Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
On 10/25/2018 at 4:27 AM, sonykongara said:
‘కూకట్‌పల్లి టికెట్‌.. కాపులకే కేటాయించాలి’
25-10-2018 13:29:22
 
కూకట్‌పల్లి/ హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ కాపులకే కేటాయించాలని కాపు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కూకట్‌పల్లి అధ్యక్షుడు అరిటాకుల రమే్‌షబాబు కోరారు. నియోకవర్గంలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న కాపు కులానికి చెందిన అభ్యర్థులకు.. ఆయా పార్టీల నాయకులు టికెట్‌ కేటాయించాలన్నారు. కాపు నాయకుడికి ఏ పార్టీ.. టికెట్‌ కేటాయిస్తే ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాపులకు టికెట్‌ కేటాయించలేదని, ఈ సారైనా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Ok, AP lone anukunna..ikkada kuda veella pathi eeparan idhena..

Link to comment
Share on other sites

24 minutes ago, niceguy said:

Aalu gaddalodu place evariki isthunnaro thelusa??

Marri sasidhar Reddy ... Secunderabad place lo Sanath Nagar teesukontey baagundedi.. koona Venkatesh gaud easy ga gelicheyvaadu.. aalugaddalodu TDP candidate chethilo vodipotey aa kick ey veru.. Venkatesh gaud ki Secunderabad istaaru .. hmm

Link to comment
Share on other sites

టీడీపీ స్వీప్ చేసిన స్థానాల్లో టెన్షన్.. టెన్షన్‌..!
02-11-2018 12:02:02
 
636767570059931848.jpg
రంగారెడ్డి: మహాకూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల పంచాయితీ ఇంకా తెగకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్‌ మరింత పెరుగుతోంది. ఎవరికెన్ని సీట్లు అనేది దాదాపు తేలినా.. ఏవేవి ఎవరికనేది ఇంకా తేలలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ తాము గతంలో గెలిచిన సీట్లన్నీ ఇవ్వాలని కోరుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నగర శివార్లలో దాదాపు సీట్లన్నీ స్వీప్‌ చేసింది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గానూ టీడీపీ, బీజేపీ కూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇవన్నీ కూడా నగర శివారు ప్రాంతాలే. ఇందులో టీడీపీ ఏడు స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి గెలిచిన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. ఎల్‌బీనగర్‌ నుంచి టీడీపీ తరుపున గెలిచిన ఆర్‌ కృష్ణయ్య ఒక్కరే ఆ పార్టీ తరుపున మిగిలారు.
 
ఆయన కూడా టీడీపీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల మాత్రం తాను టీడీపీలోనే ఇంకా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఒక వేళ పొత్తుల్లో కొన్ని వదులుకోవాల్సి వచ్చినా కనీసం నాలుగు స్థానాలు ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఇక్కడ టికెట్టు ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతలు గాబరా పడుతున్నారు. అలాగే టీజేఎస్‌, సీపీఐ కూడా జిల్లాల్లో కొన్ని స్థానాలు కోరుతున్నాయి. ఇందులో మల్కాజిగిరి, తాండూరు సీట్లు కావాలని టీజేఎస్‌ గట్టిగా పట్టుబడుతోంది. ఈ ప్రాంతాల్లో పోటీ చేసేందుకు కాంగ్రె్‌సకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కూటమి తరపున ఇప్పటి వరకు ఒక్క పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఉప్పల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ బండారు లక్ష్మారెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరడంతో టీడీపీ తరుపున వీరేందర్‌గౌడ్‌ ప్రచారం మొదలు పెట్టారు. ఇక మాజీ హోం మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నుంచి బరిలో దిగడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక మిగతా సీట్ల విషయంలో మాత్రం అనిశ్చితి నెలకొంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఆశావహుల్లో ఆందోళన అధికమవుతోంది.
Link to comment
Share on other sites

. Khammam : Nama 2. Sattupalli : Sandra 3. Ashwraopeta : Mechanagesh 4. Kukatpally : ?? 5. Sherlingampally : Anandprasad 6. Devarakadra :?? 7. Makthal : K dayakarreddy 8. NZB rural : Mandav 9. Uppal : Veerender goud 10. S-bad: venaktesh goud

