sonykongara Posted April 20, 2018 Author Posted April 20, 2018 దారి మళ్లిన గోదారమ్మడయాఫ్రమ్వాల్ నిర్మాణం కోసం అడ్డుకట్ట పోలవరం, న్యూస్‌టుడే: అఖండ గోదారమ్మ దారి మళ్లింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై డయాఫ్రమ్‌వాల్ నిర్మిస్తున్నారు. అందుకు తూర్పుగోదావరి జిల్లా అంగుళూరు గ్రామం వద్ద నది మధ్యలో గురువారం అడ్డుకట్ట వేశారు. ఇక్కడ నుంచి నీరు వెళ్లేలా విద్యుత్తు కేంద్రం ఎదురుగా ఇసుక తిన్నెలపై కాలువ తవ్వారు. ఈ మార్గం ద్వారా పోలవరం పరిధిలో నిర్మించిన తూరల వద్దకు నీరు చేరుకుంటుంది. అక్కడినుంచి దిగువ కాఫర్‌డ్యామ్ వద్ద ఉన్న పాత గోదావరిలోకి కలుస్తుంది. డయాఫ్రమ్‌వాల్ మొత్తం 1427 మీటర్ల పొడవు నిర్మించాలి. అందులో భాగంగా గతేడాది 1200 మీటర్ల గోడ నిర్మించారు. 1,000వ మీటరు వద్ద నీటి ప్రవాహానికి వీలుగా 40 తూరలు ఏర్పాటుచేశారు. దీనిపై వాహనాలు వెళ్లేందుకు రహదారి వేశారు. తూరల్లో నుంచి వచ్చే నీరు కొంతదూరం ప్రయాణించి దిగువ కాఫర్‌డ్యామ్ సమీపంలో పాత గోదావరిలో కలిసిపోతుంది. అడ్డుకట్ట వల్ల జూన్ మొదటి వారంలో గోదావరికి వరదలు వచ్చేవరకు పనులకు ఎలాంటి విఘాతం కలగదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈలోగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించి యంత్రాలతో సహా ఒడ్డుకు చేరుకుంటామని ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు తెలిపారు. ఎల్‌అండ్‌టీ, బావర్ కంపెనీ ఇప్పటికే గోదావరిపై పనులు చేసేందుకు వీలుగా సర్వం సిద్ధం చేసింది. శాండ్‌వైబ్రేషన్ పనులు ముమ్మరం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంనుంచే అడ్డుకట్ట వేయడానికి జలవనరుల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టాలో రబీ వరికి సాగునీరు అందించాల్సి రావడం, అనంతరం తాగునీటి అవసరాలు తీర్చడానికి చెరువులు నింపాల్సి ఉండటంతో గోదావరి మళ్లింపు కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం నదికి ఎగువ నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, అదంతా మళ్లింపు మార్గం ద్వారా కిందికి వెళ్తుందని అధికారులు చెప్పారు. అలాగే పర్యాటకులను తీసుకెళ్లే బోట్లు, లాంచీలను గోదావరి నది ఎగువ ప్రాంతం అంగళూరు వద్దకు తరలించారు.
sonykongara Posted April 23, 2018 Author Posted April 23, 2018 పోలవరంలో మరో కీలక ఘట్టం23-04-2018 02:07:09 నేడు స్పిల్ చానల్ పనులకు సీఎం శ్రీకారం 3 కి.మీ. దారిమళ్లనున్న ప్రవాహం పోలవరం, ఏప్రిల్ 22: పోలవరం ప్రాజెక్టులో మరో అతికీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు.. ప్రణాళిక ప్రకారం అత్యంత వేగంగా సాగుతున్నాయి. అనుబంధ పనులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ, నవయుగ కంపెనీ అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా స్పిల్ చానల్ కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్ పనులు, డయాఫ్రం వాల్, కాపర్ డ్యామ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు ప్రారంభిస్తున్నారు. స్పిల్‌వే నుంచి వచ్చే నీటిని మొత్తం ఈ స్పిల్ చానల్ ద్వారా తిరిగి గోదావరిలోకి కలుపుతారు. వేగంగా మట్టి తరలింపు: స్పిల్ చానల్ నిర్మాణంలో మొత్తం 3.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని బయటకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం వందల సంఖ్యలో వాహనాలను భారీ డంపర్లు, ఎక్స్‌వేటర్లను మోహరించారు. రాత్రి పగలు పని చేస్తూ ఇప్పటి వరకు 2.18 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని పూర్తిచేశాయి. ఇంకా 1.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాల్సి ఉంది. స్పిల్ చానల్‌లో మొత్తం 2.92 కిలోమీటర్ల పొడవునా.. కిలోమీటరు వెడల్పులో కాంక్రీట్ వేయనున్నారు. దీని నిర్మాణంలో 18.80 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. ఈ పనులను 7,520 బ్లాక్‌లుగా విభజించి కాంక్రీట్ వేస్తారు. పది మీటర్ల వెడల్పు, పది మీటర్ల పొడవు, ఒక మీటరు ఎత్తుతో వేసి దానిని ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా నిర్మాణానికి 4,13,600 టన్నుల సిమెంట్‌ను, 17 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను, 9 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగించనున్నారు. గో‘దారి’ మళ్లింపు వరద సమయంలో మహోగ్రరూపంతో గోదావరి ప్రవహిస్తుంది. దాదాపు 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. దీనికి అడ్డుకట్ట వేసి స్పిల్ చానల్ ద్వారా నీటిని మళ్లిస్తారు. పోలవరం గ్రామం దగ్గర ఈ నీరు గోదావరిలో కలుస్తుంది. దీంతో గోదావరి ప్రవాహం ప్రాజెక్టు ప్రాంతం నుంచి పోలవరం గ్రామం వరకూ 3 కిలోమీటర్లు పక్కకు జరిగి స్పిల్ చానల్ ద్వారా ప్రవహిస్తుంది.
