Jump to content

Recommended Posts

Posted

need to pull in more people to stay in pooling area and spend. then only buisinesses will grow. Nothing wrong in constructing multi storied apartment complexes. But they should not be given at free of cost to secretariat employees.

enti pulledi boodida,.. anthantha rates petti rammante vasthaara,.. mana valla kakkurthi ki chivariki aa area peddaga expand avvadu saavadu,.. 

Posted

enti pulledi boodida,.. anthantha rates petti rammante vasthaara,.. mana valla kakkurthi ki chivariki aa area peddaga expand avvadu saavadu,.. 

 

andukega ilantivi kattali anedi. ee batch antha free or subsidized batch ye kada. vellu anna vastaru mundu. jobs (tourism/medical/education ...etc) create ayithe, cost ekkuva vunna slow ga kontha mandi akkada settle avutaru. just an example, with so many high end medical institutions around there will be huge uptick in medical tourism. countries with single payer insurance like U.K, Canada ..etc nunchi medical treatments ki vacche chance vuntundi. 

Posted

Ee rajakeeyanakulaki enduku saami illu.

Elaagu vaallu akkada undi chachedi undadu. Vaalla thoththugallaki mandu ki, vindu ki tappa enduku vaadaru vatini. Anavasaram ga jaaga bokka. Malli eetiki security Ani thokka ani extra kharchu.

 

Ippudu dabbu leni rajakeeyanakudu evadunnadu asalu

 

 

Vunnaadu !! Hamara (bajaj kaadu)Leader Compaq I say   :run_dog:  :run_dog:

 

 

vja.hug.gif

 

Sundaraaniki thondharekkuvani.. Conpaqu, spelling sarigaa chadhavochchugaa..  :P

Posted

Sundaraaniki thondharekkuvani.. Conpaqu, spelling sarigaa chadhavochchugaa.. :P

Adi meeku hello cheltunna postu., danni meeru ila twist chesesara :wall:
Posted

Adi meeku hello cheltunna postu., danni meeru ila twist chesesara :wall:

 

meeru entha guruu gaarainaa, ee kaalam pillakunkalu aappudappuduu ilaa.. meere sardhuku povaali..

Posted

అమరావతిలో 6 వరుసల రహదారులు

విస్తరణకు టెండర్లు పిలిచిన ఏడీసీ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో ప్రధాన రహదారులన్నింటినీ ఆరు వరుసలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాజధాని అభివృద్ధి సంస్థ (ఏడీసీ) తాజాగా టెండర్లు పిలిచింది. ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) మినహా.. మరో 10 ప్రధాన రహదారుల నిర్మాణానికి ఏడీసీ గతంలోనే టెండర్లు పిలిచింది. వీటిలో ఎన్‌9, ఈ8 రహదారులను ఆరు వరుసలుగా నిర్మిస్తుండగా, మిగతా రహదారుల్ని నాలుగు వరుసలుగా నిర్మించేందుకే అప్పట్లో టెండర్లు పిలిచారు. వీటిలో ఏడు రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. ఈ6, ఈ12, ఎన్‌11 రహదారుల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. ఈ దశలో మిగతా 8 రహదారుల్ని ఆరు వరుసలుగా విస్తరించడంతో పాటు, పది రహదారుల వెంబడి ప్రధాన మౌలిక వసతుల కల్పనకు ఏడీసీ మంగళవారం టెండర్లు ఆహ్వానించింది. 10 రహదారుల్ని మూడు ప్యాకేజీలుగా విభజించింది. మొత్తం పనుల విలువ రూ.1520.28 కోట్లు. ఈపీసీ విధానంలో పనులు చేపట్టనున్నారు.

చేపట్టే పనులు ఇవీ

రహదారుల నిర్మాణంతో పాటు వర్షం నీటిపారుదల కాలువలు, తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ కేబుళ్లు వెళ్లడానికి డక్ట్‌లు, పునర్వినియోగ నీటి సరఫరా పైప్‌లైన్లు, నడకదారులు, సైకిల్‌ ట్రాక్‌లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం, స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఏర్పాటు వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది.

