Jump to content

Recommended Posts

Posted (edited)
15 minutes ago, LuvNTR said:

june lopala spill way complete avudda? ayithe better. they will anyway targets this project af KA elections. 

by 2019 may spillway , spill channel, coffer dam will be completed . by 2019 december main dam(ecrf dam) will be completed. don't worry they won't target polavaram. they need this project for godavari-cauvery linking which give more cauvery water to karnataka.

Edited by ravindras
Posted
2019కి గ్రావిటీతో పోలవరం నీరు
25-04-2018 02:09:33
 
  • ప్రణాళికలు సిద్ధం చేశామన్న రాష్ట్రం
  • కేంద్రం సంతృప్తి.. డిజైన్లు, తుది అంచనాలపై 3న భేటీ
అమరావతి, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 నాటికి గ్రావిటీతో నీటిని వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. నిర్వాసితులకు అవసరమైన సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేస్తామని వివరించింది.ఢిల్లీలో మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు సహాయ, పునరావాస కార్యక్రమాలపై కేంద్ర కార్యదర్శి మీనా నాయర్‌, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి లతా కృష్ణమూర్తి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ సమీక్ష నిర్వహించారు.
 
ఇందులో రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, సహాయ, పునరావాస కమిషనర్‌ రేఖారాణి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది నవంబరులో మీనా నాయర్‌, లతా కృష్ణమూర్తి విడివిడిగా పోలవరాన్ని సందర్శించారు. ఈ సమయంలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మంగళవారంనాటి సమావేశంలో ఇదే విషయాన్ని వారు ప్రస్తావించారు. కానీ, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల బాధ్యతను నవయుగకు అప్పగించాక నిర్మాణంలో వేగం పెరిగిందని శశిభూషణ్‌ వివరించారు.
 
నిర్వాసితులకు పరిహారం, సహాయపునరావాస కార్యక్రమాల గురించీ వెల్లడించడంతో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు సకాలంలో లక్ష్యాల మేరకు పూర్తి కావాలంటే నిధుల ప్రవాహం పారాల్సి ఉందని శశిభూషణ్‌ చేసిన వాదనను యూపీ సింగ్‌ సమర్థించారు. కాగా, పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, తుది అంచనాలపై మే 3న కేంద్ర జలసంఘం చైర్మన్‌ మసూద్‌ సమావేశం ఏర్పాటు చేశారు. శశిభూషణ్‌ కుమార్‌ బృందం మంగళవారం మసూద్‌ను కలిసింది.
Posted
మధ్యలోనే ప్రవాహం మాయం
గోదావరిలో కోయిడ నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు
ఏడాదికి సరాసరి 146 టీఎంసీల నష్టం
ఈ ప్రభావం పోలవరం నిర్మాణం తర్వాత ఇంకా ఎక్కువ ఉండే అవకాశం
తాజా అధ్యయనంలో వెల్లడి
26ap-main8a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘గోదావరిలో పోలవరానికి వచ్చే ప్రవాహం మధ్యలోనే నష్టం రూపంలో మాయమవుతోంది. ఇది ప్రధానంగా గోదావరిలో కోయిడ-పోలవరం మధ్య చోటుచేసుకుంటోంది. ఈ రెండింటి మధ్య ప్రవాహ దూరం కేవలం 53 కి.మీ. మాత్రమే అయినా ఏడాదికి సరాసరి 146 టీఎంసీల నష్టం ఉంటోంది. కొన్ని సంవత్సరాల్లో మరీ ఎక్కువ. ఈ ప్రభావం పోలవరం రిజర్వాయర్‌ నిర్మాణం తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుంది’’ ఓ తాజా అధ్యయనలో వెల్లడించిన అంశాలివి. 1977 నుంచి  2006 మధ్య 29 సంవత్సరాల పాటు ఈ రెండింటి మధ్య నీటి ప్రవాహ వివరాలను మదించి అది ఈ అంచనాకు వచ్చింది. పైనుంచి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య లేకున్నా తక్కువ ప్రవాహం ఉండి రిజర్వాయర్‌లో ఉన్న నీటిలో ఎక్కువ కోల్పోవడం వల్ల ప్రాజెక్టుపై భారీ ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న శ్రీనాథుడు ఈ అధ్యయనం చేశారు. దీనిపై ఇటీవల కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలసంఘానికి చెందిన ఉన్నతస్థాయి ఇంజినీర్లంతా చర్చించారు. కోయిడ-పోలవరం మధ్యలోనే పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ప్రాంతం ఎక్కువ. కోయిడ నుంచి పోలవరం మధ్య ప్రయాణంలో సరాసరిన ఏడాదికి 146 టీఎంసీల నీటి నష్టం జరుగుతుండగా అది మొత్తం లభ్యమయ్యే నీటిలో 4.55 శాతం. మామూలుగా అయితే ఇది తక్కువే కానీ, కొన్ని సార్లు ఇది 20 శాతానికి పైగా కూడా ఉంది. కోయిడ వద్ద 1986 ఆగస్టు రెండో వారంలో నీటిమట్టం 41 మీటర్లు ఉండగా ఇది పోలవరం కనీస నీటిమట్టం 41.5 మీటర్లకు దగ్గరగా ఉంది. దీని ఆధారంగా అధ్యయనం చేయగా కోయిడ నుంచి వెళ్లిన మొత్తం నీరు 1,552 టీఎంసీలు కాగా, పోలవరం దగ్గరకు చేరింది 1,345 టీఎంసీలు. దీని ప్రకారం నష్టం 207 టీఎంసీలు. అదే పోలవరం రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లను పరిగణనలోకి తీసుకుని చూస్తే నష్టం 325 టీఎంసీటు ఉంటుందని ఈ అధ్యయనం వివరించింది.

