sonykongara Posted August 4, 2018 Author Share Posted August 4, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 4, 2018 Author Share Posted August 4, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 5, 2018 Share Posted August 5, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 6, 2018 Author Share Posted August 6, 2018 చట్టప్రకారమే చెల్లింపులు06-08-2018 02:59:27 ఆస్తులను బట్టే పరిహారంలో తేడా పోలవరం భూసేకరణపై రాష్ట్రం స్పష్టీకరణ కేంద్ర జల సంఘానికి నేడు నివేదిక నిర్వాసితుల పేర్లు, సర్వే నంబర్లు జత ఈఎన్‌సీ ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రత్యేక బృందం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కూడా.. అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘ఒక రైతు పొలంలో ఫలసాయమందించే చెట్లు, గొడ్ల చావిడి, పశువులు, ఇతర కట్టడాలు ఉంటాయి.. మరో రైతు పొలంలో అవేమీ ఉండవు. అలాంటప్పుడు చెల్లింపుల విషయంలో తేడాలు సహజంగానే ఉంటాయి’ అని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేయనుంది. పోలవరం ప్రాజెక్టు కోసం 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకే ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని.. భూ సేకరణ వివరాలన్నీ పారదర్శకంగా జరిగాయని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర జల వనరుల శాఖ మరోసారి నివేదించనుంది. భూ పరిహారం చెల్లింపుల్లో రైతుకూ రైతుకూ మధ్య తేడాలు ఆస్తులను బట్టి ఉంటాయని ఆధారాలతో వివరించనుంది. ఢిల్లీలో గత వారం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలోనూ.. ఆ తర్వాత కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్‌తోనూ జరిగిన వరుస భేటీల్లో జరిగిన నిర్ణయం మేరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై కేంద్ర ఫార్మాట్‌లో సమగ్ర సమాచారాన్ని అందజేసేందుకు సిద్ధమైంది. సోమవారం ఈ నివేదికను అందించేందుకు ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరింది. భూసేకరణ విస్తీర్ణం, సహాయ పునరావాస కార్యక్రమాలను గురించి సవివరంగా తెలియజేసేందుకు పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ కూడా వీరితో వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీలో 14 మంది ఇంనీరింగ్ అధికారులు మకాం వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర జల సంఘం వేసిన కొర్రీలకు కేంద్ర ఫార్మాట్‌లో సమాచారం అందజేసేందుకు వీరు అక్కడే ఉండి కసరత్తు చేస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. తొలి నుంచీ రాష్ట్రం చెబుతున్నది ఇదే.. 2010-11 అంచనాలు, 2014-15 సవరించిన అంచనాల్లో తేడా రావడంపై జలసంఘం చాలా కాలం నుంచి ఇవే సందేహాలు లేవనెత్తుతోంది. వీటికి మొదటి నుంచీ రాష్ట్ర జలవనరుల శాఖ వివరణ ఇస్తూనే ఉంది. 2013 భూసేకరణ చట్టం అమలులోకి రావడం.. 2014లో తెలంగాణ నుంచి ఏడు ముంపు మండలాలు ఏపీలో చేరడం, 41.5 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడం వల్ల ముంపు ప్రాంత విస్తీర్ణంపై ఇంజనీరింగ్ అధికారుల అంచనాలకూ.. క్షేత్ర స్థాయిలో భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ స్థాయి అధికారుల వాస్తవ పంపిణీలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ఎత్తు 41.5 మీటర్ల వరకూ ఉంటే.. 1,07,000 ఎకరాల దాకా ముంపునకు గురవుతుందని, ఇప్పటిదాకా 73 వేల ఎకరాలను సేకరించామని, మరో 34 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని స్పష్టం చేయనుంది. ఇంకా సేకరించాల్సిన భూ విస్తీర్ణం, ప్రకటించిన అవార్డులు, అసైన్డ్ భూములకూ పరిహారం చెల్లించాలని 2013 భూ సేకరణ చట్టంలోని నిబంధనలను భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ వివరించనున్నారు. పర్యవేక్షణ కమిటీ సమావేశం వాయిదా పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ భేటీ సోమవారం ఢిల్లీలో ఉంటుందని జల సంఘం ఇదివరకు ప్రకటించింది. తాజాగా దీనిని వాయిదా వేసినట్లు రాష్ట్రానికి సమాచారం అందించింది. కేంద్రం కోరింది ఇవీ.. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు, సర్వే నంబర్లతో సహా ఏయే గ్రామాల్లో నిర్వాసితుల వారిగా చేసిన చెల్లింపులు, ముంపు విస్తీర్ణం ఎందుకు పెరిగింది..? నిర్వాసితుల సంఖ్య 44,000 నుంచి 96,000కు ఎందుకు పెరిగింది..? ముంపు ప్రాంతం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది..? ఇదే సమయంలో కొత్తగా గ్రామాలూ ఎందుకొచ్చాయి..? 