Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply

పోటి చేసే స్థానాలు శేర్ లింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్

కుకట్ పల్లి - పెద్ది రెడ్డిలేదా భవ్య ఆనంద్ ప్రసాద్

ఉప్పల్ - వీరేంద్ర గౌడ్

కుద్బుల్లాపూర్ -అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్

రాజేంద్ర నగర్- గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి

జూబ్లిహీల్స్ - అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి

ఖమ్మం - నామా నాగేశ్వరరావు

సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య

అశ్వరావు పేట -మచ్చ నాగేశ్వరరావు

మక్తల్ - కొత్త కోట దయాకర్ రెడ్డి

దేవరకద్ర - సీతా దయాకర్ రెడ్డి

జడ్చర్ల - ఎర్ర శేఖర్

వనపర్తిరావుల చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు

కోరుట్ల - ఎల్ రమణ

Link to comment
Share on other sites

కాంగ్రెస్ కు ‘ఖో’దాడ!
25-10-2018 03:36:53
 
636760354146544735.jpg
  • ఉత్తమ్‌ దంపతులకు నిరాశ తప్పదా?
  • టీడీపీకి సీటు వదులుకోవాల్సిందేనా?
  • కోదాడలో పద్మావతి పోటీపై ఉత్కంఠ
హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): శాసనసభకు ఒకే కుటుంబం నుంచి కొందరు ప్రాతినిథ్యం వహించడం కొత్తేమీకాదు. కొన్ని పార్టీల ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ ఎప్పుడూ ఉన్నదే! త్వరలో జరగనున్న ఎన్నికలకూ కొందరు స‘పరివారం’గా రేసులో ఉన్నారు. అయితే.. భార్యాభర్తలుగా ఏకకాలంలో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డు మాత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతి దంపతులదే! ఉత్తమ్‌.. హుజూర్‌నగర్‌ నుంచి, ఆయన భార్య పద్మావతి.. కోదాడ నుంచి గెలిచి ‘జంట’గా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరి.. ఈ జంట మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కుతుందా? లేదంటే.. ‘కుటుంబానికి ఒకే సీటు’ అనే కాంగ్రెస్‌ సూత్రం పక్కాగా అమలయ్యే అవకాశాలున్నాయా? అనే చర్చ జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం కుటుంబసభ్యుల్లో ఒకరికే టికెట్‌ ఇవ్వాలనే నిబంధన విషయంలో కఠినంగా ఉండనుందనే విశ్లేషణలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-టీఎస్‌, టీజేఎస్‌, సీపీఐలతో కలిసి కాంగ్రెస్‌ బరిలోకి దిగుతోంది. దీంతో సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. పైగా కోదాడ స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది. 1978 నుంచి ఇక్కడ ‘సైకిల్‌ పార్టీ’ 4 సార్లు గెలిచింది కూడా. 2014 ఎన్నికల్లో టీడీపీలో బలమైన నాయకుల్లో ఒకరైన బొల్లం మల్లయ్యయాదవ్‌పై పద్మావతి 13,374 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా కోదాడ టికెట్‌ కావాల్సిందేనని టీడీపీ గట్టిగా అడుగుతోంది.
 
ఈ క్రమంలో ‘పొత్తు’ ధర్మానికి తలొగ్గి కోదాడ సిటింగ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ వదులుకుంటుందా? దీనికి ఉత్తమ్‌ ససేమిరా అన్నప్పటికీ.. ‘కుటుంబానికి ఒకే సీటు’ ఫార్ములాతోనైనా త్యాగం చేయక తప్పదా? అన్నది త్వరలో తేలనుంది. కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి.. ఆయన కుమారుడు రఘువీర్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌, ఆయన కొడుకు అనిల్‌కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి.. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, కొండా సురేఖ.. ఆమె భర్త మురళి.. కూతురు సుస్మితా పటేల్‌ టికెట్లు ఆశిస్తున్నారు. ‘కుటుంబం నుంచి ఒకరికే టికెట్‌’ ఫార్ములా పక్కాగా అమలైతే వీరికి నిరాశ తప్పదు.
Link to comment
Share on other sites

