Jump to content

Amaravati


Recommended Posts

అభివృద్ధి పనులకు సీఆర్డీయే, ఏడీసీ సమాయత్తం
23-07-2017 10:46:01
 
636364035860280349.jpg
 
  • పెదకాకాని గుడి మార్గం అభివృద్ధి
  • గొల్లపూడి రోడ్డులో అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ నిర్మాణం
  • ప్రధాన రహదారుల వెంబడి మొక్కల పెంపకం
( అమరావతి): సీఆర్డీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ, ఏడీసీ సమాయత్తమవుతున్నాయి. ఈ పనుల్లో రాజధాని నగర పరిధిలోనివే కాకుండా దానికి ఆవల ఉన్న ప్రాంతాల్లోనివీ ఉన్నాయి. వాటి వివరాలు..
  •  రూ.1.91 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరు జిల్లాలోని పెదకాకాని శివాలయానికి వెళ్లే ప్రధాన మార్గాన్ని సీఆర్డీఏ అభివృద్ధి పరచనుంది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో పెదకాకాని కూడలి నుంచి గుడి వరకూ ఉన్న మార్గాన్ని అధునాతన వసతులతో మెరుగు పరచనున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా కాంక్రీట్‌ పేవ్‌మెంట్లు (పాదచారులు సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా), మధ్యలో సెంట్రల్‌ డివైడర్‌, అందులో అధిక కాంతినిచ్చే లైటింగ్‌ వ్యవస్థతోపాటు మురుగు, వర్షపునీరు వేగంగా ప్రవహించేందుకు వీలుగా డ్రెయిన్లు నిర్మిస్తారు. ఈ పనులు చేపట్టాలన్న ఆసక్తి ఉన్న వారు తమ బిడ్లను వచ్చే నెల 7వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది.
  •  రూ.5.43 కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లాలో, విజయవాడ శివార్లలో ఉన్న గొల్లపూడి నుంచి జక్కంపూడికి ఉన్న రోడ్డుకు పక్కన అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ను సీఆర్డీఏ నిర్మించనుంది. మచిలీపట్నం-హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి గొల్లపూడి, జక్కంపూడి మీదుగా వెల్లటూరు, వెలగలేరు, మైలవరం తదితర ప్రాంతాలకు (విజయవాడను తాకకుండా) వెళ్లేందుకు ఉపయోగపడే ఈ 100 అడుగుల రహదారికి అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అది మరింత హెచ్చింది. ఒకప్పుడు కొద్ది సంఖ్యలో మాత్రమే వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే కోట్లాది రూపాయల వ్యయంతో దీనిని అభివృద్ధి పరచారు. తాజాగా అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పనుల బిడ్ల సమర్పణకు ఈ నెల 26 ఆఖరు తేదీ కాగా అదే రోజున వాటి టెక్నికల్‌ బిడ్లను తెరచి పరిశీలిస్తారు.
  •  రూ.2.82 కోట్ల అంచనా వ్యయంతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని రాజధానిలోని మల్కాపురం- ఐనవోలు ఆర్‌ అండ్‌ బీ రహదారికి కలిపే రోడ్డును నిర్మించనున్నారు. సచివాలయ కాంప్లెక్స్‌కు ఉత్తరం వైపున ఉన్న ప్రహరీ గోడ పక్కగా ప్రారంభమయ్యే ఈ రహదారి నిర్మాణంతో రాజధాని ప్రాంతంలోని వివిధ జనావాసాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది. ఈ బిడ్ల స్వీకరణకు ఈ నెల 26 గడువుగా విధించారు.
  •  రూ.3.02 కోట్లతో రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌, 7 ప్రాధాన్య రహదారుల వెంబడి, 241 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న శాఖమూరు రీజినల్‌ పార్క్‌లో అభివృద్ధి పరచాలనుకుంటున్న పచ్చదనానికి, అవెన్యూ ప్లాంటేషన్‌కు అవసరమైన మొక్కల సేకరణ, 2017-18లో వాటి నిర్వహణతోపాటు విజయవాడలోని పోలీస్‌ కంట్రోల్‌ రూం ఎదుట నెలకొల్పిన స్ర్కాప్‌ అండ్‌ స్కల్ప్చర్‌ పార్కుకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేయించాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) నిర్ణయించింది. ఈ పనులు చేపట్టాలనుకునే వారు తమ బిడ్లను ఈ నెల 25వ తేదీలోగా సమర్పించాలంది. అదే రోజున వాటిని తెరవనుంది.
  • రూ.6 లక్షల వ్యయంతో రాజధానిలోని మల్కాపురం జంక్షన్‌ నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల కూడలి వరకు ఉన్న రహదారి పక్కన సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వీటి స్వీకరణకూ ఈ నెల 25 గడువు.
Link to comment
Share on other sites

అమరావతిలో హైపర్‌లూప్‌!