ఈ10, ఈ14, ఎన్‌16 రహదారుల్ని ఒక ప్యాకేజీగా (రూ.435.20 కోట్లు); ఎన్‌9, ఎన్‌4, ఎన్‌14 రహదారుల్ని ఒక ప్యాకేజీగా (రూ.570.80 కోట్లు); ఈ6, ఈ8, ఈ12, ఎన్‌11 రహదారుల్ని ఒక ప్యాకేజీగా (రూ.514.28 కోట్లు) టెండర్లు పిలిచారు. బిడ్‌లు దాఖలు చేయడానికి సెప్టెంబరు 11 వరకు గడువిచ్చారు. పనులు అప్పగించిన సంవత్సరంలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Posted
సీఎం చంద్రబాబు నివాసంలో ముగిసిన సీఆర్డీఏ సమావేశం...
 
 
636390997613729173.jpg
అమరావతి: సీఎం నివాసంలో సీఆర్డీఏ సమావేశం ముగిసింది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫోస్టర్ బృందం నివేదిక, సూచనలపై మంత్రులు, కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించాలని  సీఆర్‌డీఏకు సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.
గూగుల్, ఇన్ఫోసిస్ తరహా ఐటీ కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా సచివాలయం, శాఖాధిపతుల ఆఫీసు భవనాలు నిర్మించాలని ఆయన ఆదేశించారు.సెప్టెంబర్‌ 13కు తుది ఆకృతులు అందజేస్తామన్న ఫోస్టర్ బృందం ఆయనకు తెలిపింది.
Posted
కార్పొరేట్‌ సచివాలయం!
 
 
636391403530969327.jpg
  • కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా నిర్మాణం
  • ఉద్యోగులతోపాటు ప్రజలకూ ఉత్తేజం కలగాలి
  • ఫైల్‌ అన్నదే కనిపించొద్దు.. అంతా ఆన్‌లైన్‌లోనే
  • నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం
  • సెప్టెంబరు 13కి సచివాలయం తుది డిజైన్లు
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గూగుల్‌, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ దిగ్గజాల కార్పొరేట్‌ కార్యాలయాలను తలదన్నేలా అమరావతిలోని సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మించాలని సీఎం చంద్రబాబు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ను ఆదేశించారు. ఈ భవంతులన్నీ ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి భిన్నంగా ఉండాలని అన్నారు. ఉండవల్లిలోని తమ నివాసంలో బుధవారం సీఆర్డీయే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల డిజైన్లు, వాటిల్లో కల్పించాల్సిన వసతులపై సీఎం దిశానిర్దేశం చేశారు.
 
కార్యాలయ ప్రాంగణాల్లో.. వినోదం, ఆహ్లాదం, క్రీడాసదుపాయాలను కల్పించాలని, తద్వారా అక్కడ పని చేసే ఉద్యోగులకే కాకుండా వివిధ పనులపై ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలకూ ఉత్సాహం, ఉత్తేజం కలిగేలా చూడాలని సూచించారు. పరిపాలనా నగరంలో తలపెట్టిన సచివాలయం, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల ఏర్పాటును కేవలం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ ప్రక్రియగా మాత్రమే చూడకుండా, ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునే అత్యుత్తమ కార్యాలయాల సముదాయంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగులు, అధికారుల్లోని సృజనాత్మకతను వెలికిదీసి, కార్యాలయాల్లో చక్కటి పని వాతావరణం నెలకొనేలా భవంతులు ఉండాలన్నారు.
 
నూతన సచివాలయంలో ఎక్కడా భౌతికంగా ఫైల్‌ అనేదే కనిపించకూడదని, ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే ఉండాలని, అధికారులు అవసరమైతే తమ ఇళ్ల నుంచే వాటిని ఆన్‌లైన్‌లో క్లియర్‌ చేసేలా అత్యాధునిక సాంకేతికతను పొందుపరచాలని సూచించారు. విహంగవీక్షణం చేస్తే సచివాలయ ప్రాంగణం పచ్చదనం, జలసంబంధిత ఆకర్షణలతో ఒక అద్భుతాన్ని వీక్షించిన అనుభూతిని కల్పించాలని నిర్దేశించారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు డైనమిక్‌గా, కార్యదక్షతను పెంచేలా, సృజనాత్మకతను ప్రోత్సహించేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా నార్మన్‌ ఫోస్టర్‌ నివేదికను రూపొందించింది. ‘గవర్నమెంట్‌ వర్క్‌ ప్లేసెస్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ అనే థీమ్‌తో ఈ నివేదికను రూపొందించారు. బుధవారం నాటి సమావేశంలో సీఎంకు నివేదికలోని అంశాలను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు వివరించారు.
 