క్కతేలింది.. గ్రేటర్‌లో టీడీపీ పోటీ చేసేది ఈ స్థానాల్లోనే..!!
25-10-2018 13:08:17
 
636760701144638163.jpg
  • నియోజకవర్గాల కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత
  • గ్రేటర్‌లో ఏడు నుంచి తొమ్మిది సీట్లలో తెలుగు తమ్ముళ్ల పోటీ
  • పలు స్థానాలపై ఇప్పటికే నిర్ణయం
  • రెండు, మూడు స్థానాలు కావాలంటోన్న టీజేఎస్‌
  • ఒకటి లేదా రెండు చోట్ల ఆ పార్టీకి అవకాశం
 
హైదరాబాద్‌: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న దానిపై స్పష్టత వచ్చింది. ఏ నియోజక వర్గం ఎవరికి అన్నదీ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడని నేపథ్యంలో చివరి నిమిషంలో మార్పులు జరుగుతాయేమో అని కొందరు ఆశపడుతుంటే... ఇంకొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొత్తుల లెక్కలకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. సీపీఐ మినహాయిస్తే కూటమిలోని భాగస్వామ్యపక్షాలు టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ నగరం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గ్రేటర్‌లోని 24 సీట్లలో ఏడు నుంచి తొమ్మిది సీట్లలో బరిలో నిలవాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనివి ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా పార్టీ సీనియర్‌ నాయకులకు ఎలాగైనా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సనత్‌నగర్‌, కుత్బుల్లాపుర్‌, మహేశ్వరం నియోజకవర్గాలను టీడీపీ కోరుతున్నా.. ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. ఆయా స్థానాలకు బదులు ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్టు తెలిసింది. టీజేఎస్‌ రెండు, మూడు స్థానాలు అడుగుతుండగా... మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో ఒకటి లేదా రెండు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.
 
 
సీనియర్ల కోసం కాంగ్రెస్‌.. బలముందని టీడీపీ....
2014 ఎన్నికల్లో గెలిచిన మెజార్టీ స్థానాలు కావాలని టీడీపీ కోరుతోంది. ఎక్కువ సీట్ల కోసం పట్టుపట్టని నేపథ్యంలో కనీసం పార్టీ బలంగా ఉండే నియోజకవర్గాలై నా కేటాయించాలని టీడీపీ నాయకులు అడిగినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పలు చోట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు స్థానాల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం టికెట్‌ సబితా ఇంద్రారెడ్డి ఆశిస్తోన్న నేపథ్యంలో 2014లో ఆ సీటు టీడీపీ గెలిచినప్పటికీ.. పొత్తులో భాగంగా ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఇంకా ఒప్పు కోలేదని సమాచారం. రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఒక స్థానం ఇస్తామని చెబుతున్నట్టు తెలిసింది. మర్రి శశిధర్‌రెడ్డి కోసం సనత్‌నగర్‌ కావాలంటోన్న కాంగ్రెస్‌... సికింద్రాబాద్‌ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్టు సమాచారం.
 
 
సికింద్రాబాద్‌ నుంచి పోటి చేసేందుకు కూన వెంకటే‌ష్‌గౌడ్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు కూన అమరావతికి వెళ్లినట్లు సమాచారం. సనత్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నా... ఇప్పుడు మరో చోటికి వెళ్లలేను.. అదే స్థానం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఎల్‌బీనగర్‌ స్థానం తనదే అని మొదటి నుంచి చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ స్థానం టీడీపీకి కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. అదే జరిగితే పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి బరిలో నిలిచే అవకాశముంది.
 
 
ముషీరాబాద్‌ లేదా కంటోన్మెంట్‌లో ఒక స్థానం అని ప్రచారం జరిగినా... టీడీపీ అగ్రనాయకుల విజ్ఞప్తి మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు కోసం ముషీరాబాద్‌ కేటాయించేందుకు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైందని పేర్కొంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ ఆశిస్తోన్నా.. టీడీపీ గెలిచే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ స్థానం తమ్ముళ్లకు దక్కే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే కానీ... ఏ నియోజకవర్గం ఎవరికి..? అన్న దానిపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాగా... పొత్తుల లెక్కలు తేలాయన్న ప్రచారం నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు.
 
