Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply

బై జీన్స్ టీడీపీ… బై చాన్స్ టీఆర్ఎస్..! ఆ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి..?

 
 
 
 
 
TRS-and-TDP.jpg?resize=600%2C400&ssl=1
 

2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పదిహేను అసెంబ్లీ నియోజవకర్గాల్లో విజయం సాధించింది. వీరిలో పన్నెండు మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణయ్య అసెంబ్లీ రద్దయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంటే.. పదిహేను మందిలో నికరంగా.. ఒక్క సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీఆర్ఎస్‌లో వీరి పరిస్థితి ఎలా ఉంది..? వారిని టీఆర్ఎస్ నేతలుగా చూస్తున్నారా..?. వారికి పార్టీ తరపున సహకారం అందుతోందా..? అంటే.. లేదనే చెప్పాలి. అందరూ.. టీఆర్ఎస్‌లో ద్వితీయశ్రేణి నేతలుగా మిగిలిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచి.. ఈ సారి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వారు.. సంప్రదాయ టీఆర్ఎస్ క్యాడర్ నుంచి.. వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. శేరిలింగం పల్లిలో.. కార్పొరేట్లు ఎవరూ అరికెపూడి గాంధీకి సహకరించడం లేదు. ఆయన వెంట టీడీపీ క్యాడర్ కూడా పెద్దగా లేదు. ఇక కూకట్ పల్లిలో.. మాధవరం కృష్ణారావును వ్యతిరేకిస్తూ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన… గొట్టిముక్కల పద్మారావు ఏకంగా పార్టీకి రాజీనామా చేసేశారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇక జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో.. కేటీఆర్ సన్నిహితుడైన సతీష్ రెడ్డి రేపిన అలజడిలో… మాగంటి గోపీనాథ్‌నే.. కేటీఆర్ మందలించారు. సతీష్ రెడ్డి.. గతంలో జూబ్లిహిల్స్ ఇన్చార్జ్ గా ఉండేవారు. ఓ సెటిల్మెంట్ కేసులో ఒడిషా జైలుకు వెళ్లారని.. ఆ కేసుతో కేటీఆర్‌కు సంబంధం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పార్టీలో పోటీ విషయానికి వచ్చే సరికి.. మాగంటి గోపీనాథ్‌కు.. కేటీఆర్ చివాట్లు తప్పలేదు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో… ప్రకాష్ గౌడ్‌ను టీఆర్ఎస్‌ జమ్మీని చేసిందనేప్రచారం జరుగుతోంది.

 

అక్కడ టీఆర్ఎస్ తరపున ఓ బలమైన రెబల్ క్యాండిడేట్ ఉన్నారు. ఆయనకు టీఆర్ఎస్ క్యాడర్ సహకరిస్తోంది. ప్రకాష్ గౌడ్ మాత్రం.. తన సొంత అనుచరవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మజ్లిస్ కోసమే.. టీఆర్ఎస్ రెబల్‌ను బరిలోకి నిలబెట్టిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడా మజ్లిస్ పోటీ చేయడం లేదు.. ఎనిమిది స్థానాల్లో తప్ప. దీంతో ప్రకాష్ గౌడ్ భవితవ్యం… చిక్కులో పడిపోయింది. గ్రేటర్ పరిధిలోనే కాదు.. పాలకుర్తి, పరకాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డిలకూ.. టీఆర్ఎస్ పాత క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఏ విధంగా చూసినా.. టీడీపీ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన వారిలో లక్ బై చాన్స్ ఒకరిద్దరు బయటపడతారేమో కానీ.. మిగతా వాళ్లను.. టీఆర్ఎస్ నేతలే ఓడిస్తారని ప్రచారం జరుగుతోంది.

Link to comment
Share on other sites

23 minutes ago, Saichandra said:

28 నా చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనున్న తెరాస ఖమ్మం జిల్లా అధ్యక్షుడు 
తుమ్మల కి తుమ్మ ముళ్ళు గ్యారంటీ

??

