Jump to content

Recommended Posts

Guest Urban Legend
Posted

share this 

 

Posted
12 hours ago, mahesh1987 said:

repu narasaraopet and sattenapalli nundi 35 buses going

ఇది కదా రచ్చ...

50 బస్సులు , 110 కార్లు , మూడు వేలకి పైగా రైతులతో కోడెల ఆధ్వర్యంలో పోలవరం విజ్ఞాన యాత్ర

@mahesh1987

Posted

ఆగస్టు 15 నాటికి చింతలపూడి నుంచి నీరు
పోలవరం సహా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 56 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికి 15 మాత్రమే పూర్తయ్యాయని, మరో 26 వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని స్పష్టంచేశారు. కొత్తగా పనులు చేపట్టిన 15 ప్రాజెక్టులకు ఆకృతులు, టెండర్లు, భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టులపై సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. ఆగస్టు 15 నాటికి చింతలపూడి ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ‘‘వైకుంఠపురం బ్యారేజి, గోదావరి-పెన్నా తొలి దశ టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టు తలుపులపై ఆకృతుల కమిటీతో ఎప్పటికప్పుడు అనుశీలన జరిపి పనులు ఆలస్యం కాకుండా చూడాలి. సెప్టెంబరులో గ్యాలరీ వాక్‌కు ఏర్పాట్లు చేయాలి. 2019 ఫిబ్రవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తిచేసేలా పనుల వేగం పెంచాలి’’ అని చంద్రబాబు సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 
Posted
వేగం పెరగాలి
31-07-2018 03:26:27
 
  •  అనుభవమున్న కాంట్రాక్టర్లను తీసుకురండి
  •  పోలవరం కాఫర్‌, కాంక్రీట్‌ పనులపై సీఎం
  •  ప్రాధాన్య ప్రాజెక్టులనూ ప్రత్యక్షంగా చూస్తా
  •  పనుల్లో ఎంతమాత్రమూ జాప్యం తగదు
  •  అధికారులకు చంద్రబాబు స్పష్టీకరణ
పోలవరం, అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను వెంటనే తీసుకురావాలని ఇంజనీరింగ్‌ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి 69వ సారి వర్చువల్‌ పద్ధతిలో పోలవరం పనులపై సమీక్షించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను డ్రోన్‌ కెమెరాల సాయంతో పరిశీలించారు. పనుల వివరాలను ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారుడు రమేశ్‌బాబు వివరించారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు నిర్దేశిత ప్రణాళికల ప్రకారం ముందుకు సాగడం లేదని, వాటిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరద తగ్గిన వెంటనే అత్యంత కీలక నిర్మాణాలైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు సంబంధించి ఎర్త్‌వర్క్‌ చేయడంలో దేశవ్యాప్తంగా అత్యంత సాంకేతిక నైపుణ్యం కలిగిన కాంట్రాక్టర్లను చూడాలన్నారు. వచ్చే సోమవారం నాటికి కొత్త కాంట్రాక్టర్లను తీసుకురావాలన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పేర్కొన్న 56 ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాదు... ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
 
రాష్ట్రంలో 56 ప్రాధాన్య ప్రాజెక్టులను ఎంపిక చేయగా... ఇందులో 9 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 6 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఇంకో 26 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని, కొత్తగా 15 ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్‌ పూర్తి కావాలని, దీనిని వచ్చే నెలలో ప్రారంభించాల్సిందేనని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సంగం-నెల్లూరు బ్యారేజీ నిర్మాణం నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తారకరామతీర్థ సాగర్‌ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలని, వీలైనంత త్వరగా భూసేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠపురం బ్యారేజ్‌, గోదావరి-పెన్నా అనుసంధానం మొదటిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
కాగా, ఆగస్టు 15 కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు మొత్తం 56.90శాతం, తవ్వకం పనులు 76.60శాతం, కాంక్రీట్‌ పనులు 31.60శాతం, కుడి ప్రధాన కాలువ 90శాతం, ఎడమ ప్రధాన కాలువ 62.41శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 61.67శాతం, కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 93శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు.
 