sonykongara Posted April 23, 2018 Author Posted April 23, 2018 స్పిల్‌ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు23-04-2018 14:00:38 ప.గో: పోలవరం ప్రాజెక్టులో మరో అతికీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అనంతరం డయాఫ్రంవాల్‌ను సీఎం పరిశీలించారు. గోదావరి నది మళ్లింపును పరిశీలించిన చంద్రబాబు గోదావరి నీటిని తలపై చల్లుకున్నారు.
Yaswanth526 Posted April 23, 2018 Posted April 23, 2018 CBN inspected the progress of Polavaram project today. He later interacted with farmers and students from the region 3mar 1
APDevFreak Posted April 23, 2018 Posted April 23, 2018 Spillway inka 11 lakh cubic metres pending, it's going slow because of the complexity and cooled concrete. Spillchanell 18.5 lakh cubic metres anta. hope this doesn't need cooled concrete. if cooled concrete its not possible by may 2019 i guess.
APDevFreak Posted April 23, 2018 Posted April 23, 2018 4 minutes ago, Jeevgorantla said: Spillway inka 11 lakh cubic metres pending, it's going slow because of the complexity and cooled concrete. Spillchanell 18.5 lakh cubic metres anta. hope this doesn't need cooled concrete. if cooled concrete its not possible by may 2019 i guess. In one of the above video they are just pouring concrete for spillway channel. there is no iron structure visible in the video. Then it might not need cooled concrete. with out iron structure , does the concrete will only stop the erosion?
ravindras Posted April 23, 2018 Posted April 23, 2018 2 hours ago, Jeevgorantla said: Spillway inka 11 lakh cubic metres pending, it's going slow because of the complexity and cooled concrete. Spillchanell 18.5 lakh cubic metres anta. hope this doesn't need cooled concrete. if cooled concrete its not possible by may 2019 i guess. curing is must for concrete , steel is not required for spill channel . it is like cement road with 1 meter thickness
sonykongara Posted April 24, 2018 Author Posted April 24, 2018 నోళ్లు మూయించండిప్రతిపక్షాలకు జనమే సమాధానం చెప్పాలి ఎలా నీళ్లందిస్తున్నామో ఊరూరా చాటండి లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది పోలవరం రైతు సదస్సులో సీఎం చంద్రబాబు 10 వేల కోట్ల అడ్వాన్సు ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్పోలవరం నుంచి ఈనాడు ప్రతినిధి నేను 24 గంటలూ కష్టపడుతున్నా. నాలుగేళ్లుగా ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్టును ఇంతవరకు తీసుకొచ్చా. దీనితో పాటు ఇతర ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నాయి. దీనిపై ఊళ్లల్లో చర్చ జరపాలి. విమర్శకుల నోళ్లు మీరే మూయించాలి. మంచిని మంచిగా చెప్పాల్సిన బాధ్యత ప్రజలదే. మంచిని చెడుగా చెప్పే వారి గుండెల్లో నిద్రపోవాలి. ఇప్పుడే ఇందుకు నాంది పలకాలి... విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు జనమే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులకు, అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాల వైఖరిని, విమర్శకుల వైఖరికి ప్రజలు గమ్మున ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందని, మీ పిల్లలే నష్టపోతారని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద సోమవారం నిర్వహించిన రైతు సదస్సుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టు చూసేందుకు రైతులు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు చూసినవాళ్లు ఇక్కడ జరిగిన అభివృద్ధిని, రాష్ట్రం మొత్తం ఎలా నీళ్లందిస్తున్నామో బొమ్మలు వేసి ప్రజలకు వివరించాలన్నారు. ఒక్కొక్కరు వెయ్యి మందికి