Jump to content

Recommended Posts

Posted

ఉల్లాస వనం
రాజధానికే తలమానికంగా ఉద్యానవనం
241 ఎకరాల్లో సకల వసతులతో నిర్మాణం
వచ్చే సంక్రాంతికి సిద్ధం చేయాలని లక్ష్యం
తుది ప్రణాళిక ఖరారు చేసిన ప్రభుత్వం
ఈనాడు - అమరావతి
image.jpg

రాజధాని అమరావతిలోని శాఖమూరు గ్రామంవద్ద 241 ఎకరాల్లో నిర్మించే ఉద్యానవనం తుది ఆకృతులు ఖరారయ్యాయి. బుధవారం సీఆర్‌డీఏ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పార్కు ఆకృతులపై తుది నిర్ణయం తీసుకున్నారు. పార్కులో సకల విహార, వినోద సదుపాయాలు, వసతులుండేలా డిజైన్‌ చేశారు. 6 నెలల్లో సిద్ధం చేసి, వచ్చే సంక్రాంతికి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ‘గాంధీ మెమోరియల్‌’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పార్కు ప్రణాళికను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌పీసీ సంస్థ రూపొందించింది. పార్కును మొత్తం నాలుగు జోన్లుగా విభజించారు. మధ్యలో పెద్ద జలాశయం ఉంటుంది. దాని చుట్టూ జోన్‌లు వస్తాయి. మొదటి జోన్‌ 85, రెండో జోన్‌ 34, మూడో జోన్‌ 49, నాలుగో జోన్‌ 73 ఎకరాల్లో ఉంటుంది. నాలుగో జోన్‌లోనే 19.6 ఎకరాల్లో అంబేద్కర్‌ పార్కు ఉంటుంది.

image.jpg

జోన్‌-1లో వచ్చేవి
* క్రాఫ్ట్స్‌ బజారు: 3.5 ఎకరాలు
* అమ్యూజ్‌మెంట్‌పార్కు/వాటర్‌ వరల్డ్‌: 34 ఎకరాలు
* ఈవెంట్‌ ఎరీనా/యాంఫీ థియేటర్‌: 5 ఎకరాలు
* రిసార్ట్‌: 16 ఎకరాలు.

image.jpg

జోన్‌-2లో వచ్చేవి
* వాటర్‌ ఫ్రంట్‌ ప్రొమెనేడ్‌
* బోటింగ్‌, జల క్రీడలు
* అవుట్‌డోర్‌ వ్యాయామశాల: 1 ఎకరం
* పెంపుడు జంతువుల పార్కు: 2 ఎకరాలు
* పిల్లల సాహసక్రీడల పార్కు: 27 ఎకరాలు

image.jpg

జోన్‌-3లో వచ్చేవి
* చరక వనం/రాశి వనం: 5 ఎకరాలు
* పుష్పాలు, కాక్టస్‌ గార్డెన్‌: 2 ఎకరాలు
* బాతుల చెరువు (డక్‌ పాండ్‌): 3.6 ఎకరాలు
* యోగా, ధ్యాన కేంద్రాలు
* జాగింగ్‌ ట్రాక్‌లు

image.jpg

జోన్‌-4లో వచ్చేవి
* జాగింగ్‌ ట్రాక్‌లు, హరిత ప్రాంతాలు
* ఆర్టిస్ట్‌ ప్లాజా
* శిల్ప ఉద్యానవనం
* సాంస్కృతిక మ్యూజియం
* హస్తకళలు, శిల్పాల ప్రదర్శనశాల
* ఈవెంట్‌లు, ఫెయిర్ల నిర్వహణకు ప్రత్యేక గ్రౌండ్‌: 12 ఎకరాలు
* స్పోర్ట్స్‌ క్లబ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌: 12 ఎకరాలు
* ఇండోర్‌ అథ్లెటిక్‌ సెంటర్‌: 1.5 ఎకరాలు
* ఐదు నక్షత్రాల హోటళ్లు: 7 ఎకరాలు