2010-11లో ఉన్న అంచనా వ్యయం పదింతలు ఎందుకు పెరిగింది..? వీటన్నిటికీ కేంద్ర ఫార్మాట్‌లో సమాచారమివ్వాలని సీడబ్ల్యూసీ కోరింది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 6, 2018 Author Share Posted August 6, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 7, 2018 Author Share Posted August 7, 2018 భూ సేకరణ ఎలా?.. తుది అంచనాలపై నేడు భేటీ07-08-2018 08:35:52 విధివిధానాలపై సమగ్ర నోట్ ఇవ్వండి రాష్ట్రాన్ని కోరిన కేంద్ర జలసంఘం తుది అంచనాలపై నేడు మళ్లీ భేటీ డ్యాం డిజైన్ కమిటీ సమావేశం కూడా.. అన్ని సందేహాలూ నివృత్తి చేయండి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం చెల్లింపులపై కేంద్రం వేస్తున్న కొర్రీలన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని తేలిపోయింది. ముంపు ప్రాంతం ఎందుకు పెరిగింది.. నిర్వాసిత కుటుంబాలు ఎందుకు పెరిగాయి.. నిర్వాసితుల జాబితా, సర్వే నంబర్లు ఇవ్వాలన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) అధికారులు.. సోమవారం అసలు భూసేకరణ విధానమేమిటని ప్రశ్నించడం రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. భూసేకరణ ఎలా చేపడతారో సీడబ్ల్యూసీ అధికారులకు ప్రాథమిక అవగాహన ఉండదా? అని వారు ఆశ్చర్యపోయారు. ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు పూర్తికాకుండా కాలయాపన చేయడానికే సందేహాలు లేవనెత్తుతున్నారన్న తమ అనుమానాలు నిజమయ్యాయని వారు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల ఆమోదానికి కేంద్రం వేసిన కొర్రీలకు స్వయంగా వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర జలవనరుల అధికారులు సోమవారం సీడబ్ల్యూసీ అధికారులతో భేటీ అయ్యారు. భూ సేకరణ ఎలా చేపడతారు.. దాని విధివిధానాలేమిటో చెప్పాలంటూ సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి, స్పెషల్ కలెక్టర్ భాను ప్రకాశ్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావులతో కూడిన బృందాన్ని కేంద్ర అధికారులు అడిగారు. దీనిపై నివేదిక ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు తుది అంచనాలు పంపిన తొలి రోజుల్లో అడగాల్సిన ప్రశ్నలను.. చివరి అంకంలో కోరడంలోని మతలబేంటో రాష్ట్ర అధికారులకు అంతుబట్టలేదు. అయినా జల సంఘం కోరడంతో సమగ్ర నోట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మంగళవారమే నివేదికను అందజేయనున్నారు. కాగా.. జల సంఘం మంగళవారం పోలవరం డ్యాం డిజైన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం, ఇతర కీలక కట్టడాల డిజైన్లపై రెండు గంటల పాటు చర్చిస్తుంది. అనంతరం మళ్లీ తుది అంచనాలపై కేంద్ర జల సంఘం సమీక్షిస్తుంది. పోలవరంపై సీఎం సమీక్ష కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు వీలుగా కేంద్ర జల సంఘం లేవనెత్తిన సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పాలని రాష్ట్ర జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఆయన సమీక్ష జరిపారు. గతవారం ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో జరిపిన చర్చల వివరాలపై ఆరా తీశారు. ప్రధానంగా భూసేకరణ, సహాయ పునరావాసం, ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల సంఖ్య పెరగడంపై జల సంఘం వేస్తున్న కొర్రీల గురించి జల వనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు. కాగా.. ప్రాజెక్టు పనులు వేగంగా నడుస్తున్నాయి. స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి తవ్వకం పనుల్లో 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 856.89 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అంటే.. 76.80 శాతం పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 12.01 లక్షల క్యూబిక్ మీటర్ల మేర (32.60%) పూర్తయ్యాయి. రేడియల్ గేట్లు 61.72 శాతం మేర పూర్తయ్యాయి. జెట్ గ్రౌటింగ్ పనులు 93 శాతం, కనెక్టివిటీ పనులు 58.63 శాతం, కుడి ప్రధాన కాలువపై 198 స్ట్రక్చర్లు, మట్టి పనులు 177.9 కి.మీ., లైనింగ్ పనులు 149.395 కి.మీ., ఎడమ కాలువపై స్ట్రక్చర్లు 146, మట్టి పనులు 179.948 కి.