చక్కటి కాంతి, గాలి, బయటి దృశ్యాలు కనిపించే ఏర్పాట్లు, వాతావరణ నియంత్రణ ఇత్యాది సౌకర్యాలతో ఉద్యోగుల నుంచి ఆశించిన ఉత్పాదకతను సాధించగలుగుతామని, పనులపై ఇక్కడికి వచ్చే ప్రజలూ వాటిని హర్షిస్తారని నివేదిలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.. గతంలో ఎక్కడికక్కడ అంతర్గత గోడలతో నిండిన లండన్‌లోని హర్‌ మెజిస్టీ ట్రెజరీని ఆధునికీకరించడంలో భాగంగా అందులోని సుమారు 7 మైళ్ల పొడవైన ఇంటర్నల్‌ వాల్స్‌ను తొలగించారు. అనంతరం ఆ కార్యాలయంలోని ఉద్యోగుల పనితీరు ఎంతో మెరుగు పడిందని ఫోస్టర్స్‌ ఉటంకించింది. సచివాలయంలోనూ 15వేల నుంచి 25వేల మంది ఉద్యోగులు ప్రపంచస్థాయి ప్రమాణాల మధ్య పని చేసుకునేందుకు వీలుగా 4 నమూనాలను నార్మన్‌ ఫోస్టర్స్‌ రూపొందించింది.
 
10 అంతస్థుల నుంచి 25 అంతస్థుల మధ్య సెక్రటేరియట్‌, హెచ్‌వోడీలను రూపొందించేలా ఇవి ఉన్నాయి. సుమారు 5 వేల కార్లను నిలుపుకొనేందుకు వీలుగా 3 నుంచి 4 ఫ్లోర్ల బేస్‌మెంట్‌ పార్కింగ్‌లను ప్రతిపాదించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సమర్పించిన నివేదికలు, వాటిపై తాను చేసిన సూచనలపై వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో త్వరలో ఒక వర్క్‌షా్‌పను నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించాలని సీఎం సీఆర్డీయేను ఆదేశించారు. వాటిల్లోని నిర్మాణాత్మక సూచనలు, అభిప్రాయాలను ఫోస్టర్‌కు తెలియజేయాలన్నారు. వాటికి అనుగుణంగా సెక్రటేరియట్‌, హెచ్‌వోడీల కార్యాలయాలకు సంబంధించిన తుది డిజైన్లను సిద్ధం చేయాలని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను కోరారు. వచ్చే నెల 13వ తేదీకల్లా వాటిని అందజేస్తామని ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు
Posted

ఐటీ కార్యాలయాలకు దీటుగా సచివాలయం

విభాగాధిపతుల కార్యాలయ భవనాలు కూడా

ఆధునికత ఉట్టిపడేలా కార్యాలయాలుండాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీ కార్యాలయాల ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం

సెప్టెంబరు 13కి తుది ఆకృతులు రూపొందిస్తామన్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ

ఈనాడు - అమరావతి

23ap-main10a.jpg

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, విభాగాధిపతుల(హెచ్‌ఓడీ) కార్యాలయాలు గూగుల్‌, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధాని అమరావతిలో పరిపాలనా నగరంలో నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల(హెచ్‌ఓడీ) కార్యాలయ భవనాల ప్రాథమిక ప్రణాళికలు, లేఅవుట్‌లను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేసింది. వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు వేర్వేరు చోట్ల కాకుండా, ఒకే చోట ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వీటిని రూపొందించింది. బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో రాజధానిపై జరిగిన సమీక్షా సమావేశంలో తాము రూపొందించిన ప్రణాళికలను ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సెప్టెంబరు 13 నాటికి తుది ఆకృతులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, ముఖ్యమంత్రి చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.

