Jump to content

TTDP


sonykongara

Recommended Posts

కాంగ్రెస్-టీడీపీ పొత్తుకు లైన్ క్లియర్!?
08-09-2018 18:27:07
 
636720280272323740.jpg
హైదరాబాద్: కాంగ్రెస్, టీటీడీపీలు పొత్తుపై లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు విషయంలో దాదాపు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. శనివారం గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తుపై కార్యకర్తల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి.? పొత్తుపై ఏమనుకుంటున్నారు. టీడీపీ నేతల మధ్య ఏమైనా భిన్నాభిప్రాయాలున్నాయా.. వీటన్నింటీపై జిల్లాల వారిగా తెలుసుకునే పనిలోపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 
తెలంగాణలో పొత్తు విషయమై టీడీపీతో చర్చించాలని ముగ్గురు కీలక నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తలొచ్చాయి. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. కొద్దిసేపటి క్రితం టీటీడీపీ నేత ఎల్. రమణ కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉటుందనే విధంగా సంకేతాలివ్వడం.. ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే పొత్తుపై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. పొత్తులకు సంబంధించి రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకుంటే టీడీపీకి కొన్ని జిల్లాల్లో బలమైన క్యాడర్ ఉంది. టీడీపీ బలం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే టీఆర్‌ఎస్ ఓడించడం ఖాయమని ఆ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 893
  • Created
  • Last Reply

#సొంతగూటికి మొవ్వా సత్యనారాయణ శేరిలింగంపల్లి నియోజక వర్గం గ్రేటర్ హైద్రాబాద్ మరి కాసేపట్లో @ncbn సమక్షంలో టీటీడీపీ లో చేరిక ?

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

#సొంతగూటికి మొవ్వా సత్యనారాయణ శేరిలింగంపల్లి నియోజక వర్గం గ్రేటర్ హైద్రాబాద్ మరి కాసేపట్లో @ncbn సమక్షంలో టీటీడీపీ లో చేరిక ?

Avasarama ilanti vallu..malli pothaaru ilanti vallu..

Link to comment
Share on other sites

నేడు బాబుతో భేటీ కానున్న టీ టీడీపీ నేతలు
09-09-2018 10:13:39
 
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆదివారం తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే టీ టీడీపీ నేతలు ప్రచార కమిటీల జాబితాను కూడా సిద్ధం చేశారు. అధినేత చంద్రబాబు ఆమోదంతో మూడు కమిటీలను టీ టీడీపీ ఇవాళ ప్రకటించనున్నట్లు తెలియవచ్చింది.
Link to comment
Share on other sites

తెలంగాణలో తెదేపా ఉండాలి
‘తెలంగాణ గడ్డపై తెదేపా ఉండటం అవసరం. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందంటే దాని వెనుక కష్టపడింది తెదేపానే. నేను తెలంగాణకు సీఎం కావడానికి వీలుండదు. పార్టీ తెలంగాణ నేతలే సమష్టిగా సమర్థంగా ముందుకెళ్లాలి. నేను అండగా ఉండి సహకరిస్తా. తెదేపా నుంచి వెళ్లినవాళ్లు మళ్లీ వస్తామంటున్నారు. ఆహ్వానించి పార్టీని కాపాడుకోవాలి. అభివృద్ధిలో ఎప్పుడూ ఒకటీ, రెండు స్థానాల్లో తెలంగాణ, ఏపీ ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏపీలో మంచి నగరాన్ని అభివృద్ధి చేయాలని అమరావతిని నిర్మిస్తున్నాం. తెలుగు జాతి మధ్య విభేదాలు వద్దు. సమన్యాయంతో విభజన చేయమన్నాం. నేను ఎప్పుడూ విభజనను వ్యతిరేకించ లేదు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ సమయంలో ఆరున్నరేళ్లపాటు ఎన్డీఏ సుస్థిర పాలనకు తెదేపా సహకరించింది. మంత్రి పదవులు ఇస్తామని వాజ్‌పేయి చెప్పినా వద్దన్నాం.’

