Jump to content

Amaravati


Recommended Posts

మరో 5 రాజధాని రోడ్లకు టెండర్లు
 
 
636402816977577636.jpg
  • రూ.1024.33 కోట్ల అంచనా వ్యయంతో ఆహ్వానించిన ఏడీసీ
అమరావతి: రాజధానిలో మరొక 5 రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రూ.1024.33 కోట్ల అంచనా వ్యయంతో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) ప్రాతిపదికన నిర్మించదలచిన ఈ రహదారులు ప్యాకేజీ నెంబర్‌ 12 కింద ఉన్నాయి. అమరావతిలోని వివిధ గ్రామాలతోపాటు ఎల్పీఎస్‌ లేఅవుట్లను అనుసంధానించే ఈ 5 రోడ్ల మొత్తం పొడవు సుమారు 33 కిలోమీటర్లు ఉండొచ్చునని తెలుస్తోంది. ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువునిచ్చారు. కాగా.. నిన్ననే ఏడీసీ రూ.1077 కోట్లతో రాజధానిలో 3 రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సంగతి విదితమే.
 
ఇవీ.. ఆ 5 రోడ్లు..
తాజాగా టెండర్లు పిలిచిన ఈ-7, ఈ-9, ఈ-11, ఎన్‌-3ఏ, ఎన్‌-3బీ రోడ్లలో ఈ-9 అన్నింటికంటే పొడవైనది కాగా.. ఎన్‌-3ఏ చిన్నది. ఈ రహదారులు కలపనున్న గ్రామాలు (ఎల్పీఎస్‌ లేఅవుట్లు), వాటి పొడవు వివరాలిలా ఉన్నాయు.
 
  • ఈ-7: అనంతవరం- మందడంల మధ్య- సుమారు 7 కిలోమీటర్లు.
  • ఈ-9: నెక్కల్లు- కృష్ణాయపాలెం- సుమారు 12 కి.మీ.
  • ఈ-11: నీరుకొండ- యర్రబాలెం- 6 కి.మీ.
  • ఎన్‌-3ఏ: ఉండవల్లి- పెనుమాక- 3 కి.మీ.
  • ఎన్‌-3బీ: ఉండవల్లి- నవులూరు- 5 కి.మీ.
ఎంపికైన నిర్మాణ సంస్థలు ఈ 5 రోడ్లకు సంబంధించిన సవివర డిజైన్లను రూపొందించడంతోపాటు నిర్దేశిత ప్రమాణాలతో స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రహదారులు, వాటి వెంబడి స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్లు, వాటర్‌ సప్లై నెట్‌వర్క్‌, విద్యుత్తు- ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీల కోసం యుటిలిటీ డక్ట్‌లు, రీయూజ్‌ వాటర్‌లైన్‌, పాదచారులు, సైక్లిస్టుల కోసం వేర్వేరు ట్రాక్‌లు, అవెన్యూ ప్లాంటేషన్‌, స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఇత్యాదివి) కల్పించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

అమెరికన్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రేపు సీఎం శంకుస్థాపన
06-09-2017 08:05:32
 
636402819446365570.jpg
అమరావతి: అమరావతిలో రూ.600 కోట్లతో 700 పడకల ఆస్పత్రితో పాటు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఏఏఐఎంఎస్‌) వ్యవస్థాపకుడు గొర్రెపాటి నవనీత కృష్ణ చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 7వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏఏఐఎంఎస్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఐగా 40 ఏళ్ల పాటు అమెరికాలో డాక్టర్‌గా పని చేసిన తాను, జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చానని చెప్పారు. ఏఏఐఎంఎ్‌సకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో 20 ఎకరాలు కేటాయుంచిందని, ఈ సంస్థను 21 మంది ఎన్‌ఆర్‌ఐల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీన్ని ఎయిమ్స్‌కు దీటుగా నిర్మిస్తామన్నారు.
Link to comment
Share on other sites