* ఇది వరకు ప్రభుత్వ కార్యాలయాలయాలకు వెళ్లా లంటేనే భయమేసేది. అంతెత్తున పేరుకు పోయిన ఫైళ్లు, దుమ్ము ధూళితో కార్యాలయాలుండేవి. పని కోసం వచ్చిన సామాన్యులు బెరుకు బెరుకుగా లోపలికి అడుగు పెట్టేవారు. తాము సంప్రదించాల్సిన అధికారి గాని, ఉద్యోగి గాని ఎక్కడున్నారో కనుక్కోవడానికే అరగంట సమయం పట్టేది. అమరావతిలో నిర్మించే కార్యాలయాలు అలా ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు.

* సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు భిన్నంగా, ఉద్యోగులతో పాటు... వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు కూడా ఉత్సాహం, ఉత్తేజం కల్పించేలా, వినోద, ఆహ్లాద, క్రీడా సదుపాయాలతో భవంతులు నిర్మించాలి. పని ఒత్తిడి నుంచి సేద తీరేందుకు వ్యాయామశాలలు వంటివి ఉండాలి.

* ‘భవిష్యత్‌ ప్రభుత్వ కార్యాలయాలు’ అన్న భావసూత్రం ఆధారంగా నివేదిక రూపకల్పన. నాణ్యత, ఎంపిక, మార్పుచేర్పులకు అనుకూలమైన(ఫ్లెక్సిబిలిటీ) అంశాల కలయికతో, వివిధ ఐచ్ఛికాలతో నివేదిక.

* బార్సిలోనా, లండన్‌ వంటి ప్రముఖ నగరాల్లో నిర్మాణ కౌశలం ఉట్టిడేలా, సౌకర్యంగా ఉండేలా నిర్మించిన కొన్ని భవనాల చిత్రాలు చూపించిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ.

* సచివాలయం, విభాగాధిపతుల భవనాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలన్న అంశంపై విస్తృత చర్చ. ఒక శాఖకు చెందిన కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉండాలి. సందర్శకులు ఒక భవనం నుంచి మరో భవనంలోకి సులువుగా వెళ్లే సదుపాయం ఉండాలి. బయటి నుంచి చూస్తే ఈ రెండు భవనాలూ కలిసే ఉన్నట్టుగా కనిపించాలి.

* నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ప్రణాళికలు, నివేదికలపై త్వరలో ఒక కార్యగోష్ఠి నిర్వహించి మంత్రులు, కార్యదర్శుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, వారి నుంచి వచ్చిన నిర్మాణాత్మక సూచనలు, అభిప్రాయాలు ఆ సంస్థకు అందజేసి, వాటి ఆధారంగా తుది ఆకృతులు సిద్ధం చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)కు ముఖ్యమంత్రి ఆదేశం.

* సచివాలయం, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల కార్యాలయ భవనాల నిర్మాణాన్ని ఏదో సాదాసీదా కాంక్రీటు భవన నిర్మాణాలుగా చూడకుండా, ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దాలని సీఎం సూచన.

* అధికారులు, ఉద్యోగుల్లో సృజనను వెలికి తీసేలా, వారిలో సామర్థ్యం పెంచేలా, చక్కటి పనివాతావరణం కల్పించేలా కార్యాలయ భవనాలుండాలి.

* అధికారులు, ఉద్యోగుల్లో అలసట, ఒత్తిడి కనిపించని విధంగా సకల సదుపాయాలు కల్పించాలి.

* ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, పరస్పర సంభాషణలకు వేదికగా సచివాలయం నిలవాలి.

* కొత్త సచివాలయంలో ఎక్కడా భౌతికంగా దస్త్రం అన్నదే కనిపించకూడదు.. ప్రతి దస్త్రం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

* అధికారులు ఇళ్ల నుంచి, వాహనాల్లో ప్రయాణిస్తూ కూడా దస్త్రాలు పరిష్కరించవచ్చు. దీని వల్ల ఆదా అయ్యే సమయాన్ని... వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి అధికారుల మధ్య పరస్పర సహకారానికి, రెండు విభాగాలకు సంబంధించిన... పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి వినియోగించే వీలుంటుంది.