మీ., లైనింగ్ పనులు 124.593 కిలో మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇంకోవైపు.. రాష్ట్రంలోని 56 ప్రాధాన్య సాగు నీటి ప్రాజెక్టుల్లో ప్రతిదానినీ సరైన లక్ష్యంతో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వీటిలో 9 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 6 ప్రాజెక్టులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 28 ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని అధికారులు వివరించా Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 7, 2018 Author Share Posted August 7, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 7, 2018 Share Posted August 7, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 8, 2018 Author Share Posted August 8, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 9, 2018 Author Share Posted August 9, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 9, 2018 Author Share Posted August 9, 2018 పోలవరం ‘అవార్డు’ల సమస్త సమాచారం ఇవ్వండి09-08-2018 01:28:43 రాష్ట్రాన్ని కోరిన కేంద్ర జల సంఘం అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు భూపరిహారం కోసం రూపొందించిన సమగ్ర సమాచార ప్రకటన (అవార్డు)లను తమకు అందజేయాలని రాష్ట్ర జల వనరుల శాఖను కేంద్ర జల సంఘం కోరింది. పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి, జల వనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ తదితరులతో కూడిన బృందం గత రెండు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో చర్చలు జరుపుతోంది. ఒక్కో భూ సేకరణ అవార్డును ఒక్కో పుస్తకంగా తయారు చేసి ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్నారు. వాటిని కేంద్ర జల సంఘానికి అందజేశారు. సమాచారం భారీగా ఉంటుందని గుర్తించిన కేంద్ర బృందం సమాచారాన్ని ఓ పట్టికలో క్రోడీకరించి ఇవ్వాలని కేంద్ర జల సంఘం కోరింది. ఆ మేరకు మొత్తం సమాచారాన్ని పట్టిక రూపంలో ఇచ్చేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సిద్ధమైంది. గురువారం నాటికి ఈ ఫార్మెట్‌లో భూసేకరణ సమాచారం అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ వివరించింది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 9, 2018 Author Share Posted August 9, 2018 పోలవరంతో జీవనోపాధికి నష్టం ఉందా ?09-08-2018 02:14:08 మత్స్యకారులను అడిగి తెలుసుకున్న శాస్త్రవేత్తలు పోలవరం, ఆగస్టు 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో జీవనోపాధికి ఎలాంటి నష్టం జరుగుతుందని మత్య్సకారులను కేంద్ర విల్ ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కారణంగా గోదావరిలో చేపలు పట్టే అవకాశం లేక తమ జీనోపాధి కోల్పోతున్నామంటూ గతంలో మత్య్సకారులు జాతీయ ట్రిబునల్‌కు ఫిర్యాదుచేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు బుధవారం కోల్‌కతా నుంచి కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు బుధవారం గోదావరి పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. ముందుగా పోలవరం, గూటాలలోని మత్స్యకారులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగే నష్టాన్ని ఈసందర్భంగా మత్స్యకారులు వివరించారు. సముద్రంలో గ్యాస్ నిక్షేపాలు వెలికి తీస్తున్న ఓఎన్‌జీసీ ఆయా ప్రాంతాల మత్స్యకారులకు నష్టపరిహారం అందిస్తున్నారని, అలాగే తమకు నెలకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 9, 2018 Author Share Posted August 9, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 10, 2018 Author Share Posted August 10, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 10, 2018 Author Share Posted August 10, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 10, 2018 Author Share Posted August 10, 2018 తొలి స్పిల్‌వే గేటు దసరాకే!10-08-2018 03:07:43 లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీలూ సిద్ధం శరవేగంగా నిర్మాణ పనులు సరికొత్త రికార్డు దిశగా అడుగులు జపాన్, జర్మనీ నుంచి పరికరాలు ఈ నెలలోనే జపాన్ నుంచి బుష్‌లు ఏలూరు/అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు దసరా నాటికి ఒక రూపు సంతరించుకోనుంది. నిర్మాణంలో అంతర్భాగమైన