Jump to content

Recommended Posts

Posted (edited)
32 minutes ago, Yaswanth526 said:

http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1688906/643cd17a-1696-4276-b6e1-c06f6b3a6147

this news misleading and fake news

lower and upper cofferdam jet grouting  will be completed by june ending

lower and upper cofferdam  construction will be started in  october/november after godavari flood reduced. cofferdams will get completed by june 2019.  ecrf(earth cum rock fill dam) construction will be started in november/december . ecrf will completed by 2019 december. ecrf dam height 176 feet around 53.5 meters. spillway full reservoir level 150 feet

don't read andhrajyothy for issues like irrigation and any development projects. he write articles with halfknowledge. only eenadu/etv reliable for issues.

andhrajyothy useful for reading gossips and boothu. 

Edited by ravindras
Posted
  •  పోలవరానికి రూ.1400 కోట్లు.. నాబార్డు ద్వారా విడుదల
అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): అదిగో... ఇదిగో అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న రూ.1400 కోట్ల నాబార్డు నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి విడుదల చేస్తూ గురువారం కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ‘పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చులో రూ.1098 కోట్లు, మరో రూ.302 కోట్లు... మొత్తం 1400 కోట్లను విడుదల చేస్తున్నాం’ అంటూ గత ఏడాది డిసెంబరు నుంచి పదేపదే ప్రకటనలు వెలువడుతున్నాయి. రూ.1098 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో రాష్ట్రానికి కేంద్రం మరో లేఖ పంపింది. కానీ.. డబ్బులు మాత్రం చేతికి అందలేదు. నిధుల కోసం రాష్ట్రం పదే పదే లేఖలు రాస్తూ ఒత్తిడి పెంచుతోంది. అయితే... తమతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రాజెక్టుల కమిషనర్‌ మధ్య పోలవరం ప్రాజెక్టు రుణ ఒప్పందం కొత్తగా జరగాలని నాబార్డు మెలిక పెట్టింది. ఎట్టకేలకు నెలన్నర తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. దీంతో గురువారం 1400 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వు జారీచేసింది. వాప్కో్‌సకు ఇవ్వాల్సిన రూ.15 కోట్లను మినహాయించుకుని మిగిలిన రూ.1385 కోట్లను ఏపీకి విడుదల చేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో... 2010-11 అంచనా వ్య యం రూ.16,010.45 కోట్లలో ఇంకా రావాల్సిన రూ.450 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ కోసం బిల్లులను ఏపీ జలవనరుల శాఖ పంపనున్నది.
 
