sonykongara Posted June 12, 2018 Author Posted June 12, 2018 మైలురాయి..పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్ విజయవంతంగా పూర్తిచేశాం2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తాంవాల్ పైలాన్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి వెల్లడి * డయాఫ్రమ్‌వాల్ అంటే భూగర్భంలో నిర్మించేది. 95మీటర్ల లోతులో నిర్మించారు. దీని వెడల్పు 1.5మీటర్లు. నదిలో 1396.60మీటర్ల పొడవున కట్టారు. రెండే సీజన్లలో 414 పనిదినాల్లోనే పూర్తిచేశారు. * ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాం. దీన్ని చేపట్టడం నా అదృష్టం. ప్రాజెక్టును పూర్తిచేసుకుని కరవు రహిత రాష్ట్రంగా తయారుచేసుకుంటాం. 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తాం. * ఇంత కష్టపడి ప్రాజెక్టు నిర్మిస్తోంటే.. వైకాపా నాయకులు విషం చిమ్మారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుంది. అది వారికిష్టం లేదు.ఏదేమైనా పోలవరం ప్రాజెక్టునుపూర్తి చేసి తీరతా. ఈనాడు డిజిటల్ - ఏలూరు, పోలవరం - న్యూస్‌టుడే జాతికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి, కీలక మైలురాయిని అధిగమించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అంతకుముందు యాగశాల ప్రారంభించి పూజలు చేశారు. అనంతరం డయాఫ్రమ్‌వాల్‌ను పరిశీలించారు. బావర్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత స్పిల్ ఛానల్ వద్ద 13 జిల్లాల నుంచి వచ్చిన రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘ప్రపంచంలోని అన్ని భూగర్భ ప్రాజెక్టు పనులను బావర్ సంస్థ చేసింది. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో భాగంగా బెంటోనైట్ మిశ్రమంతో కలిపి ప్లాస్టిక్ కాంక్రీటు వేశారు.. దీంతో నాణ్యత పదింతలు పెరిగింది. చుక్క నీరు కూడా కిందకు ఇంకదు. ఎల్‌అండ్‌టీ సంస్థతో కలిపి ఈ ప్రతిష్ఠాత్మక పని పూర్తిచేశారు. ఇంజినీర్లు, మంత్రి కలిపి పట్టుదలతో దీన్ని కొలిక్కి తెచ్చారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 63సార్లు వర్చువల్ తనిఖీలు చేశాను. 25సార్లు ప్రత్యక్షంగా పరిశీలించాను. ఇది అధికారులకు స్ఫూర్తినిచ్చింది. మధ్యలో అనేక ఇబ్బందులు వచ్చాయి. కేంద్రం కూడా అప్పుడప్పుడు సరిగా స్పందించలేదు. ఇవన్నీ తట్టుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూశాం. తెలంగాణ నుంచి ఏడు మండలాలు మనకివ్వకపోతే ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు చెప్పాను. అవి కలిపాకే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రూ.14వేల కోట్లు ఖర్చుచేశాం. మొత్తం ప్రాజెక్టుకు రూ.57వేల కోట్లు అవసరం. ఇందులో రూ.5వేల కోట్లు విద్యుత్ ప్రాజెక్టుకి అవుతుంది. 52వేల కోట్లలో ఇప్పటికే 14వేల కోట్లు వెచ్చించామంటే.. ఇంకా రూ.38వేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అందులో రూ.27వేల కోట్ల నుంచి 28వేల కోట్ల వరకూ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకే అవుతుంది. ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు 55.12శాతం అయ్యాయి. ప్రాజెక్టు పూర్తయితే 7.20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 40లక్షల ఎకరాలకు స్థిరీకరణ వస్తుంది. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, పెన్నా నదులు అనుసంధానించనున్నాం. మీ ఆశీస్సులతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నీటిఎద్దడి లేకుండా చేయాలన్నది నా ధ్యేయం. ప్రాజెక్టులో 55.12 శాతం పనులు పూర్తిహెడ్వర్క్సు పనులు 38.2శాతం, మొత్తం ప్రాజెక్టు పనులు 55.12శాతం పూర్తయ్యాయి. కుడికాలువ 89.శాతం, ఎడమ ప్రధానకాలువ పనులు 65.01శాతం జరిగాయి. స్పిల్‌వే పనులు వేగం పుంజుకున్నాయి. త్వరలో అన్ని రికార్డులూ అధిగమించబోతున్నాం. కాంక్రీటు పనులకు ట్రాన్సుట్రాయ్ పూర్తిగా సహకరిస్తోంది. వారినీ అభినందించాలి. ప్రాజెక్టుకు 1,67,213 ఎకరాలు అవసరం కాగా 1,10,330 ఎకరాలు సేకరించాం. ఇంకా 55,650 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి 6,373కోట్లు అవసరం కాగా 5653కోట్లు ఖర్చు పెట్టాం. రూ.21వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. లక్ష కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నాం.’ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 414 రోజుల్లోనే పూర్తి చేసినందుకు బావర్, ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు, 24గంటల్లోనే 11,158 ఘనపు మీటర్ల కాంక్రీటు పనులు చేసిన నవయుగ ప్రతినిధులను అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. అనంతరం వారంతా ముఖ్యమంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ, ఎంపీ తోట సీతారామలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ కె.శ్రీధర్, ఎస్‌ఈ వీఎస్.రమేశ్‌బాబు, పోలవరం శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఒక్క రోజులో కాంక్రీటు రికార్డు!ఒక్కరోజులో కాళేశ్వరం ప్రాజెక్టులో 7,250 ఘనపు(క్యుబిక్) మీటర్ల కాంక్రీటు పని చేస్తే ఇక్కడ 11,153 ఘనపు మీటర్ల మేర చేశాం. తద్వారా దేశంలో మొదటి స్థానంలో నిలిచాం. గంట వర్షం పడింది. లేదంటే ఇంకా ఎక్కువ పని చేసేవాళ్లం. ప్రపంచంలోనే కాంక్రీటు నాణ్యతలో ఇదే మొదటిది. పని పరంగా రెండోది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన త్రీగార్జెస్‌లో 13వేల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిచేశారు. 