మెట్రో కంటే వేగవంతమైన రవాణా

అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశం

స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థల ఆసక్తి

ప్రముఖులకు 70-80 లక్షల చ.అడుగులలో ఇళ్ల నిర్మాణం

ఈ వ్యవస్థ ఆచరణలోకి వస్తే విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో చేరుకోవచ్చు

ఈనాడు - అమరావతి

26ap-main5a.jpg

రాజధాని అమరావతిలో మెట్రో రైలుకంటే వేగవంతమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని పురోగతిపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా హైపర్‌లూప్‌ పరిజ్ఞానం ద్వారా అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని హైపర్‌లూప్‌ వన్‌ సంస్థ పేర్కొంది. దీని విశేషాలను ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వ్యవస్థ ఆచరణలోకి వస్తే విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో, అమరావతి నుంచి హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, చెన్నైలకు కూడా విమానంలో కన్నా వేగంగా చేరుకోవచ్చని వారు వివరించారు. దీని సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇస్తాంబుల్‌ తరహాలో ఆతిథ్య రంగం..!

అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి రాడిసన్‌, లీలా, తాజ్‌, జీఆర్‌టీ, పార్క్‌, నోవాటెల్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్న 10 అగ్రశ్రేణి విద్యా సంస్థలు, 10 అగ్రశ్రేణి హోటళ్లపై అధికారులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఒకేసారి ఎక్కువ హోటళ్లకు అనుమతిస్తే తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఏ దశలో ఎన్ని హోటళ్లకు అనుమతిస్తారో చెప్పాలని... ఆయా సంస్థలు పేర్కొన్నాయి. మొదటి దశలో ఐదు హోటళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద 50 స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకి వీలుగా స్థలాన్ని కేటాయించి ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. హోటళ్ల కోసం సీఆర్‌డీఏ పరిధిలో 500 ఎకరాలు కేటాయించాలని తెలిపారు. అమరావతిలోను ఇస్తాంబుల్‌ తరహాలో ఆతిథ్యరంగం అభివృద్ధి చెందాలని, హోటళ్లతో పాటు వినోద కేంద్రాలు, కన్వెన్షన్‌ సెంటర్లు తగినన్ని నిర్మించాలని ఆయన చెప్పారు.

ఇతర ముఖ్య నిర్ణయాలు, ప్రస్తావనకు వచ్చిన అంశాలు..!

* అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, న్యాయమూర్తులకు ఇళ్ల నిర్మాణంపై చర్చ.

* ఎవరికి ఎంత విస్తీర్ణంలో ఇళ్లు, ఫ్లాట్లు ఉండాలన్న అంశంపై ప్రతిపాదనలు అందజేసిన సీఆర్‌డీఏ.

* మొత్తం 70-80 లక్షల చ.అడుగుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఇళ్లు, ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంటుందని అంచనా.

* కొందరికి ప్రతిపాదించిన ఇళ్లు/ఫ్లాట్లు విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో... నిర్వహణకు చాలా ఎక్కువ ఖర్చవుతుంది. విస్తీర్ణం తగ్గిస్తే బాగుంటుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర సూచన.

* విస్తీర్ణంపై ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులతో చర్చించి... వచ్చే సమావేశానికి తుది ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి సూచన.

* 15-20 రోజుల్లో ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని, 2018కి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం.

* అమరావతిలో లక్ష చ.అడుగులతో ప్రభుత్వ అతిథి గృహం నిర్మించాలని ప్రతిపాదించిన సీఆర్‌డీఏ. రాజధానిలో అతిథి గృహం అవసరం లేదన్న ముఖ్యమంత్రి. గతంలో స్టార్‌ హోటళ్లు విసృత్తంగా ఉండేవి కాదు. అతిథి గృహాలు నిర్మించేవారు. ఇప్పుడు మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లు అందుబాటులోకి వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అతిథుల్ని హోటళ్లలో ఉంచడం వల్ల ఏ స్థాయి వారికి, ఆ స్థాయి వసతులు కల్పించగలం. అదే సమయంలో నిర్వహణ భారం కూడా ఉండదని సీఎం వెల్లడి.

* అమరావతిలోని నవ నగరాల్లో ఒకటైన మీడియా సిటీ స్వరూప స్వభావాలపై మెకన్సీ సంస్థ ప్రజంటేషన్‌.

* రాబోయే దశాబ్ద కాలంలో 65 వేలకుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీడియా సిటీ అభివృద్ధి.

* ఒక యాంకర్‌ సంస్థను గుర్తించాలని, ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

* అన్ని మాధ్యమాలకు అవసరమైన ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ప్రొడక్షన్‌ హౌస్‌లు, పబ్లిషింగ్‌, శాటిలైట్‌ టెలి కమ్యూనికేషన్స్‌ - నెటవర్క్‌, అడ్వర్టయిజింగ్‌ వంటి సకల సదుపాయాలు ఈ నగరంలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

* విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సిటీస్క్వేర్‌ నిర్మాణంపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన జీఐఐసీ ప్రతినిధులు. డిజైన్లు ఇంకా మెరుగుపరచమని సీఎం సూచన. వాటిని వివిధ వర్గాలకు చూపించి అభిప్రాయాలు తెలుసుకోవాలని, 15 రోజుల్లో తుది నివేదికతో రావాలని స్పష్టీకరణ.

* సిటీస్క్వేర్‌తో పాటు విజయవాడలో కాలువల సుందరీకరణపై దృష్టి పెట్టాలని, కెనాల్‌సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం.

