Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
2 minutes ago, krantionline29 said:

Brother Congress is the big brother in the alliance and their goal would to be to come to power alone ( like Congress in 2004).. I don't see anything wrong in it ..who would want to lead a coalition govt for 5 years

maree ilanti chetha promises isthe money ekkada nundi thestharu. deeni valla bokka padedi TDP ke gaa. 

Link to comment
Share on other sites

హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట టీటీడీపీ ఆందోళన
14-09-2018 13:01:03
 
636725268640867788.jpg
హైదరాబాద్: బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు రావడానికి నిరసనగా హైదరాబాద్ కలెక్టరేట్ ముందు తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక కుట్ర ఉందని టీ.టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబుపై కేసులను ఉపసంహరించాలని ధర్నా
14-09-2018 11:52:53
 
636725227749332128.jpg
కరీంనగర్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ పలువురు టీడీపీ నేతలు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా అధ్యకుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబుపై కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

కొత్తగూడెం టీడీపీకి కంచుకోట: చిన్ని
14-09-2018 08:25:53
 
636725103541321863.jpg
(ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం)
కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ మధ్య జరిగిన ఒప్పందం మేరకు కలిసి పోటీ చేస్తాయన్నారు. కొత్తగూడెం టీడీపీకి కంచుకోట అని, ఇప్పటికీ కార్యకర్తల బలం చెక్కుచెదరలేదన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం టీడీపీ ఆధ్వర్యంలో తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం స్పందించి కొత్త జీవో జారీ చేసి పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము పొత్తులకు వ్యతిరేకం కాదని, అవసరమైతే నియోజకవర్గంలో ఏ పార్టీకి ఏ మేరకు బలముందో సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని కోరారు. తాను ఇప్పటికే టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడును కలిసి తనకు ఇవ్వాలని కోరానన్నారు. దానికి స్పం దించిన చంద్రబాబు తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణకు టిక్కెట్‌ విషయంలో సిఫారసు కూడా చేశారన్నారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినప్పటికీ నియోజకవర్గంలో 28వేల ఓట్లు టీడీపీకి లభించాయని ఆయన గుర్తుచేశారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ రావి రాంబాబు, నాయకులు కంచర్ల గోపాలకృష్ణ, గుగులోతు కృష్ణ, కోనేరు పూర్ణచందర్‌రావు, రత్నమణి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

టీడీపీ సీనియర్ నేతలో కనిపంచని భరోసా
15-09-2018 13:19:54
 
636726143951936903.jpg
  • పొత్తుపొడుపు..నేతల్లో దడుపు
  • ఆశావహుల్లో ఆందోళన
  • ఏ నియోజకవర్గం ఏ పార్టీకో.. టికెట్‌ ఎవరికో?
  • టీడీపీ, కాంగ్రెస్‌ నేతల్లో గుబులు
  • పలు స్థానాలపై ఇరు పార్టీల పట్టు
  • సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోనే పోటీ ఎక్కువ
 
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు గతంలో పోటీచేసిన నియోజకవర్గం టికెట్‌ తనకే దక్కుతుందని ఇన్నాళ్లు ధీమాగా ఉన్నారు. కొన్నాళ్లుగా అతనిలో ఆందోళన కనిపిస్తోంది.
 
 
దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న సీనియర్‌ నేత ఒకరు ఈ సారి తనకు తప్పకుండా పోటీచేసే అవకాశం ఉంటుందని భావించారు. ఇప్పుడా భరోసా అతనిలో కనిపించడం లేదు.
 
 
కారణం... పొత్తు పొడుపు. విపక్షాలు మహాకూటమి కడుతుండడంతో పలు పార్టీల నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ఏ నియోజకవర్గం ఏ పార్టీకి దక్కుతుందో.. పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో అని గుబులు చెందుతున్నారు. తమ నియోజకవర్గం పార్టీ కోటాలో ఉండేలా చొరవ తీసుకోవాలని అగ్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పైకి మాత్రం ‘సీటు మనకే, పోటీ చేసేది నేనే’ అని అనుచరుల వద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోలోపల మాత్రం ఈ సారైనా అవకాశం వస్తుందా..? రాదా..? అన్న ఆందోళన మొదలైంది.
 
 
హైదరాబాద్‌ సిటీ,  (ఆంధ్రజ్యోతి):
మహాకూటమి ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమిలో ఏ పార్టీలు ఉంటాయన్న దానిపై దాదాపు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్‌, టీడీపీతోపాటు సీపీఐ, తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) తదితర పార్టీలు జట్టు కట్టనున్నాయి. ఇక తేలాల్సింది నియోజకవర్గాలు, సీట్ల లెక్కలే. టీడీపీ, కాంగ్రెస్ కు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు అన్నది సూత్రప్రాయంగా ఖరారైనట్టు తెలుస్తోంది. టీజేఎస్‌ కూడా నగరంలో మూడు, నాలుగు స్థానాలు ఆశిస్తోంది. అయితే, ఏఏ నియోజకవర్గాలు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాల కోసం రెండు పార్టీలు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఎవరికి వారు ఆ అసెంబ్లీలో మాదే బలమైన పార్టీగా చెప్పుకుంటున్నట్టు సమాచారం. వాస్తవంగా 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. అంతకుముందు మాత్రం పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే నగరంలో మా అభ్యర్థులు గెలవలేదు. లేదంటే కనీసం ఏడెనిమిది సీట్లు వచ్చేవి’ అని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. ‘తొమ్మిది స్థానాల్లో మేం గెలిచాం, మా మద్దతుతో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మొదట్నుంచి హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డిలో మా పార్టీ బలంగా ఉంది’ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏ నియోజకవర్గం ఎవరికి అన్న దానిపై ఇంకా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు పార్టీలూ పట్టువిడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని ఆయా పార్టీల ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
 
