట 100 ఎకరాల చొప్పున కేటాయించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాక మరో 100 ఎకరాలు చొప్పున ఇస్తామన్నది షరతు. ఈ రెండు సంస్థలు ఇప్పటికే కొంత మేర నిర్మాణాలు పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాయి. ఎన్‌ఐడీకి 50 ఎకరాలు ఇచ్చింది. ఆ సంస్థ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఐయూఐహెచ్‌కి మొదట 50 ఎకరాలు, రెండో దశలో 100 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ సంస్థ ఇటీవలే కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌, వైద్య కళాశాలల ఏర్పాటుకి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. బీఆర్‌షెట్టి సంస్థ కూడా వైద్య విద్యా సంస్థలు, ఆస్పత్రి వంటివి ఏర్పాటుకి శంకుస్థాపన చేసింది. ఈ సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. అమృత యూనివర్సిటీకి ప్రభుత్వం తొలి దశలో 150 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో 50 ఎకరాలు ఇవ్వనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్నారు.

భూములు ఇచ్చేది ఇలా..! * అంతర్జాతీయ డే స్కూళ్లకు 4 ఎకరాలు

* బోర్డింగ్‌ స్కూళ్లకు 8 ఎకరాలు

* జాతీయ డే స్కూళ్లకు 2 ఎకరాలు

* బోర్డింగ్‌ స్కూళ్లకు 4 ఎకరాలు

నిర్దేశించిన అర్హతలున్న సంస్థలు ఎన్ని ముందుకు వచ్చినా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న 20 విద్యా సంస్థలకు ఇప్పటికే సీఆర్‌డీఏ లేఖలు రాసింది. అమరావతిలో పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

Posted

Singapore’s dedicated team works on Amaravati

 

World-Bank funded projects being assessed.

Prime Minister Narendra Modi (in white) at launch of Amaravati with Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu (in beige) .

A dedicated team from a Singapore consortium is marketing to potential investors for development of various facilities of Amaravati, the new capital city of Andhra Pradesh, according to a report from the south Indian state.

A team from Ascnedas-Singbridge and Sembcorp, Singpore’s top industrial groups, is also finalizing designs for Amarvati, which is to be developed in various phases.

Singapore’s Surbana Jurong Pte Ltd have done the masterplan for the greenfield city, which will be India’s first smart city development. It is also preparing to partner with investors/developers in undertaking phase-based projects in Amaravati.

Meanwhile, the Andhra Pradesh Capital Region Development Authority (AP-CRDA) Commissioner Cherukuri Sreedhar told The Hindu “They (Singapore companies) are focussing on the transformation of the entire region from the infrastructure point of view also.”

The CRDA is holding public consultations on the social and environmental impact of the projects in the new city, particularly those supported by the World Bank.

“A proper assessment of the World Bank-funded projects is a must and we have to submit detailed reports to it, lest the works should fall in jeopardy,” the Capital Region Development Authority chief stressed to The Hindu. fii-news.com

 

http://www.fii-news.com/singapores-dedicated-team-works-amaravati/

Posted

ఐకానిక్‌ వంతెనకు త్వరలో టెండర్లు

రాజధాని రహదారుల్లో సదుపాయాల కల్పనకు రూ.1,520 కోట్లు

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం నిర్మిస్తున్న పది రహదారుల వెంట సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మూడు ప్యాకేజీల్లో నిర్మించే వీటికోసం రూ.1,520.28 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ నిధులతో రహదారుల వెంట మురుగునీటి పారుదల, విద్యుత్తు, తాగునీటి సరఫరా వ్యవస్థలతోపాటు పాదచారుల నడక మార్గాలు, సైకిల్‌దారులు, పచ్చదనం పెంపు చేపడతారు. పురపాలక మంత్రి పి.నారాయణ అధ్యక్షతన అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ), రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులతో సోమవారం విజయవాడలో సమావేశం జరిగింది. అమరావతిలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు.

సీఎం ఆమోదిస్తే టెండర్లే: ఇబ్రహీంపట్నం నుంచి రాజధాని స్టార్టప్‌ ప్రాంతం దాకా ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి విధివిధానాలు తయారయ్యాయి. ముఖ్యమంత్రి ఆకృతులను ఖరారుచేసిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహంపై చర్చ: అమరావతిలో ఎన్‌టీ రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. నిపుణులను నియమించాలని మంత్రి అధికారులకు సూచించారు.

Posted
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు
 
 
636390072121402793.jpg
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల కోసం ఇళ్ల నిర్మాణం తలపెట్టింది సీఆర్డీఐ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. రూ.680 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. 18 టవర్లలో 432 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి 'పైల్ లోడ్ టెస్ట్' కోసం టెండర్లు పిలిచాం.. ఈ పనులకు రూ. 72 లక్షల ఖర్చు అవుతుందని శ్రీధర్ పేర్కొన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...