ముందే సిద్ధంకానున్న మ్యూజియం
 
 
  • అదేబాటలో వ్యూయింగ్‌ టవర్‌, గెస్ట్‌హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌
  • అసెంబ్లీ, మండలి మాత్రం వచ్చే ఏడాది చివరికే
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆదేశానుసారం రాజధాని అమరావతి నగరంలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మొత్తం సముదాయాన్ని 2018 ముగిసేలోగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అందులోని కొన్ని నిర్మాణాలు అంతకంటే ముందుగానే పూర్తి చేయడానికి సీఆర్డీయే సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు 31కల్లా మ్యూజియం, నవంబర్‌ 27 నాటికి వ్యూయింగ్‌ టవర్‌, నవంబర్‌ 29 కల్లా విజ్ఞాన్‌ భవన్‌, డిసెంబర్‌ 6కల్లా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ సిద్ధమవనున్నాయి. లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, కౌన్సిల్‌ భవంతులు, హైకోర్టు, శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్‌, సీఎం అధికారిక నివాసంతోపాటు గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఉత్తరం వైపున కృష్ణానదికి సమీపాన ఏర్పాటు చేయదలచిన ఎన్టీఆర్‌ విగ్రహం 2018 చివరికి పూర్తి కానున్నాయి.
Link to comment
Share on other sites

Amrita University

 

http://www.andhrajyothy.com/artical?SID=462056

 

 

అమరావతి : రాజధానిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభంకానున్న విఖ్యాత అమృత విశ్వవిద్యా లయం ప్లాన్‌కు సీఆర్డీయే ఉన్నతాధికారులు ప్రాథమిక ఆమోదం తెలిపారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన ఓపెన్‌ ఫోరంలో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు తమ అమరావతి క్యాంపస్‌కు సంబంధించిన ప్లాన్‌తో కూడిన దరఖాస్తును సమర్పించగా, అవి నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రాన్ని మంజూరు చేశారు. కాగా.. ఈ కార్యక్రమంలో మొత్తం 22 దరఖాస్తులు అందగా, వాటిల్లో నిబంధనలను పాటించిన 15కు అధికారులు అనుమతులిచ్చారు. మరో 4 దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. మిగిలిన మూడింటిని తిరస్కరించారు. సీఆర్డీయే డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగపు డైరెక్టర్‌ వి.రాముడు, జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు కె.నాగసుందరి, బి.బాలాజీ, కె.ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. అధికారవర్గాల నుంచి వ్యక్తమౌతోన్నది.

Link to comment
Share on other sites

దసరాకు పనుల శ్రీకారం

శాసనసభ భవనానికి 30న శంకుస్థాపన

గృహ సముదాయానికీ అదే రోజు

ఉదయం 8.26 గంటలకు ముహూర్తం

13న సీఎంతో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధుల భేటీ

హైకోర్టు భవన తుది ఆకృతి అందజేయనున్న సంస్థ

సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల ప్రాథమిక ఆకృతులూ అదే రోజు

8ap-main6a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ రోజున శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30న ఉదయం 8.26 గంటలకు శాసనసభ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన పైల్‌ ఫౌండేషన్‌ పనులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం టెండరు ప్రకటన జారీ చేసింది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పిలిచారు. ఈ నెలాఖరున విడిగా ప్రకటన జారీ చేయనున్నారు. శాసనసభ భవన ఆకృతి స్థూలంగా ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ కోహినూర్‌ వజ్రాన్ని పోలిన విధంగా ఆకృతి రూపొందించింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడకు వస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారులతో ప్రాథమిక చర్చలు, సమావేశాలు అనంతరం ఈ నెల 13న ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. అదే రోజున హైకోర్టు భవన తుది ఆకృతిని అందజేస్తారు. ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో సమావేశమై డిజైన్ల గురించి వివరిస్తారు. హైకోర్టు ఆకృతిని స్థూపాన్ని పోలిన విధంగా రూపొందిస్తున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ (హెచ్‌ఓడీ) భవనాల ప్రాథమిక ఆకృతుల్ని కూడా అదే రోజు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందజేయనుంది.

శాసనసభ భవనం ఎత్తు 42 మీటర్లు...! మొత్తం శాసనసభ భవనం కోహినూర్‌ ఆకృతిలా కనిపించేలా, భవనం మధ్య ప్రాంతం (సెంట్రల్‌ అట్రియం) వజ్రం ఆకృతిలో ఉండేలా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు భిన్నమైన ఆకృతుల్ని సిద్ధం చేయగా... అందులో ఒక దానిని ఖరారు చేస్తారు. వైశాల్యం, అంతర్గత రూపం, ఎవరి గదులు ఎక్కడ ఉండాలి వంటివన్నీ ఖరారయ్యాయి. నిర్మిత ప్రాంతం 11 అక్షల చ.అడుగులు. ఎత్తు 42 మీటర్లు ఉంటుంది. మొత్తం నాలుగు అంతస్తులుగా దీన్ని నిర్మిస్తారు. మొదటి అంతస్తులో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఒక దానిలో శాసనసభ, మరో దానిలో శాసన మండలి, మూడో దానిలో సెంట్రల్‌ హాల్‌, నాలుగో భాగంగా కార్యాలయాలు, ఇతర సదుపాయాలు వంటివి ఉంటాయి. ఈ నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. హైకోర్టు భవన ప్రాథమిక ఆకృతులు ఇది వరకే సిద్ధమయ్యాయి. 13న తుది ఆకృతిని ఖరారు చేయనున్నారు. 18-19 లక్షల చ.అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తారు.

