Jump to content

Next generation communal mobs ready avtunnai ga


Recommended Posts

  • Replies 344
  • Created
  • Last Reply

బుర్ర తక్కువ మాష్టారు...

 

ముందుగా వాళ్ళు నల్లదే వేసుకొస్తామని చెప్పలేదు

మామూలు యూనిఫామ్ వేసుకొనే నెత్తిన head scarf యూనిఫామ్ రంగులోదే వేసుకుంటున్నారు..

 

Personal laws

 Indian laws కన్నా పెద్దవని ఎవరూ అనలేదు..

Right to religious freedom,right to equality కిందనే కోర్ట్ లో కూడా వాదిస్తున్నారు..నిజానికి కాలేజీ వాళ్ళే వాళ్ళని విడిగా ఉండమన్నారు..చివరకు కాలేజీకి రావద్దని కూడా నిషేధించారు..

 

బుర్ర తక్కువ మనిషి 

రాజ్యాంగం లో ఏ ఆర్టికల్స్ లోనూ చెప్పర్రా యూనిఫామ్ల గురించి..

చివరకు కర్నాటక రాష్ట్ర చట్టంలో కూడా చెప్పలేదు 

కాలేజీ కమిటీ కి వదిలేశారు యూనిఫామ్ గురించి..

Most confused రాజ్యాంగం కాదురా most elaborated constitution 

 

Right to equality 

Right to religious freedom 

కి కొన్ని exceptions ఇస్తారు అంత మాత్రాన అది confusion ఎందుకు అవుతాది ?? 

ఉదాహరణకు 

మైనార్టీ భాషలు,మతాల వారికి తమ విద్యా సంస్థలను స్వతంత్రంగా నిర్వహించుకునే హక్కు ఇచ్చారు.. ప్రత్యేకంగా రక్షణ కల్పించారంటే మెజారిటీ హిందువులు తమ విద్యా సంస్థలు నడుపుకోకూడదని కాదురా నాయనా .

 

రాజకీయ నాయకులు చేసే చెత్తకు రాజ్యాంగాన్ని ఎందుకు అంటావ్ బుర్ర తక్కువ సోదరా ?? 

 

అంబేద్కర్ బుర్ఖా దురాచారం అన్నాడు కానీ బుర్ఖా కారణంగా వారికి చదువు నిషేధం చేయమని చెప్పలేదు..

ఆయనే ఉంటే ముందు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి వారిలో జ్జానం పెరిగితే మార్పు వస్తదనే వాడు..

నాలుగు ముక్కలు చదవగానే 

అంబేద్కర్, రాజ్యాంగం మీద పీహెచ్డీలు చేసినట్లు వాగుతారు..

మా కర్మ మీకేమో వేలమంది ఫాలోవర్స్..

Link to comment
Share on other sites

 

వ్యక్తిగత స్వేచ్ఛ, విద్యా హక్కుకి ఇచ్చిన మద్దతు ముస్లిం సాంప్రదాయవాదులు,చాంధసులు తప్పు గా తమ మతానికి ఇచ్చిన మద్దతుగా అర్థం చేసుకుంటారు..

వాళ్ళలో మార్పు తేవాల్సిన బాధ్యత చదువుకున్న ముస్లిం యువత మీదనే ఉంది..

@Sr Fan @Npower @AllDBians

Link to comment
Share on other sites

Ee Rojullo Ante Chaintanya Narayana Don't allow prayer due to lack of time gaaani...all most all schools start with Prayer:

Which includes Saraswati Namasthubhyam..

All most all school proggames start with Religiuous Especially Hindu Practices...and You are saying We are Secular and treat everyone equal...Hypocrites 

Link to comment
Share on other sites

మార్పు సహజం... తప్పక వస్తుంది. 

 

బురఖానే మీ ప్రాబ్లం అయితే దాన్ని వాళ్ళకి వాళ్ళే తీసేయడానికి ఏం చేయాలో అదే చేయాలి. ఖచ్చితంగా దానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం విద్యద్వారా, రాషనల్ థింకింగ్ ద్వారానే వస్తుంది.

 

మతంలో పుట్టి, మతంలో పెరిగి, చిన్నప్పటి నుండీ మత విద్యలని అభ్యసిస్తూ ఏదో విధంగా మత విద్యలు నేర్పే మదరసాలని దాటి సాధారణ విద్యలోకి వచ్చి, దేశ చదువు చదివే వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి ఈ దాడులేంటీ, ఈ రౌడీయిజం ఏంటీ... ఇలా చేయడం వల్ల ఈ పిల్లలంతా మత విద్యలోకే వెల్తారుకదా మళ్ళీ. అక్కడితోనే ఆగిపోతే తద్వారా మతం బలపడుతుంది తప్ప లౌకికంగా ఈ ప్రజలు మారతారా...! 

 

బేటీ పడావో బేటీ బచావో... అనే నినాదం ఒట్టి స్లోగన్ మాత్రమేనా. ఈదేశ ముస్లిం బాలికలు చదువుకి దూరంగా ఉండాల్సిందేనా. ఈ చర్యలు వాళ్ళని విద్యకి దూరంచేసివి కావా...!