2,3 నెలల్లో 13వేల ఘనపుమీటర్ల కాంక్రీటు పనిచేసి రికార్డు సృష్టించబోతున్నాం. పోలవరంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాంమంత్రి నారా లోకేష్ ట్వీట్ ఈనాడు డిజిటల్, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒకే రోజు 11,153 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి జాతీయ రికార్డు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నీటిపారుదల శాఖ అధికారులకు సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ‘పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉంటే కేవలం 5 ప్రాజెక్టుల పనులు మాత్రమే జరుగుతున్నాయి. అందులో ఒక్క పోలవరం పనులు మాత్రమే వేగంగా జరుగుతున్నాయి. పోలవరంలో ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపక్షాలు అసత్యాలు ప్రచారం చేయడం దారుణం’ అని ట్వీట్ చేశారు. 3mar 1
Yaswanth526 Posted June 12, 2018 Posted June 12, 2018 Andhra Pradesh makes India proud! NCBN created history y'day by successfully completing construction of Polavaram’s diaphragm wall in record time. 11,153 cubic mt of concrete work was completed in 24hrs setting a new natl record beating Kaleswaram project by a comfortable margin. 3mar 1
sonykongara Posted June 12, 2018 Author Posted June 12, 2018 సవాల్‌గా తీసుకున్నాం 12-06-2018 01:42:57 నవంబరు-ఫిబ్రవరి మధ్య పోలవరం కాంక్రీట్ పనుల పూర్తి 2019 జూన్‌కి గ్రావిటీ ద్వారా నీరు.. ‘నవయుగ’ ఎండీ శ్రీధర్ ధీమా అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు కష్టపడి పనిచేస్తాడని నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ఎండీ శ్రీధర్ అన్నారు. తెలివితేటలతో అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించి సత్తా చాటడం తెలుగువాడి నైజమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆదివారం 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేసి జాతీయ రికార్డు సాధించిన సందర్భంగా సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘ప్రాజెక్టు బాధ్యతలను మేం తీసుకున్నప్పుడు స్పిల్‌వే కాంక్రీట్ పనులు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర, స్పిల్‌చానల్ కాంక్రీట్ పనులు 22.5 లక్షల క్యూబిక్‌మీటర్ల మేర చేయాల్సి ఉంది. సాధారణంగా ఈ పనులు పూర్తిచేయాలంటే నాలుగైదేళ్లు పడుతుంది. కానీ ఇంత పెద్ద లక్ష్యాన్ని 2019 జూన్ నాటికి పూర్తిచేయాలని మాకు బాధ్యతలు అప్పగించే సమయంలో గడువు విధించారు. ఈ లక్ష్యాన్ని నవయుగ సంస్థ సవాల్‌గా స్వీకరించింది. రోజుకు 13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టిన త్రీగ్యాడ్జెట్స్ ప్రాజెక్టు నాకు గుర్తుకొచ్చింది. ఇందుకు అవసరమైన యంత్రసామ్రగిపై దృష్టిసారించాం. ఇప్పటికే ఇటలీ నుంచి మూడు బ్యాచింగ్ ప్లాంట్లను, యంత్రసామగ్రిని, టెలీబెల్టులను రప్పించాం. మరో రెండు బ్యాచింగ్ ప్లాంట్లు మార్గమధ్యంలో ఉన్నాయి. ఇవి ఈనెలాఖరుకు సిద్ధమవుతాయి’ అని వివరించారు. ఏడు బ్యాచింగ్ ప్లాంట్ల ద్వారా చేపట్టాల్సిన కాంక్రీట్ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తమకిచ్చిన లక్ష్యం నెరవేర్చాలంటే నెలకు 3.5 లక్షల నుంచి 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంటుందని, ఇలా చేయాలంటే నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటే చాలదని చెప్పారు. జూన్ నుంచి అక్టోబరు వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పెద్దఎత్తున కాంక్రీట్ పనులు చేపడితేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. యంత్ర సామాగ్రిని సిద్ధంచేసుకుని నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2019 మే నాటికి స్పిల్‌వే, స్పిల్‌చానల్ కాంక్రీట్ పనులు పూర్తిచేసి, గేట్లు బిగించి, గ్రావిటీ ద్వారా నీరు పారించడమే తమ లక్ష్యంగా శ్రీధర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో చేపట్టే కాంక్రీట్ పనులు చిరస్థాయిలో నిలిచిపోతాయని, ప్రపంచంలోనే రికార్డుగా నిలుస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
sonykongara Posted June 12, 2018 Author Posted June 12, 2018 కాంక్రీట్.. విజయం! 12-06-2018 01:44:16 పోలవరం రికార్డు వెనుక భారీ పరిశ్రమ రెండు షిఫ్టుల్లో 6వేల మంది సిబ్బంది అన్నాహారాలు మాని విధులు ఉదయం 7 నుంచి నిరంతర యజ్ఞం భారీ వర్షంతో గంట ఆగిన పని రికార్డు బద్దలుతో హర్షాతిరేకాలు (ఏలూరు - ఆంధ్రజ్యోతి) 47 వేల సిమెంట్ బస్తాలు... 11 వేల క్యూబిక్ మీటర్ల మెటల్... ఆరువేల క్యూబిక్ మీటర్ల ఇసుక! ఐదు భారీ బ్లాచింగ్ ప్లాంట్లు! వందల సంఖ్యలో వాహనాలు! రెండు షిఫ్టులు... మొత్తం 250 మంది ఇంజనీర్లు, ఆరువేల మంది కార్మికులు, సిబ్బంది! 24 గంటల పరి‘శ్రమ’! దీని ఫలితమే... పోలవరం ప్రాజెక్టులో ఒక రికార్డు బద్దలైంది. ప్రపంచ రికార్డుకు అతి చేరువలో నిలిచింది! పోలవరం ప్రాజెక్టులో 24 గంటల్లో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని పూర్తి చేయడం ఆషామాషీగా జరగలేదు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల దాకా యంత్రాలు నిర్విరామంగా పని చేశాయి. ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది కూడా యంత్రాల్లా విసుగూ విరామం లేకుండా పని చేశారు. పోలవరం కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ ‘రికార్డులు బద్దలు కొడతాం’ అని ముందుగానే ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలవరం ప్రాజెక్టు స్థలం వద్ద భారీ హడావుడి మొదలైంది. వందలకొద్దీ వాహనాలు, వేలకొద్దీ సిబ్బంది రంగంలోకి దిగారు. పోలవరం ప్రాజెక్టులో ఐదు భారీ బ్లాచింగ్ (కాంక్రీటును కలిపేవి) యూనిట్లు ఉన్నాయి. స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో కాంక్రీటు పోసే భారీ టెలీబెల్టులూ ఉన్నాయి. 24 గంటల్లో 10వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు కాంక్రీటు పని మొదలైంది. వచ్చే వాహనం వస్తూనే ఉంటుంది, వెళ్లేది వెళ్తూనే ఉంది! కాంక్రీట్‌ను ఎప్పటికప్పుడు సరైన ప్రాంతంలో నింపివేసే ప్రక్రియ ఇంజనీర్ల పర్యవేక్షణలో పకడ్బందీగా సాగింది. అంతా బాగుంది సరే! ఒక్క యంత్రం మొరాయించినా... ఉన్నట్టుండి వర్షం కురిసినా... లక్ష్యం ‘నీరుకారిపోతుంది’! అయితే... పోలవరం సిబ్బంది సంకల్పానికి వాతావరణం, ఇతర పరిస్థితులూ కలిసి వచ్చాయి. ప్రాజెక్టు సైట్ వద్ద చినుకు రాలేదు. యంత్రాలన్నీ ‘మేము సైతం’ అంటూ సహకరించాయి. మొత్తం 24 గంటలను రెండు షిఫ్టులుగా విభజించారు. రాత్రి 7 గంటల సమయంలో నిమిషాల వ్యవధిలో ఒక షిఫ్టు కార్మికులు రిలీవ్ కావడం, మరో షిఫ్టు సిబ్బంది రంగంలోకిదిగడం జరిగిపోయింది. స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో నిర్విరామంగా కాంక్రీట్ పోస్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటలకు ‘కాళేశ్వరం రికార్డు’ను అలవోకగా దాటేశారు. తదుపరి టార్గెట్... 10వేల క్యూబిక్ మీటర్లను సాధించే దిశగా కదిలారు. అయితే... అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జోరున వర్షం మొదలైంది. శరవేగంగా సాగుతున్న పనికి బ్రేక్ పడింది. ‘పదివేల క్యూబిక్ మీటర్ల లక్ష్యం చేరుకోలేమేమో!’ అనే ఆందోళన మొదలైంది. అయితే... గంట వ్యవధిలోనే వాన తగ్గింది. అంతే... కార్మికులు, ఇంజనీర్లు ఎగిరి గంతేశారు. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3, 4, 5, 6 గంటలు ఇలా గుడుస్తూనే ఉన్నాయి. ఏడోగంట రానేవచ్చింది. అప్పటికి నమోదైన కాంక్రీట్... 11,158 క్యూబిక్ మీటర్లు! ఇంజనీర్లు ఈ ప్రకటన చేయగానే ఒక్కసారిగా ప్రాజెక్టు సైట్‌లో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇంజనీర్లు, కార్మికులు అన్న తేడా లేకుండా సంతోషాన్ని పంచుకున్నారు. మరీ ముఖ్యంగా యువ ఇంజనీర్లు ఆనందం పట్టలేక గంతులేశారు. మా దాహం తీరలేదు తొలుత 10 వేల క్యూబిక్ మీటర్లను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంజనీర్లు, సిబ్బంది కంటిమీద కునుకులేకుండా, భోజనం లేకుండా క్షణం వృఽథా చేయకుండా పని చేయడంతో అంతకుమించిన పని చేయగలిగాం. త్రీగోర్జెస్ రికార్డులను బద్దలుకొట్టాలన్నది మా లక్ష్యం. దీనినీ సాధిస్తాం. గిన్నిస్ బుక్‌కు ఎక్కుతాం!’’ - సీనియర్ మేనేజర్ క్రాంతి
John Posted June 12, 2018 Posted June 12, 2018 Venkanna meeda pramanam chesi cheppamanu ninna polavaram lo antha work jarigindani.. cheppe dhairyam babu ku unda : vijaya sai reddy
John Posted June 12, 2018 Posted June 12, 2018 మా దాహం తీరలేదు తొలుత 10 వేల క్యూబిక్ మీటర్లను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంజనీర్లు, సిబ్బంది కంటిమీద కునుకులేకుండా, భోజనం లేకుండా క్షణం వృఽథా చేయకుండా పని చేయడంతో అంతకుమించిన పని చేయగలిగాం. త్రీగోర్జెస్ రికార్డులను బద్దలుకొట్టాలన్నది మా లక్ష్యం. దీనినీ సాధిస్తాం. గిన్నిస్ బుక్‌కు ఎక్కుతాం!’’ - సీనియర్ మేనేజర్ క్రాంతి
Hello26 Posted June 12, 2018 Posted June 12, 2018 Superb achievement. Only CBN and TDP can complete Polavaram project even though BJP, ICP Jagan and Janasena are throwing hurdles
rk09 Posted June 14, 2018 Posted June 14, 2018 సవాళ్లకు సమాధానం పోలవరం డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు తొలి ఆలోచన 200 ఏళ్ల కిందటిదే. కరవును తరిమికొట్టడానికి కాటన్ హయాంలోనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆయన ఆలోచనల్లో మెరిసింది. క్రమేణా పేర్లు మార్చుకుంటూ పోలవరంగా మారింది. ఇంత చరిత్ర ఉన్న ఈ ఆధునిక దేవాలయానికి 1980లో శంకుస్థాపన జరిగినా ఎన్నో అభ్యంతరాలు... మరెన్నో అడ్డంకులు... లెక్కలేనన్ని సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్దాల కల సాకారమవుతున్న క్రమంలో పోలవరం ఇటీవల ఒక ముఖ్య మైలురాయిని దాటింది. అది ఇలాంటి, అలాంటి మైలురాయి కానేకాదు. పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సాంకేతికంగా ఏ సమస్య ఉందని గుర్తించి 1940 దశకంలో ‘అబ్బే సాధ్యం కాదు’ అని చెప్పారో ఆ సవాల్‌ను డయాఫ్రం వాల్ (నీటి ఊట నియంత్రణ గోడ) రూపంలో అధిగమించినట్లయింది. ఇంత కీలకమైన నిర్మాణం ఎన్ని రోజుల్లో.. ఎలా నిర్మించారు? ఇందులో ఏది సవాల్? ఈ నిర్మాణం ఎక్కడుంటుంది? దాని ఫలితం ఏమిటి అన్న సమగ్ర కథనం ఏమిటీ డయాఫ్రం వాల్? బొమ్మరాజు దుర్గాప్రసాద్ ఈనాడు, అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం... ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు కలల రూపం. సాగునీటికి మరింత భరోసాతో రైతన్న మోములో కనిపించే చిరునవ్వు. దానిని సాకారం చేసేందుకు కంకణబద్ధమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణంలో ఎదురవుతున్న పెను సవాళ్లకు అందివచ్చిన అత్యాధునిక సాంకేతికతతో సమాధానమిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. ఈ ప్రయాణంలో ఓ మేలి మలుపు.. పూర్తయిన డయాఫ్రంవాల్ నిర్మాణం. దీన్ని పూర్తి చేయడానికి అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అనుభవం అవసరమైందంటే ఇది ఎంతటి ఉత్కృష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కానీ చూద్దామంటే పైకి అంతగా ఏమీ కనిపించదు. ఎందుకంటే నిర్మాణమంతా జరిగేది భూఅంతర్భాగంలో. ఉపరితలంలో చిన్న సిమెంటు కాలిబాటలాంటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇది ప్రాజెక్టులో ముఖ్యమైన ఒక పెద్ద రాయి, మట్టి కట్ట నిర్మాణానికి కీలక భూమిక. అందుకే ప్రశ్నలు ఎన్నో. దీని పూర్వాపరాలు తెలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి ఉన్న నేపథ్యంలో సాంకేతికాంశాలతో ముడిపడిన అంశాలను వీలుమేరకు సరళంగా వివరించే ప్రయత్నమిది. నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి? డయాఫ్రం వాల్ గురించి తెలుసుకోవాలంటే అంతకంటే ముందుగా నీటిపారుదల ప్రాజెక్టు.. అందులో ఏమేమి భాగాలుంటాయో తెలుసుకోవాలి. ఏ ప్రాజెక్టునైనా నదిపై నిర్మిస్తారు. నీటిని నిల్వ చేసుకునేందుకు జలాశయం నిర్మిస్తారు. దీనికి కాలువలతో అనుసంధానం ఉంటుంది. ఈ జలాశయానికి స్పిల్ వే, మట్టికట్ట లేదా రాతి, మట్టికట్ట కూడా నిర్మిస్తారు. స్పిల్ వే అంటే ఏమిటి? నదిలో వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమపద్ధతిలో పొర్లిపోయేలా (స్పిల్ వే) బయటకు వదిలేసేందుకు నిర్మించే కట్టడమే ఇది. దీనికి తలుపులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రాజెక్టులో వరదలు వచ్చినప్పుడు తలుపులు ఎత్తి నీళ్లు వదలడం మనం చూస్తుంటాం. ఆ కట్టడమే స్పిల్ వే. ఏ స్థాయిలో నిర్మిస్తారు? స్పిల్ వే నిర్మించే ముందు వందల ఏళ్ల నది వరద ప్రవాహ చరిత్రను పరిశీలిస్తారు. ఒక్క రోజులో ఎంత పెద్ద వరద రావచ్చో అంచనా వేస్తారు. హఠాత్తుగా అంత వరద వస్తే ఆ కట్టడానికి ఏ ఇబ్బంది రాకుండా తలుపులు తెరిచి ఆ నీటిని సులభంగా దిగవకు వదిలేసే స్థాయిలో, అంత పటిష్ఠంగా ఈ స్పిల్ వే నిర్మిస్తారు. స్పిల్ వే విషయంలో పోలవరం ప్రత్యేకతలేమిటి? పోలవరం ప్రాజెక్టులో ఒక్క రోజులో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా గేట్లు ఎత్తి దిగువకు వరద వదిలేసేటంత సామర్థ్యంతో స్పిల్ వే నిర్మిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా జలాశయానికి స్పిల్ వే నది ప్రవహించే మార్గంలోనే, నది మధ్యలోకి వచ్చేలా నిర్మిస్తారు. కానీ పోలవరంలో అలా నిర్మించడం లేదు. ఎందుకని? ఎందుకంటే చాలా లోతువరకు ఇసుక ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్పిల్‌వే నిర్మాణం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. గోదావరిలో పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పుడో బ్రిటిష్ హయాం నుంచే ఉంది. ప్రాజెక్టు నిర్మించే క్షేత్రం చాలా సవాల్‌తో కూడినది. నదీ ప్రవాహాలపై అధ్యయనం చేసే అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ సంస్థ(యుఎస్‌ఆర్‌ఆర్) ఇక్కడ పరిశీలించి 1940కు ముందే ఇక్కడ స్పిల్ వే నిర్మాణం సరికాదని పేర్కొంది. కారణాలు ఏం చెప్పింది? యుఎస్‌ఆర్‌ఆర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన కీలకమైన సంస్థ. నదీ ప్రవాహ మార్గాలు...వాటిపై నిర్మాణాలకు సంబంధించి మంచి నైపుణ్యం ఉన్న సంస్థగా పేరుంది. పోలవరం వద్ద గోదావరిలో దాదాపు 100 అడుగుల నుంచి 300 అడుగుల వరకు దాదాపు కిలోమీటరు మేర మేటలు మేటలుగా ఉన్న ఇసుకను పరిశీలించారు. ఆ దిగువ ఎక్కడో రాతిపొరలు ఉన్న అంశాన్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గుర్తించిన క్షేత్రం కాంక్రీటు కట్టడం నిర్మాణానికి సరైనది కాదని, అక్కడ స్పిల్ వే నిర్మాణం సాధ్యం కాదని పేర్కొన్నారు. పైగా గోదావరి మహానది. అనేక నెలల పాటు వేల, లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఇంత మహా ప్రవాహాల నేపథ్యంలో ఒక కట్టడం నిర్మించడం అంత సులభమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇంతగా పూడుకుపోయిన ఇసుకలో స్పిల్ వేకు పునాదిగా నిర్మించే కాంక్రీటు నిర్మాణం సాధ్యం కాదని తేల్చింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలా అనే నిపుణుల తర్జనభర్జనలతో గోదావరిని మళ్లించి స్పిల్ వే స్థలాన్ని కూడా మార్చాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏం చేశారు? అక్కడ ఇలాంటి సమస్య రాలేదు. నది మధ్యలోనే స్పిల్ వే నిర్మించారు. అక్కడ నదిలో ఉన్న రాతి నేలల్లో నుంచి కాంక్రీటు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మరిప్పుడు ఏం చేస్తున్నారు? గోదావరి నది ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గాన్ని మళ్లిస్తున్నారు. గోదావరి కుడి గట్టుపై గతంలో ఏడు గ్రామాలు ఉండేవి. పెద్ద పెద్ద కొండల మీద ఈ ఊళ్లు ఉండేవి. ఆ కొండల్లో రాతి నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలను ఒక