image.jpg

జురాంగ్‌ పార్క్‌ తరహాలో నైట్‌ సఫారీ
శాఖమూరు పార్కు ప్రణాళికపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు.
* శాఖమూరు పార్కును కోసం వృక్ష పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఒక నర్సరీ అభివృద్ధి చేయాలి.
* నైట్‌ సఫారీ కోసం వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా జురాంగ్‌ పార్క్‌ తరహాలో ప్రత్యేక ఏర్పాటు చేయాలి.
* రెండు మూడు స్టార్‌ హోటళ్లుండాలి.
* కొల్లేరు, పులికాట్‌ వంటి పక్షుల విడిది కేంద్రాలకు దీటుగా ఇక్కడ విహంగాలకు ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

రవాణా వ్యవస్థపై 15 రోజుల్లో నివేదిక
రాజధానిలో రవాణా వ్యవస్థపై జర్మనీకి చెందిన నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని, 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అమరావతితో పాటు సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఈ బృందం అధ్యయనం చేస్తుందన్నారు.

image.jpg

Posted

2019 మార్చికల్లా పరిపాలన నగరం
విజయదశమి నాడు శంకుస్థాపన
ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ఉచితంగా భూమి ఇచ్చేందుకు సంసిద్ధత
ఈనాడు - అమరావతి

అమరావతిలో పరిపాలన నగరం నిర్మాణ పనులను విజయదశమి రోజున ప్రారంభించి... 2019 మార్చి 31 నాటికి పూర్తిగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య కోసం దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రఖ్యాత విద్యాసంస్థలను ఇక్కడకు తీసుకురావాలని సూచించారు. అవసరమైతే ఆయా సంస్థలకు కావాల్సిన భూమిని ఉచితంగా అందించేందుకైనా సిద్ధమేనన్నారు. ఆ స్థాయి విద్యాసంస్థలు స్థాపించేందుకు ఎవరు ముందుకొచ్చినా ఆ ప్రతిపాదనలను మంత్రివర్గంలో చర్చించి వెంటనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రాజధాని నిర్మాణ పురోగతిపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ధీరూభాయ్‌ అంబానీ ట్రస్టు తమ విద్యాసంస్థను అమరావతిలో నెలకొల్పేందుకు గతంలో హామీ ఇచ్చిందని అధికారులకు గుర్తు చేశారు.

* రాజధాని ప్రస్తుత అవసరాల కోసం 20 వేల హోటల్‌ గదులైనా ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 2500 ఉంది.
* విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండు నుంచి కనకదుర్గగుడికి వెళ్లే మార్గాలను ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేయాలి. ఈ 3 ప్రాంతాలను సమీకృతం చేయాలి. రైల్వే అధికారులతో మాట్లాడాలి.
* ఈ జోన్‌లో నిత్యం లక్షన్నర మంది రాకపోకలు సాగిస్తుంటారు. వారందర్నీ ఆకట్టుకునేలా ఈ జోన్‌లో ప్రత్యేక ఆకర్షణలు ఉండాలి.
* ఈ ప్రత్యేక జోన్‌లో బయట వాహనాలను అనుమతించకుండా ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉండాలి. జలరవాణాను దీనిలో అంతర్భాగం చేయాలి.
* బందరు, రైవస్‌, ఏలూరు కాలవల మార్గాలను పర్యాటక ఆకర్షణీయంగా, వాటర్‌ ఫ్రంట్‌లుగా తీర్చిదిద్దాలి.

పట్టణ ప్రాంతాలును కళాత్మకం చేయాలి
రాష్ట్రంలోని 110 పట్టణాలను గోడలకు ప్రకటనలు అతికించని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలను కళాకృతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఈ విషయంలో ఎన్జీవోలు, విద్యార్థులు, మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పురపాలక శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర కళ్లకు కట్టేలా, ఆహ్లాదం, ఆకర్షణ కలిగే భావనాత్మక చిత్రాలను గోడలపై వేయాలని సూచించారు.

* పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఎవరిపైనా బలవంతంగా రుద్దొద్దని, కోరుకున్న వారికే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

Posted

ఎపి రాజదాని అమరావతి లోని శాఖమూరు వద్ద 241 ఎకరాలలో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబందించిన డిజైన్ లను అదికారులు సిద్దం చేశారు. ఈ పార్కులో అన్ని రకాల విహార కేంద్రాలు, వినోద సదుపాయలు ఉండేలా డిజైన్ రూపొందించారు.ఈ డిజైన్ లను ఖరారు చేసి వచ్చే సంక్రాంతినాటికి పనులు ప్రారంభించాలని సంకల్పించారు.పార్కును నాలుగు జోన్ లు గా మార్చారు. మధ్యలో జలాశయం చుట్టూ జోన్‌లు వస్తాయి. మొదటి జోన్‌ 85, రెండో జోన్‌ 34, మూడో జోన్‌ 49, నాలుగో జోన్‌ 73 ఎకరాల్లో ఉంటుంది. నాలుగో జోన్‌లోనే 19.6 ఎకరాల్లో అంబేద్కర్‌ పార్కు ఉంటుంది.ఈ పార్కు లో మౌలిక వసతులకు 227 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇది కాకుండా రకరకాల కాన్పెప్ట్ లకు , ఇతర అబివృద్ది కార్యక్రమాలకు 1650 కోట్ల పైగా వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం మీద రెండువేల కోట్ల రూపాయల విలువవైన ప్రతిపాదనలు సిద్దం చేశారు.ఇందులో అమ్యూజ్ మెంట్ పార్కుకే 936 కోట్ల వ్యయం అంచనా వేశారు.

Posted

నిర్దిష్ట కాలపరిమితిలో రాజధాని నిర్మాణాలు

636362231026000136.jpg
  • సీఆర్డీయే ఉన్నతాధికారులతో నారాయణ చర్చలు
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని రూపకల్పనలో అత్యంత కీలకంగా నిలవనున్న పరిపాలన, న్యాయ నగరాల నిర్మాణపనులు విజయదశమినాడు ప్రారంభం కాబోతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ ఆ సంస్థ ఉన్నతా ధికారులతో విస్తృత చర్చలు జరిపారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాల యానికి గురువారం ఉదయం వచ్చిన ఆయన కొన్ని గంటలపాటు అక్కడే ఉండి, అమరావతి నిర్మాణాన్ని వడివడిగా సాగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముమ్మర సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన ప్రకారం రాజధానిలోని అడ్మినిస్ట్రేటివ్‌, జస్టిస్‌ సిటీల్లోని ప్రధాన కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, స్టాఫ్‌ క్వార్టర్లు ఇత్యాది వాటిని పనులు మొదలెట్టిన 18 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో ఐకానిక్‌ కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టుల కాన్సెప్ట్‌ డిజైన్లు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం పొందిన సంగతి విదితమే. అసెంబ్లీ కోహినూర్‌ వజ్రాకృతిలో, హైకోర్టు బౌద్ధస్థూపం ఆకారంలో నిర్మించనున్న విషయమూ తెలిసిందే.
 
ఆగస్టు 15నాటికి శాసనసభ, అదే నెల 30వ తేదీకల్లా హైకోర్టు తుది డిజైన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ అందించనున్నారు. అదే వరుసలో సెప్టెంబరులో సెక్రటేరియట్‌ డిజైన్లూ రూపుదిద్దుకోనున్నాయి. ఆ తర్వాత మిగిలిన భవనాల నిర్మాణాన్ని సైతం ప్రాధాన్యతాక్రమంలో చేపట్టనున్నారు. వీటిల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాన్ని దసరా పర్వదినాన ప్రారంభించనుండగా, మిగిలిన వాటి పనులూ ఆ వెంటనే మొదలవుతాయి. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టి, నిర్దిష్ట గడువైన 2019, మార్చి 31లోగా పూర్తి చేసేందుకు ఏ విధంగా ముందుకు కదలాల్సి ఉందన్న విషయంపై నారాయణ, సీఆర్డీయే ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. వీటి టెండర్ల ప్రక్రియను ఎప్పుడు చేపట్టాలి, ఆ డాక్యుమెంట్లలో పేర్కొనే నియమ నిబంధనలెలా ఉండాలి ఇత్యాది అంశాలపై మంతనాలు సాగాయని తెలిసింది. రాజధానికి ప్రముఖ విద్య, హోటళ్ల గ్రూపులను రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటికి జరపాల్సిన భూకేటాయింపులు, నిధుల సమీకరణ వంటివీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
Posted