* రాజధానిలో భూసమీకరణ ప్రక్రియ పూర్తయి రైతులకు స్థలాలు కేటాయించిన గ్రామాలకు సంబంధించి వేగంగా లేఅవుట్‌ల అభివృద్ధి. లేవుట్‌లలో రహదారులు, మురుగు నీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకి ఆగస్టు 15 లోగా 27 గ్రామాలకు సంబంధించి టెండర్ల ఆహ్వానం.

మూడేళ్లలో పూర్తిచేస్తాం..!

లేవుట్‌లలో మౌలిక వసతుల కల్పనకు మూడేళ్ల సమయం పడుతుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. భూగర్భ మురుగునీరు, వర్షపునీటి పారుదల, తాగునీటి వసతులకు, కమ్యూనికేషన్‌ సదుపాయాల కోసం భూగర్భంలో వేసే లైన్లన్నీ వేస్తామని, రెండు మూడు లేయర్లుగా రహదారుల నిర్మాణం కూడా చేస్తామని విలేఖరుల సమావేశంలో ఆయన తెలిపారు. రైతులకు కేటాయించిన స్థలాల్లో వారు కూడా నిర్మాణాలు చేపడతారని, మొదటే రహదారుల్ని పూర్తి స్థాయిలో వేసేస్తే దెబ్బతింటాయన్నారు. అందుకే మొదట కొన్ని లేయర్లుగా రహదారుల నిర్మాణం పూర్తి చేసి, కొంత సమయం ఇచ్చిన తర్వాత వాటిని సిమెంటు రోడ్లుగా తీర్చిదిద్దుతామని వివరించారు. అందుకే మూడేళ్ల గడువు పెట్టుకున్నామని, లేకపోతే రెండేళ్లలోనే పూర్తవుతాయని చెప్పారు.

Link to comment
Share on other sites

అమరావతిలో హైపర్‌ లూప్‌!
27-07-2017 02:13:00
 
636367184086232546.jpg
  • 23 నిమిషాల్లో విశాఖకు, 25 నిమిషాల్లో తిరుపతికి
  • అత్యాధునిక రవాణా వ్యవస్థపై అధ్యయనం
  • 2018 ముగిసేలోగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇళ్లు
  • సీఆర్డీఏ పరిధిలో స్టార్‌ హోటళ్లకు 500 ఎకరాలు
 
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): విమానం కంటే వేగంగా గమ్యస్థానాలకు చేర్చే అత్యధునాతన హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థ అమరావతిలో ఏర్పాటు కానుందా? ఫలితంగా ఐటీ రాజధాని విశాఖకు 23 నిమిషాల్లోనూ, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి 25 నిమిషాల్లోనూ చేరుకునే వెసులుబాటు కలగనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. అమరావతిలో హైపర్‌ లూప్‌ ఏర్పాటుకు గల అవకాశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.
 
నవ్యాంధ్ర రాజధానిలో అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్న హైపర్‌లూప్‌ వన్‌ సంస్థ దానికి సంబంధించిన విశేషాలను బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనకు వివరించింది. ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చితే అమరావతి నుంచి విశాఖకు 23 నిమిషాల్లో, తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోగలుగుతారు. ఇదేవిధంగా హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకూ విమానం కంటే వేగంగా చేరుకోవచ్చని చెప్పారు. దీనిపై అధ్యయనం చేయాలని అమరావతి అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
 
ఆగస్టు 15 లోగా అన్ని ఎల్పీఎస్‌ లే అవుట్లకి టెండర్లు..
రాజధానిలోని అన్ని(పూలింగ్‌ ప్రక్రియ పూర్తయిన) గ్రామాల్లోని ఎల్పీఎస్‌ లే అవుట్లను అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి పరిచేందుకు వాటన్నింటికీ టెండర్లను పిలవాలని సీఎం ఆదేశించారు. వచ్చే 2, 3 రోజుల్లో 3 లేఅవుట్లకు టెండర్లను పిలుస్తున్నామని అధికారులు చెప్పగా ఈ మొత్తం ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలన్నారు. విజయవాడను ఎంత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే అమరావతికి కూడా అంత శోభ చేకూరుతుందని చెప్పారు.
 
బెజవాడను కెనాల్‌ సిటీగా అభివృద్ధి పరచాలని, కాలువలన్నింటినీ సుందరీకరించాలని చెప్పారు. స్వరాజ్య మైదానంలో రూ.2 వేల కోట్లతో ‘సిటీ స్క్వేర్‌’ను అంతర్జాతీయ హంగులతో రూపొందించనున్నట్లు చైనాకు చెందిన జీఐఐసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయా వివరాలతో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జక్కంపూడిలో నిర్మిస్తున్న ప్రభుత్వ గృహసముదాయాన్ని త్వరితంగా పూర్తి చేసి, వాటిలో విజయవాడలోని కాల్వ గట్లపై నివసిస్తున్న వారికి ఆవాసం కల్పించాలని సీఎం ఆదేశించారు.
 