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

తెలంగాణలో తెదేపా ఉండాలి
‘తెలంగాణ గడ్డపై తెదేపా ఉండటం అవసరం. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందంటే దాని వెనుక కష్టపడింది తెదేపానే. నేను తెలంగాణకు సీఎం కావడానికి వీలుండదు. పార్టీ తెలంగాణ నేతలే సమష్టిగా సమర్థంగా ముందుకెళ్లాలి. నేను అండగా ఉండి సహకరిస్తా. తెదేపా నుంచి వెళ్లినవాళ్లు మళ్లీ వస్తామంటున్నారు. ఆహ్వానించి పార్టీని కాపాడుకోవాలి. అభివృద్ధిలో ఎప్పుడూ ఒకటీ, రెండు స్థానాల్లో తెలంగాణ, ఏపీ ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏపీలో మంచి నగరాన్ని అభివృద్ధి చేయాలని అమరావతిని నిర్మిస్తున్నాం. తెలుగు జాతి మధ్య విభేదాలు వద్దు. సమన్యాయంతో విభజన చేయమన్నాం. నేను ఎప్పుడూ విభజనను వ్యతిరేకించ లేదు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ సమయంలో ఆరున్నరేళ్లపాటు ఎన్డీఏ సుస్థిర పాలనకు తెదేపా సహకరించింది. మంత్రి పదవులు ఇస్తామని వాజ్‌పేయి చెప్పినా వద్దన్నాం.’

 

Link to comment
Share on other sites

నేను తెలంగాణకు సీఎం కావడానికి వీలుండదు. పార్టీ తెలంగాణ నేతలే సమష్టిగా సమర్థంగా ముందుకెళ్లాలి. e mata tappu emi undi asalu abn vadi andham tappa

Link to comment
Share on other sites

చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్యనేతల భేటీ
09-09-2018 11:20:32
 
636720888290713745.jpg
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేశారు. వాటిపై చంద్రబాబుతో చర్చిస్తున్నారు. అధినేత ఆమోదం తర్వాత టీటీడీపీ మూడు కమిటీలను ప్రకటించనుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి టీటీడీపీ నేతలు చేరుకున్నారు. ఎన్నికలకు సంసిద్ధం కావాలని చెప్పి దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు... ముందుగా మూడు కమిటీలను సిద్ధం చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా టీటీడీపీ నేతలు మూడు కమిటీలను సిద్ధం చేశారు. దానికి చంద్రబాబు ఆమోద ముద్ర వేసినట్లుగా తెలియవచ్చింది. పొత్తుల సంప్రదింపుల కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఎల్ రమణ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు తెలియవచ్చింది. తర్వాత ప్రజలందరినీ ఆకర్షించే విధంగా అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేయడానికి 10 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రావుల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే ప్రచారకమిటీని కూడా నేతలు రూపొందించారు. ఈ కమిటీలను చంద్రబాబు ఆమోదం తెలపగానే టీటీడీపీ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
Link to comment
Share on other sites

పొత్తులపై చర్చలకు సరే!
తెలంగాణ ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు తెదేపా సిద్ధమైంది. తెరాస, భాజపాలతో కలసివెళ్లే పరిస్థితి లేనందున మిగతా పార్టీలు చర్చలకు ముందుకొస్తే మాట్లాడాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై శనివారం ఉదయం, సాయంత్రం తెలంగాణ నేతలతో చంద్రబాబు రెండు దఫాలుగా సమీక్షించారు. పొత్తులపై హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల కోసం పార్టీలో రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మేనిఫెస్టో, ప్రచార, సంప్రదింపుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ప్రధానంగా పోటీ చేసే స్థానాలు, టిక్కెట్ల కేటాయింపుల్లో తలెత్తే సమస్యలపై ముందు అవగాహనకు రావాలని సూచించారు.

60 మంది ఆశావహులు.. చంద్రబాబు ఎన్టీఆర్‌భవన్‌కు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. పలువురు నాయకులు తమ అనుచరులతో వచ్చి హంగామా చేశారు. తాము పోటీ చేస్తామని ఇప్పటికే 60 మంది వరకూ దరఖాస్తులిచ్చినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

తెలుగుదేశం గూటికి మోహన్‌లాల్‌
09-09-2018 12:24:19
 
636720926570166519.jpg
  • పొత్తులో భాగంగా మానుకోట సీటు కోసం ప్రయత్నాలు
 
(మహబూబాబాద్‌, ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌, టీడీపీల మధ్య పొత్తులో మహబూబాబాద్‌ అసెంబ్లీ సీటుపై ఉత్కంఠత చోటు చేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి మహబూబాబాద్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ రాష్ట్ర నాయకుడు, వీఆర్‌ఎస్‌ తీసుకున్న రాష్ట్ర స్థాయి ఎక్సైజ్‌ ఉన్నతాధికారి బానోత్‌ మోహన్‌లాల్‌  హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో మాతృ సంస్థ టీడీపీలో చేరడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా కండువా కప్పి మోహన్‌లాల్‌ను పార్టీలో తీసుకోవడం నియోజకవర్గంలో కొత్త చర్చకు తెరతీసింది. కాంగ్రెస్‌, టీడీపీల పొత్తు దాదాపు క్లైమాక్స్‌కు చేరుకున్న క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయిన సందర్భంగా బానోత్‌ మోహన్‌లాల్‌ తన సతీమణి లక్ష్మిదేవితో కలిసి టీడీపీలో చేరడం వెనక ఆంతర్యం రాజకీయ కోణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
 