చెప్పాలని చెప్పారు. సాంకేతికంగా, లీగల్‌గా తాను ఎక్కడా తప్పు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే శంఖారావం పూరించాం: ‘ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చనందునే నేను ఎదురుతిరిగాను. కొందరు ఇప్పుడా ఎదురుతిరిగేది అని ప్రశ్నిస్తున్నారు. నాయకుడు ఎప్పుడు పడితే అప్పుడు స్పందించకూడదు. అప్పుడే ఎదురుతిరిగి ఉంటే ఈ ప్రాజెక్టు వచ్చి ఉండేది కాదు. కేంద్రంపై నాడే పోరాటానికి దిగి ఉంటే రాష్ట్రం బలిపశువు అయి ఉండేది. పాండవులు 5 ఊళ్లైనా ఇమ్మన్నారు. ఇవ్వకపోవడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ధర్మం, న్యాయం మన పక్షాన ఉన్నాయి. అందుకే ధర్మపోరాటానికి శంఖారావం పూరించామని...’’ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చినందున ఆ వెంకన్నకే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందన్నారు. సాక్షి పత్రిక విషం కక్కుతూ అభివృద్ధి ఆగిపోవాలని కోరుకుంటోందన్నారు. ఇప్పుడు గ్యాస్, విద్యుత్తు కొరత ఉందా అంటూ రైతులను సీఎం ప్రశ్నించగా లేదని వారు సమాధానం చెప్పారు. విద్యుత్తు 24 గంటలూ ఇస్తామని, భవిష్యత్తులో ఛార్జీలు పెంచబోమని చెప్పారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ఎంపీలు సీతామహాలక్ష్మి, మాగంటి బాబు,మురళీమోహన్, ఉన్నతాధికారులు సాయిప్రసాద్, శశిభూషణ్, ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. పోలవరానికి రూ.10వేల కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలి.. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలకు ఆమోదం తెలిపేలోపు కేంద్రం రూ.10 వేల కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. విద్యుత్కేంద్రం మినహాయించి రూ.52,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోలవరం రెండో డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇది చట్టబద్దమైన హామీ అని, రాజీపడబోమని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్నారు. సోమవారం స్పిల్ ఛానల్ కాంక్రీటు పనులను ఆయన ప్రారంభించారు. అధికారులతో సమీక్షించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఆలస్యంగా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయని పక్షంలో గుత్తేదారులను మార్చాలని ఆదేశించారు. దాదాపు 18 లక్షల కాంక్రీటు పని ఇక్కడ జరగాల్సి ఉందని, షెడ్యూలు కన్నా నెల్లాళ్ల ముందే ఈ పనులను ప్రారంభించామని, రోజుకు 15 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేస్తే అది దేశంలోనే రికార్డు అని వివరించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డ్యాం పనులు మే నెలాఖరుకు పూర్తవుతాయని, డయాఫ్రం వాల్ పనులు 330 అడుగుల లోతు నుంచి చేసుకుంటూ వచ్చామని వివరించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లు ఇచ్చేందుకు పనులు చేస్తున్నామని, ఇప్పటికే 52.6శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి నుంచి మరో 200 టీఎంసీలు అదనంగా వాడుకుంటూ కృష్ణా డెల్టా, విశాఖ, రాయలసీమకు త్వరలో నీళ్లు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది 7 లక్షల ఎకరాలకు సూక్ష్మనీటి సేద్యం కింద నీరు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. జీవ ఎరువులు తీసుకువస్తున్నామని, అది వాడటం వల్ల పొలంలో నీరు వెళ్లిపోదని, ఇంకిపోదని, రెండు నెలలు వర్షం రాకపోయినా ఇబ్బంది ఉండదని చెప్పారు. మహానందిలో 43.52 డిగ్రీలుకర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : మహానంది మండలంలో సోమవారం అత్యధికంగా 43.52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డలో 43.12, పాణ్యం 42.90, దొర్నిపాడు 42.40, కర్నూలు 42.39, పగిడ్యాల 42.36, చాగలమర్రి 42.31, అత్యలంగా శ్రీశైలంలో 32.80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఇతరుల సహకారంతో 3,228 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకృతి వైపరీత్యాల డీపీఎం ఎల్లయ్య పేర్కొన్నారు.
