Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
On 9/7/2018 at 5:37 PM, hydking said:

టీటీడిపి కావాల‌ని కోరుతున్న సీట్లు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ…..
1. కోదాడ
2. నకిరేకల్ / తుంగతుర్తి
3.ఖమ్మం
4.సత్తుపల్లి
5.అశ్వారావు పేట
6. నర్సంపేట
7. హుజురాబాద్
8. కోరుట్ల
9. బాల్కొండ
10. శేరిలింగంపల్లి / కూకట్ పల్లి
11. సనత్ నగర్ / సికింద్రాబాద్
12. మేడ్చల్ / ఉప్పల్
13. జడ్చర్ల
14. వనపర్తి / దేవరకద్ర
15. మక్తల్…

30 అడిగితే బాగుంటది. JAI T-TDP

Link to comment
Share on other sites

కూటమికి తొలి అడుగు..!
10-09-2018 05:06:04
 
  • పొత్తులపై సీపీఐతో టీడీపీ చర్చలు
హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ఏర్పాటు దిశగా తొలి అడుగుపడింది. తొలుత కూటమి, ఆ తర్వాత కూటమిగా ఆవిర్భవించేందుకు.. బీజేపీ, టీఆర్‌ఎ్‌సయేతర వర్గాలను ఏకం చేసే దిశగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం తెలుగుదేశం, సీపీఐ సమావేశమై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. సోమవారం కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఎంతోనూ సమావేశమవ్వాలని టీడీపీ నిర్ణయించింది. తొలుత సీపీ ఎం, టీజేఎ్‌సతో టీడీపీ నాయకులు చర్చలు జరిపి, అనంతరం 3 పార్టీల నాయకులు కాంగ్రెస్‌ నేతలతో భేటీ కానున్నారు. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆదివారం టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణతో భేటీ అయ్యారు. పొత్తులపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.
 
 
సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి.. ఎల్‌.రమణతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తు ఎలా ఉండాలన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఏయే నియోజకవర్గాల్లో పొత్తు కుదుర్చుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. హుస్నాబాద్‌, బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా సెగ్మెంట్లను సీపీఐ కోరింది. వీటిపై ఇరుపార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం.
 
 
బీజేపీ, టీఆర్‌ఎస్ లకు గుణపాఠం: రమణ
టీఆర్‌ఎస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. తెలంగాణ ప్రజలకు నీతి నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తామని.. దోపిడీ, నియంతృత్వ పాలనను పారదోలతామని చెప్పారు. కాగా, టీడీపీతో తాము జరిపిన చర్చలతో అవగాహన కుదిరిందని, మహాకూటమికి సంబంధించి మిగతా పక్షాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు.
Link to comment
Share on other sites

ఆ నేతకే టీడీపీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా..?
10-09-2018 09:44:51
 
636721694914268742.jpg
  • కూకట్‌పల్లి టీడీపీ టికెట్‌ మాందడికే?
 హైదరాబాద్, కేపీహెచ్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి టీడీపీ టికెట్‌ కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుకి దక్కనుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండడంతో పాటు, వివాదరహితుడిగా మందడి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు తెలంగాణేతరులు ఎక్కువగా ఉండడంతో మందడికి టికెట్‌ ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. మందడికి టికెట్‌ ఇప్పించేందుకు టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌.రమణ, రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్‌రావు, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ ఆశిస్తున్న నేపథ్యంలో కూకట్‌పల్లి మందడి శ్రీనివాసరావుకు టికెట్‌ ఇస్తే బాగుంటుందని ఇప్పటికే తన ప్రతిపాదన అధిష్ఠానం ముందుంచినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

కాంగ్రె‌స్-టీడీపీల మధ్య పొత్తు కుదిరితే ఆ ఇద్దరి పరిస్థితేంటి..?
10-09-2018 10:06:35
 
636721707958119350.jpg
  • కాంగ్రె‌స్-టీడీపీల మధ్య కొలిక్కి రాని సీట్ల సర్దుబాటు
  • పొత్తు కుదిరితే నర్సంపేట స్థానం రేవూరికా.. దొంతికా...
  • వాడి వేడిగా సాగుతున్న చర్చ
నర్సంపేట/వరంగల్ అర్బన్: నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల పొత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పొత్తు కుదురితే అభ్యర్థుల ఎంపిక ఇరు పార్టీలకు పీఠముడిగా మారనుంది. టీడీపీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి దొంతి మాధవరెడ్డి మధ్య పొటీ నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ కేటాయించి ఆ మరుసటి రోజే కత్తి వెంకటస్వామికి మార్చింది. దీంతో దొంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న దొంతికే టికెట్‌ కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.
 