’ఉపాధి’కి వీక్లీ లక్ష్యాలు
ఉపాధి పనులకు వారం వారం(వీక్లీ) లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి నిధులు వినియోగిస్తున్న అన్ని శాఖలతోనూ సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిధులు వినియోగించుకుంటున్న 22 శాఖలు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి వచ్చే వారం సమర్పించాలని ఆదేశించారు. ఒక పంచాయతీలో ఒక ప్రభుత్వ స్కూల్‌కు మాత్రమే ప్రహరీ గోడ నిర్మాణం, ఆటస్థలాల అభివృద్ధి జరపాలనే నిబంధనను సడలించారు. అన్ని స్కూళ్లనూ అభివృద్ధి చేయాలన్నారు.
Posted
పోలవరం సందర్శనకు 50 బస్సుల్లో 3 వేలమంది రైతులు
31-07-2018 09:34:29
 
636686264705288937.jpg
  •  రైతులతో కలిసి స్పీకర్ పర్యటన
  • గుంటూరు నుంచి యాత్ర ప్రారంభం
గుంటూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మెగా టూర్‌ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ముం దుకు రావడంతో మొత్తం 50 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని గుంటగ్రౌండ్స్‌ వద్ద నుంచి రైతులతో కలిసి స్పీకర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
మూడు వేలమంది రైతులు ఒకేసారి ప్రాజెక్టు సందర్శనకు వెళుతోండటం ఇదే ప్రథమంగా అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వేల మంది రైతులు ఏకకాలంలో ప్రాజెక్టు సందర్శనకు రానుండటంతో విస్త్రృత ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఏడు గంటలకు గుంటూరు నగరం నుంచి యాత్రని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్‌ఈ బాబురావు తెలిపారు.
Posted
6 hours ago, Saichandra said:

ఇది కదా రచ్చ...

50 బస్సులు , 110 కార్లు , మూడు వేలకి పైగా రైతులతో కోడెల ఆధ్వర్యంలో పోలవరం విజ్ఞాన యాత్ర

@mahesh1987

Mylavaram,sattenapalli and narasaropet nundi vellaru ivvala

Posted
‘పోలవరం’ వద్దకు కేంద్ర నిపుణుల కమిటీ
01-08-2018 06:05:20
 
636687003214376724.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని డిజైన్‌ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఈ బృందం విజయవాడకు చేరుకుంది. బుధవారం నుంచి శుక్రవారం దాకా కేంద్ర జలసంఘం సీఈ వైకే శర్మ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ప్రధానంగా డ్యామ్‌ డిజైన్లపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ పెండింగ్‌లో ఉంచిన డిజైన్లను సమర్పించే అవకాశముందని అధికారులు తెలిపారు.
 

Advertisement

Posted
మత్స్యకారులపై ప్రభావంపై అధ్యయనం
01-08-2018 02:39:09
 
పోలవరం నిర్మాణం కోసం కాఫర్‌డ్యాం కట్టడం వల్ల ఆ ప్రాంత మత్య్సకార కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడిందో అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సెంట్రల్‌ ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ డ్యాం వల్ల గోదావరిలో కనీస నీటి ప్రవాహం లేదని, చేపల వేట సాగడంలేదని ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధిత మత్య్సకార కుటుంబానికి చెందిన నాగేశ్వరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం విచారించింది.
 