అంతర్జాతీయ ప్రమాణాలతో మీడియా సిటీ..
9 థీమ్‌ సిటీల్లో ఒకటైన మీడియా సిటీని వచ్చే పదేళ్లలో 65,000కుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఇందులో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా సంస్థలతోపాటు అన్ని మాధ్యమాలకు అవసరమైన ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ప్రొడక్షన్‌ హౌస్‌లు, పబ్లిషింగ్‌, శాటిలైట్‌ టెలికమ్యూనికేషన్స్‌-నెట్‌వర్క్‌, అడ్వర్టైజింగ్‌ వంటి సకల సంస్థలూ కొలువుదీరాలన్నారు.
 
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు నివాసాలు
అమరావతిలో మంత్రులు, శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, న్యాయమూర్తులు, గెజిటెడ్‌ మరియు ఎన్జీవోలకు అవసరమైన గృహాలను 70 లక్షల నుంచి కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్మాణం కోసం 15-20 రోజుల్లో టెండర్లు పిలవాలని, 2018 ముగిసేలోగా పూర్తయ్యేలా చూడాలని బాబు ఆదేశించారు. అమరావతిలో తమ స్టార్‌ హోటళ్లను నెలకొల్పేందుకు రాడిసన్‌, లీలా, తాజ్‌, జీఆర్టీ, పార్క్‌, నోవాటెల్‌ వంటి 8 గ్రూపులు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. టర్కీలోని ఇస్తాంబుల్‌ తరహాలో అమరావతిలోనూ ఆతిఽథ్య రంగం అభివృద్ధి చెందేలా చూడాలన్న సీఎం సీఆర్డీఏ పరిధిలోని వివిధ ప్రదేశాల్లో మొత్తం 500 ఎకరాలను సుమారు 50 స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

రాజధాని క్రతువులో సీఆర్డీయే, ఏడీసీల అడుగులు
31-07-2017 07:30:51
 
636370830517447731.jpg
  •  రూ.1350 కోట్లకు పైగా విలువైన పనులకు టెండర్లు
  • అడ్మినిస్ట్రేటివ్‌, జస్టిస్‌ సిటీల రూపకల్పన
  • అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, హౌసింగ్‌, శాఖమూరు పార్కు నిర్మాణ పనులు
  •  కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ల ఎంపిక నిమిత్తం బిడ్లు..
 
ఎంతసేపూ సమావేశాలూ, చర్చలూ, సమీక్షలూ, అధికారిక పర్యటనలే తప్ప ఆశించిన విధంగా అమరావతి నిర్మాణదిశగా అడుగులు పడడం లేదంటూ కొందరు చేసే వ్యాఖ్యలకు ఒక్క ఈ జూలై నెలలోనే సీఆర్డీయే, ఏడీసీలు తగిన విధంగా సమాధానమిచ్చాయి! రాజధాని రూపకల్పన ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్న పలు పనులకు ప్రతిపాదనలు కాదు.. టెండర్లనే పిలిచేశాయి! కొద్ది రోజుల్లో సీఆర్డీయే, ఏడీసీలు వేర్వేరుగా పిలిచిన టెండర్ల మొత్తం వ్యయం సుమారు రూ.1,350 కోటు.్ల వీటిల్లో రోడ్ల పనుల విలువ రూ.713.77 కోట్లు, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి పనుల విలువ రూ.632.90 కోట్లు. వివిధ రోడ్ల వెంబడి, శాఖమూరు రీజియనల్‌ పార్కులోనూ నాటే వేలాది మొక్కలు, అభివృద్ధి పరచే పచ్చదనం కోసం రూ.3 కోట్లతో బిడ్లను ఆహ్వానించారు.
(ఆంధ్రజ్యోతి, అమరావతి): అటు పరిపాలన, న్యాయనగరాలు, వాటిల్లోని ఐకానిక్‌ కట్టడాలు, వివిధ వర్గాల నివాస సముదాయాల డిజైన్ల ఖరారు, నిర్మా ణానికి వ్యూహరచన సాగిస్తూనే.. మరొకపక్క అమరావతివ్యాప్తంగా అద్భుత రోడ్‌గ్రిడ్‌ ఏర్పాటులో భాగంగా వివిధ రహదారుల నిర్మాణానికి సీఆర్‌డీయే, ఏడీసీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇంకోపక్క రాజధాని అంతటా ప్రపంచ ప్రమాణాలతో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పన పైనా దృష్టి సారించాయి. వీటన్నింటినీ నిర్దిష్ట కాలవ్యవధిలోగా పూర్తి చేసేందుకు నిపుణులైన కన్సల్టెంట్లు, ప్రఖ్యాత కాంట్రాక్టర్ల నియామకానికి కసరత్తు చేప ట్టింది. ఇదేసమయంలో పనులన్నింటికీ అవసరమైన నిర్మాణ సామగ్రి గుర్తింపు, వాటిని తక్కువ ఖర్చు, సమయంలో రాజధాని ప్రాంతానికి చేర్చడానికి అవ సరమైన ప్రణాళిక దాదాపు సిద్ధం చేస్తున్నాయి.
మరో 3 రోడ్లు...
రాజధానిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొద్ది నిమిషాల్లోనే సౌకర్యవంతంగా, సురక్షితంగా చేరుకునేందుకు వీలు కల్పించే అత్యధునాతన రోడ్‌ గ్రిడ్‌ వ్యవస్థను మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే సీడ్‌ యాక్సెస్‌తోపాటు ఫేజ్‌-1లోని 7 ప్రాధాన్య రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుండడమూ తెలిసిందే. తాజాగా.. ఫేజ్‌-2 లోని మొత్తం 11 రోడ్లకుగాను ప్రపంచ బ్యాంక్‌ ఆర్థి సహాయ ంతో చేపట్టనున్న 3 కీలక రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) శనివారంనాడు టెండర్లు పిలిచింది. ‘ఈ-6, ఈ-12, ఎన్‌-11’ పేర్లతో ఏర్పడనున్న ఈ రోడ్ల మొత్తం పొడవు 25.28 కిలోమీటర్లు. ఇవి వరుసగా మల్కాపురం సమీపం నుంచి అనంతవరం వరకు, యర్రబాలెం నుంచి నీరుకొండ వరకు, లింగాయపాలెం నుంచి ఐనవోలు వరకు నిర్మితమవనున్నాయు. నిధుల లభ్యతనుబట్టి ఫేజ్‌-2లోని మిగిలిన 8 రహ దారులకు కూడా సాధ్యమైనంత త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏడీసీ సమా యత్తమవుతోంది.
 