ఈ నియోజకవర్గాల్లో...
  • సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ నేత ఆశిస్తుండగా, ఆ స్థానం కోసం కాంగ్రెస్‌ పట్టుపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఆ నాయకుడ్ని మరో అసెంబ్లీ నుంచి బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ‘ఇక్కడి నుంచే పోటీ చేస్తా, అవకాశం కల్పించాలని’ అగ్ర నేతలను కోరుతున్నారు.
  • మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అగ్రనాయకులు కన్నేశారు. పార్టీ కేడర్‌, అభిమానులు ఎక్కువగా ఉండే ఆ శాసనసభా స్థానాల్లో పోటీచేస్తే గెలవడం సులువన్నది వారి ఆలోచన. కానీ, శివార్లలోని పలు స్థానాల కోసం కాంగ్రెస్‌ పట్టుబడుతోందని సమాచారం.
  • నగరానికి తూర్పున ఉండే ఓ నియోజకవర్గం నుంచి కాంగ్రె్‌సలో బలమైన నేతగా పేరున్న వ్యక్తి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నా రు. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని మరో పార్టీకి ఇస్తారన్న ప్రచారంతో ఇటీవల టీపీసీసీ నేతలను కలిసి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది.
  • సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే స్థానం కోసం టీడీపీ తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది.
  • మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకుడు పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకోగా... ఇప్పుడా స్థానం కోసం కూటమిలోని మరో పార్టీ అడుగుతోంది.
Link to comment
Share on other sites

పొత్తులపై టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇవే..
15-09-2018 13:05:13
 
636726135146704881.jpg
  • మహాకూటమిదే విజయం
  • పొత్తులపై పేచీలు లేవు
  • సజావుగా సీట్ల సర్దుబాటు
  • ఎక్కడా వివాదాలు లేకుండా చూస్తున్నాం
  • ప్రజాభీష్టానుసారంగానే కాంగ్రెస్ తో పొత్తులు
  • మా పొత్తుతో టీఆర్‌ఎస్‌ బెంబేలు: టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌
 
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): 
ప్రజాభీష్టం మేరకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని టీడీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, ఎన్నికల కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు దేవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తుతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు మొదలైందని, ఆ పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో ఎలాంటి పేచీలు లేవని, మహాకూటమిలో ఉన్న పక్షాలతో చర్చలు సక్రమంగానే సాగుతున్నాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు అంతా సజావుగానే కొనసాగుతుందని తెలిపారు. మహాకూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దేవేందర్‌గౌడ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. పొత్తుల వ్యవహారాలతోపాటు, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన వివరాలను ఆయన వెల్లడించారు.
 
మా వ్యూహాలు మాకున్నాయి..
వచ్చే ఎన్నికల్లో మహాకూటమిదే విజయం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో వ్యవహరిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ కు రాష్ట్రంలో ఇక భవిష్యత్‌ లేదు. టికెట్లు ప్రకటించిన తరువాత ఆ పార్టీ ఢీలా పడడం అందరూ చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ఆ పార్టీ పతనం అంచుల్లోకి వెళుతుంది. ఇక ఎన్నికల్లో మా వ్యూహాలు మాకు ఉన్నాయి. రోజురోజుకూ టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు. ప్రజాస్వామ్యయుతంగా పాలించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రజలు టీఆర్‌ఎస్ పై విరక్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. ముమ్మాటికీ మహాకూటమిదే విజయం.
 
సజావుగానే సీట్ల సర్దుబాటు
పొత్తులపై ఎలాంటి పేచీలు లేవు. పొత్తుల వల్ల బలపడుతున్నాం. సీట్ల సర్దుబాటు సజావుగానే సాగుతోంది. పొత్తుల వల్ల ఎవరికీ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరి ప్రయోజనాలు కాపాడతాం. టీఆర్‌ఎస్ ను గద్దెదించే లక్ష్యంతో అంతా కలిసి పనిచేస్తున్నాం. ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు అనేది ఇంకా ఇప్పుడే చెప్పడం కష్టం. నగరశివారు ప్రాంతాల్లో పొత్తుల సర్దుబాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
 
బడుగుల ప్రయోజనాలకు అనుగుణంగా..
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పేద, బడుగు వర్గాలు నష్టపోయాయి. రాష్ట్ర భవిష్యత్తును పట్టించుకోకుండా ఎడాపెడా అప్పులపాలు చేశారు. ఈ భారమంతా సామాన్య ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందిస్తున్నాం. బడుగుల ప్రయోజనాలు కాపాడే విధంగా మేనిఫెస్టో ఉంటుంది. భవిష్యత్‌ తరాల వారు నష్టపోకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:
టీడీపీ సీనియర్ నేతలో కనిపంచని భరోసా
15-09-2018 13:19:54
 
636726143951936903.jpg
  • పొత్తుపొడుపు..నేతల్లో దడుపు
  • ఆశావహుల్లో ఆందోళన
  • ఏ నియోజకవర్గం ఏ పార్టీకో.. టికెట్‌ ఎవరికో?
  • టీడీపీ, కాంగ్రెస్‌ నేతల్లో గుబులు
  • పలు స్థానాలపై ఇరు పార్టీల పట్టు
  • సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోనే పోటీ ఎక్కువ
 
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు గతంలో పోటీచేసిన నియోజకవర్గం టికెట్‌ తనకే దక్కుతుందని ఇన్నాళ్లు ధీమాగా ఉన్నారు. కొన్నాళ్లుగా అతనిలో ఆందోళన కనిపిస్తోంది.
 
 
దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న సీనియర్‌ నేత ఒకరు ఈ సారి తనకు తప్పకుండా పోటీచేసే అవకాశం ఉంటుందని భావించారు. ఇప్పుడా భరోసా అతనిలో కనిపించడం లేదు.
 