Tags : telugudesam, Hyderabad, Mahakutami
Link to comment
Share on other sites

‘రాజేంద్రనగర్‌ అసెంబ్లీ టికెట్‌ టీడీపీకే కేటాయించాలి’
25-10-2018 13:45:45
 
636760720581615129.jpg
రాజేంద్రనగర్/హైదరాబాద్: రెండు పర్యాయాలు రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఈ దఫా కూడా రాజేంద్రనగర్‌ టికెట్‌ను టీడీపీకే కేటాయించేలా చొర వ తీసుకోవాలని ఆ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామేశ్వర్‌రావు కోరారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు టి.దేవేందర్‌గౌడ్‌ను కలిసి ఆయన విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి చేస్తున్నవారిని గుర్తించి అవకాశం కల్పించాలన్నారు. బడు గు, బలహీన వర్గాలు, యువతకు పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్నామని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారికి అవకాశమిస్తే సునాయాసంగా విజయం సాధించడం జరుగుతుందన్నారు.
Link to comment
Share on other sites

‘కూకట్‌పల్లి టికెట్‌.. కాపులకే కేటాయించాలి’
25-10-2018 13:29:22
 
కూకట్‌పల్లి/ హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ కాపులకే కేటాయించాలని కాపు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కూకట్‌పల్లి అధ్యక్షుడు అరిటాకుల రమే్‌షబాబు కోరారు. నియోకవర్గంలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న కాపు కులానికి చెందిన అభ్యర్థులకు.. ఆయా పార్టీల నాయకులు టికెట్‌ కేటాయించాలన్నారు. కాపు నాయకుడికి ఏ పార్టీ.. టికెట్‌ కేటాయిస్తే ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాపులకు టికెట్‌ కేటాయించలేదని, ఈ సారైనా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
‘కూకట్‌పల్లి టికెట్‌.. కాపులకే కేటాయించాలి’
25-10-2018 13:29:22
 
కూకట్‌పల్లి/ హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ కాపులకే కేటాయించాలని కాపు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కూకట్‌పల్లి అధ్యక్షుడు అరిటాకుల రమే్‌షబాబు కోరారు. నియోకవర్గంలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న కాపు కులానికి చెందిన అభ్యర్థులకు.. ఆయా పార్టీల నాయకులు టికెట్‌ కేటాయించాలన్నారు. కాపు నాయకుడికి ఏ పార్టీ.. టికెట్‌ కేటాయిస్తే ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాపులకు టికెట్‌ కేటాయించలేదని, ఈ సారైనా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

kapu ki iste nyayam jaragadu ra Ramesh Jaffa...unnollallo manchodikipani cheyatam telsinodiki vadiki iste manchi jaruguddi

Link to comment
Share on other sites

తెరపైకి కొత్త పేర్లు.. అయోమయంలో నేతలు
26-10-2018 10:45:07
 
636761475760443612.jpg
  • కూటమిలో అన్నింటా.. మిగతా పార్టీల్లో కొన్నింట...
 హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం 30 మంది దరఖాస్తు చేసుకున్నారు... గోషామహల్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం 8 మంది పోటీ పడుతున్నారు. కూకట్‌పల్లిలో టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. సనత్‌నగర్‌ కూటమి టికెట్‌ ఎవరికో తెలియక అన్ని పార్టీల కార్యకర్తలూ అయోమయంలో ఉన్నారు... ఇలా టికెట్‌ టెన్షన్‌ ఆశావహులను వెంటాడుతోంది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతున్న కొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తుండడం మరింత గుబులు రేకెత్తిస్తోంది.
 
