Jump to content

Recommended Posts

Guest Urban Legend
Posted
2 minutes ago, Saichandra said:

Started 

chaala hurdles create chestunnadu modi gadu ..

Posted
పోలవరానికి రూ.1089 కోట్లు
నాబార్డుకు చేరిన దస్త్రం, రెండు మూడు రోజుల్లో విడుదల
జూన్‌ 11న జాతీయ ప్రాజెక్టులపై దిల్లీలో భేటీ

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.1089 కోట్లు నిధులు త్వరలో రాష్ట్రానికి చేరనున్నాయి. మార్చి నెలాఖరునే ఈ మొత్తం రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఆ నిధులు విడుదలకు నిబంధనల ప్రకారం ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాదాపు రెండు నెలల అనంతరం తిరిగి ఆర్థికశాఖ అనుమతి పొంది ఆ ప్రతిపాదన కేంద్ర జలవనరులశాఖ నుంచి జాతీయ జల అభివృద్ధి సంస్థకు చేరింది. అక్కడి నుంచి నాబార్డుకు వెళ్లి నిధులు విడుదల కానున్నాయి. ప్రస్తుతం నిధుల విడుదల ప్రక్రియ తుది దశకు చేరిందని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు భూసేకరణకు సంబంధించి మరో రూ.345 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులకు సంబంధించి జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ నిరంతరం కేంద్ర జలసంఘం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.ఈ రెండింటికి సంబంధించిన నిధులు వస్తే తొలి ప్రాజెక్టు నివేదిక ప్రకారం మొత్తం నిధులు వచ్చినట్లవుతుంది. ఆపై పోలవరంనకు కేంద్రం నిధులు ఇవ్వాలంటే రూ.58 వేల కోట్లకు సవరించిన అంచనాలు ఆమోదించాల్సి ఉంటుంది.

ముందుగానే సవరించిన అంచనాలపై చర్చ: జూన్‌ 11న జాతీయస్థాయి సాగునీటి ప్రాజెక్టులపై దిల్లీలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరంనకు జాతీయస్థాయి హోదా ఇచ్చిన నేపథ్యంలో దిల్లీ సమావేశానికి జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులు హాజరుకానున్నారు. ఈ లోపునే అధికారులు దిల్లీ పర్యటనకు వెళ్లి సవరించిన అంచనాలపై చర్చించనున్నారు. 11న కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తారు. మరో వైపు ప్రాజెక్టుకు గతంలో కేంద్ర పర్యావరణశాఖ పని నిలుపుదల ఉత్తర్వులకు సంబంధించి కూడా లేఖ రాయబోతున్నారు. ఆ ఉత్తర్వులను పూర్తిగా తొలగించాలని కోరనున్నారు.

Posted

Polavaram Bhoosekarana bills poorthiga pampi Center meeda funds release ki full pressure pettali.

Posted
మత్స్యకారులకు నష్ట పరిహారం ఇవ్వాలి
ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు

ఈనాడు, దిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ కారణంగా మత్స్యకారుల జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని, నష్టపరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విచారణకు స్వీకరించింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ జావేద్‌ రహీంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణం కారణంగా నదీ ప్రవాహాన్ని మళ్లించారని తద్వారా మత్స్యకారులకు చాలా నష్టం వాటిల్లుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రగ్యా సింగ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకోచ్చారు. కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 31కి వాయిదా వేసింది.

