Jump to content

Governor Nirasimhan..Thank You.


LuvNTR

Recommended Posts

Andhra Runam Teerchukunnavu.

                మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం– భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి కొన్ని శక్తులు కారణమని స్పష్టమవుతోంది. ఇందులో ప్రధాన పాత్ర గవర్నర్‌ నరసింహన్‌ది! ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్‌ వచ్చి తనను కలిసే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులందరి వద్ద చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరి వద్ద కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గవర్నర్‌ చిట్టా విప్పారు. గవర్నర్‌ వైఖరికి సదరు ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ఇది ఎంత దూరం వెళ్లిందంటే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు గవర్నర్‌ నరసింహన్‌ ఇందులో ఏదో మతలబు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇదంతా గమనిస్తూ వచ్చిన ఒక కేంద్ర మంత్రి మరో ప్రముఖుడితో మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే గవర్నర్‌ నరసింహన్‌కు పడదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ నరసింహన్‌ చెబుతున్న మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుకు ఆయన చాలా రోజులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.
                        రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్‌ కల్యాణ్‌ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్‌ నివేదిక ఇచ్చారట! కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో వేలుపెట్టడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. ఐ.వై.ఆర్‌. కృష్ణారావు వంటివారితో కూడా సంప్రదింపులు జరిపారట! ఈ దశలోనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, రాష్ర్టానికి అన్యాయం జరిగిందన్న భావన ప్రజలలో ఏర్పడటం జరిగింది. అయినా ఉభయ కుశలోపరిగా ఉన్న హితులు జోక్యం చేసుకుని అమిత్‌ షాను ఒప్పించి చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయించారు. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా సదరు సమావేశానికి చంద్రబాబు వెళ్లకుండా వేరే ప్రతినిధి వర్గాన్ని పంపారు. ఆ ప్రతినిధివర్గంలో కుటుంబరావు వంటివారు ఉండటాన్ని అవమానంగా భావించిన అమిత్‌ షా సదరు సమావేశానికి హాజరుకాలేదు. పెద్ద మనుషుల జోక్యంతో చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడతానన్న అమిత్‌ షా అలక్ష్యం చేశారు. దీంతో గ్యాప్‌ మరింత పెరిగింది. అమిత్‌ షా బదులు అరుణ్‌ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో కుటుంబరావు చేసిన వ్యాఖ్యలు అమిత్‌ షా దృష్టికి వెళ్లడంతో అపార్థాలు తారస్థాయికి చేరాయి. ఈ దశలో తాము ఇవ్వబోతున్న ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరిస్తున్నారా? లేదా? అన్నది స్పష్టంచేయాలని అమిత్‌ షా తెలుగుదేశం ముఖ్యుడొకరిని ప్రశ్నించారు. దీంతో సదరు నాయకుడు ముఖ్యమంత్రిని సంప్రదించడం, ఇప్పటికి ప్యాకేజీ తీసుకుందాం– ఎన్నికల నాటికి మన నిర్ణయం మనం తీసుకుందామని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ మాటను కూడా సదరు వ్యక్తి అమిత్‌ షా ఉన్నప్పుడే చెప్పడంతో మేలైన ప్యాకేజీ ఇచ్చినా చంద్రబాబు తమతో పొత్తు కొనసాగించే ఉద్దేశంలో లేరన్న అనుమానంతో అమిత్‌ షా కాడిపారేశారు. మరోవైపు గవర్నర్‌ ద్వారా తనకు పొగ పెడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు కూడా బీజేపీ అధినేతలతో అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. దీంతో ఇరుపక్షాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరకు అది ఉభయపక్షాల మధ్య తెగదెంపులకు దారితీసింది. తెర వెనుక జరిగింది ఇది! గవర్నర్‌ నరసింహన్‌ వంటివారి పుణ్యమా అని మొదలైన అపార్థాలు చినికిచినికి గాలివానగా మారాయి. అంతిమంగా నష్టపోతున్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం! ఎండమావులను నమ్ముకుంటే దప్పిక తీరదని చెప్పినా వినిపించుకునే పరిస్థితులలో రాజకీయ పార్టీలు గానీ, ప్రజలు గానీ లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసి పొరుగువారు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు. ఆంధ్రావాళ్లు తెలివైనవారు– వారిని తాము తట్టుకోలేమని తెలంగాణ ప్రజలు భావించేవారు. కానీ జరుగుతున్న బాగోతాలను చూస్తుంటే ఆంధ్రావారి పట్ల జాలి కలుగుతోంది. చెరువు మీద అలిగినట్టు కేంద్ర ప్రభుత్వంపై అలిగినా, పరస్పరం నిందించుకున్నా ప్రయోజనం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆగ్రహించినంత మాత్రాన భారతీయ జనతాపార్టీకి పోయేది పెద్దగా ఏమీ ఉండదు గానీ రాష్ర్టానికి వచ్చేది కూడా రాకుండా పోతుంది.

http://www.andhrajyothy.com/artical?SID=561321

Link to comment
Share on other sites

10 minutes ago, Kiran said:

So Modi mistake kanna other factors influenced antadu AJ babu:dream:

if this is news is true ,  Cheppudu maatalu vini oka manchi trusted party and able leader ni anumaninche vyakthi Modi.....Modi is a politician...He can never be a statesman like Vajpayee or CBN.

Link to comment
Share on other sites

33 minutes ago, JAYAM_NANI said:

If cabinet ministers can understand that CBN and Governor didn't go along, it is surprising Modi couldn't understand that. If one's motive is to break, how can a mere Governor stop it?

governor alone will not be the reason.. BJP leaders like Puran, kavuri and Kanna have been giving bad feedback on CBN.. then Modi/Amit wanted more seats for BJP and at the same time Jagan is promising them moon... all these contributed for the split.. but don't understand what happened to their own intelligence reports.. pogaru eyes ni kappesindemo..

