sonykongara Posted August 15, 2017 Author Posted August 15, 2017 అమరావతిలో రూ.వెయ్యి కోట్లతో మెడిసిటీ ప్రాజెక్టు ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు వేయి పడకలతో కింగ్స్ కాలేజి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం రేపు ఈనాడు అమరావతి: అమరావతిలో రూ.వెయ్యి కోట్లతో ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టును కింగ్స్ కాలేజ్ హాస్పిటల్-ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (కేసీహెచ్-ఐయూఐహెచ్)గా వ్యవహరిస్తారు. రాజధానిలోని నవులూరు గ్రామ సమీపంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేస్తున్నారు. విజయవాడలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐయూఐహెచ్ మెడిసిటీ ప్రాజెక్టుల ఎండీ, గ్రూప్ సీఈఓ అజయ్ రాజన్ గుప్తా, బ్రిటిష్ హైకమిషన్‌లో అంతర్జాతీయ వాణిజ్య విభాగం ఫస్ట్‌సెక్రటరీ హేడెన్ స్పైసర్, లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ ఛైర్మన్ లార్డ్‌రాబర్ట్ కెర్‌స్లేక్ తదితరులు హాజరవుతున్నారు. ఇదే కేంద్ర స్థానం * భారత్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మన దేశంలో 11 ఐయూఐహెచ్ కేంద్రాల ఏర్పాటుకు ఇండో యూకే హెల్త్‌కేర్ లిమిటెడ్ అంగీకరించింది. * 11 కేంద్రాల్లో మొదటిది అమరావతిలోనే ఏర్పాటవుతోంది. దేశంలో ఏర్పడే మిగతా పది కేంద్రాలకు కూడా ఇది కేంద్రస్థానంగా ఉంటుంది. * అమరావతిలో ఏర్పాటయ్యే ఐయూఐహెచ్ మెడిసిటీ ప్రాజెక్టు వల్ల పది వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. * ఐయూఐహెచ్‌కు రెండు దశల్లో 150 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మొదట 50 ఎకరాల్లో మొదటిదశ ప్రాజెక్టు చేపడతారు. అది పూర్తయ్యాకవందఎకరాల్లో రెండోదశ ప్రాజెక్టు వస్తుంది. మొదటి దశ ప్రాజెక్టులో వచ్చేవి ఇవీ.. * వేయి పడకల కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ * 200 మంది విద్యార్థులతో నర్సింగ్ స్కూల్ * 200 మంది విద్యార్థులతో పారామెడికల్ శిక్షణ కేంద్రం * ఎన్‌హెచ్‌ఎస్‌ఆంకాలజీ యూనిట్. పునరావాస కేంద్రం. * ఐయూఐహెచ్ సప్లై చైన్‌సెంటర్. రెండో దశలో వచ్చేవి ఇవీ * కింగ్స్ కాలేజీ లండన్ మెడికల్ కాలేజ్ * జిమ్మర్ బయోమెట్ పీజీ మెడికల్ సెంటర్ * ఐబీఎం ఆసియాడేటా అనలిటిక్స్ సెంటర్ * ఇంప్లాంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ * ఎన్‌హెచ్‌ఎస్ స్టెమ్‌సెల్స్- ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ అండ్ మెడికల్ సెంటర్ * ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లు ఎప్పటికి పూర్తి చేస్తారు? * హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అకాడెమీ, ఇండో యూకే క్లినిక్‌ల నిర్మాణ పనులు 2018లో మొదలుపెడతారు. * ఇండో యూకే క్లినిక్, డయాగ్నోస్టిక్ సెంటర్లను 2019లో ప్రారంభిస్తారు. * పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అకాడమీని 2019లో ప్రారంభిస్తారు. * 250 పడకల ఆస్పత్రిని 2019/2020లో ప్రారంభిస్తారు. * 500 పడకల ఆస్పత్రిని 2022లో ప్రారంభిస్తారు. * వైద్యకళాశాలను 2023లో ప్రారంభిస్తారు.