బాబు ఆశీస్సులతోనే..
డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారిగా ఉన్న మోహన్‌లాల్‌ ఎన్నికల బరిలో దిగాలన్న వ్యూహంతో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆశీస్సులతో 2013 ఆగస్టు 30న వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఆపై సెప్టెంబర్‌ 19న చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ లో చేరారు. 2014 ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆపై మారిన రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆశీస్సులతో పాలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
 
 
అప్పట్లోనే మహబూబాబాద్‌ అసెంబ్లీ టికెట్‌పై పార్టీ ముఖ్యులతో హామీ పొందినట్లు తన ఫాలోవర్స్‌కు చెబుతూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మోహన్‌లాల్‌ మహబూబాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు చేరువయ్యారు. తాజాగా పార్టీ సుప్రీం కేసీఆర్‌ సిట్టింగ్‌లకే సీట్ల ప్రకటన చేయడంతో టికెట్‌ చేజారి కంగుతిన్నారు. ఆ వెంటనే తన అనుయాయులతో మహబూబాబాద్‌ అత్యవసర భేటీ నిర్వహించుకుని రాత్రికి రాత్రే యూటర్న్‌ తీసుకున్నారు.
 
స్పష్టమైన హామీతో టీడీపీ..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో మహబూబాబాద్‌ టికెట్‌పై స్పష్టమైన హామీ పొంది టీడీపీలో చేరినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీల మధ్య పొత్తులో మహబూబాబాద్‌ను కోరే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. మహబూబాబాద్‌లో టీడీపీకున్న పట్టును ప్రస్తావిస్తూ ఈసారి కాంగ్రెస్‌ పొత్తులో మహబూబాబాద్‌ టీడీపీకి ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

కొండా’ దంపతుల రాకతో మారుతున్న సమీకరణాలు
09-09-2018 12:46:09
 
636720939663708587.jpg
  • ‘పరకాల’లో రాజకీయ వేడి
  • ఉత్సాహంలో పాత క్యాడర్‌
  • పొత్తు కోసం పట్టుబడుతున్న టీడీపీ
(ఆంధ్రజ్యోతి, వరంగల్‌ రూరల్‌)
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో టికెట్‌ దక్కకపోవడంతో కొండా దంపతులు.. కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీ చేస్తారని వార్తలు గుప్పుమంటుండటం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ వేదికగా కొండా సురేఖ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తాము పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. కొండా దంపతుల రాకతో వారి వర్గానికి చెందిన వారంతా జత కట్టేందుకు రెడీ అవుతుండడంతో టీఆర్‌ఎస్‌లో చీలికలు వచ్చేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ టీఆర్‌ఎ్‌సలో అన్ని గ్రూపులు కలిసి పనిచేశాయి. గతంలో కొండా వర్గంగా ఉన్న వారు సైతం పరకాలలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి, స్థానిక నేతలకు సహకరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలోని అధికార పార్టీలో ముసలం మొదలైంది.
 