* కొత్త సచివాలయాన్ని చూసి సందర్శకులు, సాధారణ పౌరులు అబ్బురపడాలి. అదుకు తగ్గ ఆకర్షణలుండాలి. విహంగ వీక్షణం చేసినప్పుడు సచివాలయ ప్రాంగణం పచ్చదనం, జల ఆకర్షణలతో ఒక అద్భుతాన్ని చూసిన అనుభూతి కలిగించాలి.

Posted
రాజధానికి అటవీ భూమి!

636391400165860892.jpg


  • షరతులతో 2087 హెక్టార్ల కేటాయింపు
  • అటవీ సలహా మండలి స్పష్టీకరణ
  • ఒక హెక్టారును మొక్కల కోసం కేటాయించాలి
  • 60% భూమిని హరితంగానే ఉంచాలి
  • ఊపందుకోనున్న అమరావతి నిర్మాణాలు
  • ఏలూరులో ఏపీఐఐసీకి ఎర్రజెండా

న్యూఢిల్లీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ప్రతిపాదించిన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పచ్చజెండా ఊపింది. అయితే, కొన్ని షరతులు విధించింది. ఇటీవల ఈ విషయంపై సమావేశమైన అటవీ శాఖ సలహా మండలి ఏపీ విజ్ఞప్తిపై దృష్టి పెట్టింది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న అటవీ భూమిని తమకు బదలాయించాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన సలహా మండలి.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెంలో 1835.32 హెక్టార్లను(2087.09 హెక్టార్లు) వినియోగించుకోడానికి పచ్చజెండా ఊపింది. అయితే, ఈ భూమి వినియోగానికి కొన్ని కీలకమైన షరుతులు విధించింది. ఆయా వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.

 

ఏపీఐఐసీకి భూములివ్వలేం

ఎలక్ట్రికల్‌ మెషినరీ మ్యానుఫ్యాక్చర్‌ సెక్టార్‌ ఏర్పాటుకు ఏలూరు డివిజన్‌లోని జగన్నాథపురం అటవీ భూములను ఏపీఐఐసీకి బదలాయించలేమని అటవీ శాఖ సలహా మండలి స్పష్టం చేసింది. ఎలక్ట్రికల్‌ మెషినరీ మ్యానుఫ్యాక్చర్‌ సెక్టార్‌ను ఏర్పాటు చేయడానికి 761.69 హెక్టార్ల అటవీ భూములను బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, ఈ భూములు గత 30 ఏళ్లుగా ఆక్రమణలకు గురయ్యాయని, ఆక్రమణదారులు వాటిలో వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. అయితే, ఆక్రమణదారులకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ భూములపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ నేపథ్యంలో వీటిని ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 

షరతులు ఇవే..


  • ఈ భూములను అమరావతి నిర్మాణం, భద్రత సంస్థల ఏర్పాటు కోసమే వినియోగించాలి. 
  • తాడేపల్లి భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలి.
  • వెంకటాయపాలెం భూముల్లో రాష్ట్ర పోలీసు అకాడమీ, గ్రేహౌండ్స్‌, వాటర్‌ సర్వైవల్‌ ట్రైనింగ్‌ ఫ్యాకల్టీ, మిలటరీ స్టేషన్‌, కేంద్ర కారాగారం, రైల్వే అకాడమీ, సీఆర్‌పీఎఫ్‌ శిక్షణ తదితర భద్రతకు సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి.
  • 60% భూమిని హరిత ప్రాంతంగా ఉంచాలి. పనుల ప్రారంభానికి ముందే కేంద్ర పర్యావరణ శాఖకు మాస్టర్‌ ప్లాన్‌ను అందించాలి.
  • ఈ భూముల్లో వాణిజ్య, నివాస అపార్ట్‌మెంట్టు, రీటైల్‌ షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, లాడ్జీలు, తదితర వ్యాపార సంబంధిత భవనాలను నిర్మించరాదు.
  • ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టవచ్చు.
  • అమరావతిలోని నీటి కుంటలు, చెరువులు, నదులను పరిరక్షించాలి.
  • మరో చోట అటవీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి.
  • ఒక హెక్టారులో 1000 మొక్కలు నాటాలి.
  • పట్టణ అటవీ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు చేయాలి.
  • అవసరం మేరకే చెట్లను నరికివేయాలి.
  • కాగా, ఈ భూముల్లో ఎయిరోస్పేస్‌, గ్రీన్‌ మొబిలిటీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సలహా మండలి పక్కనబెట్టింది
Posted

Poni ala chusinaaaa 27000 acres ivvaledu especially kondapalli forest lo okka Acer kuda ivvaledu which is very close to Amaravati

adi ivvalasindi pushapu daridrulu,,,,,

Posted

అర చేతిలో ‘మన అమరావతి’!

24ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: అమరావతికి సంబంధించిన సమస్త సమాచారం అరచేతిలో ఇమిడిపోనుంది. అమ్మకానికి ఉన్న భూములు, ధరలు, అమ్మేవారి వివరాలు, ఉపాధి అవకాశాలతో కూడిన పూర్తి సమాచారంతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను తయారు చేశారు. ‘మన అమరావతి’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతికి సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు... రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులకు సీఆర్‌డీఏ ఇచ్చిన స్థలాలు, లేఅవుట్‌ల వివరాలు, మ్యాప్‌లు వంటివన్నీ పొందుపరిచారు. సీఆర్‌డీఏ, భూముల అమ్మకాలు, కొనుగోళ్లే కాకుండా... రాజధానిలో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి ఉన్నవారూ ఈ యాప్‌ ద్వారా సంప్రదించవచ్చు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం సీఆర్‌డీఏ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగులు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ దరఖాస్తులూ చేసుకునే వీలుంది. స్మార్ట్‌ఫోన్లలో ఎంతో తేలిగ్గా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలున్న ఈ యాప్‌ని అనేక విశేషాల సమాహారంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి ‘మన అమరావతి’ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి పేరు, ఆధార్‌ నెంబరు, ఫోన్‌ నెంబరుతో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో ఎప్పుడైనా లాగిన్‌ అవ్వొచ్చు.

రైతు సేవలో...! రాజధాని రైతుల స్థలాల క్రయ విక్రయాలకు ప్రత్యేకంగా ‘రైతు సేవలో’ పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేశారు. దానిలో కొనుగోళ్లు-అమ్మకాలు పేరుతో సబ్‌ లొకేషన్‌లో విక్రయం, జాయింట్‌ డెవలప్‌మెంట్‌, లీజుకి ఆప్షన్లు కనిపిస్తాయి. స్థలాలు విక్రయించాలనుకున్న రైతులు... ఈ మూడింటిలో ఎంచుకున్న కేటగిరీలోకి వెళ్లి పేరు, స్థలం కోడ్‌ నెంబరు, విస్తీర్ణం, నివాస స్థలమా, వాణిజ్య స్థలమా, చదరపు గజం ధర వంటి వివరాలు పొందుపరచాలి. స్థలం కొనాలనుకున్నవారు ‘కాంటాక్ట్‌ ఓనర్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి లాగిన్‌ అయితే... స్థలం విక్రయానికి ఉంచిన రైతు ఫోన్‌ నెంబరు, ఇతర వివరాలు స్థలం కొనాలనుకుంటున్న వ్యక్తి ఫోన్‌కి సంక్షిప్త సందేశం రూపంలో వస్తాయి. కొనాలనుకుంటున్న వ్యక్తి వివరాలు సంబంధిత రైతు ఫోన్‌కి సంక్షిప్త సందేశం ద్వారా వెళతాయి. తమకు ఏ వూరికి సంబంధించిన లేవుట్‌లో, ఎంత విస్తీర్ణం గల స్థలం, ఎంత ధరలో కావాలో ముందే నిర్ణయించుకుని, అలాంటి స్థలాలు ఎక్కడున్నాయో చూసేందుకు ‘అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌’ వంటి ఆప్షన్‌ కూడా ఉంది. రాజధానిలోని ఒక లేవుట్‌లోకి వెళ్లి నిలబడి యాప్‌లో ‘వ్యూ ప్లాట్‌ బై లొకేషన్‌’ అన్న ఆప్షన్‌లోకి వెళితే... జీపీఎస్‌ ద్వారా మీరు నిలబడిన లేఅవుట్‌, స్థలం మ్యాప్‌లో కనిపిస్తాయి. ఆ స్థలంపై క్లిక్‌ చేస్తే... ఆ స్థలం యజమాని పేరు, ఇతర వివరాలు కనిపిస్తాయి. ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికీ ఆప్షన్‌ ఉంది. భవన నిర్మాణ ప్రణాళికలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పెట్టుబడుల కోసం..! ‘అమరావతిలో పెట్టుబడులు పెట్టండి’ అన్న విభాగంలోకి వెళితే ఒక దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. దాన్ని నింపి యాప్‌ ద్వారానే పంపాలి... సీఆర్‌డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగానికి వెళుతుంది. వారు దాన్ని పరిశీలించి... దరఖాస్తు చేసినవారితో సంప్రదింపులు జరుపుతారు.

సమస్యలుంటే...! తమ సమస్యల్ని సీఆర్‌డీఏ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోరేవారు... యాప్‌లోని ‘విచారణలు’ విభాగంలోకి వెళ్లి... మీ వివరాలన్నీ నమోదు చేయాలి. అది నేరుగా సీఆర్‌డీఏ కమిషనర్‌ పేషీకి చేరుతుంది. అక్కడి నుంచి దాన్ని సంబంధిత విభాగానికి పంపిస్తారు.

మరిన్ని సేవలు..! రాజధాని రైతులకు సామాజిక అభివృద్ధిలో భాగంగా సీఆర్‌డీఏ అందజేస్తున్న ప్రయోజనాల గురించిన సమాచారం కూడా దీనిలో ఉంటుంది. రాజధానికి భూములిచ్చిన రైతులు తమకు ప్రభుత్వం ఇస్తున్న వార్షిక కౌలు ఎప్పుడెప్పుడు జమైంది. యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

* పింఛన్లు, ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, ఎన్టీఆర్‌ క్యాంటీన్లు, రుణమాఫీ వంటి వివరాలన్నీ దీనిలో ఉంటాయి. సీఆర్‌డీఏ అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందాలనుకున్నవారు, ఉద్యోగం, ఉపాధి కావాలనుకున్నవారు ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Posted
రహదారులకు అనుసంధానం
636392479651393447.jpg
(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలోని అంతర్గత రహదారులను దాని చుట్టూ ఉన్న జాతీయ, ప్రాంతీయ రహదారులతో అనుసంధానించేందుకు గల అవకాశాలపై సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతా ధికారులు విపులంగా చర్చించారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాల యంలో గురువారం జరిగిన సమావేశంలో సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్ధసారధిలు అమరావతి ప్రతిపాదిత ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ (ఐఆర్‌ఆర్‌), అవుటర్‌ రింగ్‌రోడ్ల (ఓఆర్‌ఆర్‌)కు రాజధా నిలోని అంతర్గత రహదారులను కలపడంపై సమాలోచనలు జరిపారు. ఐఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు, గ్రోత్‌కారిడార్లపై సమీక్షించారు. హైదరాబాద్‌ వైపు నుంచి చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలోని కాజ వరకు రహదారుల అనుసంధానతతోపాటు అమరావతి పశ్చిమం వైపు నుంచి అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు రాజధానిలోని ఎన్‌-13 రోడ్డును అను సంధానించడం ద్వారా దక్షిణం నుంచి ఉత్తరదిశ వైపు కల్పించాల్సిన లింకేజ్‌పై చర్చిం చారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి ఈ-5 ద్వారా తూర్పు వైపు నుంచి పశ్చిమదిశగా అనుసంధానత, కృష్ణానదిపై ప్రతిపాదిత 5 వంతెనల ఆవశ్యకతపై కూడా సమాలోచనలు జరిపారు. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు జాతీయ రహ దారుల సంస్థ ఫీజిబిలిటీ నివేదిక రూపొందింపజేస్తోందని, దీనికి సంబంధించిన లైడార్‌ సర్వేకు డీజీసీఏ ఇప్పటికే అనుమతులు ఇవ్వగా, కేంద్ర రక్షణ శాఖ నుంచి ఒకట్రెండు వారాల్లో అనుమతి లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లైడార్‌ సర్వే ముగిసిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై పూర్తిస్థాయి నివేదిక వస్తుందన్నారు. విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణావశ్యకతపై కూడా చర్చ జరిగింది.
 