Advertisement

Posted
ఏపీకే ఓటు 
పోలవరంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర వాదనను సమర్థించిన కేంద్ర జలవనరుల శాఖ 
  ఒడిశా దావాకు విచారణ అర్హత లేదన్న ఏపీ 
  భద్రాచలం ముంపుపై అధ్యయనం చేయాలి: తెలంగాణ 
  బహిరంగ విచారణ జరపకుండా నిర్మాణమా: ఒడిశా 
ఈనాడు - దిల్లీ 
1ap-main1a.jpg
జల వివాదాల పరిష్కారాలకు ట్రైబ్యునళ్లు ఉన్నాయని, కోర్టులు ఆ కేసులను పరిష్కరించాల్సిన అవసరం లేదని అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం చెబుతోందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ‘ఒరిజనల్‌ సూట్‌’లో విచారణ అంశాలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం వాటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వం ఆయా అంశాలు కోర్టుకి అందజేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనతో కేంద్ర జలవనరుల శాఖ ఏకీభవించింది. పలు అంశాలను ప్రస్తావించింది. ఆర్టికల్‌ 262 ప్రకారం ఈ కేసుకి విచారణ అర్హత లేదని పేర్కొంది. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డుకు అన్నిరాష్ట్రాల కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం గోదావరి ట్రైబ్యునల్‌కు లోబడి ఉందని గోపాలకృష్ణ  కమిటీ అధ్యయనం తేల్చిందని పేర్కొంది.

ఏపీ అంశాలు 
* 7.7.1980న ప్రకటించిన గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డును అన్ని పార్టీలు అంగీకరించిన నేపథ్యంలో మళ్లీ దీనిపై సవాల్‌ చేయడానికి లేదు. 
* 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు కేంద్ర జల సంఘం అనుమతించింది. దీన్ని ఉల్లంఘన అని ఒడిశా  ఎలా అంటుంది. 
* గోపాలకృష్ణ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు నమూనా పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే నిర్మాణం జరుగుతోందని కమిటీ స్పష్టం చేసింది. అందువల్ల ఒడిశా దావాను కొట్టివేయాలి. 
* విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ప్రశ్నించకూడదు. ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చింది. నమూనా, నిర్వహణ అంశాలు కేంద్ర జలసంఘం పర్యవేక్షిస్తుంది. 
* 2.4.1980న అన్నిపార్టీల మధ్య జరిగిన ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. గోదావరి ట్రైబ్యునల్‌ తుది అవార్డులో పేర్కొన్న కారణంగా ఈ సూట్‌కు విచారణార్హత లేదు. 
* ఈ కేసు కోర్టు పరిధిలో ఉందంటూ ఒడిశా తన భూభాగంలో నిర్వహించాల్సిన బహిరంగ విచారణను వాయిదా వేయొచ్చా? చట్టాలు చూపిన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించొచ్చా? అని ఏపీ ప్రశ్నించింది.

తెలంగాణ దాఖలు  చేసిన అంశాలు 
* ప్రాజెక్టు నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు సంబంధించి పూర్తి అధ్యయనం నిర్వహించారా? నమూనా మార్పు వల్ల తెలంగాణ ప్రాంతంలో ముంపు ప్రాంతం పెరగనుందా? 
* నీటి పారుదల 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల భద్రాచలం ఆలయం, పరిసర ప్రాంతాలు, మణుగూరులో భారజల కర్మాగారం, కొత్తగూడెంలో సింగరేణి గనులకు తలెత్తే ముంపుపై అధ్యయనం చేశారా?  తెలంగాణలో ముంపు ప్రాంతాలకు కరకట్టలు కడుతున్నారా?.. అని ప్రశ్నించింది.

ఒడిశా దాఖలు చేసిన ప్రధాన అంశాలు 
* ఇచ్చంపల్లి, భూపాలపట్నం వద్ద ప్రాజెక్టులు కడుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటిపై ప్రభావం చూపుతుందా? 
* పోలవరం ప్రాజెక్టు నమూనాను బ్యారేజీ నుంచి డ్యాంకు మార్చారా? 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల నమూనాలో మార్పు చేయడం గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ఉల్లంఘించినట్లు కాదా? నీటి విడుదల సామర్థ్యం మార్చడంపై సీడబ్ల్యూసీ తాజా అధ్యయనం అవసరం లేదా? 
* ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరపకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుమతించొచ్చా? అని ప్రశ్నించింది.

