Jump to content

Recommended Posts

Posted (edited)

st commission r&r is responsibility of state government.

state should provide atleast 2.5 acres to st family or equivalent to land acquired from family .as per my understanding, suppose st family has no land government should give land 2.5 acres . if government acquire 6 acres from st family government should give 6 acres land to that family . this land should  be under polavaram command area. ie land irrigated under polavaram left/right canal should be given to st families.

http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=180357

Edited by ravindras
Posted
దిగువ కాఫర్‌ డ్యాంకు వరద ముప్పు
10-07-2018 02:52:08
 
ఏలూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో గోదావరి వద్ద ఉధృతి పెరుగుతోంది. దీనిప్రభావం దిగువ కాఫర్‌ డ్యాం పనులపై పడనుంది. సోమవారం నాటికే భద్రాచలం వద్ద గోదావరి వరద మట్టం 17 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు స్థలిలో 16.1 మీటర్ల మేర వరద నమోదైంది. దీంతో కాఫర్‌ డ్యాం పనులకు కాస్తంత విరామం తప్పదని అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఇంకో 248.5 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేస్తే, ఈ డ్యాం పూర్తయిపోతుంది. గడ్కరీ వచ్చేలోపే ఆ కాస్త పనులు ముగించుకోవాలని అధికారులు, సిబ్బంది ప్రయత్నించినా.. అది వీలు కాని పరిస్థితే కనిపిస్తోంది.
Posted
సీఎం సమక్షంలోనే సమీక్షిస్తా: గడ్కరీ
10-07-2018 02:52:21
 
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే పోలవరం పనులపై సమీక్ష చేస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఢిల్లీలోని గడ్కరీ కార్యాలయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే సమాచారం అందించింది. గడ్కరీ బుధవారం ఉదయం సీఎంతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులు సమీక్షిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్ట్టర్‌లో పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే జరుపుతారు. సాయంత్రం 5.20 గంటలకు రాజమండ్రికి చేరుకొని, ప్రత్యేక విమానంలో విశాఖకు వెళతారు. గురు, శుక్రవారం విశాఖలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని, ఢిల్లీకి వెళ్లిపోతారు.
Posted
పోలవరం పరిశీలనకు గడ్కరీ, చంద్రబాబు..
10-07-2018 15:34:45
 
636668336842874321.jpg
విజయవాడ: రేపు(బుధవారం) పోలవరం ప్రాజెక్ట్ పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఏబీఎన్‌తో మంత్రి మాట్లాడుతూ సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామన్నారు. రూ.57 వేల కోట్లతో అంచనాలు సవరించినట్లు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెరిగాయన్నారు. అంచనాలు 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు స్పష్టం చేశారు. తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని గడ్కరీని కోరుతామన్నారు. పూర్తయిన పనుల్లో కేంద్రం నుంచి రూ.2300 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. పోలవరం అథారిటీకి బిల్లులు సమర్పించామన్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి చేశామని, గోదావరి వరదతో పనులు ఆగలేదని మంత్రి వెల్లడించారు.
Posted
రైట్‌ రైట్‌..!
10-07-2018 02:23:00
 
