sonykongara Posted August 30, 2017 Author Posted August 30, 2017 రైలుమార్గంపై సర్వే30-08-2017 03:02:50 వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై వంతెన! ఈటీఎస్ సర్వే చేస్తోన్న చెన్నై సంస్థ త్వరలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు నివేదిక గుంటూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. కృష్ణానది మీదగా రైలు వంతెన నిర్మాణం విషయంలో ఎలకాట్రానిక్ టోటల్ స్టేషన్(ఈటీఎస్) సర్వేని చెన్నైకి చెందిన జేపీ సర్వేయింగ్ సంస్థ నిర్వహిస్తోంది. కొన్ని రోజులుగా ఆ సంస్థకు చెందిన ఇంజనీర్లు అమరావతి మండలంలోని వైకుంఠపురం పరిసరాల్లో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. త్వరలోనే తాము రెండు, మూడు ఎలైన్‌మెంట్‌లను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్)కు అందజేస్తామని, వాటిపై తుది నిర్ణయం ఆర్‌వీఎన్‌ఎల్ తీసుకొంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. 2016 రైల్వే బడ్జెట్‌లోనే అమరావతికి నూతన రైలుమార్గం నిర్మాణం కోసం సర్వే మంజూరైంది. విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం నుంచి 106 కిలోమీటర్ల పొడవున రాజధానికి ఎలైన్‌మెంట్ ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.2,679 కోట్లు అవసరమౌతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగేళ్ల వ్యవధిలో ఈ రైలు మార్గ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రాజధానిలో ఒక రైల్వే జంక్షన్ నిర్మించి, దానికి ఎర్రుపాలెం నుంచి ఒక రైలుమార్గం తీసుకొచ్చి కనెక్టివిటీ ఇస్తారు. అక్కడి నుంచి నంబూరు మీదగా గుంటూరు మార్గంతో అనుసంధానం చేస్తారు. అలానే మరో రైలుమార్గం అమరావతి నుంచి పెదకూరపాడు, నరసరావుపేట మీదగా బెంగళూరు రైలుమార్గంతో అనుసంధానం అవుతుంది. దీనివల్ల అటు న్యూఢిల్లీ, ఇటు చెన్నై, బెంగళూరు నుంచి అమరావతికి రైలు కనెక్టివిటీ వస్తుంది. ఈ నూతన రైలుమార్గానికి జేపీ సర్వేయింగ్ సంస్థ డీపీఆర్ తయారు చేసి ఇచ్చేలా ఆర్‌వీఎన్‌ఎల్ ఒప్పందం చేసుకొంది. ఈ రైలుమార్గంలో అత్యంత కీలకమైనది కృష్ణానదిపై రైలువంతెన నిర్మాణం. ఈ వంతెన నిర్మాణానికి ఎక్కడి నుంచి ఎలైన్‌మెంట్ చేస్తారనే దానిపై రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమరావతి రైల్వే జంక్షన్‌ను రాజధాని నడిబొడ్డున కాకుండా తాడికొండ-పెదపరిమి మధ్యలో నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠపురం వద్దనే రైలు వంతెన నిర్మాణం జరుగుతుందని అంటున్నారు.