 

మన దేశంలో బాలికా విద్య అత్యంత దారుణ స్తితిలో ఉంది. 2011 లెక్కల ప్రకారం కేవలం 65.46% గానే ఉంది. అందులో ముస్లిం బాలికా విద్య 51.9% మాత్రమే. అంటే దాదాపు 15% వెనకపడే ఉన్నారు. దీనకి కారణం పేదరికం, మత మౌడ్యం అని వేరే చెప్పక్కర్లేదు. అలాంటి స్తితిలో బాలికా విద్యని ప్రోత్సహించడానికి వాడ వాడకీ విద్యని చేర్చాల్సిందిపోయి, ఎన్నో సవాళ్ళు దాటి బడికి కాలేజీకి వస్తున్నవాళ్ళనీ ఇలా వేధిందడం అన్యాయం. తాము ఈ దేశంలో సెంకడ్ గ్రేడ్ పౌరులమా అనే భీతి కలిగితే ఈ దేశంలో ప్రజల మద్య అనైక్యతకి తద్వారా వినాశనానికి పునాదులు వేసుకున్నట్టే. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎప్పుడేం జరుగుతుందో అనే పరిస్తితి ఉంది. 

 

ఒక వేళ నిజంగా హిజాబ్ వల్ల ఏవైనా కొన్ని సెన్సిటివ్ ప్రదేశాల్లో సమస్య వస్తే దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి తప్ప ఇలా ఒక రాజకీయ అంశంగా, ఎన్నికల అంశంగా చేసి రౌడీయిజం చేయడం ముమ్మాటికీ తప్పే. రాజకీయలకి పట్టిన దౌర్భాగ్య స్థితి అనాలేమో...

 

ఈ దేశంలో ముస్లిం జనాభా 20 కోట్లకి పైనే ఉంటుంది. ప్రపంచంలోని ముస్లిం జనాభాలో 10% మంది ఇక్కడే ఉన్నారు. అంత పెద్ద సంఖ్య ఉన్న జనాభాని దేశానికి వ్యతిరేకంగా మారేలా ప్రొవోక్ చేయడం పాలకులు ఆపకపోతే, మిగతాపని ఆ ముస్లిం మత ఛాందసులు చేసేస్తారు. 

 

ఈ దేశ భిన్నత్వాన్ని గ్రహించే లౌకిక స్వభావాన్ని మన కల్చర్ గా చేసుకుంటున్నాము కనుకనే దాన్నే రాజ్యాంగ బద్దంగా ప్రోత్సహించారు. అదే నిజానికి గొప్ప విషయం. అలా ఉండడం దాన్ని కొనసాగించి, కాలానుగుణంగా మతాల కట్టుబాట్లని త్యజించి, సర్వమానవాళి శ్రేయస్సుకై విశ్వనరుడుగా మారాల్సిన వాళ్ళం ఇలా మద్యయుగాల అజ్ఞానం కోసం గొడవలు పెట్టుకుని, తన్నుకుని అదే గొప్పవిషయంగా మీసాలు మెలేయడం అంటే కత్తికట్టి ఛావడానికి పందెంలోకి వెళ్ళే కోళ్ళలానే కనపడుతున్నారు. ఈ మత రాజకీయం, వాళ్ళ స్వలాభం కోసం మనల్ని పందెం కోళ్ళలా బలివ్వబోతున్నారని తెలీని మతపు పొరలు కప్పేసిన మైకంలో. 

 

ఒక్కసారి గుజరాత్ మారణహోమం గురించి తెలుసుకోండి. కొన్నైనా చదవండి. ఆనాడు అజ్ఞానంతో తమ సొదరులపైనే మారణహోమం చేసామని వాళ్ళు నేడు పడుతున్న పచ్చాతాపానికి ప్రాణాలు తిరిగిరావు. ఆ భయం అక్కడి మనుషుల్లో పోదు. పాత సోదరభావం మళ్ళీ రాదు.

 

స్వేచ్చగా నా రెహ్మాన్ గాడింటికెళ్ళి నేను కంచాలు వెతుక్కుని అన్నం పెట్టుకుని తినలేని దుస్తితి మనకవసరమా... 

 

బురఖా వదిలేసి స్వేచ్చని అనుభూతి చెందుతున్న ఈ సిస్టర్స్ ఏం చెబుతున్నారో కాస్త చూడండి. వీళ్ళలా స్వేచ్చా యువతులుగా మారాలంటే మీ మార్గంలో సాద్యపడదు

. ఆలోచించుకోండి...

 

 

 

 

 

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

Ee Rojullo Ante Chaintanya Narayana Don't allow prayer due to lack of time gaaani...all most all schools start with Prayer:

Which includes Saraswati Namasthubhyam..

All most all school proggames start with Religiuous Especially Hindu Practices...and You are saying We are Secular and treat everyone equal...Hypocrites 

Hindu votes ni BJP ki Muslim votes MIM lanti partys ki polorise cheyadaniki adutunna drama idhanta..

Link to comment
Share on other sites

8 hours ago, Npower said:

Enduku swaamee eee racha... Pagelu Pagelu discussion... Akkadikedo memu maa ladies ni purdah system kinda thokkestunnatlu... To be frank.. I never imposed it.. Nor anyone in my household.  My sister dint wore it because she is not comfortable with that whereas my wife feel its essential to guard herself with some eyes... Its her version... And my daughter too wear it upto the college and removes it before attending class. Yedo mahaa paapam aipoyinde.  Yedo vaalla ishta ishtaalaki vadileyyandi saamee... Oka rule pass cheyyamansndi Govt. Ni... Do not disturb them until they reach campus.. And let them remove before attending class Ani... Ledu... Adi koodaa vaddu.. Asale burqa vaddu ante... Ishtamu na vaallu chaduvulo daaniki vasthaaru... Leni vaallu vantintlo koorchoni vvandi.... Enduku paapam mee feelings antha gaa disturb ayipovadam cheppandi... Malli prathi daaniki minority appeasement.. Bochu bhoshanam anukuntoo ye DB lo choosinaa thathangam ayipoyindi.  Entha sepu ani defend chesthaam

 Naayanaa adi green burqa kaadu... Religion exhibit cheyyadaaniki... Transparency thgginchdam kosam vaade Black cloth anthe ani... Ekkuva maatlaadithe Pakistan ki velli pondi.. Afghanistan lo bratiki choodandi antaru... Maa puttuka le mudanashtapu puttuka Lai poyaayi yem chestaam. 