 
అయితే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తి కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని రేవూరి ప్రకాశ్‌రెడ్డి ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ప్రచారం చేశారు. దుగ్గొండి, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల్లో దొంతి మాధవరెడ్డి చేపట్టిన రోడ్లన్నీ పాడయ్యాయని ఆరోపించారు. ఒకరోజు దీక్షను కూడా చేపట్టాడు. మిషన్‌ కాకతీయ పథకం కింద చేపట్టిన మాధన్నపేట ట్యాంక్‌బండ్‌ పనుల్లో కూడా దొంతి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. తాజాగా మాధవరెడ్డి చేపట్టిన పనులపై విజిలెన్స్‌ అధికారులచే విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో పట్టువిడుపులు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.
 
 
రేవూరికా..! దొంతికా..!
రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్థానాల సీట్ల సర్దుబాటు విషయంలో అటు కాం గ్రెస్‌ ఇటు తెలుగుదేశం పార్టీల అగ్రనేతలు జరుపుతున్న చర్చలు ఆదివారం సాయంత్రం నాటికి కూడా కొలిక్కి రాలేదు. ఇరు పార్టీలకు నర్సంపేట టికెట్‌ పీఠముడిగా మారడంతో అగ్రనేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తుండటంతో కేంద్రంలో కాంగ్రె్‌సకు భవిష్యత్‌లో తెలుగుదేశం అవసరాలు ఉన్నందున పొత్తుల విషయంలో ఆ పార్టీ కూడా సీట్ల సర్దుబాటు నిర్ణయాలను వెంట వెంటనే తీసుకోలేకపోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

పోటీపై టీడీపీ సీనియర్ నేత క్లారిటీ
10-09-2018 11:23:38
 
636721754190861353.jpg
  • ఖాళీ అవుతోంది.. కారే..!
  • టీఆర్‌ఎస్‌ గెలుపు అసాధ్యం
  • ఆ పార్టీ నాయకత్వం భ్రమల్లో ఉంది
  • సంస్థాగతంగా టీడీపీ పటిష్ఠం
  • కాంగ్రెస్ తో కలుస్తామంటే ఎందుకంత వణుకు..?
  • ముషీరాబాద్‌ నుంచి తప్పకుండా పోటీ
‘టీడీపీని ఖాళీ చేశామనే భ్రాంతిలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది. పటిష్ఠ కేడర్‌ ఉన్న తెలుగుదేశం సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపుతాం. ఖాళీ అవుతోంది... ఎన్నికల తర్వాత ఖాళీ అయ్యేది’ కారే అని టీడీపీ నగరాధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు అన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, రాష్ర్టాభివృద్ధి దృష్ట్యా పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నామని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో తెలిపారు.
 
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): 
 
నవంబర్‌లో ఎన్నికలు జరిగితే మీ పార్టీ సిద్ధమేనా..?
ఎమ్మెన్‌: నగరంలో టీడీపీ అంత బలహీనంగా ఏదీ లేదు. ఎన్నికల కోసం మేం కొత్తగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. బూత్‌, డివిజన్‌ కమిటీలు ఇప్పటికే వేశాం. జిల్లా స్థాయిలో అనుబంధ సంస్థ కమిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు, త్రీమెన్‌, ఫోర్‌ మెన్‌ కమిటీలు ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు, ఎక్కడికక్కడ కమిటీలతో సంస్థాగతంగా ఎప్పటిలానే పటిష్ఠంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం.
 
ఆం: కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ అదే కాంగ్రెస్‌తో కలవాలనుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? లేదా పొత్తు ఉంటే ఎన్ని సీట్లు అడుగుతారు..?
ఎమ్మెన్‌: కాంగ్రెస్‌ పార్టీ కి వ్యతిరేకంగా టీడీపీ పుట్టినా.. 36 యేళ్ల క్రి తం నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు తెలంగాణలో నాటి రాచరిక పాలన సాగుతోంది. ప్రజలను పట్టించుకోవడం లేదు. అభివృద్ధి, సంక్షేమం హామీలకే పరిమితమైంది. అందుకే ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రె్‌సతో కలిసి నడవాలనుకుంటున్నాం. పొత్తులపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నగరంలో మూడు, శివార్లలో ఐదారు సీట్లు అడుగుతున్నాం. 2014 ఎన్నికల్లో మేం గెలిచిన, మా మద్దతుతో బీజేపీ గెలిచిన సీట్లు ఇవ్వాలని కోరనున్నాం. పొత్తు లేకుంటే నగరంలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం.
 