sonykongara Posted August 15, 2017 Author Posted August 15, 2017 అమరావతికి మణిహారం! ఐయూఐహెచ్ మెడిసిటీకి రేపే శంకుస్థాపన లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి కోట్లతో ఏర్పాటు అత్యాధునిక సదుపాయాలు, శిక్షణ, పరిశోధన కేంద్రాలు 10,000 మందికి ఉద్యోగావకాశాలు అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. రాజధాని అమరావతికే మణిహారంగా భాసిల్లే విధంగా అంతర్జాతీయ స్థాయి వైద్య విద్యాకేంద్రం ఏర్పాటుకానుంది. ఇక్కడి నవులూరులో ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆప్ హెల్త్ (ఐయూఐహెచ్) మెడిసిటీకి బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఇంగ్లండ్ మంత్రులు, ఎంపీలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంతులు, పలువురు ప్రముఖులు హాజరవుతారు. దేశంలో మొత్తం 11 ఐయూఐహెచ్ కేంద్రాలను నెలకొల్పేందుకు కొంతకాలం క్రితం భారత్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్య విద్యాబోధన, పరిశోధన రంగాలతోపాటు అనుబంధ విభాగాల ఏర్పాటు, నిర్వహణలో ప్రపంచంలోనే పేరొందిన లండన్ కింగ్స్ కాలేజీ హాస్పిటల్ పర్యవేక్షణలో మన దేశ ప్రజలకూ అధునాతన వైద్యసేవలు అందేలా చూడడం ఈ ఒప్పందం లక్ష్యం. దేశంలో ఏర్పాటయ్యే మిగిలిన అన్ని కేంద్రాలకూ ఈ ప్రాంగణమే ప్రధాన కేంద్రంగా ఉండబోతోంది! అమరావతిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని ‘కింగ్స్ కాలేజ్ హాస్పిటల్- ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (కేసీహెచ్- ఐయుఐహెచ్)గా వ్యవహరించనున్నారు. నవులూరులో ప్రభుత్వం కేటాయించిన 150 ఎకరాల్లో మొత్తం రూ.1,000కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. 2023 నాటికి అందుబాటులోకి వచ్చే ఈ సంస్థ 10వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇండో-యూకే ఆస్పత్రి, నర్సింగ్ కాలేజ్, పీజీ ట్రైనింగ్ అకాడమీల పనులు 2018లో మొదలవుతాయి. 2019లో ఇండో-యూకే క్లినిక్, డయాగ్నోస్టిక్ సెంటర్, పీజీ ట్రైనింగ్ అకాడమీలు, 2019-2020లో 250 పడకల ఆస్పత్రి, 2022లో 500 బెడ్ల హాస్పిటల్, 2023లో మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతాయి.
sonykongara Posted August 15, 2017 Author Posted August 15, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/topic/367426-britain-investments-in-amaravati/page-2
LuvNTR Posted August 15, 2017 Posted August 15, 2017 idi kada manaku kavalsindi. money ledu ani telsu anni immediate ga kattataniki. kani ila slow ga edo atleast foundation construct seyyadam start chesi atleast aa construction pictures bayataki vochi news lo tiruguthu unte TDP ki brahma rathame. janalu slow ga ee amaravati ane concept meeda frustrated phase ki vocharu edi construction start cheyyaledu ani.