Feel avakandi brother...this is all politics only...

Link to comment
Share on other sites

24 minutes ago, sskmaestro said:

Ekkadiki potunnam swami…… edho mohaaaniki oka black cloth addu pettukoni vastunnaru…..  daniki kooda enduku eee dramalu? Religious issue kinda create chestunnaru anavasaramgaaa…… 

School lone kada brother...bayata evari istam valladi.

Link to comment
Share on other sites

పాత పోస్ట్ 

 

ముస్లింలు-రాజకీయ ప్రాతినిధ్యం

 

బీహార్ రాష్ట్రంలో ముస్లింల జనాభా 17 % 

2020 శాసనసభ ఎన్నికల్లో 243 సీట్లలో ముస్లిం ఎమ్మెల్యేలు 19 అంటే దాదాపు 8% 

రాష్ట్రీయ జనతాదళ్ -8

కాంగ్రెస్ -4 

ఓవైసీ పార్టీ -5 

బీఎస్పీ- 1

సీపీఐ -1 

ఎన్డీయే కూటమి నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు..

జనాభా నిష్పత్తిలో సగానికి కూడా ప్రాతినిధ్యం లేదు..

అధికార కూటమిలో అసలు ప్రాతినిధ్యమే లేదు..

 

 ఉత్తర ప్రదేశ్ లో ముస్లింల జనాభా 19.2%

403 అసెంబ్లీ సీట్ల లో 24 ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే దాదాపు 6%,కనీసం జనాభా నిష్పత్తిలో మూడోవంతు ప్రాతినిధ్యం కూడా లేదు..

312 మంది బీజేపీ కూటమి ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా ముస్లిం ఎమ్మెల్యే లేరు..అసలు ఒక్క ముస్లిం అభ్యర్థి కి కూడా టిక్కెట్ ఇవ్వలేదు..

80 మంది యూపీ ఎమ్పీలలో ఒక్కరుకూడా ముస్లిం లేరు..

అంటే ఇరవై శాతం జనాభా కి అసలు ప్రాతినిధ్యమే లేదు..

 

ఇక హిందూత్వ ప్రయోగశాల గుజరాత్ లో ముస్లింల జనాభా 10% గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థి కి కూడా టిక్కెట్ ఇవ్వలేదు..

కాంగ్రెస్ నుంచి ముగ్గురు గెలిచారు అంటే 182 లో 1.65% 

ఐదోవంతు ప్రాతినిధ్యం కూడా లేదు..

 

స్వాతంత్య్ర భారత మొదటి ఎన్నికల(1952) దగ్గర నుంచి 

2019 దాకా ముస్లిం జనాభా నిష్పత్తికి సమానంగా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఎప్పుడూ లేదు..

1980 లో ముస్లిం ఎమ్మెల్యేలు 9%,ఇదే అత్యధికం..

2019 లో ఇది 4% అంటే 15 % ముస్లిం జనాభాకి మూడోవంతు ప్రాతినిధ్యం కూడా లేదు..

 

ముస్లింలు మెజారిటీ లేదా సగానికి దగ్గర జనాభా ఉన్న నియోజకవర్గాలలో మాత్రమే రాజకీయ పార్టీలు ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తాయి..

 

గెలిచిన ముస్లిం అభ్యర్థులలో కూడా వెనుకబడిన కులాలకు చెందిన 85% జనాభా ఉన్న పాస్మాండా ముస్లింల ప్రాతినిధ్యం చాలా తక్కువ..

అంటే ముస్లింలలో కూడా ఆధిపత్య వర్గాలవారే మెజార్టీ స్థానాలలో నిలబడి గెలుస్తున్నారు..

ఉదాహరణకు బీహార్ 19 మందిలో పాస్మాండా ముస్లింలు నలుగ్గురే..

 

సెక్యులరిజం ఇప్పుడు ఇండియాలో బూతు పదమైపోయింది.. మైనారిటీ హక్కుల పరిరక్షణ అంటే హిందువుల ప్రయోజనాలు దెబ్బ తీయడం అనే నిర్వచనానికి రాజకీయాలు వచ్చాయి..

సెక్యులర్ పార్టీలు అని పిలవబడుతున్న రాజకీయ పార్టీలు కూడా బీజేపీ ని ధైర్యంగా భావజాలపరంగా ఎదుర్కొనే సాహసం చేయడం లేదు చేస్తే హిందూ వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేస్తారనే భయం పట్టుకుంది.. ఇంకా ముందుకెళ్తే ముల్లాల పార్టీలుగా ముద్ర వేస్తూనే ఉన్నారు..

 

ముస్లిం నాయకత్వ వైఫల్యం కూడా ఇందులో ఉంది..మౌలానా అబుల్ కలామ్ అజాద్ లాంటి నాయకులను తర్వాత తరాలలో చూడలేదు..ఓవైసీ లాంటి నాయకులు మంచి ఉదాహరణైతే కాదు..అలాగని హిందూ మెజార్టీ జనాభా లో నాయకత్వం వెలిగిపోతుందని కాదు..

మత చాంధసవాదం కాకుండా అభివృద్ధి, సామాజిక న్యాయం,విద్య, వైద్యంలాంటి విషయాల మీద దృష్టి నిలిపే నాయకత్వం దేశంలో పెరగాలి అది ఆర్థిక, రాజకీయ రంగాలలో బాగా వెనుకబడిన ముస్లింలలో పెరగాల్సిన ఆవశ్యకత ఇంకా ఉంది..