2 ఎల్పీఎస్‌ లేఅవుట్లు..
అమరావతి నిర్మాణార్ధం సమీకరణ ప్రాతిపదికన భూములిచ్చిన వారికి బదులుగా కేటాయించిన ప్లాట్లతో ఉన్న ఎల్పీఎస్‌ లేఅవుట్లను కూడా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధనలకు అనుగుణంగా అత్యుత్తమ మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు సీఆర్డీయే కొద్ది రోజుల క్రితమే రూ.632.90 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు కోరింది. ఇంత భారీ మొత్తాన్ని నెక్కల్లు, శాఖమూరు (కొంత భాగం) గ్రామాల లేఅవుట్లలో ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పనకు ఈ సంస్థ వెచ్చిం చనుంది. ఇదే కోవలో రాజధానిలోని అన్ని ఎల్పీఎస్‌ లేఅవుట్లనూ అభివృద్ధి చేయాలనుకుంటున్న సీఆర్డీయే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను రూపొందిస్తోంది. నిధుల సమీకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్నందున నిర్దిష్ట అంచనాలు సిద్ధమైన వెంటనే మిగిలిన ఎల్పీఎస్‌ అవుట్లకూ టెండర్లను పిలవనుంది.
ఆకట్టుకునే పచ్చదనం..
కొద్ది రోజుల క్రితమే రాజధానిలో నయనానందం కలిగించే పచ్చదనం అభివృద్ధి కోసం ఏడీసీ ఇంకొక టెండర్‌ పిలిచింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఫేజ్‌-1లోని 7 ప్రయారిటీ రోడ్ల వెంబడి ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ బెల్ట్‌లు, 241 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదాల్చనున్న శాఖమూరు రీజియనల్‌ పార్కు చుట్టూరా, లోపల నాటనున్న వేలాది దేశ, విదేశాలకు చెందిన మొక్కలు, పెంచనున్న అవెన్యూ ప్లాంటేషన్ల కోసం రూ.3.01 కోట్లతో ఈ బిడ్‌ను ఆహ్వానించింది.
 
చకచకా డిజైన్లు
1350 ఎకరాల్లో రానున్న అడ్మినిస్ట్రేటివ్‌, జస్టిస్‌ సిటీలకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌తోపాటు వాటిల్లోని ఐకానిక్‌ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది వారాల క్రితమే ఆమోదించింది. అసెంబ్లీ కోహినూర్‌ వజ్రాకృతిలో, హైకోర్టు బౌద్ధ స్థూపాకారంలో రూపొందడం విదితమే. తొలుత ప్రతిష్టాత్మక కట్టడంగా గుర్తించ నప్పటికీ రాష్ట్ర పాలనావ్యవస్థకు కేంద్రబి ందువైన సచివాలయాన్ని కూడా ఐకానిక్‌ గా రూపొందించాలన్న సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశానుసారం దాని డిజైన్లను రూపొందింపజేసేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది. పైన పేర్కొన్న 2 నగరాల్లో గవర్నర్‌, సీఎంలతో మొదలుకుని మంత్రులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గెజిటెడ్‌, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల వరకూ అవసరమయ్యే అధికారిక నివాసాలు, క్వార్టర్లకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో ఈ సంస్థ నిమగ్నమై ఉంది. రాజధానిని కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం సంగమస్థలిని కలుపుతూ కృష్ణానదిపై నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జికి సంబంధించిన డిజైన్లను తయారు చేయించేందుకు కూడా ఈ సంస్థ ముమ్మర కసరత్తు జరుపుతోంది. ఒకపక్క డిజైన్లు సిద్ధమవుతుండగానే.. సీఎం చెప్పినట్లుగా ఈ ఏడాది సెప్టెంబరు ఆఖర్లోగా వీటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ల ను గుర్తించే ప్రక్రియను కూడా సీఆర్డీయే చేపట్టింది.
Link to comment
Share on other sites

అమరావతిలో మహేష్‌ బడి!
 
 
636369762318703460.jpg
  • మిత్రులతో కలసి స్కూల్‌ ఏర్పాటుకు సన్నాహాలు
  • అమరావతిలో మహేష్‌బాబు స్కూల్‌!
 
అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు మహేష్‌బాబు నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన, అంతర్జాతీయ స్థాయి పాఠశాలను మిత్రులతో కలసి ఆయన నెలకొల్పాలనుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టులో ఆయన ‘స్లీపింగ్‌ పార్ట్‌నర్‌’గా మాత్రమే ఉంటారంటున్నారు. దీనికి అవసరమైన భూమి కోసం త్వరలోనే ఆయన మిత్రులు ఏపీసీఆర్డీయేకు దరఖాస్తు చేయబోతున్నారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

The first private university in the capital region of Amaravati - Vellore Institute of Technology A.P., commenced classes for Engineering courses from July 26, 2017.
B.Tech in CSE, ECE, EEE, Mechanical, Data Analytics, CSE with Specialisation, 5 Year Integrated MTech in Software Engineering, Ph.D. in Engineering, Science, Humanities and Management are currently being offered as courses of study.
The registrar informed that efforts were underway for formal inauguration of VIT-AP by Hon’ble chief minister in September 2017.
#ManaAmaravati

20376089_1945503462390305_39962023719733

20431363_1945503555723629_77648714295831

Link to comment
Share on other sites

రాజధానిలో మరో మూడు రోడ్లు

ముందస్తు వ్యయానికి ప్రపంచబ్యాంకు ఆమోదం

రూ.714 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం

టెండర్లు పిలిచిన అమరావతి అభివృద్ధి సంస్థ

అన్ని ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లకు అనుసంధానం

31ap-main2a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో మరో మూడు ప్రధాన రహదారుల నిర్మాణాన్ని సుమారు రూ.714 కోట్లతో చేపట్టేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. ఈ మూడు రోడ్ల నిర్మాణ వ్యయాన్ని త్వరలో తాము ఇవ్వబోయే రుణం నుంచి సర్దుబాటు చేసుకునేందుకు ప్రపంచబ్యాంకు ఇటీవలే అనుమతిచ్చింది. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు)తో కలిపి మొత్తం 8 ప్రధాన రహదారుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పుడు టెండర్లు పిలిచిన మూడు రహదారులతో ఈ సంఖ్య 11కు చేరుతుంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుని మినహాయిస్తే... మిగతా 10 రోడ్లలో 5 తూర్పు నుంచి పడమరకు, మరో 5 ఉత్తరంనుంచి దక్షిణ దిశగాను ఉంటాయి. ఈ 10 రహదారుల్ని సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లుగా వ్యవహరిస్తున్నారు. వీటి వెడల్పు 50మీటర్లు. ఇవన్నీ ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలంగా నిర్మిస్తున్నవే. వీటి నిర్మాణంతో రాజధానిలోని అన్ని ఎల్‌పీఎస్‌ లేవుట్‌లను (రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు ఇచ్చేందుకు వేస్తున్న లేఅవుట్‌లు) అనుసంధానించినట్లు అవుతుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

వాణిజ్య ప్రాంతాల్ని అనుసంధానిస్తూ!.. అమరావతిలో ఇ6, ఇ12, ఎన్‌11 రహదారులకు ఏడీసీ టెండర్లు పిలిచింది. ఇ6 పొడవు 9.845 కి.మీ.లు, అంచనా వ్యయం రూ.251.33 కోట్లు. ఇ12 పొడవు 6.791 కి.మీ.లు, అంచనా వ్యయం రూ.207.18 కోట్లు. ఎన్‌11 పొడవు 8.657 కి.మీలు, అంచనా వ్యయం రూ.255.26 కోట్లు. వీటిలో ఎన్‌11 రహదారి 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరానికి కుడిపక్కన ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ఉంటుంది. ఇది ప్రధాన అనుసంధాన రహదారిని అనుసంధానిస్తూ... లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం, ఐనవోలు మీదుగా శాఖమూరు వరకు వెళుతుంది. ఇ6 రహదారి అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం, మల్కాపురం మీదుగా సచివాలయం పక్క నుంచి, ఇ12 రహదారి నీరుకొండ, కురగల్లు, యర్రబాలెం, నవులూరు మీదుగా వెళుతుంది. ఈ మూడు రహదారులు ఆయా గ్రామాలకు సమీపంలో అభివృద్ధి చెందే ప్రధాన వాణిజ్య సముదాయాల్ని అనుసంధానం చేస్తాయి. ఎస్‌ఆర్‌ఎం, విట్‌, ఎన్‌ఐడీ వంటి విద్యా సంస్థల్ని కూడా అనుసంధానించినట్టవుతుంది.