 
కారణం... పొత్తు పొడుపు. విపక్షాలు మహాకూటమి కడుతుండడంతో పలు పార్టీల నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ఏ నియోజకవర్గం ఏ పార్టీకి దక్కుతుందో.. పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో అని గుబులు చెందుతున్నారు. తమ నియోజకవర్గం పార్టీ కోటాలో ఉండేలా చొరవ తీసుకోవాలని అగ్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పైకి మాత్రం ‘సీటు మనకే, పోటీ చేసేది నేనే’ అని అనుచరుల వద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోలోపల మాత్రం ఈ సారైనా అవకాశం వస్తుందా..? రాదా..? అన్న ఆందోళన మొదలైంది.
 
 
హైదరాబాద్‌ సిటీ,  (ఆంధ్రజ్యోతి):
మహాకూటమి ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమిలో ఏ పార్టీలు ఉంటాయన్న దానిపై దాదాపు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్‌, టీడీపీతోపాటు సీపీఐ, తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) తదితర పార్టీలు జట్టు కట్టనున్నాయి. ఇక తేలాల్సింది నియోజకవర్గాలు, సీట్ల లెక్కలే. టీడీపీ, కాంగ్రెస్ కు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు అన్నది సూత్రప్రాయంగా ఖరారైనట్టు తెలుస్తోంది. టీజేఎస్‌ కూడా నగరంలో మూడు, నాలుగు స్థానాలు ఆశిస్తోంది. అయితే, ఏఏ నియోజకవర్గాలు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాల కోసం రెండు పార్టీలు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఎవరికి వారు ఆ అసెంబ్లీలో మాదే బలమైన పార్టీగా చెప్పుకుంటున్నట్టు సమాచారం. వాస్తవంగా 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. అంతకుముందు మాత్రం పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే నగరంలో మా అభ్యర్థులు గెలవలేదు. లేదంటే కనీసం ఏడెనిమిది సీట్లు వచ్చేవి’ అని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. ‘తొమ్మిది స్థానాల్లో మేం గెలిచాం, మా మద్దతుతో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మొదట్నుంచి హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డిలో మా పార్టీ బలంగా ఉంది’ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏ నియోజకవర్గం ఎవరికి అన్న దానిపై ఇంకా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు పార్టీలూ పట్టువిడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని ఆయా పార్టీల ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
 
ఈ నియోజకవర్గాల్లో...
  • సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ నేత ఆశిస్తుండగా, ఆ స్థానం కోసం కాంగ్రెస్‌ పట్టుపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఆ నాయకుడ్ని మరో అసెంబ్లీ నుంచి బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ‘ఇక్కడి నుంచే పోటీ చేస్తా, అవకాశం కల్పించాలని’ అగ్ర నేతలను కోరుతున్నారు.
  • మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అగ్రనాయకులు కన్నేశారు. పార్టీ కేడర్‌, అభిమానులు ఎక్కువగా ఉండే ఆ శాసనసభా స్థానాల్లో పోటీచేస్తే గెలవడం సులువన్నది వారి ఆలోచన. కానీ, శివార్లలోని పలు స్థానాల కోసం కాంగ్రెస్‌ పట్టుబడుతోందని సమాచారం.
  • నగరానికి తూర్పున ఉండే ఓ నియోజకవర్గం నుంచి కాంగ్రె్‌సలో బలమైన నేతగా పేరున్న వ్యక్తి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నా రు. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని మరో పార్టీకి ఇస్తారన్న ప్రచారంతో ఇటీవల టీపీసీసీ నేతలను కలిసి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది.
  • సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే స్థానం కోసం టీడీపీ తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది.
  • మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకుడు పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకోగా... ఇప్పుడా స్థానం కోసం కూటమిలోని మరో పార్టీ అడుగుతోంది.

Eedi music eedide 

Link to comment
Share on other sites

38 minutes ago, sonykongara said:

eroju TRS edupulu mari ekkuva ayyayi endukoo..

Ninna AP 24X7 Venkata Krishna cheppadu KCR govt ni dissolve chesinappudu TRS winning one sided ga vundi now 50:50 vundi ani oka person cheppadu annadu. And he is mentioned that person is very genuine max gives almost correct info istadu annadu. May be it's true that is why they are trying to distrub Maha kutami.

Link to comment
Share on other sites

kcr49440.png

40 సీట్లలో అభ్యర్థుల మార్పు? అందుకే ప్రచారం ఆలస్యం అదే జరిగితే వాళ్లే ఓడిస్తారు

 
 

కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపంలా తయారైంది తెరాస పరిస్థితి. అత్యుత్సాహంతో ముందే అభ్యర్థులను ప్రకటించి తప్పు చేశాం అనే భావన వ్యక్తం అవుతోంది. ప్రతి నియోజకవర్గంలో సిట్టింగులపై అతి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అభ్యర్థిని మార్చకపోతే ఓడిపోయే పరిస్థితి ఉంది. అలాగే వేరే పార్టీల నుంచి చేర్చుకున్న వారు ఇప్పుడు తలనొప్పిగా తయారయ్యారు. తలబొప్పి కట్టిస్తున్నారు. పార్టీలోనూ ఆశవహులు అనూహ్యంగా పెరిగిపోయారు. దాంతో గులాబీ దళంలో రోజురోజుకు నిరసనలు మిన్నంటుతున్నాయి.