KaNTRhi Posted August 30, 2017 Posted August 30, 2017 రైలుమార్గంపై సర్వే30-08-2017 03:02:50 వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై వంతెన! ఈటీఎస్ సర్వే చేస్తోన్న చెన్నై సంస్థ త్వరలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు నివేదిక గుంటూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. కృష్ణానది మీదగా రైలు వంతెన నిర్మాణం విషయంలో ఎలకాట్రానిక్ టోటల్ స్టేషన్(ఈటీఎస్) సర్వేని చెన్నైకి చెందిన జేపీ సర్వేయింగ్ సంస్థ నిర్వహిస్తోంది. కొన్ని రోజులుగా ఆ సంస్థకు చెందిన ఇంజనీర్లు అమరావతి మండలంలోని వైకుంఠపురం పరిసరాల్లో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. త్వరలోనే తాము రెండు, మూడు ఎలైన్‌మెంట్‌లను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్)కు అందజేస్తామని, వాటిపై తుది నిర్ణయం ఆర్‌వీఎన్‌ఎల్ తీసుకొంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. 2016 రైల్వే బడ్జెట్‌లోనే అమరావతికి నూతన రైలుమార్గం నిర్మాణం కోసం సర్వే మంజూరైంది. విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం నుంచి 106 కిలోమీటర్ల పొడవున రాజధానికి ఎలైన్‌మెంట్ ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.2,679 కోట్లు అవసరమౌతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగేళ్ల వ్యవధిలో ఈ రైలు మార్గ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రాజధానిలో ఒక రైల్వే జంక్షన్ నిర్మించి, దానికి ఎర్రుపాలెం నుంచి ఒక రైలుమార్గం తీసుకొచ్చి కనెక్టివిటీ ఇస్తారు. అక్కడి నుంచి నంబూరు మీదగా గుంటూరు మార్గంతో అనుసంధానం చేస్తారు. అలానే మరో రైలుమార్గం అమరావతి నుంచి పెదకూరపాడు, నరసరావుపేట మీదగా బెంగళూరు రైలుమార్గంతో అనుసంధానం అవుతుంది. దీనివల్ల అటు న్యూఢిల్లీ, ఇటు చెన్నై, బెంగళూరు నుంచి అమరావతికి రైలు కనెక్టివిటీ వస్తుంది. ఈ నూతన రైలుమార్గానికి జేపీ సర్వేయింగ్ సంస్థ డీపీఆర్ తయారు చేసి ఇచ్చేలా ఆర్‌వీఎన్‌ఎల్ ఒప్పందం చేసుకొంది. ఈ రైలుమార్గంలో అత్యంత కీలకమైనది కృష్ణానదిపై రైలువంతెన నిర్మాణం. ఈ వంతెన నిర్మాణానికి ఎక్కడి నుంచి ఎలైన్‌మెంట్ చేస్తారనే దానిపై రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమరావతి రైల్వే జంక్షన్‌ను రాజధాని నడిబొడ్డున కాకుండా తాడికొండ-పెదపరిమి మధ్యలో నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠపురం వద్దనే రైలు వంతెన నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. Dini tho.. water storage chesetattu kadithe best...
Ramesh39 Posted August 30, 2017 Posted August 30, 2017 మేము సైతం... అజరామర అమరావతి నిర్మాణానికి పదుల సంఖ్యలో దేశాలు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి ఆసక్తి కార్యాచరణ ప్రారంభించిన పలు సంస్థలు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘అమరావతి’ పేరు పెట్టుకుని.. ఆ కీర్తిని మరో వెయ్యేళ్లు అజరామరంగా నిలిపే స్థాయిలో భవ్యమైన ఆధునిక రాజధాని నిర్మాణానికి సిద్ధమవుతున్న వేళ.. సహకారం అందించడానికి మేము సైతం అంటూ పదులకొద్దీ ప్రముఖ దేశాలు పోటీ పడుతున్నాయి. రాజు ముందు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోటీపడే కవుల్లా.. దేవతల రాజు దేవేంద్రుడి రాజధాని ‘అమరావతి’ పేరు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో, నిర్వహణలో తమ ప్రతిభను చూపడానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు గుంటూరు జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక వూరైన ‘అమరావతి’ నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకరిస్తోంది. నిర్మాణ, మౌలిక వసతులు, ప్రణాళికల రంగాల్లో అగ్రగామి అంతర్జాతీయ సంస్థల్ని నేడు రా రామ్మని వూరిస్తోంది. 217 చ.కి.మీ. పరిధిలో నిర్మిస్తున్న ఈ నూతన నగరంలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు సింగపూర్, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా ఇలా పలు దేశాలు, అక్కడి సంస్థలు ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఈ దేశాల బృందాలు ఇప్పటికే అమరావతిలో పర్యటించాయి. కొన్ని దేశాలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలూ చేసుకున్నాయి. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైతే సగం సినిమా పూర్తయినట్టే అని సినీ పండితులు చెబుతారు. నిర్మాణానికి కూడా అంతే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో పలు అంశాలపై అనేక దేశాలు అందిస్తున్న వివిధ ప్రణాళికలపై ప్రత్యేక కథనం.. సింగపూర్ గురించి చెప్పేదేముంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత అమరావతి ప్రాజెక్టులో ఎక్కువ పాత్ర పోషిస్తోంది సింగపూరే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలోనే సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆ దేశానికి కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి నగరం, కేంద్ర రాజధాని ప్రాంతం, మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు వ్యూహ ప్రణాళికను సింగపూర్ సంస్థలే రూపొందించాయి. * అమరావతిలో 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత అభివృద్ధికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కూటమి ఎంపికమైంది. * ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధికి సింగపూర్ సహకారానికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని అమలు పర్యవేక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. * సీఆర్‌డీఏ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి ‘క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ ఏజెన్సీ’ ఏర్పాటుకు సింగపూర్ ముందుకు వచ్చింది. * తమ దేశానికి చెందిన ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ సంస్థ ద్వారా అమరావతిలో భూ నిర్వహణ, నగర నిర్వహణ ప్రణాళికల రూపకల్పనలో సింగపూర్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. జపాన్ రవాణా ప్రణాళిక * అమరావతిపై మొదటి నుంచి ఆసక్తి కనబరుస్తున్న దేశాల్లో జపాన్ ఒకటి. మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి సమగ్ర ట్రాఫిక్, రవాణా అధ్యయనాన్ని జపాన్ చేపట్టింది. రెండేళ్లలో ఇది పూర్తవుతుంది. * సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ పట్టణ ప్రాంతాల్ని రాజధానితో అనుసంధానం చేయడం, వాటి మధ్య పరస్పర అనుసంధానానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తుంది. * రాజధాని మొత్తానికి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ) నెట్‌వర్క్ ప్రణాళిక రూపకల్పనకు ముందుకు వచ్చింది. * అమరావతిలో క్రీడా, ఎలక్ట్రానిక్ నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యానికి జపాన్ ఆసక్తిగా ఉంది. 2020 ఒలింపిక్స్ నిర్వహిస్తున్న అనుభవంతో రాజధానిలో క్రీడా నగరాన్ని అభివృద్ధి చేస్తామని జపాన్ ప్రతిపాదించింది. * ఆంధ్రప్రదేశ్, జపాన్ మధ్య సహకారానికి అక్కడి మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టు (ఎంఎల్‌ఐటీ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. * రాజధానిలో ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు జపాన్‌కు చెందిన జైకా, జేబిక్ వంటి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. * తాగునీరు, మురుగునీటి శుద్ధి, విపత్తుల నుంచి రక్షణ, డేటా కేంద్రాల నిర్వహణలో ప్రాజెక్టులు చేపట్టేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. స్టేడియం నిర్మాణానికి బ్రిటన్ ఆసక్తి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌తో సహకారానికి బ్రిటన్ రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. అమరావతిలో వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సమావేశాలు, రహదారి ప్రదర్శనల నిర్వహణ వంటి కార్యక్రమాల్ని ఒక విభాగం చూస్తుంది. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించేందుకు మరో విభాగం కృషి చేస్తోంది. * అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. * వివిధ అంశాలపై అధ్యయనానికి నిధులిచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (డీఎఫ్‌ఐడీ) ఆసక్తిగా ఉంది. * తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం, వాతావరణ మార్పులు, ఆకర్షణీయ నగరాల నాయకత్వం, నవకల్పన సంస్థల ఏర్పాటు తదితర అంశాల్లో బ్రిటన్ సహకరించనుంది. * రాజధానిలో భూగర్భ జలవనరులు, కృష్ణా నది పరీవాహక ప్రాంతం గతంలో ఎలా ఉండేది, రాబోయే కొన్నేళ్లలో ఎలా మారనుంది వంటి అంశాలపై బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ జియోలాజికల్ సర్వే సంస్థ అధ్యయనం చేయనుంది. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. * పరిపాలన నగరం బృహత్ ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులు రూపొందిస్తోంది కూడా బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్-పార్ట్‌నర్స్ సంస్థే. మౌలిక వసతుల ప్రణాళికలో చైనా పాత్ర * రాజధాని ప్రాథమిక ప్రణాళిక దశ నుంచి చైనా ఆసక్తి కనబరిచింది. రాజధానిలో కీలకమైన మౌలిక వసతుల ప్రణాళిక రూపకల్పనలో చైనాకు చెందిన గుజౌ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ (జీఐఐసీ) కీలక పాత్ర పోషించింది. ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి ఆ సంస్థ ప్రణాళిక రూపొందించింది. గుజౌ, అమరావతి మధ్య సోదర నగర సహకారానికి ఒప్పందం జరిగింది. జల నిర్వహణలో ఆస్ట్రేలియా సాయం జలవనరుల సుస్థిర నిర్వహణలో సాయపడేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. అమరావతిలో నివాస భవనాల నుంచి వచ్చే వ్యర్థ జలాల్ని అక్కడే శుద్ధి చేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చే ప్రాజెక్టుకు ‘కోపరేటివ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వాటర్ సెన్సిటివ్ సిటీస్’ (సీఆర్‌సీ) సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఆ సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇంధన రంగంలో జర్మనీ ఆసక్తి రాజధానిలో ఇంధన, రవాణా రంగాల అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఆ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఆసక్తిగా ఉంది. విజయవాడలో లైట్ రైల్ రవాణా వ్యవస్థపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆకర్షణీయ అమరావతికి ఫ్రాన్స్ తోడ్పాటు అమరావతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. అమెరికాలోని వివిధ ఫ్రెంచి కంపెనీల ప్రతినిధులు ఇటీవల అమరావతిని సందర్శించారు. వారిలో సలహాదారులు (కన్సల్టెంట్), గుత్తేదారులు, సాంకేతిక సహాయం అందించేవారు ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మార్సిలే నగరంతో అమరావతికి సోదర నగర ఒప్పందం ఉంది. అమరావతిలో రవాణా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అక్కడి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు.. * కెనడా: రాజధానిలో రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన పరికరాల సరఫరా, ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఈ దేశం ఆసక్తి కనబరుస్తోంది. * స్విట్జర్లాండ్: ఈ దేశ బృందం ఇటీవలే అమరావతిలో పర్యటించింది. బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ ప్రాజెక్ట్ (బీప్) ద్వారా సాంకేతిక, పర్యావరణ, జల నిర్వహణలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. * నెదర్లాండ్స్: ఈ దేశానికి చెందిన ఆర్కాడిస్.. టాటా సంస్థతో కలిసి రాజధానికి వరద నియంత్రణ ప్రణాళిక, బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. * డెన్మార్క్: రాజధానిలో సైకిల్ ట్రాక్‌లు, మోటారు రహిత రవాణా వ్యవస్థల రూపకల్పనలో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ఉంది. * అమెరికా: ఈ దేశానికి చెందిన మెకన్సీ, సీహెచ్ 2ఎం సంస్థలు సీఆర్‌డీఏకి కీలకమైన కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నాయి. * రష్యా: ఈ దేశ బృందం అమరావతిని సందర్శించింది. నిర్మాణంలో పాలుపంచుకోవాలన్న ఆసక్తి వ్యక్తం చేసింది. * మలేసియా: ‘కెపాసిటీ బిల్డింగ్’లో సహకారానికి సిద్ధంగా ఉంది. అమరావతి ప్రణాళిక రూపకల్పన దశలో.. పుత్రజయ నగర నిర్మాణంలో తమకెదురైన అనుభవ పాఠాలను వివరించింది.
