Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
ఆ అసెంబ్లీ స్థానంపై టీఆర్ఎస్ క్లారిటీ..!
11-09-2018 13:45:46
 
636722703472496503.jpg
  • మేడ్చల్‌ బరిలో మల్లారెడ్డి!
  • వికారాబాద్‌, మల్కాజిగిరిపై వీడని సస్పెన్స్‌
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ మల్లారెడ్డిని బరిలో దింపాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించని విషయం తెలిసిందే. ఈ మూడు కూడా టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. కొత్త వారికి అవకాశాలు కల్పించేందుకే సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇవ్వలేదని ప్రచారం సాగింది. వారు ఎవరనేదానిపై కొన్నాళ్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మేడ్చల్‌ సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ నుంచి గతంలో గెలుపొందిన సుధీర్‌రెడ్డి మళ్లీ తనకే టికెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్‌ నేతలు మైనంపల్లి హన్మంతరావు, నక్కా ప్రభాకర్‌గౌడ్‌, సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి, నందారెడ్డితోపాటు మల్కాజిగిరి సిట్టింగ్‌ ఎంపీ మల్లారెడ్డి కూడా పోటీపడుతున్నారు. చివరకు మల్లారెడ్డివైపు పార్టీ మొగ్గుచూపినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చే ఒక నేతను బరిలో దింపేయోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. మల్కాజిగిరి వికారాబాద్‌ అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇక్కడ కూడా కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కనకారెడ్డి పేరు పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ నుంచి ఆయన కోడలుకు సీటు ఇచ్చే విషయంలో తర్జనభర్జలను జరుగుతున్నాయి. వికారాబాద్‌ నుంచి సిట్టింగ్‌, తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు తొలిజాబితాలో స్థానం లభించలేదు. ఆయన స్థానంలో కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చే ఒక నేతకు టికెట్టు ఇవ్వనున్నట్లు తెలిసింది.
 
కొనసాగుతున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌
అధికార టీఆర్‌ఎస్‌ ఇంకా ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొన సాగిస్తుండడంతో విపక్షాలకు చెందిన ముఖ్యనేతలు గులాబీ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ లక్ష్మారెడ్డి కాంగ్రె్‌సకు రాజీనామా చేశారు. తాను టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌ నేతలు వస్తున్నట్లు సమా చారం. ఇప్పటికి కాకున్న భవిష్యత్తు రాజకీయ ప్రయో జనాల దృష్ట్యా వీరు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు తెలిసింది.
 
అసమ్మతిని చల్లార్చేయత్నం
టిక్కెట్లు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై నగరశివార్లలోని పలు నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్‌లో ఉన్న నియోజకవర్గాల్లో అనేక మంది కార్పొరేటర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. దీంతో పార్టీ ముఖ్యనేతలు రంగంలో దిగి..కొందరు నేతలతో మాట్లాడారు.
Link to comment
Share on other sites

కేసీఆర్‌ పాదాలపై పడుతూ..టికెట్‌ కోసం నానా తిప్పలు
11-09-2018 15:40:18
 
636722772191090565.jpg
  • టికెట్ల కోసం నేతల తిప్పలు
  • గాడ్‌ ఫాదర్ల చుట్టూ చక్కర్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖరారు చేసినా.. పునఃపరిశీలించి అవకాశం కల్పించాలని ఒకరు.. నాకే టికెట్‌ ఇప్పించాలంటూ కాంగ్రెస్‌ ఆశావహులు.. అదే బాటలో టీడీపీ, బీజేపీ నేతలు.. అభ్యర్థిత్వం కోసం గాడ్‌ ఫాదర్లను అభ్యర్థిస్తున్నారు. వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
సికింద్రాబాద్‌,(ఆంధ్రజ్యోతి): 
 
కంటోన్మెంట్‌లో టికెట్ల వేట...
ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టికెట్‌ కోసం అన్ని పార్టీల్లోనూ తీవ్ర పోటీ ఉంది. సిట్టింగ్‌ శాసనసభ్యుడిగా ఉన్న జి.సాయన్నకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించినట్లు తెలిసిందే. తెలుగుదేశం నుంచి వచ్చిన సాయన్నకు టికెట్‌ ఇవ్వొద్దని, గడిచిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన తనకు మళ్లీ అవకాశం కల్పించాలని పార్టీ ఇన్‌చార్జి గజ్జల నాగేష్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. దీని కోసం ఆయన టీఆర్‌ఎస్ కు చెందిన ముఖ్య నేతలందరినీ కలిసి తనదైన స్టైల్‌లో దండం పెడుతున్నారు. మంత్రులందరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అవకాశం చిక్కిన ప్రతిసారీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాదాలపై పడుతూ, టికెట్‌ కోసం నానా తిప్పలు పడుతున్నారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఖదీరవన్‌ రాజగోపాల్‌ కూడా టికెట్‌ కోసం ఇంకా యత్నిస్తున్నారు. ఆయన దానం నాగేందర్‌ను నమ్ముకున్నారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ ముప్పిడి గోపాల్‌ సైతం రాష్ట్ర మంత్రులు, ఇతర పెద్దలను కలిసి తనకు ఓ చాన్స్‌ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. శివార్లలోని గుండ్లపోచంపల్లి సర్పంచ్‌ ఈశ్వర్‌ కూడా అదే బాటలో ఉన్నారు. మంత్రులు, పార్టీ పెద్దలను కలిసి తనకు ఓ అవకాశం ఇవ్వాలంటూ చక్కర్లు కొడుతున్నారు.
 
