sonykongara Posted August 27, 2017 Author Posted August 27, 2017 శాఖమూరు పార్కులో 1.04 లక్షల మొక్కలు! దేశ విదేశాలకు చెందిన 62 రకాల సేకరణ అమరావతి: రాజధానిలోని శాఖమూరు వద్ద 241 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అభివృద్ధి పరచనున్న భారీ ఉద్యానవనంలో దేశ, విదేశాలకు చెందిన సుమారు 1.04 లక్షల మొక్కలను నాటేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో 62 రకాలకు చెందిన పుష్పజాతి మొక్కలతోపాటు నేలపై పాకేవీ (క్రీపర్లు) ఉన్నాయి. ఈ పార్కును అణువణువునా ప్రకృతి సౌందర్యంతో తొణికిసలాడేలా చేయడం ద్వారా దీనిని రాజధానిలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించడం తెలిసిందే. తదనుగుణంగా ఈ ఉద్యానవనంలో అసంఖ్యాక మొక్కలను నాటడంతోపాటు యాంఫీ థియేటర్, క్రాఫ్ట్ బజార్ తదితర హంగులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్న ఏడీసీ పైన పేర్కొన్న మొక్కల సరఫరాకు ఆసక్తి ఉన్న సంస్థలు, నర్సరీల నుంచి ఎక్స్‌ప్రెషన్‌ఆఫ్ ఇంట్రెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ- ఈవోఐ) కోరుతూ బిడ్లను ఆహ్వానించింది. వీటి స్వీకరణకు వచ్చే నెల 3ను గడువుగా నిర్ణయించింది. కాగా.. 59 రకాల మొక్కలను రకానికొక 1,000 చొప్పున కావాలన్న ఏడీసీ దేశ విదేశాలకు చెందిన వేర్వేరు రంగులు, జాతుల గులాబీలు, క్రైశాంతిమం రకాలను మాత్రం తలకొక 20,000 లెక్కన కోరింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న, కొత్త హ్రైబ్రిడ్ రకాల ప్లుమేరియా జాతి మొక్కలను 5,000 కావాలని పేర్కొంది. ఈ అన్ని రకాల మొక్కల ఎత్తు 4 అడుగుల నుంచి 7 అడుగుల వరకు ఉండాలని నిర్దేశించింది. వీటిని సరఫరా చేయాలనుకునే నర్సరీలు, సంస్థలు ఒక్కొక్క మొక్క ఖరీదును ఎంతో పేర్కొనాలని కోరింది.
sonykongara Posted August 28, 2017 Author Posted August 28, 2017 Shapoorji Pallonji iconic towers kadtau anta
sonykongara Posted August 29, 2017 Author Posted August 29, 2017 కూచిపూడి భంగిమ ఆకృతి జంట ఆకాశహర్మ్యాల ఆకృతులు రూపొందించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థ మూడు వారాల్లో సమగ్ర డిజైన్లతో రావాలని సీఎం సూచన పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని 900 ఎకరాల పరిపాలనా నగరంలో... దక్షిణ దిశలో కృష్ణా నదికి పక్కనే జంట ఆకాశహర్మ్యాలు (ట్విన్ టవర్స్) నిర్మించనున్నారు. వీటిని నగరం మొత్తాన్ని తిలకించేందుకు వీలుగా ‘వ్యూయింగ్ టవర్స్’గా నిర్మించడంతో పాటు, బహుళ ప్రయోజనకర భవనాలుగా తీర్చిదిద్దనున్నారు. వీటి ఆకృతులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ రూపొందిస్తోంది. ఆంధ్రుల సంప్రదాయ కూచిపూడి నృత్యంలోని ఒక భంగిమను స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ ఒక ఆకృతిని రూపొందించింది. ఈ ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరిశీలించారు. ముఖ్యాంశాలు ఇవీ..! * ఆధునికత, సంప్రదాయ శైలి ఉట్టిపడేలా ఆకృతి సిద్ధం చేశారు. * రెండూ ఒకే ఎత్తులో ఉండవు. గాలి గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్ సిద్ధం చేశారు. * మొదటి దాని పొడవు 324 మీటర్లు ఉంటుంది. మొత్తం 72 అంతస్తులుంటాయి. * రెండో దాని పొడవు 