మంతనాల్లో కొండా వర్గం
పరకాల నియోజకవర్గంలో పరకాల, గీసుగొండ, సంగెం, దామెర, ఆత్మకూరు మండలాలున్నాయి. కొండా దంపతుల సొంత మండలం గీసుగొండ. వారు ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. కొండా దంపతులు పార్టీ మారితే పరకాల నుంచే పోటీ చేస్తారని వారి వర్గం బలంగా నమ్ముతోంది. ఇదే నిజమైతే ఇన్నా ళ్లూ పంటికింద నొప్పి భరిస్తూ మరో దగ్గరున్న నాయకులు, కార్యకర్తలంతా కొండా పక్షాన నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక గీసుగొండ ప్రాంతంలో కొండా వీర విధేయులుగా చాలా మంది ఉన్నారు. ఇటీవల ఎంపీపీపై అవిశ్వాస పరీక్ష సమయంలో గతంలో కొండా వర్గానికి చెందిన ఎంపీటీసీని చల్లా వర్గం వారు ఎంపీపీగా ఎన్నిక చేశారు. తాజాగా సమీకరణాలు మారిపోవడంతో ఇప్పుడు అధికార హోదాలో ఉన్నవారంతా ఎటువైపు ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాత క్యాడరంతా ఫోన్లు చేస్తూ నాయకుడు మన ప్రాంతానికే వస్తున్నాడంటూ కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారు. అయితే పోటీకి కొండా దంపతులతో పాటు, వారి కుమార్తె సుస్మితాపటేల్‌ సై అంటుండటంతో ముగ్గురిలో పరకాల బరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. 2009లో సురేఖ పరకాల నుంచి గెలుపొంది మంత్రి అయిన విషయం విదితమే.
 
 
టీడీపీ సై..
పరకాల నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని తప్పించేందుకు ప్రతిపక్ష పార్టీలు గురిపెట్టాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. పరకాల తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ స్థానం కావడంతో టీడీపీ కన్నేసింది. తమ పార్టీ గుర్తుతో గత ఎన్నికల్లో గెలుపొందిన ఈ స్థానాన్ని తమకే వదిలిపెట్టాలంటూ కాంగ్రెస్‌తో జరిగిన మంతనాల్లో పట్టుపట్టినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ సైతం ఈ స్థానం తమకు వదిలి పెట్టాలని వాదిస్తున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ పొత్తుల విషయం స్పష్టమైన అనంతరం ఈ రెండు పార్టీల నుంచి అభ్యర్థులెవరో తేలనుంది.
Link to comment
Share on other sites

దేశం’ చూపు.. శివార్ల వైపు
పొత్తు పొడిచినా వదలొద్దంటున్న శ్రేణులు
ఆ 8 నియోజకవర్గాలపై నేతల మనోగతం
hyd-gen6a.jpg

ఈనాడు-హైదరాబాద్‌ : ‘తెదేపా తరపున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలిచినవారితోపాటు కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లినా ఇంకా జనంలో అభిమానం అలానే ఉంది..  ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందే.. ప్రత్యేకించి గత ఎన్నికల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో గెలిచిన 8 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలి.. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా ఆ స్థానాల్లోనూ మన అభ్యర్థులే ఉండాలి’.. ఇదీ శివారు నియోజకవర్గాల్లో తెదేపా స్థానిక నాయకుల మనోగతం. ఇదే విషయాన్ని ముఖ్య నాయకులను కలిసి విన్నవించుకుంటున్నారు.

ప్రయత్నాలు ఇలా...
* మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో గతసారి తెదేపా తరపున గెలిచిన తీగల కృష్ణారెడ్డి తర్వాత తెరాసలో చేరారు. ఈ నియోజకవర్గంలో తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌కు గట్టి పట్టు ఉందని, ఆయన ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

* శేరిలింగంపల్లి: ఇక్కడ 2014 ఎన్నికల్లో తెదేపా తరఫున అరెకపూడి గాంధీ పోటీ చేసి గెలిచారు. ఆయన కూడా తెరాసలో చేరిపోయారు. అయినా ఇక్కడ తెదేపా బలమైన శక్తిగానే ఉందన్నది కార్యకర్తల అభిప్రాయం. తాజాగా తెరాసలో అసంతృప్తికి గురైన మొవ్వ సత్యనారాయణ తదితరులు మళ్లీ తెదేపాలో చేరిపోయారు. ఆయన టిక్కెట్టు ఆశిస్తున్నారు. అంతేకాకుండా తెదేపా తరఫున ఒక ప్రముఖ సినీ నటుడిని బరిలో పెట్టాలని మరికొందరు ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* ఉప్పల్‌: ఇక్కడ తెదేపాకు గట్టి పునాది ఉందని, అలానే ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌కు కీలక అనుచరణ గణం ఉందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గత ఎన్నికల్లో తెదేపా మద్దతు భాజపా అభ్యర్థి విజయానికి దోహదపడిందన్నది వీరి మాట. ఈసారి దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ పోటీ చేసే అవకాశం ఉంది.

* కూకట్‌పల్లి: తెదేపా తరఫున మాధవరం కృష్ణారావు విజయం సాధించి తదనంతర పరిణామాల్లో తెరాసలో చేరారు. కేపీహెచ్‌బి డివిజన్‌లో తెదేపా అభ్యర్థి మందడి శ్రీనివాసరావు విజయబావుటా ఎగరవేశారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి కూడా యోచిస్తున్నట్లు ప్రచారం ఉంది.