కాంగ్రెస్‌లోనూ..
కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం కంటోన్మెంట్‌లో తీవ్రమైన పోటీ ఉంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్‌ ఈ నియోజకవర్గ టికెట్‌ ఆశిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో మొదట తన అభ్యర్థిత్వం ఖరారు చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారని, ఈసారి తనకే టికెట్‌ కేటాయించాలంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా తన రాజకీయ గురువు, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయం ఇన్‌చార్జి కొప్పుల రాజుపై క్రిశాంక్‌ గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి శ్రీగణేష్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జె.గీతారెడ్డి ద్వారా టికెట్‌ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా చేపడుతున్న సామాజిక, సేవా కార్యక్రమాలు, పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి టికెట్‌ ఇప్పించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
 
టీడీపీ నుంచి..
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ముప్పిడి మధుకర్‌ టీడీపీ టికెట్‌ కోసం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సహా అగ్ర నేతలందరినీ కలుస్తున్నారు. వివాదరహితుడిగా పేరున్న తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. బీజేపీ టికెట్‌ కోసం కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వి.జైప్రకాష్‌ యత్నిస్తున్నారు. పార్టీ పెద్దలు బండారు దత్తాత్రేయ, డాక్టర్‌ లక్ష్మణ్‌, జి.కిషన్‌రెడ్డి, డాక్టర్‌ ఎన్‌.రాంచందర్‌రావులను తరచూ కలుస్తూ, టికెట్‌ కోసం పాట్లు పడుతున్నారు. ఈ నియోజకవర్గం కోసం పెద్దగా పోటీ లేకపోవడంతో తనకే టికెట్‌ గ్యారంటీ అన్న ధీమాతో జైప్రకాష్‌ ప్రచారం చేసుకుంటున్నారు.
 
సికింద్రాబాద్‌లో పోటా పోటీ
 
టీఆర్‌ఎస్‌కు తప్ప...
మంత్రి తీగుళ్ల పద్మారావుగౌడ్‌ మళ్లీ పోటీ చేయనుండడంతో టీఆర్‌ఎస్‌ సీటు కోసం ఇక్కడ పోటీ లేదు. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ తొలి మేయర్‌ బండ కార్తీకరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పెద్ద నేతలందరినీ టికెట్‌ కోసం కలుస్తున్నారు. మేయర్‌గా పని చేసి ఉండడంతో నేరుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా తన అభ్యర్థనలను పంపుతున్నారు. మరోవైపు పీసీసీ కార్యదర్శి ఆదం సంతోష్ కుమార్‌ ఈ పర్యాయం ఎలాగైనా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. టికెట్‌ కోసం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా జాతీయ స్థాయి నాయకులను సంప్రదిస్తున్నారు. రాహుల్‌గాంధీ సన్నిహితుల ద్వారా కూడా ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్‌ కూడా సికింద్రాబాద్‌ టికెట్‌పై దృష్టి సారించారు. ఏఐసీసీ పెద్దల ద్వారా టికెట్‌ కోసం యత్నిస్తున్నారు.
 
టీడీపీ...
తెలుగుదేశం పార్టీ టికెట్‌ కోసం టీడీపీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి మేకల సారంగపాణి నేరుగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నగర టీడీపీ బీసీ సెల్‌ విభాగం అధ్యక్షుడు సి.బద్రీనాద్‌యాదవ్‌ అధ్యక్షుడు ఎమ్మెన్‌.శ్రీనివాస్ రావుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నగర టీడీపీ కార్యదర్శి వల్లారపు శ్రీనివాస్‌ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అన్ని డివిజన్ల అధ్యక్షులూ ఆయకు మద్దతు తెలుపుతుండడంతో వారితో కలిసి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, అగ్రనేతలను కలిసి, టికెట్‌ కోసం యత్నిస్తున్నారు.
 