Link to comment
Share on other sites

మూడేళ్లలో 30 వేల కోట్లు

అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు అవసరం

రూ.22,700 కోట్లకు ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు

మిగిలిన రూ.7300 కోట్లను సమకూర్చుకుంటాం

సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో సీఎంకు నివేదించిన అధికారులు

వివిధ వర్గాల నివాసాల విస్తీర్ణంపై వివరణ

ఈనాడు - అమరావతి

2ap-main1a.jpg

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనుల కోసం రాబోయే మూడేళ్లలో రూ.30 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఆ మొత్తంలో రూ.22,700 కోట్లను సమకూర్చుకునేందుకు ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల అమలు వివిధ దశల్లో ఉందని, మరో రూ.7,300 కోట్లు సమకూర్చుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రికి నివేదించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం సీఆర్‌డీఏ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు నిధులు సమకూర్చుకునేందుకు రూపొందించిన ప్రణాళికను సీఎంకు వివరించారు. అలాగే రాజధానిలో న్యాయమూర్తులు, శాసనసభ్యులు, మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించనున్న నివాస సముదాయాలు; వాటి విస్తీర్ణాలకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు అందించారు. ఆ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

అమరావతిలో మౌలిక

వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం తొలి 11 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏటా రూ.1500 కోట్ల మేర బడ్జెట్‌ కేటాయింపులు అవసరమని సీఆర్‌డీఏ అధికారులు సీఎంకు వివరించారు. దీర్ఘకాలిక వాయిదా సౌకర్యం కల్పిస్తూ నిర్మాణ సమయంలో మారిటోరియానికి అంగీకరించే ఆర్థిక సంస్థలనే సంప్రదించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. విద్యుత్తు, ఫైబర్‌, ఆప్టిక్‌ కేబుల్‌, పైపులైన్ల ద్వారా అందించే గ్యాస్‌ వంటి మౌలిక సదుపాయాలు ప్రాథమికంగా తమకు ఆర్థిక వనరులుగా ఉంటాని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

ఏడు మార్గాల ద్వారా రూ.7300 కోట్లు...

* ప్రభుత్వ అధికారులకు చెల్లించే ఇంటి అద్దె భత్యం ద్వారా సమకూరే నిధులు ప్రాతిపదికగా తీసుకుని వారి నివాస సముదాయాల ప్రాజెక్టు చేపట్టడానికి తీసుకునే రుణం: రూ.500 కోట్లు

* ప్రభుత్వ కార్యాలయాల అద్దె చెల్లింపుల ద్వారా సమకూరే నిధులను ఉపయోగించి తీసుకొచ్చే స్ట్రక్చర్డ్‌ బాండ్ల ద్వారా: రూ.1000 కోట్లు

* పీపీపీ పద్ధతిలో సమకూర్చుకునేది: రూ.1600 కోట్లు

* ఏటా రాష్ట్ర ప్రభుత్వ అదనపు బడ్జెట్‌ కేటాయింపులు: రూ.1500 కోట్లు

* కలెక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీము కింద: రూ.2000 కోట్లు

* కన్వర్టబుల్‌ బాండ్ల జారీతో: రూ.500 కోట్లు

* మసాలా బాండ్ల ద్వారా: 1000 కోట్లు

ఎవరెవరికి ఎంతెంత విస్తీర్ణంలో (చదరపు అడుగులు) నివాసాలు..

* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసం: 8550

* మంత్రుల నివాసాలు ఒక్కొక్కరికి: 6000

* శాసనసభ్యుల కోసం బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం. ఒక్కొక్కరికి: 3500

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం: 7500

* డీజీపీ నివాసం: 5000 నుంచి 8000

* ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల స్థాయి అధికారులకు: 4000

* అఖిల భారత సర్వీసు అధికారులకు, నాన్‌ క్యాడర్‌ శాఖాధిపతులకు: 3500

* టైప్‌-1 గెజిటెడ్‌ అధికారులకు: 1800

* టైప్‌-2 గెజిటెడ్‌ అధికారులకు: 1500

* నాన్‌ గెజిటెడ్‌ అధికారులకు: 1200

* నాలుగో తరగతి ఉద్యోగులకు: 800

Link to comment
Share on other sites

రాజధాని సిగలో ఆరోగ్య సంస్థలు
 
 
636373438179163017.jpg
  • అమరావతికి రెండు అంతర్జాతీయ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాక
  • 10న బీఆర్‌ శెట్టి మెడికల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన
  • పిచుకలపాలెంలో వంద ఎకరాల కేటాయింపు
  • 16న నవులూరులో ఇండో- యూకే ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన
 
బీఆర్‌ శెట్టి హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కి కేటాయించనున్న పిచుకలపాలెం రెవెన్యూలోని భూములను పరిశీలిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
 
తుళ్లూరు: రాజధాని అమరావతి విజ్ఞాన ఖనిగా మారబోతుంది. ఇప్పటి కే జాతీయస్థాయి గురింపు పొందిన విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థలు ప్రవేశించి బోధనను ఆరంభించిన సంగతి తెలిసిందే. మరో రెండు అంతర్జాతీయ హెల్త్‌ విద్యాసంస్థలైన బీఆర్‌ శెట్టి మెడికల్‌ సిటీ హెల్త్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌, కింగ్‌ కాలేజీ ఆఫ్‌ లండన్‌కు చెందిన ఇండో-యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాజధాని అమరావతిలో ఏర్పడబోతున్నాయి. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచుకలపాలెం రెవెన్యూలోని వంద ఎకరాల్లో నెలకొల్పుతున్న బీఆర్‌ శెట్టీ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే నెల 16న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలోని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండో- యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కు కూడా మఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పిచుకలపాలెంలో శెట్టి ఇనిస్టిట్యూట్‌కి కేటాయించే భూములను బుధవారం సీఆర్‌డీఏ భూ వ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, సర్వే అధికారులు, ఎకనామిక్‌ డెవలప్‌మెంటు డైరెక్టర్‌ నాగిరెడ్డి, బీఆర్‌ శెట్టి ప్రతినిఽధి ప్రజీత్‌ వాసుదేవన్‌ పరిశీలించారు. బీఆర్‌ శెట్టి ప్రధాన ఇనిస్టిట్యూట్‌ అబుదాబీ దేశంలో నెలకొల్పబడి ఉంది. మనదేశంలో కూడా ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఆ సంస్థ తన ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పటానికి ఆసక్తి కనబరచటంతో వంద ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

రాజధానిలో 30 వేల కోట్లతో మౌలికం!
 
