-
Posts
75,426 -
Joined
-
Last visited
-
Days Won
113
Everything posted by sonykongara
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Chennai - Bangalore Industrial Corridor
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Alluri Sitarama Raju International Airport #Bhogapuram
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
Bhogapuram: భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు! By Andhra Pradesh News DeskPublished : 07 Jul 2025 06:05 IST Ee Font size 3 min read పర్యాటక, పారిశ్రామిక ప్రగతికి ఊతం మారనున్న విమానాశ్రయ పరిసరాల రూపురేఖలు విజయనగరం జిల్లా చింతపల్లి సముద్ర తీరంలో సిద్ధమవుతున్న కాటేజీలు ఈనాడు, విజయనగరం విజయనగరం జిల్లా భోగాపురానికి మరో ఏడాదిలో అంతర్జాతీయ చిత్రపటంలో స్థానం దక్కనుంది. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. విమానాశ్రయానికి సమీపంలో తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు ప్రభుత్వం గతంలో 80 ఎకరాలు కేటాయించింది. ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ సంస్థకు అప్పగించారు. భోగాపురం- భీమిలి మండలాల పరిధిలో ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయి. చింతపల్లి తీరంలో గతంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు. నాలుగున్నర ఎకరాల్లోని ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయాన్ని ఆనుకుని జీఎంఆర్ సంస్థ రూ.500 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించతలపెట్టింది. సమీపంలో ప్రస్తుతం ఉన్న ప్రైవేటు రిసార్టు యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో విమానాశ్రయానికి సమీపంలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా సరిహద్దులోని భీమిలి మండల పరిధిలో తాజ్ హోటల్ నిర్మాణానికి యాజమాన్యం ముందుకొచ్చింది. రహదారుల నిర్మాణానికి ఎదురుచూపు విమానాశ్రయానికి ఒకవైపు 16వ నంబరు జాతీయ రహదారి.. మరోవైపు అందాల సముద్రతీర ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు వీఎంఆర్‌డీఏ సహా ప్రభుత్వ శాఖలు 15 అనుసంధాన రోడ్లు నిర్మించనున్నాయి. విశాఖ తీర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నందున ఈ పనులు ప్రారంభమైతే వాటిని ఆనుకొని ఇటు తీరంలో.. అటు ఆనందపురం, తగరపువలస మధ్య నాలుగైదు ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మించాలని పారిశ్రామికవేత్తలు యోచిస్తున్నారు. ప్రభుత్వం వద్దనున్న 500 ఎకరాలను జీఎంఆర్ సంస్థకు తాజాగా అప్పగించింది. కొంత విస్తీర్ణంలో దిల్లీలో మాదిరి టౌన్‌షిప్ నిర్మించాలని జీఎంఆర్ యాజమాన్యం నిర్ణయించింది. భోగాపురం సమీపంలో విమానాశ్రయ రన్‌వే నిర్మాణం వంద ఎకరాల్లో ఐటీ కంపెనీ విమానాశ్రయానికి సమీపంలోనే వంద ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముక్కాం తీరానికి వెళ్లే దారిలో కొంగవానిపాలెం వద్ద పరిశ్రమల శాఖకు 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం 36 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయకుండా వైకాపా ప్రభుత్వం మోకాలడ్డింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 23 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేటింగ్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పనున్నారు. మరో 10 ఎకరాల్లో దివీస్ సంస్థ లాజిస్టిక్ హబ్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ రకాల సామగ్రిని ఇక్కడ నిల్వ చేసి ఎగుమతులకు హబ్‌గా వినియోగించనుంది. స్థిరాస్తి రంగానికి కళ విమానాశ్రయ పరిసర మండలాల్లో ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన యజమానులు లేఅవుట్లు వేశారు. భోగాపురం, పూసపాటిరేగ, తగరపువలస, ఆనందపురం, భీమిలి మండలాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రియల్టర్లు ముందుకొస్తున్నారు. విమానాశ్రయం పనులు పూర్తయ్యే నాటికి వీటిలో కొన్నింటిని పూర్తి చేయాలని యోచిస్తున్నారు. -
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Vijayawada- Amaravati seed capital access way
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ ABN , Publish Date - Jul 07 , 2025 | 01:21 PM Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్‌ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. Amaravati Quantum Valley Declaration అమరావతి, జులై 7: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ (Amaravati Quantum Valley Declaration) ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 23ను ఐటీ ఎలక్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఈరోజు (సోమవారం) జారీ చేశారు. జూన్ 30న విజయవాడలో ‘అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్’ను నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు జరిగాయన్నారు. అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్’ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటం బెడ్‌గా క్వూ - చిప్ - ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కూడా చదవండి -
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
Quantum Valley: 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి.. డిక్లరేషన్‌కు ఆమోదం By Andhra Pradesh News TeamUpdated : 07 Jul 2025 13:59 IST Ee Font size 1 min read అమరావతి: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్ వే హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా “అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్”ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించారు. (Andhra Pradesh -
Towers lepali ante diagrid structures ravali
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
pedaparimi vallu 2015 lo ma land tisukomani govt ni adigevallu, ippudu rates peragane Amaravati meda nammakam ledu kani rajadani pakkana undtam valla ma rates ekkuvaga unnayi antunnaru , kontha mandi unna lands antha ayipoyaka malli lands tisukovachuga ippude enduku antunnaru, appudu ippudu icchevallu appudu ivvaru.