189 మీటర్లు ఉంటుంది. మొత్తం 42 అంతస్తులుంటాయి. * రెండు టవర్లలోను మధ్య మధ్యలో స్కై గార్డెన్‌లు ఉంటాయి. * మొదటి దానిలో 12 అంతస్తుల ఎత్తుతో సమానమైన 6 స్కైగార్డెన్‌లు, రెండో దానిలో 6 అంతస్తుల ఎత్తుతో సమానమైన 3 స్కై గార్డెన్‌లు ఉంటాయి. * రెండో టవర్ పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. * వీటిల్లో హోటళ్లు, రిటైల్, ఆఫీసు స్పేస్, సర్వీసు అపార్ట్‌మెంట్లు, కళలు, జానపద కళల మ్యూజియం, వాణిజ్య కేంద్రాలు, స్కై క్లబ్‌లు, 360 డిగ్రీల్లో అబ్జర్వేటరీ వంటివి ప్రతిపాదించారు. అగ్రశ్రేణి కట్టడాలకు దీటుగా..! * ప్రపంచంలోని పది అగ్రశ్రేణి కట్టడాల్ని అధ్యయనం చేసి వాటికి దీటుగా అమరావతిలో జంట టవర్ల ఆకృతులు సిద్ధం చేయాలని సీఎం సూచన * మూడు వారాల్లో సమగ్ర ఆకృతులు, నివేదికతో రావాలని సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశం. * ఈ జంట ఆకాశహర్మ్యాలు నిరుపమాన భవనాలుగా (ఐకానిక్) ఉండాలి. * దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా, మలేషియా, సింగపూర్ దేశాల్లో ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి. * వాటికి లేని ప్రత్యేక ఆకర్షణలు అమరావతిలో ఉన్నాయి. జలసంపద, పచ్చదనం, క్రియాశీలంగా వ్యవహరించే పౌరులు మన దగ్గర ప్రధాన వనరులు. * జంట ఆకాశహార్మ్యాలలో 55 నుంచి 57 శాతం విస్తీర్ణాన్ని కార్యాలయాలకు, 12 నుంచి 13 శాతం విస్తీర్ణాన్ని దుకాణాలకు, 8 శాతం విస్తీర్ణాన్ని సర్వీసు అపార్ట్‌మెంట్లకు వినియోగించే రూపొందించినట్టు వివరించిన షాపూర్జీ ప్రతినిధులు.
RKumar Posted August 29, 2017 Posted August 29, 2017 Shappor Ji Pallamji vaallu fast gaa kaduthunnaru but seems some quality related issues as we have seen in secretariat. Better take care these things.
sonykongara Posted August 29, 2017 Author Posted August 29, 2017 వెంకటపాలెంలోని ‘మంతెన’ ప్రకృతి ఆశ్రమం భూముల సేకరణఈనాడు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో ఇవ్వని భూముల్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా వెంకటపాలెం గ్రామానికి చెందిన 66.120 ఎకరాలకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ సోమవారం తుది ప్రకటన (రూఢి ప్రకటన) జారీ చేశారు. వీటిలో కృష్ణా కరకట్టకు, నదికి మధ్య ఉన్న భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంతెన సత్యనారాయణరాజు నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమానికి చెందిన సుమారు 16 ఎకరాల భూమి, వాటిలోని ఐదు భవంతులు కూడా ఉన్నాయి. ఒక్కో భవంతిని జీ+5 విధానంలో నిర్మించారు.
KaNTRhi Posted August 29, 2017 Posted August 29, 2017 కూచిపూడి భంగిమ ఆకృతిజంట ఆకాశహర్మ్యాల ఆకృతులు రూపొందించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థమూడు వారాల్లో సమగ్ర డిజైన్లతో రావాలని సీఎం సూచనపరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని 900 ఎకరాల పరిపాలనా నగరంలో... దక్షిణ దిశలో కృష్ణా నదికి పక్కనే జంట ఆకాశహర్మ్యాలు (ట్విన్ టవర్స్) నిర్మించనున్నారు. వీటిని నగరం మొత్తాన్ని తిలకించేందుకు వీలుగా ‘వ్యూయింగ్ టవర్స్’గా నిర్మించడంతో పాటు, బహుళ ప్రయోజనకర భవనాలుగా తీర్చిదిద్దనున్నారు. వీటి ఆకృతులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ రూపొందిస్తోంది. ఆంధ్రుల సంప్రదాయ కూచిపూడి నృత్యంలోని ఒక భంగిమను స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ ఒక ఆకృతిని రూపొందించింది. ఈ ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరిశీలించారు. ముఖ్యాంశాలు ఇవీ..!