* ఇబ్రహీంపట్నం:  తెదేపా తరపున మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లోనూ పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత గులాబీ గూటికి చేరారు. ఆయనతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులూ తెరాసలోకి వెళ్లినా ఇప్పటికీ తెదేపాకు బలమైన క్యాడర్‌ ఉందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి తప్పనిసరిగా పోటీకి దిగాలని కోరుతూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లారు.

* రాజేంద్రనగర్‌: తెదేపా తరపునే ప్రకాశ్‌ గౌడ్‌ రెండుదఫాలుగా విజయం సాధించారు. అనంతరం కారెక్కారు. తెదేపా ప్రాతినిధ్యం ఈసారి ఉండాలని స్థానిక నాయకులు  తెదేపా అధ్యక్షుడు రమణను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. సామా భూపాల్‌రెడ్డి, మ్యాడం రామేశ్వరరావు, వేణుగోపాల్‌, గణేశ్‌గుప్తా టిక్కెట్లు ఆశిస్తున్నారు.

* ఎల్‌బీనగర్‌: గత ఎన్నికల్లో తెదేపా తరఫున ఆర్‌.కృష్ణయ్య గెలిచిన విషయం తెలిసిందే. ఇక్కడ పార్టీకి ఓటు బ్యాంకు బాగానే ఉందని, ఈసారి సీటును వదులుకోకూడదని స్థానిక నేతలు భావిస్తున్నారు. కంటోన్మెంట్‌లోనూ ఇదే యోచనలో ఉన్నారు.

Link to comment
Share on other sites

ఎల్‌బీనగర్‌: గత ఎన్నికల్లో తెదేపా తరఫున ఆర్‌.కృష్ణయ్య గెలిచిన విషయం తెలిసిందే. ఇక్కడ పార్టీకి ఓటు బ్యాంకు బాగానే ఉందని, ఈసారి సీటును వదులుకోకూడదని స్థానిక నేతలు భావిస్తున్నారు. కంటోన్మెంట్‌లోనూ ఇదే యోచనలో ఉన్నారు.

krishna prasad unnada tdp lo nbk chuutam anukunta 2009 lo poti chesi odipoyadu

Link to comment
Share on other sites

స్పీడ్ పెంచిన టీడీపీ... ఉత్తమ్‌కు రమణ ఫోన్
09-09-2018 15:32:01
 
636721039184285318.jpg
 
హైదరాబాద్: టీటీడీపీ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పొత్తులపై రాష్ట్ర నేతలకే సీఎం చంద్రబాబు అధికారాలిచ్చిన విషయం తెలిసిందే. పొత్తుల నిర్ణయం తెలంగాణ నేతలదేనని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రచారం చేయబోనని పరోక్షంగా చెప్పారు. తెలంగాణలో పార్టీ బాగు కోసం ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ నేతలు సమష్టిగా పనిచేయాలని కోరారు. ఎన్నికల్లో పోరాడండి.. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌తో వెళ్లాల్సి వచ్చినా నేతలే ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం పార్టీ పనిచేయాలని, సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ఇక్కడికి రాలేనని స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పొత్తులపై చర్చలకు సంప్రదింపుల కమిటీ రంగంలోకి దిగింది. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం ఉత్తమ్‌తో కూడా సమావేశం కానున్నారు.
 
 
టీటీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను టీడీపీ సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎలక్షన్ పబ్లిసిటీ కమిటీ ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై దాదాపుగా క్లారిటీ !
09-09-2018 16:17:22
 
636721066395357199.jpg
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధినేతకు సూచించినట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. పొత్తుపై తమ సూచనలను చంద్రబాబు ఆమోదించారని ఆయన తెలిపారు. నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ తమకు ఇచ్చారని ఆయన చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలకు సంబంధించి కాస్త గందరగోళం నెలకొందని తెలిపారు. తెలంగాణలో టీడీపీ కోసం చంద్రబాబు అవసరమైన చోట ప్రచారంలో కూడా పాల్గొంటారని ఎల్.రమణ స్పష్టం చేశారు.
 
కాంగ్రెస్‌తో పొత్తును టీడీపీ శ్రేణులు అర్థం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, టీటీడీపీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను ప్రకటించారు. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎలక్షన్ పబ్లిసిటీ కమిటీ ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...