sonykongara Posted August 30, 2017 Author Posted August 30, 2017 సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం అమరావతి: సీఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాఖమూరు పార్కు అభివృద్ధి నమూనాలపై చర్చ జరిగింది. అలాగే రాజధాని ప్రాంతంలోని 27గ్రామాల్లో నరేగా నిధులతో పరిశుభ్రత, రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో న్యాయ, శాసన, కార్యనిర్వాహక సంస్థల భవనాలు, పౌరసముదాయాలు నిర్మించేందుకు నిర్ణయించారు. వీటిని రూ. 11,602 కోట్లతో నిర్మించాలని, మూడేళ్లలో వీటిని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంతేగాక విజయవాడలోని రాజీవ్‌గాంధీ పార్క్ సహా మిగిలిన ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
AnnaGaru Posted August 31, 2017 Posted August 31, 2017 courtesy : Parakala garu morning walk /**** Krishnaveni.She never ceases to speak to me.
KaNTRhi Posted August 31, 2017 Posted August 31, 2017 courtesy : Parakala garu morning walk /**** Krishnaveni. She never ceases to speak to me. Is it near to Pavithra Sangamam?
sonykongara Posted August 31, 2017 Author Posted August 31, 2017 రూ.6,914 కోట్లతో మౌలిక వసతులు ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలో రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్‌పీఎస్ లేఅవుట్‌లను మొత్తం 13 జోన్లుగా విభజించి... జోన్ల వారీగా అభివృద్ధి చేయనున్నారు. వీటిలో మూడు జోన్లను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. 4, 5, 9 జోన్లను సమీకృతంగా అభివృద్ధి చేస్తారు. ఒక జోన్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని... రహదారులు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్లు, గ్యాస్ పైప్‌లైన్లు వంటివి వేసేందుకు అవసరమైన భూగర్భ డక్ట్‌ల నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం వంటి పనులన్నీ చేపడతారు. ఒక జోన్‌కి సంబంధించిన మొత్తం పనులన్నీ ఒకే అభివృద్ధిదారుకి అప్పగిస్తారు. ఈ జోన్ల అభివృద్ధికి రూ.6,914 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనిలో జోన్-4కి రూ.817 కోట్లు, జోన్-5కి రూ.2,383 కోట్లు, జోన్-6కి రూ.3,714 కోట్లు అవసరమవుతుందని అంచనా. హైబ్రిడ్ యాన్యుటీ విధానమంటే..! ఈ విధానంలో మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 40 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 60 శాతాన్ని అభివృద్ధిదారు వెచ్చించాలి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా అతనిదే. అభివృద్ధిదారు పెట్టిన 60 శాతం మొత్తాన్ని పదేళ్లలో దఫ దఫాలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. అతని ఎంపికకు టెండర్లు పిలుస్తారు. తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనులు అప్పగిస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు, కర్ణాటక ప్రభుత్వం, గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ వంటి ప్రాజెక్టుల్లో హైబ్రిడ్ యాన్యుటీ విధానం అమలు చేస్తున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి. రాజధాని గ్రామాల అభివృద్ధికి నరేగా నిధులు * రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను పురపాలక శాఖకు అప్పగించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం వంటి పనులకు నరేగా నిధులు వినియోగిస్తారు. * అమరావతిలో న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల భవనాల నిర్మాణం, ఇతర పౌర నివాస సముదాయాల్ని 1.47 కోట్ల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. * వీటి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తారు. ఇందుకు రూ.11,602 కోట్ల వ్యయమవుతుంది. * అమరావతిలో 280 ఎకరాల్లో నిర్మించే శాఖమూరు పార్కును ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం. * ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్ యాక్సెస్ రోడ్డు)కి ఇరు పక్కలా, శాఖమూరు పార్కులోను మొక్కలు నాటే కార్యక్రమం సెప్టెంబరు రెండో వారంలో పెద్ద ఎత్తున చేపడతారు. * రాజధాని ప్రాంతంలో 10 వరకు హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు. అమరావతిలో కృష్ణా నదీ ముఖంగా 30 ఎకరాలు కేటాయించాలని అక్షరధామ్ సంస్థ ప్రతినిధులు కోరినట్టు ముఖ్యమంత్రికి సీఆర్డీఏ అధికారులు వివరించారు. అమెరికాలో అక్షరధామ్ మందిర నిర్మాణం పూర్తికాగానే... అమరావతిలో నిర్మాణం మొదలు పెడతామని వారు ప్రతిపాదించినట్టు తెలిపారు. వారికి భూమి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచేలా అద్భుత కట్టడం నిర్మించేలా చూడాలని సూచించారు. రాజధానిలో శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులు, పరిపాలనా నగర తుది ప్రణాళికను నార్మన్ ఫోస్టర్ సంస్థ సెప్టెంబరు 11న అందజేయనుంది. శాసనసభ భవనానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ఒక పక్క తుది ఆకృతులు సిద్ధం చేస్తుండగా... హఫీజ్ కాంట్రాక్టర్, ఆర్వీ సంస్థలు తాము రూపొందించిన ప్రత్యామ్నాయ డిజైన్‌లను బుధవారం ముఖ్యమంత్రికి చూపారు. దాన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థకు పంపించి, తుది ఆకృతితో రావాలని సీఎం సూచించారు. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాస భవనాలకు ఆర్కిటెక్ట్‌లను వారం రోజుల్లో ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా అమలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తాను ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
sonykongara Posted August 31, 2017 Author Posted August 31, 2017 రాజధానిలో ‘హ్యాం’ విధానం! 3 ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధికి నిర్ణయం సీఆర్డీయేపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో భూసమీకరణ కింద సేకరించిన మూడు ఎల్పీఎస్ జోన్లను ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’(హ్యాం)లో అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ‘ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్’ (ఈపీసీ) విధానంతో పోల్చితే ‘హ్యాం’ విధానం ఎంతో మెరుగైనదని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా రాజధానికి గణనీయస్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని, అత్యంత నాణ్యమైన సేవలు, నిర్వహణ ఉంటుందని సీఆర్డీయే పేర్కొంటోంది. వెలగపూడిలో సీఎం చంద్రబాబు సమక్షంలో బుధవారం సీఆర్డీయే సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. రూ.6914 కోట్ల అంచనా వ్యయంతో ఈ జోన్లలో అగ్రశ్రేణి మౌలిక వసతులు కల్పించేందుకు హ్యాం విఽధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం 49 శాతం, డెవలపర్లు 51 శాతం భరించేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో పనులు చేపట్టే కాంట్రాక్టర్లను మూడు రోజుల్లో ఖరారు చేస్తామని సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధానిలోని 29 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ‘ఉపాధి’ నిధులను వెచ్చించనున్నారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ ప్రతినిధులు సెప్టెంబరు 11న గవర్నమెంట్ కాంప్లెక్స్ ఫైనల్ డిజైన్లను సీఎంకి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు చెందిన భవనాలు, పౌర నివాస సముదాయాల నిర్మాణానికి రూ.11602 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశామని, వీటిని మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రాజధానిలోని శాఖమూరు వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కులోనూ, సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సెప్టెంబరు 2వ వారంలో పెద్దఎత్తున చేపట్టాలని సీఎం సూచించారు. అమరావతిలో అక్షరఽధామ్ నిర్మాణానికి నదీముఖంగా 30 ఎకరాలను కేటాయించేందుకు సీఎం సానుకూలత తెలిపారు. రాజధాని ప్రాంతంలో 10 వరకు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు.