636667861797410909.jpg
  • పోలవరానికి తొలగిన అడ్డంకి
  • స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌పై ఏడాది స్టే
  • గడ్కరీ రాకకు రెండు రోజుల
  • ముందుగా ఫైలుపై మంత్రి సంతకం
  • ఫలించిన ముఖ్యమంత్రి యత్నం
  • కీలక అంశాలపై మటుకు కొర్రీలే
  • తుది అంచనాలపై తేల్చని వైనం
  • రేపు పోలవరం పర్యటనకు గడ్కరీ
  • ఢిల్లీలో అధికారులతో సన్నాహక సమీక్ష
  • సీఎంతో కలిసే పోలవరం వద్దకు!
అమరావతి, న్యూఢిల్లీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై ఏడాది పాటు స్టేను కొనసాగిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం నిర్ణయం తీసుకొన్నారు. పోలవరం పనుల సమీక్ష కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రావడానికి రెండు రోజుల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సంతకం చేశారు. దీనిపై రానున్న రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనుల నిలిపివేతకు ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్రం 2015 జూన్‌ 23న స్టే విధించింది. అప్పటినుంచి ఏటా స్టే గడువును కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఆ గడువు ఈ నెల రెండో తేదీతో ముగిసింది. మారిన పరిస్థితుల్లో కేంద్రం తిరిగి స్టేను పొడిగిస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. దీని ప్రభావం గడ్కరీ పోలవరం పర్యటనపైనా పడొచ్చునని భావించారు. తాజా కేంద్ర నిర్ణయంతో ఆ సమస్య తీరిపోయింది.
 
నిజానికి, స్టే ఎత్తివేత విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మరో ఏడాది పాటు స్టే పొడిగించాలని లేదా స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో స్వయంగా ఫోనులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన ఆ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా ఫైలుపై సంతకం చేశారు. ఈ ఫైలుపై సోమవారం హర్షవర్ధన్‌ కూడా సంతకం చేశారు. దీంతో ప్రాజెక్టు పనులు తిరిగి పుంజుకోనున్నాయి. అయితే, శరవేగంగా ఈ పనులు ముందుకు సాగాలంటే 2013-14 సవరణ అంచనాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఈ అంచనాలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కొర్రీల మీద కొర్రీలను వేస్తూ వస్తోంది. తాజాగా, 2010-11 అంచనా వ్యయం అయిన రూ.16,010.45 కోట్లతో ప్రాజెక్టు పనులు ఎంత వరకూ జరుగుతాయో చెప్పాలంటూ తలా తోకా లేని ఒక ప్రశ్నను రాష్ట్రానికి సంధించింది.
 
ఎంతిచ్చాం.. ఎంతివ్వాలి..
పోలవరం పనులకు అడుగడుగునా కేంద్రం వేస్తున్న కొర్రీలపై తెలుగు మీడియా వేసే ప్రశ్నలను ఎదుర్కొనేందుకుగాను, కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఎన్ని నిధులను విడుదల చేసింది.. ఇంకా ఎంత ఇవ్వాలి.. పనుల పురోగతి ఎంత వరకు వచ్చింది..పునరావాస ప్యాకేజీ పరిస్థితి ఏంటి... అనే అంశాలపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖపై, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తనకు రాసిన లేఖపైనా మంత్రి చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి ఇచ్చిన నివేదికలోని సిఫారసులపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది వెల్లడి కాలేదు.
 
 
 
 
Posted
అనుమానాలు తీర్చండి.. అంచనాలు తేల్చేద్దాం
సవరించిన లెక్కల్లో సమస్యలున్నాయి
సేకరించాల్సిన భూమీ రెండు రెట్లు పెరిగింది
‘పోలవరం’పై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
మోదీకి, కేంద్రానికీ ఈ ప్రాజెక్టు ముఖ్యమేనని ప్రకటన
పనుల్లో పురోగతి బాగుందని కితాబు
11ap-main1a.jpg

పోలవరం నుంచి ఈనాడు ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ముఖ్యమో, చంద్రబాబునాయుడుకు ఎంత ప్రాధాన్యమో- మోదీకి, కేంద్రానికి, నాకూ అంతే ముఖ్యం. ఇది జాతీయ ప్రాజెక్టు. దేశానికే ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు ఆమోదించేందుకు కొన్ని సమస్యలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమూ, కేంద్రమూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సుస్పష్టమైన ప్రకటన చేశారు. ‘ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానని గతంలోనే ప్రాజెక్టు వద్దకు వచ్చి చెప్పాను. మాట చెప్పానంటే నేను కట్టుబడి ఉంటాను’ అని సయితం ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో ఉన్న సమస్యలు.. వాటి పరిష్కారానికి ఎలా ముందుకు సాగనున్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర అధికారులను దిల్లీకి ఆహ్వానించారు. కూర్చుని తేల్చేద్దామని చెప్పారు. ‘రాజకీయాలు వేరు. అవి రోడ్ల మీద చూసుకునేవి. పోలవరం ప్రాజెక్టుతో ఎలాంటి రాజకీయాలు లేవు. అభివృద్ధికి రాజకీయాలను ముడిపెట్టవద్దు’ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం స్వయంగా పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పనులు చాలావేగంగా జరుగుతున్నాయని కితాబు ఇచ్చారు. అధికారులను, ఇంజినీర్లను, గుత్తేదారులను సయితం ప్రశంసించారు.

