Jump to content

sanathnagar తలసాని గట్టెక్కగలరా..?


sonykongara

Recommended Posts

తలసాని గట్టెక్కగలరా..?

 
 
 
 
kuna-venkatesh-and-talasani.jpg?resize=6
 

సనత్ నగర్ నియోజకవర్గంలో.. తలసాని శ్రీనివాసయాదవ్ వర్సెస్ కూన వెంకటేష్ గౌడ్ అన్నట్లుగా పోరు నడవడం ఖాయమైపోయింది. టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పోరు ఉండబోతుంది. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి … అసంతృప్తికి గురైనా… హైకమాండ్‌ను కాదని.. స్వతంత్రంగా బరిలోకి దిగే ప్రయత్నం చేయకపోవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో నిజానికి సనత్ నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి తలసానికి టిక్కెట్ ఖరారయింది. కానీ తలసాని సికింద్రాబాద్ నుంచి గెలుపుపై నమ్మకం లేకపోవడంతో.. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి.. టిక్కెట్లు మార్పించుకున్నారు. కూన వెంకటేష్ గౌడ్‌కు చంద్రబాబు నచ్చ చెప్పి సికింద్రాబాద్‌కు పంపారు. కానీ కూన అక్కడ ఓడిపోయారు. తలసాని పార్టీ మారగానే… వెంటనే… కూన వెంకటేష్ గౌడ్‌ను చంద్రబాబు సనత్‌నగర్ ఇంచార్జిగా నియమించారు. పొత్తులో భాగంగా టీడీపీకి దక్కడంతో ఆయన పోటీ ఖరారయింది.

2014 ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసేందుకు కూనకు దాదాపు మార్గం సుగమమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అప్పుడు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చి చివరి నిమిషంలో సనత్‌నగర్‌ టికెట్‌ దక్కించుకున్నారని, తనకు అన్యాయం చేశారని కూన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో సికింద్రాబాద్‌లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొంటారు. తాను సర్వం సిద్ధం చేసిన చోట బరిలో నిలిచి తలసాని అలవోకగా గెలిచారని, తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తుంటారు. నాటినుంచి తలసానిపై పోటీచేసి గెలవాలన్న లక్ష్యం తనకిపుడు చేరువైందని ఆయన పేర్కొంటున్నారు. కూన విజ్ఞప్తితో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా సనత్‌నగర్‌ టీడీపీకి వచ్చేలా పట్టుబట్టారని సమాచారం. సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిని పక్కన పెట్టి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కూన బరిలోకి దిగుతున్నారు. తలసాని, కూన ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా మారారు.

 

సనత్ నగర్‌లో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. సెటిలర్స్ కూడా.. ప్రభావవంతమైన స్థాయిలో ఉన్నారు. తలసాని అనుచరగణం మొత్తం.. సికింద్రాబాద్‌లోనే ఉంది. ఆయన తలసాని టీడీపీలో చేరినప్పుడు.. సికింద్రాబాద్ నుంచి ఆయన అనుచరులే టీఆర్ఎస్‌లో చేరారు. అదే సమయంలో.. తలసాని టీఆర్ఎస్‌లో చేరేటప్పుడు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు సనత్ నగర్‌లోని ప్రతి పేదవారికి కట్టిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో కట్టించిన మోడల్ ఫ్లాట్లే తప్ప… ఇంకెవరికీ.. ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అందరి దగ్గర దరఖాస్తులుకూడా తీసుకున్నారు. ఆ అసంతృప్తి ప్రజల్లో ఉంది. కూన వెంకటేష్‌కు కాంగ్రెస్ క్యాడర్ మద్దతు కూడా కలసి వస్తే… తలసానికి ఇబ్బందికర పరిణామాలు ఎదురవడం ఖాయమే.

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply
7 minutes ago, RKumar said:

BC Votes vertical split with Kuna contesting.

Kams, Rs, Vs etu vote vesthe vaallade vijayam ikkada.

Talasani ni rechhagotti CBN ki against gaa maatladinchaali, sure shot vodipothadu appudu.

Ee plan bavundi...but, vallu kuda jagratha padutunnaru since the time KCR criticized CBN and public anger

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...