kcr.jpg

టిఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసేందుకు దళపతి ప్రకటించిన అభ్యర్థుల్లో పలువురిని మార్చాలంటూ నిరసనలు తీవ్రతరం అయ్యాయి. దీంతో గులాబీ దళపతి పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నారు. నిరసనలు రోజు రోజుకు తీవ్రతరం కావడంతో దాదాపు 40 మందిని మార్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తుకు సై అంటూ ఎన్నికల భేరి మోగించి…తొలిజాబితాను ప్రకటించి ప్రత్యర్థులతో పాటు సొంతపార్టీ లీడర్లకు గులాబీ దళపతి కె.చంద్రశేఖరరావు షాకిచ్చారు. హుస్నాబాద్‌ వేదికగా సమరశంఖం కూడా పూరించారు. ఇక సభలే… సభలంటూ గొప్పలు చెప్పుకున్నారు. తీరా చూస్తే… ప్రగతి భవన్‌ లోనే కారు ఆగిపోయింది. అభ్యర్థుల్ని ప్రకటించి వారం దాటినా టిఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందు కోలేదు. అగ్ర నేతల ప్రచార సభలు మొదలు కాలేదు. అభ్యర్ధుల మార్పు ఆలోచన తోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టలేదనే అభిప్రాయ తెలంగాణ భవన్‌లో వ్యక్తం అవుతోంది.అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు ఉదృతం అవుతున్న క్రమంలో తొలుత 15 మందిని మార్చాలని యోచించినప్పటికీ అది తీవ్రతరమై 40 నియోజక వర్గాలపై ప్రభావం చూపుతుంది. ప్రజాదరణ లేనివారికి, అభివృద్ధికి దూరంగా ఉన్నవారికి టికెట్లు ఎలా ఇస్తారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసిన తమను కాదని వివిధ రాజకీయ పక్షాల నుంచి గులాబీ గూటికి చేరిన దాదాపు 30 మందికి ఎలా టికెట్లు ఇస్తారని దళపతిని ప్రశ్నిస్తు న్నారు. ప్రజల నుంచి వారంతా తీవ్ర వ్యతిరేకత చవిచూస్తున్నా టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఎందు కొచ్చిందని గులాబీ మండిపడుతున్నారు. తెెలంగాణ శాసనసభను రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన దళపతి…50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తానని ప్రకటించారు. వంద నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అభ్యర్ధులను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటా నని, ప్రచార సామాగ్రి సిద్ధంగా ఉందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

trs545.jpg

 

అసెంబ్లీ రద్దు చేసిన మరుసటి రోజే హుస్నాబాద్‌ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత ప్రచారాన్ని నిలిపి వేశారు. ఇక కెసిఆర్‌ తర్వాతి స్థానం కోసం పోటీ పడుతున్న కెటిఆర్‌, హరీశ్‌ రావులు సైతం… ఇతర నియోజకవర్గాల్లో అడుగు పెట్టడం లేదు. అసమ్మతి నేతలైతే రగిలిపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో కాక పుట్టిస్తున్నారు. అభ్యర్ధుల కంటే ముందే జనాన్ని సమీకరించి తమకు టికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్నారు. మరోవైపు ప్రచారాన్ని ప్రారంభించక పోవడం వెనుక కేెసిఆర్‌ భారీ వ్యూహం ఉందని తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. అధినేత ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 40 మందిని మార్చే యోచనలో గులాబీబాస్‌ ఉన్నట్లు సమాచారం. ఐతే ఇప్పుడే మారిస్తే వారు ఇతర పార్టీల్లో చేరి పోటీచేసే అవకాశం ఉందనే యోచనతో విపక్షాలన్నీ తమ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాతే ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని దళపతి యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, జనసమితి మధ్య సీట్ల సర్దుబాటు అయ్యాక ఆయా పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించనున్నాయి.అప్పుడు టిఆర్‌ఎస్‌ అభ్యర్ధులను మార్చినా వారి వల్ల పెద్దగా నష్టం ఉండదు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో నిలిచినా టిఆర్‌ఎస్‌ ఓట్లు పెద్దగా చీలవని కెసిఆర్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అసలు ప్రచారాన్నే మొదలుపెట్టకపోతే ఎలాంటి చిక్కులు ఉండవని ఆయన భావిస్తున్నారు. అందు కోసమే కావాలనే ఎన్నికల ప్రచారాన్ని ఆలస్యం చేస్తున్నారని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి. విపక్ష కూటమి అభ్యర్ధులు ఖరారైన వెంటనే కనీసం 40 మంది అభ్యర్ధులను మార్చి కొత్త పేర్లను ప్రకటించనున్నారు. ఈ 40 మంది అభ్యర్ధుల చిట్టా మొత్తం కెసిఆర్‌ వద్ద ఉన్నట్లు సమాచారం. ఏ బలమైన కారణాలతో వీరి అభ్యర్ధిత్వాన్ని మార్చాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పడం ద్వారా వ్యతిరేకత రాకుండా చూసుకోనున్నారు. అందుకే విపక్ష కూటమి అభ్యర్ధుల ప్రకటన తర్వాతే 50 రోజులు 100 ప్రచార సభలు మొదలు పెడుతారని తెలుస్తోంది. మొత్తానికి టికెట్‌ ఉంటుందో..? ఊడుతుందో..? తెలియక టిఆర్‌ఎస అభ్యర్థులు సతమతం అవుతున్నారు.

Link to comment
Share on other sites

30 minutes ago, Suresh_Ongole said:

Ninna AP 24X7 Venkata Krishna cheppadu KCR govt ni dissolve chesinappudu TRS winning one sided ga vundi now 50:50 vundi ani oka person cheppadu annadu. And he is mentioned that person is very genuine max gives almost correct info istadu annadu. May be it's true that is why they are trying to distrub Maha kutami.

bayam pattukunnadi annamata

Link to comment
Share on other sites

అన్ని స్థానాల్లో టీడీపీ బలమే కీలకం’
16-09-2018 09:08:00
 
636726856763198246.jpg
  • జిల్లాలో మూడు సీట్లు అడుగుతున్నాం
  • సత్తుపల్లి, ఖమ్మంలో తప్పనిసరి పోటీ
  • మహాకూటమిగానే ఎన్నికల బరిలోకి..
  • టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-ఖమ్మం)
రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం జిల్లాలో బలహీనపడింది. ముఖ్యనేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ గత వైభవాన్ని కోల్పోయింది. ఈసారి ఎన్నికలలో తన ఉనికి చూపేందుకు సన్నద్ధమవుతోంది. 1983 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కేడర్‌ గులాబీ వైపు వెళ్లడమంతో క్షేత్రస్థాయిలో కూడా బలహీనపడింది. ఈసారి జరగబోతున్న ఎన్నికలు టీడీపీకి పరీక్షగా నిలవనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కార్యచరణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్యూ..
 