 

హిందూ నాయకత్వానికి పార్టీ తో సంబంధం లేకుండా మెజారిటేరియన్ భావజాలాన్ని జాతీయతను కలిపి హిందూ చిహ్నాలను ఎన్నికల్లో వాడుకున్నా దేశ ద్రోహులు, పాకిస్థాన్ వెళ్ళిపోండి,విదేశీ మతం లాంటి మాటలు పడాల్సిన అవసరం లేదు..

ఇది స్వాతంత్య్ర ఉధ్యమ కాలం నుంచే ఉంది..

నెహ్రూ క్యాబినెట్ లోని నాయకులు ఇలాంటి భావాలు వ్యక్త పరచినవాళ్ళు ఉన్నారు.తర్వాత కాలంలో మొరార్జీ దేశాయ్,ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ ఇలా దాదాపు ప్రతీ రాజకీయ నాయకులు ఏదో ఒక సందర్భంలో హిందూ కార్డ్ ఉపయోగించినవాళ్ళే ఎన్నికల్లో.. వీళ్ళెవ్వరూ దేశ ద్రోహులు, పాకిస్థాన్ పోండని మాటలు ఎదుర్కోలేదు..

కానీ ఎప్పుడైతే మైనారిటీ హక్కుల పరిరక్షణ ముస్లింలలోని అభద్రతను ఎన్నికల్లో వాడుకోవాలని నాయకుల వస్తే పాకిస్థానీ ముద్ర, విదేశీ ముద్ర, దేశాన్ని విడగొట్టేవాళ్ళని నిందలు మోయాల్సి వస్తుంది..

 

మోదీ, యోగీ ఆధిత్యనాధ్ లు వాడిన కమ్యూనల్ భాష ఓవైసీ కేమీ తీసిపోదు కానీ మెజార్టీ హిందువులు (ముఖ్యంగా ఆధిపత్య కులాలవారు ) వీరిని సమానంగా చూడరు..అంటే హిందూ మెజారిటేరియనిజమ్ జాతియతకు ప్రతీకగా చూస్తే ముస్లిం కమ్యూనలిజం దేశ విభజనకు,దేశ ద్రోహానికి ప్రతీకగా చూస్తారు..

 

ముస్లింలు మైనారిటీలలో అభద్రత ఉండడం సహజం,హిందువులలో ఈ అభద్రత కృత్రిమంగా సృష్టించినది ముఖ్యంగా హిందూ కుల వ్యవస్థ లోని అనైక్యత పైకి రాకుండా ముస్లింలను బూచిగా చూపి హిందువులు ప్రమాదంలో ఉన్నారనే నినాదం పైకివచ్చింది..

దీనికి మండల్ VS కమండల్ రాజకీయాలు గొప్ప ఉదాహరణ..

సెక్యులర్ పార్టీ గా పిలవబడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ 

మొన్నటి బీహార్ ఎన్నికల్లో నిలబెట్టింది హిందూ చాంధసవాద సంస్థ దుర్గావాహిని సభ్యుడిని..దీన్ని ఎవరూ లేవనెత్తరు కానీ ఓవైసీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది..

హిందూ మెజార్టీ దేశంలో హిందూ మెజారిటేరియనిజమ్ అనేది సాదరణమైపోయి అది తప్పుగానే కనపడదు..

ఇకముందు ఈ భావజాలం పెరగడమేగానీ తగ్గేది లేదు..

 

 దేశ జనాభా లో 15 % ఉన్నా 

 

1.మూడోవంతు ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్ లో లేని వర్గం (4%)

2.చాలా రాష్ట్రాల అసెంబ్లీలలో మూడోవంతు కూడా ప్రాతినిధ్యం లేని వర్గం (5%)

3.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మూడోవంతు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న వర్గం (5%) 

4. అతి పెద్ద రాష్ట్రంలో ఐదోవంతు జనాభా ఉన్న వారికి అధికార పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వని వర్గం 

5. మీడియా దగ్గర నుంచి ఏరంగం తీసుకున్నా తగిన ప్రాతినిధ్యం లేని వర్గం 

6.ఆర్థిక,సామాజిక అభివృద్ధి లో హిందూ ఓబీసీలకు తక్కువ ఎస్సీలకు కొంచెం ఎక్కువగా నిలచిన వర్గం 

7. డిల్లీ సుల్తానులు,మొఘలుల పరిపాలనకు

 1947 దేశ విభజనకు బాధ్యత వహించాల్సి వస్తున్న వర్గం 

8.ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఇస్లామిక్ తీవ్రవాద దాడులకు బాధ్యత వహించాల్సి వస్తున్న వర్గం 

ఇప్పుడు హిందువులు ప్రమాదంలో ఉన్నారనే నినాదానికి కూడా బాధ్యులనమాట 😀

ముస్లింలలో కమ్యూనలిజానికి ముల్లాలు, మత చాంధసవాదంతోపాటు మైనారిటీలుగా హిందూ మెజారిటీ ఆధిపత్యం వలన సహజంగా ఉండే అభద్రత కారణం..

 

మరి హిందువులలో కమ్యూనలిజానికి కారణమేమిటి? 

హిందూ ఐక్యత పేరుతో

 దళిత, ఆదివాసీ, బహుజన ఐడెంటిటీలను,

ప్రాంతీయత, భాష ఐడెంటిటీలను,విభిన్నతను ధ్వంసం చేసి బ్రాహ్మానిజ ఫాసిజ హిందూత్వ భావజాలానికి పట్టం కట్టడం ..ఇందుకు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలను బూచిగా చూపించి లక్ష్యం సాధించడం..