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నెలా నెలా వస్తానని చెప్పినా రాలేకపోయానన్నారు. తనకున్న పనుల వల్ల సాధ్యం కాలేదన్నారు. అయితే అధికారులతో ఎప్పుడూ సమీక్షిస్తూనే ఉన్నానని తెలిపారు. రెండ్రోజుల కిందట కూడా కేంద్ర అధికారులతో పోలవరంపై సమీక్షించానని, ఏపీ భవన్‌ కమిషనర్‌ వచ్చారని చెబుతూ పోలవరంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సమస్యలను రెండు భాగాలుగా చూస్తున్నామన్నారు. అంచనాలు రెండు రెట్లు మించి పెరిగిపోయాయంటూ సివిల్‌ పనులకు సంబంధించినవి ఒక భాగంగా; భూసేకరణ-పునరావాసానికి సంబంధించి మరో భాగంగా చూస్తున్నామన్నారు. సివిల్‌ పనుల అంచనాలపెంపుపై కేంద్రజలసంఘం ఛైర్మన్‌, జలవనరుల కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి ఇతర రాష్ట్ర అధికారులు కలిసి చర్చించి కొలిక్కి తీసుకువచ్చి తనకు సమర్పించాలన్నారు. భూసేకరణ వ్యయమూ బాగా పెరిగిందని, మొత్తం రూ.60 వేల కోట్లకు చేరిందని గడ్కరీ అన్నారు. 2013 భూసేకరణ చట్టంవల్ల అంచనాలు పెరిగిన మాట వాస్తవమైనా, సేకరించాల్సిన భూమీ పాత డీపీఆర్‌తో పోలిస్తే  రెండురెట్లు పెరిగిపోయిందని, వీటన్నింటికీ సాంకేతికంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ‘మా అధికారులకు ఇప్పటికే చెప్పా. మళ్లీ చెబుతా. మీరు దిల్లీ వచ్చి ఏ కాగితాలు కావాలో అన్నీ సమర్పించి సమస్యలు పరిష్కరించుకోవాల’ని సూచించారు. మూడు రోజుల్లో నాకు సమర్పిస్తే తాను ఆమోదించి 8 రోజుల్లో ఆర్థికశాఖకు పంపుతామన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి, తాను కలిసి సంయుక్త భేటీ ఏర్పాటు చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ఎందుకు అంచనాలు పెరిగాయో ఆయనకూ వివరించి ఆమోదం తెచ్చుకుందామన్నారు. ఒక్కసారి ఆర్థికశాఖ ఆమోదిస్తే అడ్వాన్సుగా నిధులు ఇచ్చే అంశం తనపరిధిలోకి వస్తుందని గడ్కరీ చెప్పారు. ఆర్థికశాఖ ఆమోదించే వరకు అడ్వాన్సు నిధులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. నిధులకు ఎలాంటి కొరతలేదని స్పష్టం చేశారు. గిరిజన రైతులకు ప్రస్తుతం వారి జీవనం కన్నా మెరుగైన పునరావాసం కల్పించాలన్నారు. వారికి భూమికి భూమి ఇవ్వాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రమూ, రాష్ట్రమూ ఒకే క్రమంలో ఉన్నాయంటూ... ఇది జాతీయ ప్రాజెక్టు... పూర్తి చేయడం కేంద్రం బాధ్యత అని గడ్కరీ ప్రకటించారు.
 