Posted
మీ హరికథలు వినలేం!
02-06-2018 02:37:04
 
636635038319976316.jpg
  • పోలవరం ఫైలుతో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు
  • ఆరు నెలలుగా పైసా విడుదల చేయలేదు
  • 1089 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ ఏమైంది?
  • భూ సేకరణ, పునరావాసంతో సీడబ్ల్యూసీకి ఏం పని?
  • కేంద్ర అధికారికి రాష్ట్ర ఉన్నతాధికారి సూటి ప్రశ్నలు
  • ఈనెల 11న భేటీకి హాజరుకాబోమని స్పష్టీకరణ
అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘పోలవరానికి నిధుల విడుదల’... అంటూ పదే పదే ప్రకటనలు, లేఖలు! కానీ... అన్నీ కాగితాలకే పరిమితం! రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరేది శూన్యం! ఇలాంటి పరిస్థితుల్లో... ప్రాజెక్టులపై సమీక్ష పేరిట కేంద్ర జలవనరుల శాఖ ఈనెల 11న ఏర్పాటు చేసిన భేటీకి హాజరు కాకూడదని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర అధికారి ముఖాన సూటిగా చెప్పేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమీక్షకు హాజరు కావాలని కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారికి ఫోన్‌ చేశారు. దీనిపై రాష్ట్ర అధికారి తీవ్రంగా స్పందించారు.
‘‘పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్రం మాటలు చెబుతోంది. ఏపీ నుంచి పంపిన ప్రతి ఫైలునూ వెనువెంటనే క్లియర్‌ చేసేస్తున్నామని పేర్కొంటోంది. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. గత 6 నెలలుగా పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క పైసా విడుదల కాలేదు. 2017-18 సంవత్సరానికి రావాల్సిన రూ.1089కోట్ల రీయింబర్స్‌ చేయలేదు. ఆ తర్వాత విడుదలైన రూ.1400కోట్లు, రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సిన మరో రూ.350 కోట్లు కూడా రాలేదు. వీటిని విడుదల చేసినట్లు కాగితాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కొత్త ఒప్పందాలంటూ నాటకాలు ఆడుతున్నారు. పోలవరం తుది అంచనాలు ఇంత ఎక్కువైతే ఎలా అని సీడబ్ల్యూసీ ప్రశ్నిస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలించాల్సిన సీడబ్ల్యూసీకి.. భూ సేకరణ చట్టం, సహాయ పునరావాస కార్యక్రమాల గురించి ఏం పని?’’ అని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారి ఒకరు కేంద్ర అధికారిని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ‘ఈ సమావేశానికి మేమెందుకు రావాలి? మీరు చెప్పే హరికథలను వినడానికి రావాలా? మీ మాటలు విని సంబరపడాలా’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆరు నెలలుగా ఒక్క పైసా నిధులు విడుదల చేయకపోతే నిర్మాణ పనులెలా సాగుతాయని నిలదీశారు. దీంతో.. కేంద్ర అధికారి పోలవరం ప్రాజెక్టు ఫైలు ఎక్కడ ఉందని ఆరా తీయగా... ‘పోలవరం ఫైలుతో కేంద్రం ఫుట్‌బాల్‌ ఆడుతోంది’ అని రాష్ట్ర అధికారి ఆక్రోశించారు.
Posted
పోలవరం పనులు తక్షణమే ఆపండి
ఒడిశా సీఎం
0335392BRK103-PATNAIK.JPG

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి ప్రాజెక్టుగా పేర్కొంటున్న పోలవరం పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖలు రాశామని, ఒడిశాకు తెలియకుండా ఎలాంటి పనులూ చేపట్టకుండా నిలుపుదల చేయాలని అప్పడు కోరినట్టు చెప్పారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్‌ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో అభిప్రాయపడ్డారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని ఆయన కేంద్ర పర్యావరణ శాఖను కోరారు.

 

 

Posted
పోలవరంపై అనుమానాలు పటాపంచలు...
03-06-2018 11:06:20
 
636636207880754650.jpg
 
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం సొంత ఖర్చులతో పనులు పూర్తి చేస్తోంది. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులు మరో వారంతో పూర్తవుతాయి.
 
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కేంద్రం నిధులివ్వకున్నా.. రాష్ట్రప్రభుత్వ సొంత ఖర్చుతో మరో వారంలోపు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తికాబోతోంది. దేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో పూర్తికాబోతున్న తొలి నిర్మాణం ఇది. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయి. ఈ నెల పదో తేదీ లోపు మిగతా ఐదు శాతాన్ని అలవోకగా పూర్తిచేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికి సమాంతరంగా కీలకమైన కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులూ శరవేగంగా జరుగుతున్నాయి.
 
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం ఒకటి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్లే. ఈ డ్యాం నిర్మాణ పనులు చేపట్టాలంటే దానికి ముందుగా నదీగర్భంలో నిర్మించేదే డయాఫ్రంవాల్‌. దీని నిర్మాణం వల్ల నదీగర్భం నుంచి గోదావరి నీరు డ్యాం కింది భాగంలో ప్రవహించే అవకాశం ఉండదు. ఇంజనీర్ల పరిభాషలో చెప్పాలంటే.. డ్యాం అడుగున ఈ నిర్మాణంతో నీటి ప్రవాహ ఒత్తిడిని అడ్డుకుంటారు. ఇందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి డయాఫ్రం వాల్‌ నిర్మించాలి. ప్రపంచంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇలాంటి టెక్నాలజీని ఒకటి, రెండు చోట్లే వినియోగిస్తున్నారు. ఆ టెక్నాలజీతోనే పోలవరంలోనూ డయాఫ్రంవాల్‌ నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 1500 మీటర్ల పొడవున రెండు దశల్లో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం విధించింది. మొదటిదశలో ప్రాజెక్టు కుడివైపున 800 మీటర్ల నిడివితో, రెండోదశలో ఎడమవైపున 700 మీటర్ల పొడవున నిర్మించాలని నిశ్చయించింది. 2018 జూన్‌ 10లోపు ఈ పనులు పూర్తిచేసే లక్ష్యంతో ఈ బాధ్యతను బావర్‌ కంపెనీకి అప్పగించారు. ప్రస్తుతానికి వాల్‌ నిర్మాణంలో మరో 25 మీటర్లు మాత్రమే పూర్తిచేయాల్సి ఉంది.
 