sonykongara Posted August 16, 2017 Author Posted August 16, 2017 ఆకర్షణీయం... అత్యాధునికం అమరావతిని తీర్చిదిద్దేందుకు కసరత్తు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు ప్రభుత్వానికి సీఆర్‌డీఏ ప్రతిపాదన నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న ప్రణాళికలు అంచనా వ్యయం రూ.1874 కోట్లు కేంద్రం ఇచ్చేది రూ.500 కోట్లు ఈనాడు - అమరావతి స్మార్ట్ సైకిళ్లు... స్మార్ట్ ఎలక్ట్రికల్ బస్సులు... స్మార్ట్ వాటర్ ట్యాప్‌లు... సోలార్ విద్యుత్ ప్యానళ్లను పైకప్పుగా అమర్చిన బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయం.. బయో పార్కులు... సెన్సర్లు... థర్మల్ రాడార్లు... ఇలా ఎటు చూసినా స్మార్టే..! రాజధాని అమరావతిలో పరిపాలనా నగరాన్ని అత్యంత ఆకర్షణీయంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సన్నాహాలు చేస్తోంది. అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయడంతో... కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని, దానికి రాష్ట్ర ప్రభుత్వం జత చేసే నిధుల్ని మూలధనంగా చూపించి... ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్మార్ట్ సిటీగా ఎంపికైన ఏ నగరానికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటే... సంబంధిత నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలసి ఒక ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలి. సాధారణంగా ఎస్పీవీలో స్థానిక స్వపరిపాలన సంస్థకు 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉండాలి. అమరావతికి ఇంకా స్వపరిపాలన (యూఎల్‌బీ) సంస్థ లేదు కాబట్టి... సీఆర్‌డీఏ భాగస్వామిగా ఉంటుంది. ఎస్పీవీ ఏర్పాటుకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్డీఏ ఇప్పటికే ప్రతిపాదన పంపింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ)ని నియమించేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. ఎస్పీవీలో 26 శాతానికి మించకుండా ప్రైవేటు సంస్థలకు వాటా ఇచ్చే వీలుంది. అమరావతి వరకు ప్రస్తుతం ప్రైవేటు సంస్థలకు వాటా ఇచ్చే ఆలోచన లేదని సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి. తొలి విడతలో రూ.200 కోట్లు...! అమరావతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇస్తుంది. దానిలో రూ.200 కోట్లు వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం కోసం ఎదురు చూస్తోంది. మిగతా రూ.300 కోట్లు... ఏటా రూ.100 కోట్లు చొప్పున వచ్చే మూడేళ్ల పాటు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు తమ వాటాగా రూ.500 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రెండు విభాగాలు ఉంటాయి. నగరంలో నిర్దిష్ట ప్రాంతం (ఏరియా బేస్డ్) అభివృద్ధికి, మొత్తం నగరాభివృద్ధిలో (పాన్‌సిటీ) భాగంగా చేపట్టే ప్రాజెక్టుల్ని ప్రతిపాదించాలి. ఏరియా బేస్డ్ కింద 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలా నగరాన్ని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. పాన్‌సిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా నగరంలో కొన్ని ఆకర్షణీయ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ ప్రతిపాదనలకు రూ.1418.90 కోట్లు, పాన్ సిటీ డెవలప్‌మెంట్‌కి రూ.392.89 కోట్లు... మొత్తం కలిపి సుమారు రూ.1,874 కోట్ల మూలధన పెట్టుబడి కావాలని అంచనా. వాటి నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో రూ.214.62 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఇదీ ప్రణాళిక... * ఎస్పీవీలో కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం రూ.1000 కోట్లు * వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రూ.257.65 కోట్లు. దీనిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు చెందిన ఫేమ్ పథకం కింద రూ.112.50 కోట్లు. స్వచ్ఛభారత్ పథకం కింద రూ.12 కోట్లు, అమృత్ కింద రూ.131.65 కోట్లు, సోలార్ సిటీ మిషన్ కింద రూ.51.50 కోట్లు సమకూర్చుకోవాలన్నది ఆలోచన. * ప్రపంచబ్యాంకు రుణం ద్వారా రూ.56.85 కోట్లు. * హడ్కో రుణం ద్వారా రూ.119.20 కోట్లు * జైకా నుంచి రుణం ద్వారా రూ.268.30 కోట్లు * ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టుల ద్వారా రూ.122 కోట్లు.