Link to comment
Share on other sites

టీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రికి కీలక బాధ్యతలు
01-12-2018 10:06:56
 
636792556135884394.jpg
రాజాంరూరల్‌, శ్రీకాకుళం: మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌కు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఈ మేరకు కుద్బుల్లాపూర్‌, మహేశ్వరం నియోజక వర్గాల్లో మహాకూటమి తరఫున అభ్యర్థులకు మద్దతుగా గురువారం నుంచి ప్రచారం చేపడుతున్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కుద్బుల్లాపూర్‌ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్రీశైలంగౌడ్‌, మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సబితా ఇంద్రారెడ్డిల గెలుపు బాధ్యతలను తనకు అప్పగించినట్లు చెప్పారు. అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నానన్నారు. తనతోపాటు డీసీసీబీ ఉపాధ్యక్షుడు దూబ ధర్మారావు, రాజాం మండల పార్టీ అధ్యక్షుడు జడ్డు విష్ణుమూర్తి పాల్గొంటున్నారని వివరించారు.
Link to comment
Share on other sites

సీఆర్‌.. ఫాంహౌస్‌లో ఇక వంకాయలు పండించుకోవాల్సిందే'
01-12-2018 09:38:44
 
636792546260755724.jpg
  • ఫాంహౌస్‌లో వంకాయలు పండించుకోవాల్సిందే
  •  సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకేందుకు
  •  కేసీఆర్‌, కేటీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో ఇక వంకాయలు పండించుకోవాల్సిందే.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరిస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, గొట్టిముక్కల పద్మారావుతో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ తర్వాత కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో వంకాయలు పండించుకుంటూ కాలక్షేపం చేయక తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, మోదీ హయాంలో జరిగిన రాఫెల్‌ కుంభకోణంపై ప్రపంచ దేశాలు కోడై కూస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం నోరెత్తకపోవడం వెనక ఉన్న ఆంతర్యమేంటని నారాయణ ప్రశ్నించారు.
 
సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే కేటీఆర్‌కు ఎందుకు...
నందమూరి సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే కేటీఆర్‌కు ఎందుకని నారాయణ నిలదీశారు. దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని అమెరికాలో చదదివిన కేటీఆర్‌కు పోటీ చేసే అర్హతల గురించి తెలియదా...? అని ఆయన ప్రశ్నించారు. కూకట్‌పల్లి నుంచి టీడీపీ గుర్తుపై నందమూరి సుహాసిని నిలబడితే కేసీఆర్‌, కేటీఆర్‌లకు భయమెందుకో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వని కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి నందమూరి ఆడబిడ్డను విమర్శించే స్థాయికి దిగజారితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మిత్రపక్షాలు, ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అన్న కూతురు, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమ్యారావు మాట్లాడుతూ నందమూరి సుహాసినిపై ఈగ వాలినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కె.యేసురత్నం, బాలమల్లేష్‌, జి.ఐలయ్య, వెంకట్‌రెడ్డి, కృష్ణ, కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పైనే నమ్మకం పెట్టుకుంటున్నారట
01-12-2018 09:27:36
 
636792533525791290.jpg
  • తెలంగాణ గట్టుమీద.. ప్రచారాస్త్రం!
  • అక్కడి ఎన్నికల ప్రచారంలో టీడీపీ జిల్లా నేతలు
  • రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రచారం
  • వ్యూహాత్మకంగా మీటింగ్‌లు
  • అందరి దృష్టి కూకట్‌పల్లిపైనే..
 
గుంటూరు: తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమికి అనుకూలంగా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా హరికృష్ణ కుమార్తె.. నందమూరి ఆడపడుచు రంగంలో ఉన్న కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపుకోసం పలువురు టీడీపీ నేతలునాలు గైదురోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా జిల్లా నేతలను తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
బీజేపీని వ్యతికేకించిన టీడీపీ.. తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొంది. ఇందుకోసం సుమారు మూడున్నర దశాబ్ధాల రాజకీయ వైరానికి స్వస్తి పలికింది. మహాకూటమిలో పాలుపంచుకుంటూ తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. మహాకూటమి గెలుపొందితే ఆ క్రెడిట్‌ చంద్రబాబు ఖాతాలో పడుతుంది. త్వరలో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షం మరింత బలహీనపడుతుంది. అందువల్ల ప్రస్తుతం టీడీపీకి తెలంగాణ ఎన్నికలు ముఖ్యమనే భావనలో పార్టీ శ్రేణులున్నాయి. దీంతో తెలంగాణలో పరిచయం ఉన్న నేతలను గెలిపించటానికి జిల్లా నేతలు ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతో ఏర్పడిన టీడీపీ.. మారిన పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి సమర్ధించుకుంటూ ఎన్నికల కురుక్షేత్రంలో ముందుకు సాగుతోంది.
 