ఢిల్లీకి అధికారులు...
పోలవరం తుది అంచనా వ్యయం రూ.58,319.06 కోట్లను ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వారంలో ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రం లేవనెత్తిన సందేహాలన్నింటిని నివృత్తి చేసినందున కొత్త అంచనాలకు ఆమోద ముద్ర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Posted
పోలవరం నిధులు ఎట్టకేలకు విడుదల
పీపీఏ ఖాతాకు చేరిన రూ.1400 కోట్లు
తొలి డీపీఆర్‌ ప్రకారం రాష్ట్రానికి రావాల్సింది రూ.395 కోట్లే
కొత్త డీపీఆర్‌కు ఆమోదంలో జాప్యం
అనిశ్చితి కొనసాగితే నిధుల కొరత తలెత్తే ప్రమాదం
దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి
ఈనాడు - దిల్లీ
8ap-main3a.jpg
పోలవరం ప్రాజెక్టు కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన రూ.1,400 కోట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మొత్తం శుక్రవారం ప్రాజెక్టు అథారిటీ ఖాతాలో జమయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం తిరిగి చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31లోపే (2017-18 ఆర్థిక సంవత్సరం) రూ.1400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిధుల సమీకరణ కోసం నాబార్డుకు అనుమతినిచ్చినా వివిధ కారణాల వల్ల అది ఆ పని చేయలేకపోయింది. కాలక్రమంలో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో పాత సంవత్సరంలో ఇచ్చిన అనుమతులకు కాలదోషం పట్టింది. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి నిధుల సమీకరణకు నాబార్డుకు అనుమతిస్తూ మేలో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటినుంచి   నిధుల సమీకరణ కోసం నాబార్డు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి నిధులు ప్రాజెక్టు అథారిటీ ఖాతాకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మరో రూ.766 కోట్ల బిల్లులు ప్రస్తుతం ప్రాజెక్టు అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిశీలించి కేంద్ర జలవనరుల శాఖకు పంపితే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ కేంద్రం పాత డీపీఆర్‌ ప్రకారమే ఇస్తోంది. కొత్త డీపీఆర్‌కు ఆమోదముద్ర వేయలేదు. పాత డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం అంచనా వ్యయం రూ.12,294 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందే దీనిపై రూ.5,136 కోట్లు వెచ్చించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని లోగడే కేంద్రం స్పష్టం చేసింది. అదిపోగా మిగిలిన రూ.7,158 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకూ ప్రస్తుత రూ.1,400 కోట్లతో కలిపి రూ.6,764 కోట్లు చెల్లించినట్లయింది. ఇక మిగిలింది రూ.395 కోట్లు మాత్రమే. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదించకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి కేవలం రూ.395 కోట్లు మాత్రమే వస్తుంది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక సహాయ, పునరావాస ఖర్చులు పెరిగిపోవడం, 2014 జూన్‌ 2నాటికి ఉన్న ధరల ప్రకారం సాగునీటి విభాగం నిర్మాణ ఖర్చును కేంద్రం భరిస్తుందని హామీనివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.53వేల కోట్లతో సవరించిన అంచనాలు పంపింది. అందులో సహాయ, పునరావాసానికి రూ.33,225 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,509.46 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సవరించిన అంచనాలపై సీడబ్ల్యూసీలో ఇప్పటికే పలు దఫాలు చర్చించారు. అది వేసిన కొర్రీలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం పంపింది. అయినప్పటికీ ఇంతవరకూ దానికి ఆమోదముద్ర వేసే విషయంలో సానుకూలత కనిపించడం లేదు. ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తే మాత్రం మున్ముందు పోలవరానికి నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈ ఏడాదికి తాత్కాలిక ప్రాతిపదికన పోలవరానికి రూ.10వేల కోట్లు విడుదల చేయాలంటూ లేఖ రాయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సవరించిన అంచనాలు  ఆమోదించేంత  వరకూ నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమయ్యే ప్రమాదం ఉన్నందున తాత్కాలికంగా రూ.10వేల కోట్లకు అనుమతినిచ్చి డీపీఆర్‌కు అంతిమ ఆమోదం పొందాక ఈ మొత్తాన్ని అందులో సర్దుబాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం.
రూ.10 వేల కోట్లు ఇవ్వండి
నితిన్‌గడ్కరీకి దేవినేని లేఖ
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఆమోదించే లోపు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో విన్నవించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1400 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
 
Posted

జయహో పోలవరం... 496 రోజుల్లో రికార్డు... పోలవరం పనుల్లో పూర్తయిన కీలక ఘట్టం...

Super User
10 June 2018
Hits: 82
 
polavaram-10062018-1.jpg
share.png

ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమించింది. అమలుకు నోచని విభజన హామీలతో అభద్రతాభావంలో కూరుకుపోయిన ఆంధ్ర జాతికి ఇప్పుడు పోలవరం ప్రాణనాడి కాబోతోంది. ఆల్మట్టి నిర్మాణంతో ఆకా రం కోల్పోయిన కృష్ణా బేసిన్‌కు జీవనాడై ఊపిరులు ఊదబోతోంది. అడుగడుగు విఘ్నాలతో ప్రాజెక్టుపై ప్రజలు ఆశలు కోల్పోతున్న దశ లో ఈ విళంబి నామ సంవత్సరంలో పోలవరం ఊహలకు అందని ప్రొగ్రెస్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటు తుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