Posted
పోలవరం పనులు నిలిపేయండి.. సుప్రీంలో మరో పిటిషన్
02-08-2018 13:59:52
 
636688151936111862.jpg
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే పోలవరం పనులు నిలిపివేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మూడు వారాల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే రేలా అనే సంస్థ మరో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరంతో లక్షలాది గిరిజనులు నిర్వాసితులవుతున్నారంటూ ఇంకో పిటిషన్ దాఖలు చేసింది.
 
 
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. తాజాగా తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అభ్యంతరం తెల్పడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Posted
జల వివాదం ఎక్కడుంది?
02-08-2018 01:33:07
 
  • పోలవరాన్ని ట్రైబ్యునల్‌ ఎప్పుడో ఆమోదించింది
  • అవార్డుకు ఒడిసా అంగీకరించింది
  • ఇప్పుడు ఎలా అభ్యంతరం చెబుతుంది?
  • సుప్రీం కోర్టులో ఆంధ్ర అఫిడవిట్‌
  • నేడు ఒడిసా సూట్‌పై విచారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పోలరవం ప్రాజెక్టుపై సుప్రీంలో ఒడిసా దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ఠ అంశాలతో అఫిడవిట్‌ దాఖలుచేసింది. గతంలో తానే అంగీకరించిన అంశాలను కాదంటూ ఒడిసా వితండవాదం చేస్తోందని అందులో పేర్కొంది. ఒడిసా వాదనను తిప్పికొట్టే విధం గా విచానణాంశాలను సిద్ధంచేసి సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలతో ఒడిసా దాఖలు చేసిన సూట్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. ఏపీ 11 విచారణాంశాలను గుర్తించి కోర్టుకు సమర్పించింది. వీటిని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సమర్థించగా.. కేంద్రం కొన్నిటితో ఏకీభవించింది.
 
 
రాష్ట్రం లేవనెత్తిన 11 అంశాలు..
  • పోలవరం ప్రాజెక్టును ఒడిసా నీటి వివాదంగా పే ర్కొంది. రాజ్యాంగంలోని 262వ అధికరణ, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్‌ 2(సీ), సెక్షన్‌ 11 ప్రకారం.. నీటివివాదాన్ని కేవలం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన జలవివాద ట్రైబ్యునల్‌లోనే విచారించాలి. సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి లేదు!
  • ఒకవేళ ట్రైబ్యునల్‌కు వెళ్లాలన్నా.. గోదావరి ట్రైబ్యునల్‌ 1980 జూలై 7న అవార్డు ఇచ్చింది. దానికి అప్పుడే అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అలాంటప్పుడు ఇక జల వివాదం ఎక్కడుంది..?
  • ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆ అవార్డుకు కట్టుబడినట్లు ఒడిసా అఫిడవిట్‌ దాఖలు చేసింది. కాబట్టి అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదు.
  • సుప్రీంకోర్టు నియమించిన ఎం.గోపాలకృష్ణన్‌ కమి టీ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతున్నట్లు నివేదిక ఇచ్చింది! ఇక వివాదం ఏముంది?
  • పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకు అన్ని పార్టీల అంగీకారంతోపాటు వేగంగా సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
  • ఏప్రిల్‌ 17న స్పిల్‌వే ద్వారా 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యమా లేక 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యమా అనే అభ్యంతరాన్నే ఒడిసా పేర్కొంది. ఇప్పు డు అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేస్తుంది?
  • ప్రాజెక్టు ఎత్తు 140 అడుగులు ఉన్నప్పుడు స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు.. ఎత్తు 150 అడుగులు ఉన్నప్పుడు 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం ఉండాలని సీడబ్ల్యూసీ బీఐఎస్‌ కోడ్‌ 11223-1985 ప్రకారం సరైనదే కదా..!
  • 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకెళ్తే ఒడిసాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది?
  • పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం నిర్మాణానికి తెలంగాణ సమ్మతం తెలిపినట్లే..! ఇప్పుడెలా అభ్యంతరం చెబుతుంది?
  • 131వ అధికరణ ద్వారా ఒడిసా ప్రభుత్వం పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలి. కానీ సుప్రీం లో సూట్‌ ఎలా దాఖలు చేస్తుంది?
  • ప్రాజెక్టుకు అనుమతి ఉన్నా సుప్రీంలో కేసు ఉంద ని సాకు చూపుతూ ఒడిసాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడాన్ని ఎలా సమర్ధిస్తారు..?
Posted
On 7/26/2018 at 9:33 PM, swarnandhra said:

navigation channel mentioned by @ravindras is not for right canal. that channel is to connect polavaram upstream to downstream (Bhadrachalam-Rajahmundry). Polavaram back water to right canal navigation is difficult. Need to go through a hill.

 

Posted
సందేహాలు సశేషం
03-08-2018 03:09:45
 
636688781538250885.jpg
  • పోలవరం తుది అంచనాలపై మళ్లీ పాత పాటే
  • నిర్వాసితుల పేర్లు సర్వే నంబర్లు సహా ఇవ్వాలి
  • సీడబ్ల్యూసీ సంతృప్తి చెందితే సత్వరమే ఆమోదం
  • రాష్ట్ర అధికారులకు గడ్కరీ స్పష్టీకరణ
  • కేంద్ర ఫార్మాట్‌లో 6లోగా వివరాలివ్వాలి
  • అదే రోజు భూసేకరణ, పరిహార కమిటీ భేటీ
  • ప్రధాన పనుల అంచనాలనే ఆమోదించే చాన్స్‌
అమరావతి/న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలపై కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ పాతపాటే పాడారు. 2013-14 అంచనాల్లో స్పష్టత ఉంటే.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తే సత్వరమే అంచనాలను ఆమోదిస్తామని తెలిపారు. అంచనాల్లో స్పష్టత ఉన్నంత వరకూ ఆ మొత్తాన్ని ‘క్లియర్‌’ చేస్తామని అన్నారు. తద్వారా ప్రధాన పనుల వరకు మాత్రమే నిధులు అందిస్తామని సంకేతప్రాయంగా తెలియజేశారు. అయితే భూసేకరణ, పునరావాస వ్యయం భారీగా పెరగడంతో.. దానికి ఆమోదం తెలుపకుండా కొర్రీలు కొనసాగిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గడ్కరీ గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇన్‌చార్జి చైర్మన్‌ మసూద్‌ అహ్మద్‌, చీఫ్‌ ఇంజనీర్‌ సీకేఎల్‌ దాస్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ నాగిరెడ్డిలతో సమీక్ష నిర్వహించారు.
 
 
అంచనా వ్యయాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం మధ్య చర్చలు ఎంత వరకు వచ్చాయి.. ఏయే అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. 2010-11లో 2,934 కోట్లుగా ఉన్న భూసేకరణ, పరిహార వ్యయం రూ.33,225 కోట్లకు పైగా పెరగడంపై సీడబ్ల్యూసీ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. గడ్కరీ ఇవే సందేహాలను లేవనెత్తారు. ‘2013కి ముందు సేకరించాల్సిన భూమి కంటే ఎందుకు ఎక్కువ సేకరించాల్సి వచ్చింది? నిర్వాసితుల సంఖ్య 44 వేల నుంచి 96 వేలకు ఎందుకు పెరిగింది? ముంపు గ్రామాల సంఖ్య ఎందుకంత పెరిగింది? నిర్వాసితుల పేర్లు, అవార్డుల వివరాలను సర్వే నంబర్లు సహా సోమవారం (6వ తేదీ) లోగా ఇవ్వండి’ అని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
 