ఆం: మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు..?
ఎమ్మెన్‌: టీఆర్‌ఎస్‌ను ఇప్పుడు గెలిపించినా.. మళ్లీ మధ్యలోనే అసెంబ్లీ రద్దు చేసే అవకాశముంది. ఆ పార్టీ ఆశించిన రీతిలో ఎక్కడా విజయం సాధించే పరిస్థితి లేదు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయని టీఆర్‌ఎస్‌ చెప్పేది అవాస్తవం. అదే నిజమైతే ప్రగతి నివేదన సభ ఎందుకు ఫ్లాప్‌ అవుతుంది. మా ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌.
 
ఆం: టీడీపీ ఖాళీ అయ్యింది. 0.01 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయంటున్నారు..?
ఎమ్మెన్‌: పటిష్ఠ కేడర్‌తో ఉన్నది టీడీపీ మాత్రమే. ఈ విషయం అందరికీ తెలుసు. వాళ్లు చెప్పినట్టు నిజంగానే 0.01 శాతం ఓటు బ్యాంకు ఉంటే... కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకుంటుంటే అంత ఉలికిపాటు ఎందుకు. పార్టీని ఖాళీ చేశామన్న భ్రాంతిలో వాళ్లున్నారు. ఈ ఎన్నికల్లో మా సత్తా చూపుతాం. టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల తరువాత కారు ఖాళీ అవడం ఖాయం. విజ్ఞులైన ప్రజలకు అన్నీ తెలుసు.
 
ఆం: మీకు ఈ సారైనా అవకాశం వస్తుందా..?
ఎమ్మెన్‌: 32 యేళ్లుగా పార్టీలో ఉన్నా. గతంలో బీ-ఫారం ఇచ్చి చివరి నిమిషంలో వద్దని చెప్పినా.. చంద్రబాబుగారి మీద గౌరవంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. పదవులు లేకున్నా నియోజకవర్గంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటు వస్తున్నా. ఈ సారి రాష్ట్ర నాయకత్వమే నాకు అవకాశం ఇస్తామని చెప్పింది. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం.
Link to comment
Share on other sites

ఓటర్లలో ‘శేర్‌’లింగంపల్లి!
10-09-2018 03:45:10
 
  • అత్యధిక ఓటర్లు అక్కడే
  • అతి తక్కువతో చివరి స్థానంలో భద్రాచలం
  • పలు స్థానాల్లో తగ్గిన ఓటర్ల సంఖ్య
  • కుత్బుల్లాపూర్‌లో 1.86 లక్షల తగ్గుదల
హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం... రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 5,34,221 మంది ఓటర్లు ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గం 1,25,552 మంది ఓటర్లతో చివరి స్థానంలో ఉంది. అత్యల్ప సంఖ్యలో ఓటర్లతో భద్రాచలం తర్వాత వరుసగా అశ్వారావుపేట, బెల్లంపల్లి, బాన్సువాడ, చెన్నూరు, సంగారెడ్డి నియోజకవర్గాలున్నాయి. అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో శేరిలింగ ంపల్లి తర్వాత వరుసగా మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీ నగర్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలున్నాయి. 2014 ఓటర్ల జాబితాతో పోల్చితే.. ప్రస్తుత జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
 
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 2014 ఎన్నికల సమయంలో 6,10,204 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4,23,704కు పడిపోయింది. ఏకంగా 1,86,204 ఓట్లు తగ్గిపోయాయి. అలాగే శేరిలింగంపల్లిలో కూడా సుమారు 60 వేల ఓట్లు తగ్గాయి. వీటితోపాటు భద్రాచలంలో 91 వేలు, అశ్వారావుపేట 38 వేలు, పిన పాకలో 10 వేల ఓట్లు తగ్గిపోయాయి. ఈ మూడు నియోజకవర్గాల్లోని కొంత భూభాగాన్ని ఏపీలో కలపడంతో ఆ మేరకు ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది.
 
voters-1.jpg 
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

intiki okati rendu votes tisaru

People need to put case on EC, Modi & Jr. Modi (KCR). Though courts also puppets for Modi's still need to make big issue out of it.

For removing votes without any information to Voter.

Link to comment
Share on other sites

ఏబీఎన్ ఎఫెక్ట్: అభ్యర్థులను మార్చండి.. లేదంటే పరువుపోతుంది
10-09-2018 10:17:26
 
636721716405197878.jpg
  • రెబల్స్‌నుంచి పెరుగుతున్న ఒత్తిడి
  • పాలకుర్తిలో పాగావేసిన ‘తక్కెళ్లపల్లి’
జనగామ: నిన్నటివరకు కేవలం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికే పరిమితమైన నిరసనలు ఆదివారం జిల్లాలోని జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు పాకాయి. ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘‘15మంది మారే చాన్స్‌’’ కథనం కలకలం సృష్టించింది. ఈ కథనంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి నేతలు తమ గళాన్ని విప్పారు. జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలలో అసమ్మతి సెగలు సిట్టింగ్‌లకు తలనొప్పిగా మారాయి.
 
జనగామ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేకత కలిగివున్న తాజామాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కేటాయించిన టికెట్‌ను వెంటనే రద్దుచేయాలని నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు డిమాండ్‌ చేయడంతో నియోజకవర్గంలో పరిస్థితులు వేడెక్కాయి. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలతోపాటు జిల్లాకేంద్రంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌ్‌సలో ఆప్కోమాజీ చైర్మన్‌ మండలశ్రీరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా నాయకులు కొండం మధుసూదన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ముత్తిరెడ్డి టికెట్‌ను రద్దుచేసి స్థానికుల్లో ఎవరికైనా కేటాయిస్తే విజయం సాధించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని తెలిపారు. జనగామ పట్టణపార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పారపు ఆనంద్‌, యువజన విభాగం అధ్యక్షుడు గుజ్జుక రాజు, మైనార్టీసెల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్‌ జహంగీర్‌ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముత్తిరెడ్డి వల్ల పార్టీ పరువుపోతుందని ఆయనను మార్చాలని డిమాండ్‌ చేశారు.
 
పాలకుర్తికి తాకిన సెగ..
గులాబీ పార్టీ సీట్ల కేటాయింపు సెగ పాలకుర్తి నియోజకవర్గానికి తాకింది. ఆదివారం వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాలకుర్తిలో తన అనుయాయులతో భారీ సమావేశం నిర్వహించారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి పాలకుర్తి టికెట్‌ తనకు కేటాయించాలని కోరనున్నట్లు చెప్పడంతో ఎర్రబెల్లి వర్గీయులు అయోమయంలో పడాల్సి వచ్చింది. రవీందర్‌రావు సమావేశానికి ముందు సోమన్న ఆలయంలో తన జన్మదినం సందర్భంగా పూజలుచేసి ర్యాలీగా స్థానిక ఫంక్షన్‌హాల్‌కు వెళ్లి అక్కడ సమావేశం నిర్వహించడం విశేషం.
 
12న చలో హైదరాబాద్‌..
స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ రాజయ్యకు కేటాయించకుండా మరెవరికైనా కేటాయించాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈనెల 12న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రాజయ్యకు వ్యతిరేకంగా శనివారం రెండు మండలాల్లో సమావేశాలు నిర్వహించిన నాయకులు ఆదివారం చిలుపూరు మండలం పల్లగుట్టలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీ జగన్మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ స్వామినాయక్‌, అధికార ప్రతినిధి బెలిదె వెంకన్న, రఘునాథపల్లి ఎంపీపీ దాసరి అనిత, జడ్పీటీసీ బానోతు శారద, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మారపాక ఇసాక్‌ పాల్గొని విస్తృతంగా చర్చించారు. రాజయ్యకు ఇచ్చిన టికెట్‌ను వెంటనే రద్దుచేయాలని తీర్మానించారు.
Link to comment
Share on other sites

