sonykongara Posted June 17, 2018 Author Posted June 17, 2018 పోటెత్తిన గోదావరి17-06-2018 03:22:26 పోలవరం పనుల వద్ద వరద నీరు తెగిపోయిన ప్లాట్‌ఫాం గట్టు యథావిధిగా జెట్ గ్రౌటింగ్ పనులు 4 రోజుల ముందుగానే పట్టిసీమ నుంచి నీరు తుంగకు భారీ వరదనీరు.. పదేళ్లలో ప్రథమం (ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) గోదావరికి వరద నీరు పోటెత్తింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వరద చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు గోదావరిలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, ప్రస్తుతం కొనసాగుతున్న ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులకు సంబంధించి నిర్మించిన ప్లాట్ ఫాం వరద ధాటికి తెగిపోయింది. గత వేసవిలో ప్రతి రోజు 5 నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే విధంగా నిర్మించిన ప్లాట్ ఫాం పైపులు వరద ధాటికి లేచిపోయాయి. 34 వేల క్యూసెకుల నీరు పోలవరం డయాఫ్రమ్ వాల్ మీదుగా దిగువకు ఉరకలు వేస్తూ ధవళేశ్వరం బ్యారేజి వద్దకు చేరుకుంది. కాగా, జూన్ నెలలో గోదావరి వరద వస్తుందనే ముందే ఉహించిన ఇంజనీరింగ్ అధికారులు ఆ మేరకు అన్నీ సిద్ధం చేయడంతో ఎగువ కాఫర్ డ్యామ్, జెట్ గ్రౌటింగ్ పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇసుక ర్యాంపులో మునిగిన ట్రాక్టర్లు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు ర్యాంపులో కొంత కాలంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ర్యాంపుల్లో నీరు చేరుకోవడంతో ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు రోజులుగా మరల తవ్వకాలు ప్రారంభించారు. శనివారం తవ్వకాలు నిర్వహించి ఇసుకను ట్రక్కుల్లోకి ఎగుమతి చేస్తుండగా ధవళేశ్వరం వద్ద అధికారులు వరద నీటిని విడుదల చేశారు. మెల్లగా ర్యాంపులోకి నీరు చేరుతుండగా లోడుతోఉన్న ఐదు ట్రాక్టర్లు నీట మునిగాయి. పట్టిసీమ నీటి విడుదల పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శనివారం నీటిని విడుదల చేశారు గోదావరిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో పోలవరం చీఫ్ ఇంజనీరు శ్రీధర్ పూజలు నిర్వహించి కంప్యూటర్ ద్వారా పంపులను ఆన్‌చేశారు. అనంతరం డెలివరీ పాయింట్ వద్ద పైపుల ద్వారా వస్తున్న గోదావరి నీటికి పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మట్లాడుతూ.. గత ఏడాదికన్నా ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందుగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. గత ఏడాది 105.80 టీఎంసీల నీటిని విడుదల చేయగా ప్రస్తుతం 70,330 ఎకరాల్లో రైతులు వరి పండించుకున్నారన్నారు. ఈ ఏడాది అంతకుమించి నీటిని విడుదల చేసి కృష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నం చేస్తామన్నా రు. ఇదిలావుంటే, తుంగభద్ర జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతోంది. గడిచిన 10 ఏళ్లలో ఇం త స్థాయిలో వరద నీరు చేరడం ఇదే ప్రథమం. శనివారం రాత్రికి దాదాపు 17 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరింది.
Yaswanth526 Posted June 18, 2018 Posted June 18, 2018 Polavaram's overall progress at 55.38% The Polavaram Irrigation Project has reached an overall progress of 55.38%, officials reported to the Chief Minister during the 64th review of the project. This includes the headworks, the Right Main Canal and the Left Main Canal. The Chief Minister virtually inspected the progress using a live drone feed. 75.2% of the excavation for the spillway and spill channel has been completed, i.e., 838.80 lakh cubic metres out of 1,115.59 lakh cubic metres. This week, against a target of 11.76 lakh cubic metres, 3.02 lakh cubic metres of earthwork was excavated for the spill channel, pilot channel, spillway, left bank and approach channel. 26.1% of the concreting for the spillway, stilling basin and spill channel is completed, accounting for a total of 9.6 lakh cubic metres out of 36.79 lakh cubic metres. 28,000 cubic metres of concrete was laid this week. 61.17% of the construction of radial gates have been completed with trunnion castings and trunnion pins being the only remaining components.