స్థాయి వరకు తవ్వేసి నదిని ఆ ఊళ్ల మీదకు మళ్లించేలే ప్రవాహ మార్గాన్ని మార్చారు. ఆ కొండల్లో ఉన్న రాయి ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్పిల్ వే నిర్మిస్తున్నారు. గోదావరి ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గంలో ఏం కడుతున్నారంటే... రాతి, మట్టి కట్టతో డ్యాం కడుతున్నారు. దానిని ఆంగ్లంలో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం అంటున్నారు. గోదావరి నది ప్రవాహాన్ని జలాశయంగా నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది. స్పిల్ వే నిర్మిస్తే ఇబ్బంది అనుకున్నారు కదా... రాతి, మట్టి కట్ట నిర్మించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అని సందేహం రావచ్చు. అలాంటి ఇబ్బంది రాకుండా నిర్మించిందే డయా ఫ్రం వాల్. గొప్పతనం ఏమిటి? పోలవరంలో గోదావరి నదికి అడ్డంగా ఏకంగా 1.5 మీటర్ల మందం(వెడల్పు)తో 1.38 కిలోమీటర్ల మేర నిర్మించినంత డయాఫ్రం వాల్ భారతదేశంలోనే లేదు. అంతే కాదు... నదిలో ఏకంగా దాదాపు 90 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్లి రాయిని పట్టుకుని ఆ రాయిలో నుంచి ఇలాంటి ఊటనీటి నియంత్రణ గోడ నిర్మించింది దేశంలోనే ఎక్కడా లేదు. విదేశాల్లో కూడా ఇంత లోతు నుంచి ఎక్కడా నిర్మించింది లేదని ఈ నిర్మాణాల్లో అనుభవం ఉన్న బావర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిర్మాణంలో అసలు సవాల్ ఏమిటి? ఊట నియంత్రణ గోడ నిర్మాణంలో దాదాపు 300 అడుగుల లోతు నుంచి కూడా నిటారుగా గోడ నిర్మించుకుంటూ రావాలి. అంటే 90 డిగ్రీల లంబకోణంలోనే ఆ నిర్మాణం ఉండాలి. ఎక్కడా చిన్నపాటి తేడా కూడా ఉండకూడదు. అది సరిగ్గా చేయడమే అసలు సవాల్. ఇందుకు ఉపయోగించిన యంత్రపరికరాలు, పని చేసిన వారి నైపుణ్యం, అనుభవమే ఇందులో కీలకమైంది. నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది? హైడ్రాలిక్ గ్రాబర్లు, బ్లాచింగ్ ప్లాంట్లు, ఎంసీ128 వంటి కట్టర్లు....ఇలా పెద్ద పెద్ద యంత్రపరికాలు వినియోగించారు. ఇక్కడ ఉన్నదంతా ఇసుకే. తవ్విన చోట ఆ ఇసుక పెచ్చులుగా ఊడితే నిర్మాణం కష్టం. అందుకే ఈ యంత్రాల సాయంతో తవ్వుతూ ఆ తవ్విన ప్రాంతంలో బెంటినైట్ ద్రావణం పోస్తూ రాయి తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్లారు. ఆ తవ్విన ఇసుక, మట్టి తదితరాలు పైకి తీసుకొచ్చేందుకు ఒక పంపు ఉంటుంది. ఆ ఖాళీ ఏర్పడ్డ ప్రదేశంలో ప్లాస్టిక్ కాంక్రీట్ నింపుతూ వెళ్లారు. ఇలా రాయి తగిలే వరకు వెళ్లారు. ఈ క్రమంలో ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. దేశంలో ఈ స్థాయి నిర్మాణం చేసిన గుత్తేదారు ఏజన్సీ లేకపోవడంతో జర్మన్ కంపెనీ బావర్‌ను రంగంలోకి దించి పనులు చేయించారు. బెంటినైట్ ద్రావణం ఎందుకు? లోతుకు తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు ఇసుకతో మళ్లీ పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అలా పెచ్చులూడి పడకుండా ఒకపక్క చుట్టూ బెంటినైట్ ద్రావణ నింపుతూ లోతుకు తవ్వుకుంటూ వెళ్తారు. ప్లాస్టిక్ కాంక్రీటు అంటే ఏమిటి? డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్ వాడారు అంటే ప్లాస్టిక్ వాడారని కాదు. సిమెంట్, ఇసుక, కంకరతో పాటు బెంటినైట్ పొడిని నీళ్లతో కలిపి జత చేస్తారు. దీని వల్ల కట్టడం గట్టిగా ఉంటుంది. భూకంపాలు వచ్చినప్పుడు ఆ ప్రభావాలను తట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక కర్ర స్కేలు గట్టిగా వంచితే విరిగిపోతుంది. అదే ప్లాస్టిక్ స్కేలును గట్టిగా వంచినా ఏ ప్రభావమూ పడదు. అంటే ఈ కాంక్రీటు వల్ల కాస్త సంకోచ, వ్యాకోచ గుణం ఉండి నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది. ఎన్ని రోజుల్లో, ఎలా నిర్మించారు? గోదావరిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకే ప్రవాహాలు తగ్గుతాయి. ఈ సవాళ్లను తట్టుకుంటూ 412 రోజుల్లో డయా ఫ్రం వాల్ నిర్మించారు. ఎంత ఖర్చయింది? రూ.430 కోట్లు ఖర్చు చేశారు. జర్మనీ నిర్మాణ సంస్థ బావర్‌కు ఈ పనిలో అనుభవం ఉంది. వారు ఎల్‌అండ్‌టి జియోతో కలిసి ఈ నిర్మాణ పనులు చేశారు. వరదలు వస్తే డయాఫ్రం వాల్‌కు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది ఉండదు. సాధారణంగా నదిపై ఉండే ఇసుక ఎప్పుడూ కోసుకుపోదు. వరద మరింత పూడికను తీసుకువచ్చి మేట వేసేలా చేస్తుంది. కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక రాతి, మట్టి కట్ట నిర్మాణమే! పూర్తయిన డయాఫ్రం వాల్‌పై ఇక 1.47 కిలోమీటర్ల పొడవునా రాతి, మట్టి కట్ట నిర్మాణం చేపడతారు. ఈ డ్యాం దిగువ భాగంలో దాదాపు వెయ్యి అడుగుల వెడల్పు ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అలా క్రమంగా తగ్గుతూ పైకి వచ్చేసరికి 50 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ నిర్మాణం 2019 డిసెంబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. డయాఫ్రం వాల్ అంటే...? నదిలో అడ్డుకట్టగా పెద్ద రాతి, మట్టి కట్ట కడుతున్న సమయంలో పునాది ఎలా నిర్మించాలి అనేది కీలకాంశం. ఊట నీరు అటు నుంచి ఇటు వైపునకు రాకుండా పకడ్బందీ ఏర్పాటు ఉండాలి. మన ఇంటికి పునాది ఎలాగో కరకట్టకు పునాది కూడా అంత పటిష్టంగా ఉండాలి. ఇందుకు అనేక విధానాలున్నాయి. పోలవరంలో డయాఫ్రం వాల్ పద్ధతి సరైంది అని తేల్చారు. ఇక్కడ చాలా లోతు వరకు ఇసుక ఉన్నందున ఆ ఇసుక గుండా నీటి ఊట