Jump to content

Recommended Posts

Posted (edited)
53.12% progress in Polavaram project

https://cdn.ncbn.in/ncbn/feed/ncbnBanner1525708260361.jpeg

Briefing on the progress made so far, an official informed the Chief Minister that till now 53.12% of progress has been made which includes the head works, and right and left main canals and within the next few months, the goal of delivering water by gravity will be achieved. The Chief Minister was also informed that statistically if .1% of total work is carried out per day, the timelines set will be achieved on schedule.

The Chief Minister was also informed that till 29.4.18, the works on soil dredging which includes spill channel, spillway, pilot channel, left flank and approach channel were completed upto 72.30%. The same works over the last week have shown great progress of .46% and currently, 72.76% of the dredging has been completed.

Similarly, concrete works which include spillway, stilling basin, spill channel have progressed by .87% and a total of 21.04% work has been finished. The diaphragm valve, jet grouting and radial gates are also being completed in full swing and have a total progress of 88.95%, 67.32% and 60% respectively.

The Chief Minister also discussed the progress and issues with officials from Navayuga and Transtroy and asked them to adhere to the specified timelines. “All the works should be completed as per set deadlines and there shouldn’t be any scope of exceeding the timelines. Make the progress and achievements available online and there shouldn’t be any scope for error and all the works must be completed on a priority basis”, said the Chief Minister to the officials present.
 
Edited by Yaswanth526
Posted
కొర్రీల మీద కొర్రీలు
13-05-2018 03:19:30
 
  • పోలవరం నిధుల విడుదలకు ఎంవోఏలో మార్పులు చేయాలంటూ షరతు
  • ఈ నెల 4 నుంచి ఆర్థిక శాఖలోనే ఫైలు
  • 1098 కోట్లకు కేంద్రం ఆటంకాలు
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1098 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ గత నెల ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తోన్న ప్రభుత్వానికి... కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొత్తగా మరోషాక్‌ ఇచ్చింది. ఈ నిధులు విడుదల చేయాలంటే నాబార్డు, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చేసుకున్న మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌(ఎంవోఏ)కు సవరణ చేయాలని, కొత్తగా కొన్ని అంశాలను చేర్చాల్సి ఉందని పేర్కొంది. దీంతో.. ఆ ఒప్పంద సవరణలను ఈ నెల 4వ తేదీన కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వద్ద ఈ ఫైలు పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి కేంద్ర జల వనరులశాఖకు, అనంతరం నాబార్డుకు ఈ ఫైలు చేరి... రీయింబర్స్‌మెంట్‌ కావాల్సిన రూ.1098 కోట్లు పీపీఏ ద్వారా రాష్ట్రానికి వచ్చే సరికి మరో 15 రోజులైనా పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు ఎంవోఏను సవరించాలని భావిస్తే తప్పులేదుగానీ... ఇప్పటికే రీయింబర్స్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన రూ.1098 కోట్ల విడుదలకు కొత్తగా ఎంవోఏను సవరించాలని కేంద్రం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
తుది అంచనాలపైనా కిరికిరి
2013-14 తుది అంచనాలపైనా కేంద్రం మళ్లీ కొర్రీలు వేసింది. వాస్తవానికి ఈ కొర్రీలను గతంలోనే వేసింది. వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ ఇచ్చిన సమాధానాలతో కేంద్ర జలసంఘం సంతృప్తి కూడా వ్యక్తం చేసింది. దీంతో మరి కొద్ది రోజుల్లోనే తుది అంచనా వ్యయం రూ.58,319.06 కోట్లకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ ఆశించింది. కానీ, ఇంతలోనే పాత కొర్రీలనే కేంద్రం రిపీట్‌ చేసింది. ఈ నెల 3న ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్‌ మసూద్‌తో జరిగిన సమావేశాన్ని కేవలం డిజైన్లకే పరిమితం చేశారు. తుది అంచనాల గణాంకాలు పరిశీలనలో ఉన్నాయి.
Posted
పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
14-05-2018 13:24:12
 