sonykongara Posted June 23, 2018 Author Posted June 23, 2018 కొత్త అంచనాల ఆమోదంపై కసరత్తుపోలవరంలో 8 అంశాలపై కేంద్ర జలసంఘం అనుమానాలు వివరణలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికఈనాడు - అమరావతి పోలవరంలో రూ.58,319 కోట్లకు అంచనాలు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం పూర్తయింది. పోలవరంలో తదుపరి కీలక మైలురాయి కొత్త డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడమే. ఇందులో భాగంగా దాదాపు ఎనిమిది అంశాలపై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలకు ఏపీ అధికారులు తుది సమాధానాలు పంపారు. ఇప్పటికే మౌఖికంగా వారికి సమాధానాలు తెలిపినా లిఖితపూర్వకంగా వివరణలు కోరారు. ఈ మేరకు జవాబులు ఇస్తూ లేఖను పోలవరం ఇంజినీర్ ఇన్‌చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం మెయిల్ ద్వారా పంపారు. స్కోచ్ అవార్డుల స్వీకరణకు రాష్ట్ర జలవనరుల బృందం శనివారం దిల్లీ వెళుతోంది. ఈ సందర్భంగా అక్కడ నేరుగా కేంద్ర జలసంఘం అధికారులను కలిసి ఈ ప్రతిని అందిస్తామని అధికారులు ‘ఈనాడు’కు చెప్పారు.* పోలవరం కుడి, ఎడమ కాలువల అంచనాలు ఎందుకు మరీ ఎక్కువయ్యాయో తెలియజేయాలన్నదే ప్రధానాంశం. పని పరిమాణం పెరగడానికి కారణాలతో పాటు తొలి డీపీఆర్ ప్రకారం కాకుండా మార్పులు ఎందుకని కేంద్రజలసంఘం ప్రశ్నించింది.* ప్రాజెక్టు ప్రతిపాదన 1941 నుంచే ప్రారంభమైంది. 1980లో గోదావరి ట్రైబ్యునల్ అవార్డును ఖరారు చేశారు. 1976-81 సంవత్సరాల మధ్య జరిగిన సర్వే ఆధారంగానే ఎడమ కాలువకు సంబంధించి 1982లో కేంద్ర జలసంఘానికి తొలి డీపీఆర్ పంపారు. కుడి కాలువకు సంబంధించి 1984లోనూ ప్రధానడ్యాంతో కలిపి 1987లో డీపీఆర్ సమర్పించారు. తదనంతర కాలాల్లో కేంద్ర జలసంఘం సాంకేతిక అంశాలతో ఇచ్చిన తుది మార్గదర్శకాల ప్రకారం ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. ఈ మేరకు 2005-06 ధరల ప్రకారం అంచనాలు రూపొందించి 2009లో ఆమోదం పొందారు. 2010-11 ధరల ప్రకారం అంచనాలు రూపొందించి సాంకేతిక సలహా సంఘం ఆమోదం పొందారు. ఇప్పుడు తాజాగా 2013-14 ధరలతో తాజా అంచనాలు నవీకరించారు.* భూభౌతిక పరిస్థితుల్లో మార్పుల వల్ల పని అంచనా మారిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. తొలుత కుడి, ఎడమ కాలువలను 8,500 క్యూసెక్కుల మేరకే నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత 17,500 క్యూసెక్కులకు పెరిగింది. గోదావరిలో ప్రవాహాలు తగ్గుతున్నందునే కాలువల సామర్థ్యం పెంచుకోవాల్సి వచ్చిందని అధికారులు సమాధానమిచ్చారు. వంద రోజుల్లో 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలించేలా తొలుత కాలువ సామర్థ్యం నిర్దేశించారని, ప్రస్తుతం గోదావరిలో సెప్టెంబరు తర్వాత ప్రవాహాలు తగ్గుతున్నందున ఆ మేరకు తక్కువ రోజుల్లోనే లక్ష్యం మేరకు నీటిని కుడి ఎడమ కాలువల మీదుగా మళ్లించాల్సి వస్తోందని వివరించారు. ఏడాదిగా చర్చోపచర్చలుపోలవరానికి సవరించిన అంచనాలు గతేడాది ఆగస్టులోనే కేంద్రానికి పంపారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని అనుమానాలతో వెనక్కు పంపగా.. వాటికీ సమాధానాలిచ్చారు. కేంద్ర జలసంఘం అధికారులకు ఈ విషయాలపై స్పష్టత లేకపోవడంతో ఇంజినీరింగు అధికారుల్లో దిగువ స్థాయి బృందాలను వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు దిల్లీ పంపేవారు. వారు వారి పరిధిలో అంశాలకు మాత్రమే సమాధానాలిచ్చేవారు. ఈ నేపథ్యంలో నేరుగా కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులే వారి వద్ద కూర్చుని అనేక సందేహాలను నివృత్తి చేశారు. తాజాగా దిల్లీలో శనివారం నివేదిక అందించనున్నారు.
