KaNTRhi Posted August 10, 2017 Posted August 10, 2017 Farmers ni Singapore teesukuvellatam is a good move. It gives positive vibe in the entire state Etuvanti positive Vibe.. brother?
sonykongara Posted August 10, 2017 Author Posted August 10, 2017 రాజధానికి గృహ శోభ ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు 4,016 యూనిట్లు 2018కి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో గవర్నర్, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మంత్రుల వంటి ప్రముఖులకు, చట్టసభల ప్రతినిధులు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగులకు 4,016 నివాస యూనిట్లు అవసరమవుతాయని, వీటిలో 3820 యూనిట్లను బహుళ అంతస్తుల భవనాలుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) 11వ అథారిటీ సమావేశం బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. చట్టసభల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన 3820 గృహ నిర్మాణ యూనిట్ల నిర్మాణానికి రూ.1991 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. రాజధాని అమరావతిలో 2018 చివరి నాటికి 2 లక్షల జనాభా అవసరాలకు తగ్గట్టుగా గృహ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం దేనికదే సుప్రసిద్ధంగా ఉండాలన్నారు. * నివాస యూనిట్ల కోసం వివిధ మార్గాల ద్వారా సేకరించే నిధులను తిరిగి చెల్లించేందుకు అవసరమైనట్టుగా ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించి, అందుకు తగ్గ వ్యూహ ప్రణాళిక సిద్ధం చేస్తారు. * జర్నలిస్టులకు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు మీడియా సిటీలో ఏ ప్రాంతంలో వస్తాయి? అక్కడి నుంచి పాలన నగరం ఎంత దూరంలో ఉంటుందనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా. ప్రభుత్వ భవనాల సముదాయానికి 2 కి.మీ.లోపు తుళ్లూరుకి చుట్టుపక్కల మీడియా ప్రతినిధులకు గృహ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని సీఎం సూచన. * రైతుల కోసం అభివృద్ధి చేస్తున్న లేఅవుట్‌లలో ఏడు జోన్లలో రూ.13,157 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి పాలనాపరమైన అనుమతుల మంజూరు. జోన్ 4, 5, 7, 9, 10, 12, 12ఎలలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తారు. ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాల్లో వీటిని చేపడతారు. * రాజధానిలో సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణానికి అనుమతి. 60వేల చ.అడుగుల్లో ఈ భవనం నిర్మిస్తారు. నగరం మధ్యలో సరైన స్థలాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశం. 3.5 ఎకరాల్లో ఈ కార్యాలయాన్ని ప్రీ ప్యాబ్రికేటెడ్ విధానంలో జీప్లస్ వన్‌గా నిర్మిస్తారు. ఈ భవన నిర్మాణానికి రూ.40 కోట్లు వ్యయమవుతుందని అంచనా. * రాజధాని గ్రామాలకు చెందిన 100మంది రైతుల్ని మూడు దఫాలుగా సింగపూర్ పర్యటనకు తీసుకెళ్తారు. ఒక్కో బృందంలో 35 మంది ఉంటారు. భూసమీకరణ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వెళతారు. రైతులకు రాను,పోను విమాన ఖర్చులు రూ.30 వేల వరకు అవుతాయని అంచనా. దాన్ని రైతులే భరిస్తారు. మిగతా ఖర్చుల్ని సీఆర్‌డీఏ భరిస్తుంది. రైతులు మూడు రోజులపాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. సింగపూర్‌లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై అవగాహన కల్పిస్తారు. సెంటర్ ఫర్ లివబుల్ సిటీ, ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు రూ.47 లక్షలు వ్యయమవుతుందని అంచనా. అక్కడకు వెళ్లేందుకు ముందు వారికి రెండు రోజులపాటు నైపుణ్యాల పెంపుపై ఇక్కడ శిక్షణ ఉంటుంది. * సింగపూర్‌లో మాదిరిగా అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా వన్ రేసులకు అనుగుణంగా నిర్మించాలని సీఎం సూచన. కొత్త రాజధానిలో రహదారులపై ఎక్కడా రాజీపడొద్దని స్పష్టీకరణ. * బ్రిటిష్ జియోలాజికల్ సర్వే (బీజీఎస్)తో సీఆర్‌డీఏ అవగాహన ఒప్పందం. ముఖ్యమంత్రి సమక్షంలో సీఆర్‌డీఏ, బీజీఎస్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు. ఆసియన్ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ హబ్ ఫర్ అర్బన్ జియో సైన్స్ ప్రాజెక్టులో భాగంగా కౌలాలంపూర్, హనోయ్ నగరాలతోపాటు అమరావతిలోనూ బీజీఎస్ సర్వే చేయనుంది. * రాజధానిలో ప్రపంచబ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈ6, ఈ12, ఎన్11 రహదారుల నిర్మాణానికి ఆమోదం. మొత్తం 25.3 కి.మీ. పొడవైన ఈ రోడ్లను రూ.889.9 కోట్ల వ్యయంతో చేపడతారు. * రాజధానిలో బలహీన వర్గాల గృహనిర్మాణం కోసం తుళ్లూరు, దొండపాడు, బోరుపాలెం, మందడం, ఉండవల్లి, నవులూరు గ్రామాల పరిధిలో 32.19 ఎకరాల భూమిని ఏపీ టిడ్కోకు కేటాయిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. * రాజధానిలో భూసమీకరణలో తీసుకున్న నాలుగు పౌల్ట్రీ యూనిట్ల యజమానులకు రూ.12.48 కోట్లు చెల్లించేందుకు అథారిటీ నిర్ణయం.