పోలవరం మనమే పూర్తిచేస్తామని ప్రజలకు చెప్పండి:
గడ్కరీ 
ఈనాడు డిజిటల్‌, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తోందని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అక్కడే భాజపా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తోంది. దీన్ని మనమే పూర్తి చేస్తాం. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలి’ అని సూచించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, నరసాపురం ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యేలు పైడికొండల మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Posted
క్షేత్రస్థాయిలో చూడండి.. అడిగింది ఇవ్వండి
ముంపును బట్టే సేకరించే భూమీ పెరిగింది
కారణాలు పక్కాగా ఇప్పటికే చెప్పాం, మళ్లీ చెబుతాం
అంచనాలు పెరగడంపై గడ్కరీకి వివరించిన సీఎం
అసలు కేంద్రం చేయాల్సిన పని మేం చేస్తున్నాం..
ఏ జాతీయ ప్రాజెక్టులోనైనా ఇలా పని జరుగుతోందాని ప్రశ్న

పోలవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల వల్లే సేకరించే భూమి విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాల్సి రావడం, ముంపునకు తగ్గట్టుగా నిపుణుల కమిటీలు ఆ తర్వాత కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రధాన కారణాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చారు. అధికారులతో, ముఖ్యమంత్రితో గడ్కరీ నిర్వహించిన సమావేశంలోను, వాహనంలో ఆయనతో పాటు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించిన సందర్భంలో చంద్రబాబు సుస్పష్టంగా వివరించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి ప్రాజెక్టు చూసిన తర్వాత అక్కడే రాత్రి 9 గంటల వరకు దాదాపు 90 నిమిషాల సేపు అధికారులతో సమావేశమయ్యారు. సవరించిన అంచనాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘ఎంత సమయం తీసుకోవచ్చు’ అని కేంద్రమంత్రిని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ ప్రశ్నించగా తనకు ఈ రోజు వేరే కార్యక్రమం ఏమీ లేదని ఎంతసేపయినా తనకు సమ్మతమేనని చెప్పి సమావేశం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి అంచనాలు ఎందుకు బాగా పెరిగాయో వివరించారు. ‘‘గతంలో కేవలం పట్టా భూములకు మాత్రమే పరిహారం లెక్కించారు. ఆ తర్వాత 2013 చట్టంలో అసైన్డు భూములకు కూడా పరిహారం ఇవ్వాలని తేల్చారు. ఆ కారణంగా పరిహారం చెల్లించే భూమి పెరిగింది. మరో వైపు గతంలో కొంత మేర గోడ నిర్మించి ముంపు నివారించవచ్చని భావించారు. ఆ తర్వాత నిపుణుల కమిటీలు గోడతో సాధ్యం కాదని తేల్చి మరికొన్ని గ్రామాలను ముంపులో చేరేవిగా గుర్తించారు. దీని వల్లా భూమి పెరిగింది’’ అని సీఎంతో పాటు అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.

‘అసలు ఈ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. మేము బాధ్యత తీసుకుని నిర్మిస్తోంటే ఇలాంటి అనుమానాలు సబబా’ అన్న కోణంలోనూ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని ప్రశ్నించినట్లు సమాచారం. అసలు ఏ జాతీయ ప్రాజెక్టులోనైనా ఈ స్థాయిలో పనులు జరుగుతున్నాయా అని సీఎం కేంద్రమంత్రిని ప్రశ్నించారు. నిధులున్నా ఏ జాతీయ ప్రాజెక్టులోనూ పనులు ఈ  స్థాయిలో జరగడం లేదని కేంద్ర మంత్రి అంగీకరించినట్లు సమాచారం. మరో వైపు ముంపులో చిక్కుకునే భూమి పెరగలేదని, పరిహారం చెల్లించాల్సిన భూమి మాత్రమే పెరిగిందని అదీ 67 వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పెరిగిందని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కేంద్ర మంత్రికి చెప్పారు. భూమికి బదులు భూమి ఇచ్చేందుకు ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడా ప్రభుత్వ భూమి లేదా అని గడ్కరీ ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు ఆయన ఆ సౌలభ్యం లేదని సమాధానం ఇచ్చారు. అంచనాలు ఎందుకు ఎలా పెరిగాయో శశిభూషణ్‌, ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌లు సమగ్రంగా కేంద్రమంత్రికి వివరించారు.

