sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 9 నాటికి గ్రౌటింగ్ పూర్తి కావాలి26-06-2018 02:54:46 పోలవరంపై ఆదేశించిన సీఎం గడువుకు ముందే ‘ఎగువ’ పనులు పూర్తి కావడంపై చంద్రబాబు హర్షం అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులోని ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల జెట్ గ్రౌటింగ్ పనులను జూలై 9 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులు గడువునకు ముందే పూర్తి కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి పునరావాస పనులను పూర్తిచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జలవనరులశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,050 మీటర్లు పొడవున ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, దిగువ జెట్ గ్రౌటింగ్ పనులు 77 శాతం అయ్యాయని ఆయనకు అధికారులు వివరించారు. పోలవరం నిర్వాసితుల కోసం పునరావాసం-పరిహారం కేటాయించిన రూ.3,115.11 కోట్లకు గాను రూ.219.25 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్‌ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పుగోదావరి కలెక్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
sonykongara Posted June 28, 2018 Author Posted June 28, 2018 పోలవరానికి మరో పరీక్ష!28-06-2018 02:25:58 ప్రాజెక్టు పనులపై రాజకీయ నీలినీడలు అమరావతి (ఆంధ్రజ్యోతి): చైనాలోని త్రీగాడ్జెస్ ప్రాజెక్టును అధిగమించేలా వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు కాంట్రాక్టు సంస్థ నవయుగ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆ దిశగా సదరు పనులు శరవేగంతో నడుస్తున్నాయి. ఇంకోవైపు.. సవరించిన ప్రాజెక్టు అంచనాలను, తుది డిజైన్లను ఆమోదించకుండా.. కేంద్రం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ తరుణంలో మరో అనుకోని గండం ముందుకొచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ‘స్టాప్ వర్క్’ ఉత్తర్వుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇచ్చిన స్టే ఆదేశాల గడువు జూలై 2తో ముగుస్తోంది. ఈ ఆదేశాలను మరో ఏడాది పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పొడిగించవద్దని పోలవరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఇటీవల లేఖ రాశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కాంట్రాక్టు సంస్థల్లో, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారుల్లో నెలకొంది. అప్పుడే రెండేళ్లకు పొడిగించి ఉంటే.. పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) 2015 చివరిలో ‘స్టాప్ వర్క్’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జావడేకర్ ఆ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలను అనిల్ దవే స్వీకరించారు. స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. జూలై 2వ తేదీతో స్టే గడువు ముగియనుంది. దీంతో స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్టే ఎందుకు కొనసాగించాలో స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు లేఖ కూడా రాసింది. తర్వాత రెండ్రోజులకే ఒడిసా సీఎం లేఖ రాశారు. తమ అభ్యంతరాలను అందులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటూ ఆంధ్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కేంద్ర పర్యావరణ అటవీశాఖకు వివరిస్తూ మరో లేఖ రాశారు. స్టే పొడిగింపుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఝా సానుకూలంగా ఉన్నా.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కేంద్రం స్టాప్ ఆర్డర్ పై స్టేను పొడిగిస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌తో సీఎం చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈ అంశంపై ఆయనతో మాట్లాడతానని ముఖ్యమంత్రి జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో చెప్పారు. అయితే.. స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టేకు సంబంధించిన ఫైలు కేంద్ర కార్యదర్శి ఝా వద్దకు వెళ్లాకే మంత్రితో మాట్లాడితే పనులు వేగంగా ముందుకు కదులుతాయని రాష్ట్ర ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా ఒడిసా సీఎం అభ్యంతర లేఖ, దానికి రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిస్పందనను పరిశీలించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఒక నోట్‌ను తయారు చేసింది. దీనిపై సంతకం చేయాల్సిన ఆ శాఖ సంయుక్త కార్యదర్శి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక ఫైలు కార్యదర్శికి చేరింది. ఇప్పుడేమో కార్యదర్శి వియత్నాం వెళ్లారు. ఆయన భారత్‌కు సరిగ్గా జూలై 2న తిరిగి వస్తారు. అదే రోజుతో స్టాప్ వర్క్ ఆర్డర్‌పై ఇచ్చిన స్టే గడువు ముగుస్తుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే రోజునే స్టే ఆర్డర్‌పై ఝా నిర్ణయం తీసుకున్నా.. మంత్రి హర్షవర్ధన్ దానిపై ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం జాప్యం జరిగినా.. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు ముందుకు సాగవు. గత ఏడాది కూడా ఇదే తరహాలో నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పట్లో కాంక్రీట్ పనులు మందకొడిగా ఉండడంతో.. దీని ప్రభావం పెద్దగా కన్పించలేదు. కానీ ఇప్పుడు వడివడిగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే ఎంత ఆలస్యమైతే.. అంతకు రెండింతల నష్టం వాటిల్లుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడీ వ్యవహారంపై రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయి. మోదీ మొగ్గు ఎటో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగిన టీడీపీ.. తుదకు ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. దరిమిలా బీజేపీ, టీడీపీ రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో.. లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు జరపాలని కాంక్షిస్తున్న మోదీ ఆలోచనలతో ఒడిసా సీఎం నవీన్ ఏకీభవించారు. ఇటీవల బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ పార్టీలతో కలవలేదు. కాంగ్రెస్, బీజేపీలకు దూరం పాటిస్తూనే ప్రధానికి సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. దీంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ నవీన్ రాసిన లేఖకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదు. చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణితో ఉన్న మోదీ ప్రభుత్వం... స్టే ఆదేశాలను పొడిగించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న సందేహాలు రేగుతున్నాయి. వాస్తవానికి పోలవరం నిర్మాణానికి సంబంధించి రాష్ట్రం చేసిన వ్యయంలో ఇంకా రూ.1995 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. అయితే.. కేంద్రం నుంచి పూర్తిగా నిధులన్నీ వచ్చేశాయని, పెండింగ్‌లో ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర నేతలు గత రెండ్రోజులుగా అసత్య ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. ఇప్పుడు నిర్మాణ పనుల నిలిపివేతపై స్టే విషయంలోనూ మోదీ రాజకీయంగా వ్యవహరిస్తే పోలవరం పనులు స్తంభించిపోతాయని, ప్రాజెక్టు ముందుకు నడవకుండా బ్రేకులు పడిపోతాయని రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
sonykongara Posted June 30, 2018 Author Posted June 30, 2018 కాంక్రీటు పనుల్లో మరో మైలురాయి30-06-2018 04:02:25 రికార్డు స్థాయిలో పోలవరం స్పిల్ చానెల్ పనులు 40 రోజుల్లో లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోలవరం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు పనులు చేస్తున్న ‘నవయుగ’ మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు స్పిల్‌వే కాంక్రీటు పనులను రికార్డు స్థాయిలో చేస్తున్న ఈ కంపెనీ ఇప్పుడు స్పిల్ చానెల్‌నూ అదే వేగంతో చేస్తూ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. మే 15న స్పిల్ చానెల్ కాంక్రీట్ పనులు ప్రారంభించినప్పటి నుంచి 40 రోజుల్లో లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వేశారు. స్పిల్ చానెల్ పొడవునా పాత డిజైన్ ప్రకారం మొత్తం 18.75 లక్షల క్యూబిక్ మీటర్లు వేయాల్సి ఉండగా 40 రోజుల్లోనే లక్ష క్యూబిక్ మీటర్ల మైలురాయిని దాటిందని ఈఈ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ వర్షాకాలంలో 3లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీటు వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఈఈ పేర్కొన్నారు. ఒకపక్క వర్షాల కారణంగా స్పిల్ చానెల్‌లో మట్టి పనులు అనుకున్న వేగంతో కాకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు విడుదల: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ మరింత జోరందుకుంది. శుక్రవారం 18పంపుల ద్వారా 5,650 క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేశారు. ఇప్పటి వరకూ 4.4948 టీఎంసీల నీరు డెల్టాకు విడుదలైంది.