* ఆధునికత, సంప్రదాయ శైలి ఉట్టిపడేలా ఆకృతి సిద్ధం చేశారు.* రెండూ ఒకే ఎత్తులో ఉండవు. గాలి గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్ సిద్ధం చేశారు.* మొదటి దాని పొడవు 324 మీటర్లు ఉంటుంది. మొత్తం 72 అంతస్తులుంటాయి.* రెండో దాని పొడవు 189 మీటర్లు ఉంటుంది. మొత్తం 42 అంతస్తులుంటాయి.* రెండు టవర్లలోను మధ్య మధ్యలో స్కై గార్డెన్‌లు ఉంటాయి.* మొదటి దానిలో 12 అంతస్తుల ఎత్తుతో సమానమైన 6 స్కైగార్డెన్‌లు, రెండో దానిలో 6 అంతస్తుల ఎత్తుతో సమానమైన 3 స్కై గార్డెన్‌లు ఉంటాయి.* రెండో టవర్ పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది.* వీటిల్లో హోటళ్లు, రిటైల్, ఆఫీసు స్పేస్, సర్వీసు అపార్ట్‌మెంట్లు, కళలు, జానపద కళల మ్యూజియం, వాణిజ్య కేంద్రాలు, స్కై క్లబ్‌లు, 360 డిగ్రీల్లో అబ్జర్వేటరీ వంటివి ప్రతిపాదించారు. అగ్రశ్రేణి కట్టడాలకు దీటుగా..!* ప్రపంచంలోని పది అగ్రశ్రేణి కట్టడాల్ని అధ్యయనం చేసి వాటికి దీటుగా అమరావతిలో జంట టవర్ల ఆకృతులు సిద్ధం చేయాలని సీఎం సూచన* మూడు వారాల్లో సమగ్ర ఆకృతులు, నివేదికతో రావాలని సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశం.* ఈ జంట ఆకాశహర్మ్యాలు నిరుపమాన భవనాలుగా (ఐకానిక్) ఉండాలి.* దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా, మలేషియా, సింగపూర్ దేశాల్లో ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి.* వాటికి లేని ప్రత్యేక ఆకర్షణలు అమరావతిలో ఉన్నాయి. జలసంపద, పచ్చదనం, క్రియాశీలంగా వ్యవహరించే పౌరులు మన దగ్గర ప్రధాన వనరులు.* జంట ఆకాశహార్మ్యాలలో 55 నుంచి 57 శాతం విస్తీర్ణాన్ని కార్యాలయాలకు, 12 నుంచి 13 శాతం విస్తీర్ణాన్ని దుకాణాలకు, 8 శాతం విస్తీర్ణాన్ని సర్వీసు అపార్ట్‌మెంట్లకు వినియోగించే రూపొందించినట్టు వివరించిన షాపూర్జీ ప్రతినిధులు. :terrific:
sonykongara Posted August 29, 2017 Author Posted August 29, 2017 ఇబ్రహీంపట్నంలో రూ.650 కోట్లతో ‘ఎయిమ్స్’..!ఈనాడు, అమరావతి: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో రూ.650 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ‘అమరావతి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (ఎయిమ్స్) ముందుకొచ్చింది. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్, ఎయిమ్స్ సంస్థ ప్రధాన ఆర్థికాధికారి చంద్ర మొక్కపాటిల మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు టక్కర్ సమక్షంలో ఈ పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ఎయిమ్స్ సంస్థ అమరావతిలో 20ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మిస్తుందని తెలిపారు. తొలి దశలో రూ.300కోట్ల వ్యయంతో 700 పడకలతో, మలి దశలో మరో రూ.300కోట్లు వెచ్చించి 400 పడకలతో ఆస్పత్రిని నిర్మిస్తుందని తెలిపారు.