రేడియల్ గేట్ల అమరిక విజయదశమికి ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్టోబరు నెలలోనే లక్ష్యాలను చేరుకోవాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. స్పిల్‌వేలో మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉంది. ఆరునూరైనా రాబోయే 2 నెలల్లోనే ప్రయోగాత్మకంగా ఒక గేటు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, తద్వారా వచ్చే ఏడాదికి ప్రాజెక్టు పూర్తవుతుందనే విశ్వాసం రైతుల్లో బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కాంక్రీట్ పనుల్లో అవాంతరాలు తప్పడం లేదు. అయినా స్పిల్‌వే విషయంలో నిర్ణీత వ్యవధిలోనే కాంక్రీట్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతకంటేమించి స్పిల్‌వేలో రేడియల్ గేట్ల అమరిక కోసం ఇంజనీర్లు అంతర్గత కసరత్తును పూర్తిచేశారు. ప్రాజెక్టు పనుల్లో సరికొత్త రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. బేకం కంపెనీ గేట్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. 3 నెలల క్రితం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు..‘స్పిల్‌వే కాంక్రీట్ పనులన్నీ శరవేగంగా సాగుతాయి. స్పిల్‌వేలో 48 ఖానాలు ఉండగా, వాటిలో ఒక ఖానాకు సంపూర్తిగా గేట్లను అమరుస్తాం. ఇది ప్రయోగాత్మకంగా ఉంటుంది. ప్రాజెక్టుకు ఒక రూపు వస్తుంది. రేడియల్ గేట్లలో ఒక దానిని అమర్చడం ద్వారా లక్ష్యాలకు చేరువయ్యేందుకు మరింత ఉత్సాహం వస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ రెండు నెలలూ కీలకం సుమారు 15.96 మీటర్ల వెడల్పు, 20.835 మీటర్ల ఎత్తు కలిగిన 48 గేట్ల నిర్మాణంలో ఇప్పటికే 70ుపైనే పనులు పూర్తయ్యాయి. వీటికి 18వేల టన్నుల ఉక్కు అవసరం కాగా, ఇప్పటికే 11వేల టన్నుల ఉక్కును గేట్ల నిర్మాణానికి వినియోగించారు. మరో 7టన్నుల ఉక్కు కోసం ఎదురుచూస్తున్నారు. స్పిల్‌వే అంతర్భాగంలో కొన్నింటికి అనుమతులు రాగా, మరికొన్నింటికి అనుమతులు లభించాల్సి ఉంది. అయినా అక్టోబరులోనే తొలి రేడియల్ గేటు అమరికకు వీలుగా పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. దీనికి సరిపడా హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ నుంచి రావాలి. గేటు ఎత్తేందుకు ఈ హైడ్రాలిక్ సిలిండర్లను వినియోగిస్తారు. ఒక్కొక్కటీ 250 టన్నుల బరువు ఉంటుంది. గేటు బరువు 300 టన్నులకు పైగానే ఉంటుంది. ఒక హైడ్రాలిక్ సిలిండర్ సరాసరిన 500 టన్నుల బరువును అలవోకగా పైకి ఎత్తుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కావాల్సినన్ని సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు. గేట్ల నిర్మాణంలో సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు కీలకపాత్ర వహిస్తాయి. మొత్తం 96 బుష్‌లు అవసరం. ఇవన్నీ జపాన్ నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటివరకు 16 బుష్‌లు భారత్‌కు చేరుకోగా మిగతా 80 బుష్‌లు జపాన్‌లోని ఎఓహోం ఓడరేవు నుంచి బయలుదేరి విశాఖ పోర్టుకు చేరుకోవాలి. జపాన్ నుంచి 3,200 నాటికల్ మైళ్లు ప్రయాణించాలి. అనుకున్నట్టుగా జరిగితే ఈనెల మూడోవారానికి బుష్‌లన్నీ అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. హైడ్రాలిక్ సిలిండర్లు, సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు దగ్గర ఉంటేనే స్పిల్‌వే గేట్ల నిర్మాణ ఆకృతిని ఒక దశకు చేర్చవచ్చు. అనుమతులు రావడమే ఆలస్యం స్టాప్‌లాక్ గేట్లు, రివర్ స్లూయిజ్ గేట్లు, జన్‌ట్రై క్రేన్‌లు, హారిజంటల్ గట్టర్స్, ఆర్మ్ గట్టర్స్, థిన్ గేట్లు వంటి వాటిని గేట్ల నిర్మాణంతో సమానంగా అమరిక కొనసాగాలి. అయితే ప్రయోగాత్మకంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఒక గేటు నిర్మాణం జరిగితే.. అనుమతులు రాగానే మిగతావాటిని ప్రారంభిస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. స్పిల్‌వే గేట్ల నిర్మాణానికి రూ.530కోట్ల వ్యయం అవుతుంది. ఇప్పటి వరకూ బేకం కంపెనీకి రూ.69 కోట్లే చెల్లించారు. అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం స్పిల్‌వే విభాగంలో గేట్ల అమరిక పూర్తయ్యేదానిని బట్టి మిగతా మొత్తానికి చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గేట్ల నిర్మాణానికి ప్రాథమికంగా అవసరమైన నిధులనే విడుదల చేశారు. ‘వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గ్రావిటీ ద్వారా కాల్వలకు నీరు అందిస్తాం. ఈ విషయంలో తగిన లక్ష్యాలను అందుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. కచ్చితంగా లక్ష్యాలకు చేరుకుంటామనే నమ్మకం కుదిరింది. పనులు అంతలా వేగంగా ఉన్నాయి. ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న రైతుల్లోనూ నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా గోదావరి జలాలు తమ చేలకు వస్తాయని విశ్వాసంతో ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు ఈ మధ్య ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు 57% పూర్తయినట్టు తెలిపారు. ఎడమ కాల్వకు కొత్త టెండర్లు అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువకు అడ్డంగా ఉన్న చెరువులు, వాగులు, జాతీయ రహదారులపై వంతెనలు నిర్మించేందుకు కొత్తగా టెండర్లను పిలవాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. 2005లో ఈ పనులను మైటా్‌స-ఎన్‌సీసీ జాయింట్ వెంచర్ సంస్థకు అప్పగించారు. పనులు చేపట్టకపోవడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో ఆ సంస్థను తప్పిస్తూ నిర్ణయం తీసుకొంది. 2016-17 అంచనా వ్యయం మేరకు టెండర్ల ఖరారు చేస్తారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 10, 2018 Author Share Posted August 10, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 12, 2018 Author Share Posted August 12, 2018 సాంకేతిక సలహా’ భేటీ మిగిలింది భూసేకరణ, పునరావాసంపై సీఈకి వివరించిన ముగ్గురు ఐఏఎస్‌లు పోలవరంపై సమగ్ర సమాచారం అందజేత ఈనాడు, అమరావతి: దిల్లీలో పోలవరం మహాయజ్ఞంలో మరో ఘట్టం పూర్తయింది. రూ.57,900 కోట్ల సవరించిన అంచనాల ఆమోదానికి చేసిన ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వివరణలు పూర్తయ్యాయి. ఇప్పుడిక వారు సాంకేతిక సలహా కమిటీ భేటీ కోసం వేచి చూస్తున్నారు. కేంద్ర జల సంఘం వద్ద ప్రస్తుతం ఈ అంచనాలు పరిశీలనలో ఉన్నాయి. వారి తనిఖీ పూర్తయి అన్నీ కొలిక్కి వస్తే అక్కడి నుంచి సాంకేతిక సలహా కమిటీ సమావేశానికి వెళ్తాయి. సవరించిన అంచనాల ఆమోదంలో ఇదే కీలకఘట్టం. ఇప్పటికే కేంద్ర జల సంఘం అధికారులు అడిగిన సమస్త సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇచ్చి వచ్చారు. భూసేకరణ- పునరావాసానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసేందుకు సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్‌లు దిల్లీ వెళ్లి ప్రత్యేకంగా అక్కడి చీఫ్ ఇంజినీరుకు సమగ్ర వివరాలు అందజేశారు. గత వారం కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వద్ద పోలవరంపై సమావేశం జరిగిన విషయమూ తెలిసిందే. ఆ సమావేశంలో గడ్కరీ స్పష్టమైన సూచనలు చేశారు. కేంద్ర జల సంఘం అధికారులకు, రాష్ట్ర అధికారులకు మధ్య ఏకాభిప్రాయం ఉన్న విషయాలు తొలుత పరిష్కరిద్దామని, భిన్నాభిప్రాయాలు ఉన్నవాటిని పెండింగులో ఉంచి ఆ తర్వాత కొలిక్కి తీసుకొద్దామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర జల సంఘం ఛైర్మన్ మసూద్ అహ్మద్ వివాదాలేమీ లేవని బదులిచ్చారు. గంటల కొద్దీ వివరణలు... పోలవరం భూసేకరణ, పునరావాసానికి సవరించిన అంచనాలను పరిశీలిస్తున్నది ఒక చీఫ్ ఇంజినీరు స్థాయి అధికారి కావడంతో రెవెన్యూ అంశాలను ఆయనకు అర్థమయ్యేలా ఐఏఎస్‌లు విడమర్చి చెప్పారు. భూసేకరణ ఎలా చేస్తారు? డ్రాఫ్టు నోటిఫికేషన్ అంటే ఏమిటి? డ్రాఫ్టు డిక్లరేషన్ అంటే ఏమిటి? 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది? అంతకు ముందు చట్టం ఏం చెప్పింది? వంటి వాటితోపాటు మొత్తం ప్రక్రియను ఎలా నిర్వహిస్తారో వారు ఆ చీఫ్ ఇంజినీరుకు కూలంకషంగా అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది. ప్రతి అంశానికి సంబంధించి ఒక్కో నమూనా ఫైలు కావాలని ఆయన అడగ్గా అన్నీ సమర్పించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ప్రతి గ్రామంలో ముంపులో చిక్కుకునే భూమిని మ్యాప్‌లో చూపిస్తూ సర్వే నెంబర్ల వారీగా మ్యాప్‌లను చీఫ్ ఇంజినీరు అడిగారు. వాటిని రంగుల్లో గుర్తించి దాదాపు 371 ఆవాసాలకు సంబంధించిన మ్యాప్‌లను సమర్పించారు. టీఏసీ ముందు ప్రతిపాదించేందుకే... కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీరుగా ఉన్న దాస్ ఈ సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ భేటీలో ప్రతిపాదించాల్సి ఉంటుందని సమాచారం. ఆ కమిటీ అడిగే అన్ని ప్రశ్నలకు ఆయనే సమాధానాలివ్వాలి. సమగ్ర వివరాలను ఇప్పటికే తెలుసుకున్న ఆయన ఇంకా సందేహాలుంటే లేఖ రాస్తానని చెప్పినట్లు పునరావాస అధికారులు చెబుతున్నారు. కేంద్ర జల సంఘంలో డైరెక్టర్లతో కూడిన బృందం పోలవరం పరిశీలనకు వచ్చే అవకాశమూ ఉందనే ప్రచారముంది. ఆ బృందం వచ్చి వెళ్లిన తర్వాత కేంద్ర జల సంఘం గడప దాటి సాంకేతిక సలహా కమిటీ ముందుకు ఈ అంచనాలు వెళ్తాయా లేక సంబంధం లేకుండానే జల సంఘం నుంచి మరో మెట్టు ఎక్కుతాయా అన్నది వేచి చూడాలి. ఆగస్టు చివర్లో సాంకేతిక సలహా కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో కాకుండా సెప్టెంబరులో జరిగే సమావేశానికి ఈ ప్రతిపాదనలు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 12, 2018 Author Share Posted August 12, 2018 (edited) Edited August 12, 2018 by sonykongara Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 13, 2018 Share Posted August 13, 2018 Link to comment Share on other sites More sharing options...
abhitdp Posted August 13, 2018 Share Posted August 13, 2018 http://epaper.andhrajyothy.com/c/31208586 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 14, 2018 Author Share Posted August 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 14, 2018 Author Share Posted August 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 14, 2018 Author Share Posted August 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 14, 2018 Author Share Posted August 14, 2018 కేవీపీకి ఘాటుగా రిప్లై ఇచ్చిన స్పీకర్14-08-2018 20:01:40 గుంటూరు: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లేఖ రాసినపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. కేవీపీ కంటే తనకే రాజకీయ అనుభవం ఎక్కువని చెప్పారు. తనకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా అనుభవం ఉందన్నారు. పోలవరం పూర్తవ్వాలంటే చిత్తశుద్ధి కావాలన్నారు. అంతేకాని రాజకీయాలు కాదని హితవు పలికారు. పోలవరం ఇప్పటికే 57 శాతం పూర్తయిందని చెప్పారు. కేవీపీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఇకనైనా పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని కేవీపీకి కోడెల సూచించారు. ఇటీవల స్పీకర్ కోడెల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2శాతమే పూర్తయ్యాయని కోడెల ఆరోపించారు. దీన్ని ఉటంకిస్తూ ఏపీ స్పీకర్ కోడెలకు ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2 శాతమే జరిగాయనడం సరికాదని పేర్కొన్నారు. పోలవరం పనులు చూసి పులకించిన కోడెల.. అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై తాను వేసిన పిల్‌కి.. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని కేవీపీ లేఖలో తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 14, 2018 Author Share Posted August 14, 2018 ఏపీకి మరో షాక్... పోలవరం డిజైన్లను ఆమోదించని కేంద్రం14-08-2018 20:01:44 ఆంధ్రజ్యోతి: అదే నిర్లక్ష్యం.. అదే అలసత్వం... ఏపీపై ఢిల్లీలో అదే చిన్నచూపు.. రాష్ట్రానికి అది చేస్తాం.. ఇది చేస్తామని కేంద్ర పెద్దలు గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నా... ఆచరణలో మాత్రం అంతా శూన్యం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల మంజూరు ప్రక్రియ చూస్తుంటే.. మాటలు తప్ప చేతలు లేవనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం స్థూల శోధన కొనసాగుతోంది. గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతుంటే.. సమయం సమీపిస్తున్నా కేంద్ర జలసంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. భూసేకరణ, పునరావాసం సహా తుది అంచనాలు, డిజైన్లను ఆమోదించకుండా అడుగడుగునా కొర్రీలు వేస్తూ అడిగిన సమాచారమే అడుగుతోంది. రాష్ట్ర జలవనరుల శాఖ అన్నింటికి సమాధానాలు చెబుతున్నా కీలక డిజైన్ల ఆమోదానికి గానీ, తుది అంచనాల ఆమోదానికి గానీ ఒక్క అడుగైనా ముందుకు వేయడంలేదు. గత నెల రోజులుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రతి 2, 3 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్లి వస్తునే ఉన్నారు. జలసంఘం అధికారులతో చర్చలు సాగిస్తూనే