sonykongara Posted June 30, 2018 Author Posted June 30, 2018 న్ఆర్ఐ ఇంకా.. పోలవరం అంచనాల సవరణపై జులైలో టీఏసీ సమావేశం ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై జులై మూడో వారంలో సాంకేతిక సలహా మండలి(టీఏసీ) సమావేశం ఏర్పాటు చేయడానికి సీడబ్ల్యూసీ సమాయత్తమవుతోంది. ఈమేరకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్‌హుస్సేన్ శుక్రవారం ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్‌కు తెలిపారు. 2014 ఏప్రిల్1 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయం భరించడానికి కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53వేల కోట్లతో సవరించిన అంచనాలు పంపింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ముంపు బాధితులకు పరిహారం, సహాయ, పునరావాస కార్యక్రమాలకే ఇందులో రూ.33వేల కోట్లవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం పంపిన సవరించిన అంచనాలను పరిశీలించిన సీడబ్ల్యూసీ కొన్ని కొర్రీలు వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటికీ ఇటీవలే వివరణలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాని పురోగతిని తెలుసుకోవడానికి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శుక్రవారం సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్‌హుస్సేన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఈ అంశంపై జులై మూడో వారంలో సాంకేతిక సలహా మండలి సమావేశం ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు మసూద్‌హుస్సేన్ స్పష్టం చేశారు. అది ఆమోదముద్ర వేస్తే వెంటనే ఆర్థిక శాఖలోని వ్యయ సంఘానికి పంపుతామన్నా
sonykongara Posted July 3, 2018 Author Posted July 3, 2018 పోలవరం పనులపై అనిశ్చితి!పనుల నిలిపివేత ఆదేశాలపై ‘స్టే’ గడువు పూర్తికొనసాగింపునకు లభించని కేంద్ర అనుమతి6 వరకు విదేశీ పర్యటనలో కేంద్ర మంత్రి హర్షవర్థన్ఆయన వచ్చేవరకూ ఎదురుచూడాల్సిందేఈనాడు - దిల్లీ పోలవరం ‘పనుల నిలిపివేత ఆదేశాల’ (స్టాప్ వర్క్ ఆర్డర్)పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం లభించలేదు. దీంతో ప్రాజెక్టు పనులపై అనిశ్చితి నెలకొంది. సదరు దస్త్రంపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులు ఆమోదముద్ర వేసి కార్యదర్శి సీకే మిశ్రాకు పంపారు. ఆయన నుంచి అనుమతి పొందడానికి సోమవారం రాత్రి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఈ దస్త్రానికి ఆయన ఆమోదముద్ర వేస్తే కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు చేరుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి దిల్లీకి చేరుకుంటారని అధికార వర్గాల సమాచారం. ఆలోపు పర్యావరణశాఖ కార్యదర్శి పచ్చజెండా ఊపితే కేంద్ర మంత్రి దిల్లీకి వచ్చిన వెంటనే దస్త్రంపై తుది ముద్ర వేసే అవకాశం ఉంటుంది. లేదంటే మరికొంత జాప్యం జరిగే ప్రమాదం ఉందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యావరణ అనుమతుల రద్దుతో సమస్యపోలవరం ప్రాజెక్టుకు 2005లోనే పర్యావరణ అనుమతులు వచ్చాయి. అయితే ఒడిశాలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పర్యావరణ అనుమతులు మంజూరుచేయడాన్ని తప్పుపడుతూ జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ 2007 డిసెంబరు 19న అనుమతుల్ని కొట్టివేసింది. అయితే ఆ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఒడిశా ప్రభుత్వం ఏపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. తర్వాత ఆ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కలిసి సర్వోన్నత న్యాయస్థానంలో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలుచేసింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉంది.2014లో రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో.. జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ విధించిన పనులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 ఏప్రిల్ 25న కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి పనుల నిలుపుదల ఉత్తర్వులను ఏడాదిపాటు పెండింగ్‌లో పెడుతున్నట్లు 2015 జూన్ 23న ఉత్తర్వులు జారీచేసింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఏడాదిపాటు దాన్ని కొనసాగిస్తూ వస్తోంది. గత ఏడాది జారీచేసిన ఉత్తర్వులు సోమవారంతో ముగియడంతో ఇప్పుడు వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది. స్టే కొనసాగించకపోతే క్షేత్రస్థాయిలో పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై చాలా పట్టుదలతో ఉంది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ వద్ద మోహరించి ఈ దస్త్రం ప్రతి కదలికనూ పరిశీలిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి హర్షవర్థన్‌తో ఫోన్‌లో మాట్లాడి గడువులోగా అనుమతులు ఇవ్వాలని కోరారు. గత వారం రోజులుగా వియత్నాం పర్యటనలో ఉన్న పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి సోమవారమే దిల్లీ చేరుకోవడం, ఆయన వచ్చేలోపు ఆ శాఖ మంత్రి హర్షవర్థన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో అనుమతుల అంశం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. 