అయోధ్య అయ్యింది ఇప్పుడు కొత్తగా మధుర,కాశీ లాంటి నినాదాలు ఎత్తుకుంటున్నారు..

ఉన్న ఒక్క ముస్లిం మెజారిటీ రాష్ట్రం స్వయంప్రతిపత్తిని తీవ్ర వాదం,ఏర్పాటువాదాలను బూచిగా చూపి తొలగించి కళ్ళ మంట తీర్చుకున్నారు..

CAA పై సుప్రీం కోర్టు ద్వారా అనుకూల తీర్పు రావచ్చు.

ఎన్నికల్లో NRC నినాదమవుతుంది…

పాకిస్థాన్ బూచి జీవ నదిలా ఉంటూనే ఉంటుంది…

గోరక్షణ నినాదం కామధేనువే..

వీటన్నింటి వలన ఒక కమ్యూనిటీని బూచిగా చూపి మతచాంధసవాదులను సంతృప్తి పరచడం తప్పితే దేశానికి ,మెజారిటీ హిందువులకు నయాపైసం ఉపయోగం లేకపోగా హిందూ పాకిస్థాన్ కి రాచబాటలు..

 

ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం,మైనారిటీ హక్కుల పరిరక్షణ, సెక్యులరిజం ఎన్నికల్లో ప్రధాన నినాదాలు గా (ఆచరణ తర్వాత సంగతి) మళ్ళీ ఎప్పుడు వినబడతాయో అప్పుడు మాత్రమే మన దేశానికి ఉదారవాద సామాజిక ప్రజాస్వామ్యం అని పేరుకైనా పిలిపించుకునే అర్హత ఉంటుంది.

 

లేకపోతే పాకిస్థాన్, సౌదీఅరేబియా లాంటి దేశాలతో పోల్చుకొని మేము తోపులమని విర్రవీగడమే..

Link to comment
Share on other sites

గత సంవత్సరం పోస్ట్ 

 

No doubt గత ఆరున్నర సంవత్సరాలుగా ముస్లింల vulnerability పెరిగింది..దీన్ని హక్కులు పరిరక్షణ,ఆధునిక ప్రగతి శీల వాదంతో ఎదుర్కోవాలి కానీ ఇస్లాం మత గ్రంథం ఖురాన్ ,ప్రొఫెట్ జీవితాన్ని Misrepresent చేశారనే కోణంలో వెళితే Right wing కి అవకాశం ఇచ్చినట్లవుతుంది.. లౌకిక వాదంపై సరైన చర్చ జరగకుండా దారి మరల్చడానికి అవకాశం ఉంది..అదే జరుగుతోంది కూడా.. 

ఇస్లాంని వెనకబడిన మతంగా,మధ్య యుగపు సంస్కృతి గా గుర్తించకుండా ముస్లిం సమాజంలో లింగ సమానత్వం,విద్య, ఆరోగ్యం, ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యం అనుకుంటే అది ఇస్లాంలోని చాంధసవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తుందే తప్ప ఆధునికత వైపు నడపదు..

ఒకసారి సచార్ కమిటీ రిపోర్ట్ చదివితే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సూచీలలో దళితులకి కొంచెం పైన ఓబీసీలకు కింద ముస్లింలు ఉన్నారు.. అందులోనూ ఒక్క sex ratio తప్ప మిగతా అన్ని సూచీలలోనూ ముస్లిం మహిళలు మిగతా మతాలలోని మహిళల కన్నా చాలా వెనకబడ్డారు..అంతర్గతంగా కూడా స్త్రీ-పురుషుల మధ్య అంతరం ముస్లిం సమాజంలో ఎక్కువ ఉంది..

దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అభివృద్ధి లో ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో విఫలమయ్యాము కానీ అంతర్గత చాంధసవాదం కూడా దీనికి ప్రధాన కారణమని గుర్తించాలి....ఇది జరగాలంటే ఇస్లాం,దాని తిరోగమన ప్రభావంపై విమర్శలు తప్పనిసరి....దీన్ని ముస్లింలపై దాడిగా సానుభూతితో చూశామంటే ఇరవై కోట్ల ముస్లింలు ముఖ్యంగా మహిళల పురోభివృద్ధి కి ఆటంకం కలిగించినట్లవుతుంది....

ఇక్కడ ఇంకో కోణం ఉంది 

మన దేశ చరిత్రలో ముస్లిం రాజుల పాత్రను కేవల మత కోణంలోనే చూస్తూ చరిత్ర ను తప్పుదారి పట్టించడంపై పోరాడాలి...సూఫీ ఉధ్యమం వలన జరిగిన మంచిని చర్చించాలి..

కానీ ఇది ఇస్లాం మతాన్ని సమర్థించడం దగ్గరకు తీసుకెళితే ప్రమాదం.. అంటే మహమ్మద్, ఖురాన్ ఇలా వెనక్కి వెళ్తూ డిఫెండ్ చేసుకుంటూపోతే దీనికి అంతూ ఉండదు ఆధునికత ఉండదు..

 

ముస్లింల అభద్రతా భావాన్ని ఇంకా పెంచే ఇటీవలి పౌరసత్వ చట్టం,NRC లాంటి మీద ఖచ్చితంగా పోరాడాల్సిందే,హక్కులకు విలువనిచ్చేవారు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి నిలపాలి..కానీ దీర్ఘకాలికమైన లౌకిక సమాజం రావాలంటే అంతర్గత సంస్కరణ కోసం అంతే మద్దతు నివ్వాలి..