ఉన్నారు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయినా జలసంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సీడబ్ల్యూసీకి అందుబాటులో ఉండేందుకు 14 మంది ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. వారు నిత్యం ఉదయం 10 గంటల నుంచి జలసంఘం కార్యాలయం తలుపులు మూసివేసేవరకు అక్కడే ఉంటూ అడిగిన వివరాలు ఇస్తూ వచ్చారు. తుది అంచనాల ఆమోదంలో జాప్యం జరిగేటట్లు అయితే తక్షణమే రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని, కాపర్ డ్యామ్, స్పిల్ చానల్ ఎట్ కం రాఫెల్ డ్యామ్ పనులు వడివడిగా పనులు పూర్తి చేసేందుకు వాటి డిజైన్లు అయినా ఆమోదించాలని రాష్ట్ర అధికారులు అభ్యర్థించారు. ఈ పనుల పూర్తికి సీడబ్ల్యూసీ ఆమోదం తప్పనిసరి. ఈ అనుమతులు రాకుంటే నిర్ణీతగడువులోగా పూర్తి చేయడం కుదరదు. 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఈ పరిస్థితిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తామని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted August 14, 2018 Share Posted August 14, 2018 poorthi nyayam cheyyataniki try chestunnaru Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 15, 2018 Author Share Posted August 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 15, 2018 Author Share Posted August 15, 2018 రాతి డ్యాంకు మరో గుత్తేదారు? నోటీసులకు స్పందించని ట్రాన్స్‌ట్రాయ్ గడువు సయితం పూర్తి నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల్లో కొన్ని ప్రదాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ నుంచి తప్పించి మరొకరికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. రాతి, మట్టి డ్యాం నిర్మాణం; ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఇందులో ఉన్నాయి. మూణ్నాలుగు నెలలుగా ఈ పనుల కోసం నైపుణ్యం ఉన్న గుత్తేదారును గుర్తించి ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌ట్రాయ్‌ను ఇంజినీరింగు అధికారులు కోరుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం అనేక సమావేశాల్లో ఈ అంశంపై సూచిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ నైపుణ్యం ఉన్న గుత్తేదారుణ్ని ఈ పనికి ఉపగుత్తేదారుగా నియమించేందుకు ట్రాన్స్‌టాయ్ ముందుకు రాలేదని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు. పనుల ప్రారంభానికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ పనులు మీ నుంచి తొలగించి వేరే వారికి ఎందుకు అప్పజెప్పకూడదో తెలియజేయాలంటూ పోలవరం ఎస్‌ఈ ఇప్పటికే 60 సి కింద నోటీసులు ఇచ్చారు. సమాధానం లేదు. ఆ గడువు కూడా ఆగస్టు 13తో ముగిసింది. అక్టోబరు నెలలో వీటి నిర్మాణ పనులు ప్రారంచాలని, వచ్చే జూన్ నెలాఖరుకల్లా కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేసి జలాశయంలో నీటిని నిలబెట్టి గ్రావిటీ ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాంక్రీటు పని అంతా ఫిబ్రవరి నెల చివరి నాటికే పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. స్పిల్‌వే నిర్మాణంతో పాటు గేట్ల ఏర్పాటు కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుకు, దిగువ కాఫర్ డ్యాంను 28 మీటర్ల ఎత్తున నిర్మించాలి. దీనికి సమాంతరంగా ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణ పనులు రెండు సీజన్లలో పూర్తి కావాలి. ఆ పనులు సయితం అక్టోబరు నుంచి ప్రారంభం కావాల్సిందే. కానీ ఇందుకు తగిన సన్నద్ధత ప్రధాన గుత్తేదారు వైపు నుంచి కనిపించట్లేదని అధికారులు పేర్కొంటున్నారు. అప్పగించనున్న పనిలో మిగిలిందెంత? పోలవరంలో ప్రధాన రాతి, మట్టి డ్యాం 1.75 కిలోమీటర్ల పొడవునా, 54 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తయినందున అది మినహాయిస్తే మిగిలిన పని విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా 42.5 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలి. దిగువ కాఫర్ డ్యాం 1.6 కిలోమీటర్ల పొడవునా 28 మీటర్ల ఎత్తుకు నిర్మించాలి. వీటికి సంబంధించి దాదాపు జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తి కావచ్చాయి. వీటికి సంబంధించి చేయాల్సిన పనుల విలువ కూడా దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రాన్స్‌ట్రాయ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో వారితో కూర్చుని చర్చించి కొలిక్కి తీసుకురావాలని సీఎం సోమవారం నాటి సమీక్షలో సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే పనులు, కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ ఈ పనులు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కొత్తగా ఎల్‌ఎస్(లంసమ్) పద్ధతిలో అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కాంక్రీటు పనుల తరహాలోనే ధర మారకపోయినా అందుకునే మొత్తం మారుతుంది. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted August 15, 2018 Share Posted August 15, 2018 1 hour ago, sonykongara said: రాతి డ్యాంకు మరో గుత్తేదారు? నోటీసులకు స్పందించని ట్రాన్స్‌ట్రాయ్ గడువు సయితం పూర్తి నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల్లో కొన్ని ప్రదాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ నుంచి తప్పించి మరొకరికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. రాతి, మట్టి డ్యాం నిర్మాణం; ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఇందులో ఉన్నాయి. మూణ్నాలుగు నెలలుగా ఈ పనుల కోసం నైపుణ్యం ఉన్న గుత్తేదారును గుర్తించి ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌ట్రాయ్‌ను ఇంజినీరింగు అధికారులు కోరుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం అనేక సమావేశాల్లో ఈ అంశంపై సూచిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ నైపుణ్యం ఉన్న గుత్తేదారుణ్ని ఈ పనికి ఉపగుత్తేదారుగా నియమించేందుకు ట్రాన్స్‌టాయ్ ముందుకు రాలేదని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు. పనుల ప్రారంభానికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ పనులు మీ నుంచి తొలగించి వేరే వారికి ఎందుకు అప్పజెప్పకూడదో తెలియజేయాలంటూ పోలవరం ఎస్‌ఈ ఇప్పటికే 60 సి కింద నోటీసులు ఇచ్చారు. సమాధానం లేదు. ఆ గడువు కూడా ఆగస్టు 13తో ముగిసింది. అక్టోబరు నెలలో వీటి నిర్మాణ పనులు ప్రారంచాలని, వచ్చే జూన్ నెలాఖరుకల్లా కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేసి జలాశయంలో నీటిని నిలబెట్టి గ్రావిటీ ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాంక్రీటు పని అంతా ఫిబ్రవరి నెల చివరి నాటికే పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. స్పిల్‌వే నిర్మాణంతో పాటు గేట్ల ఏర్పాటు కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుకు, దిగువ కాఫర్ డ్యాంను 28 మీటర్ల ఎత్తున నిర్మించాలి. దీనికి సమాంతరంగా ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణ పనులు రెండు సీజన్లలో పూర్తి కావాలి. ఆ పనులు సయితం అక్టోబరు నుంచి ప్రారంభం కావాల్సిందే. కానీ ఇందుకు తగిన సన్నద్ధత ప్రధాన గుత్తేదారు వైపు నుంచి కనిపించట్లేదని అధికారులు పేర్కొంటున్నారు. అప్పగించనున్న పనిలో మిగిలిందెంత? పోలవరంలో ప్రధాన రాతి, మట్టి డ్యాం 1.75 కిలోమీటర్ల పొడవునా, 54 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తయినందున అది మినహాయిస్తే మిగిలిన పని విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా 42.5 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలి. దిగువ కాఫర్ డ్యాం 1.6 కిలోమీటర్ల పొడవునా 28 మీటర్ల ఎత్తుకు నిర్మించాలి. వీటికి సంబంధించి దాదాపు జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తి కావచ్చాయి. వీటికి సంబంధించి చేయాల్సిన పనుల విలువ కూడా దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రాన్స్‌ట్రాయ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో వారితో కూర్చుని చర్చించి కొలిక్కి తీసుకురావాలని సీఎం సోమవారం నాటి సమీక్షలో సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే పనులు, కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ ఈ పనులు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కొత్తగా ఎల్‌ఎస్(లంసమ్) పద్ధతిలో అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కాంక్రీటు పనుల తరహాలోనే ధర మారకపోయినా అందుకునే మొత్తం మారుతుంది. ecrf dam, coffer(lower and upper) dams navayuga ki isthe manchidi . Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now