sonykongara Posted August 16, 2017 Author Posted August 16, 2017 అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక హెల్త్‌సిటీ16-08-2017 09:05:44 అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక హెల్త్‌సిటీ రూ.వెయ్యి కోట్లతో ఇండో - యూకే హెల్త్‌సిటీ యర్రబాలెంలో ఏర్పాటుకు సన్నద్ధం నేడు సీఎం చంద్రబాబుచే శంకుస్థాపన మంగళగిరి: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక వైద్య ఆరోగ్యసంస్థ పురుడు పోసుకోనుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఇండో - యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ అమరావతిలో తమ మెడిసిటీని నెలకొల్పబోతుంది. ఇందుకోసం ఇటీవలే ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. యెర్రబాలెంలో ఆ సంస్థకు మూడు దశలుగా 150 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. తొలిదశ కింద కేటాయించిన యాభై ఎకరాల విస్తీర్ణంలో ఇండో - యూకే సంస్థ హెల్త్ సిటీ ఏర్పాటుకు సన్నద్ధమైంది. సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఏర్పాటు కాబోతున్న ఈ హెల్త్‌సిటీకి బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిమోట్ కంట్రోల్ సాయంతో ఉండవల్లి రెస్ట్‌హౌస్‌నుంచి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. రాజధాని అమరావతిని వివిధ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అమరావతిని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా అభివృద్ధి చేయనున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగానే పలు ప్రసిద్ధ ఐటీ కంపెనీలను రప్పించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న విద్యాసంస్థలను సైతం రప్పించి కొన్నింటిని ప్రారంభించారు. అదే ఊపుతో రాజధాని అమరావతికి పశ్చిమంగా బీఆర్ శెట్టి మెడికల్ ఫౌండేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి.. వారం రోజులు గడువక ముందే రాజధాని తూర్పు శివారులో మరో అంతర్జాతీయ హెల్త్‌సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మరోవైపు మంగళగిలో రూ.1,680 కోట్ల భారీ వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటుచేస్తున్నారు. ఈ మూడు సంస్థల ఆవిర్భావంతో రాజధాని అమరావతి భవిష్యత్తులో ఓ సుప్రసిద్ధ ఆరోగ్యనగరంగా అవతరించగలదన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడినట్టయింది. ఇండో - యూకే సంస్థ దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో రూ.17,600 కోట్ల భారీ వ్యయంతో 11 హెల్త్‌సిటీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. నవ్యాంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, హరియాణా, తెలంగాణలలో ఆ సంస్థ హెల్త్‌సిటీలను ఏర్పాటు చేయబోతుంది. ప్రతిరాష్ట్రంలోనూ ఒక్కో హెల్త్‌సిటీని మూడు దశలుగా అభివృద్ధి చేస్తారు. ప్రతి హెల్త్‌సిటీలో వెయ్యి పడకల ఆసుపత్రితో పాటు నర్సింగ్, వైద్య కళాశాలలతో పాటు ఇతర అనుబంధ వైద్య సంస్థలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. తాజాగా గత ఆదివారమే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హెల్త్‌సిటీ ఏర్పాటుకు శిలాఫలకాన్ని వేయించింది. ఇండో - యూకే 11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న ఈ హెల్త్‌సిటీల రూపేణా ఐదువేల మంది డాక్టర్లు, 25 వేల మంది నర్సులకు ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. ప్రతక్ష్యంగా.. పరోక్షంగా కానీ మరో మూడు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. విజయవాడలో శంకుస్థాపన కార్యక్రమం.. విజయవాడలోని ‘ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్’లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ‘ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీ’కి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి.నద్దా, సహాయమంత్రి అనుప్రి య పటేల్, ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతోపాటు బ్రిటిష్ హై కమిషన్‌లో అంతర్జాతీయ వాణిజ్య విభాగపు ఫస్ట్ సెక్రటరీ హెడెన్‌స్పైసర్, ఇంగ్లండ్ ఎంపీ ఆండ్రూ మిఛెల్, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్టల్ చైౖర్మన్ లార్డ్ రాబర్ట్ కెర్స్‌లేక్ పాల్గొని, కీలకోపన్యాసాలు ఇవ్వనున్నారు. వీరితోపాటు ఏపీఈడీబీ సీఈవో జె.కృష్ణ కిషోర్, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీ ప్రాజెక్ట్స్ ఎండీ అండ్ గ్రూప్ సీఈవో డాక్టర్ అజయ్ రాజన్‌గుప్తా, ఐయూఐహెచ్ ప్రతినిధి రాజ్‌దీప్‌సింగ్ చిన్నా, డాక్టర్ గౌతమ్ మార్వా, రుక్సానా చౌధురి, వినయ్ సింఘాల్, ప్రదీప్‌సూర్ తదితరులు పాల్గొననున్నారు.