sonykongara Posted April 24, 2018 Author Posted April 24, 2018 కురుక్షేత్రమే.. హామీలు నెరవేర్చకుంటే యుద్ధమే: సీఎం24-04-2018 01:42:01 ధర్మం, న్యాయం రాష్ట్రం వైపే విజయం సాధించి తీరుతాం పోలవరం పూర్తికాకుండా కుట్రలు మాపై రైతుల్లో వ్యతిరేకత పెంచి రాజకీయ లబ్ధి పొందే యోచన అందరూ పోలవరం చూడండి మంచిని కథలు కథలుగా చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు పోలవరం ప్రాజెక్టు సందర్శన... స్పిల్ చానల్ పనులు ప్రారంభం తాడేపల్లిగూడెం/పోలవరం ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): విభజన హామీలన్నీ నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. లేదంటే కురుక్షేత్ర సమరమేనని కేంద్రాన్ని హెచ్చరించారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరంలో కీలకమైన స్పిల్ చానల్ పనులను ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అక్కడ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ‘‘మహాభారతంలో ఐదు ఊళ్లు ఇవ్వనందుకు కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది. కౌరవులు ప్రసంగించారు. ‘‘మహాభారతంలో ఐదు ఊళ్లు ఇవ్వనందుకు కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది. కౌరవులు ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్రం చేపడుతున్న యుద్ధంలోనూ విజయం మనదే! ఎందుకంటే... ధర్మం, న్యాయం మనవైపే ఉన్నాయి. ధర్మపోరాటానికి శంఖం పూరించాం’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి మోదీతో సహా అందరూ రాజకీయాల్లోకి తన తర్వాత వచ్చిన వారే అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని, చెప్పిన మాట నెరవేర్చాలన్న తనను విమర్శించే హక్కు వీరికి లేదన్నారు. ‘‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై మోదీ హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చాలి. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఎదురు తిరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. ‘‘ఈ పని మొదటి ఏడాదిలోనే చేయాల్సిందని కొందరు అంటున్నారు. కానీ... అప్పుడే ఎదురు తిరిగి ఉంటే పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయేది. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి’’ అని సీఎం సూచించారు. ప్రాజెక్టుపై కుట్రలు పోలవరం ప్రాజెక్టు పూర్తికాకూడదని అడ్డు పడుతున్నారని విపక్షాలపై చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టులపై కోర్టులకు, ట్రిబ్యునల్‌కు వెళ్తున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టులకు కష్టాలు పెరుగుతాయి. ప్రాజెక్టులు ఆగిపోతే ప్రజలకు కష్టాలు వస్తాయి. తద్వారా... నాపై వ్యతిరేకత పెరుగుతుందని, అంతిమంగా అది తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలకు ఐదు కోట్ల మంది ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి అందరూ మరొకరికి చెప్పాలన్నారు. ‘‘ప్రతీరోజూ పోలవరానికి 750 మంది రైతులను తీసుకొస్తాం. వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు, మేథావులూ ఈ ప్రాజెక్టును సందర్శించి... అవగాహన తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ పది మందికి, వందమందికి, వెయ్యిమందికి చెప్పండి. పనిగట్టుకుని మరీ చెప్పండి. కథలు కథలుగా విడమరిచి చెప్పండి’’ అని కోరారు. దీనివల్ల మంచిని ప్రోత్సహించడంతో పాటు... చేస్తున్న మంచిని చెడుగా చిత్రీకరించే వారికి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని సీఎం తెలిపారు. పోలవరం నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని... పనులు పూర్తి చేసే బాధ్యత మాత్రం రాష్ట్రానిదని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలి. డీపీఆర్-2ను ఆమోదించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు విలువ పెరిగింది. భూసేకరణకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అత్యధిక నిధులు కేటాయించాల్సి వస్తోంది. అందుకోసమే డీపీఆర్-2లో ప్రాజెక్టు వ్యయం పెరిగింది. దీనిని ఆమోదించి... ముందస్తుగా పదివేల కోట్లు ఇవ్వాలి’’ అని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టులో గ్రావిటీ ద్వారా సాగునీటిని అందిస్తామని తెలిపారు. కేంద్రం నిధులు సమకూర్చినప్పుడే అది సాధ్యపడుతుందన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టుతోపాటు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. ‘‘మే నెలలోనే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాడెల్టాకు నీటిని మళ్లించి శ్రీశైలం, సాగర్‌ల ద్వారా సీమకు నీరు అందిస్తాం’’ అని తెలిపారు. నీటి భద్రత నా ఆశయం నీటి భద్రతే తన జీవితాశయమని చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. ‘‘శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నదులను అనుసంధానిస్తాం. వంశధార - నాగావళి, కృష్ణా - గోదావరి - పెన్నా నదులను అనుసంధానించి రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రైతుల ఆదాయాన్ని పెంచుతాం’’ అని భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేస్తున్నప్పటికీ తన మీడియా ద్వారా విషం కక్కుతున్నారని పరోక్షంగా జగన్‌పై మండిపడ్డారు. ముందుగా పులివెందులకే తాగునీరు ఇచ్చామని జగన్‌కు చురకలు అంటించారు. రాష్ట్రంలో వ్యవసాయంలో నీటి పొదుపు కోసం జీబాను వాడాలన్నారు. ఎకరానికి 12.5 కిలోల జీవాను వినియోగిస్తే నీటి పొదుపు సాధ్యపడుతుందని తెలిపారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now