 
ఆంధ్రజ్యోతి: ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేయబోతోంది?
తుళ్లూరి: జిల్లాలో మూడు సీట్లు డిమాండ్‌ చేస్తున్నాం. సత్తుపల్లి, ఖమ్మంలో తప్పనిసరిగా పోటీచేస్తాం. వైరా సీటు కూడా మాడిమాండ్‌లో ఉంది.
 
ఆంధ్రజ్యోతి: ఖమ్మం నుంచి మీరు బరిలో దిగే అవకాశం ఉందా?
తుళ్లూరి: పోటీచేయాలన్న ఆసక్తి ఉన్నా.. ఆర్థికంగా ఆస్థాయి లేదు. నేను ఒక కార్యకర్తనే. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావును పోటీ చేయాలని ఇప్పటికే కోరాం. పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పాం. ఆయన పోటీ చేయడంవల్ల పార్టీ మరింత బలపడుతుంది. గత ఎన్నికలలో ఖమ్మం ఎంపీగా తక్కువ ఓట్లతో ఓటమి చెందారన్న సానుభూతి ప్రజల్లో ఉంది.
 
ఆంధ్రజ్యోతి: పొత్తులు, సీట్లు సర్దుబాటు ఎంతవరకు వచ్చింది?
తుళ్లూరి: రాష్ట్రస్థాయిలో ప్రాథమికంగా టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్‌ మహాకూటమిగా పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మహాకూటమిగా అన్ని విపక్షాలు ఏకమై పోటీచేయడం తథ్యం. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి జిల్లాల్లో అన్ని సీట్లు గెలుచుకుని తీరుతాం.
 
ఆంధ్రజ్యోతి: పొత్తుల్లో మా సీట్లు వదలొద్దంటూ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే అధిష్ఠానికి చెప్పారు కదా?
తుళ్లూరి: టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే విపక్షాలు కలవాల్సిన అవసరం ఉంది. కేవలం కాంగ్రెస్‌గా ఒక్కరే గెలవడం సాధ్యంకాదు. విపక్షాలన్నీ కలిస్తేనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దెదించే అవకాశం ఉంటుంది. సీపీఎంను కూడా కలిసి పోటీకి రావాలని కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు సీట్ల విషయంలో సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
 
ఆంధ్రజ్యోతి: కాంగ్రెస్‌తో కలవడం వల్ల టీడీపీ ఓట్లు బదిలీ అయ్యే అవకాశం ఉండదని కొందరంటున్నారు? వాస్తవమేనా ?
తుళ్లూరి: టీడీపీ, కాంగ్రెస్‌తో ఇతర పక్షాల కూటమి ప్రజలు హర్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్‌స్‌ను ఓడించాలన్న బలమైన కోరిక ప్రజలతోపాటు మాపార్టీల కేడర్‌లోను కనిపిస్తుంది. అక్కడక్కడా ఓట్లు స్వల్పంగా పడకపోయినా మెజారిటీ ఓటుబ్యాంకు బదిలీ అవుతుంది. తద్వారా అధికార టీఆర్‌ఎస్‌ ఓటమి చెందుతుంది.
 
ఆంధ్రజ్యోతి: టీడీపీకి ఓటుబ్యాంకు లేదని.. అంతా టీఆర్‌ఎస్‌కు వెళ్లారని.. సీట్లుఇవ్వడం వల్ల నష్టం ఉంటుందని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు కదా?
తుళ్లూరి: అది పూర్తిగా అవాస్తవం. ముఖ్యనాయకులు వెళ్లినమాట నిజమే. నాయకత్వం అక్కడక్కడా సమస్యగా ఉన్నా కేడర్‌ బలం టీడీపీకి ఉంది. అనేక వర్గాలు టీడీపీని నమ్ముకునే ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో 20శాతం ఓటుబ్యాంకు ఉంది. ఏపార్టీనైనే గెలిపించే, ఓడించే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉంది.
 
ఆంధ్రజ్యోతి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీ శ్రేణులు సమర్ధిస్తారా?
తుళ్లూరి: పొత్తును అందరు కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు శత్రువు కాంగ్రెస్‌కాదు. టీఆర్‌ఎస్‌. పార్టీని నష్టం చేయడంతోపాటుఅనేక ఇబ్బందులకు గురిచేసంది. అందువలపార్టీని క్షేత్రస్థాయినుంచి కూడా కేడర్‌ మహాకూటమిలో ఉండాలని కోరుతోంది.
 
ఆంధ్రజ్యోతి: కూటమివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పదికి పదిసీట్లు వస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు? నిజమైనా?
తుళ్లూరి: గతంలో 1994, 2004 ఎన్నికల తరుణంలో టీడీపీ, కమ్యూనిస్టుల కూటమి, ఆతర్వాత కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కూటమి ఎలాంటి ఫలితాలిచ్చాయో జిల్లా ప్రజలకు తెలుసు. కూటముల బలం అధికారపక్షానికి ఇబ్బందులు తెచ్చిన సంఘటనలున్నాయి. అదే నమ్మకంతో ముందుకు పోతున్నాం.
Link to comment
Share on other sites