sonykongara Posted August 16, 2017 Author Posted August 16, 2017 శాసనసభ, హైకోర్టు భవంతులపై కొత్త ఆకృతులు సిద్ధం: ఫోస్టర్ అండ్ పార్టనర్స్16-08-2017 22:54:02 అమరావతి, ఆగస్ట్ 16: శాసనసభ, హైకోర్టు భవంతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా కొత్త ఆకృతులు సిద్ధం చేశామని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తెలియజేశారు. వీటితో పాటు అమరావతిలో పరిపాలన నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై 400 పేజీల నివేదికను ఈనెల 24, 25 తేదీలలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బుధవారం రాత్రి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ బృందంతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గత సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మార్పుల ప్రకారం శాసనసభ భవంతిని కోహినూర్ వజ్రాకారంలో, హైకోర్టు భవంతిని బౌద్ధ స్థూపాకారంలో మార్చి ఈ నవీన ఆకృతులకు రూపకల్పన చేసినట్టు ఫోస్టర్స్ బృందం ప్రతినిధి క్రిష్ ముఖ్యమంత్రికి వివరించారు.
Anne Posted August 17, 2017 Posted August 17, 2017 Em aroygym oo endo private hospital ki eltae antae sangathal. Consultation most of the docs are taking 500 for 3,days. Ideba Chinna health issue 20k sesar Bill Aa test ee test ani. Insurance undi hospital ki veltae first insurance value adugutar next Dani Pina inko Lakaram to 2, add setunar.chala Darunam. Hope govt takes some measurements on this private mafia
katti Posted August 17, 2017 Posted August 17, 2017 Em aroygym oo endo private hospital ki eltae antae sangathal. Consultation most of the docs are taking 500 for 3,days. Ideba Chinna health issue 20k sesar Bill Aa test ee test ani. Insurance undi hospital ki veltae first insurance value adugutar next Dani Pina inko Lakaram to 2, add setunar.chala Darunam. Hope govt takes some measurements on this private mafia govt hospital ki velochhu kadha...
sonykongara Posted August 18, 2017 Author Posted August 18, 2017 అమరావతికి అటవీ భూములు మళ్లింపునకు కేంద్రం ఆమోదం రాజధాని అవసరాల కోసం 12,444 హెక్టార్ల వినియోగానికి ఎఫ్‌ఏసీ అనుమతి చింతలపూడి ఎత్తిపోతలకూ మార్గం సుగమం ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాజధాని నిర్మాణం కోసం 12,444.89 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆమోదముద్ర వేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని ఈ భూములను రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి మార్గం సుగమమైంది. దీనివల్ల రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అమరావతి అవసరాల కోసం అటవీ భూమి మళ్లింపునకు అనుమతివ్వాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 3న ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మే 16న జరిగిన సమావేశంలో అటవీ సలహా సమితి(ఎఫ్‌ఏసీ) ఆ ప్రతిపాదనపై చర్చించి నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఏపీ కోరిన ప్రతి అంశంపైనా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కమిటీకి నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ అటవీ భూమిని ఏయే అవసరాలకోసం ఉపయోగించబోయేదీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టంచేసింది. అందుకు అనుగుణంగా నిపుణుల కమిటీ జూన్ 19 నుంచి 22వ తేదీవరకూ సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించింది. సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకొని అటవీ సలహా సమితికి నివేదిక సమర్పించింది. జులై 20న జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలో దానిపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేశారు. అయితే ఆ సమావేశంలో పూర్తిస్థాయి