బీజేపీ...
బీజేపీ టికెట్‌ కోసం పార్టీ నగర ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ గౌడ్‌ పార్టీ పెద్దలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌ సహా అగ్రనేతలను కలిసి మొర పెట్టుకున్నారు. మంత్రి పద్మారావుగౌడ్‌ను ఎదుర్కొనే సత్తా తనకుందని, అవకాశం ఇవ్వాలంటూ వారిని అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

అసెంబ్లీ టికెట్ ఇవ్వండి: చంద్రబాబును కలిసిన కోనేరు సోదరులు
12-09-2018 12:23:42
 
636723518230308902.jpg
కొత్తగూడెం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ మహా కూటమిగా ఏర్పడి పొత్తు ఖరారైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో టీడీపీ తరపున తనకే టిక్కెట్‌ కేటాయించాలని కోరుతూ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 1983 నుంచి నేటి వరకు టీడీపీకి ఉన్న క్యాడర్‌, పార్టీ బలాన్ని తదితర అంశాలను చంద్రబాబు నాయుడికి వివరించారు. 1983 నుంచి కొత్తగూడెం నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ నాటి నుంచి నేటివరకు ఆ పార్టీని నిలబెట్టుకుంటూ దివంగత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయులుగా తాము ఎంతో కృషి చేశామన్నారు.
 
1983లో పార్టీ స్థాపించిన దివంగత ఎన్‌టీఆర్‌ ఆశీస్సులతో పార్టీ క్రియాశీలతను తెలుసుకొని టీడీపీలో తన తండ్రి కోనేరు నాగేశ్వరరావు చేరారని అప్పటి నుంచి టీడీపీ పార్టీలో క్రమ శిక్షణ గత కుటుంబంగా కోనేరు కుటుంబానికే దక్కిందన్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో 9వేల మెజార్టీతో సీనియర్‌ నాయకుడు చేకూరి కాశయ్యపై విజయం సాధించిన ఘనత కోనేరు నాగేశ్వరరావుకు దక్కిందన్నారు. 1985 జరిగిన ఎన్నికల్లో కోనేరు నాగేశ్వరరావుకు 10వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారని తెలిపారు. 2009లో తమ పార్టీ అండతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. 2014 జరిగిన ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకున్న టీడీపీ తరపున తాను పోటీచేసి తృతీయస్థానంలో ఓట్లు సాధించామని తెలిపారు. గత 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందించిన కోనేరు కుటుంబ సభ్యులను గుర్తించి పార్టీ టిక్కెట్‌ తమకు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర నాయకులు కోనేరు పూర్ణచందర్‌ రావు ఉన్నారు.
Link to comment
Share on other sites

ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి: టీడీపీ కార్యకర్తల ఏకాభిప్రాయం
12-09-2018 12:13:54
 
636723512353747453.jpg
ఖమ్మం: ఖమ్మం శాసనసభ బరిలో టీడీపీ నుంచి నామానాగేశ్వరరావు పోటీ చేయాలని కార్యకర్తలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పోరేషన్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యఽక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు నామా ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే అది పక్కనే ఉన్న పలు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. కార్యకర్తల మనోభావాలను నామా దృష్టికి తీసుకెళ్తానని బ్రహ్మయ్య కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కమిటీలను త్వరలో పూర్తిచేస్తామని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటామని అందరి సమన్వయంతో కమిటీలను నియమించాలనే లక్ష్యంతో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి మాట్లాడుతూ ఓటరు జాబితాలు పరిశీలించుకోవాలన్నారు. సమావేశంలో మద్దినేని స్వర్ణకుమారి, కూరపాటి వెంకటేశ్వర్లు, గాజుల కృష్ణమూర్తి, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, మందపాటి వెంకటేశ్వర్లు, రాయపూడి జైకర్‌, కొడగంటి ఆంజనేయులు, గొడ్డేటి మాధవరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఖైరతాబాద్‌‌ సీటు కాంగ్రెస్‌కే..?!
12-09-2018 12:23:09
 
636723517904970510.jpg
హైదరాబాద్: అందరూ ఊహిస్తున్నట్లుగా టీడీపీతో పొత్తు ఖరారైతే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీకి సరైన నాయకులు లేకపోయినప్పటికీ ఇప్పటికీ భారీగానే ఓటుబ్యాంకు ఉంది! ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, యువనేత రోహిణ్‌రెడ్డి, మహిళా నేత జువ్వాడి ఇందిరారావు టికెట్‌ కోసం అధిష్ఠానం వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మహిళా కోటాలో తనకు ఇక్కడ టికెట్‌ ఇవ్వాలని ఇందిరారావు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. విచిత్రమేంటంటే ఇటు వినోద్‌రెడ్డి, ఆటు రోహిణ్‌రెడ్డిలకు మాజీ మంత్రి జానారెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉంది.
 