636619010527121903.jpg
 
అమరావతి: పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. 60వ సారి పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ జరిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.50 శాతం పూర్తి అయినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. కుడికాలువ 89.60 శాతం, ఎడమ కాలువ పనులు 59.60 శాతం పూర్తి అయిందని, స్పిల్‌వే, స్పిల్, అప్రోచ్, పైలెట్ చానళ్లు, లెఫ్ట్ ఫ్లాంక్ ఎర్త్‌వర్క్ 73.26 శాతం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 91శాతం, జెట్ గ్రౌటింగ్ పనులు70శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 60.28 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
 
కాగా పోలవరం కాంక్రీట్ పనుల్లో వేగం మందగించడంపై నిర్మాణ సంస్థల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏ నెలకు చెందిన లక్ష్యాలను అదే నెలలో అధిగమించాలని సూచించారు. జూన్ 11 కల్లా డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు ముందుగానే నీరు విడుదల చేయవచ్చునని చంద్రబాబు అన్నారు.
Posted
నెల రోజుల్లో అంతర్భాగ డ్యాం పూర్తి
జూన్‌ 11న పోలవరం సందర్శించి ప్రకటన చేస్తా
ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి వెల్లడి
కాంక్రీటు పనుల మందగమనంపై ఆరా
14ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో గోదావరి అంతర్భాగ డ్యాం పనులు జూన్‌ 11 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాన డ్యాం, కాఫర్‌ డ్యాం నిర్మాణంలో భాగంగా గోదావరి అడుగు నుంచి నిర్మించుకుంటూ వచ్చే డయాఫ్రం వాల్‌ పనులు, జెట్‌ గ్రౌటింగు పనులను అప్పటికి పూర్తి చేయాలన్నారు. ఆ రోజు స్వయంగా ప్రాజెక్టును సందర్శించి.. ఈ పనులు పూర్తయినట్లు ప్రకటిస్తానని సీఎం చెప్పారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులపై వెలగపూడి సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్షించారు. పోలవరంలో కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతుండడంపై
సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉండటంతో కార్మికులు పని చేయలేకపోతున్నారని, యంత్రపరికరాలు కొంత మొరాయించడం కూడా కారణమని పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు చెప్పారు. బ్యాచింగ్‌ ప్లాంట్లు, ఇతరత్రా యంత్రాలు సిద్ధం చేస్తున్నామని, వచ్చే వారాల్లో లక్ష్యాలతో కలిపి మిగిలిన పనిని పూర్తిచేస్తామని నవయుగ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
గత వారంలో స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌తో పాటు మిగిలిన పనుల్లో 5.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు, 29 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనికిగానూ.. ఇప్పటివరకు 8.03 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పని చేసినట్లు తెలిపారు. అల్తూరుపాడు జలాశయం పనులు జూన్‌లో ప్రారంభించి డిసెంబరుకు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి పనులు జూన్‌ నెలాఖరకు పూర్తి కావాలన్నారు. హిరమండలం జలాశయం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. స్వర్ణముఖి- సోమశిల లింకు కాలువకు సంబంధించి అటవీ అనుమతులపైనా సమీక్షించారు. జల సంరక్షణ పనుల గడువును జూన్‌ నెలాఖరు వరకు పెంచుతున్నామని, అప్పటికి పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం కార్యాలయ కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్‌, రవిచంద్ర, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