SREE_123 Posted June 24, 2018 Posted June 24, 2018 48 minutes ago, Yaswanth526 said: Clarified many doubts...esp...Harish Rao...comments.....AP need to share krishna water to TG, as Krishna delta is getting Godavari water...
sonykongara Posted June 24, 2018 Author Posted June 24, 2018 53,735 కోట్లు పోలవరం తుది అంచనా ఖరారు24-06-2018 02:00:44 ఇందులో 33,225 కోట్లు భూసేకరణ, ఆర్‌ఆర్‌కే జల విద్యుత్కేంద్రానికయ్యే 4205 కోట్లు అదనం కేంద్రానికి నివేదించిన జలవనరుల శాఖ సత్వరమే ఆమోదించాలని వినతి జూలై మొదటి వారంలో ఢిల్లీకి మన బృందం అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనాను రూ.53,735.20 కోట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఇందులో సింహభాగం.. రూ.33,225.74 కోట్లు భూసేకరణ, సహాయ పునరావాసానికి ప్రతిపాదించింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖకు, కేంద్ర జల వనరుల కమిషన్‌కు నివేదించింది. సవరించిన తుది అంచనాను ఆమోదించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలిసి కోరేందుకు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని రాష్ట్ర జలవనరుల శాఖ బృందం జూలై మొదటి వారంలో ఢిల్లీ వెళ్లాలని భావిస్తోంది. ఈలోగా వచ్చే గురు, శుక్రవారాల్లో (28, 29 తేదీల్లో) రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. వాస్తవానికి 2013-14 అంచనాలను రాష్ట్ర జలవనరుల శాఖ సవరించి.. జలవిద్యుత్కేంద్రంసహా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.58,319.06 కోట్లుగా తొలుత అంచనా వేసింది. తర్వాత ఉక్కు ధరలు తగ్గడంతో నిర్మాణ వ్యయాన్ని రూ.378.20 కోట్ల మేర తగ్గించి తుది అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లుగా పేర్కొంది. పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ భారం రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో దీనికయ్యే వ్యయం రూ.4205.66 కోట్లను కూడా మినహాయించింది. ఇవిపోగా.. పోలవరం సాగునీటి ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.53,735.20 కోట్లుగా తేల్చింది. పదేపదే అవే కొర్రీలు భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సి ఉన్నందున ఈ వ్యయం భారీగా పెరిగిందని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నోసార్లు తెలియజేసింది. పార్లమెంటరీ ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్టీ కమిషన్‌సహా పలు జాతీయ కమిటీలు పర్యటించి రాష్ట్ర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి. అయినా కేంద్రం కొర్రీలు మానలేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీతోపాటు.. బీజేపీ, జనసేన పార్టీలూ పోలవరం భూ సేకరణపై ఆరోపణల సంధించడం ప్రారంభించాయి. 2013నాటికి భూ సేకరణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లే ఈ పద్దు అంచనాలు ఆకాశానికి ఎగబాకాయని రాష్ట్ర జల వనరుల శాఖ మొత్తుకుంటోంది. 2010-11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. ఈ మొత్తాన్ని దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసింది. తుది అంచనాల ప్రకారం ఇంకా రూ.37,725.21 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులను పరుగులెత్తించాలంటే.. తుది అంచనాలను కేంద్రం తక్షణమే ఆమోదించి.. నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే గత ఏడాదిన్నరగా కేంద్రం వాస్తవ ధోరణిలో కాకుండా అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ.. కొర్రీల మీద కొర్రీలు వేస్తూనే ఉంది. కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ చైర్మన్ మసూద్ కూడా పోలవరం పనులు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిటీ నివేదికను ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే ప్రచురించింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ నివేదిక ప్రతులను సభ్యులకు అందజేసింది కూడా. ఇప్పుడు కేంద్ర జల సంఘానికి మసూద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం పనులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న ఆయన కూడా తుది అంచనాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇందుకు మోదీ ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుది అంచనాలను, పోలవరం డిజైన్లను త్వరితగతిన ఆమోదించాలంటూ ఈనెల 5వ తేదీన నితిన్ గడ్కరీకి దేవినేని లేఖ రాశారు. ఇందుకోసం కేంద్ర జల వనరుల శాఖ, జల సంఘం, జల కమిషన్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈమేరకు త్వరలోనే గడ్కరీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చని అంటున్నారు.
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 9 నాటికి గ్రౌటింగ్ పూర్తి కావాలి26-06-2018 02:54:46 పోలవరంపై ఆదేశించిన సీఎం గడువుకు ముందే ‘ఎగువ’ పనులు పూర్తి కావడంపై చంద్రబాబు హర్షం అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులోని ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల జెట్ గ్రౌటింగ్ పనులను జూలై 9 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులు గడువునకు ముందే పూర్తి కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి పునరావాస పనులను పూర్తిచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జలవనరులశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,050 మీటర్లు పొడవున ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, దిగువ జెట్ గ్రౌటింగ్ పనులు 77 శాతం అయ్యాయని ఆయనకు అధికారులు వివరించారు. పోలవరం నిర్వాసితుల కోసం పునరావాసం-పరిహారం కేటాయించిన రూ.3,115.11 కోట్లకు గాను రూ.219.25 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్‌ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పుగోదావరి కలెక్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 10వేల కోట్లివ్వండిపోలవరంపై కేంద్ర మంత్రి గడ్కరీకి చంద్రబాబు లేఖ ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఆమోదించే లోగా తక్షణం రూ.10వేల కోట్లు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక లేఖ రాశారు. ‘2010-11 అంచనాల ప్రకారం ఇంకా రూ.431.27 కోట్లు, ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1504.14 కోట్లు (మొత్తం రూ.1935.41 కోట్లు) రావాలి. ఈ నిధులన్నీ తక్షణం అందించే ఏర్పాటు చేయాలి...’ అని ఆయన కోరారు. * పోలవరంలో ఇప్పటికే 55శాతం పనులు పూర్తయ్యాయి. 2010-11 అంచనా వ్యయంలోని రూ.16010.45 కోట్లకు నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం రూ.13,978.54 కోట్లు ఖర్చు చేశాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టుపై రాష్ట్రం రూ.8662.67 కోట్లు (2018 మే నెలాఖరు వరకు) ఖర్చు చేయగా.. కేంద్రం రూ.6727.26 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. ఇంకా రూ.1935.41 కోట్లు ఇవ్వాల్సి ఉంది. * 1.4.2014 నాటికి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే నీటిపారుదల వ్యయమంతా పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. రూ.57,940.86 కోట్లతో సవరించిన అంచనాలను కేంద్ర జలసంఘానికి సమర్పించాం. వారు అడిగిన సందేహాలకు సమాధానాలూ పంపాం. తక్షణమే ఇవి ఆమోదం పొందేలా చూడగలరు. భూసేకరణ, పునరావాస కార్యక్రమలు వేగంగా అమలు చేస్తున్నాం. పనులు వేగవంతం చేశాం. నిధులు సకాలంలో అందకపోతే అన్ని పనులకు ఇబ్బందులొస్తాయి. ఆగస్టు 15 కల్లా ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలిరాష్ట్రంలో కొత్తగా చేపట్టదలుచుకున్న ప్రాధాన్య ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ మొత్తం ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వంశధార రెండోభాగం, రెండోదశ పనుల్లో భాగంగా హిరమండలం జలాశయంలో 5 టీఎంసీల నీరు నిలబెట్టాలన్నారు. వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం సోమవారం సమీక్షించారు. దిగువ కాఫర్ డ్యాం జెట్ గ్రౌటింగు పనులు తక్షణం వేగవంతం చేసి జులై 9 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. పునరావాసం, భూసేకరణకు రూ.219.25 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పగా తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస పనులు వేగవంతం చేయాలని అక్కడి కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పెదపాలెం, చినసేన, పులకుర్తి, అవుకు టన్నెల్, పులికనుమ ఎత్తిపోతల పథకాలు తదితరాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, జులై 15 నాటికి కొండవీటి వాగు ఎత్తిపోతల పనులు పూర్తవుతాయని, జులై31 నాటికి కుప్పం కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని అధికారులు వివరించారు. గుండ్లకమ్మ పనులు తుది దశకు చేరాయని, ఆగస్టు 31 నాటికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, నెల్లూరు- సంగం బ్యారేజి పనులు పూర్తవుతాయని చెప్పారు. జలవనరులశాఖకు 19 స్కోచ్ అవార్డులు దక్కడం అరుదైన ఘనతగా చంద్రబాబు అభివర్ణించారు. మంత్రి దేవినేని ఉమాను, అధికారులను అభినందించారు. నీటిపారుదల రంగంలో స్టేట్ ఆఫ్‌ది ఇయర్ కింద ప్లాటినం అవార్డుతో పాటు మరో 18 అవార్డులు సాధించడాన్ని ప్రశంసించారు. 54 ప్రాజెక్టుల పూర్తి, పంచనదుల మహాసంగమం, గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేద్దామని పేర్కొన్నారు. చర్చలో భాగంగా నిధులు విడుదలలో ఆలస్యం చేయడం లేదన్న భాజపా నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారులు సాయిప్రసాద్, శశిభూషణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బృందస్ఫూర్తితోనే 60 అవార్డులుబృంద స్ఫూర్తి వల్లే ఆంధ్రప్రదేశ్ 60 అవార్డులు సాధించిందని, అద్భుత బృందం అనే పేరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఈ అవార్డులు రాష్ట్ర ప్రజలకే అంకితమన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయాభివృద్ధిపై సోమవారం కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు సగటున 20 నుంచి 30 అవార్డులు మాత్రమే వచ్చాయన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటీశాఖల్లో ఎక్కువ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. వీటిని సాధించిన వారందరికీ త్వరలో సత్కారం చేస్తామన్నారు. ‘పెళ్లికానుక ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయొద్దు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో విత్తన పంపిణీ వేగవంతం చేయాలి. ఈ నెలాఖరులోగా రూ.300 కోట్ల ఉపాధి నిధులతో పనులు పూర్తి చేయాలి. వృక్షమిత్రలను ప్రోత్సహించాలి. ఖరీఫ్‌లో రైతులకు ఎరువులు, పంటరుణాలు అందించాలి. సూక్ష్మపోషకాలు ఉచితంగా ఇవ్వాలి. సాగు విస్తీర్ణం 2కోట్ల ఎకరాలకు చేరాలి. ఉద్యాన సాగు కోటి ఎకరాలకు పెరగాలి...’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 https://www.youtube.com/watch?v=-AvuBYZi7N0