 

విద్య, ఆరోగ్యం,ఉద్యోగం , ముస్లింలపై వివక్ష, దాడులు, చరిత్ర వక్రీకరణ,లింగ సమానత్వం..లాంటి విషయాలపై ఫోకస్ పెరిగి ఇస్లాం మతం,ఖురాన్, మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చరిత్ర లో భాగంగా మాత్రమే చదువుకోవడానికి పరిమితమైతే లౌకిక శక్తులు ముస్లిం సమాజంలో బలపడడానికి తోడ్పడుతుంది..

ఈ బేధాన్ని గమనించకుండా ముందుకెళ్తే దేశంలో లౌకిక శక్తులకు,హక్కుల పోరాటానికి మెజారిటేరియన్ ఫాసిజాన్ని ఎదుర్కొనే సైద్దాంతిక నైతిక ప్రగతి శీల పునాది బలంగా ఉండదు..దీర్ఘకాలిక నష్టం కలుగుతుంది..

Link to comment
Share on other sites

7 hours ago, Sunny@CBN said:

School lone kada brother...bayata evari istam valladi.

School lo religious conflict enduku? If you want to bring uniform civil code across all educational institution, it’s time to do it without ruckus. Polluting young minds is not good for society. Just imagine if your daughter is part of this (saffron/hijab), would you desire your kid to be part of this ruckus ? 

Link to comment
Share on other sites

11 hours ago, Only Andhra said:

The Supreme Court has confirmed the Order of the Madurai Bench of the Madras High Court of transferring the investigation of the Lavanya suicide case to the CBI from Tamilnadu police. It criticized the SP for denying the conversion angle in her press conference.

True. 

  • Jolt to TN govt in Lavanya case, SC says CBI to continue investigation :  The Economic Times
  • Hijab row: 'Don't spread these things to a larger level', SC ..on pleas challenging Karnataka HC order  The Times of India

Truth seeking is noble but it is always an arduous task. 

(What about Truth reconcilement , is it default? May be not. You seem to be new & appears perplexed as to why a simple verifiable fact is not accepted as it is, and plenty number of words are rolling along without leveling to Truth.  Will tell you Brother, one incident for illustration purposes only without divulging too many details.  Few years ago, One time after seeing a dear and beloved brother posting here in rampant frequency, a big chunk of volumes, verifiably untrue material including some hodge podge writeups and demonstrably corrupt photos, confronted him  ' Brother - why are you doing this?  Do you know what you are posting is Untruthful and cookedup material '?  His answer was ' Yes Annaay ! I know they are fake' he answered nonchalantly.  Taken aback for a couple of moments, haven't engaged in any meaningful conversation ( other than may be jr's acting good or movie is nice etc.)  A well  mannered and courteous person as far as dealings with me, pleasant & personable so I do like him.)

 
Link to comment
Share on other sites

23 hours ago, Npower said:

-----------------------

సాజిద్ బ్రదర్ ......చాలా రోజుల తరువాత,  వాత్సల్యం తో కూడిన నమస్కారం ....

విద్యాధికులు,  సమకాలీన ఆధునిక జీవనశైలి, అంతో ఇంతో ప్రగతిశీల మనస్తత్వం ఉన్నా కూడా స్థానిక  కడప నేపధ్యం, చుట్టుపక్కల ప్రభావం, సాధక బాధకాలు,చిన్నపాటి ఆవేదన- ఆ అనుభవాలు మీ మాటల్లో ... 

మీ వ్యక్తిగత విషయాలకు జవాబులు కావు ఇవి, వాటిని మీరే సమర్ధవంతం గా ఎదుర్కోగలరు అని భావిస్తాను ....స్నేహం లో పంచుకొనే ఒకటి రెండు మాటలు, తప్పు అనిపిస్తే పట్టించుకోవద్దు ..  మీరు సున్నిత మనస్కులు మొదట నుంచి, మంచి వ్యక్తి గా నాకు ఇంకా  ప్రియమైన  సోదరులకు కూడా పరిచితులు,  అభిమానపాత్రులు  ....మాధ్యమాల్లో సంభాషణలు, ఇంతమంది మనుషులు - మనిషి మనిషికో మతి ప్రకృతి ధర్మమిది- విభిన్నత. .. చర్చా వస్తువు లో  హితాహితాలు మాత్రమే  చూసుకుని, సత్యం ఉన్నదనిపిస్తే స్వీకరించి మిగతావాటిని వదిలివేయటమే ధర్మం .....

ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ, న్యాయస్థానాల్లో తీర్పు చెప్పేది విద్యాలయాల్లో తరగతి గదుల్లో సమానత్వం, ఆ స్థానిక నియమాల గురించి ...దేశంలో ఉన్న  వస్త్రధారణ లో ఏ  మార్పులు లేవు ...యథాతదం ...  ఇంకా, భారతదేశం లో తుష్టీకరణ రాజనీతి మాట యదార్థం, ఇప్పటిది కాదు 1920 దశకంలోనే వచ్చేసింది, ఆ రాజనీతే మన దేశ చీలికకు ఒక కారణం, ఇప్పటికీ వుంది అన్నిపార్టీల్లో - వినటానికి కష్టమైనా చేదు నిజం.....సమకాలీన సమాజంలో సంఘటనలు  సామాజిక మాధ్యమాల్లో, చర్చా వేదికల్లో ప్రస్తావనకు రావటం సహజం, అనివార్యం.