sonykongara Posted August 31, 2017 Author Posted August 31, 2017 ప్రపంచబ్యాంక్ ప్రతినిధులకు రైతుల విన్నపం స్వచ్ఛందంగా భూములిచ్చాం రాజధాని అభివృద్ధి శరవేగంగా జరగాలి ప్రపంచబ్యాంక్ ప్రతినిధులకు రైతుల విన్నపం తుళ్ళూరు: రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చామని, అభివృద్ధి శరవేగంగా జరగాలని బుధవారం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాపులో వెంకటపాలెం రైతులు కోరారు. వరద నియంత్రణ చర్యలు, అమరావతి రాజధాని నగరంలో ప్రపంచబ్యాంక్ ఆర్థిక సహకారంతో, రోడ్లు వరద నియంత్రణ ప్రాజెక్టు అమలు చర్యలు వల్ల ప్రభావితమయ్యే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు సూచనలు, సలహాలు స్వీకరణకు సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో రెండు రోజులు వర్క్‌షాపులు నిర్వహించారు. బుధవారం వెంకటపాలెంలో నిర్వహించిన వర్క్‌షాపులో రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రపంచబ్యాంక్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. సీఆర్‌డీఏలో రైతులకు ఎక్కువ ప్రాతినిధ్యం కలగాలనే భావన రైతుల నుంచి వినిపించింది. సిటిజన్ కమిటీలో రైతులకు అగ్రపీఠం వేయాలనే వినతులు వచ్చాయి. గ్రామ కంఠాల సమస్యలు పరిష్కారించాలని సూచించారు. రోడ్ల వల్ల ప్రభావితమయ్యే వారికి వెంటనే న్యాయం చేయాలని సూచించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం, పర్యావరణ ప్రభావ అంచనా- పర్యావరణ నిర్వాహక ప్రణాళిక, వరద నియంత్రణ పనుల ప్రభావిత పునరావాస పాలసీల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. ఆయా అంశాలను తెలుగులో ముద్రించి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు నలుగురు, సీఆర్‌డీఏ లాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవరావు, స్ట్రాటజీ డైరెక్టర్ జీఎస్‌ఆర్కే శాస్త్రి, కాంపిటెంటు అథారిటీలు పాల్గొన్నారు.
sonykongara Posted September 4, 2017 Author Posted September 4, 2017 రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు రాజధాని నగరంలో తొమ్మిది గ్రామాల్లో 1100 ఎకరాల ప్రభుత్వ భూములు సీఆర్డీయే స్వాధీనం కానుంది. ఇప్పటికే భూసమీకరణ విధానంలో 34 వేల ఎకరాల వరకు భూములు రైతుల నుంచి సమ కూరాయి. భూములు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్న రైతుల వద్ద సేకరణ విధానంలో తీసుకొ నేందుకు సీఆర్డీయే ప్రక్రియ ప్రారంభించి చివరి దశకు తీసుకొచ్చింది. దసరా నుంచి రాబోయే ఏడాదిన్నరపాటు కీలక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వ భూముల స్వాధీనంతో మరో ముందడుగు పడింది. తొమ్మిది గ్రామాల్లో సీఆర్డీయేకి ప్రభుత్వ భూముల అడ్వాన్స్ పొజిషన్ 1,100 ఎకరాలు స్వాధీన పరిచేందుకు రెవెన్యూ శాఖకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కోన శశిధర్ రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు గుంటూరు: అమరావతి రాజధాని నగరంలోని తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వ భూములన్నింటినీ సీఆర్డీయేకి స్వాధీనపరిచేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వీటిలో డొంక, అసైన్డ్, ప్రభుత్వ పోరంబోకు, చెరువులు, రోడ్లు, శ్మశానవాటిక స్థలా లున్నాయి. ఒకటి, రెండు గ్రామాల్లో కొండ భూములు కూడా ఉన్నట్లు తెలిసింది. విజయదశమి పర్వదినం నుంచి సీడ్ క్యాపి టల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న భూములను సీఆర్డీయేకి ఇచ్చేయాల్సిందిగా ప్రభుత్వ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, రెవెన్యూ అధికారులు కసరత్తు జరిపి ప్రభుత్వ భూ ముల లెక్కలు తేల్చి వాటిని అడ్వాన్స్ పొజిష న్ ఇచ్చేందుకు తుళ్లూరు మండల తహసీ ల్దార్ కార్యాలయానికి అనుమతించారు. దీంతో రాజధాని నగరంలో తొమ్మిది గ్రామా ల్లో 1,100 ఎకరాల ప్రభుత్వ భూములు సీఆర్డీయే స్వాధీనం కానుంది. రాజధానిలో 26 ల్యాండ్ పూలింగ్ యూనిట్లలో ప్రభుత్వ భూములు 1,110.80 ఎకరాలు, అసైన్డ్ భూములు 1,235.78 ఎకరా లు, గతంలో భూకేటాయింపు జరిపినవి 7 ఎకరాలు, వక్ఫ్ భూములు 28.37 ఎకరాలు, దేవదాయ, ధర్మాదాయ భూములు 888.92 ఎకరాలు, అటవీ భూములు 1,048.53 ఎకరా లు, గుట్టలు 8.91 ఎకరాలు, వాగులు, వంకలు, కాలువలు 213 ఎకరాలు, చెరువు లు, నీటివనరులు 1,648.09 ఎకరాలు, గ్రామకంఠం భూములు 329.49 ఎకరాలు, శ్మశానవాటికలు 15.61 ఎకరాలు, ఇనాం భూము లు 280.39 ఎకరాలు, ఇతర కేటగిరీకి చెందినవి 89.04 ఎకరాలు కలిపి మొత్తం 7,614.31 ఎకరాలున్నాయి. వీటిల్లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములు ఇప్పటికే భూ సమీకరణ పథకం కింద సీఆర్డీ యే ఆధీనంలోకి వచ్చేశాయి. గ్రామకంఠాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అటవీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే భూసమీకరణ విధానంలో 34 వేల ఎకరాల వరకు భూములు రైతుల నుంచి సీఆర్డీయేకి సమకూరాయి. భూములు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్న రైతుల వద్ద భూసేకరణ విధానంలో భూములు తీసు కొనేందుకు సీఆర్డీయే ప్రక్రియ ప్రారంభించి చివరి దశకు తీసుకొచ్చింది. అన్ని గ్రామాల్లో అవార్డు ఎంక్వయిరీలు జరుగుతున్నాయి. ఇవి పూర్తికాగానే రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ భూములను కూడా తీసుకొని జిల్లా యంత్రాంగం సీఆర్డీయేకి ఇవ్వనుంది. అభివృద్ధికి తొలగిన అడ్డంకులు రాజధాని నగరంలో ప్రస్తుతం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మౌలిక సదు పాయాల కల్పన పనులను ప్రారంభించింది. ఇప్పటికే ఏడు ప్రాధాన్య రోడ్లకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులను చేస్తోంది. మరోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డును నిర్మిస్తోంది. శాకమూరులో భారీ విస్తీర్ణంలో ఉద్యావన నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇంకోవైపు రైతులకు కేటాయించిన నివాస, వాణిజ్య భూముల లేఅవుట్‌లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రభుత్వ భూములుగా మార్కింగ్ అయి ఉన్నాయి. దీని దృష్ట్యా ప్రభుత్వ భూములన్నింటిని సీఆర్డీయేకి స్వాధీనపరచాల్సిన అవసరం ఏర్పడింది. దసరా నుంచి రాబోయే సంవత్సరంన్నర పాటు కీలకమైన అభివృద్ధి పనులు రాజధానిలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మిగిలిన గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కూడా సీఆర్డీయేకి స్వాధీనపరుస్తామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
sonykongara Posted September 5, 2017 Author Posted September 5, 2017 అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటుకానుంది. ఇప్పటికే ఆయా విద్యా, వైద్య సంస్థలు అమరావతిలో ఏర్పాటవుతుండగా మరో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ కూడా అమరావతిలో ఏర్పాటుకాబోతోంది. ఇబ్రహీంపట్నం దగ్గర 20 ఎకరాల్లో అమరావతి అమెరికన్ ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. మొత్తం మూడు దశల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో, 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనిని 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా... ఈ ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now