-
Jagan gadi time dani ni cheda dobberu, CBN emo oka range lo kavali antadu, reality duram ga dates pedatadu.
-
-
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
ఏపీ రాజధానికి మలివిడతలో 34,964 ఎకరాల భూసమీకరణ By Andhra Pradesh News DeskUpdated : 06 Jul 2025 06:39 IST Ee Font size 3 min read సీఆర్‌డీఏ ఆమోదం ఈనాడు - అమరావతి సీఆర్‌డీఏ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, అధికారులు ప్రద్యుమ్న, వాడ్రేవు వినయ్‌చంద్ రాజధాని అమరావతి నిర్మాణానికి మలివిడతలో 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూసమీకరణకు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన సీఆర్‌డీఏ 50వ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిలో పట్టాభూమి 26,369.5 ఎకరాలు, ప్రభుత్వభూమి 5,207.42 ఎకరాలు ఉంది. మిగతావి ఎసైన్డ్, ఇతర కేటగిరీల భూములు. ఈ భూముల సమీకరణకు 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 16 మంది తహసీల్దార్లు సహా పలువురు అధికారుల్ని నియమిస్తారు. 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడానగరం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూముల్ని సమీకరించనుంది. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించగా, భూములిచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు, రాజధాని అమరావతిలో 33 వేల ఎకరాల సమీకరణకు అమలుచేసిన ప్యాకేజీనే మలివిడత భూసమీకరణకూ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. రాజధానిలో 58 ఎకరాల్లో నివాస, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు రాజధాని అమరావతిలోని మూడు ప్రాంతాల్లో నివాస, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లో మందడం, రాయపూడి, పిచ్చుకలపాలెం సమీపంలో దాదాపు 58 ఎకరాల్లో ఈ హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపడతారు. వీటికి టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అథారిటీ నిర్ణయాల్ని మంత్రి నారాయణ విలేకర్లకు వివరించారు. ముఖ్యాంశాలు.. అమరావతిలో ఇప్పటివరకు భూములు కేటాయించిన నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లకు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. 10వేల మందికిపైగా కూర్చునే సామర్థ్యంతో నిర్మించే సెంటర్‌కి 2.5 ఎకరాలు, 7,500 నుంచి 10వేల సామర్థ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ సామర్థ్యం గల ప్రాజెక్టులకు ఒక ఎకరం చొప్పున కేటాయిస్తారు. మందడంలో వివాంతా, హిల్టన్ హోటళ్లకు, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెంలోని నోవోటెల్‌కు ఇప్పటికే భూములు కేటాయించారు. వాటికి సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అవసరాలకు అమరావతి, పెదకూరపాడు, తుళ్లూరు మండలాల్లో 34,964 ఎకరాల భూములు సమీకరించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. దానిలో మొదట 20,494 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీచేస్తారు. అమరావతిలో నిర్మాణ పనులకు వచ్చే రెండేళ్లలో 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అంచనా వేశారు. ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారమే నిర్మాణ సంస్థలకు ఇసుక సరఫరా చేసేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయం. దీని కోసం రెండు కమిటీల ఏర్పాటు. అమరావతిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. అమరావతిలో సీఆర్‌డీఏ కార్యాలయ భవనం ఆగస్టు 15లోగా ప్రారంభం. విమానాశ్రయంపై కేంద్రంతో సంప్రదించండి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. రాజధానిలో ఏ ప్రాజెక్టూ ఆలస్యం కావడానికి వీల్లేదని, కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వాలని స్పష్టంచేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేలా నిర్దేశించాలని తెలిపారు. కిమ్స్ వైద్య కళాశాలకు 25 ఎకరాలు రాజధానిలో వైద్య కళాశాల ఏర్పాటుకు కిమ్స్ సంస్థకు ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించింది. సీఎం అధ్యక్షతన శనివారం జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో.. రాజధానిలో ఏడు సంస్థలకు కొత్తగా 32.40 ఎకరాలు కేటాయించారు. భాజపా కార్యాలయానికి ఏడాదికి రూ.వెయ్యి లీజు చెల్లించే ప్రాతిపదికన 2 ఎకరాలు కేటాయించారు. 2014-19 మధ్య భూ కేటాయింపులు జరిగిన ఆరు సంస్థలకు చిన్నపాటి సవరణలతో కేటాయింపులు కొనసాగించారు. వాటిలో సీబీఐ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ వంటి సంస్థలు ఉన్నాయి. గెయిల్‌కి, అంబికా సంస్థకు గతంలో చేసిన కేటాయింపుల్ని రద్దుచేశారు.
