పాత పోస్ట్
సెంట్రల్ విస్తా వెబ్సైట్...
లోక్ సభ సీట్లు ఖచ్చితంగా పెంచే ఆలోచనలోనే ఉన్నారు..
ఇప్పటికే కౌబెల్ట్ ఆధిపత్యం ఎక్కువై హిందీ రుద్దడం నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము..
ప్రస్తుత జనాభా ప్రాతిపదికన సీట్లు పంచితే బీజేపీ ఆధిపత్యంలో ఉన్న కౌబెల్ట్ రాష్ట్రాలకి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే...
లోక్ సభ సీట్లు 545 నుండి 848 కి పెరుగుతాయి..
ఇన్ని సీట్లు పెరిగినా జనాభా ప్రాతిపదికన
కేరళ కి ఒక్క సీటు కూడా అదనంగా రాదు..
తమిళ నాడు కి 10, తెలుగు రాష్ట్రాలకు కలిపి 12,కర్ణాటక 13 సీట్లు మాత్రమే అదనంగా కలుస్తాయి..
కానీ యూపీ కి ఏకంగా 63 సీట్లు, రాజస్థాన్ కి 25,
బీహార్ కి 39, మధ్య ప్రదేశ్ కి 23 సీట్లు అదనంగా వస్తాయి......
New numbers Estimation based on population
Bracket లో ఇప్పటి సంఖ్య
UP-143 (80)
Bihar-79(40)
MP-52 (29)
Rajasthan-50(25)
Kerala-20(20)
Tamilnadu 49(39)
Telugu states 54(42)
Karnataka 41(28)
దక్షిణ భారత రాష్ట్రాలన్నింటికి కలిపి కేవలం 35 సీట్లు కలిస్తే కౌబెల్ట్ నాలుగు పెద్ద రాష్ట్రాలకి ఏకంగా 150 సీట్లు పెరుగుతాయి...
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జనాభా ప్రాతిపదికన సీట్లు పంచితే దక్షిణ భారతం, తూర్పు భారతాలు నష్టపోతాయి...
బీజేపీ 2024 లో అధికారంలోకి వస్తే ఈ విషయంలో మరోమాటే లేదు..మంద బలంతో బిల్లును నెగ్గించుకుంటారు...
జనాభా నియంత్రణ సరిగ్గా అమలు చేసినందుకు శిక్ష 😌