వచ్చే వారం అంతా అధికారులు దిల్లీకి.. కేంద్ర అధికారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లతో వచ్చే వారం జలవనరులశాఖ అధికారులు, భూసేకరణ అధికారులు దిల్లీకి వెళ్లి వారం రోజులుఅక్కడే ఉండి సమస్య పరిష్కరించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

371 ఆవాసాలు తరలించాలి: సీఎం
పోలవరం ముంపు వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో 371 ఆవాసాలు తరలించాల్సి వస్తోందని, అందువల్లే భూసేకరణ పునరావాస వ్యయం రూ.30 వేల కోట్లు దాటిందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెంటనే అక్కడికి అక్కడే తన సమాధానం చెప్పారు. కేంద్ర అనుమానాలను సాంకేతికంగానే నివృత్తి చేస్తామన్నారు. కేంద్ర జలసంఘం అధికారులు, నిపుణులు వేరే ఏదైనా సాంకేతికంగా కొత్త పరిష్కారం చూపగలిగితే దానిని అనుసరించడానికీ తమకు అభ్యంతరం లేదన్నారు. కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడానికి ముందు సీఎం మాట్లాడుతూ గత అక్టోబరులో గడ్కరీ వచ్చి వెళ్లిన తర్వాత ఈ 8 నెలల్లో ఎంత పని జరిగిందో వివరించారు. డయా ఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయిందని, కాఫర్‌ డ్యాం జెట్‌ గ్రౌటింగు పనులు ఎగువవి పూర్తయ్యాయని, దిగువవి 82 శాతం పూర్తయ్యాయని, నాడు అసలు ఆ పనులే ప్రారంభించలేదని వివరించారు. అప్పటికి రూ.12,425 కోట్ల విలువైన పని జరిగితే ఇప్పటికి రూ.14,141 కోట్ల పని జరిగిందని చెప్పారు. కాంక్రీటు పనులు నాడు 3.16 లక్షల క్యూబిక్‌ మీటర్లు జరిగితే ఇప్పుడు 10.76 లక్షల క్యూబిక్‌ మీటర్లు జరిగిందన్నారు. 1983లో తొలి అంచనాల నుంచి ఎలా అంచనాలు పెరుగుతూ వచ్చాయో కూడా వివరించారు. సవరించిన అంచనాలు ఆమోదించాలని, అడ్వాన్సు నిధులు ఇవ్వాలని, ఇప్పటికే ఖర్చు చేసిన నిధులు విడుదల చేయాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు. కేంద్ర మంత్రి గడ్కరీని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తోడ్కొని వచ్చారు. తిరిగి ఆయనే రాజమహేంద్రవరంలో వీడ్కోలు పలికారు. ప్రాజెక్టు సందర్శనలోను, ముఖ్యమంత్రి, అధికారులతో గడ్కరీ నిర్వహించిన సమీక్షల్లోనూ పాల్గొన్నారు.