ఆ స్థానంలో టీడీపీ గెలుపు అవకాశాలపై ముమ్మరంగా సర్వే
16-09-2018 07:29:20
 
636726797567080790.jpg
  • ఎవరు విజయం సాధిస్తారు?
  • పార్టీల సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి?
  • సత్తుపల్లిలో నిఘా వర్గాల సర్వే.. అభ్యర్థుల స్థితిగతులపై ఆరా
సత్తుపల్లి(ఖమ్మం): సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశావహులైన అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వ నిఘా వర్గాలు రెండు రోజులుగా నియోజకవర్గంలో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లి అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇప్పటికే పిడమర్తి రవిని పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో స్థానిక నినాదంతో ఆదే పార్టీ నాయకుడు, దిశా సభ్యుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి పలు వర్గాల ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని పలు సందర్భాల్లో కోరారు. మరో పక్క కాంగ్రెస్-టీడీపీ-సీపీఐలతో మహాకూటమి ఏర్పడుతున్న క్రమంలో సత్తుపల్లి అభ్యర్థిగా టీడీపీ మాజీ శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లో రేగిన వివాదం, మరో పక్క మహా కూటమి అభ్యర్థిగా సండ్ర ప్రచారం నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రెండు రోజులుగా నిఘా వర్గాలు అన్ని కోణాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
 
 
ఏ అంశాలు కలిసొస్తాయి
సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కలిసివచ్చే అంశాలు ఏమిటనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరో పక్క టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పాటు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని నాయకత్వాన్ని కోరుతున్న డాక్టర్‌ మట్టా దయానంద్‌కు నియోజకవర్గంలో ఏ మేరకు అనుకూల వర్గం ఉంది, ఆయన అనుచరులు ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన పార్టీ పరంగా లేదా స్వతంత్య్రంగా పోటీ చేస్తే ఏ మేరకు ప్రభావితం చేయగలరు? తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, వ్యాపారవర్గాలను కలుసుకుని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి రహస్యంగా ఈ సర్వే సాగుతోంది. త్వరలో ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక అందజేయనున్నాయి.
Link to comment
Share on other sites

అది మా కంచుకోటే అంటున్న టీడీపీ... టీఆర్‌ఎస్‌లో చిచ్చు!
16-09-2018 12:52:19
 
636726991361722955.jpg
  • టీడీపీలో పోటాపోటీ
  • కాంగ్రెస్‌లో పొత్తుల పరేషాన్‌
కూకట్‌పల్లి/హైదరాబాద్: కూకట్‌పల్లి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని పార్టీలూ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ ‘ముందస్తు’గా అభ్యర్థిని ప్రకటించడంతో టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. అధిష్ఠానం రంగంలోకి దిగినా ససేమిరా అంటున్నారు. టీడీపీ ‘కూకట్‌పల్లి మా కంచుకోట’ అంటోంది. ఈ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు సీనియర్‌ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మహాకూటమిలో భాగంగా ఈ స్థానం తమకే దక్కుతుందన్న ఆశతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.
 
 
మాధవరంపై అసమ్మతి స్వరం
కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పన్నాల హరీష్‌రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల పద్మారావు అసమ్మతి స్వరం పెంచారు. ఉద్యమకారులు సైతం కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఉద్యమకారులంతా సమావేశమై సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉద్యమంలో పాల్గొన్న వారికే టికెట్‌ ఇవ్వాలన్నది వీరి డిమాండ్‌. ఇదే అదనుగా టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు ఉద్యమకారులను దగ్గరకు తీసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కార్పొరేటర్‌ పన్నాల కావ్వారెడ్డి ఒకడుగు ముందుకేసి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తన భర్త హరీ్‌షచంద్రారెడ్డికి టికెట్‌ కేటాయించాలంటూ దీక్ష చేపట్టడం స్థానిక రాజకీయాల్లో కలకలం రేగుతోంది.
 
అటు ఆశావహులు, ఇటు ఉద్యమకారుల అసమ్మతితో టీఆర్‌ఎస్‌ పార్టీకి కొంత నష్టం కలిగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
 ticket-lolli.jpg
అయితే, పార్టీ అధిష్ఠానం మాత్రం మాధవరం కృష్ణారావు వైపే ఉన్నట్లు కచ్చితమైన సంకేతాలు పంపింది. స్థానిక టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కృష్ణారావుకు పూర్తిస్థాయి మద్దతు తెలపడంతో కొంతమేర కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. టికెట్‌ రాకపోవడంతో నిరాశకు గురైన ముగ్గురు నాయకులు మాత్రం పట్టువదలడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా ఎన్నికల బరిలో దిగేందుకు వారు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇండిపెండెంట్‌గా లేదంటే రెబల్‌గా, ఇతర పార్టీలో నుంచైనా పోటీలో నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 
 
టీడీపీ రేసులో పలువురు..
కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు, మరో సీనియర్‌ నాయకులు ఆరెకపూడి ప్రసాద్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇందులో మందడి శ్రీనివాసరావు విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు తెలిసినా, సరైన హామీ లభించకపోవడంతో నాయకుల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. పెద్దిరెడ్డి, ప్రసాద్‌లు సైతం అధిష్ఠానం వద్ద టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పెద్దిరెడ్డి కూకట్‌పల్లిలో పోటీ చేస్తే తాము సహకరించమని స్థానిక టీడీపీ నాయకులు గతంలో పలుమార్లు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందడి శ్రీనివాసరావు, ఆరెకపూడి ప్రసాద్‌ ఇద్దరిలో ఎవరికి టికెట్‌ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.
 