రాజధాని తాగునీటికి కృష్ణా జలాలపైనే ఆధారపడొద్దు

ప్రత్యామ్నాయాలూ చూడండి

సింగపూర్‌ నిపుణుల సూచన

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతి తాగు నీటి అవసరాలకు కేవలం కృష్ణా నదీ జలాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సింగపూర్‌కు చెందిన నిపుణులు సూచించారు. రాజధానికి వరద నియంత్రణలో భాగంగా ప్రతిపాదించిన మూడు రిజర్వాయర్లను మంచినీటి అసవరాలకు అనుగుణంగా నిర్మించాలని ప్రతిపాదించారు. రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, మౌలిక వసతులపై సమగ్ర అధ్యయనానికి ఈ నెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల కార్యశాల జరిగింది. సింగపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ (సీఎల్‌సీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు కూ తెంగ్చీ, సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లోహటాన్‌ నేతృత్వంలో 15 మంది సింగపూర్‌ నిపుణుల బృందం ఇందులో పాల్గొంది. సీఆర్‌డీఏ ప్రణాళిక, ఇన్‌ఫ్రా విభాగం అధికారులు, ఆర్వీ అసోసియేట్స్‌, సీహెచ్‌2ఎం, టాటా ఆర్కాడిస్‌, ఏడీసీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

సింగపూర్‌ నిపుణుల సూచనలు

* మురుగు నీటి నిర్వహణలో భాగంగా 13 జోన్లలో ప్రతిపాదించిన మురుగునీటి శుద్ధి కేంద్రాల సంఖ్యను తగ్గించి పెద్ద సైజు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుంది.

* మంచినీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల, వరద నియంత్రణ వ్యవస్థలన్నీ ఒకే సంస్థ నియంత్రణలో ఉంటే మంచిది.

* ఆయా రంగాల్లో క్షేత్రస్థాయి అవగాహన కోసం సీఆర్‌డీఏ, ఏడీసీ ఇంజినీర్లకు పాలనాపరమైన, సాంకేతికపరమైన అంశాల్లో రెండు విడతలుగా సింగపూర్‌లో శిక్షణనిస్తే బాగుంటుంది.

Posted
అమరావతిలో పీవీ సింధుకు భూమి కేటాయింపు

636362683473097171.jpg


 

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఒలింపిక్స్‌ విజేత పి.వి.సింధుకు భూమి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ 20 సెంట్ల భూమికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఒలంపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి దేశానికి మంచి పేరు తీసుకువచ్చిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు డిప్యూటి కలెక్టర్‌ పదవిని కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే.. అమరావతిలో 16 సంస్థలకు 88.20 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాటిలో ముఖ్యంగా..

ఇండియన్ నేవీ- 15 ఎకరాలు

నిఫ్ట్‌-10 ఎకరాలు

పోస్టల్ డిపార్ట్‌మెంట్- 5.50 ఎకరాలు

పురావస్తు మ్యూజియం- 8 ఎకరాలు

రెండు కేంద్రీయ విద్యాలయాలకు 10 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Posted
ఆహా.. ఐకానిక్‌ బ్రిడ్జీలు!
 