ప్రతి భవనంలో ఐదు వేల మంది..! సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలకు ఆకృతులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఏడు భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో దానిలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉండేలా రూపొందిస్తున్నారు. ఇలా నిర్మిస్తే.... ఎలాంటి వసతులు సమకూర్చాలి? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి అంశాలపై సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. గూగుల్‌ కార్యాలయ భవనం కంటే బాగుండాలని సీఎం నిర్దేశించారని దానికి అనుగుణంగానే ఆకృతులు రూపొందిస్తున్నామని శ్రీధర్‌ తెలిపారు. ఈ భవనాలను మొత్తం 40 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా నిర్మిస్తారు. పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు నిర్మించే ప్రభుత్వ క్వార్టర్లకు సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. సుమారు 4 వేల ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటికీ ఈ నెల 30న సీఎం శంకుస్థాపన చేస్తారు.

Link to comment
Share on other sites

రాజధానిలో మరో 4 రోడ్లకు టెండర్లు
12-09-2017 03:37:42
 
  • ఎమ్మెల్యేలు, ఏఐఎస్‌ నివాసాలకు కూడా
  • అంచనా వ్యయం రూ.1542 కోట్లు
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజధానిలో మరొక 4 రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రూ.934.64 కోట్ల అంచనా వ్యయంతో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) ప్రాతిపదికన నిర్మించదలచిన ఈ రహదారులు ప్యాకేజీ నంబరు 14 కింద ఉన్నాయి. ఈ-16, ఎన్‌-12, ఎన్‌-15, ఎన్‌-17 అనే ఈ రహదారులను నిర్మించాలనే ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థలు తమ బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకూ గడువిచ్చారు. ఏడీసీ గత వారంలో రూ.2101.33 కోట్లతో రాజధానిలో 8 రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సంగతి విదితమే. మరోవైపు, రూ.608 కోట్లతో శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు(ఏఐఎస్‌) అధికారుల కోసం 432 ఫ్లాట్లను మొత్తం 21,69,358 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో నిర్మించేందుకు ఏపీసీఆర్డీయే టెండర్లు పిలిచింది. జీ+12 అంతస్థులుండే 18 టవర్లలో ఇవి నిర్మితమవనున్నాయి. దీనినిబట్టి ఒక్కొక్క ఫ్లాట్‌ విస్తీర్ణం సుమారు 5021 చదరపు అడుగులు ఉండనుండగా, ఒక్కొక్క ఫ్లాట్‌ నిర్మాణానికి రూ.1.41 కోట్ల వ్యయం కానుంది. నిర్మాణానంతరం మూడేళ్ల వరకూ ఎక్కడైనా లోపాలు తలెత్తితే సరి చేయాల్సిన బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదేనని సీఆర్డీయే పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 6 వరకూగడువునిచ్చింది.
Link to comment
Share on other sites