Posted
ఒప్పిస్తే ఓకే !
12-07-2018 02:55:57
 
636669609562134231.jpg
  • సహేతుక కారణాలు చూపితేనే ‘ఆర్థిక’ ఆమోదం
  • పెంచిన అంచనాలకు అది అనుమతివ్వాలి
  • అప్పుడు మాత్రమే నిధులు ఇవ్వగలం
  • డాక్యుమెంట్లు ఇచ్చిన 8 రోజుల్లో పరిష్కారం
  • పోలవరం ప్రాజెక్టు మీదీ... మాదీ!
  • నాకు, మోదీకి, కేంద్రానికీ ప్రతిష్ఠాత్మకం
  • పనులు శరవేగంగా సాగుతున్నాయి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం భేష్‌
  • మే నెలలో ఎన్నికలు వస్తాయి
  • ఫిబ్రవరి కల్లా సివిల్‌ పనులు పూర్తి కావాలి
  • రాజకీయాలకూ, అభివృద్ధికీ సంబంధం లేదు
  • కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ స్పష్టీకరణ
ఏలూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాదు! ఇది మొత్తం భారతదేశానిది. ప్రధాని మోదీ సారథ్యంలో దీనిని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. నిధులకు సమస్యే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉన్నారో... కేంద్రం కూడా అంతే చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
 
బుధవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే గడ్కరీ, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తికి సహకరిస్తామంటూనే... పెరిగిన అంచనాలపై సహేతుక కారణాలను వివరించి, ఆర్థిక శాఖను ఒప్పించాల్సి ఉందని అన్నారు. ‘‘ఒక రైతుగా నీరు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ధికి నీరే కీలకం. నీటి కొరతతో మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ది కాదు... మొత్తం దేశానికి చెందినది. ప్రతి ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.
 
ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ రైతులకు కొత్త జీవితం అందించవచ్చు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తికి కట్టుబడి ఉంది. కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారంపైనా నిర్ణయాలు తీసుకున్నాం’’ అని తెలిపారు. తొమ్మిది నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుందన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. సివిల్‌ పనులను ఫిబ్రవరి ఆఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు గడువు విధించారు. ‘‘ఏప్రిల్‌ ఆఖరుకు పూర్తి చేస్తామని వారంటున్నారు. అయితే... మార్చి మొదటివారంలో మళ్లీ నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. అప్పటికి ప్రాజెక్టు పూర్తయితే చూడాలని భావిస్తున్నాను. ఎందుకంటే... మేలో ఎన్నికలొస్తాయి. అంతకంటే ముందే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. అందుకే, ఫిబ్రవరి ఆఖరుకల్లా సివిల్‌ పనులు పూర్తి చేయాలి! ఎన్నికల తర్వాత ఏమిటన్నది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
 
లాజికల్‌గా కన్విన్స్‌ చేయండి!
పోలవరం అంచనా వ్యయం రూ.60వేల కోట్లకు చేరుకుందని గడ్కరీ తెలిపారు. కొత్త చట్టం భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కల్పన, పరిహారం చెల్లించాల్సి ఉందని అంగీకరించారు. అయితే... సివిల్‌ పనుల్లోనూ అంచనా వ్యయం పెరిగిందని, సేకరించాల్సిన భూమీ గత అంచనాకంటే రెట్టింపు ఉందని తెలిపారు. ‘‘పోలవరానికి నిధుల సమస్య లేనే లేదు. అయితే.... నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ఆర్థిక శాఖే. అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందో సహేతుకంగా వివరించి ఒప్పించాల్సి ఉంది’’ అని తెలిపారు. డాక్యుమెంట్లు సమర్పించిన ఎనిమిది రోజుల్లోనే దీనిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సివిల్‌ పనుల అంచనాలకు సంబంధించి కేంద్రం నిర్దిష్టంగా కొన్ని విధానాలను అనుసరిస్తుందన్నారు. ‘‘రాష్ట్రం నుంచి అధికారులు రండి. కేంద్రంలోనూ సంబంధిత అధికారులందరినీ అందుబాటులో ఉంచుతాను. మూడు రోజులు పోలవరంపైనే చర్చిద్దాం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి వద్దకు ఉమ్మడిగా వెళదాం. పెరిగిన అంచనాల గురించి ఒప్పించి, అనుమతులు తెచ్చుకుందాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు.
 