 

polavaram 10062018 2

నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుం డడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై పలు హామీ లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంపై నానాటికీ ఆశలు కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో సింహభాగం పోలవరానికే కేటాయించి అయినా వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

polavaram 10062018 3

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 23 సార్లు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన ఆయన ఈ నెల 18న మరోసారి పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు. అదే రోజున ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న డయాఫ్రమ్‌ వాల్‌ను ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రతి సోమ వారం క్రమం తప్పకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జాప్యానికి గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణంగా భావించిన ప్రభుత్వం ఆ పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు బదిలీ చేసింది. అప్పటి నుంచే పనుల్లో కూడా కదలిక వచ్చినట్లు కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటి వరకు 55 శాతానికి చేరుకోగా అందులో సగ భాగం గడిచిన 5 నెలల కాలంలోనే జరగడంతో లక్ష్యానికి తగ్గట్టుగా అనుకున్న సమయానికి పనులు పూర్తయితాయన్న ఆశాభావం ప్రభుత్వంలో కనిపిస్తోంది. 4వేల మంది కార్మికులు, 150 మంది ఇంజనీర్లు, అత్యాధునిక యంత్రాలతో యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్న తీరును బట్టి ముఖ్యమంత్రి ఆశయం నెరవేరే అవకాశం మెండుగానే కనిపిస్తుంది.

496 రోజుల వ్యవధిలోనే 1400 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌ పని పూర్తికావడం పోలవరం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అతి తక్కువ సమయంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తికావడం పట్ల ముఖ్యమంత్రి పూర్తి సంతృప్తితో ఉన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ను ఈనెల 18న జాతికి అంకితం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన స్పిల్‌వే పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే సగ భాగం పూర్తి అయింది. ఇప్పటివరకు రోజుకు 3వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతుండగా, రోజుకు 4వేల క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగేలా అదనపు యంత్రాలను రం గంలోకి దించారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి కాగా, ఇందుకు సమాంతరంగా కాపర్‌డ్యామ్‌ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇదిలా ఉండగా పోలవరం ప్రధాన కుడికాలువ పనులు 93 శాతం పూర్తికాగా, ఎడమ కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికే పోలవరం ప్రాజెక్టుపనులు పూర్తిచేసి , గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Posted (edited)
5 minutes ago, AbbaiG said:

Happy tears

3 years ago this looked like an impossible job.

Focus will be back on spillway and spill channel. Polavaram going to be a reality soon  :jackson:

choosing right contractor reduces lot of headaches to government

hatsoff to navayuga, l&t, bauer , thriveni, keller

fuckoff transstroy 

i hope cbn will choose right contractors for pending & future projects, even if they quote little higher price.

cbn shouldn't tolerate incompetent contractors even if they belongs to tdp

Edited by ravindras
Posted (edited)
8 minutes ago, AbbaiG said:

Happy tears

3 years ago this looked like an impossible job.

Focus will be back on spillway and spill channel. Polavaram going to be a reality soon  :jackson:

malli nekkanti gari tho matladera bro emi annaru

Edited by sonykongara
Posted
Just now, sonykongara said:

malli nekkanti gari tho matladera bro emi annadu

ee madya kalava ledu. 18th try chestam

Posted
18 minutes ago, ravindras said:

choosing right contractor reduces lot of headaches to government

 

Rosiah, Kiran Kumar Reddy lu andhrollaki chesina anyayam adi

 Donga L@&^%$# *&^%$ chesina papam valla pillalaki tagalaka podu le

Posted
9 hours ago, AbbaiG said:

Rosiah, Kiran Kumar Reddy lu andhrollaki chesina anyayam adi

 Donga L@&^%$# *&^%$ chesina papam valla pillalaki tagalaka podu le

Rosaiah emi chesadu. KKR ayithe ichhindi project ayithe last 2 years rule chesindi KKR.

Posted
13 minutes ago, RKumar said:

Rosaiah emi chesadu. KKR ayithe ichhindi project ayithe last 2 years rule chesindi KKR.

 

Rosaiaha ki pillalu leru le. (penchukunnatlunnadu). andukani annaremo le. light teesukondi.

Posted
10 hours ago, ravindras said:

choosing right contractor reduces lot of headaches to government

hatsoff to navayuga, l&t, bauer , thriveni, keller

fuckoff transstroy 

i hope cbn will choose right contractors for pending & future projects, even if they quote little higher price.

cbn shouldn't tolerate incompetent contractors even if they belongs to tdp

Naa perception different...

Doesn't matter good or bad...