అందరి చూపు కూకట్‌పల్లిపైనే
టీడీపీ స్థాపించిన తరువాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా హైదరాబాద్‌ ఎన్నికల్లో బరిలోకి దిగటం ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌ నల్గొండ, కల్వకుర్తిలో పోటిచేసి తెలంగాణ నుంచి చట్ట సభల బరిలోకి దిగారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఊహించని విధంగా కూకట్‌పల్లిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేకమంది ఎన్టీఆర్‌ వారసురాలి పోటీపై హర్షం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి సుహాసిని ఒక్కరే మహిళా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమె మంచి మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో ఇక్కడి నేతలు అక్కడ పనిచేస్తున్నారు.
 
జిల్లా నుంచి వెళ్లి కూకట్‌పల్లి, హౌసింగ్‌బోర్డు, బీహెచ్‌ఈల్‌, మదీనాగూడ తదితర ప్రాంతాలో సెటిలైన వారి సమాచారాన్ని సేకరించి వారిని అపార్టుమెంట్‌లలో, విల్లాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదులో సెటిలర్స్‌ కుటుంబాల మూలాలు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం వారీగా కుటుంబీకులపై దృష్టి పెట్టారు. వారి ద్వారా నేరుగా నేతలు మాట్లాడటం, స్థానికంగా అక్కడ కొంతమంది మద్దతు పొంది సభలు ఏర్పాటు చేస్తున్నారు.
 
వ్యూహాత్మకంగా ప్రచారం
జిల్లా నుంచి వెళ్లిన నేతలు నేరుగా ప్రచారంలో పాల్గొనటం కంటే ఎక్కువగా వ్యూహ రచనలో నిమగ్నమవుతున్నారు. ప్రధానంగా సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా గ్రామాల నుంచి హైదరాబాద్‌లో సెటిలైన వారి వివరాలు సేకరించి, ఆ సమాచారం ఆధారంగా అక్కడ కుల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీనికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాలు, ప్రాంతాల వారీగా వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారాన్ని పంచుకుంటున్నారు. దీంతో పాటు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులతో మాట్లాడతున్నారు. వారి ద్వారా సమాచారం సేకరించి ప్రచారం చేస్తున్నారు.
 
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నాలుగు రోజుల నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, ఖమ్మం, సత్తుపల్లి జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేపట్టారు. మరో సీనియర్‌ నేత మాజీ మంత్రి, తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఐదురోజుల నుంచి కూకట్‌పల్లిలో మకాం వేసి జిల్లావాసులతో రాజకీయాలను నడుపుతున్నారు.
 
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎండీ హిదాయిత్‌, గుంటూరు కోపరేటివ్‌ అర్భన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌లు రాంజేంద్రనగర్‌, మలక్‌పేట, ఎమ్మెల్సీ, శాసన మండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మూషీరాబాద్‌ నియోజకవర్గంలో, మాజీ శాసనసభ్యుడు దేవినేని మల్లిఖార్జునరావు, మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ లాల్‌ వజీర్‌, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ, మంగళగిరి టీడీపీ సీనయర్‌ నేత పోతినేని శ్రీనివాసరావు, నగరానికి చెంది న టీడీపీ నేత వేములపల్లి శ్రీ రాంప్రసాద్‌ (బుజ్జి), టీడీపీ సీనియర్‌ నేత కంతేటి శివప్రసాద్‌లు గ్రేటర్‌ పరిధిలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