 
636373233537358048.jpg
  • ఇప్పటికే రూ.22700 కోట్లు సమీకరించాం
  • 25వేల చదరపు అడుగుల్లో సీఎం నివాసం
  • 8550 చదరపు అడుగుల్లో సీజే నివాసం
  • గృహాల విస్తీర్ణంపై సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
  • అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోమన్న సీఎం
  • మద్యం, భూములు, ఇసుకపై జాగ్రత్త
  • తేడా వస్తే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం: చంద్రబాబు
 
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో మౌలిక వసతులు.. ఇతర అభివృద్ధి పనుల కోసం రానున్న మూడేళ్లలో సుమారు రూ.30 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబుకి తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలోని సీఎం చాంబర్‌లో బుధవారం సీఆర్డీయే సమీక్ష సమావేశం జరిగింది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రూ.30 వేల కోట్లలో వివిధ ఆదాయ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు కలుపుకుని రూ.22,700కోట్లు ఇప్పటికే సమకూరాయని సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకి వివరించారు.
 
ఇందులో హడ్కో ద్వారా రూ.7,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు రూ.3,800 కోట్లు, బహుళ సంస్థల ద్వారా రూ.3,200 కోట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ రూపంలో రూ.2,500 కోట్లు, స్మార్ట్‌ సిటీ నిధులు రూ.100 కోట్లు, విట్‌, తదితర సంస్థలకు భూ కేటాయింపుల రూపేణా సమకూరిన రూ.400 కోట్ల్లు ఉన్నాయని వివరించారు. ఇవి పోను మిగిలిన రూ.7,300 కోట్లను 7 మార్గాల్లో సమీకరించుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
 
అమరావతిలోని పరిపాలన, న్యాయ నగరాల్లో ముఖ్యమంత్రి నుంచి 4వ తరగతి ఉద్యోగుల వరకు వివిధ క్యాటగిరీల వారికి కల్పించాల్సిన నివాస వసతి గురించి కూడా ఈ భేటీలో చర్చించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనాన్ని 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించినట్లు సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబుకి వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయాధికారుల నివాసాలను కూడా సీఎం అధికార నివాస సముదాయంలో భాగంగా ఉంచాలని సీఎం సూచించారు.
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కనీసం 8,550 చదరపు అడుగులు, డీజీపీకి 5 వేల నుంచి 8వేల చదరపు అడుగుల్లో నివాస సముదాయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. మంత్రులకు 6వేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 7,500, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు 5వేలు, అదనపు కార్యదర్శులకు 4వేల చదరపు అడుగుల్లో నివాసాలు నిర్మించాలని ప్రతిపాదించారు. శాసనసభ్యులకు అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించే బహుళ అంతస్థుల భవనాల్లో 3,500 చదరపు అడుగుల చొప్పున కేటాయిస్తారు. ఇతర అఖిల భారత సర్వీస్‌ అధికారులు, నాన్‌ కేడర్‌ శాఖాధిపతులకు 3,500 చదరపు అడుగుల చొప్పున, టైప్‌-1 గెజిటెడ్‌ అఽధికారులకు 1800, టైప్‌-2 గెజిటెడ్‌ అధికారులకు 1500, ఎన్జీవోలకు 1200, 4వ తరగతి ఉద్యోగులకు 800 చదరపు అడుగుల చొప్పున నివాసాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిపై ఆయా వర్గాలతో సంప్రదించి, తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సీఆర్డీయేకు సూచించారు.
 
బెజవాడకు లైట్‌ మెట్రో భేష్‌: ఎడ్వర్డ్‌ డాట్సన్‌
విజయవాడ నగరానికి లైట్‌ మెట్రో రైల్‌ అన్ని విధాలుగా అనుకూలమని జర్మనీకి చెందిన కె.ఎ్‌ఫ.డబ్ల్యూ. సంస్థకు చెందిన ప్రజారవాణారంగ నిపుణుడు ఎడ్వర్డ్‌ డాట్సన్‌ అభిప్రాయపడ్డారు. ‘విజయవాడలో మెట్రో రైలు అవసరాలు, అనుకూల, ప్రతికూలాంశాల’పై రెండు వారాలుగా అధ్యయనం జరిపిన ఎడ్వర్డ్‌ బృందం ఇదే సమావేశంలో తమ అధ్యయన నివేదికను సమర్పించింది. నగరంలో లైట్‌ మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటుకు మొత్తం రూ.4,273 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన ప్రధాన కారిడార్‌-1ను నిడమానూరు నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వరకు 13.27 కిలోమీటర్లు, 2వ కారిడార్‌ను పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు 12.76 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...