As long as govt is strict

Posted
13 hours ago, ravindras said:

choosing right contractor reduces lot of headaches to government

hatsoff to navayuga, l&t, bauer , thriveni, keller

fuckoff transstroy 

i hope cbn will choose right contractors for pending & future projects, even if they quote little higher price.

cbn shouldn't tolerate incompetent contractors even if they belongs to tdp

CBN didn’t select transstroy

Posted
అసాధ్యం సుసాధ్యమైంది 
కీలకమైన ’పోలవరం’ డయాఫ్రమ్‌వాల్‌ పూర్తి 
అందివచ్చిన ఆధునిక సాంకేతికత 
412 రోజులు.. 1396.60 మీటర్ల పొడవునా నిర్మాణం 
నేడు పైలాన్‌ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 
పోలవరం - న్యూస్‌టుడే 
10ap-main1a.jpg
ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న గోదావరి గట్టును ఆనుకుని నిర్మించే డయాఫ్రమ్‌వాల్‌లో ఒక భాగం ఇది. నిర్మాణం పొడవు మొత్తం 1396.60 మీటర్లు. వెడల్పు 1.5 మీటర్లు (ఐదు అడుగుల మందం). నదీ గర్భం లోతు 40 మీటర్ల నుంచి 93.50 మీటర్లు ఉంటుంది. లోపల రాయి తగిలే వరకు వెళ్లడంతో సరిపెట్టలేదు. రాయి తగిలిన తరువాత అందులోనే మరో రెండు మీటర్ల దిగువకు వెళ్ళి అక్కడ నుంచి కాంక్రీట్‌ వేసుకుంటూ వచ్చారు. పనిపూర్తవడంతో ఆదివారం యంత్ర సామగ్రిని తరలించే పని చేపట్టారు. మరోవైపు పోలవరంలో అన్ని విభాగాల్లో కలిపి ఆదివారం ఒక్కరోజు రికార్డు స్థాయిలో 8,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరిగింది.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పూర్తైంది. అసాధ్యం అనుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి సుసాధ్యం చేశారు. మొత్తం రెండు సీజన్లలో దీన్ని పూర్తిచేయగలిగారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి 412 రోజులు బాగా శ్రమించి రూ.430 కోట్లతో ఈ పనిని పూర్తి చేశారు. సోమవారం ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఏర్పాటు చేసిన ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. గోదావరి నది గర్భంలో నిర్మించే డయాఫ్రమ్‌వాల్‌ ఇంటి నిర్మాణానికి పునాది ఎలాగో  ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్‌ అలాంటిది. దీనిపై మట్టి, రాయితో 150 అడుగుల ఎత్తున ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌డ్యామ్‌ను నిర్మిస్తారు. ఇందులో 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు దిగువన 93 మీటర్ల లోతువరకూ లీక్‌ కాకుండా ఈ వాల్‌ అడ్డుకుంటుంది. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమైనది. దీని నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వాడడం మరో ముఖ్యాంశం. సిమెంటు, ఇసుక అందులో తక్కువ మోతాదులో కంకర వేసి బెంటోనైట్‌ మిశ్రమాన్ని కలపడాన్ని ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా వ్యవహరిస్తారు. ఇది కాంక్రీట్‌ లాగే పూర్తిస్థాయిలో గట్టి పడుతుంది. నదీ గర్భంలో జరిగే మార్పులకు తట్టుకుంటుంది. విపత్తులు వచ్చి నదీ గర్భంలో దీనిపై ఒత్తిడి పెరిగినా అందుకనుగుణంగా రూపాంతరం సంతరించుకునే అవకాశం ఉంది.