sonykongara Posted August 10, 2017 Author Posted August 10, 2017 Etuvanti positive Vibe.. brother? రాజధాని గ్రామాలకు చెందిన 100మంది రైతుల్ని మూడు దఫాలుగా సింగపూర్ పర్యటనకు తీసుకెళ్తారు. ఒక్కో బృందంలో 35 మంది ఉంటారు. భూసమీకరణ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వెళతారు. రైతులకు రాను,పోను విమాన ఖర్చులు రూ.30 వేల వరకు అవుతాయని అంచనా. దాన్ని రైతులే భరిస్తారు. మిగతా ఖర్చుల్ని సీఆర్‌డీఏ భరిస్తుంది
sonykongara Posted August 10, 2017 Author Posted August 10, 2017 రాజధానికి ‘గృహ’ కళ!10-08-2017 07:40:00 2018కి 2 లక్షల మందికి సరిపడా ఇళ్లు ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు 4016 ఫ్లాట్లు బహుళ అంతస్థుల్లో 3820 ఫ్లాట్ల నిర్మాణం వాటి నిర్మాణానికి రూ.1991 కోట్ల వ్యయం ఈ ఏడే కోటి చ.అ. నిర్మాణాలకు శ్రీకారం అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 2018 చివరి నాటికి రెండు లక్షల మంది జనాభా అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలిపి వచ్చే ఏడాది చివరికి 4,016 ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటిలో 3,820 ఫ్లాట్లను బహుళ అంతస్థులుగా నిర్మిస్తారు. ఈ బహుళ అంతస్థుల ఫ్లాట్ల నిర్మాణ ప్రాజెక్టుకు రూ.1991 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాదిలోనే కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో సుమారు 70 లక్షల వరకు ప్రభుత్వ గృహ సముదాయానికి కాగా, మిగతా 30 లక్షల చదరపు అడుగులను కార్యాలయాల కోసం నిర్మిస్తారు. సీఎం చంద్రబాబు బుధవారం సీఆర్డీయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో నిర్మించే ప్రతి నివాస భవనం ఐకానిక్‌గా ఉండాలని సూచించారు. అత్యుత్తమ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల స్థాపనతోనే అమరావతికి అంతర్జాతీయ నగర స్థాయి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా వన్ రోడ్డుగా నిర్మించాలని సీఆర్డీయేకి సూచించారు. ఇప్పటివరకు రైతులకు స్థలాలు ఇచ్చిన కొన్ని జోన్లలోనే రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన జోన్లలోనూ మౌలికవసతుల కల్పన పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపారు. దీనికి రూ.13,500 కోట్లు కేటాయించారు. పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో రహదారులను నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాజధాని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని, దానికి ఇటీవల తుళ్లూరులో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. అమరావతిలో జరిగే నిర్మాణాలన్నింటినీ పర్యవేక్షించేందుకు సీఆర్డీయే కార్యాలయాన్ని 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు సీఎం ఆమోదముద్ర వేశారు. పాత్రికేయులకు ఫ్లాట్లు ఎక్కడ? పాత్రికేయులకు ఇచ్చే ఫ్లాట్లు ఎక్కడ ఉండాలన్న దానిపైనా సీఆర్డీయ బహుళ అంతస్థుల ఫ్లాట్లు ఇలా అమరావతిలో బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్ల రూపంలో నిర్మించనున్న ఫ్లాట్లలో ఎవరికి ఎన్ని అనే అంశాన్ని సమావేశంలో ఖరారు చేశారు. ఈ బహుళ అంతస్థుల భవనాల్లో ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,185 నుంచి రూ.2,722 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఫ్లాట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటిష్ జియోలాజికల్ సర్వేతో ఒప్పందం బ్రిటిష్ జియోలాజికల్ సర్వే(బీజీఎస్)తో సీఆర్డీయే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియన్ రీసెర్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అర్బన్ జియోసైన్స్ ప్రాజెక్టులో భాగంగా కౌలాలంపూర్, హనోయ్ నగరాలతోపాటు అమరావతిలో కూడా ఆ సంస్థ సర్వే చేస్తుంది. ఆసియాలో ఆ సంస్థ ఎంపిక చేసుకున్న మూడో నగరం అమరావతి కావడం గమనార్హం.