 
కూకట్‌పల్లి.. టీడీపీపైనే గురి
కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో రోజురోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం... బీజేపీ టికెట్‌ దాదాపు మాధవరం కాంతారావుకే దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి మహాకూటమి అభ్యర్థిపైనే ఉంది. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి టికెట్‌ టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల్లో టికెట్లు రానివారంతా టీడీపీపై ఆశలు పెట్టుకొన్నారు. ఓ పక్క టీడీపీ నాయకులు... మరోపక్క ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు టీడీపీ అధిష్ఠానం వద్ద క్యూలు కడుతున్నారు. టికెట్‌ కోసం ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించే సమయం ఆసన్నం కావడంతో చంద్రబాబుపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కూకట్‌పల్లి టికెట్‌ దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, ఆరెకపూడి ప్రసాద్‌, మందడి శ్రీనివాసరావు, మాధవరం రంగారావు, కృష్ణగౌడ్‌ టికెట్‌ కేటాయించాలని పార్టీ అధిష్ఠానం వద్ద ప్రతిపాదించారు. తాజాగా ప్రముఖ బిల్డర్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి డా.ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ టీడీపీ టికెట్‌ తనకు కేటాయించాలంటూ రేసులోకి వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు టికెట్‌ కేటాయిస్తే సులభంగా గెలవవచ్చని ఆయన విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిసింది. అధిష్ఠానం మాత్రం అందరినీ పరిశీలించి గెలిచే సత్తా ఉన్న నాయకుడికే టికెట్‌ కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
 
పెద్దిరెడ్డి ప్రచారం...
కూకట్‌పల్లి టికెట్‌ ఆశిస్తున్న ఇ.పెద్దిరెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని కూటమికి సంబంధించిన నాయకులు, యూనియన్‌ సంఘాలు, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర పార్టీల నాయకులు టీడీపీలో చేరే కార్యక్రమాల్లోనూ ముమ్మరంగా పాల్గొంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు. దాదాపుగా టికెట్‌ పెద్దిరెడ్డికే ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అభ్యర్థులను అఫీషియల్‌గా ప్రకటించకపోవడం, ఆశావహులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతుండడంతో టికెట్‌ కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
 
ముషీరాబాద్‌లో ఉత్కంఠ
రాంనగర్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు చెందిన ఆశావహులు టికెట్‌ తమకే వస్తుందని ఎవరికి వారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా కాంగ్రెస్‌, టీడీపీ పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ కోసం దాదాపు 30 మంది దరఖాస్తులు చేసుకున్నారు. టీడీపీ నుంచి ఒకరు, టీజేఎస్‌ నుంచి మరొకరు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుని తమ గాడ్‌ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్‌చార్జి ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు దరఖాస్తు చేశారు. ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ కోసం యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కనుకుల జనార్థన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర లీగల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ విభాగాల అధ్యక్షులు చల్లా దామోదర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.నాగేష్‌ ముదిరాజ్‌, టీపీసీసీ కార్యదర్శులు సంగిశెట్టి జగదీష్‌, టి.రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ పార్టీ డాక్టర్‌ సెల్‌ చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌, టీపీసీసీ మాజీ జాయింట్‌ సెక్రటరీ ఎస్తేర్‌రాణి, మాజీ కార్పొరేటర్‌ రావి వెంకటరెడ్డి, తెలంగాణ రిటైర్డ్‌ అధ్యాపకుల సంఘం నాయకులు కె.ఐలయ్యతోపాటు పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ జన సమితి నుంచి నియోజకవర్గం ఇన్‌చార్జి ఎం.నర్సయ్య పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా మూడు పార్టీల ఆశావహులు ముషీరాబాద్‌ టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిన్నారు. పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎవరు పోటీలో ఉంటారనే ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది.
 