ఆధునిక సాంకేతికతతో... ఏళ్ళ తరబడి కలగా మిగిలిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి గోదావరి నదిపై అడ్డుకట్ట నిర్మాణమే. సాంకేతికత అంతగా లేని ఆ రోజుల్లో ఏటా విరుచుకుపడే గోదారమ్మను నిలువరించడం సాధ్యమా అన్న ప్రశ్న ఆనాడు ఎదురైంది. నదీగర్భంలో రాయి తగిలేవరకు వెళ్ళి అక్కడ నుంచి కాంక్రీట్‌ వేసుకురావడం జరగని పని అనుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇది సుసాధ్యమైంది. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ బావర్‌ కంపెనీతో ట్రాన్స్‌స్ట్రాయ్‌ గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమజర్మనీ నుంచి ఆధునిక యంత్ర పరికరాలు గ్రాబర్‌లు, కట్టర్‌లు, భారీ క్రేన్‌లు తెప్పించారు. ఆ దేశానికి చెందిన నిపుణులే పోలవరంలో మకాం వేసి పనులు చేపట్టారు. నదీగర్భంలో తీసిన ప్రతి ప్యానల్‌ వివరాలు జర్మనీ కంపెనీతో అనుసంధానించి వారు అనుమతి ఇచ్చిన తరువాతే కాంక్రీట్‌ పనులు ప్రారంభించేవారు. ఇక ప్రతి ప్యానల్‌లో వేసిన కాంక్రీట్‌ నమూనాలు తీసి చెన్నైలోని ఎల్‌అండ్‌టీ ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేయించారు. దీనంతటికీ కారణం భవిష్యత్తులో 194 టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ చేసినప్పుడు ఆ నీరు నదీగర్భం నుంచి సీపేజ్‌ (లీకు) కాకూడదని, భూకంపాలను తట్టుకోవాలని, డయాఫ్రమ్‌వాల్‌పై నిర్మించే మట్టి, రాయి కట్టడానికి ఎటువంటి అవరోధాలు కలగకూడదని. భూకంపం వచ్చి సంకోచ, వ్యాకోచాలు చెందినా గోడ యథాస్థితికి మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. మొత్తం 1.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.

* 2017 ఫిబ్రవరి ఒకటిన పనులు ప్రారంభించి తొలుత జులై 24 వరకు పని చేశారు. గోదావరిలో నీరు పెరగడం, వాతావరణం సహకరించక పోవడంతో పనులు నిలిపివేసి యంత్రాలను ఒడ్డుకు ఎక్కించారు. వరదలు తగ్గిన తరువాత 2017 అక్టోబరు 9న ప్రారంభించి నవంబరు 15 వరకు పని చేశారు. అనివార్య కారణాల వలన పనులు నిలిచిపోవడంతో నవంబరు 20న తిరిగి ప్రారంభించి 2018 జూన్‌ తొమ్మిది నాటికి మిగిలిన పనుల్ని పూర్తి చేశారు.

Posted
  • కాంక్రీట్‌ పనుల్లో రికార్డు బద్దలు
  • 16 గంటల్లో 8 వేల క్యూబిక్‌ మీటర్ల పని
  • కాళేశ్వరం రికార్డును అధిగమించిన వైనం
  • 24 గంటల్లో పదివేల క్యూబిక్‌ మీటర్లకు పైనే
  • త్వరలో త్రీగోర్జెస్‌ రికార్డూ చెరిపేస్తామని ధీమా
  • ‘జల-జీవ నాడి’లో నేడు మరో చరిత్ర
  • డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం సంపూర్ణం
  • రాతి-మట్టి కట్ట పనులకు గ్రీన్‌ సిగ్నల్‌
  • నేడు పోలవరానికి సీఎం.. పైలాన్‌ ఆవిష్కరణ
(అమరావతి/ఏలూరు - ఆంధ్రజ్యోతి)
నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాదు... త్వరలో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ రికార్డునూ అధిగమిస్తామని ‘నవయుగ’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని ఆదివారం పోలవరం ప్రాజెక్టు అధిగమించింది.
 
 
ఉదయం 7 గంటల నుంచి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లలో నిరాటంకంగా కాంక్రీట్‌ పనులు కొనసాగాయి. రాత్రి 11 గంటలకల్లా... అంటే 16 గంటల్లో 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ప్రాజెక్టులో ఉపయోగించారు. జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. అంతేకాదు... సోమవారం ఉదయానికి మరో 4వేల క్యూబిక్‌ మీటర్ల పని జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అంటే... పదివేల క్యూబిక్‌ మీటర్లను కూడా అధిగమించి, ప్రపంచ రికార్డును సమీపిస్తారన్న మాట! అతి త్వరలోనే ప్రపంచ రికార్డు అయిన త్రీగోర్జె్‌సనూ అధిగమిస్తామని నవయుగ ఎండీ శ్రీధర్‌ తెలిపారు. చైనాలోని త్రీగోర్జె్‌సలో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేశారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రమేశ్‌బాబు పేర్కొన్నారు. కొత్త చరిత్ర సృష్టించిన నవయుగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.
 