14ap-main3b.jpg

లక్ష మందితో పోలవరంలో గ్యాలరీ నడక: ఉమా
పోలవరం ప్రాజెక్టులో ఆగస్టులో లక్ష మందితో ‘గ్యాలరీ నడక’ నిర్వహిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు సగానికి పైగా పూర్తయింది. మొత్తం 22 స్పిల్‌ వే బ్లాకులు.. 17 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తయ్యాయి. (16 మీటర్ల వరకు స్పిల్‌ వే గ్యాలరీల నిర్మాణం పూర్తయితే మధ్యలో టన్నెల్‌ ఆకారం ఏర్పడుతుంది. దీనినే స్పిల్‌ వే గ్యాలరీ అంటారు) ఆగస్టు నాటికి గ్యాలరీ సిద్ధమవుతుంది. అందులో లక్ష మందితో కలిసి నడిచే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నాటి ప్రధానితో కలిసి గ్యాలరీలో నడిచామని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు’’ అని మంత్రి వివరించారు.
వైకాపా అధ్యక్షుడు జగన్‌ పులివెందుల వెళ్లి అక్కడ కృష్ణా జలాలు ఎలా ప్రవహిస్తున్నాయో, చీనీ, అరటి తోటలకు తాము నీరు ఎలా ఇచ్చామో చూడాలని  మంత్రి సూచించారు. ‘లోటస్‌పాండ్‌లో కమలం నీళ్లు చల్లుకోవడం కాదు, పులివెందుల వెళ్లి కృష్ణా నీళ్లు చల్లుకోవాలి’ అని సలహా ఇచ్చారు. జగన్‌ తమను రాక్షసులుగా చిత్రీకరిస్తున్నాడని, ఆయనకు అమిత్‌షా దేవుడా అని మంత్రి ప్రశ్నించారు.

Posted
పోలవరంలో కీలక ఘట్టం
15-05-2018 00:46:16
 
636619419764310151.jpg
  • 11 నాటికి డయాఫ్రమ్‌వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు పూర్తి
  • జోరందుకున్న ప్రాజెక్టు పనులు
  • 11న సీఎం ప్రాజెక్టు సందర్శన
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తికావస్తోంది. అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు పూర్తికావచ్చాయి. ఇవి జూన్‌ 11నాటికి పూర్తికానున్నాయి. ఇంకోవైపు ప్రాజెక్టు పనులు బాగా జోరందుకున్నాయి. ఇప్పటికే 53.50 శాతం పూర్తయ్యాయి. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంపై 60వ వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. డయాఫ్రమ్‌వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు తుది దశకు చేరుకోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి పూర్తికాగానే ఈ నిర్మాణ పనులు చేస్తున్న కెల్లర్‌, బావర్‌-ఎల్‌ అండ్‌ టీ సంస్థలు ప్రాజెక్టు పనుల భాగస్వామ్యం నుంచి విరామం తీసుకుంటాయని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. జూన్‌ 11న ప్రాజెక్టును సందర్శిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. కాంక్రీట్‌ పనుల్లో వేగం మందగించడంపై ఆరా తీశారు. మెషినరీలో తలెత్తిన సమస్యలతో కాస్త వెనుకబడ్డామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.
 
 
ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో అధిగమించాలని ఆయన స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా కృష్ణా డెల్టాకు ముందుగా నీటిని విడుదల చేయొచ్చని చెప్పారు. కుడి ప్రధాన కాలువ 89.60 శాతం, ఎడమ ప్రధాన కాలువ 59.60 శాతం, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌, ఎర్త్‌వర్క్‌ 73.26 శాతం, స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు 21.83 శాతం, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 91 శాతం, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 70ు, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 60.28ు మేర పూర్తయినట్లు జల వనరులశాఖ ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు.
 
 
ప్రాధాన్య ప్రాజెక్టులకు తుది గడువు
పోలవరం ప్రాజెక్టు సమీక్ష ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 54 ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవిపల్లి రిజర్వాయరు మే 31 నాటికి, కుప్పం బ్రాంచి కెనాల్‌ ఆగస్టు నాటికి, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. మూలపల్లితో పాటు మరో 4 చెరువుల పనులను ఈ ఏడాది చివరికి పూర్తిచేసి నీరు తీసుకెళ్లాలని సూచించారు.
 
 
పంచ నదుల సంగమానికి సంకల్పిద్దాం
వంశధార-నాగావళి అనుసంధాన పనులు పరుగులు పెట్టించాలని జల వనరుల శాఖను సీఎం నిర్దేశించారు. హిరమండలం పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలన్నారు.
 