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
AP Govt: క్వాంటమ్‌తో నవశకం ABN , Publish Date - Jul 06 , 2025 | 03:17 AM భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ పరిశ్రమను భారత్ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీతో దేశ... క్వాంటమ్ వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది క్వాంటమ్ పరిశ్రమను శాసించే దిశగా ఏపీ వైద్య, సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక మార్పులు ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖచిత్రం జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే జాతీయ క్వాంటమ్ మిషన్ (ఎన్‌క్యూఎం). 2023 నుంచి 2031 వరకూ కొనసాగే ఈ మిషన్ కోసం కేంద్రం మొత్తం రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. ఈ మిషన్‌లో భాగంగానే ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ లక్ష్యాలు ఏమిటంటే.. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడం. క్వాంటమ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధిని సాధించడం. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడం. (అమరావతి - ఆంధ్రజ్యోతి) భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ పరిశ్రమను భారత్ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీతో దేశ, రాష్ట్ర ముఖచిత్రమే మారనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గేమ్ చేంజర్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్ఠంగా మారుతుందని, వైద్య రంగంలో నయంకాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయని, వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టవచ్చని, దేశ రక్షణ కోసం శక్తిమంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇవన్నీ.. ఒక్క క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఎలా సాధ్యమవుతాయో.. వివరంగా తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్ తయారీ.. 1990 నుంచి 2000 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ సెక్టార్‌లో ఎవరూ ఊహించిన అభివృద్ధిని అందుకుంది. అయితే ఈసారి ఐటీ పరిశ్రమకు బదులుగా క్వాంటమ్ ఇండస్ట్రీలో ఆ అభివృద్ధిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం ఇప్పటికే భూమిని కేటాయించింది. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటమ్ కంప్యూటర్. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి త్వరలోనే భారతదేశపు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయబోతున్నాయి. క్వాంటమ్ సిస్టమ్-2గా భావిస్తున్న ఇది 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి..? క్వాంటమ్ టెక్నాలజీ అనేది భౌతికశాస్త్రం, ఇంజనీరింగ్ విభాగాల కలయిక. ప్రస్తుతం మనం వాడే సాధారణ కంప్యూటర్ల కన్నా సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. కానీ.. ఆ సూపర్ కంప్యూటర్ల కన్నా లక్షల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు. దీనికి కారణం మనం వాడే సాధారణ కంప్యూటర్ల బైనరీ మీద ఆధారపడి పనిచేస్తే.. ఇవి క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. బైనరీ సిస్టమ్‌లో 0, 1 అనే రెండు బిట్స్ ఉంటాయి. ఇక్కడ జీరో అంటే ఆఫ్ అని.. వన్ అంటే ఆన్ అని అర్థం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మాత్రం క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. వీటినే క్యూబిట్స్ అని కూడా అంటారు. ఈ క్యూబిట్స్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ఒకేసారి జీరోగానూ, వన్‌గానూ ఉండగలవు. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ సూపర్ పొజిషన్ సాయంతో సాధారణ కంప్యూటర్‌లో రెండు బిట్లు చేసే పనినే క్వాంటమ్ కంప్యూటర్‌లో ఒక బిట్ మాత్రమే పూర్తి చేయగలదు. ఇలా క్యూబిట్స్ సంఖ్య పెరిగేకొద్దీ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. రెండు క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ నాలుగు పాజిబుల్ వ్యాల్యూ్‌సని కనుక్కోగలిగితే 20 క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ 10 లక్షల కన్నా ఎక్కువ వ్యాల్యూ్‌సని గుర్తించగలదు. తయారీ అంత ఈజీ కాదు నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా ఇటీవల బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే కంపెనీ భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేసింది. ఇది 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ సహాయంతో పనిచేస్తుంది. ఇక అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ కంప్యూటర్ అయితే.. 