Jump to content

Telangana Elections


Raaz@NBK

Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply

తెలుగు ప్రజలందరికీ నా విజ్ఞప్తి దయచేసి ఇది పూర్తిగా చదవాలని 🙏

నవంబర్ 10వ తారీకు తెలంగాణలో నామినేషన్లకు చివరి తేదీ. 

నవంబర్ 8వ తారీకు బాబు గారి క్వాష్ పిటీషన్ పై తీర్పు.

ఈ రెండు వేరు వేరు వార్తలు..

కానీ ఇక్కడే ఒక పెద్ద కుట్ర రాజకీయం ఉంది తెలంగాణలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటుంది మేము మీకు వంగి వంగి దండం పెడతాం మా నాయకుడిని వదిలిపెట్టండి వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వస్తారు అనే ఆలోచనలో బిజెపి వాళ్లు ఉన్నట్లు సమాచారం లేదంటే ఆలోపు లొంగకపోతే మాత్రం తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు జైల్లోనే నిర్బంధించాలనే కుట్ర చేస్తున్నారనేది కూడా వాస్తవం..

మా నాయకుడిని జైల్లో పెట్టి ఇంత నీచమైన రాజకీయాలకు తెరదీస్తున్నారంటే ఇంతకన్నా నీచమైన సిగ్గుమాలినది ఇంకొకటి ఉంటుందా? అనేది ప్రజలు ఆలోచించాలి..తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ ని పోటీ చేయించే విధంగా ఒత్తిడి చేసి అదే సమయంలో టిడిపిని పొత్తు లో కలుపుకొని పోటీ చేయిస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ( సెటిలర్స్) ఓట్లు చీలి అది బిఆర్ఎస్ వైపు మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనవాడు జగన్  గెలవడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం అనే ఆలోచనలో ఈ ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు దేశంలో కూడా కాంగ్రెస్ కనిపించరాదు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు కనిపించరాదు అది వాళ్ళ సిద్ధాంతంగా మలుచుకున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మనకు పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అనే ఆలోచనలో ఈ కల్వకుంట్ల కుటుంబం,మోడీ,అమిత్ షా, ఈ సైకో జగన్ కలిసి కుట్ర చేస్తున్నారు దీన్ని తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది కచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్,బిజెపి మరియు ఎంఐఎం మూడు పార్టీలని ఓడించాలి ఈ మూడు పార్టీలు ఒకటే ఈ మూడు పార్టీలు కలిసే ఈరోజు కుట్ర చేస్తున్నారు..ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కచ్చితంగా బిఆర్ఎస్ ,బిజెపి & ఈ ఎంఐఎం కు బుద్ధి చెప్పాలి అదే సమయంలో జనసేన పోటీ చేసిన లేదా ఇంకో పార్టీ ఏదైనా పోటీ చేసిన ఓట్లు చీల్చటం తప్ప గెలవలేము గెలవము కూడా అనవసరంగా చీల్చి మళ్ళీ ఈ కేసీఆర్ ని గద్దెనెక్కించడం కంటే మనం కచ్చితంగా ఓటు చీల్చకుండా  గెలిచే పార్టీ వైపే మనం ఉండాలి ఎందుకంటే తెలంగాణలో పోటీ మాత్రం బిఆర్ఎస్ & కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంది  కచ్చితంగా అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సంకేతాలు ఇస్తున్నారు మనం గెలిచే పార్టీ వైపు ఉండి మన ఓటును జాగ్రత్తగా గెలిచే పార్టీకి వేసి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇక్కడ మార్పు మొదలైంది అంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సునామీ సృష్టిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు  అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అర్థం చేసుకోవాలి. కచ్చితంగా మనం ఈ మూడు పార్టీలను మట్టి కరిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణలో మాత్రం బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం కి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి సెట్లర్స్ మొత్తం ముకుమ్మడిగా బీఆర్ఎస్ & బిజెపిని బంగాళాఖాతంలో కలిపేంతవరకు పోరాటం చేయాలి, శ్రమించాలి, అదే మన నినాదం కావాలి, మన నాయకుడు నీతి నిజాయితీతో త్వరలో బయటకు రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యాయస్థానాలు కూడా ఎందుకు తీర్పులు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకి అనుకూలమైన వాతావరణం వస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఓటు అనే ఆయుధంతో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, బాబుతో మేము అని మనందరం కలిసికట్టుగా నిలబడాలి అని కోరుకుంటు మరొక్కసారి రెండు చేతులు జోడించి తెలంగాణలో మాత్రం బిఆర్ఎస్ బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు వాళ్ళని ఓడించే అంతవరకు మనం పోరాడాలి ఇక్కడ బిఆర్ఎస్  ఓటమే మన ఆంధ్రప్రదేశ్ కి శ్రీరామరక్ష అనే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.

మీ రాఘవరావు  తెలుగుదేశం పార్టీ మాజీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నందమూరి బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...