 
సనత్‌నగర్‌లో ఎవరికి సై...
ప్రజా క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రె్‌స, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ మహా కూటమిగా జట్టు కట్టాయి. కూటమి తరపున ఎవరికి టికెట్‌ అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సనత్‌నగర్‌ టికెట్‌ కోసం కూటమిలో రెండు పార్టీల నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ సీఎం తనయుడు, పలుమార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి శశిధర్‌ రెడ్డి పోటీలో ఉండగా, టీడీపీ అఽభ్యర్థిగా కూన వెంకటేష్‌ గౌడ్‌ తనకే టికెట్‌ ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నారు. పొత్తులో భాగంగా టికెట్‌ మీ పార్టీకి వస్తుందా... మా పార్టీకి వస్తుందా అన్న చర్చలు గత కొన్ని రోజులు తారా స్థాయికి చేరాయి. కూన వెంకటేష్‌ టీడీపీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకే్‌షల నుంచి హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ప్రచారం జోలికి వెళ్లలేదు. పొత్తు ఖరారై అభ్యర్థుల ప్రకటన జరిగే వరకు ఆపార్టీ ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు.
 
బీజేపీలోనూ...
భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో సనత్‌నగర్‌ టికెట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వారసుడిగా ప్రదీ్‌పకుమార్‌కు టికెట్‌ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పోటీలో ఉన్న ఇద్దరు నాయకులు నిరసన గళం విప్పుతున్నారు. తమలో ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని, మరొకరికిస్తే సహకరించేది లేదని అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ బీజేపీలోనూ టికెట్‌ టెన్షన్‌ కొనసాగుతోంది.
 
 
గోషామహల్‌ స్థానంపై 8 మంది గురి..
గోషామహల్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఇప్పటి వరకు 8 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇందులో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గడ్డం శ్రీనివా్‌సయాదవ్‌, తెలంగాణ ఉద్యమకారులు ఆర్‌వీ. మహేందర్‌ కుమార్‌, నందకిశోర్‌వ్యా్‌స(బిలాల్‌), గోషామహాల్‌ కార్పొరేటర్‌ ముఖే్‌షసింగ్‌, బెజిని శ్రీనివాస్‌, శీలం సరస్వతి, శాంతిదేవి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్‌ పోటీచేసి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ అధిష్ఠానం ఆయనకే టికెట్‌ కేటాయించింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపి గోషామహల్‌ స్థానాన్ని గెలిచి తమ ఖాతాలోకి వేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
 
డిసైడింగ్‌ ఓటర్లు మైనార్టీలే..
నియోజకవర్గ పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి. ఇందులో గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో 2 ఎంఐఎం, 1 బీజేపీ, 3 టీఆర్‌ఎస్‌ పార్టీలు గెలుచుకున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉన్న 2,29,874 ఓట్లలో 60 వేల మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి వచ్చినా మైనార్టీల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయిస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. టికెట్‌ వస్తే ముందుగా మైనారిటీ ఓటర్లను కలుసుకుని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు.
Link to comment
Share on other sites

ఖమ్మం అసెంబ్లీ బరిలో నామా నాగేశ్వరరావు?
26-10-2018 10:04:02
 
636761451709104541.jpg
  • టీడీపీ శ్రేణుల విస్తృత ప్రచారం
  • త్వరలో తన నిర్ణయం ప్రకటించనున్న ‘దేశం’నేత
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి - ఖమ్మం)
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నామ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ప్రసంగిస్తూ.. ఖమ్మం ఎమ్మెల్యేగా నామా నాగేశ్వరరావు పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, నామా పోటీ ఖాయమని స్పష్టం చేశారు. అయితే.. నామా మాత్రం అధికారికంగా ఎక్కడా తన అంగీకారాన్ని తెలపడంలేదు. నాయకులు, పార్టీ కేడర్‌ నుంచి మాత్రమే ప్రచారం నడుస్తోంది. నామా నాగేశ్వరరావు కూడా పార్లమెంటుకు పోటీ చేయాలా..? లేక అసెంబ్లీ బరిలో దిగాలా..? అన్న విషయంపై ఖమ్మం పట్టణంలోని ప్రముఖులతోపాటు, ఆయా వర్గాల నేతలతోనూ చర్చిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు పోటీ చేయమని ఆదేశిస్తే తప్పనిసరిగా పోటీ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మాత్రం నామా చెబుతూ వస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న నామా.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిచెందారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తే ఖమ్మం లోక్‌సభకే పోటీ చేయాలనే ఆలోచనలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. దీంతో అసెంబ్లీకి పోటీ చేయాలా? లేక పార్లమెంటుకు పోటీచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమిగా ఏర్పడడంతో జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట సీట్లలో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం అసెంబ్లీ సీటుకు నామా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అని, ఆయనే పోటీ చేయాలని పార్టీ కేడర్‌ మొదటి నుంచి ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై త్వరలో నామ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ
26-10-2018 10:40:41
 