 
కాంగ్రెస్‌లో పొత్తు లొల్లి...
మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి కాంగ్రెస్‌, టీడీపీల మధ్య ఎవరికి దక్కుతుందో తేలలేదు. అయితే, ఈ సీటు తమకే వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ టికెట్‌ రేసులో ఉన్న గొట్టిముక్కల వెంగళరావు, శేరి సతీష్‌రెడ్డి, పట్లోళ్ల నాగిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీకి ఇస్తే.. గెలిచే సత్తా ఉన్న నాయకుడికే టికెట్‌ ఇవ్వాలని, టికెట్‌ కేటాయింపులో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అభిప్రాయాల మేరకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.
Link to comment
Share on other sites

కృష్ణారావుకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసమ్మతి
16-09-2018 13:25:17
 
హైదరాబాద్‌: కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా అసమ్మతి పెరుగుతోంది. కృష్ణారావును మార్చాలంటూ బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ దీక్షకు దిగారు. ఉద్యమకారులకు టికెట్‌ ఇవ్వాలంటూ నియోజవర్గంలో ఆందోళనలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

అందుకే పొత్తులు పెట్టుకుంటున్నాం: టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే
16-09-2018 07:41:07
 
636726804634674524.jpg
వేంసూరు(ఖమ్మం): టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పొత్తులతో అధికారం పీఠం కదిలిపోతుందనే భయంతోనే కేసీఆర్‌ అర్థరహిత విమర్శలు చేస్తున్నారన్నారు. వేంసూరు మండలం కొత్తూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తొమ్మిది నెలల పరిపాలన మిగిలి ఉండగానే శాసనసభను రద్దు చేసి ప్రజలపై రూ.400 కోట్ల భారం మోపి, కేసీఆర్‌ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. రెండు దశలుగా ఎన్నికలు జరపడం వల్ల రాష్ట్ర ప్రజలపై రెట్టింపు భారం పడుతోందన్నారు. సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే టీఆర్‌ఎస్‌ మంత్రి వర్గంలో కనీసం ఒక్క మహిళామంత్రి కూడా లేరని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2.50లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించామని ప్రకటనలు గుప్పిస్తున్నారు కాని కనీసం 20వేలు ఇళ్లు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సత్తుపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం త్వరలో ఆవిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్ల సంజీవరెడ్డి, ఉప్పలపాటి కృష్ణయ్య, కంటే వెంకటేశ్వరరావు, దొడ్డా శంకర్‌రావు, పగుట్ల వెంకటేశ్వరరావు, నాయుడు వెంకటేశ్వరరావు, రాయల సత్యనారాయణ, గొర్ల సత్యనారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి, ఉప్పలపాటి సుబ్బయ్య, మందపాటి బాబురెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, రామ్మోహన్‌రెడ్దిలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌లోని ఆ కీలక స్థానంపైనే అన్ని పార్టీల గురి..
16-09-2018 13:14:52
 
636727004884986723.jpg
  •  
  • అందరి గురి.. మల్కాజిగిరి
  • ఖరారు కాని అభ్యర్థులు
  • పెండింగ్‌లో పెట్టిన అధికార పార్టీ
  • మహాకూటమిలో మాకంటే.. మాకు
  • బీజేపీ నుంచి బరిలో పలువురు
మల్కాజిగిరి/హైదరాబాద్: సిటీలో కీలకమైన మల్కాజిగిరి బరిలో ఎవరుంటారనే విషయంలో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ తన సిట్టింగ్‌ స్థానమైనా ఇక్కడి అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టడంతో ఆ పార్టీలో ఆశావహుల లిస్ట్‌ పెరుగుతోంది. మహాకూటమి పొత్తులో భాగంగా తమకే అవకాశం దక్కుతుందన్న ఆశాభావంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌ ఉన్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన బీజేపీ ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఆశావహులు టికెట్ల కోసం తమ తమ అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ గాడ్‌ఫాదర్‌లతో కలిసి అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆశావహులు రోజురోజుకూ పెరుగుతుండడంతో అధిష్ఠానాలకు సైతం మల్కాజిగిరి కిరికిరి పెడుతోంది.
 
 
టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఎవరికో..?
అసెంబ్లీ రద్దు ప్రకటన అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌ అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో సిట్టింగ్‌ స్థానమైన మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి పేరు లేకపోవడంతో ఆశావహులు అభ్యర్థిత్వంపై ఆశలు పెంచుకున్నారు. ఈ స్థానంలో సిట్టింగ్‌కు కాకుండా ఆయన కోడలు అల్వాల్‌ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివా్‌సరెడ్డికి దాదాపు ఖరారు అయినట్లు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆమె అభిమానులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ మేరకు సంబురాలు సైతం నిర్వహించడం గమనార్హం. అయితే, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఉద్యమకారుడు బద్దం పరుశరాంరెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. అధిష్ఠానం వద్ద తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కనకారెడ్డి కోడలికి టికెట్‌ ఖరారు విషయంలో ఓ మంత్రి చేయి ఉందని, ఆమెకే టికెట్‌ వస్తుందని అంటున్నారు. ఈ మేరకు ఉద్యమకారుడు బద్దం పరుశరాంరెడ్డిని, ఎమ్మెల్సీ మైనంపల్లిని మంత్రి కేటీఆర్‌ బుజ్జగించినట్లు సమాచారం.
 
 
పొత్తులు ఎత్తులు...!
మహాకూటమి ఆవిర్భవించడం ఖాయం కావడంతో టీడీపీ, కాంగ్రె్‌సతో పాటు సీపీఐ కూడా ఈ సీటుపై కన్నేసింది. మల్కాజిగిరి తమకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకులు కోరుతున్నారు. తమ పార్టీకి కంచుకోటలాంటి ఈ స్థానంలో మళ్లీ విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి మండల రాధాకృష్ణయాదవ్‌ టికెట్‌ ఆశిస్తూ ఈమేరకు అధిష్ఠానం వద్ద తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తు కుదిరితే ఇక్కడి నుంచి సీపీఐ కూడా పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల్లోని నాయకులు కొన్నాళ్లుగా టికెట్‌ ఆశించి పోటీ పడి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పొత్తుల వ్యవహారం ఎవరి కొంపముంచుతుందోనన్న ఆందోళనలో ఆయా పార్టీల నేతలున్నారు.
 