156 క్యూబిట్‌ల ప్రాసెసింగ్ పవర్‌తో పనిచేయనుంది. అందుకే దీన్ని భారతదేశపు అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆల్గరిథమ్స్‌ను రాయడానికి ఏ హార్డ్‌వేర్‌ను అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ విభాగంలోకే వస్తుంది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్ల డిజైన్ కూడా మనం రోజూ వాడే సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తాన్నీ కూడా ఒక సీల్డ్ బాక్స్‌లో పెడతారు. క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సాధారణ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్లు కదలకుండా ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటర్లలో అలాకాదు. ఇక్కడ పార్టికల్స్ అనేవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి చిన్న వైబ్రేషన్ వచ్చినా.. టెంపరేటచర్‌లో చిన్న తేడా వచ్చినా.. రేడియేషన్ పెరిగినా.. ఇలా చిన్న అంతరాయం ఎదురైనా ఇవి మైక్రో సెకన్లలోనే తమ క్వాంటమ్‌లను కోల్పోతాయి. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుంతుంది. కాబట్టే వీటిని బయటి ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేమైన ఆపరేటింగ్ రూమ్స్‌లో ఉంచుతారు. అలాగే -273 డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో వీటిని ఏర్పాటు చేస్తారు. దీనికోసమే ఈ కంప్యూటర్‌ని ఒక సీల్డ్ బాక్సులో భద్రపరుస్తారు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్ దాని పూర్తిసామర్థ్యంతో పనిచేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విప్లవాత్మక మార్పులు క్వాంటమ్ కంప్యూటర్ ఎన్నో కాలిక్యులేషన్స్‌ని చేయడం ద్వారా అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సుసాధ్యం చేయగలదు. ఇది చూపించే సొల్యూషన్స్‌తో కొత్త వ్యాక్సిన్లను, ఔషధాలను కనుగొనేందుకు సహాయపడగలదు. భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులను వంద ు కచ్చితత్వంతో అంచనా వేయగలదు. అలాగే స్టాక్ మార్కెట్‌లో రిస్క్‌ను తగ్గించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి కొత్త టెక్నాలజీని తయారు చేయడం, రవాణాలో ఖర్చుతక్కువయ్యే మార్గాలను కనుగొనడంలో సహాయపడగలదు. సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, రక్షణ రంగం, క్రిప్టోగ్రఫీ.. ఇలా ఎన్నో రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. అగ్రదేశాల సరసన చేరేలా.. ఇలాంటి క్వాంటమ్ టెక్నాలజీపై అమెరికా, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్ వంటి అతికొద్ది దేశాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో క్వాంటమ్ టెక్నాలజీతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకొనే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీనికోసం చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్ నిర్మాణంతోపాటు, డేటా సెంటర్లు, రిసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను నిర్మించనున్నారు. ప్రపంచాన్ని ప్రభావం చేయను న్న క్వాంటమ్ ఇండస్ట్రీలోకి అమెరికా, చైనా వంటి దేశాలు దీటుగా భారత్ అడుగుపెట్టడం.. అదికూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సరికొత్త విప్లవానికి నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్‌కు 7 సెకన్లు చాలు క్వాంటమ్ వ్యాలీతో అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. దీనికి క్వాంటమ్ కంప్యూటరే కారణం. వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే పరిష్కరించగలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గరున్న ఎంతగొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే.. దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానాన్ని ఒకదాని తర్వాత ఒకటి సరిచూసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ, క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటమ్ సెర్చ్‌లో సరైన సమాధానం కోసం కోటానుకోట్ల మార్గాలను ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైన సమాధానాన్ని పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైన పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడితే.. క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం దానికి ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్‌తో ఈ పాస్‌వర్డ్‌ను కేవలం ఏడు సెకన్లలోనే క్రాక్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌నైనా సరే కొన్ని సెకన్లలోనే క్రాక్ చేయగలదు. కానీ, ఇది సృష్టించే ఎన్‌స్ర్కిప్షన్‌ను బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవిత కాలం సరిపోదు.