636761473534668579.jpg
  • కేసీఆర్‌ పీడ వదిలించేందుకే మహాకూటమితో ప్రజల ముందుకు
  • జిల్లాలో రెండు, భద్రాద్రిలో రెండు స్థానాల్లో పోటీ
  • ఖమ్మంలో నామా పోటీకి అవకాశం?
  • 28న సీట్ల ఖరారు
  • కార్యకర్తల సమావేశంలో బ్రహ్మయ్య, స్వర్ణకుమారి
ఖమ్మం: రాష్ర్టాన్ని ఆవరించిన కేసీఆర్‌ పీడను వదిలించేందుకు ఈ ఎన్నికల్లో మహాకూటమితో కలిసి టీడీపీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య స్పష్టం చేశారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించడానికి మహాకూటమి ప్రజా మేనిఫెస్టోతో ఎన్నికల బరిలో దిగనున్నట్టు వారు తెలిపారు. గురువారం ఖమ్మంలోని ఎన్టీఆర్‌ భవనంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడేందుకు సీపీఐ, కాంగ్రెస్‌, కోదండరాం పార్టీలతో కలిసి టీడీపీ మహాకూటమిగా పోటీ చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని అన్నారు. ఖమ్మం బరి నుంచి నామ నాగేశ్వరరావు పోటీకి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. మహాకూటమి అభ్య ర్థుల వివరాలను ఈనెల 28న ప్రకటించనున్నట్లు స్వర్ణకుమారి, బ్రహ్మయ్య తెలి పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మహాకూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చేందుకు సిద్ధంగా ఉండాలని బ్రహ్మయ్య కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో, రానున్న ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఇంటికి వెళ్లి అధికార పార్టీ ఆగడాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించి మహాకూటమి విజయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్‌ నాయకులు వల్లభనేని బాలగంగాధర్‌ చౌదరి, కూరపాటి వెంకటేశ్వర్లు, గాజుల కృష్ణ మూర్తి, ఏలూరి శ్రీనివాసరావు, వల్లంకొండ వెంక ట్రామయ్య, రాయపూడి జైకర్‌, మందపాటి వెంక టేశ్వర్లు, ప్రొదుద్టఊరి కోటిరెడ్డి, మీగడ రామారావు, కొడగంటి ఆంజనేయులు, గొడ్డేటి మాధవరావు, దుద్దుకూరి సుమంత్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కోదాడ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశం..?
27-10-2018 10:03:31
 
636762319969648460.jpg
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): టికెట్లు ఖరారు కాకపోవడంతో జిల్లాలో కాంగ్రెస్‌ ప్రచారం ఊపందుకోలేదు. మహాకూటమి పొత్తులు స్పష్టం కాకపోవడంతో జిల్లాలో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇంకా ఖరారు కాలేదు. ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన స్ర్కీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే సర్వేలు చేపట్టింది. అయితే మహాకూటమిలో పొత్తులు ఖరారు కాకపోవడంతో అధికారిక ప్రకటనల్లో జాప్యమవుతుంది. ఒకే అభ్యర్థి ఉన్న చోట్ల ప్రచారం చేసుకోవాలని ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చాయి. అభ్యర్థుల మధ్యన పోటీ ఉన్న చోట మాత్రం ఖర్చు దృష్టిలో ఉంచుకొని ప్రచారానికి వెనుకంజ వేస్తున్నారు. అభ్యర్థులు ఖరారయ్యాకే పార్టీ అధినేతల ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో హుజుర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. కోదాడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉత్తమ్‌పద్మావతికి సీటు ఇస్తారో లేదో తెలియట్లేదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్‌ ఇస్తామని అధిష్టానం ప్రకటించింది. దీంతో మహాకూటమి పొత్తులో టీడీపీ ఆ సీటును అడుగుతుంది. కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బొల్లం మల్లయ్యయాదవ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తిలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఆశిస్తున్నా వారి సంఖ్య బాగానే ఉంది. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు సైతం వేర్వేరుగా జరుగుతున్నాయి. పటే ల్‌ రమే్‌షరెడ్డి ఇప్పటికే ప్రచార వాహనాలను సిద్ధం చేసుకోగా ఆయనకు సంబంధించిన వాహనా లు తిరుగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవ ర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారు. గతంలో పోటీచేసిన అద్దం కి దయాకర్‌, గుడిపాటి నర్స య్య, అన్నెపర్తి జ్ఞానసుందర్‌, వడ్డెపల్లి రవిటికెట్‌ ఆశిస్తున్నారు.
 