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కూడా వినోద్‌రెడ్డికి ఇటీవల బందుత్వం కూడా ఏర్పడింది. ఇక్కడ అభ్యర్థిని ఎంపికచేసే విషయంలో జానారెడ్డి సూచించేవారికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో టీడీపీ ఇచ్చే సూచన కీలకమని తెలుస్తోంది. రోహిణ్‌రెడ్డికి అంజన్‌కుమార్‌ యాదవ్‌ మద్దతు కూడా ఉందని తెలుస్తోంది. వీరే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్‌నేతలు, పలువురు మాజీ మంత్రులు కూడా ఖైరతాబాద్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
 
అందరి చూపు ఇటువైపే..
ప్రధాన పార్టీలకు ఖైరతాబాద్‌ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. నగరంలో సులువుగా విజయం సాధించే నియోజకవర్గాల్లో ఖైరతాబాద్‌ ఒకటని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తుండగా.... టీడీపీ మద్దతుతో ఇక్కడ గెలుపుఖాయమనే దీమాలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది! ప్రస్తుతం బీజేపీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆయన ఇక్కడ మంచి మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి కూడా ఇక్కడ బీజేపీ నుంచి ఆయనే మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఆ పార్టీ ఇప్పటి నుంచి ప్రచార పర్వానికి పూర్తిగా సిద్ధమవుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అంతర్గతంగా నిర్వహించుకునే సర్వేల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన పక్షంలో తప్పనిసరిగా గట్టెక్కుతామనే ఫలితాలు వచ్చాయని రెండు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.
 
 
నగరంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి దానం నాగేందర్‌, కార్పొరేటర్లు విజయారెడ్డి, విజయలక్ష్మి,నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్‌ మన్నె గోవర్ధన్‌రెడ్డిలు టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తుండగా మరో మాజీ మంత్రి కే.విజయరామారావు కూడా తన కుమార్తెకు టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు కూడా ఇక్కడ టికెట్‌ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో ఇటీవలే టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సురే్‌షరెడ్డి పేరు కూడా ఇక్కడ వినిపించింది! అయితే దానం నాగేందర్‌, విజయారెడ్డి పేర్లపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. అధిష్ఠానం ఆలోచన మాత్రం వేరుగా ఉందని, పార్టీ ముఖ్యులలో ఒకరిని ఇక్కడ బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా వినబడుతోంది.
Link to comment
Share on other sites

జూబ్లీహిల్స్‌ బరిలో దంత వైద్యుడు
12-09-2018 12:11:21
 
636723510821281744.jpg
హైదరాబాద్: హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్‌ కడియాల రాజేంద్ర జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ బరిలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన ఏపీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ పేరుతో హైదరాబాద్‌లో దంత వైద్య శాల నిర్వహిస్తున్నారు. ఆయన ఇక్కడ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని కోరారు.
 
 
ఆయనతో పాటు ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ బాబు, సంఘం నేత చంద్రశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. తాను పలు సాంఘిక ఉద్యమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, తనకు అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎంను కోరారు.
 
ఉస్మానియా జేఏసీ మాజీ నేత, టీడీపీ నిజామాబాద్‌ జిల్లా నాయకుడు రాజారాం యాదవ్‌ కూడా చంద్రబాబును కలిశారు. నిజామాబాద్‌లో తనకు అవకాశం ఇప్పించాలని కోరారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఇన్‌చార్జి కోనేరు చిన్ని కూడా కొందరు నేతలతో కలిసి చంద్రబాబును కలిశారు. పొత్తులో కొత్తగూడెం నియోజకవర్గాన్ని టీడీపీ తీసుకోవాలని, తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ భార్య నిరాహార దీక్ష
12-09-2018 12:05:28
 
636723507293657239.jpg
హైదరాబాద్‌: భార్యల కోసం భర్తలు పాటుపడడం చూశాం. రిజర్వేషనో, మరో కారణమో... సతులను ఎన్నికల బరిలోకి దించేందుకు పతులు అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అనంతరమూ వారి వెంటే ఉంటూ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. కానీ.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గతానికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భర్త కోసం ఓ భార్య రోడ్డెక్కితే... మరో సతీమణి ఏకంగా అగ్రనేతలను కలుస్తోంది. నగరంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన ఈ పరిణామాలు రాజకీయ ఆసక్తిని పెంచుతున్నాయి. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరు ప్రకటించడాన్ని.. స్థానిక కార్పొరేటర్‌ పన్నాల కావ్య, ఆమె భర్త హరీష్‌రెడ్డి ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి ఉన్న తనకు అవకాశం కల్పించకుంటే రెబల్‌గా బరిలోకి దిగుతానని హరీష్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు.
 