ఎందుకిలా... వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కోయిడ-పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1983 ఆగస్టు 15న కోయిడ వద్ద 58,616 క్యూసెక్కుల(179 టీఎంసీలు) ప్రవాహం ఉంటే పోలవరం వద్ద 40,176 క్యూసెక్కులు(124 టీఎంసీలు) ఉంది. అంటే ఒక రోజులో 55 టీఎంసీలు, 1986 ఆగస్టు 17న 45 టీఎంసీలు పోయింది.

కోయిడ వరకు కనిపించని తేడా: పైభాగంలో ఉన్న గేజ్‌ స్టేషన్ల వద్ద నీటి ప్రవాహంతో కోయిడలో లభ్యమయ్యే నీటితో పోల్చినపుడు పెద్దగా తేడా కనిపించలేదు. పేరూరు గేజ్‌ స్టేషన్‌ వద్ద 2,369 టీఎంసీలు, సంగం వద్ద 11, కుంట వద్ద 511, మధ్యలో గేజ్‌లతో సంబంధం లేని పరివాహక ప్రాంతం నుంచి వచ్చేది 308 టీఎంసీలు కలిపి మొత్తం 3,199 టీఎంసీలు ఉండగా, కోయిడ వద్ద 3,218 ఉంది. కోయిడతో పాటు దిగువన లభించే నీటి లభ్యతతో కలిపి పోలవరం దగ్గర ఇంకా ఎక్కువ ఉండాల్సి ఉండగా తక్కువ ఉంటోంది. ఈ నష్టం ఎక్కువగా నదీ ప్రాంతంలోనే జరుగుతుందని, తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు కూడా ఈ నష్టం ఉందని అధ్యయనం పేర్కొంది.

నష్టం ఎక్కడో గుర్తించాలి: శ్రీనాథుడు, కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌.. జులై మొదటి పదిరోజుల నుంచి సెప్టెంబరు వరకు 90 రోజులపాటు పోలవరం కాలువలకు నీటి లభ్యత ఉంటుంది. రిజర్వాయర్‌ జులై మొదటి పది రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. అక్కణ్నుంచి సెప్టెంబరు మొదటి పదిరోజులు ఉంటుంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు రోజుకు ఉండే నష్టం 32.5 టీఎంసీలు. కనీస నీటిమట్టం ఉన్నప్పుడు 24 టీఎంసీలు. దీనివల్ల ఏడాది మొత్తం ఈ రిజర్వాయర్‌ ద్వారా వినియోగించుకొనే మొత్తం తగ్గిపోతుంది. ఈ నీటినష్టం ఎక్కడ జరుగుతుందో ఖచ్చితంగా గుర్తించాలి.

Posted

Polavaram left canal works are being expedited will be completed by November and would be ready for inauguration on December 1st

ఈ ఎడమకాలువ కలకత్తా జాతీయరహదారిని 27 చోట్ల దాటాలి..వంతెనలు,ఆక్వెడక్ట్ లు చాలా కట్టాలి..పోలవరం డాం కన్నా చాలా పెద్దపని

https://pbs.twimg.com/media/Dby9Yh4U8AAT9mE.jpg

https://pbs.twimg.com/media/Dby9nGhUwAEXuoi.jpg

Posted
5 minutes ago, sonykongara said:

U3MNYSF.jpg

Opposition may make it an issue. 22 Cr for taking visitors to the site. But it will be good publicity for TDP. They should take the opportunity to educate people about the rapid progress that was achieved during this term.

 

Posted
1 minute ago, TDPforever said:

Opposition may make it an issue. 22 Cr for taking visitors to the site. But it will be good publicity for TDP. They should take the opportunity to educate people about the rapid progress that was achieved during this term.

 

In every govt project some amount should be used for PR and public awareness. It is mandatory. Adi ila vafutunaru anthe.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...