సభ్యులు లేకపోవడంతో సదరు నివేదికను తదుపరి సమావేశంలో సభ్యులందరికీ అందించాలన్న ఉద్దేశంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. గురువారం జరిగిన తాజా సమావేశంలో నిపుణుల బృందం ఇచ్చిన నివేదికపై ఎఫ్‌ఏసీ సభ్యులంతా చర్చించి తుది ఆమోదముద్ర వేశారు. ప్రసుత్తం అనుమతిచ్చిన 12,444.89 హెక్టార్లలో రాజధాని పరిధిలోని తాడేపల్లి (251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం (1,835.32 హెక్టార్లు) పరిధిలోని అటబీభూములు ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలకు మోక్షం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకూ కేంద్ర అటవీ సలహాదారుల సమితి ఆమోదముద్ర వేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించిన ఎఫ్‌ఏసీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణలు ఇవ్వడంతోపాటు ప్రతిపాదనలను సవరించింది. తొలుత అడిగిన 469.18 హెక్టార్లకు బదులు 347.64 హెక్టార్ల మళ్లింపునకు అనుమతి ఇస్తే చాలని విజ్ఞప్తిచేసింది. దానిపై జులై 20న జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలోచర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు అడిగింది. ఎఫ్‌ఏసీ అడిగిన వివరాలన్నీ ఏపీ ప్రభుత్వం మరోసారి పంపడంతో గురువారం జరిగిన సమావేశంలో అటవీభూమి మళ్లింపునకు తుది ఆమోదముద్ర వేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఫలించిన చంద్రబాబు కృషి... గత రెండుమూడు పర్యాయాలు ముఖ్యమంత్రి దిల్లీకొచ్చిన ప్రతిసారీ ఈ అంశాలపై కేంద్రమంత్రులను కలుస్తూ వచ్చారు. ఇదివరకు అనిల్‌దవేతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్‌తో జూన్ 23న ఒకసారి, మళ్లీ జులై 25న సమావేశమై పరిస్థితిని వివరించారు. ఈ చర్చల నేపథ్యంలో కేంద్రం రెండు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.
swarnandhra Posted August 18, 2017 Posted August 18, 2017 12444 hectares wrong anukunta. 1835+251+347 antha kalipi 2434 hectares ye kada
sonykongara Posted August 18, 2017 Author Posted August 18, 2017 12444 hectares wrong anukunta. 1835+251+347 antha kalipi 2434 hectares ye kada kadu bro, crda paridoo 12444hectares, amaravati city paridi lo తాడేపల్లి (251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం (1,835.32 హెక్టార్లు) పరిధిలోని అటబీభూములు ఉన్నాయి. land pooling area lo evi unnayi
swarnandhra Posted August 18, 2017 Posted August 18, 2017 kadu bro, crda paridoo 12444hectares, amaravati city paridi lo తాడేపల్లి (251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం (1,835.32 హెక్టార్లు) పరిధిలోని అటబీభూములు ఉన్నాయి. land pooling area lo evi unnayi wow. then it is super good news !!!
sonykongara Posted August 18, 2017 Author Posted August 18, 2017 రాజధానికి అటవీ భూములు!18-08-2017 02:22:30 బదిలీకి కేంద్ర పర్యావరణ శాఖ ఓకే ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు వెంకటాయపాలెంలో 1,835 హెక్టార్లు, తాడేపల్లిలో 251.77 హెక్టార్లు బదిలీ రాజధాని నిర్మాణానికి తొలగిన అడ్డంకి న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. రాజధాని నిర్మాణానికి అటవీ భూములను బదిలీ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. దీంతో తాడేపల్లి, వెంకటాయపాలెంలలో అటవీ భూములను రాజధాని కోసం ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కి మార్గం సుగమమైంది. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే నిరుపయోగంగా ఉన్న అటవీ భూములను ఉపయోగించుకోవడానికి విభజన చట్టంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం కావలసిన అటవీ భూములను గుర్తించి రెండేళ్ల క్రితమే కేంద్ర అటవీశాఖ అనుమతి కోసం పంపింది. రాష్ట్రపతి రామ్‌నాఽథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి.. అటవీ భూముల బదిలీకి అనుమతించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. నిజానికి అటవీ నిపుణుల కమిటీ ఈ ఏడాది జూన్ 19 నుంచి జూన్ 22 వరకూ క్షేత్రస్థాయి తనిఖీల కోసం అమరావతికి వచ్చింది. సీఆర్‌డీఏ అధికారులతో చర్చల అనంతరం సమగ్ర నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను జూలై 20వ తేదీన జరిగిన అటవీశాఖ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశంలో కేంద్రం ఆమోదించింది. అయితే సలహా కమిటీ పూర్తిస్థాయి భేటీలో మరోసారి ఈ నివేదికపై చర్చించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలో అటవీభూముల బదిలీపై కూలంకషంగా చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెంలోని 1835.32 హెక్టార్ల అటవీభూము ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇంతే మొత్తం లో కర్నూలు, కడప, అనంతపురం జి ల్లాల్లో కొత్తగా అడవుల పెంపకానికి త గిన నిధులను, భూ ములను రాష్ట్ర ప్రభుత్వం సూ చించింది. తాజా నిర్ణయంతో మొత్తంగా 12444.89 హెక్టార్ల అటవీభూములను సీఆర్‌డీఏ వినియోగించుకోనుంది. చింతలపూడికీ లైన్‌క్లియర్ చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూముల బదిలీకి కూడా ఎఫ్‌ఏసీ అనుమతించింది. 2016 చివరిలో ఈ ప్రాజెక్టు కోసం మొదట 469.18 హెక్టార్ల అటవీ భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అంచనాలను సవరించి 347.64 హెక్టార్ల అటవీ భూముల కోసం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూలై 20వ తేదీన జరిగిన ఎఫ్‌ఏసీ భేటీలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును మాత్రమే నిర్మిస్తారా.. లేక వేరే ఇతర అవసరాలకు ఈ భూములను వాడుకునే ఉద్దేశం ఉందా.. అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా నివేదిక అందించడంతో గురువారం సమావేశంలో అనుమతులను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది.
sonykongara Posted August 18, 2017 Author Posted August 18, 2017 నేడే టెండర్లు? ప్రభుత్వ గృహ సముదాయంపై సీఆర్డీయే ఫోకస్ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు 4016 ఫ్లాట్లు 2018లోగా పూర్తి అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు కలిపి దాదాపు 2 లక్షలమందికి నివాస వసతి కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు కార్యరూపమిచ్చేందుకు ఏపీసీఆర్డీయే చకచకా ముందుకు సాగుతోంది. అమరావతి పరిపాలనా నగరంలో ఆయా వర్గాలకు ఉద్దేశించిన గృహ సముదాయాలకు ఈ సంస్థ శుక్రవారం టెండర్లు ఆహ్వానించనుందని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ గృహ సముదాయాలను నిర్దిష్ట కాలవ్యవధిలోగా, నాణ్యతా ప్రమాణాలతో నిర్మించగలిగిన కంపెనీలను గుర్తించేందుకు టెండర్లకు సిద్ధమైంది. రూ.1991 కోట్లతో మొత్తం 4,016 ఫ్లాట్లను నిర్మించాలన్నది సీఆర్డీయే ప్రణాళిక. వీటిల్లో 3,820 ఫ్లాట్లను బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్లలో, మిగిలిన వాటిని కొద్ది అంతస్థుల్లో నిర్మిస్తారు. ఈ ఫ్లాట్ల విస్తీర్ణం ఆయా వర్గాల స్థాయిని బట్టి మారుతుంది. కాగా, ఈ ఏడాదిలోనే... అంటే రానున్న కొద్ది నెలల్లోనే కోటి చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే భవనాల నిర్మాణ పనులను సీఆర్డీయే ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో సుమారు 70 లక్షల చదరపు అడుగుల్లో ప్రభుత్వ గృహ సముదాయం, మిగిలిన 30 లక్షల చదరపు అడుగుల్లో వివిధ గవర్నమెంట్ ఆఫీసుల కోసం భవనాలను అది నిర్మించనుంది.
JVC Posted August 18, 2017 Posted August 18, 2017 Ee rajakeeyanakulaki enduku saami illu. Elaagu vaallu akkada undi chachedi undadu. Vaalla thoththugallaki mandu ki, vindu ki tappa enduku vaadaru vatini. Anavasaram ga jaaga bokka. Malli eetiki security Ani thokka ani extra kharchu. Ippudu dabbu leni rajakeeyanakudu evadunnadu asalu
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now