 
కాగా కేపీహెచ్‌బీ కాలనీలోని టెంపుల్‌ బస్టాప్‌ వద్ద పన్నాల కావ్య పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి అయిన కృష్ణారావుకు టికెట్‌ ఇవ్వడం సమంజసం కాదన్నారు. పార్టీ కేడర్‌ను పట్టించుకోకుండా.. గతంలో కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వ్యక్తిని బరిలోకి దించితే ఆయనకు మద్దతుగా ఎలా పనిచేస్తామని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మాజీ కార్పొరేటర్‌ సునితాప్రకాష్‌గౌడ్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గం టికెట్‌ తన భర్తకు కేటాయించాలని విలేకరుల సమావేశంలో కోరారు. కార్పొరేటర్‌గా టికెట్‌ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారని, గ్రేటర్‌ ఎన్నికల్లో పోటి చేసే అవకాశం ఇవ్వకుండా నామినేటెడ్‌ పోస్టు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. ఇప్పుడైనా తన భర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ ఆపద్ధర్మ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, టీ పద్మారావుగౌడ్‌లను కోరారు.
Link to comment
Share on other sites

కారులో సెగలు.. విపక్షాల్లో గుబులు
కొత్తగూడెం గులాబీలో అసమ్మతి సెగలు
వైరా అభ్యర్థిని మార్చాలని 22 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా
bdr-top2a.jpg

ఖమ్మం: తెరాసలో అసమ్మతి చినికి చినికి గాలివానలా మారుతోంది. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసే వరకు వెళ్లింది. సత్తుపల్లి తెరాస టికెట్‌ ఆశించిన మట్టా దయానంద్‌ మంగళవారం నియోజవకర్గంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జలగం వెంకటరావు అభ్యర్థిత్వాన్ని మార్చాలని కొత్తగూడెంలో ప్రదర్శన చేపట్టారు. ఇల్లెందులో తెరాస అభ్యర్థి కోరం కనకయ్య ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఈ నెల 14న జిల్లాకు రానున్న అపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం నగర సమీపంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ వరకు ఘన స్వాగతం పలకాలని శ్రేణులు నిర్ణయించాయి. ఇదీ ఉభయ జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితి.

bdr-top2c.jpg
ఇల్లెందులో గులాబీ శ్రేణుల ఉత్సాహం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెరాసలో అసమ్మతి సెగలు మరింతగా పెరుగుతున్నాయి. విపక్షాల్లో సీట్ల కేటాయింపుపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎవరికి ఏ సీటు దక్కుతుందోనని రోజులు గడిచేకొద్దీ ఆయా పార్టీల నాయకులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

bdr-top2b.jpg
చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న కోనేరు చిన్ని, పూర్ణచందర్‌రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెదేపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని), ఆయన సోదరుడు పూర్ణచందర్‌రావు తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంగళవారం అమరావతిలో కలిశారు. 1999 ఎన్నికల సమయంలో కొత్తవారికి టికెట్‌ కేటాయించాలన్న పార్టీ నిర్ణయం మేరకు కోనేరు కుటుంబం కట్టుబడి ఉందని, 2009 ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలోని పరిస్థితులు, తాజా పరిస్థితులు వివరిస్తూ చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. భద్రాచలం నేతలు కొందరు హైదరాబాద్‌కు వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలను కలిశారు. అశ్వారావుపేట మండల కేంద్రంలో తెదేపా నేత మెచ్చా నాగేశ్వరరావు పర్యటించారు. తెదేపా-కాంగ్రెస్‌ పొత్తు ఖరారు అయ్యాయని, పొత్తులో భాగంగా టికెట్‌ ఎవరికి వచ్చినా గెలుపునకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని దమ్మపేటలో భాజపా నేత భుక్యా ప్రసాద్‌ ప్రదర్శన నిర్వహించారు.