sonykongara Posted August 30, 2017 Author Posted August 30, 2017 3275 కోట్లతో గృహ నిర్మాణాలు మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు బంగ్లాలు ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు గృహనిర్మాణ ప్రాజెక్టులకు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని యోచన ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులకు రూ.3,275 కోట్లతో నివాస గృహాలు నిర్మించనుంది. ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులకు బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. వీటికి రూ.2,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బంగ్లాలు నిర్మిస్తారు. వీటికయ్యే వ్యయం సుమారు రూ.676 కోట్లు. ఈ మొత్తంపై జీఎస్టీ కూడా కలిపితే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3275 కోట్లు. వీటిలో ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల (ఎన్‌జీఓ)కు అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లతో పాటు, బంగ్లాల నిర్మాణానికి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్ పత్రంలో సీఆర్‌డీఏ నిర్ణయించిన ధరల ప్రకారం అఖిల భారత సర్వీసుల అధికారులకు నిర్మించే ఫ్లాట్‌కి రూ.1.42 కోట్లు ఖర్చవుతోంది. ఎమ్మెల్యేల కోసం నిర్మించే ఫ్లాట్‌కి రూ.1.40 కోట్లు, అత్యల్పంగా నాలుగో తరగతి ఉద్యోగులకు నిర్మించే ఫ్లాట్‌కి రూ.37 లక్షలు వ్యయమవుతోంది. మంత్రులు మొదలుకుని, నాలుగో తరగతి ఉద్యోగుల వరకు నిర్మించేవన్నీ క్వార్టర్లు మాత్రమే..! ప్రభుత్వ పదవి/ఉద్యోగంలో ఉన్నంత వరకే వారు ఆ క్వార్టర్లలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. పదవి/ఉద్యోగ విరమణ చేసినా, బదిలీపై వేరే చోటుకి వెళ్లినా... ఈ క్వార్టర్లను ఖాళీ చేసి వెళ్లాలి. వాటిని వేరే వారికి కేటాయిస్తారు. 194 బంగ్లాలు..! * మంత్రులు, న్యాయమూర్తులతో పాటు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విడిగా మొత్తం 194 బంగ్లాలు నిర్మించనున్నారు. * అపార్ట్‌మెంట్లన్నీ స్టిల్ట్+12 అంతస్తులుగా నిర్మిస్తారు. వీటిలో మొత్తం 3,840 ఫ్లాట్‌లుంటాయి. * ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులకు నిర్మించే అపార్ట్‌మెంట్లలో మాత్రం బేస్‌మెంట్ కూడా ఉంటుంది. * గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్-1, గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్-2, నాన్ గెజిటెడ్ అధికారులు, క్లాస్ డి (నాలుగో తరగతి ఉద్యోగులు) అని నాలుగు కేటగిరీలుగా విభజించి, వారికి హోదాకు తగ్గట్టుగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ పరిమాణం నిర్ణయించారు. * ఫ్లాట్ల పరిమాణంలో ఉద్యోగుల హోదాలను బట్టి హెచ్చు తగ్గులున్నాయి తప్ప, నిర్మాణంలో వాడే సామగ్రి విషయంలో అందరికీ ఒకేలాంటివి వినియోగిస్తున్నారు. * మొత్తం 61 బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుండగా... వీటిని మూడు ప్యాకేజీలుగా విభజించారు. * అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో పాటు... ఆ ప్రాంగణంలో రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు వంటి వ్యవస్థల ఏర్పాటు, వీధి దీపాలు వంటి పనులు, ప్రహరీ వంటివన్నీ కలిపే టెండరు ప్యాకేజీలు సిద్ధం చేశారు. * ఎమ్మెల్యేలు, ఏఐఎస్ అధికారులకు నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఒక్కో అంతస్తుకి రెండు ఫ్లాట్‌లే ఉంటాయి. నాన్‌గెజిటెడ్ అధికారుల అపార్ట్‌మెంట్లలో కొన్నింటిలో 8 ఫ్లాట్‌లు, కొన్నింటిలో 6 ఫ్లాట్‌లు చొప్పున ఉంటాయి. గెజిటెడ్ అధికారుల కోసం నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఒక్కో అంతస్తులో నాలుగు ఫ్లాట్‌లుంటాయి. నాలుగో తరగతి ఉద్యోగుల అపార్ట్‌మెంట్లలో ఒక్కో అంతస్తుకి 10 ఫ్లాట్‌లుంటాయి. హెచ్‌ఆర్‌ఏతో రుణం చెల్లింపు..! పరిపాలనా నగరంలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. మొత్తం రూ.3,275 కోట్లలో 70 శాతం రుణంగా తీసుకుంటారు. 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సుమారు రూ.2,200 కోట్లు రుణం తీసుకోవాలని అంచనా. ఈ రుణం కోసం హడ్కో, ఐఎఫ్‌సీ, ఏఐఐబీ, ఇతర బ్యాంకులను సీఆర్‌డీఏ సంప్రదిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరుతోంది. రుణ వితరణ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నిర్మించే క్వార్టర్లలో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని(హెచ్‌ఆర్‌ఏ) మినహాయించి, తీసుకున్న రుణాలను ఆ మొత్తంతో తిరిగి చెల్లించాలన్నది ప్రతిపాదన. సచివాలయం, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల్లో ఐదో వంతు మాత్రమే ప్రభుత్వం నిర్మించే క్వార్టర్లలో నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతారన్న అంచనాతో... దానికి సరిపడినన్ని ఫ్లాట్లే నిర్మిస్తున్నారు. వీటిలో నివాసం ఉండేవారి నుంచి హెచ్‌ఆర్‌ఏ రూపంలో రూ.150 నుంచి రూ.170 కోట్లు మిగులుతుందని అంచనా. దాన్ని రుణ వితరణ సంస్థలు, బ్యాంకులకు చెల్లిస్తారు. 26-27 ఏళ్లకు అసలు, వడ్డీ సహా మొత్తం రుణం తిరిగి చెల్లించగలమని అంచనా వేశారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now