 
139 రోజులకు పెంపు..
జల సంరక్షణ ఉద్యమ స్ఫూర్తి కింద చేపట్టిన పనులు నూరు శాతం పూర్తయ్యేందుకు వీలుగా గడువును 116 రోజుల నుంచి 139 రోజులకు పెంచు తూ ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ నెలాఖరు నాటికి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది సాధారణం కంటే 13 శాతం తక్కువగా వర్షపాతం నమోదుకానుందని చెప్పారు.
Posted
పోలవరంపై కేంద్రం కుట్ర!
19-05-2018 02:45:40
 
  • తుది డిజైన్లు ఆమోదించదు.. సవరించిన అంచనాలూ అంతే
  • నిధులకు మోకాలడ్డు.. నాబార్డు సందేహాలు.. ‘ఆర్థిక’ కొర్రీలు
  • ఇంకా రాని 1089 కోట్లు.. 2019లోగా అవకుండా అడ్డుపుల్లలు
  •  సకాలంలో పూర్తికాకుండా ఎత్తుగడ
  •  నిధులు విడుదల కాకుండా మోకాలడ్డు
  •  నాబార్డు సందేహాలు.. ఆర్థిక శాఖ కొర్రీలు
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... లక్ష్యానికి అనుగుణంగా అది పూర్తికాకుండా అడ్డుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కారణాలతో అడుగడుగునా మోకాలడ్డుతోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్‌ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.
 
మార్చిలోనే చెప్పినా రాని నిధులు
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.1089 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ లిఖిత పూర్వకంగా వెల్లడించింది. ఈ సమాచారం రాష్ట్ర జల వనరుల శాఖకూ చేరింది. ఈ నిధులు డిసెంబరు నాటి బిల్లులకు సంబంధించినది. మార్చి మూడోవారంలో వచ్చిన ఈ నిధుల సమాచారం ఏప్రిల్‌ మొదటి వారంలో కార్యరూపం దాల్చుతుందని రాష్ట్ర జల వనరులశాఖ ఉన్నతాధికారవర్గాలు ఆశించాయి. అయితే.. ఏప్రిల్‌లో రూ.1089 కోట్లు విడుదల కాలేదు. మళ్లీ ఈ నెల 4వ తేదీన మరో దఫా ఈ రూ.1089 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లిఖిత పూర్వకంగా సమాచారం అందింది. దీంతో.. ఈ సమాచారాన్నీ రాష్ట్ర జల వనరులశాఖకు పీపీఏ చేరవేసింది. రెండుసార్లు అధికారికంగా సమాచారం పంపినందున ఒకటి రెండురోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి రూ.1089 కోట్ల నిధులు పీపీఏకు చేరుతాయని రాష్ట్ర జల వనరులశాఖ ఆశించింది. కానీ, అంతలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నాబార్డుల మధ్య కుదిరిన మొమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఏంవోఏ)లో కొద్దిపాటి సవరణలు చేసుకోవాల్సి ఉందంటూ నాబార్డు పేర్కొంది. ఎంవోఏలో సవరణలపై ఆమోదం తెలిపేందుకు ఈనెల మొదటివారంలో కేంద్ర ఆర్థికశాఖకు ఫైలు వెళ్లింది. ఈ ఫైలు పెండింగ్‌లో ఉండగానే... నాబార్డు మరో కొత్త కిరికిరి తెరపైకి తెచ్చింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు రుణానికి సంబంధించి మార్గదర్శకాలను సవరించాల్సి ఉందం టూ మరో అంశాన్ని లేవనెత్తింది. ఈ ఫైళ్లకు మోక్షం కలిగితే తప్ప.. మార్చి నెలలో విడుదల కావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తం విడుదల కాదు.
 
అంచనాలపై నిర్ణయం లేదు
మరో ముఖ్యమైన విషయం... పోలవరం 2013-14 తుది అంచనాలు రూ. 58,319.06 కోట్లకూ కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా ఈ తుది అంచనాలపైనా ఎలాంటి నిర్ణయామూ తీసుకోలేదు. ఫలితంగా .. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలు ఎప్పటికి ఆమోదం పొందుతాయో తెలియని స్థితి నెలకొంది. ఈ నిధులు వస్తేనే పోలవరం నిర్వాసితులకు పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టడం సాధ్యమవుతుంది.
 