 భారతీయులు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, మీరు పుట్టిన నేల, తరతరాల సంస్కృతి  ఆ అనుమతి ఇవ్వవు  మీకు ...మీ నాన్న గారికి  ఉపనిషత్తులు  ఇత్యాది విషయాల  పట్ల ఆసక్తి ఉండేదని ఇష్టాగోష్టుల్లో చెప్పారు, గుర్తుందా! మంచి వంశం, ప్రేమించే  కుటుంబం మీది, పూజా పధ్ధతి వేరు అవ్వచ్చు ఇప్పుడు, కానీ పరంపర పోదుగా, ఆ  స్ఫూర్తి, నేపథ్యం  లో చెపుతున్న మాట ఇది.  

చివరిగా, కల్మషం లేని మీ సీమ నైజం ఎప్పుడూ అయస్కాంతమే, మీలో అంతర్లీనం గా వుండే ఆ ఆకర్షణ బలం... ఉదాసీనత వద్దు ఉత్సాహమే  దైవీ లక్షణం, మర్చిపోవద్దు ....శుభాభివందనం 

Link to comment
Share on other sites

1 hour ago, Sr Fan said:

సాజిద్ బ్రదర్ ......చాలా రోజుల తరువాత,  వాత్సల్యం తో కూడిన నమస్కారం ....

విద్యాధికులు,  సమకాలీన ఆధునిక జీవనశైలి, అంతో ఇంతో ప్రగతిశీల మనస్తత్వం ఉన్నా కూడా స్థానిక  కడప నేపధ్యం, చుట్టుపక్కల ప్రభావం, సాధక బాధకాలు,చిన్నపాటి ఆవేదన- ఆ అనుభవాలు మీ మాటల్లో ... 

మీ వ్యక్తిగత విషయాలకు జవాబులు కావు ఇవి, వాటిని మీరే సమర్ధవంతం గా ఎదుర్కోగలరు అని భావిస్తాను ....స్నేహం లో పంచుకొనే ఒకటి రెండు మాటలు, తప్పు అనిపిస్తే పట్టించుకోవద్దు ..  మీరు సున్నిత మనస్కులు మొదట నుంచి, మంచి వ్యక్తి గా నాకు ఇంకా  ప్రియమైన  సోదరులకు కూడా పరిచితులు,  అభిమానపాత్రులు  ....మాధ్యమాల్లో సంభాషణలు, ఇంతమంది మనుషులు - మనిషి మనిషికో మతి ప్రకృతి ధర్మమిది- విభిన్నత. .. చర్చా వస్తువు లో  హితాహితాలు మాత్రమే  చూసుకుని, సత్యం ఉన్నదనిపిస్తే స్వీకరించి మిగతావాటిని వదిలివేయటమే ధర్మం .....

ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ, న్యాయస్థానాల్లో తీర్పు చెప్పేది విద్యాలయాల్లో తరగతి గదుల్లో సమానత్వం, ఆ స్థానిక నియమాల గురించి ...దేశంలో ఉన్న  వస్త్రధారణ లో ఏ  మార్పులు లేవు ...యథాతదం ...  ఇంకా, భారతదేశం లో తుష్టీకరణ రాజనీతి మాట యదార్థం, ఇప్పటిది కాదు 1920 దశకంలోనే వచ్చేసింది, ఆ రాజనీతే మన దేశ చీలికకు ఒక కారణం, ఇప్పటికీ వుంది అన్నిపార్టీల్లో - వినటానికి కష్టమైనా చేదు నిజం.....సమకాలీన సమాజంలో సంఘటనలు  సామాజిక మాధ్యమాల్లో, చర్చా వేదికల్లో ప్రస్తావనకు రావటం సహజం, అనివార్యం.

 భారతీయులు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, మీరు పుట్టిన నేల, తరతరాల సంస్కృతి  ఆ అనుమతి ఇవ్వవు  మీకు ...మీ నాన్న గారికి  ఉపనిషత్తులు  ఇత్యాది విషయాల  పట్ల ఆసక్తి ఉండేదని ఇష్టాగోష్టుల్లో చెప్పారు, గుర్తుందా! మంచి వంశం, ప్రేమించే  కుటుంబం మీది, పూజా పధ్ధతి వేరు అవ్వచ్చు ఇప్పుడు, కానీ పరంపర పోదుగా, ఆ  స్ఫూర్తి, నేపథ్యం  లో చెపుతున్న మాట ఇది.  

చివరిగా, కల్మషం లేని మీ సీమ నైజం ఎప్పుడూ అయస్కాంతమే, మీలో అంతర్లీనం గా వుండే ఆ ఆకర్షణ బలం... ఉదాసీనత వద్దు ఉత్సాహమే  దైవీ లక్షణం, మర్చిపోవద్దు ....శుభాభివందనం 

Brother, chaalaa pogidesaaru nannu.  Mee abhimaanaaniki kruthagnathalu.  Mee abhimaanam kaanee antha manishini kaanu.  Nijamgaa chaalaa rojulayyindi, CHSRK brother missing.  Chaalaa rojulayyindi thanu kanapadi DB lo.  Ekkada vunna kshemamgaa untaarani... malli thondarlo DB lo active avuthaarani aasistunnaanu. 

Yes, mana madhya maatallo maa father gurinchi cheppaanu.  Ippatikee aayannu talachukoni roju ledu.  Such is his clout on me.  Chaalaa broad minded person, missing him always.