ప్రశంసల వర్షం
పోలవరం ప్రాజెక్టు పూర్తికి సీఎం కష్టపడుతున్నారని గడ్కరీ ప్రశంసించారు. వారి కృషివల్లనే పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అదే చిత్తశుద్ధి, నిబద్ధత తనకు, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికీ ఉందన్నారు. ‘‘డబ్బులు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులు ఉంటే సరిపోదు. బలమైన చిత్తశుద్ధి ఉంటేనే పనులు జరుగుతాయి’’ అని అన్నారు. తాను రాజకీయంగా ఒక మాట ఇచ్చానంటే... వందశాతం పూర్తి చేసి తీరుతానన్నారు. నా ట్రాక్‌ రికార్డు చూస్తే ఇది తెలుస్తుందని తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు పూర్తి నా జీవితంలో ఎంతో కీలకం. 20 మీటర్ల లోతు నుంచి ప్రాజెక్టును నిర్మించడం ప్రపంచంలోనే తొలిసారి. కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు అభినందనల’న్నారు.
 
అదేమిటో మీకే తెలుసు!
టీడీపీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం గురించి గడ్కరీ ప్రస్తావించారు. ‘‘పోలవరానికి ప్రతినెలా వస్తానని గతంలో చెప్పాను. కానీ, రాలేకపోయాను. దానికి కారణాలేమిటో విడమరచి చెప్పనక్కర్లేదు’’ అంటూ చిరునవ్వుతో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను రాకున్నా తమ శాఖ పూర్తిస్థాయి దృష్టి సారించిందన్నారు. రాజకీయాలకూ, అభివృద్ధి పనులకూ సంబంధం లేదన్నారు. ‘‘రాజకీయంగా వీధుల్లోకి ఎక్కి కొట్లాడవచ్చు. దీనిని అభివృద్ధి పనులతో లంకె పెట్టం. పోలవరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే విషయంపై కాంట్రాక్టర్లకు నేను భరోసా ఇచ్చాను’’ అని తెలిపారు.
Posted
కొత్త డీపీఆర్‌ను పంపండి!
12-07-2018 02:51:25
 
636669606847074395.jpg
  • అధికారిక సమీక్షలో గడ్కరీ స్పష్టీకరణ
  • కేంద్ర చట్టం వల్లే వ్యయం పెరిగింది
  • కొత్తగా పెరిగిన ముంపు విస్తీర్ణం
  • 2005 తర్వాత పనులే జరగలేదు
  • అంచనా వ్యయం పెరగడం సహజం
  • అవకతవకల్లేవు, అంతా పారదర్శకమే
  • తేడా ఉంటే మీరే చెప్పండి: సీఎం
(పోలవరం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పోలవరం తాజా అంచనాలపై నివేదిక ఇచ్చిన దాదాపు ఏడాది తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ‘మళ్లీ మొదటికి’ వచ్చారు. రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌ లేదా ఇతర ప్రఖ్యాత సంస్థతో కొత్త అంచనాలు తయారు చేయించాలని సూచించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పోలవరం పనులను పరిశీలించిన గడ్కరీ... ఆ తర్వాత దీనిపై అధికారిక సమీక్ష జరిపారు. పెరిగిన అంచనాలపై ఆయన అనేక సందేహాలు లేవనెత్తారు. వాటికి ముఖ్యమంత్రితోపాటు అధికారులు అప్పటికప్పుడే సమాధానాలు ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... పోలవరం భూసేకరణ, సహాయ పునరావాస వ్యయం భారీగా పెరగడం గురించి గడ్కరీ ప్రశ్నించారు. దీనిపై ‘తమ వాళ్ల’ నుంచి ఫిర్యాదులు కూడా అందాయన్నారు. 2013 భూ సేకరణ చట్టం వల్లే వ్యయం పెరిగిందని రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూములు లేవని, అత్యంత ఖరీదైన భూములను సేకరించాల్సి వస్తోందని కలెక్టర్‌ కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. అయితే... గతంలో చూపినదానికంటే నిర్వాసితుల సంఖ్య, భూమి విస్తీర్ణం ఎందుకు పెరిగిందని గడ్కరీ ప్రశ్నించారు.
 