 
మరో ఘట్టానికి సిద్ధం
పోలవరం ప్రాజెక్టులో ఒక కీలకఘట్టం ముగిసింది. మరో ముఖ్యమైన దశ ప్రారంభం కానుంది. ప్రాజెక్టు పటిష్ఠతను కాపాడేలా నదీగర్భంలో నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌ పనులు ఆదివారం పూర్తయ్యాయి. అదే సమయంలో... కీలకమైన ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ (రాతి-మట్టి కట్ట - ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పనులు పూర్తికావడంతో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ... పోలవరం ప్రాజెక్టు వద్ద సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఇదే సందర్భంలో ప్రాజెక్టు ప్రగతిని కూడా సమీక్షిస్తారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నదీ జలాలను స్పిల్‌వే వైపు మళ్లించేందుకు ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు పునాదిలాంటి డయా ఫ్రమ్‌వాల్‌! గోదావరి నదీ గర్భంలో రాతి పొర వచ్చేదాకా లోపలికి ఇసుకను తొలుస్తూ వెళ్లి... అక్కడి నుంచి ఒకటిన్నర మీటర్ల మందంతో.. 1750 మీటర్ల పొడవునా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. కనిష్ఠంగా 40 మీటర్లు... గరిష్ఠంగా 93.5 అడుగుల లోతు నుంచి డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. అతి సంక్లిష్టమైన ఈ నిర్మాణం కేవలం 414 రోజుల్లోనే పూర్తయింది.
 
 
దీంతో... ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ ఎత్తు 53 మీటర్లు. 1750 మీటర్ల పొడవున నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ కోసం 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయినీ మట్టినీ వాడుతారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇదో పెద్ద కొండను తలపిస్తుంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నదీ జలాలను స్పిల్‌ వే దిశగా మళ్లిస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గేట్ల బిగింపు పూర్తయితే.. గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయి. అయితే... ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదావరికి కొత్త నీరు తరలి వస్తుంది. అందువల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభిస్తారు. రెండు సీజన్లు అంటే... 2019 డిసెంబరు నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
 
 
కేంద్రం సహకరించకున్నా...
పోలవరాన్ని రాష్ట్ర జల-జీవ నాడిగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. కేంద్రం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ... తగిన సహకారం మాత్రం అందించడంలేదు. కొత్త భూసేకరణ చట్టం మేరకు అంచనాలను ఇప్పటిదాకా ఆమోదించలేదు. ప్రాజెక్టుపై పెట్టిన రాష్ట్రం పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. డిజైన్ల ఆమోదంలో కొత్త సందేహాలు లేవనెత్తుతూ, మెలికలు పెడుతూనే ఉంది. అయినా... రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. లోటుపాట్లను సమీక్షిస్తూ వాటిని సరిదిద్దుతోంది.
 
 
కాంక్రీట్‌ పనులు మందగించిన నేపథ్యంలో... పాత ధరలకే వాటిని చేపట్టేలా ‘నవయుగ’ సంస్థను ఒప్పించింది. నవయుగ రంగంలోకి దిగిన తర్వాత కాంక్రీట్‌ పనులు జోరందుకున్నాయి. పోలవరంపై కేంద్రం సహాయ నిరాకరణ కొనసాగుతున్నా... ఢిల్లీ నుంచి వస్తున్న వివిధ అధికార కమిషన్లు, సంఘాలు మాత్రం పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. భూ సేకరణపై కేంద్ర గిరిజన కమిషన్‌, గిరిజన పార్లమెంటరీ కమిటీ, కేంద్ర జల సంఘంతో సహా పలు కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోని అధికారుల బృందాలు క్షేత్ర స్థాయి సమీక్షలు నిర్వహించాయి. భూ సేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలపై ఈ బృందాలన్నీ సంతృప్తిని వ్యక్తం చేశాయి.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...