Ika point ki vasthe... meeru cheppaali anukunnadi nenu artham chesukogalanu, kaanee naa abhipraayaaniki kattubadi untaanu.  Memu schools chadive rojullo Vandemaathram, drill periods lo surya namaskaaram contintious issues kaavu, kaanee ippudu avi contentious... alaage ippatikee konni govt. schools lo sarasvathi vandanaalu, gayatri mantra pathanaalu jarugutunnaayi.... i am aware of it.  Vaatiki nenu vyatirekam kaadu.... daani vaalla naa pillala chaduvuku kaanee... vaalla faith ki kaanee itharathraa kaanee... etuvanti harm ledu.... raadu.  Inni mathaalunna samaajam manadi... andulo Bharatha deshapu pradhaana mathaaniki chendina vidyaarthulu vaalla faith ki sambandinchina pathanaalu school lo morning prayer lo chesukunte.... addupade antha sankuchitha manasthatvam undakoodadu ani bhaavisthaanu.... if we really feel our fellow Indians as our brother & sisters.  Likewise, oka chinna nalla rangu cloth valla migatha mathaala students ki jarugutunna haani kaanee... kashtam kaanee yemee ledane anukuntunnaanu.  Yes, mukham kanapadaali... campus varaku burqa allow chesi... class lo maatram with school dress and with a scarf on head... that too if they want.... and also school can dictate its color either without Green, Black & Saffrom colors... to suit the School dress itself.  Ide chepthunnaanu nenu.... court nunchi koodaa ituanti order..ye vastundani anukuntunnaanu.... ide jarigithe.... ubhaya pakshaalu angeekaristhaayi ani anukuntunnaanu.... otherwise intha silly thing teesukuni manalo manam fight chesukovadam.... oohinchadaaniki koodaa siggesthundi.  I want.... Govt. and courts to resolve the issue asap... peacefully and amicably.

Finally, once again thank you very much for the understanding u have on me.  Mee indepth analysis chaalaa rojulu miss ayyaamu.... welcome back again brother.

Link to comment
Share on other sites

10 hours ago, sskmaestro said:

School lo religious conflict enduku? If you want to bring uniform civil code across all educational institution, it’s time to do it without ruckus. Polluting young minds is not good for society. Just imagine if your daughter is part of this (saffron/hijab), would you desire your kid to be part of this ruckus ? 

Who polluted the young minds and why they are demanding wearing in classroom from December?

Link to comment
Share on other sites

58 minutes ago, Rajakeeyam said:

Who polluted the young minds and why they are demanding wearing in classroom from December?

Fasten your seat belt Brother, mass prayers on roads and also in open public places are coming no joke. Brace yourself. 

Testing the waters, they have already did few prototype models like Delhi & suburbs, but faced a fightback......stopped for now.  A very concerted and planned way( Tested excuses in Delhi -we are working, no near praying areas, no mosq. nearby etc ). India has been the unfinished business in their view(guzwa e hind)- this is not secret, every maulvi knows. Most of the non-beleivers have no idea(Ignorance is bliss).  

(Karnataka state - South Canara, North Canara, Mandya etc dts, west coast belt from Kasargod above - they are running unit models - doing groups of people namz in classrooms recording and uploading in their social network for further distribution to spread). fyi: no M country allows on roads including SA.......

On the other side of the coin in Intellectual sense : In the digital age, more and more people are reading and researching, finding things they are not aware of before, beyond cliche s about heinous things to non-believers- firsthand. Light is shedding.  Intellectually they are in weak footing, ice is melting, even believers(educated small percentage) getting disillusioned, leaving. Digital & Internet age is rapid - we will see lot of new things in near future.)

Link to comment
Share on other sites

10 hours ago, Rajakeeyam said:

'Religious freedoms in danger in India '- Western Media ( Ny times, WaPo, BBC etc) Top coverage

An Indian girl in kundapur freely protesting her position against her schoolmate counterpart protesters, all standing few feet away with no physical contact, no matter how unpleasant for eyes, and both are expressing their freedom of speech protected in India by constitution. Not to say least, Courts in India are in the process of hearing the merits/demerits of the hijab hoopla inside classrooms.

Meanwhile What is happening in nearby countries? - A Mentally ill man, accused of abusing the religious book, beaten to death by mob while police kept silently watching in Pakistan two days ago. ( Warning : graphic  below)

#Khanewal - Twitter Search / Twitter

 
Link to comment
Share on other sites

On 2/14/2022 at 8:26 PM, sskmaestro said:

School lo religious conflict enduku? If you want to bring uniform civil code across all educational institution, it’s time to do it without ruckus. Polluting young minds is not good for society. Just imagine if your daughter is part of this (saffron/hijab), would you desire your kid to be part of this ruckus ? 

Hope they bring this law asap. Uniform Civil Code. 

Link to comment
Share on other sites

Did anyone raise their voice against the unfair treatment of minorities in Muslim majority countries? I'm not saying that India should be like them but our country is a great country which gives freedom to all religions. But are we taking this freedom for granted and not willing to follow simple rules? In this very same country, majority religion is not allowed to follow it's customs in missionary schools. Kashmiri Pandits were killed and displaced from their homes. Missionaries preach against Hindu Gods and customs. People try to convert innocent Hindus. Idiots like Zakir Naik talk against Hinduism and Indian traditions and get away. Why did BJP even get Majority seats in 2014 from being a 2MP party in 1989? What went wrong. The majority religion (me being a part of it) felt insecure and targeted. Yes they are going to do politics and BJP will be in power or in opposition atleast for another 20 years. Only thing we can do is stop further polarization...

Frankly speaking I was a big supporter of BJP till 2015-16 until rift started with TDP.  

Anyway I'm not going to post any further in this thread...other than hurting other people's emotions we have not achieved anything here. 

Link to comment
Share on other sites

7 hours ago, Rajakeeyam said:

e statement pattukoni edho nasa proof laaaga peeel avtunnavaaa ? Asalu Muslim students hijab lekunda eppativaraku raaledu…. This is the first of its kind ani certify cheyyatam biggest comedy! 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...