టీడీపీ పక్కా ప్రణాళిక..నేతలు చేస్తున్న పని ఇదే
01-12-2018 10:26:02
 
636792568108975961.jpg
  • గ్రేటర్‌పై తెలుగుదేశం స్కెచ్‌
  • కార్యాలయంలో ప్రోగ్రామింగ్‌ కమిటీ
  • ఏ రోజుకారోజు సమాచార సేకరణ
  • డివిజన్ల వారీగా ప్రతినిధుల నియామకం
  • పార్టీ బరిలో ఉన్న చోట ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): మహానగరంలో పోటీ చేస్తోన్న అభ్యర్థుల విజయం కోసం టీడీపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పార్టీ బరిలో ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక ప్రతినిధులను నియమించింది. ఇప్పటికే వారు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభ్యర్థి ప్రచారం ఎలా సాగుతోంది, కూటమిలోని ఇతర పక్షాలు సహకరిస్తున్నాయా, సొంత పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారా, లేదా అన్న అంశాలు పరిశీలించి వారు ప్రధాన కార్యాలయానికి ఏ రోజుకారోజు నివేదిక ఇస్తున్నారు. కూట మికి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏ ప్రాంతంలో పార్టీకి అనుకూలంగా ఉంది, ఎక్కడ వ్యతిరేకత ఉంది అన్న వివరాలనూ వారు సేకరిస్తున్నారు. కూటమిలోని కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ పార్టీల నేతలు స్థానికంగా సహకరించడం లేదని తెలిస్తే, వారి అగ్రనేతలతో టీటీడీపీలోని ముఖ్యనేతలు మాట్లాడి పరిస్థితి సరిదిద్ధే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెల్సుకునేందుకు ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ప్రోగ్రామింగ్‌ కమిటీ ఏర్పాటుచేశారు. కమిటీలోని సభ్యులు ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సమాచారం సేకరించి అగ్రనాయకులకు అందజేస్తున్నారు.
 
వ్యూహాత్మకంగా..
గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. ఉప్పల్‌, సనత్‌నగర్‌, మలక్‌పేట, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో ఉన్నారు. ఆయా స్థానాల్లో పార్టీలోని అసంతృప్తులు ఇప్పటికే దారికి రాగా, కూటమిలోని కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ శ్రేణులు సహకరిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను చక్కదిద్దేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. డివిజన్ల వారీగా రాష్ట్ర స్థాయి నాయకులను బాధ్యులుగా నియమించారు. వారు అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంపై పలు సూచనలు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయం, అభ్యర్థులకు మధ్య వారధులుగా నిలుస్తున్నారు.
 
డివిజన్ల పర్యవేక్షకులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర కార్యాలయం నుంచి గెలుపు కోసం ఏం చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. నగరంలో హోరాహోరి పోరు ఉండనున్న నేపథ్యంలో ఏ ఒక్క అవకాశం వృథా చేసుకోకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీలోని కీలక నేతలు కూడా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని పరిశీలించే అవకాశముందని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

తెలంగాణలో ఎన్నికలు.. చంద్రబాబు వార్నింగ్‌తో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలల్లో..
03-12-2018 14:18:42
 
636794435222591532.jpg
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రకాశం జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాల నేతల్లో తెలంగాణ ఎన్నికల సమరం గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన హెచ్చరికలు టీడీపీ సిట్టింగ్‌లను కలవరపెడుతున్నాయి. మరోవైపు వైసీపీలో అయోమయ పరిస్థితి కన్పిస్తోంది. అదేసమయంలో జిల్లా నుంచి టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తుండగా, వైసీపీ పరోక్షంగా మద్దతిస్తోంది.
 