అడ్డుకట్ట దాటుకుని వచ్చేసే ప్రమాదం ఉంది. అందుకే రాతిపొర తగిలే వరకు కూడా ఊట నియంత్రణ గోడ నిర్మించాల్సి వచ్చింది. ఆ గోడే డయాఫ్రం వాల్. ఇసుక పొరల్లో కట్టిందిలా.. గోదావరి గర్భంలో ఇసుక పొరల్లో నిర్మించేదే డయాఫ్రంవాల్. ఆ గోడ అంతా ఏకమొత్తంగా నిర్మించుకుంటూ రావడం సాధ్యం కాదు. అందుకని యంత్రాల సాయంతో తొలుత 7 మీటర్ల మేర తవ్వుతూ బెంటినైట్ ద్రావణం నింపుతూ వెళ్లారు. తవ్విన ప్రదేశంలోని ఇసుక, మట్టి, రాళ్లను అదే యంత్రం సాయంతో బయటకు తీసుకొచ్చేశారు. తిరిగి ప్లాస్టిక్ కాంక్రీటును ఆ ఖాళీ ప్రదేశంలో నింపారు. ఇలా ఏడేసి మీటర్ల చొప్పున నిర్మించడమే ఒక ప్యానల్. దాని పక్కన మళ్లీ 2.8 మీటర్లు వదిలేసి మళ్లీ మరో 7 మీటర్ల మేర తవ్వుకుంటూ గోడ నిర్మించారు. తర్వాత ఇలా మధ్యమధ్యలో 2.8 మీటర్ల మేర వదిలేసిన వాటిని తవ్వి అక్కడ గోడ కడతారు. పోలవరం ఏ రకంగా ప్రత్యేకం? పోలవరం ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు మళ్లించేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 13.56 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మించారు. అదే నాగార్జునసాగర్ 15.60 లక్షల క్యూసెక్కుల వరద మళ్లించేందుకు వీలుగా నిర్మించారు. పులిచింతల ప్రాజెక్టు 20 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించగలదు. ప్రకాశం బ్యారేజిని 12.12 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేయగలిగే సామర్థ్యంతో నిర్మించారు. దాదాపు 90 అడుగుల ఎత్తైన గేట్లు స్పిల్ వే 1.12 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు. వీటికి అమర్చే 48 గేట్లు ఒక్కోటి దాదాపు 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద తలుపులు దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఈ స్పిల్ వే నిర్మాణం తలుపులతో సహా 2019 మార్చి నాటికి పూర్తి కావాలనేది లక్ష్యం. KING007 1
sonykongara Posted June 14, 2018 Author Posted June 14, 2018 సవాళ్లకు సమాధానం పోలవరం డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు తొలి ఆలోచన 200 ఏళ్ల కిందటిదే. కరవును తరిమికొట్టడానికి కాటన్ హయాంలోనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆయన ఆలోచనల్లో మెరిసింది. క్రమేణా పేర్లు మార్చుకుంటూ పోలవరంగా మారింది. ఇంత చరిత్ర ఉన్న ఈ ఆధునిక దేవాలయానికి 1980లో శంకుస్థాపన జరిగినా ఎన్నో అభ్యంతరాలు... మరెన్నో అడ్డంకులు... లెక్కలేనన్ని సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్దాల కల సాకారమవుతున్న క్రమంలో పోలవరం ఇటీవల ఒక ముఖ్య మైలురాయిని దాటింది. అది ఇలాంటి, అలాంటి మైలురాయి కానేకాదు. పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సాంకేతికంగా ఏ సమస్య ఉందని గుర్తించి 1940 దశకంలో ‘అబ్బే సాధ్యం కాదు’ అని చెప్పారో ఆ సవాల్‌ను డయాఫ్రం వాల్ (నీటి ఊట నియంత్రణ గోడ) రూపంలో అధిగమించినట్లయింది. ఇంత కీలకమైన నిర్మాణం ఎన్ని రోజుల్లో.. ఎలా నిర్మించారు? ఇందులో ఏది సవాల్? ఈ నిర్మాణం ఎక్కడుంటుంది? దాని ఫలితం ఏమిటి అన్న సమగ్ర కథనం ఏమిటీ డయాఫ్రం వాల్? బొమ్మరాజు దుర్గాప్రసాద్ ఈనాడు, అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం... ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు కలల రూపం. సాగునీటికి మరింత భరోసాతో రైతన్న మోములో కనిపించే చిరునవ్వు. దానిని సాకారం చేసేందుకు కంకణబద్ధమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణంలో ఎదురవుతున్న పెను సవాళ్లకు అందివచ్చిన అత్యాధునిక సాంకేతికతతో సమాధానమిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. ఈ ప్రయాణంలో ఓ మేలి మలుపు.. పూర్తయిన డయాఫ్రంవాల్ నిర్మాణం. దీన్ని పూర్తి చేయడానికి అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అనుభవం అవసరమైందంటే ఇది ఎంతటి ఉత్కృష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కానీ చూద్దామంటే పైకి అంతగా ఏమీ కనిపించదు. ఎందుకంటే నిర్మాణమంతా జరిగేది భూఅంతర్భాగంలో. ఉపరితలంలో చిన్న సిమెంటు కాలిబాటలాంటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇది ప్రాజెక్టులో ముఖ్యమైన ఒక పెద్ద రాయి, మట్టి కట్ట నిర్మాణానికి కీలక భూమిక. అందుకే ప్రశ్నలు ఎన్నో. దీని పూర్వాపరాలు తెలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి ఉన్న నేపథ్యంలో సాంకేతికాంశాలతో ముడిపడిన అంశాలను వీలుమేరకు సరళంగా వివరించే ప్రయత్నమిది. నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి? డయాఫ్రం వాల్ గురించి తెలుసుకోవాలంటే అంతకంటే ముందుగా నీటిపారుదల ప్రాజెక్టు.. అందులో ఏమేమి భాగాలుంటాయో తెలుసుకోవాలి. ఏ ప్రాజెక్టునైనా నదిపై నిర్మిస్తారు. నీటిని నిల్వ చేసుకునేందుకు జలాశయం నిర్మిస్తారు. దీనికి కాలువలతో అనుసంధానం ఉంటుంది. ఈ జలాశయానికి స్పిల్ వే, మట్టికట్ట లేదా రాతి, మట్టికట్ట కూడా నిర్మిస్తారు. స్పిల్ వే అంటే ఏమిటి? నదిలో వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమపద్ధతిలో పొర్లిపోయేలా (స్పిల్ వే) బయటకు వదిలేసేందుకు నిర్మించే కట్టడమే ఇది. దీనికి తలుపులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రాజెక్టులో వరదలు వచ్చినప్పుడు తలుపులు ఎత్తి నీళ్లు వదలడం మనం చూస్తుంటాం. ఆ కట్టడమే స్పిల్ వే. ఏ స్థాయిలో నిర్మిస్తారు? స్పిల్ వే నిర్మించే ముందు వందల ఏళ్ల నది వరద ప్రవాహ చరిత్రను పరిశీలిస్తారు. ఒక్క రోజులో ఎంత పెద్ద వరద రావచ్చో అంచనా వేస్తారు. హఠాత్తుగా అంత వరద వస్తే ఆ కట్టడానికి ఏ ఇబ్బంది రాకుండా తలుపులు తెరిచి ఆ నీటిని సులభంగా దిగవకు వదిలేసే స్థాయిలో, అంత పటిష్ఠంగా ఈ స్పిల్ వే నిర్మిస్తారు. స్పిల్ వే విషయంలో పోలవరం ప్రత్యేకతలేమిటి? పోలవరం ప్రాజెక్టులో ఒక్క రోజులో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా గేట్లు ఎత్తి దిగువకు వరద వదిలేసేటంత సామర్థ్యంతో స్పిల్ వే నిర్మిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా జలాశయానికి స్పిల్ వే నది ప్రవహించే మార్గంలోనే, నది మధ్యలోకి వచ్చేలా నిర్మిస్తారు. కానీ పోలవరంలో అలా నిర్మించడం లేదు. ఎందుకని? ఎందుకంటే చాలా లోతువరకు ఇసుక ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్పిల్‌వే నిర్మాణం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. గోదావరిలో పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పుడో బ్రిటిష్ హయాం నుంచే ఉంది. ప్రాజెక్టు నిర్మించే క్షేత్రం చాలా సవాల్‌తో కూడినది. నదీ ప్రవాహాలపై అధ్యయనం చేసే అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ సంస్థ(యుఎస్‌ఆర్‌ఆర్) ఇక్కడ పరిశీలించి 1940కు ముందే ఇక్కడ స్పిల్ వే నిర్మాణం సరికాదని పేర్కొంది. కారణాలు ఏం చెప్పింది? యుఎస్‌ఆర్‌ఆర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన కీలకమైన సంస్థ. నదీ ప్రవాహ మార్గాలు...వాటిపై నిర్మాణాలకు సంబంధించి మంచి నైపుణ్యం ఉన్న సంస్థగా పేరుంది. పోలవరం వద్ద గోదావరిలో దాదాపు 100 అడుగుల నుంచి 300 అడుగుల వరకు దాదాపు కిలోమీటరు మేర మేటలు మేటలుగా ఉన్న ఇసుకను పరిశీలించారు. ఆ దిగువ ఎక్కడో రాతిపొరలు ఉన్న అంశాన్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గుర్తించిన క్షేత్రం కాంక్రీటు కట్టడం నిర్మాణానికి సరైనది కాదని, అక్కడ స్పిల్ వే నిర్మాణం సాధ్యం కాదని పేర్కొన్నారు. పైగా గోదావరి మహానది. అనేక నెలల పాటు వేల, లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఇంత మహా ప్రవాహాల నేపథ్యంలో ఒక కట్టడం నిర్మించడం అంత సులభమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇంతగా పూడుకుపోయిన ఇసుకలో స్పిల్ వేకు పునాదిగా నిర్మించే కాంక్రీటు నిర్మాణం సాధ్యం కాదని తేల్చింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలా అనే నిపుణుల తర్జనభర్జనలతో గోదావరిని మళ్లించి స్పిల్ వే స్థలాన్ని కూడా మార్చాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏం చేశారు? అక్కడ ఇలాంటి సమస్య రాలేదు. నది మధ్యలోనే స్పిల్ వే నిర్మించారు. అక్కడ నదిలో ఉన్న రాతి నేలల్లో నుంచి కాంక్రీటు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మరిప్పుడు ఏం చేస్తున్నారు? గోదావరి నది ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గాన్ని మళ్లిస్తున్నారు. గోదావరి కుడి గట్టుపై గతంలో ఏడు గ్రామాలు ఉండేవి. పెద్ద పెద్ద కొండల మీద ఈ ఊళ్లు ఉండేవి. ఆ కొండల్లో రాతి నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలను ఒక స్థాయి వరకు తవ్వేసి నదిని ఆ ఊళ్ల మీదకు మళ్లించేలే ప్రవాహ మార్గాన్ని మార్చారు. ఆ కొండల్లో ఉన్న రాయి ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్పిల్ వే నిర్మిస్తున్నారు. గోదావరి ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గంలో ఏం కడుతున్నారంటే... రాతి, మట్టి కట్టతో డ్యాం కడుతున్నారు. దానిని ఆంగ్లంలో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం అంటున్నారు. గోదావరి నది ప్రవాహాన్ని జలాశయంగా నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది. స్పిల్ వే నిర్మిస్తే ఇబ్బంది అనుకున్నారు కదా... రాతి, మట్టి కట్ట నిర్మించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అని సందేహం రావచ్చు. అలాంటి ఇబ్బంది రాకుండా నిర్మించిందే డయా ఫ్రం వాల్. గొప్పతనం ఏమిటి? పోలవరంలో గోదావరి నదికి అడ్డంగా ఏకంగా 1.5 మీటర్ల మందం(వెడల్పు)తో 1.38 కిలోమీటర్ల మేర నిర్మించినంత డయాఫ్రం వాల్ భారతదేశంలోనే లేదు. అంతే కాదు... నదిలో ఏకంగా దాదాపు 90 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్లి రాయిని పట్టుకుని ఆ రాయిలో నుంచి ఇలాంటి ఊటనీటి నియంత్రణ గోడ నిర్మించింది దేశంలోనే ఎక్కడా లేదు. విదేశాల్లో కూడా ఇంత లోతు నుంచి ఎక్కడా నిర్మించింది లేదని ఈ నిర్మాణాల్లో అనుభవం ఉన్న బావర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిర్మాణంలో అసలు సవాల్ ఏమిటి? ఊట నియంత్రణ గోడ నిర్మాణంలో దాదాపు 300 అడుగుల లోతు నుంచి కూడా నిటారుగా గోడ నిర్మించుకుంటూ రావాలి. అంటే 90 డిగ్రీల లంబకోణంలోనే ఆ నిర్మాణం ఉండాలి. ఎక్కడా చిన్నపాటి తేడా కూడా ఉండకూడదు. అది సరిగ్గా చేయడమే అసలు సవాల్. ఇందుకు ఉపయోగించిన యంత్రపరికరాలు, పని చేసిన వారి నైపుణ్యం, అనుభవమే ఇందులో కీలకమైంది. నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది? హైడ్రాలిక్ గ్రాబర్లు, బ్లాచింగ్ ప్లాంట్లు, ఎంసీ128 వంటి కట్టర్లు....