కార్యాలయాలన్నీ కిలోమీటరులోపే
11-09-2017 08:20:55
 
636407148710256180.jpg
  • చ. కిలోమీటరు పరిధిలో పాలనా భవనాలు
  • 1350 ఎకరాల్లో ప్రభుత్వ సముదాయాలు
  • 13న తుది డిజైన్లు.. దసరాకి శంకుస్థాపన
  • రాజధాని భవనాల నాణ్యతలో రాజీ లేదు
  • రాజధాని పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్‌
  • రాజధాని పురోగతిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రజలందరికీ సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు కిలోమీటరు పరిధిలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పురోగతిపై ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రాజధానిని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు కిలోమీటరు పరిధిలో ఉండేలా నిర్మించాలని సూచించారు. ‘విజయదశమి రాష్ట్రానికి విజయాలను అందించనుంది. ప్రజారాజధాని అమరావతిలో భవనాల నిర్మాణానికి దసరా రోజే శంకుస్థాపన జరగనుంది’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజారాజధానిలో ప్రతి నిర్మాణం ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల నాణ్యతలో రాజీపడే సమస్యే లేదని, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవన సముదాయ డిజైన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు వచ్చిందన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ బృందం మంగళవారం అమరావతికి వస్తుందని, అదే రోజు అసెంబ్లీ, హైకోర్టు ఇతర ప్రభుత్వ భవన సముదాయాల డిజైన్లపై సీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చిస్తుందని అన్నారు. 13న తుది డిజైన్లను ఖరారు చేస్తారని సీఎం తెలిపారు. డిజైన్లకు సంబంధించి సీఎం కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను, ఆధునికతను ప్రతిబింబించాలని రాజధాని నిర్మాణాలు ఉండాలన్నారు. 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా భవనాలు సామాన్యుడికి హక్కుగా మారాలని ఆకాంక్షించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలంటే కాంక్రీట్‌ జంగిల్‌ అనే భావనను తుడిచిపెట్టేయాలి. రాజధానిలో నిర్మించే ప్రతి ప్రభుత్వ భవనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, ప్రపంచ శ్రేణి డిజైన్లతో వాటిని నిర్మించాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ పాలనాభవనాలతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రైవేటు సంస్థల భవనాలు, వాణిజ్య, వినోద సంస్థలు ఉండాలని అప్పుడే సమగ్ర నగరాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రాజధాని నాది అనే భరోసా కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజలు రాజధానితో ఆత్మీయ స్నేహబంధాన్ని కొనసాగించేందుకు వీలుగా కృష్ణానది తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాజధానిని నిర్మించడమే లక్ష్యమని సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయ ప్రాంతంలో పచ్చదనంతోపాటు, చిన్న, చిన్న సరస్సుల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ భవనాల సమదాయం ఒక కిలోమీటరు పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు విస్తీర్ణంలో ఉండేలా నిర్మించనున్నట్లు తెలిపారు. ఆ విస్తీర్ణంలో సూపర్‌బ్లాక్‌ను మరో 9 స్క్వేర్‌బ్లాకులను నిర్మిస్తామన్నారు
Link to comment
Share on other sites

30న అసెంబ్లీకి శంకుస్థాపన
13-09-2017 04:01:07
 
  • నేడు శాసనసభ, హైకోర్టు ఫైనల్‌ డిజైన్ల ఎంపిక
  • 25, 26 తేదీల్లో అసెంబ్లీ నిర్మాణ టెండర్ల ఖరారు
  • హైకోర్టు డిజైన్లను పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి దసరా పర్వదినమైన ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం జరిగే సీఆర్డీయే సమీక్షా సమావేశంలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు అసెంబ్లీ, హైకోర్టుతోపాటు సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను సీఎంకు చూపిస్తారని చెప్పారు. గతంలో కోహినూర్‌ వజ్రాకృతిలో అసెంబ్లీ కోసం డిజైన్‌ రూపొందించారని, అయితే సీఎం సూచన మేరకు మరో 2, 3 డిజైన్లను తెస్తున్నారని వివరించారు. అసెంబ్లీ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, వాటిని ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఖరారు చేస్తామని చెప్పారు.
చీఫ్‌ జస్టిస్‌తో సమావేశం..
హైకోర్టుకు సంబంధించిన డిజైన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ తదితరులకు చూపి, అభిప్రాయాలను తెలుసుకునేందుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో న్యాయమూర్తులతో సమావేశమయ్యారు.
Link to comment
Share on other sites

In a meeting held today, CM Nara Chandrababu Naidu suggested having an iconic Giant Wheel installed at a prominent location in Amaravati for amusement and Tourist Attraction where people can enjoy the most panoramic views and the local scenic beauty.ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రితో సమావేశమై అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తామన్నారు. మూడు దశలలో ఈ నిర్మాణాన్ని చేపడతామని, తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి సీఎం ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

In a meeting held today, CM Nara Chandrababu Naidu suggested having an iconic Giant Wheel installed at a prominent location in Amaravati for amusement and Tourist Attraction where people can enjoy the most panoramic views and the local scenic beauty.ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రితో సమావేశమై అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తామన్నారు. మూడు దశలలో ఈ నిర్మాణాన్ని చేపడతామని, తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి సీఎం ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

Super
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...