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ 80కి పైగా స్థానాలు సాధిస్తుందని తెలుగుదినపత్రిక ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రముఖ జర్నలిస్టు రాధాకృష్ణ తన వ్యాసం కొత్తపలుకు లో రాయడంపై పలు రకాలైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఏ ప్రాతిపదికన టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు ? ఆయన రాసిన రాతలకు విశ్వసనీయత ఉందా ? ఎందుకు ఈ విధమైన రాతలు రాశారనే దానిపై అటు రాజకీయ నాయకుల్లోనూ, అటు సోషల్‌ మీడియా వేదికగా పలు రకాలైన విమర్శలు వస్తున్నాయి. కేవలం రెండు వారాల ముందు ముందస్తు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనని రాసిన రాధాకృష్ణ ఈ రోజు టిఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలుస్తుందని, అదీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు క్షేత్రస్థాయిలో టిఆర్‌ఎస్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసిందీ ఆయనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవనీ చెప్పిందీ ఆయనే దిగువ స్థాయిలో సంతృప్తి లేదని టిఆర్‌ఎస్‌పై అసంతృప్తి ఉందని రాసిన ఆయన ఈ రోజు టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని రాయడంపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, విమర్శలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు రాధాకృష్ణ రెండు వారాల్లోనే ఇలా రాశాడు అనే

ABN-Radhakrisha.jpg

దానిపై తీవ్ర స్థాయిలో కలకలం చెలరేగుతోంది.అయితే దేనికి ఇలా జరిగింది అని ఆరా తీస్తే కొన్ని వందల కోట్ల రూపాయిల ప్రాజెక్ట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే కొన్ని రోజుల ముందే  ఆర్కే సమీప బంధువు కి ఇచ్చారని, దాని కోసం ఆర్కే సడెన్ యు టర్న్  తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఎలాట్ అవ్వటంతోనే చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు కాంగ్రెస్-టిడిపి కలిసి పోటీ చేస్తే టీఆరెస్ భారీ గా దెబ్బ తింటుంది అని అందరు అంటున్న తరుణంలో ఆర్కే యు టర్న్ తీసుకోవటం ఎక్కువ మందికి రుచించట్లేదు. ఆగస్టు26న ఆయన రాసిన కొత్తపలుకు వ్యాసంలో కాంగ్రెస్‌,టిడిపి పొత్తు పెట్టుకుంటే టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనన్నారు. టిడిపి ఇంకా క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు టిడిపి వైపే ఉన్నారని వారితో కాంగ్రెస్‌ గెలిస్తే టిఆర్‌ఎస్‌ గట్టెక్కడం కష్టమని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసినా టిఆర్‌ఎస్‌దే విజయమని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా తెలంగాణలో కెసిఆర్‌ను ఓడించడం కష్టమని చంద్రబాబు పొత్తులగురించి ఆలోచించకుండా ఆంధ్రా రాజకీయాల గురించి చూసుకుంటే మంచిదని సలహా ఇవ్వడంపై అటు తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు, ఇటు ఆంధ్రాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ స్వయం ప్రయోజనాల కోసం టిడిపితో ఆడుకుంటున్నారని ఆయనకు చంద్రబాబు ఇచ్చిన చనువుతోనే చివరకు ఎవరితో పొత్తు ఉండాలో ఎవరితో పొత్తు ఉండకూడదో ఆయనే నిర్ణయిస్తున్నారని విమర్శిస్తున్నారు. తాను చెప్పినట్లు చంద్రబాబు ఆడకపోతే బ్లాక్‌మెయిలింగ్‌ రాతలకు పాల్పడుతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు.

Link to comment
Share on other sites

టీఆర్‌ఎస్‌కు టికెట్ల సెగ
10-09-2018 03:25:29
 
636721467271480240.jpg
  • కూకట్‌పల్లిలో కృష్ణారావుపై కార్పొరేటర్ల తిరుగుబాటు
  • జనగామలో ముత్తిరెడ్డిపై నేతల ఆగ్రహ జ్వాల
  • మానకొండూర్‌లో టవర్‌ ఎక్కిన యువకులు
  • మధిరలో బొమ్మెర ఆవేదన సభ
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)
సిట్టింగ్‌ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంతో.. టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు.. ఒత్తిళ్ల తీవ్రతను పెంచారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా.. రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు సవాళ్లు విసురుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల దిష్టిబొమ్మలు దహనం చేయగా.. మరికొన్ని చోట్ల నిరసనల ద్వారా తమ గళం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ జగదీశ్వర్‌గౌడ్‌ అనుచరులు ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. తమ నాయకుడికే టికెట్‌ ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నాంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా స్థానికేతరుడైన ఆనందకుమార్‌ను ఎలా ప్రకటిస్తారని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.
 