 
636362863156942887.jpg
  • నమూనాలు ప్రదర్శించిన ప్రఖ్యాత వర్శిటీలు, సంస్థలు
  • త్వరలో ముఖ్యమంత్రికి చూపనున్న ఏడీసీ
 
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతిని కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారికి అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జికి మరికొన్ని డిజైన్లు వచ్చాయి. రాజధానిలోని స్టార్టప్‌ ఏరియా, ప్రభుత్వ పాలనా సముదాయాలకు చేరువలో నుంచి ఇబ్రహీంపట్నం పవిత్రసంగమస్థలిని కలుపుతూ ఈ వంతెన నిర్మితం కానుంది. అత్యంత ఆకర్షణీయంగా ఇది రూపుదిద్దుకుని, అటు అమరావతికి ఎంతో ప్రధానమైన కనెక్టివిటీ సౌకర్యాన్ని కల్పిస్తూనే ఇటు ప్రముఖ పర్యాటక స్థలంగానూ వెలుగొందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్న సంగతి విదితమే. ఇందుకోసం ఇప్పటికే వివిధ నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు కొన్ని ఆకర్షణీయ డిజైన్లను తయారు చేసి ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని చురుగ్గా పరిశీలిస్తూనే ఆసక్తి ఉన్న విద్యా, నిర్మాణ సంస్థల నుంచి మరిన్ని డిజైన్లను కోరింది.
 
అమరావతికి తలమానికాలుగా నిలవనున్న కట్టడాల్లో ఒకటిగా దీని డిజైన్లను తయారు చేసేందుకు పలు దేశీయ, విదేశీ నిర్మాణ సంస్థలే కాకుండా ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్‌ యూనివర్శిటీల విద్యార్థులు ముందుకు వచ్చారు. ఎల్‌అండ్‌టీ, ఎస్‌పీ సింగ్లా సిబ్‌మోస్ట్‌ తదితరాలు వీటిల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వీరు వివిధ డిజైన్లను రూపొందించారు. వీటిల్లో కొన్నింటిని విజయవాడలోని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా సంస్థల ప్రతినిధులు ప్రదర్శించారు. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ జి.వి.ఎ్‌స.రాజు డిజైన్లలోని విశిష్టతలను వివరించారు.
Posted

తుది దశకు వంతెన ఆకృతులు
ఆ వెంటనే నిర్మాణానికి టెండర్లు
image.jpg

ఈనాడు అమరావతి: అటు రాజధాని అమరావతిని, ఇటు కృష్ణా జిల్లాలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెన ఆకృతుల రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌పీ సింగ్లా, సిబ్‌మోస్ట్‌లతో పాటు వివిధ ఆర్కిటెక్చర్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రాథమిక ఆకృతులు రూపొందించారు. వాటిని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీ పార్థసారథి, అధికారులు శుక్రవారం పరిశీలించారు. తదుపరి రాజధాని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరిస్తారు. వాటిలో ఒకదాన్ని ఆ సమావేశంలో ఎంపిక చేస్తే... వెంటనే టెండర్లు పిలుస్తారు. ఒకవేళ వీటిలో ఏదీ ఎంపిక కాకపోతే... మళ్లీ ఆకృతుల రూపకల్పనతో పాటు, వంతెన నిర్మాణానికి కూడా కలిపి టెండరు పిలవాలన్న యోచనలో ఉన్నట్టు లక్ష్మీపార్థసారథి ‘ఈనాడు’కి తెలిపారు. ఈ ఐకానిక్‌ వంతెన పొడవు సుమారు 3.8 కిలో మీటర్లు. అంచనా వ్యయం రూ.800 కోట్లు. ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం ప్రాంతాన్ని, అటు రాజధానిని అనుసంధానిస్తుంది. ప్రభుత్వ సూచన మేరకు ఈ వంతెనకు సంబంధించి ఎల్‌ అండ్‌ టీ సంస్థ మార్చిలో ఆరు ఆకృతులు అందజేసింది. వాటిలో కూచిపూడి నృత్యభంగిమను పోలిన ఆకృతి, పుష్పాన్ని పోలిన విధంగా రెండు అంతస్తులతో రూపొందించిన ఆకృతి ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నాయి. ఈ రెండింటినీ కలిపి... రెండంతస్తులుగా వంతెన ఆకృతిని రూపొందించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఐకానిక్‌ వంతెన ఆకృతుల రూపకల్పనకు ఏడీసీ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ)ను పిలిచింది. ఎల్‌అండ్‌టీతో పాటు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రముఖ ఆర్కిటెక్చర్‌ విద్యా సంస్థల విద్యార్థులకు కూడా ఆకృతుల రూపకల్పనకు అవకాశం కల్పించారు. ఆయా సంస్థలు, విద్యార్థులు తాము రూపొందించిన ఆకృతులను శుక్రవారం లక్ష్మీపార్థసారథి, ఏడీసీ సీనియర్‌ కన్సల్టెంట్‌ జి.వి.ఎస్‌.రాజు, తదితరులకు వివరించారు. వీటిని పరిశీలించారు.