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి 2019కల్లా గ్రావిటీ ద్వారా రైతులకు నీరు అందించి తీరతామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. మొత్తం పోలవరం పనుల్లో ఇప్పటికి పూర్తయింది 54 శాతమే అయినా.. ఏడాదిలోపే మిగతా పనులపై దృష్టిపెట్టి.. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వగలమని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. స్పిల్‌వే నిర్మాణం కూడా జోరందుకుంది. ఇందులో 52 బ్లాకులకు గాను 46 బ్లాకుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగతా ఆరు బ్లాకుల విషయంలోనూ కొంత పని మాత్రమే మిగిలి ఉంది.
Posted
రేపో మాపో నిధులు
పోలవరం తొలి డీపీఆర్‌లో రావాల్సింది రూ.400 కోట్లే
  సవరించిన అంచనాల ఆమోదమే ఇక కీలకం
  6000 క్యూబిక్‌ మీటర్ల రికార్డు స్థాయి కాంక్రీటు పనులు
డయాఫ్రం వాల్‌ పనులు మిగిలింది 18 మీటర్లే
4ap-main5a.jpg

విద్యుత్తు కేంద్రం మినహా పోలవరం పాత అంచనాలు: రూ.13,466 కోట్లు
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన 2014 మార్చి తర్వాత ఖర్చు: రూ.8330 కోట్లు
ఇంతవరకు చెల్లించింది:    రూ.5342 కోట్లు
ఇంకా రావాల్సింది:  రూ.2988 కోట్లు
విడుదలకు సిద్ధంగా ఉన్నది:  రూ.1400 కోట్లు
తొలి డీపీఆర్‌కు సంబంధించి ఇంకా రావాల్సింది (రమారమి): రూ.400 కోట్లు
మే నెలాఖరు వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది: మరో రూ.300 కోట్లు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయమై గత ఆరు నెలలుగా నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని అనేక శాఖల మధ్య, అనేక సంస్థల మధ్య అటూ, ఇటూ రకరకాలుగా కదులుతున్న దస్త్రం ఒక కొలిక్కి వచ్చింది. అన్ని దశలు దాటుకుని నాబార్డుకు వెళ్లింది. ప్రస్తుతం నాబార్డు... మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం రెండు విడతలుగా మంజూరైన మొత్తం రూ.1400 కోట్లు ఈ వారంలోనే    రాష్ట్ర ఖజానాకు చేరుతుందని భావిస్తున్నారు. విద్యుత్తు ప్రాజెక్టు మినహాయిస్తే తొలి డీపీఆర్‌ కింద రూ.13,466 కోట్లకు కేంద్రం ఆమోదించిన బడ్జెట్‌లో ఇక కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం రూ.400 కోట్లే. అంతకుమించి రాష్ట్రం ఇప్పటికే దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేసి ఉంది. ఆ నిధులూ కేంద్రం నుంచి రావాలి. ఆ మొత్తం విడుదల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.58 వేల కోట్లకు సవరిస్తూ పంపిన అంచనాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. ఇవి ఆమోదం పొందే లోపు అడ్వాన్సుగా కొంత నిధులు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రానికి విన్నవించనుంది.

కాంక్రీటు పనుల్లో తాజా రికార్డు
పోలవరం కాంక్రీటు పనుల్లో ఈ వారంలో తాజా రికార్డు సాధించారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు కలిపి ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 6000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేపట్టారు.  ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో కాంక్రీటు పనులు చేసింది ఇప్పుడే. ఏ ప్రాజెక్టులోనూ రాష్ట్రంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఒక్క రోజులో కాంక్రీటు వేసింది లేదని అధికారులు చెబుతున్నారు.
* డయా ఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇక కేవలం 18 మీటర్ల మేర మాత్రమే పని మిగిలి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. కాఫర్‌ డ్యాంలో ఎగువ డ్యాం పనలు వేగంగా సాగుతున్నాయి. జూన్‌ 11న ముఖ్యమంత్రి పోలవరం సందర్శించనున్నారు. ఆ రోజుకి డయాఫ్రంవాల్‌ పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...