దయానంద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ..
తెరాస తరపున సత్తుపల్లి టికెట్‌ ఆశించిన మట్టా దయానంద్‌కు నిరాశే ఎదురవ్వడంతో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 వేల ద్విచక్రవాహనాలు, ఆరేడు వేల మంది జనంతో ప్రదర్శన నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వైరా నియోజకవర్గం పరిధిలో అసమ్మతి సెగలు ఆగడం లేదు. మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం మొత్తం 22 మంది ప్రజాప్రతినిధులుతమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈనెల 14న తొలిసారి జిల్లాకు రానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికేందుకు పాలేరు నియోజకవర్గ నేతలు సన్నద్ధం అవుతున్నారు. కూసుమంచిలో సమావేశం నిర్వహించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం గ్రామీణ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించి ఆహ్వానించాలని నిర్ణయించారు. అశ్వారావుపేటలో పార్టీ ఇన్‌ఛార్జి నూకల నరేశ్‌రెడ్డి అశ్వారావుపేట మండల నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
 

Link to comment
Share on other sites

మహాకూటమికి అంకురార్పణ 07191911BRK161MAHA.JPG
హైదరాబాద్‌: కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ నేతలు హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. మూడు పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటించారు. ప్రజల కోసం ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మొదటి సమావేశం మాత్రమేనని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా సంఘాలతో కలిసి వెళ్తామని నేతలు వివరించారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారని.. అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని నేతలు తెలిపారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనూ చర్చలు జరపకుండానే అసెంబ్లీని రద్దు చేసిందని విమర్శించారు. తెదేపా నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Link to comment
Share on other sites

పొత్తులకు ముందే కత్తులు
తెదేపా, కాంగ్రెస్‌ నాయకుల మధ్య పోటీ
ఎవరికి వారే.. తమకు కావాలంటూ ప్రయత్నాలు
ఈనాడు, హైదరాబాద్‌
hyd-sty3a.jpg

ఒకవైపు తెరాస అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తుండగా.. మరోవైపు ఇతర పార్టీల్లో నాయకులు ఉత్కంఠతో ఊగిపోతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో నియోజకవర్గాల్లోని ఆయా పార్టీల నాయకులు తమ పోటీ విషయంపై స్పష్టత రాక ఆందోళనకు గురవుతున్నారు. తెరాస అభ్యర్థులు ప్రచారంలో దిగగా.. తాము మాత్రం బరిలో ఉంటామో.. లేదో తెలియక సతమతమవుతున్నామని వాపోతున్నారు. ప్రత్యేకించి నగర శివారుల్లో తెదేపా, కాంగ్రెస్‌కు బలమై నాయకులు ఉన్న నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీల నాయకుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు ఆ నియోజకవర్గాలు తమకే కావాలని తెదేపా నాయకత్వం కోరుతోంది. ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు మారాయని తెదేపా తరఫున గెలిచిన వారు తెరాసలో చేరిపోయారని, కాంగ్రెస్‌కే గట్టి పట్టు ఉండటంతో పాటు బలమైన నాయకులు కూడా ఉన్నారని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు.

ఆ నియోజకవర్గాలపై పీటముడి
ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ సహా మరికొన్ని నగర పరిధిలోని నియోజకవర్గాల విషయంలోనే ఇరు పార్టీల మధ్య చివరి వరకు చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఈ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని తెదేపా జిల్లా నాయకులు గట్టిగా కోరుతున్నారు. ఈ స్థానాలు అడిగే విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అడగాలని రాష్ట్ర నాయకులను అభ్యర్థిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికి గట్టి నాయకులు ఉన్నారని.. సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండటం.. తెదేపా హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం వంటి కారణాలు తమకు కలసి వస్తాయని తెదేపా నాయకులు చెపుతున్నారు. ఇలాంటి వాదనలనే కాంగ్రెస్‌ నాయకులు కూడా వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో తాము  కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలోనూ మరికొన్ని చోట్ల గణనీయమైన ఓట్లను పొంది బలంగా ఉన్నామని చెపుతున్నారు. గత రెండు మూడేళ్లుగా తమ శక్తి పెరిగిందన్నది కాంగ్రెస్‌ నాయకుల వాదన. ఉభయ పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు మాత్రం పెదవి విప్పడం లేదు. కనీసం జిల్లా స్థాయి నాయకులకూ సమాచారం ఉండటం లేదు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ పార్టీ తరఫున టిక్కెట్టు ఆశిస్తున్న నాయకుడొకరు తెలిపారు. పొత్తుల్లో భాగంగా ఏ స్థానం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ ఆశావహుల్లో నానాటికీ ఎక్కువవుతోంది. ప్రత్యామ్నాయాలు అన్వేషించుకుంటున్నారు.