image.jpg

Posted
అమరావతిలో ప్రభుత్వ సంస్థలకు స్థలాలు



  • అన్నింటికీ కలిపి 88.40 ఎకరాలు.. కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ
  • పి.వి.సింధుకు 20 సెంట్లు

 

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో వివిధ ప్రభుత్వసంస్థలు,శాఖలకు మొత్తం 88.40 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులిచ్చింది. ఈ సంస్థల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 సంస్థలు, శాఖలు, భారత నావికాదళం ఉన్నాయి. అమరావతిలో స్థలాలు కోరిన మరొక 4 సంస్థలకు ప్రత్యేకంగా వాటిని ఇవ్వకుండా, సంబంధిత శాఖాధిపతులకు కేటాయించబోయే ఆఫీస్‌ బ్లాక్‌లలో స్థానం కల్పిస్తారు. ఈ స్థలాలను అనువైన ప్రాంతాల్లో గుర్తించి, కేటాయించే బాధ్యతను ఏపీసీఆర్డీయేకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి ఈ కేటాయింపులు జరగాలని, వివిక్షకు తావులేకుండా ఏకరూప విధానాన్ని అనుసరించాలని, ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేముందు అవన్నీ ఏపీసీఆర్డీయే యాక్ట్‌- 2014కు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త వహించాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించింది.

 

ఏయే సంస్థలకు ఎంత?

భారత నౌకాదళానికి 15 ఎకరాలు (ఎకరం రూ.50 లక్షల చొప్పున), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(ని్‌ఫ్ట)కు 10 ఎకరాలు (చదరపు మీటర్‌కు రూ.1 చొప్పున నామమాత్రపు ధరకు), కేంద్రీయ విద్యాలయ- 1, 2లకు ఒక్కొక్కదానికి 5 ఎకరాలు (చదరపు మీటర్‌కు రూ.1 చొప్పున), బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌కు 30 సెంట్లు (ఎకరం రూ.50 లక్షల ప్రాతిపదికన), తపాలా శాఖకు 5.50 ఎకరాలు (ఎకరం రూ.50 లక్షల ప్రాతిపదికన), నేషనల్‌ బయోడైవర్సిటీ మ్యూజియానికి 25 ఎకరాలు (చదరపు మీటర్‌కు రూ.1 చొప్పున నామమాత్రపు ధరకు), స్టేట్‌ ఆర్కియాలిజికల్‌ మ్యూజియానికి 8 ఎకరాలు (చదరపు మీటర్‌కు రూ.1 చొప్పున నామమాత్రపు ధరకు) ఇవ్వనున్నారు. ఎకరం రూ.50 లక్షల చొప్పున ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 1.10 ఎకరాలు, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.)కు 75 సెంట్లు, ఎస్‌.బి.ఐ.కు 3.30 ఎకరాలు, ఆంధ్రాబ్యాంక్‌కు 2.65 ఎకరాలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 1.50 ఎకరాలు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు 40 సెంట్లు, నాబార్డ్‌కు 4.30 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థకు 40 సెంట్లను ఇవ్వనున్నారు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ క్రీడలో రజత పతక విజేత పి.వి.సింధుకు 20 సెంట్లు (వెయ్యి చదరపు గజాలు) ఉచితంగా కేటాయించనున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...