డిజైన్లపైనా నాన్చుడే
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనులకు సంబంధించిన డిజైన్లపైనా కేంద్ర జలసంఘం ఆమోదం తెలపకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావస్తున్న తరుణంలో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, గేట్ల బిగింపులు, క్రస్ట్‌ గేట్ల డిజైన్లకు సంబంధించి ఇంకా డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలిస్తూనే ఉంది. కానీ, కేంద్ర జలసంఘం సమావేశాలు నిర్వహించి ఆమోదం తెలపడం లేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ విషయంలోనూ జాప్యం చేస్తోంది.
Posted
On 5/18/2018 at 4:18 AM, sonykongara said:

jc7FzdI.jpg

orni, mattli katta daggara vaste pareledu kani, mari concrete lining vesina daggara kuda avutundi ante aa lining chesina contractor/engineers ki oka dannam.

Posted
ఓర్వలేకే కేసులు
21-05-2018 03:07:54
 
636624688752420589.jpg
  • పోలవరం పనులు చకచకా
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు పూర్తిచేస్తారు
  • ఇప్పటికే 53.9 శాతం పనులు పూర్తి
  • మంత్రి దేవినేని ఉమ వెల్లడి
  • న్యాయవాదులతో కలిసి ప్రాజెక్టు పరిశీలన
పోలవరం, మే 20: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంతవేగంతో జరుగుతుంటే కొంత మంది ఓర్వలేక తరచూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆదివారం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ, అడ్వకేట్‌ జనరల్‌ దమ్ములపాటి శ్రీనివా్‌సతో కలిసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు, డయా ఫ్రం వాల్‌ నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు ఎవరెన్ని చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని పూర్తి చేసి తీరతారని స్పష్టం చేశారు. ‘ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎనిమిది, హైకోర్టులో రెండు కేసులు వేశారు. కాంగ్రెస్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరావు, సామాజికవేత్తల ముసుగులో కొంత మంది, పక్క రాష్ట్రాల్లోని కొంతమందితో ఈ కేసులు వేయించారు.
 
 
ఢిల్లీ హైకోర్టులోచ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లోనూ కేసులు వేశారు. ఏదో రకంగా పోలవరాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. కానీ దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టులో జరగనంత వేగంతో పోలవరం పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు ఇప్పటికే 53.9 శాతం పూర్తయింది. మట్టి పని 73.54 శాతం, కాంక్రీట్‌ పనులు 22.56 శాతం, ఢయా ఫ్రం వాల్‌ నిర్మాణ పనులు 93.3 శాతం, కాపర్‌ డ్యామ్‌లో జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 73.2 శాతం, గేట్లు 60.5 శాతం, కనెక్టవిటిస్‌ 57.7శాతం కుడి కాలువ 99 శాతం, ఎడమ కాలువ 59.8 శాతం పూర్తయింది’ అని వివరించారు. ప్రాజెక్టుకు ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం రూ.13,464 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాక రూ.8,330 కోట్లు ఖర్చుచేయగా.. కేంద్రం రూ.5,342 కోట్లు ఇచ్చిందన్నారు. ఇంకా రూ.2,988 కోట్లు రావలసి ఉందని, మార్చిలో రూ.1,089 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం చెప్పినా.. మూడు నెలలైనా రాష్ట్రానికి అందలేదని చెప్పారు.
 
 
కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రాజెక్టును సీఎం పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మండుటెండల్లో సైతం కాంక్రీట్‌ పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని చెప్పారు. 2019 జూన్‌కల్లా గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. పోలవరంలో నిబంధనలకు లోబడే పనులు ముందుకు నడుస్తున్నాయని న్యాయవాదులకు కూడా విశ్వాసం కలిగిందని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వారు స్వయంగా పరిశీలించినందున పూర్తి అవగాహన వచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌కు పక్క రాష్ట్రాలపై ఉన్న ప్రేమ ఆంధ్ర రాష్ట్రంపై లేదని మండిపడ్డారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...