 
ఈవిషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎ్‌సవీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కూకట్‌పల్లి అభ్యర్థి కృష్ణారావు తరఫున తాము ప్రచారం చేయబోమని నలుగురు కార్పొరేటర్లు, పలువురు సర్పంచ్‌లు తేల్చిచెప్పారు. మరోవైపు ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు వ్యవహరిస్తున్నారు. బాల్కొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం లక్కోరలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ బాల్కొండలో తన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి టికెట్‌ స్థానికులకే ఇవ్వాలంటూ పలువురు నాయకులు మోత్కూరులో రాస్తారోకో చేశారు.
 
 
మండల శ్రీరాములు నేతృత్వంలో సమావేశం
జనగామలో ముత్తిరెడ్డి నిలబడితే.. చేజేతులా సీటు వదులుకోవాల్సి వస్తుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. చేర్యాలలో సీనియర్‌ నాయకుడు మండల శ్రీరాములు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి టికెట్‌ను రద్దు చేసి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తూ పల్లగుట్టలో నియోజకవర్గ నేతలు సమావేశమయ్యారు. పాలకుర్తిలో తక్కెళ్లపల్లి రవీందర్‌రావు... తన అనుయాయులతో సమావేశం నిర్వహించారు.
 
 
పలు ప్రాంతాల్లో నిరసనలు
కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ టికెట్‌ను రసమయి బాలకిషన్‌కు కేటాయించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ ఓరుగంటి ఆనంద్‌ అనుచరులు ముగ్గురు టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. నారాయణఖేడ్‌లో తాజామాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు నాయకులు ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణఖేడ్‌ టికెట్‌ను బీసీకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మధిర టికెట్‌ దక్కని బొమ్మెర రామ్మూర్తి ఆవేదన సభ నిర్వహించారు.
 
 
పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు ఓట్లు వేయకూడదని కొమ్మునకిరిపేటలోని 25 కుటుంబాలు నిర్ణయించాయి. సత్తుపల్లిలో టికెట్‌ దక్కని మట్టా దయానంద్‌ తన వర్గీయులను కలుసుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ను కేటాయించాలని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ, మనుమయ, స్వర్ణకార సంఘాలు, బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో వారుమాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం ఇచ్చిన వారికే మద్దతు ఉంటుందన్నారు.
Link to comment
Share on other sites

టీ.కాంగ్రెస్‌లో పొత్తుల చిచ్చు
10-09-2018 16:24:30
 
636721934704290269.jpg
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పొత్తుల చిచ్చు మొదలైంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండారు లక్మారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. పొత్తుల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్ గౌడ్ బరిలో దిగుతారనే ప్రచారం నేపథ్యంలో సైనికపురిలోని క్యాంపు కార్యాలయంలో తన అనుచరులతో లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. ఇదిలాఉండగా.. వైరా సీటును సీపీఐకి ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ‌వద్ద ఆందోళనకు దిగారు.
Link to comment
Share on other sites

సోనియాను కలిసేందుకు కొండా దంపతుల ప్రయత్నాలు!
10-09-2018 18:31:20
 
636722010809253439.jpg
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాకిచ్చిన కేసీఆర్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సీట్ల కేటాయింపుపై కొందరు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా ఆందోళనలు నిర్వహిస్తారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఏకంగా టీఆర్‌ఎస్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. అసెంబ్లీ రద్దు అనంతరం తొలి విడతగా ఏకంగా 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఇందులో ఇద్దరు సిట్టింగ్‌లు బాబూమోహన్‌ (ఆందోల్‌), నల్లాల ఓదెలు (చెన్నూర్‌)కు టికెట్‌ దక్కలేదు. మరో ఐదు చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు. మేడ్చల్‌, మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్‌, వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగులే ఉన్నా వాళ్ల అభ్యర్థిత్వాన్ని వారం, పది రోజుల్లో నిర్ణయిస్తామని సందిగ్ధంలో పెట్టారు.
 
 
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే సామెతను కొందరు నేతలు అనుసరిస్తున్నట్లున్నారు. కాంగ్రెస్‌లో చేరి తాము కోరుకుంటున్న సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ దంపతులు, కాంగ్రెస్ నేత సోనియాను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 12న హైదరాబాద్‌లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. ఈ సభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పాల్గొననున్నారు. ఆయన సమక్షంలో కొండా దంపతులు, డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, నందీశ్వర్‌గౌడ్, ఆకుల రాజేందర్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
 
Tags : konda sureka, konda murali, Congress
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...