 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో గుబులు
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతోనూ అలాగే పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లలో తెలంగాణ ఎన్నికల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో దాదాపు అందరికీ తిరిగి టిక్కెట్లు ఇవ్వడం సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రచారానికి వెళ్లిన వారిని గ్రామాల్లో నిలదీస్తున్నారంటూ మనం జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయం రాష్ట్రంలోని అధికార టీడీపీ ఎమ్మెల్యేలలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి జిల్లాలోని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ అంశంపై పదేపదే ప్రస్తావించుకోవడం కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలైతే అక్కడ తెలంగాణాలో సిట్టింగు ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురైతే బాసు (చంద్రబాబు) దానినే ప్రమాణికంగా తీసుకుంటారు కదా, అప్పుడు ఎంత మంది మీద వేటు పడుతుందోనని వ్యాఖ్యానించుకొంటున్నారు.
 
 
అంతేకాక ఒక వైపు తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి రావాలని భావిస్తూనే టీఆర్‌ఎస్‌లో గెలిచేవారంతా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైతే బాగుండని వ్యాఖ్యానించుకోవడం వారిలోని ఆందోళనను అద్దం పడుతుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు అక్కడ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఉన్న సమయంలో జాగ్రత్త పడేందుకు సిద్ధమయ్యారు. తదనుగుణంగా నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ప్రజా సంబంధాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే అప్పటివరకూ ఆగడం ఎందుకన్న భావనతో అసమ్మతి వాదులను కలుపుకునేందుకు చర్చలు ప్రారంభించారు. ప్రజాకూటమి గెలుపొందాలని కోరుకుంటూనే టీఆర్‌ఎస్‌లో ఎంతమంది గెలిచినా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైతే తమపై కొంత ప్రభావం తగ్గవచ్చని వారి అంచనా. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేక తీర్పు వస్తే ఇక్కడ మన బాసు(చంద్రబాబు) మరికొంత ధైర్యంగా కనీసం 30 శాతం మందికైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన బెట్టవచ్చన్న భావన కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో వచ్చినట్లు కనిపిస్తోంది.
 
 
అయోమయంలో వైసీపీ
వైసీపీ నేతల్లో తెలంగాణ ఎన్నికల సమరం విషయంలో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వైసీపీ పోటీలో లేని విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం వారికి కల్గలేదు. అయితే చంద్రబాబు కలిసిన ప్రజా కూటమి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడ పోటీలో ఉండి తమకు తెలిసిన వారికి ప్రచారానికి వెళితే ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందోనన్న భావన వ్యక్తమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో స్థిరపడిన వారిలో జిల్లాలోని అన్నీ ప్రాంతాల వారు ఉన్నారు.
 
కార్తీక మాసం పేరుతో ఆయా ప్రాంతాలలో ఉన్న జిల్లాలోని వారు వివిధ పేర్లతో సమావేశమవుతున్నారు. ఆసందర్భంగా వైసీపీ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. వెళుతున్నారు కూడా. కానీ వెళ్లిన వారు అడిగితే ఎవరికి మద్దతు చెబితే ఏమవుతుందోనన్న భయంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా కొందరు చెబుతున్నప్పటికీ మరికొందరు మీ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి, మన ఎన్నికలలో మాత్రం తరలిచ్చి నాకు మద్దతివ్యవండని చెబుతున్నారు.
 
 
పెరిగిన టీడీపీ నేతల ప్రచారం
ప్రచారం కార్యక్రమం ముగింపు దశకు వస్తుండటంతో జిల్లాలోని ఆయా ప్రాంతాల టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై తెలంగాణలో పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్‌బుల్లాపూర్‌, సనత్‌నగర్‌, ఖమ్మం తదితర నియోజకవర్గాల్లో జిల్లాకు చెందిన వారు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఆదివారం సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థి కోన వెంకటేశ్‌గౌడ్‌కు మద్దతుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విస్తృతంగా ప్రచారం చేశాడు. అలాగే కుత్‌బుల్లాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీశైలం గౌడ్‌ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని ప్రగతి నగర్‌లో విస్తృతంగా పర్యటించారు. ప్రత్యేకించి అక్కడ జరిగిన కాకతీయ కమ్మ సంఘం సమావేశానికి వెళ్లి అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోమవారం అద్దంకి ప్రాంత వాసుల ఆహ్వానం మేరకు మరికొన్ని ప్రాంతాలలోని అపార్టుమెంట్లు, లేఅవుట్లలో ప్రచారంలో పాల్గొంటారు. శనివారం ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గంలో దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసినికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
 
