Jump to content

Viveka Murder Case


Recommended Posts

Posted

వివేక కేసు విచారణలో సడన్ ట్విస్ట్.. 44 రోజుల విచారణ తరువాత కేంద్రం ఎందుకు ఇలా చేసింది ? వివేక కేసు సిబిఐ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేక కేసు ఎంత సంచలనమో, విచారణ జరుగుతున్న పరిణామాలు కూడా అంతే సంచలనంగా మారాయి. ఈ కేసు ముందుగా జగన్ మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలి అన్నారు. తరువాత అధికారంలోకి వచ్చి సిబిఐ విచారణ వద్దని కోర్టుకు తెలిపారు. కుటుంబలో చెల్లి మాత్రం, మాకు నమ్మకం లేదు సిబిఐ విచారణ కావాలి అన్నారు. చివరకు హైకోర్టు ఈ కేసుని సిబిఐకి ఇచ్చింది. తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ, ఈ కేసు విషయంలో నాలుగు విడతలుగా విచారణ చేసింది. అయితే మొదటి మూడు సార్లు ఏదో ఫార్మాలటీగా విచారణ చేసినట్టు కనిపించినా, నాలుగో సారి మాత్రం గట్టిగా విచారణ చేస్తుంది.

ఏకంగా 44 రోజులుగా సిబిఐ విచారణ చేస్తుంది. అయితే ఈ కేసులో విచారణా అధికారిగా, డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ను ఈ సారి సిబిఐ నియమించింది. ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు ఉంది. ఆమె ట్రాక్ రికార్డు కూడా, ఎన్నో కేసులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారనే పేరు ఉంది. దీనికి తగ్గట్టే ఆమె, ఈ సారి గట్టిగా రంగంలోకి దిగారు. దాదపుగా 25 మంది సిబిఐ ఆఫీసుర్లు, నాలుగు బృందాలుగా ఏర్పడి, గత 44 రోజలుగా విచారణ చేస్తున్నారు. పలు మార్లు పులివెందులలో వివేక ఇంటికి వెళ్లి అక్కడ కూడా విచారణ చేసారు. ఈ సారి కేసు తేలే వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ చెప్పటంతో, కొంత మంది నాయకులకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.

ఎక్కడ తమ బండారం ఆధారాలతో సహా బయట పడుతుందో అని దోషులు భయపడుతూ ఉన్న సమయంలో, వారికి మంచి వార్త ఒకటి వినిపించింది. నిన్న ఉన్నట్టు ఉండి డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ని బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి రామ్ కుమార్ రంగలోకి దిగారు. డిఐజి స్థాయి అధికారి నుంచి, ఈ కేసుని ఎస్పీ స్థాయి అధికారికి సిబిఐ ఎందుకు బదిలీ చేసిందో అర్ధం కావటం లేదు. సిబిఐ కేంద్ర హోం శాఖ కంట్రోల్ లో ఉంటుంది, ఇది హైప్రొఫైల్ కేసు కావటంతో, కేంద్రం వైపు నుంచి ఏమైనా ఒత్తిడి తెచ్చి, ఈ బదిలీ చేసారా అని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఇక్కడ విచారణ చేసి, కేసు ఒక కొలిక్కి వస్తున్న సందర్భంలో, డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ను సిబిఐ బదిలీ చేయటం, ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం సహజంగా జరిగెదా, లేక ఏమిటి అనేది సిబిఐ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Image

Image

Image

Image

Posted

aa eddaru pramukhulu evaru ??  

aina watchman ni interrogate chesi ee matram cheppincha daniki 2.5 years pattinda  

Posted

A watchman ne chupincharu ABN lo, adike e na hair telidu anukonta. Sariga matladatam raledu adu ella chebutadu sami.

8 crorers a watchman mundara ichara enti.

Max blood stains clean chesi vuntadu danike minchi naku telisi a watchman ke emi telisi vundadu.

Light abba state and central government change aite kani facts bayatiki ravu.

Posted

It seems its a typical BJP warning to Jagan and co for their fake agitation in the parliament, expecting silence from YSRCP, from Monday in the parliament.

Posted

Just oka naatu Goddeli tho ..oka old age person ni veseyadaani ki.. 8 crores supaari yaa?😂

Kadapa chala develop ayipoyindannaa ( Kota gif from Athadu) 🤪 

Posted

ముగ్గురి పేర్లు చెప్పా!