 
ఆకుల చేరికతో మారిన సమీకరణ
కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌ పేరు మాత్రమే ప్రచారంలో ఉన్నా ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ తిరిగి సొంత గూటికి చేరడంతో రాజకీయ సమీకరణలో మార్పు ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్‌ నాయకులు, ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఓబీసీ విభాగం జాతీయ నాయకులు బోనగిరి సురేష్‌ యాదవ్‌ కూడా మల్కాజిగిరి టికెట్‌ ఆశిస్తున్నారు.
 
 
బీజేపీలోనూ ఆశావహులు..
బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నియోజక వర్గాల్లో మల్కాజిగిరి ఒకటి. గతంలో తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందరావు స్వల్ప ఓట్ల తేడాతో అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి బీజేపీ మల్కాజిగిరిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాంచందర్‌రావు మల్కాజిగిరిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎక్స్‌ సర్వీ్‌సమన్‌ కమిటీ నాయకులు, ఓపెన్‌ ఎన్జీఓ వ్యవస్థాపకులు గోపు రమణారెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు తనకే ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నారు. నియోకవర్గంలో ప్రధానమంత్రి జనరిక్‌ ఔషదీ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అలాగే, ప్రముఖ సామాజిక నాయకురాలు యమునా పాఠక్‌, రాష్ట్ర నాయకులు జిల్లెల రవియాదవ్‌లు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు.
Link to comment
Share on other sites

టీడీపీ సిట్టింగ్ స్థానంలో ఈ సారి విజయం ఎవరిది..?
17-09-2018 12:13:40
 
636727832169255749.jpg
నియోజకవర్గంలోనూ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.
 
 
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఐక్యతా రాగం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మహా కూటమిగా ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ టికెట్‌ ఏ పార్టీకి కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు పట్టు ఉంది. ఈ క్రమంలో ఆ రెండింట్లో ఏదో ఒక పార్టీకి మాత్రమే ఎల్‌బీనగర్‌ టికెట్‌ను కేటాయిస్తారన్నది ఇప్పటికే స్పష్టం. అయితే టీడీపీకి వదిలేస్తారా..? కాంగ్రెస్‌కు కేటాయిస్తారా..? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. తమకంటే తమకంటూ కాంగ్రెస్‌, టీడీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.
 
అభ్యర్థుల బలాబలాలు కూడా..!
పొత్తులో భాగంగా ఎల్‌బీనగర్‌ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయించాలన్న విషయంలో.. పోటీ చేసే అభ్యర్థుల స్థాయిని, బలాబలాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డి తాను రాష్ట్ర స్థాయి నేతగా, సీనియర్‌ నాయకుడిగా చెప్పుకొంటున్నారు. కొన్నాళ్లుగా రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా భాగస్వామ్యం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయనను కాదని, తెలుగు దేశానికి ఎల్‌బీనగర్‌ స్థానం కేటాయిస్తారా..? అనే ప్రశ్న కూడా ఒకింత వ్యక్తమవుతోంది. టీడీపీకి ఎల్‌బీనగర్‌ సిట్టింగ్‌ స్థానమైనప్పటికీ.. ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మొదటి నుంచీ ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
 
ఈ క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఎల్‌బీనగర్‌ నుంచి పోటీకి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 2014లోనే టికెట్‌ దక్కాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఆర్‌.కృష్ణయ్యకు కేటాయించటంతో ఒకింత అసహనానికి గురయ్యారు. ఆ తరువాత మళ్లీ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతను తనపై వేసుకొని పని చేస్తున్నారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. కృష్ణయ్య కూడా మళ్లీ పోటీ చేస్తానని బలంగా అడుగుతున్న పరిస్థితి కన్పించని పరిస్థితుల్లో.. సామ రంగారెడ్డే ప్రధానంగా టికెట్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు ఆ స్థానం టీడీపీకా..? కాంగ్రెస్‌కా..? అనేది తేలితే అభ్యర్థుల సంగతి తర్వాత అని విశ్లేషకులు చెబుతున్నారు.
 
 
పార్టీ బలాబలాలే ప్రాతిపదికనా...?
బలాబలాలే ప్రాతిపదికగా టికెట్‌ నిర్ణయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో రాష్ర్టేతరుల ప్రభావం అధికంగా ఉంటుంది. మొత్తం 4.65 లక్షల ఓట్లకు గానూ సుమారు 70 వేల ఓట్లు వారివే ఉన్నట్లు అంచనా. పొత్తులో భాగంగా ఎల్‌బీనగర్‌ను తమకే కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా.. పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకోవద్దని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు గత మూన్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం.. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం ఎంత అనే లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2009 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో (రెండు సార్లు జీహెచ్‌ఎంసీ, ఒకసారి సాధారణ) కాంగ్రెస్‌తో పోల్చితే.. టీడీపీకే అధికంగా ఓట్లు, సీట్లు వచ్చాయి. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 8 మందికి గానూ ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఆర్‌.కృష్ణయ్య గెలుపొందగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి సుధీర్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
 
2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. ప్రతి చోటా టీడీపీ అభర్థులే రెండో స్థానంలో నిలిచారు. అంతేకాకుండా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్‌ స్థానం. ఎంపీ కూడా టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తే. ఇలా ఆయా ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ బలాబలాలు, సిట్టింగ్‌ స్థానం తదితర అంశాలను ముందు పెట్టి ఎల్‌బీనగర్‌ను టీడీపీకే కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎల్‌బీనగర్‌ను తమకే కేటాయిస్తారన్న ధీమా కాంగ్రెస్‌ నేతల్లోనూ ఉంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనదే టికెట్‌ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ నేతలు కూడా ముందుకు తేవొచ్చనేది తెలుస్తోంది. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్‌రెడ్డి.. 2014లో ఓడిపోయారు. మళ్లీ పోటీ చేయాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...