Link to comment
Share on other sites

AJ article - mutton pulav anTaaDu, masaala ekkuva.....Gov. Trouble maker , nijamE ....assalu mukka adi kaadu - Modi/Jaitley/Sha on AP policy & politics --- Tinted with Arrogance, could not see the clear picture of latent anguish of AP public underneath the surface...

Congress gontu kOstunTE bjp taDibaTTa chuTTindi mettagaa Division prahasanam lO.......appuDu dimma dirigE debbha koTTaali bjp ki.....Andhra people went for the easier route, aversion to fight & struggle .....Jaitley ,& co ki ...adi gurthu - oka soft opinion.....chalimiDi suddha lo kitchen knife laa easy game ......Luckily, CBN/tdp did the right thing - called the bluff, credit to people who provided enough inspiration for fight....That's the story, the belligerent attitude of bjp towards AP, not just this side story of Gov. 's misdemeanors.....

Link to comment
Share on other sites

గవర్నర్ ఏపీలో బీజేపీ అజెండా అమలు చేస్తున్నారు’
08-04-2018 12:56:19
 
636587889779098994.jpg
 
రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై ఏపీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలహీనపర్చేలా కేంద్రానికి గవర్నర్‌ తప్పుడు నివేదికలు అందజేశారని ఆరోపించారు. నరసింహన్ ఏపీలో బీజేపీ అజెండా అమలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గుళ్ల చుట్టూ తిరిగే గవర్నర్ ఏపీ సమస్యలపై ఎప్పుడూ స్పందించలేదన్నారు. నరసింహన్ గవర్నర్‌గా కొనసాగటానికి అనర్హుడని మంత్రి జవహర్‌ అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వెనుక గవర్నర్ ఉన్నారని స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

పదవి కోసం గవర్నర్ బీజేపీ తొత్తుగా మారారు’
08-04-2018 13:15:14
 
రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీరు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందని ఏపీ శాసనమండలి విప్ షరీఫ్‌ విమర్శించారు. గవర్నర్‌ పదవిని కాపాడుకునేందుకు ఆయన బీజేపీ తొత్తుగా మారారన్నారు. గవర్నర్‌ టీడీపీపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని షరీఫ్‌ మండిపడ్డారు.
Link to comment
Share on other sites

‘ఆ పార్టీల మధ్య సఖ్యత కుదిర్చింది గవర్నరే’
08-04-2018 13:09:04
 
636587897421757839.jpg
 
గుంటూరు: రాజ్‌భవన్‌ వేదికగా తెలుగు రాష్ట్రాలలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని మంత్రి ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్, బీజేపీ మధ్య సఖ్యత కుదిర్చింది గవర్నర్ నరసింహన్ అని మంత్రి ఆరోపించారు. మొదటి నుంచి గవర్నర్ తీరు వివాదాస్పదంగానే ఉందని, రాజధాని, పోలవరంపై కేంద్రానికి ఆయన తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆనందబాబు వ్యాఖ్యానించారు
Link to comment
Share on other sites

13 hours ago, Hello26 said:

Since the ime of bifurcatione this fellow has done many backstabbing moves against AP 

Very true H bro,....Sitting in a revered constitutional position, during pre- bifurcation era this guy used to meet top congress leaders in their residences in Delhi, and used to brief them & submit reports also on AP.....The list includes Chidambaram, Sonia and other key notorius architects in the back room designs & dealings for slicing & carving of AP .....He works as a submissive  underling to Center, irrespective of who is in power; Also, Kcr's sycophancy has a big impact on this person, is an under statement.

All in all he has operated clandestinely against AP , as a tool to the opportunistic machinations of center, against Tdp obviously he has an Axe to grind, no Q ....

Link to comment
Share on other sites

1 hour ago, Sr Fan said:

Very true H bro,....Sitting in a revered constitutional position, during pre- bifurcation era this guy used to meet top congress leaders in their residences in Delhi, and used to brief them & submit reports also on AP.....The list includes Chidambaram, Sonia and other key notorius architects in the back room designs & dealings for slicing & carving of AP .....He works as a submissive  underling to Center, irrespective of who is in power; Also, Kcr's sycophancy has a big impact on this person, is an under statement.

All in all he has operated clandestinely against AP , as a tool to the opportunistic machinations of center, against Tdp obviously he has an Axe to grind, no Q ....

Narsimhanni anatam valana emi use bro... above person ni batti ilanti vallu behave chestaru... Modi first lo ne cut chesthe Narsimham muusukune vaadu.. modi kavalanu kunnappudu ilanti vallu chelaregi potaru

Link to comment
Share on other sites

EE uhaganalu antha waste.. modi ki cbn meeda personal grudge undi.. other than that they want bjp to grow at any cost.

gov, amit shah, vijaysai, sarai veerraju etc characters are mere part of his revenge drama..

Link to comment
Share on other sites

43 minutes ago, katti said:

Narsimhanni anatam valana emi use bro... above person ni batti ilanti vallu behave chestaru... Modi first lo ne cut chesthe Narsimham muusukune vaadu.. modi kavalanu kunnappudu ilanti vallu chelaregi potaru

True k bro...Narasimhan story is true , but ancillary , and bjp's hegemonistic attitude towards AP is THE STORY ....

( Note :There is another post prior to this about the main issue, same thread -  Real perpetrator (s)----- regime(s)at center, they perceive AP as cheese cake - easy to slice & dice with a small kitchen knife)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...