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 ఎగువ కాఫర్‌డ్యామ్ జెట్‌గ్రౌటింగ్ నిర్మాణం పూర్తి పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన నిర్మిస్తున్న ఎగువకాఫర్‌డ్యామ్ జెట్‌గ్రౌటింగ్ పనులు పూర్తయినట్లు ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్ సోమవారం రాత్రి ‘న్యూస్‌టుడే‘కు చెప్పారు. ఇసుక తిన్నెలపై నుంచి 20 మీటర్ల లోతున ఇసుకను గట్టిపర్చడమే జెట్‌గ్రౌటింగ్ అని వెల్లడించారు. గోదావరి నదిపై పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి వరకూ 2045 మీటర్ల పొడవునా చేపట్టిన ఈ పనులను కెల్లర్ సంస్థ త్వరగా పూర్తి చేసిందని, డయాఫ్రమ్‌వాల్ నుంచి 400 మీటర్ల దూరంలో ఎగువకాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టామని వివరించారు. వరదలు తగ్గిన వెంటనే అక్టోబరు లేదా నవంబరులో దానిపై కాఫర్‌డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. తద్వారా 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం కుడి, ఎడమ కాలువలకు నీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
sonykongara Posted June 26, 2018 Author Posted June 26, 2018 కెల్లర్’ కమాల్26-06-2018 02:48:53 గడువుకు ముందే కాఫర్ డ్యాం గ్రౌటింగ్ పోలవరం పనుల్లో మరో మైలురాయి వారం ముందే పూర్తి చేసిన కెల్లర్ రాత్రింబవళ్లూ కష్టించిన ఇంజనీర్లు 4 నెలల్లోనే 2,050 మీటర్ల గ్రౌటింగ్ ‘అంచనాలు’ ఆమోదించండి ఖర్చు పెట్టిన 1504 కోట్లు తిరిగివ్వండి 10 వేలకోట్ల విడుదలకు అనుమతివ్వండి గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ ఏలూరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి జీవ-జల నాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. టార్గెట్‌ను ముందుగానే చేరుకొంటూ.. వరుసగా రికార్డులను బద్దలు కొడుతున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులను గడువు కన్నా వారం రోజులు ముందుగానే పూర్తిచేసి, మరో మైలురాయిని అధిగమించాయి. ఈ పనులను ఆస్ర్టేలియా కంపెనీ కెల్లర్ చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి ఎగువ కాఫర్ డ్యామ్‌లో జెట్ గ్రౌటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, సోమవారం నాటికే ఆ లక్ష్యాన్ని ఆ కంపెనీ చేరుకొంది. దీనికోసం వందమంది ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టించి పనిచేశారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎటువంటి తేమ (సీపేజ్) రాకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మిస్తారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ, గోదావరి నడిబొడ్డున సుమారు 2,050 మీటర్ల నిడివి ఉన్న ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలని తలపెట్టారు. కేంద్రం నుంచి డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మే 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ పనులను ప్రారంభించారు. దీనికోసం రూ.105 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూన్ చివరినాటికి ఈ పనులను పూర్తిచేయాలని ‘కెల్లర్’కు సీఎం నిర్దేశించారు. నిపుణత, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, సిబ్బంది సంకల్ప బలం, నేరుగా సీఎం జరిపిన సమీక్షలు చకచకా పనులు పూర్తి కావడానికి దోహదపడ్డాయి. సోమవారం సాయంత్రం జెట్ గ్రౌటింగ్ చివరి విడత పనులు కాగానే ప్రాజెక్టు ప్రాంతంలో వేడుక వాతావరణం కనిపించింది. ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులు పరస్పరం అభినందించుకొన్నారు. అనుకున్న గడువుకు వారం ముందుగానే లక్ష్యాలను ఛేదించడం సంతోషంగా ఉన్నదని సీఈ శ్రీధర్ అన్నారు.. కాఫర్ డ్యామ్ ఎందుకంటే.. ఒక ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి దిగేటప్పుడు, దానికి ఎగువ, దిగువన నిర్మించేదే కాఫర్ డ్యామ్. ఎగువ నుంచి ఎటువంటి నీటి చెమ్మ ప్రధాన ప్రాజెక్టుకు సోకకుండా సాధ్యమైనంత మేర నూరు శాతం ఈ తేమను కట్టడి చేయడమే కాఫర్ డ్యామ్ నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now