చాంద్రాయణగుట్ట
పేరు; అక్బరుద్దీన్‌ ఒవైసీ
తండ్రి పేరు.. సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ
పుట్టినతేది.. జూన్‌ 14, 1970.
విద్యార్హత: (ఎంబీబీఎస్‌)
కుటుంబం..: భార్య సబీనా ఫర్జానా, కుమార్తె ఫాతిమా, కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీ
hyd-sty3b.jpg
రాజకీయ నేపథ్యం: 1999 ఎన్నికల్లో మొదటి సారి మజ్లిస్‌ తరఫున చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అప్పటి రాజకీయ కురువృద్ధుడు, ఎంబీటీ వ్యవస్థాపకుడు అమానుల్లాఖాన్‌పై విజయం సాధించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో సైతం అక్బరుద్దీన్‌ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా పోటీ చేసి వరస విజయాలు నమోదు చేసుకున్నారు. రద్దయిన శాసనసభలో మజ్లిస్‌ పక్ష నేతగా అక్బరుద్దీన్‌ ఒవైసీ బాధ్యతలు నిర్వహించారు.  ప్రజలను తన ప్రసంగాలతో రెచ్చగొడతారనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. పలు పోలీసుస్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి.  పలు ప్రాంతాల్లో ఒవైసీ ఎక్సలెంట్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, యువతకు క్రీడా సామగ్రి పంపిణీ చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోటీలో ఎవరూ ఉన్నా విజయం తనదేనని అక్బరుద్దీన్‌ ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

-  న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట

మలక్‌పేట
అభ్యర్థి: అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల
పుట్టిన తేదీ: 22.10.1967
విద్యార్హత: ఎస్సెస్సీ
కుటుంబం: భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు.
hyd-sty3c.jpg
రాజకీయ నేపథ్యం: వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూనే మజ్లిస్‌ రాజకీయాలపై దృష్టిసారించారు. 2004లో మజ్లీస్‌ పత్తర్‌గట్టీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం 2009లో తొలిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టారు. మలక్‌పేట నుంచి బరిలో నిలబడి తెదేపా అభ్యర్థి ముజఫర్‌ అలీఖాన్‌పై గెలుపొందారు. 2014లో భాజపా అభ్యర్థి బి.వెంకటరెడ్డిపై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. మజ్లీస్‌ ఎమ్మెల్యే కంటే వ్యక్తిగత అభిమానంతో రాజకీయాలకతీతంగా ఈ మేరకు నియోజకవర్గవాసులు అభిమానిస్తారు. జలమండలి, విద్యుత్తు విభాగాలకు సంబంధించిన ఇత్తేహాద్‌ యూనియన్ల గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ గట్టి నమ్మకంతో మూడోసారి బరిలో నిలిపేందుకు ఎంపిక చేశారు. హ్యాట్రిక్‌ సాధించేందుకు అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేశా. మరోసారి గెలిచి దీర్ఘకాలికంగా ఉన్న మరికొన్ని సమస్యల పరిష్కారానికి దృష్టిసారిస్తా. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు చేయించా.

- న్యూస్‌టుడే, సైదాబాద్‌

నాంపల్లి
అభ్యర్థి..: జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌
పుట్టిన తేది : 26.01.1960
తండ్రి పేరు : అహ్మద్‌ హుస్సేన్‌ (దివంగత మాజీ శాసన సభ్యుడు)
కొడుకులు : మినాజ్‌ హుస్సేన్‌, మక్సూద్‌ హుస్సేన్‌, ఇద్దరు కూతుళ్లు
విద్యాభ్యాసం : ఇంటర్‌
hyd-sty3d.jpg
రాజకీయ జీవితం: 1982లో వ్యాపారంలో అడుగుపెట్టిన జాఫర్‌ హుస్సేన్‌, 2004 మజ్లిస్‌ పార్టీలో చేరారు. 2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ తరపున టోలిచౌకి డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2009 డిసెంబరు 4న గ్రేటర్‌ డిప్యూటీ మేయర్‌గా నియమితులై, రెండేళ్లపాటు కొనసాగారు. 2014లో  నాంపల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి మజ్లస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మిత్రపక్షాల అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌పై 17వేల పై చిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. దాదాపు రూ.100 కోట్లతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ‘లంచ్‌ విత్‌ దళిత్‌’ కార్యక్రమం ద్వారా ఎస్సీ బస్తీల్లో పర్యటించి, సమస్యలు పరిష్కరించారు. పాదయాత్రలు, నియోజకవర్గంలో పర్యటనలు చేపట్టే సమయంలో ‘ఏక్‌ కప్‌ చాయ్‌’ కార్యక్రమంతో ప్రజలు, కార్యకర్తలతో కలిసి తేనీరు తాగుతున్నారు. నియోజకవర్గంలోని అన్నీ వర్గాల సహకారంతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని జాఫర్‌ చెప్పారు.