 
వీటికి ఇప్పటికే వివరణ ఇచ్చామని శశిభూషణ్‌ తెలిపారు. తుది అంచనాల విషయంలో 2-3 అంశాల్లో తమకు సందేహాలున్నాయని.. వాటికి కూడా సోమవారం నాటికి కేంద్ర ఫార్మాట్‌లో సమాధానాలు పంపితే.. వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా ఆమోదం తెలుపుతామని మసూద్‌ వెల్లడించారు. 6వ తేదీన పోలవరం సహాయ పునరావాస కమిటీ సమావేశం జరగనున్నందున తాము కోరిన వివరాలన్నీ సర్వే నంబర్లు సహా ఇవ్వాలని సూచించారు. ఈ సమాచారంతో సంతృప్తి చెందితే.. టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదానికి పంపాలని గడ్కరీ పేర్కొన్నారు. సందేహాలు లేనంత మేర తుది అంచనా మొత్తాలను ముందుగా ఆమోదిస్తామని తెలిపారు. దీంతో.. ఈ సమాచారాన్ని క్రోడీకరించే బాధ్యతను శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు అక్కడే మకాం వేసిన 14 మంది ఇంజనీరింగ్‌ అధికారుల బృందానికి అప్పగించారు.
 
 
నాడు ఈపీసీ పద్ధతిలో..
గడ్కరీ లేవనెత్తిన ప్రశ్నలకు శశిభూషణ్‌ అక్కడే బదులిచ్చారు. ‘2010-11 అంచనాలను ఈపీసీ పద్ధతిలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ తయారుచేసి ఇచ్చింది. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరుగలేదు. 2014లో నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ప్రాజెక్టుపై సంపూర్ణ అధ్యయనం చేశాం. ప్రాజెక్టు నిర్మాణానికి గోదావరి గర్భంలోనేగాక.. గట్టు వెంబడి కూడా పంట పొలాలను సేకరించాల్సి వచ్చింది. లేదంటే నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి. ఇవిగాక 2103లో వచ్చిన కొత్త భూసేకరణ చట్టం కారణంగా భూసేకరణతో పాటు సహాయ పునరావాసాల వ్యయం భారీగా పెరిగింది. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ కుటుంబంగా పరిగణించాల్సి రావడంతో నిర్వాసితుల సంఖ్యా పెరిగింది. దీంతో వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది’ అని వివరణ ఇచ్చారు. వాటిని మళ్లీ 6లోగా కేంద్ర ఫార్మాట్‌లో ఇస్తే ఆరోజు జరిగే భూసేకరణ సహాయ పునరావాస కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని గడ్కరీ తెలిపారు. ఈ కమిటీ సంతృప్తి చెంది జల సంఘానికి నివేదిక ఇస్తుందని.. దానిని సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదించాక.. ఆ మొత్తం వరకూ టీఏసీ ఆమోదానికి పంపుతామని చెప్పారు.
 
 
ఇంకోవైపు.. తుది అంచనాలను సత్వరమే ఆమోదించకుంటే ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు ఇక అందే అవకాశం ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2010-11 అంచనాల ప్రకారం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ కింద కేంద్రం ఇవ్వాల్సిన నిధులు దాదాపుగా వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చుచేసినా.. కేంద్రం తుది అంచనాలను ఆమోదించేదాకా పైసా కూడా వెనక్కి రాదు. వీటిని ఆమోదిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేదని రాష్ట్ర అధికారులు గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ.14,488.20 కోట్లు ఖర్చు పెట్టామని, అందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9352.33 కోట్లు ఖర్చు చేయగా... పీపీఏ ద్వారా కేంద్రం రూ. 6727.26 కోట్లు రీయింబర్స్‌ చేసిందని వివరించారు. రూ.2625.07 కోట్లు ఇంకా రావలసి ఉందని గుర్తుచేశారు. సమావేశం ముగిశాక శశిభూషణ్‌ విలేకరులతో మాట్లాడారు. తుది అంచనాల ఆమోద ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు. అంచనా వ్యయాల పెంపు ప్రక్రియలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణమేనని అన్నారు.
 
polawaram-25.jpg 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...