akhill Posted August 10, 2017 Posted August 10, 2017 Etuvanti positive Vibe.. brother? Farmers will get a sense of belonging.. also it sends a message that their voice is not ignored.. even if it is 5 or 10 farmers, they can educate others back home.
Compaq Posted August 10, 2017 Posted August 10, 2017 Farmers will get a sense of belonging.. also it sends a message that their voice is not ignored.. even if it is 5 or 10 farmers, they can educate others back home. enduku taruvaatha maa karyakarthalaki dabbulu karchu pedutunnamu ani aadiposukovataanika mee plans
akhill Posted August 10, 2017 Posted August 10, 2017 enduku taruvaatha maa karyakarthalaki dabbulu karchu pedutunnamu ani aadiposukovataanika mee plans Ofcourse adi kuda kareshtey anuko compaqqu.. dobbali anukunnappudu upayoga padiddi ee concept kuda..
Compaq Posted August 10, 2017 Posted August 10, 2017 Ofcourse adi kuda kareshtey anuko compaqqu.. dobbali anukunnappudu upayoga padiddi ee concept kuda.. pattiseema ne dobbaru thamaru,.. inka idem lekka le,..
akhill Posted August 11, 2017 Posted August 11, 2017 pattiseema ne dobbaru thamaru,.. inka idem lekka le,.. Mee tdp ollu chesedi edina sare dobbataniki ready ga untaam..
KaNTRhi Posted August 11, 2017 Posted August 11, 2017 Farmers will get a sense of belonging.. also it sends a message that their voice is not ignored.. even if it is 5 or 10 farmers, they can educate others back home. Miru anna aa 5/10 ayithe valid ye... not 100 or 1000 Malli tharuvatha vachi... Lotu budget antu, ee anavasarapu kharchu enduku antaru
akhill Posted August 11, 2017 Posted August 11, 2017 Miru anna aa 5/10 ayithe valid ye... not 100 or 1000 Malli tharuvatha vachi... Lotu budget antu, ee anavasarapu kharchu enduku antaru Akkada pamputunnadhi 100 ane ga esaru.. 1000 ani kadu ga... Ofcourse 100 kuda ekkuve anuko.. Asale state ni lotu budget lo pettukoni ee anavasara karchulu endho babugoru... malli deeniki kuda central funds ivvatledani gola chestara endhi meerandharu kalisi.. meeru mararayya.. anni dabbulu bokka patti yapaaralu.. ippudu antha urgent ga singapore trip eyyakapote vchina nashtam endanta.. babugoriki maree chadastam ekkuvaipoindhi.. Migatha balance allu singapore ellochaka dobbutha..
swarnandhra Posted August 11, 2017 Posted August 11, 2017 dabbu kharchu kante, migatha areas lo negativity ekkuva avutundi. enduku janalani reccha gottatam?