 
పొత్తుల పీట ముడి ప్రధాన సమస్య..
పొత్తుల పీటముడి విడిపోతేనే టికెట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని నాలుగు ని యోజక వర్గాలలో కాంగ్రెస్‌పార్టీ బలంగానే ఉం ది. గత ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా, సూర్యాపే ట,తుంగతుర్తి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజ యం సాధించింది. కోదాడలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొదటి స్థానంలో ఉండగా టీడీ పీ రెండో స్థానంలో ఉంది. అన్ని నియోజక వర్గాల్లో ఈ సారి హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. త్రిముఖ,చతుర్మఖ పోటీల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్‌ పార్టీ టికెట్లను వీలైనం త తొందరగా ప్రకటించాలని ఆపార్టీ ఆశావాహులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర పార్టీలు ప్రచారంలో ముందు ఉంటే తా ము వెనకబడాల్సి వస్తుందని వాపోతున్నారు.
 
ఊపందుకొని కాంగ్రెస్‌ ప్రచారం....
పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుండడంతో కాంగ్రెస్‌ ప్రచారంలో వెనకంజలో ఉంది. టికెట్ల కోసం ఎదురు చూస్తుండడంతో ప్రచారం వైపు ఆసక్తి చూపట్లేదు. ఎవరికి వారు హైదరాబాద్‌, ఢిల్లీకి వెళ్తూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాదాపు టికెట్‌ ఖరారైన పేర్లు సైతం ప్రకటించకపోవడంతో ప్రచారం ముమ్మరంగా కనిపించడంలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకే నష్టమన్న భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. పలు చోట్ల ఎన్నికల ప్రచారం కనిపించడంలేదు. ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు టికెట్‌ ఖరారయ్యే వరకు ప్రచారానికి దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర నేతల జిల్లా పర్యటనలు సైతం అభ్యర్థులను ప్రకటించే వరకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరికి కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చేస్తారనే ఆశతో ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
Link to comment
Share on other sites

మహాకూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు!
31-10-2018 16:16:05
 
636765993667146795.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అర్థరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. సీట్ల కేటాయింపు విషయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మెత్తపడ్డట్లు తెలుస్తోంది. టీడీపీకి 13 సీట్లు, జనసమితికి 8, సీపీఐకి 4 సీట్లు కేటాయించినట్లు మహాకూటమి నేతలు చెబుతున్నారు. ఉమ్మడిగా అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను ప్రకటిద్దామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు టీడీపీ, జనసమితి, సీపీఐ అంగీకరించినట్లు సమాచారం. తమకు సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యం అని కూటమి నేతలు అంటున్నారు. ఇదిలాఉండగా.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపుపై రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
Link to comment
Share on other sites

తెలంగాణలో కాంగ్రెస్ సర్వే.. షాకింగ్ రిజల్ట్స్..!
31-10-2018 17:17:06
 
636766031071417335.jpg
హైదరాబాద్: తెలంగాణలో పార్టీల బలాబలాలపై ఏఐసీసీ పలు సర్వేలు చేయించింది. దీనికి సంబంధించి కీలకమైన సమాచారం పార్టీ అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఏసీసీ దూతలు.. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై అంతర్గత సర్వే నిర్వహించారు. 35 నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరుమీద నడకే అని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. 35 నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీ బలంగా ఉందని సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారు పార్టీ మారినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉనట్లు సమాచారం. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
 
టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి అందజేశారు. సర్వే నివేదిక, మహాకూటమి పొత్తులు, తాజా పరిస్థితిపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. సర్వేలో తేలిన 35 సీట్లలో గెలుపు ఖాయం కాబట్టి.. మరో 25 స్థానాలపై దృష్టి సారిస్తే అధికారం ఖాయం అని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
 
 
కాంగ్రెస్ సర్వేలో టీడీపీ బలంగా ఉందని తేలిన నియోజకవర్గాలు ఇవే...
దేవరకద్ర, మక్తల్, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, సిర్పూర్, ఖానాపూర్, జగిత్యాల, పెద్దపల్లి, నర్సంపేట్, ములుగు, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, ఆలేరు, ఉప్పల్, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
Link to comment
Share on other sites

టీడీపీకి 14సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకారం
31-10-2018 23:21:00
 
636766248610184807.jpg
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సీట్లపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన కుదిరింది. టీడీపీకి 14 సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకారం తెలిపింది. మరోవైపు రాహుల్‌ను కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. చర్చలు జరిపి ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో తేలుస్తారు. అటు శుక్రవారం టీజేఎస్ అధినేత కోదండరామ్ హస్తిన వెళ్తున్నారు. రాహుల్‌తో చర్చలు జరుపుతారు. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇచ్చేందుకు ఏఐసీసీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సీపీఐతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
Link to comment
Share on other sites

8 hours ago, sonykongara said:
టీడీపీకి 14సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకారం
31-10-2018 23:21:00
 
636766248610184807.jpg
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సీట్లపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన కుదిరింది. టీడీపీకి 14 సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకారం తెలిపింది. మరోవైపు రాహుల్‌ను కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. చర్చలు జరిపి ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో తేలుస్తారు. అటు శుక్రవారం టీజేఎస్ అధినేత కోదండరామ్ హస్తిన వెళ్తున్నారు. రాహుల్‌తో చర్చలు జరుపుతారు. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇచ్చేందుకు ఏఐసీసీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సీపీఐతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

Enti idi 14 aa... :kick:

 

atleast aa 15 ayina isthe melu...

Link to comment
Share on other sites

తెరాస సింగిల్‌ డిజిట్‌కే పరిమితం: రమణ 0638121RAMANA132A.JPG

హైదరాబాద్‌: కేసీఆర్‌ కుటుంబం మినహా ఇతర తెరాస నేతలను క్షేత్రస్థాయిలో ప్రజలు అడ్డుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. రాష్ట్రంలో తెరాస పునాదులు కదులుతున్నాయని, ఆ పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. 50 రోజుల్లో వంద సభలు పెడతామన్న తెరాస నేతలు 56 రోజుల్లో నాలుగు సభలకే పరిమితమయ్యారని విమర్శించారు. గజ్వేల్‌లో కూడా ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయని చెప్పారు. దేశంలో రాజకీయ వ్యవసాయానికి తెదేపా ముందుకు కదలిందన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లలేదని, దేశ ప్రతిష్ఠ కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చొరవ తీసుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. భాజపా దుష్పరిపాలనపై రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకే హస్తినకు వెళ్లారన్నారు. మోదీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, చంద్రబాబు పర్యటన చరిత్రాత్మకం కానుందన్నారు. భాజపాపై పోరాడుతున్న చంద్రబాబుకు అన్ని పార్టీలూ అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని రావుల చెప్పారు.

ఎప్పుడూమేం ప్రజా పక్షమే

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపాది ప్రజాపక్షమే అని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని, కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమిలో సీట్ల కోసం తామెప్పుడూ ఆలోచించలేదని.. కాంగ్రెస్‌ ప్రకటించిన 14 సీట్లపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. నయా గడీల పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రమణ చెప్పారు. త్వరలోనే తెదేపా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. సామాజిక సమతుల్యంతో దీన్ని పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తామని రమణ వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...