ఇలా పెద్ద పెద్ద యంత్రపరికాలు వినియోగించారు. ఇక్కడ ఉన్నదంతా ఇసుకే. తవ్విన చోట ఆ ఇసుక పెచ్చులుగా ఊడితే నిర్మాణం కష్టం. అందుకే ఈ యంత్రాల సాయంతో తవ్వుతూ ఆ తవ్విన ప్రాంతంలో బెంటినైట్ ద్రావణం పోస్తూ రాయి తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్లారు. ఆ తవ్విన ఇసుక, మట్టి తదితరాలు పైకి తీసుకొచ్చేందుకు ఒక పంపు ఉంటుంది. ఆ ఖాళీ ఏర్పడ్డ ప్రదేశంలో ప్లాస్టిక్ కాంక్రీట్ నింపుతూ వెళ్లారు. ఇలా రాయి తగిలే వరకు వెళ్లారు. ఈ క్రమంలో ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. దేశంలో ఈ స్థాయి నిర్మాణం చేసిన గుత్తేదారు ఏజన్సీ లేకపోవడంతో జర్మన్ కంపెనీ బావర్‌ను రంగంలోకి దించి పనులు చేయించారు. బెంటినైట్ ద్రావణం ఎందుకు? లోతుకు తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు ఇసుకతో మళ్లీ పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అలా పెచ్చులూడి పడకుండా ఒకపక్క చుట్టూ బెంటినైట్ ద్రావణ నింపుతూ లోతుకు తవ్వుకుంటూ వెళ్తారు. ప్లాస్టిక్ కాంక్రీటు అంటే ఏమిటి? డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్ వాడారు అంటే ప్లాస్టిక్ వాడారని కాదు. సిమెంట్, ఇసుక, కంకరతో పాటు బెంటినైట్ పొడిని నీళ్లతో కలిపి జత చేస్తారు. దీని వల్ల కట్టడం గట్టిగా ఉంటుంది. భూకంపాలు వచ్చినప్పుడు ఆ ప్రభావాలను తట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక కర్ర స్కేలు గట్టిగా వంచితే విరిగిపోతుంది. అదే ప్లాస్టిక్ స్కేలును గట్టిగా వంచినా ఏ ప్రభావమూ పడదు. అంటే ఈ కాంక్రీటు వల్ల కాస్త సంకోచ, వ్యాకోచ గుణం ఉండి నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది. ఎన్ని రోజుల్లో, ఎలా నిర్మించారు? గోదావరిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకే ప్రవాహాలు తగ్గుతాయి. ఈ సవాళ్లను తట్టుకుంటూ 412 రోజుల్లో డయా ఫ్రం వాల్ నిర్మించారు. ఎంత ఖర్చయింది? రూ.430 కోట్లు ఖర్చు చేశారు. జర్మనీ నిర్మాణ సంస్థ బావర్‌కు ఈ పనిలో అనుభవం ఉంది. వారు ఎల్‌అండ్‌టి జియోతో కలిసి ఈ నిర్మాణ పనులు చేశారు. వరదలు వస్తే డయాఫ్రం వాల్‌కు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది ఉండదు. సాధారణంగా నదిపై ఉండే ఇసుక ఎప్పుడూ కోసుకుపోదు. వరద మరింత పూడికను తీసుకువచ్చి మేట వేసేలా చేస్తుంది. కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక రాతి, మట్టి కట్ట నిర్మాణమే! పూర్తయిన డయాఫ్రం వాల్‌పై ఇక 1.47 కిలోమీటర్ల పొడవునా రాతి, మట్టి కట్ట నిర్మాణం చేపడతారు. ఈ డ్యాం దిగువ భాగంలో దాదాపు వెయ్యి అడుగుల వెడల్పు ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అలా క్రమంగా తగ్గుతూ పైకి వచ్చేసరికి 50 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ నిర్మాణం 2019 డిసెంబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. డయాఫ్రం వాల్ అంటే...? నదిలో అడ్డుకట్టగా పెద్ద రాతి, మట్టి కట్ట కడుతున్న సమయంలో పునాది ఎలా నిర్మించాలి అనేది కీలకాంశం. ఊట నీరు అటు నుంచి ఇటు వైపునకు రాకుండా పకడ్బందీ ఏర్పాటు ఉండాలి. మన ఇంటికి పునాది ఎలాగో కరకట్టకు పునాది కూడా అంత పటిష్టంగా ఉండాలి. ఇందుకు అనేక విధానాలున్నాయి. పోలవరంలో డయాఫ్రం వాల్ పద్ధతి సరైంది అని తేల్చారు. ఇక్కడ చాలా లోతు వరకు ఇసుక ఉన్నందున ఆ ఇసుక గుండా నీటి ఊట అడ్డుకట్ట దాటుకుని వచ్చేసే ప్రమాదం ఉంది. అందుకే రాతిపొర తగిలే వరకు కూడా ఊట నియంత్రణ గోడ నిర్మించాల్సి వచ్చింది. ఆ గోడే డయాఫ్రం వాల్. ఇసుక పొరల్లో కట్టిందిలా.. గోదావరి గర్భంలో ఇసుక పొరల్లో నిర్మించేదే డయాఫ్రంవాల్. ఆ గోడ అంతా ఏకమొత్తంగా నిర్మించుకుంటూ రావడం సాధ్యం కాదు. అందుకని యంత్రాల సాయంతో తొలుత 7 మీటర్ల మేర తవ్వుతూ బెంటినైట్ ద్రావణం నింపుతూ వెళ్లారు. తవ్విన ప్రదేశంలోని ఇసుక, మట్టి, రాళ్లను అదే యంత్రం సాయంతో బయటకు తీసుకొచ్చేశారు. తిరిగి ప్లాస్టిక్ కాంక్రీటును ఆ ఖాళీ ప్రదేశంలో నింపారు. ఇలా ఏడేసి మీటర్ల చొప్పున నిర్మించడమే ఒక ప్యానల్. దాని పక్కన మళ్లీ 2.8 మీటర్లు వదిలేసి మళ్లీ మరో 7 మీటర్ల మేర తవ్వుకుంటూ గోడ నిర్మించారు. తర్వాత ఇలా మధ్యమధ్యలో 2.8 మీటర్ల మేర వదిలేసిన వాటిని తవ్వి అక్కడ గోడ కడతారు. పోలవరం ఏ రకంగా ప్రత్యేకం? పోలవరం ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు మళ్లించేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 13.56 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మించారు. అదే నాగార్జునసాగర్ 15.60 లక్షల క్యూసెక్కుల వరద మళ్లించేందుకు వీలుగా నిర్మించారు. పులిచింతల ప్రాజెక్టు 20 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించగలదు. ప్రకాశం బ్యారేజిని 12.12 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేయగలిగే సామర్థ్యంతో నిర్మించారు. దాదాపు 90 అడుగుల ఎత్తైన గేట్లు స్పిల్ వే 1.12 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు. వీటికి అమర్చే 48 గేట్లు ఒక్కోటి దాదాపు 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద తలుపులు దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఈ స్పిల్ వే నిర్మాణం తలుపులతో సహా 2019 మార్చి నాటికి పూర్తి కావాలనేది లక్ష్యం.
RKumar Posted June 14, 2018 Posted June 14, 2018 ee news paper lo kooda intha detailed ga veyyaru it shows standards of other news papers.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now