KaNTRhi Posted August 11, 2017 Posted August 11, 2017 Akkada pamputunnadhi 100 ane ga esaru.. 1000 ani kadu ga... Ofcourse 100 kuda ekkuve anuko.. Asale state ni lotu budget lo pettukoni ee anavasara karchulu endho babugoru... malli deeniki kuda central funds ivvatledani gola chestara endhi meerandharu kalisi.. meeru mararayya.. anni dabbulu bokka patti yapaaralu.. ippudu antha urgent ga singapore trip eyyakapote vchina nashtam endanta.. babugoriki maree chadastam ekkuvaipoindhi.. Migatha balance allu singapore ellochaka dobbutha.. Usshhh
sonykongara Posted August 11, 2017 Author Posted August 11, 2017 జాబ్స్.. జోష్ మన చెంతకే ప్రపంచ స్థాయి సంస్థలు అందుబాటులోకి ఎన్నెన్నో కొలువులు మెడికల్ హబ్‌గా రాజధాని యువత ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు ఎన్నెన్నో సంస్థలు ఇక్కడికే తరలొస్తాయి తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరంలో గేమింగ్, వర్చువల్ స్టూడియోలు అమరావతిలో రైతులే ప్రథమ పౌరులు రాజధానిలో 27 టౌన్ షిప్పులు: సీఎం బీఆర్‌ఎస్ మెడిసిటీకి శంకుస్థాపన రాజధానిలో 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బీఆర్ శెట్టి సంస్థలు గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కొలువులు కదలి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రానికి చెందిన యువత ఉపాధి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచస్థాయి సంస్థలే మన వద్దకు తరలి వస్తాయని స్పష్టం చేశారు. తుళ్లూరు మండలం దొండపాడులో ఏర్పాటు చేయనున్న బీఆర్‌ఎస్ మెడిసిటీకి గురువారం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వాలని పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, వారి దూరదృష్టి వల్ల అమరావతి అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ప్రాంతమవుతోందని అన్నారు. అమరావతిలో రైతులే ప్రథమ పౌరులని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. బెంగళూరుకు చెందిన బీఆర్ శెట్టి సంస్థ ద్వారా రాజధానికి రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. దీంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బీఆర్ శెట్టితోపాటు గల్ఫ్ దేశాల నుంచి ఎంతో మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని సీఎం వివరించారు. త్వరలో అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు విమానం తిరుగుతోందని అభిలషించారు. త్వరలోనే మరో ప్రఖ్యాత సంస్థ ఇండో- యూకే ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాజధాని ప్రాంతానికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయిని తెలిపారు. అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. అమరావతిలో 27 టౌన్‌షి్‌పలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే అమరావతిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 15 నిమిషాల్లోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరంలో గేమింగ్, వర్చువల్ స్టూడియోలను ఏర్పాటు చేయటంతోపాటు అమరావతిని నాలెడ్జ్, మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివసించేందుకు సుమారు 4 వేల గృహాల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పేదవారి ఆదాయాన్ని పెంచడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. మెడిసిటీలో ఏముంటాయంటే! మెడిసిటీ నిర్మాణాన్ని లాభాల కోసం చేపట్టడం లేదని, సామాజిక సేవాదృక్పథంతోనే చేపడుతున్నామని డాక్టర్ బీఆర్ శెట్టి వెల్లడించారు. మెడిసిటీలో రూ.3 వేల కోట్లతో వైద్య వర్సిటీ, వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.600 కోట్లతో వైద్య ఉపకరణాల తయారీ యూనిట్, రూ.250 కోట్లతో క్వాంటం డేటా సెంటర్, రూ.400 కోట్లతో అమరావతి ఐబీ స్కూల్, రూ.250 కోట్లతో నాలెడ్జ్ ప్రాసెసింగ్ ఔట్ సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Compaq Posted August 11, 2017 Posted August 11, 2017 Mee tdp ollu chesedi edina sare dobbataniki ready ga untaam.. yeah yeah,.. pattiseema ivvala results choosaaka em cheyyaleka calm ga unnavu kani, lekapothe desa aardhika paristhithulanni ee project valle thaaru maaru ani cheppe vaadivi ga. appudu-ippudu maa tone okate,.. CBN and TDP we might commit mistakes, but time being matrame, we will always rise back like phoenix
sonykongara Posted August 11, 2017 Author Posted August 11, 2017 రాజధాని రైతులకు నేడు విల్లాల కేటాయింపు11-08-2017 09:04:49 తుళ్లూరు: రాజధానికి భూములిచ్చిందుకు ప్రతిగా విల్లాలు కోరిన రైతులకు శుక్రవారం తుళ్లూరు సీఆర్‌డీయే కార్యాలయంలో విల్లా ప్లాట్లను కేటాయిస్తున్నట్లు భూవ్యవహారాల డైరెక్టర్ బీఎల్ చెన్నకేశవ రావు ఓ ప్రకటనలో తెలిపారు. లాటరీ ద్వారా విల్లాల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు తుళ్లూరు క్లస్టర్ పరిధిలోని పిచుకలపాలెం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల రైతులకు 273 విల్లా ప్లాట్లను, మధ్యాహ్నం 2 గంటలకు రాయపూడి క్లస్టర్ పరిధిలో కొండమరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి గ్రామాల రైతులకు 315 విల్లా ప్లాట్లు, సాయంత్రం 4 గంటలకు వెంకటపాలెం క ్లస్టర్ పరిధి లోని మందడం, కృష్ణాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మల్కాపురం, వెంకటపాలెం రైతులకు 390 విల్లా ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల రైతులందరూ పాల్గొనాలని సూచించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now