6వ తేదీ వరకూ వేచి ఉండక తప్పదని అధికారులు అంటున్నారు. కేంద్రం మెలిక పెడుతుందా?పోలవరం పనుల నిలిపివేతకు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వకూడదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు జూన్ 2న ఆయన కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా నవీన్ లేఖకు కౌంటర్‌గా హర్షవర్థన్‌కు లేఖ రాశారు. తక్షణం ‘స్టాప్ వర్క్ ఆర్డర్’పై స్టే జారీచేసి పోలవరం పనులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ ఆర్డర్‌పై గత ఏడాది జులై 3న ఇచ్చిన స్టే సోమవారం (జూన్ 2)తో ముగిసింది. ఇప్పుడు కేంద్రం మళ్లీ దాన్ని పునరుద్ధారించాల్సి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెదేపా బయటకు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి మెలికపెడుతుందోనన్న ఆందోళన ఏపీ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
sonykongara Posted July 4, 2018 Author Posted July 4, 2018 పోలవరం పనులపై తొలగిన అనిశ్చితి 04-07-2018 20:15:33 ఢిల్లీ: పోలవరం పనులపై అనిశ్చితి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై స్టే కొనసాగింపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్టే కొనసాగింపు ఫైలుపై కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి సీకే మిశ్రా సంతకం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్దన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈనెల 6న హర్షవర్దన్ ఢిల్లీకి రానున్నారు.
SREE_123 Posted July 4, 2018 Posted July 4, 2018 22 minutes ago, sonykongara said: పోలవరం పనులపై తొలగిన అనిశ్చితి 04-07-2018 20:15:33 ఢిల్లీ: పోలవరం పనులపై అనిశ్చితి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై స్టే కొనసాగింపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్టే కొనసాగింపు ఫైలుపై కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి సీకే మిశ్రా సంతకం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్దన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈనెల 6న హర్షవర్దన్ ఢిల్లీకి రానున్నారు. ?
ravindras Posted July 4, 2018 Posted July 4, 2018 (edited) 11 hours ago, sonykongara said: transtroy sani laa tagilaadu . lowercofferdam,upper coffer dam , ecrf dam lu navayuga ki isthe manchidi. ee vishayamlo state water resources delay chestunnayante devineni uma role kuda vundi vundaali. i prey to cbn to give remain polavaram works to navayuga Edited July 4, 2018 by ravindras
sonykongara Posted July 4, 2018 Author Posted July 4, 2018 6 minutes ago, ravindras said: transtroy sani laa tagilaadu . lowercofferdam,upper coffer dam , ecrf dam lu navayuga ki isthe manchidi. ee vishayamlo state water resources delay chestunnayante devineni uma role kuda vundi vundaali. i prey to cbn to give remain polavaram works to navayuga avunu
AbbaiG Posted July 4, 2018 Posted July 4, 2018 2 hours ago, ravindras said: transtroy sani laa tagilaadu . lowercofferdam,upper coffer dam , ecrf dam lu navayuga ki isthe manchidi. ee vishayamlo state water resources delay chestunnayante devineni uma role kuda vundi vundaali. i prey to cbn to give remain polavaram works to navayuga Bezawada busa gang strikes again Soma, doma ayiponai ippudu ratna engineering anta
sskmaestro Posted July 5, 2018 Posted July 5, 2018 50 minutes ago, sonykongara said: They have to give until 2019 elections
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now