నాలుగో వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు

ఆయనను ఎప్పుడూ చూడలేదు

స్థానికులకు వివరించిన రంగయ్య

జమ్మలమడుగు జడ్జికి వాంగ్మూలం

పులివెందులలో ఒంటరిగా వదిలేసిన సీబీఐ

వాచ్‌మన్‌ రంగయ్య

కడప, జూలై 23(ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్‌ రంగయ్య శుక్రవారం రాత్రి స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి నివాసానికి వచ్చిన ముగ్గురి పేర్లను జడ్జికి చెప్పానని తెలిపారు. నాలుగో వ్యక్తి కూడా ఉన్నారని... బాగా పొడవుగా ఉన్న ఆయనను గతంలో తాను చూడలేదని పేర్కొనడం రంగయ్య గమనార్హం. కోర్టులో జడ్జి ముందు ఏం చెప్పావని స్థానికులు, మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. పలు వివరాలు వెల్లడించారు. ‘ఆ ముగ్గురిలో ఒకరు... తమ పేర్లు బయటికి చెబితే నన్ను నరికేస్తామన్నారు. అందుకే... భయపడ్డాను. సీబీఐ సారోళ్లు మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఏమైనా కానీ అని సీబీఐ సారోళ్లకు, కోర్టులో అవే చెప్పాను’’ అని రంగయ్య వివరించారు. ‘గురువారం నన్ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు లేదంటే మళ్లీ కడపకు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మళ్లీ జమ్మలమడుగుకు తీసుకెళ్లి కోర్టులోకి పంపించారు. రాత్రి పెద్ద సారోళ్లు పులివెందులకు తీసుకొచ్చి జేఎన్‌టీయూ వద్ద వదిలేశారు. నా ఖర్చులకు ఏమైనా ఇవ్వండి సార్‌ అంటే ఢిల్లీ పెద్దసారు రూ.1,500 ఇచ్చారు. కాగా.. రంగయ్యను సీబీఐ అధికారులు ఒంటరిగా వదిలి వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, భద్రత కల్పించాల్సిన అవసరముందని చర్చించుకున్నారు.

 

 
Posted

watchman lopal judge ki emi statement ecchado evariki teliyadu.  

unnecessary speculations. 

Janalanu VPlu cheyyadaniki sketch. 

BJP vallu vunnanta kalam ... jaggadiki emi kaadu. 

Posted

Mind Arikalu  lo unnodu kuda nammadu rangya garu cheppedi ...judge garu ,cbi vallu chala amayakula la unnaru .  Ela bathukutharo ee kalikalam lo 

Posted
1 hour ago, gnk@vja said:

Mind Arikalu  lo unnodu kuda nammadu rangya garu cheppedi ...judge garu ,cbi vallu chala amayakula la unnaru .  Ela bathukutharo ee kalikalam lo 

There is another video brother..someone warned to kill him if he opens his mouth..CBI guys told him they wont let anything happen to him, so he told everything he knew to the magistrate..and the CBI guys told him to tell everyone that he doesnt know/remember anything

Posted

Erra Gangi Reddy peru cheppaadanta.... thanu viveka anucharudu anta.  Case lo maamoolu vyaktulanu irikinchi close cheselaa unnaaru. Adi Narayana Reddy BJP lo unnaadu kaabatti... eee false allegations yevi thana meeda pani cheyyavu anukunta. 

Inka... eega koodaa vaalanivvam anna CBI... ilaa ontarigaa vadilesi vellindi ante... thanaki ye praana haanee ledu anukuntaa... anthaa drama laagaa anipistondi.

Posted

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీల్ కుమార్ యాదవ్ సహా నలుగురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లా మోతునూతలపల్లి కి చెందిన వై సునీల్ యాదవ్, అతని కుటుంబానికి చెందిన మరో ముగ్గురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈ ఏడాది సీబీఐ తనకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లానని, విచారణ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ ఆరోపించాడు. తన అనుమతి లేకుండానే బలవంతంగా లై డిటెక్టర్ వినియోగించారని పిటిషనర్ ఆరోపించారు. దీంతో పాటు ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నాడు. వివేకా హత్య కేసులో తనను ఇరికించాలని సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ ఆరోపించాడు. ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.



వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే రంగయ్యను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో ముగ్గురి పేర్లు రంగయ్య వెల్లడించగా.. అనుమానితుల్లో సునీల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి సునీల్‌ను ఇప్పటికే సీబీఐ అధికారులు చాలాసార్లు ప్రశ్నించారు.

Posted
15 hours ago, kalyan babu said:

A watchman ne chupincharu ABN lo, adike e na hair telidu anukonta. Sariga matladatam raledu adu ella chebutadu sami.

8 crorers a watchman mundara ichara enti.

Max blood stains clean chesi vuntadu danike minchi naku telisi a watchman ke emi telisi vundadu.

Light abba state and central government change aite kani facts bayatiki ravu.

Ee 8 crores gurinchi investigation ki inko 5-6 yrs…ee lopu watchman ki bathroom scene or dumbell scene repeat avuddi…. Ee lopu all set. Nyaya devatha kallaki gudda kattedi indukegaa…

Posted

ilanti bokadia investigation cheyataniki inni yrs/months aa..chi daridram...evaro gotta gallani irikinchi main culprits ni side chestaru le Bajaffa gallu...congress govt ee better ilanti vishayallo

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...