- న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్‌
Link to comment
Share on other sites

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్‌లో ముసలం
12-09-2018 16:33:50
 
636723668313972272.jpg
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ నతే ఈసీ శేఖర్ గౌడ్ నిరసనకు దిగారు. తన అనుచరులతో కలిసి సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంచిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శేఖర్ గౌడ్.. టీఆర్ఎస్‌ బలోపేతం కోసం తాను ఎంతగానో కృషి చేశానని అన్నారు. తనను కాదని, టీడీపీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం దారుణం అన్నారు. ఎమ్మెల్యేగా ఆయన ఏనాడు పార్టీ శ్రేణులను కలుపుకొని పోలేదని శేఖర్ ఆరోపించారు. పార్టీ శ్రేణుల్లో విభేదాలు సృష్టించి.. తన వర్గం వారికి మాత్రమే పదువులు ఇచ్చారని దుయ్యబట్టారు. మంచిరెడ్డికి కేటాయించిన టికెట్‌ను వెనక్కి తీసుకోవాలని శేఖర్ డిమాండ్ చేశారు. మంచిరెడ్డి హటావో.. టీఆర్ఎస్ బచావో అంటూ నినదించారు.
Link to comment
Share on other sites

ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సీబీఐ మాజీ డైరెక్టర్ కుమార్తె?
13-09-2018 12:09:48
 
636724373895283205.jpg
 
హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో ఖరారు కాని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరన్న విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రధానంగా నాలుగు నియోజక వర్గాల విషయంలో అభ్యర్థులపైనే గ్రేటర్‌లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. గ్రేటర్‌లోని అంబర్‌పేట, గోషామహల్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌ నియోజక వర్గాల్లో ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు.
 
సిట్టింగ్‌లకు టికెట్‌లు ప్రకటించడంతో చాలా నియోజక వర్గాల్లో అసంతృప్తులు పెరిగాయి. అధినేతలు చెప్పినా అలకలు, అసంతృప్తులు కొనసాగించే వారిని అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. ముషీరాబాద్‌ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన ముఠా గోపాల్‌తోపాటు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పోటీపడుతున్నారు.
 
 
ఈ విషయంలో పార్టీ ఇప్పటికీ ఎవరినీ ఖరారు చేయలేదు. దీంతో మరికొందరు కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ మహ్మద్‌ సలీం తనకు ఇవ్వకపోతే తన కుమారుడికైనా టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అంబర్‌పేట విషయంలోనూ పార్టీనేతల మధ్య తీవ్ర పోటీ పెరిగింది. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నేత డీపీరెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. బీసీ కార్డు కింద మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌, పార్టీ సీనియర్‌ నేత గడ్డం సాయికిరణ్‌ వంటివారు పోటీకి సై అంటున్నారు.
 
 
ఇక గోషామహల్‌ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మహేందర్‌కుమార్‌, నందకిషోర్‌ వ్యాస్‌, వంటివారే కాకుండా తాజా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ కూడా తెరపైకి వచ్చారు. కాగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకా శం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. వారం రోజులుగా పార్టీ అధిష్ఠానం టికెట్ల విషయంలో ఏ విధమైన ప్రకటన చేయక పోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగింది.
 
 
ఇక ఖైరతాబాద్‌ విషయంలోనూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కార్పొరేటర్లు విజయారెడ్డి, విజయలక్ష్మి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా, మన్ను గోవర్దన్‌ కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తాజాగా కె.విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ పేరు తెర పైకి వస్తోంది.
Link to comment
Share on other sites

On 9/12/2018 at 9:13 AM, sonykongara said:
ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి: టీడీపీ కార్యకర్తల ఏకాభిప్రాయం
12-09-2018 12:13:54
 
636723512353747453.jpg
ఖమ్మం: ఖమ్మం శాసనసభ బరిలో టీడీపీ నుంచి నామానాగేశ్వరరావు పోటీ చేయాలని కార్యకర్తలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పోరేషన్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యఽక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు నామా ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే అది పక్కనే ఉన్న పలు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. కార్యకర్తల మనోభావాలను నామా దృష్టికి తీసుకెళ్తానని బ్రహ్మయ్య కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కమిటీలను త్వరలో పూర్తిచేస్తామని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటామని అందరి సమన్వయంతో కమిటీలను నియమించాలనే లక్ష్యంతో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి మాట్లాడుతూ ఓటరు జాబితాలు పరిశీలించుకోవాలన్నారు. సమావేశంలో మద్దినేని స్వర్ణకుమారి, కూరపాటి వెంకటేశ్వర్లు, గాజుల కృష్ణమూర్తి, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, మందపాటి వెంకటేశ్వర్లు, రాయపూడి జైకర్‌, కొడగంటి ఆంజనేయులు, గొడ్డేటి మాధవరావు పాల్గొన్నారు.

Yes good call ..hung aite each MLA would be important... If doesn't work out he can still contest for MP

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...