సివిల్‌ పనుల అంచనా వ్యయం కూడా పెరిగిందని గుర్తు చేశారు. దీనిపై చంద్రబాబు వివరంగా స్పందించారు. ‘‘అప్పట్లో హడావుడిగా అంచనాలు రూపొందించారు. పనులు చేపట్టడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. కీలకమైన పనులు మొదలుపెట్టిన తర్వాతకానీ అసలు విషయం అర్థం కాలేదు. ముంపు విస్తీర్ణం, తరలించాల్సిన ఆవాసాల సంఖ్య కూడా భారీగా పెరిగింది’’ అని వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లలో ఏమైనా సమస్యలున్నాయా అని గడ్కరీ ప్రశ్నించారు. గేట్ల బిగింపు కోసం ఏడాది కిందట పంపిన డిజైన్లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటిదాకా ఆమోదించలేదని అధికారులు తెలిపారు. ఆ ఆమోదం కోసం ఎదురు చూడొద్దని.. పనులు ముందుకు తీసుకువెళ్లాలని గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏడాదికిందట నివేదిక పంపితే ఎందుకు పట్టించుకోలేదంటూ సీడబ్ల్యూసీపైనా అసహనం వ్యక్తం చేశారు. ఏ సమస్యలున్నా కాంట్రాక్టర్లు తనను సంప్రదించవచ్చునని సూచించారు. పోలవరం తుది అంచనాలను ఆమోదించాలని సీడబ్ల్యూసీని ఆదేశించాలని జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమర్‌ కోరారు. సోమవారం ఢిల్లీకి వస్తే .. సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ తన సమక్షంలోనే పరిష్కారించుకోవచ్చునని గడ్కరీ సూచించారు. ఈ సమయంలో పోలవరం తుది అంచనాల ప్రస్తావన మరోసారి వచ్చింది. ‘‘వీటిని నేను ఆమోదించినా... కేంద్ర ఆర్థిక శాఖ మరో దఫా పరిశీలిస్తుంది. చివరిగా ఆమోదం వేయాల్సింది ఆర్థిక శాఖే’’ అని తెలిపారు.
 
అంతా పారదర్శకంగానే: సీఎం
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కపైసా అవినీతికి ఆస్కారంలేకుండా పారదర్శకంగా పనులు చేపడుతున్నామని గడ్కరీకి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ‘‘భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలతో సహా తుది అంచనాల రూపకల్పనలో, సివిల్‌ పనుల్లో ఎక్కడా తేడా లేదు. ఏమైనా అవకతవకలుంటే మీరే చెప్పండి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలి’’ అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలోచన 1942 నుంచి ఉన్నా ఇప్పటిదాకా పూర్తి కాలేదన్నారు. ‘‘2005లో పనులు ప్రారంభించినా ప్రాజెక్టును పూర్తి చేయలేదు.
 
అందువల్లే నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2013 భూ సేకరణ చట్టం కేంద్రమే తెచ్చింది. ఆ మేరకు పరిహార భారాన్ని కూడా కేంద్రమే చెల్లించాలి’’ అని స్పష్టం చేశారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరందించాలంటే.. నిధుల విడుదలలో అడ్డంకులు ఎదురుకారాదని చెప్పారు. సీడబ్ల్యూసీతో పెండింగ్‌ అంశాలపై సోమవారం ఢిల్లీకి రావాలన్న గడ్కరీ చేసిన సూచనపై స్పందిస్తూ... అనుమతులు, తుది అంచనాల ఆమోదానికి సంబంధిత అధికారులంతా ఢిల్లీలోనే మకాం వేస్తారని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే తాను కూడా ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...