ప్రధాన పర్యాటక ఆకర్షణగా శాఖమూరు ఉద్యానవనం
శాఖమూరులో నిర్మించనున్న పార్కు నవ్యాంధ్ర రాజధానికే తలమానికంగా నిలవనుందని, దీనిని విఖ్యాత ఆర్కిటెక్ట్‌లతో దాని డిజైన్లను రూపొందిపజేస్తున్నామని లక్ష్మీ పార్థసారధి ఈ సందర్భంగా శ్రీధర్‌కు తెలిపారు. శాఖమూరు ఉద్యానవనంలో అణువణువునా ఆహ్లాదం, ప్రకృతి సౌందర్యం తొణికిసలాడేందుకు పలు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి చిరునామాగా దీనిని మలచేందుకు చుట్టూ పచ్చదనం (పెరిఫెరల్‌ ప్లాంటేషన్‌), నక్షత్ర, రాశివనాలు, పలు జాతుల వృక్షజాలాన్ని అభివృద్ధి పరచనున్నామని పేర్కొన్నారు. హెచ్‌సీపీ కన్సల్టెంట్‌ సంస్థ నేతృత్వంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నితీష్‌ రాయ్‌ రోజ్‌గార్డెన్‌కు డిజైన్లను రూపొందించగా, ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌ కిషోర్‌ ప్రధాన్‌తదితరుల సేవలనూ పొందుతున్నట్లు తెలిపారు. వీరందరూ తయారుచేసిన ఆకృతులను ఇప్పటికే తాము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ పార్కులో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకోగలిగే క్రాఫ్ట్‌ బజార్‌, లేజర్‌ షో, వాటర్‌ ఫౌంటెన్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, యాంఫీ థియేటర్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, భారీ అంబేడ్కర్‌ విగ్రహం, మ్యూజికల్‌ షో, చిల్డ్రన్స్‌ అడ్వెంచర్‌, జిమ్‌, అథ్లెటిక్స్‌, జాగర్స్‌ పార్క్‌, రోజ్‌ గార్డెన్‌తదితర ఎన్నో ఆకర్షణలను కల్పించనున్నట్లు చెప్పారు.
 
నీరుకొండ రిజర్వాయర్‌ అంచులను సుందరీకరించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఏడీసీ అర్బన్‌ ప్రణాళికా విభాగాధిపతి పి.సురేష్‌బాబు, ఇన్‌ఫ్రా విభాగా ధిపతి గణేష్‌బాబు, సీఆర్డీయే ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగపు ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగం డైరెక్టర్‌ వి.రాముడు, సీనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ జి.నాగేశ్వరరావు, అనుబంధ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.
 
రోడ్ల నిర్మాణంలో పైపులైన్లకు నష్టం జరగరాదు
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా దిగువకు వెళ్లే నీటి పైపులైన్లకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి ఆదేశించారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రహదారి పనుల పురోగతిని గురువారం పరిశీలించిన ఆమె అబ్బరాజుపాలెం వద్ద కృష్ణానది నుంచి తాత్కాలిక సచివాలయానికి నీటిని సరఫరా చేసే ఏపీఐడీసీకి చెందిన పైపు లైన్‌ ఏమాత్రం దెబ్బ తినకుండా అప్రమత్తంగా ఉండాలని అధి కారులు, కాంట్రాక్టర్లను కోరారు.
 
మల్కాపురం వద్ద గ్రామీణ నీటిసరఫరా శాఖకు చెందిన పంప్‌హౌస్‌, మందడం ఎస్‌.సి. కాలనీకి నీటిని సరఫరా చేస్తున్న పంప్‌హౌస్‌లు రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నందున వాటిని అక్కడి నుంచి తొలగించి, సమీ పంలోని ఇతర ప్రదేశాలకు మార్చే పనులను శీఘ్రంగా చేపట్టాలన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం మరింత చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏడీసీ సీఈ టి.మోజెస్‌కుమార్‌, డీఈఈ వై.కృష్ణయ్య, సీడ్‌యాక్సెస్‌ రోడ్డును నిర్మిస్తున్న ఎన్‌.సీసీ ప్రతినిధి వెంకటేశ్వర్లు, పీఎంసీ టీం లీడర్‌ రమేష్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...