 
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశిరావు ఖమ్మం నియోజకవర్గంలో అత్యంత సన్నిహితుడైన నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఆరంభం నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆదివారం సినీనటుడు బాలకృష్ణతోపాటు ప్రచార సభలలో పాల్గొన్నారు. యువనాయకుడు కరణం వెంకటేశ్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అద్దంకి ప్రాంత వాసులందరినీ కలిసి తెలుగుదేశానికి మద్దతుగా నిలవాలని ప్రచారం చేస్తున్నారు. మార్కాపురానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఏలూరి రామచంద్రరెడ్డి పది రోజుల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. అటవీ అభివృద్ధి సంఘ చైర్మన్‌ దివి శివరాం కూడా అక్కడ ప్రచారంలో ఉన్నారు. మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్‌ నేత కరణం బలరాం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు కూడా ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Link to comment
Share on other sites

కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు: ఎమ్మెల్యే మొడియం
04-12-2018 10:55:42
 
636795181670966369.jpg
 
బుట్టాయగూడెం/పశ్చిమగోదావరి : నిన్న, మొన్నటి వరకు తనకు తిరుగులేదనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సా యంత్రం బుట్టాయగూడెంలోని కలగర రాము బ్యారన్ల వద్ద నిర్వ హించిన నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని విర్రవీగిన కేసీఆర్‌కు బాబు దెబ్బతో నిద్రపట్టడం లేదన్నారు.
 
 
మంగళ, బుధవారాల్లో చంద్రబాబు ఆంధ్రా సరిహద్దులో ఉన్న సత్తుపల్లి, ఆశ్వారావుపేట, భద్రాచలం ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల 30న రాజమండ్రి లో నిర్వహించే జయహో బీసీ సమావేశాన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందని, అన్న ఎన్టీఆర్‌ బీసీల అభివృద్ధికి ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు బీసీలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని, మంత్రివర్గంలో అధికంగా బీసీలే ఉన్నారని, బీసీలం తా టీడీపీకి అండగా నిలవాలని కోరారు. దేశంలో ప్రధాని మోదీని ఎదిరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని స్పష్టం చేశారు. రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతుందని అన్నారు. కార్యక్రమానికి టి.నర్సాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరావు అధ్యక్షత వహించగా జిల్లా గ్రంథాలయ చై ర్మన్‌ జయవరపు శ్రీరామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్‌ మొగపర్తి సోంబాబు, నియోజకవర్గ, మండల పార్టీ నాయకులు పాయం గవరయ్య, సోమసుందరం, గంగరాజు, గణపతి రత్తయ్య, చీమల వెంకటేశ్వరావు, మంతెన సోమరాజు, పి.మధు, గద్దె అబ్బులు, మట్టా సత్తిపండు, కె.వీర్రాజు, ఎస్కే బాజీ, బొబ్బర ఎలీషా, పి.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణం
గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్యెల్యే మొడియం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం స్థానిక బీసీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 80 శాతం సీసీ రోడ్లు నిర్మించామని, మిగిలిన 20 శాతం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఎక్కడైనా సీసీ రోడ్లు అవరమైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అభివృద్ధే ద్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని, అందుకోసం ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అయినపర్తి చందన, జడ్పీటీసీ చింతల వెంకటరమణ, మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

On 9/6/2018 at 5:40 PM, sonykongara said:

akkada bhayam, bhayam, bhayam ednuku bhayam, nomination vesthe narakaleduga, booth daggara ki vasthe bomb lu veyyaledu ga,karyakartha lani ventadi champaledu ga,nayakula illa ni tagala bettaleduga,sanubhuti parula chela ni nasanam cheyyaleduga,case lu petti illa lo moga vallani lekunda cheyyaleduga,evi anni anubavinchi tattukoni nilabadina party ki, party puttina gadda meda bhaya padedi enduku  pourusham ga poradi party ni nilabettukondi, daddamma laga puri gadda meda undakandi..

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...