 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక ప్రకటన చేసిన టీటీడీపీ అధ్యక్షుడు
03-11-2018 10:48:16
 
636768401755265391.jpg
హైదరాబాద్: మహాకూటమి నుంచి టీడీపీకి చెందిన మైనార్టీలకు రెండు స్థానాలను కేటాయించాలని నిర్ణయించినట్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతూ మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఎల్‌.రమణ విలేకరులతో మాట్లాడుతూ చార్మినార్‌ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతికి, మలక్‌పేట అసెంబ్లీ స్థానాన్ని మహ్మద్‌ ముజఫర్‌అలీఖాన్‌కు కేటాయించాలని మహాకూటమిలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన 8వ తేదీనగాని, 9వ తేదీన గాని అభ్యర్థుల జాబితాలో వెల్లడికానుందన్నారు.
Link to comment
Share on other sites

16 minutes ago, sonykongara said:
అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక ప్రకటన చేసిన టీటీడీపీ అధ్యక్షుడు
03-11-2018 10:48:16
 
636768401755265391.jpg
హైదరాబాద్: మహాకూటమి నుంచి టీడీపీకి చెందిన మైనార్టీలకు రెండు స్థానాలను కేటాయించాలని నిర్ణయించినట్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతూ మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఎల్‌.రమణ విలేకరులతో మాట్లాడుతూ చార్మినార్‌ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతికి, మలక్‌పేట అసెంబ్లీ స్థానాన్ని మహ్మద్‌ ముజఫర్‌అలీఖాన్‌కు కేటాయించాలని మహాకూటమిలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన 8వ తేదీనగాని, 9వ తేదీన గాని అభ్యర్థుల జాబితాలో వెల్లడికానుందన్నారు.

Charminar , malakpet rendu pothayemo ga Avi endku dandaga..

Link to comment
Share on other sites

On 10/27/2018 at 10:17 AM, sonykongara said:
కోదాడ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశం..?
27-10-2018 10:03:31
 
636762319969648460.jpg
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): టికెట్లు ఖరారు కాకపోవడంతో జిల్లాలో కాంగ్రెస్‌ ప్రచారం ఊపందుకోలేదు. మహాకూటమి పొత్తులు స్పష్టం కాకపోవడంతో జిల్లాలో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇంకా ఖరారు కాలేదు. ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన స్ర్కీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే సర్వేలు చేపట్టింది. అయితే మహాకూటమిలో పొత్తులు ఖరారు కాకపోవడంతో అధికారిక ప్రకటనల్లో జాప్యమవుతుంది. ఒకే అభ్యర్థి ఉన్న చోట్ల ప్రచారం చేసుకోవాలని ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చాయి. అభ్యర్థుల మధ్యన పోటీ ఉన్న చోట మాత్రం ఖర్చు దృష్టిలో ఉంచుకొని ప్రచారానికి వెనుకంజ వేస్తున్నారు. అభ్యర్థులు ఖరారయ్యాకే పార్టీ అధినేతల ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో హుజుర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. కోదాడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉత్తమ్‌పద్మావతికి సీటు ఇస్తారో లేదో తెలియట్లేదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్‌ ఇస్తామని అధిష్టానం ప్రకటించింది. దీంతో మహాకూటమి పొత్తులో టీడీపీ ఆ సీటును అడుగుతుంది. కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బొల్లం మల్లయ్యయాదవ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తిలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఆశిస్తున్నా వారి సంఖ్య బాగానే ఉంది. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు సైతం వేర్వేరుగా జరుగుతున్నాయి. పటే ల్‌ రమే్‌షరెడ్డి ఇప్పటికే ప్రచార వాహనాలను సిద్ధం చేసుకోగా ఆయనకు సంబంధించిన వాహనా లు తిరుగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవ ర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారు. గతంలో పోటీచేసిన అద్దం కి దయాకర్‌, గుడిపాటి నర్స య్య, అన్నెపర్తి జ్ఞానసుందర్‌, వడ్డెపల్లి రవిటికెట్‌ ఆశిస్తున్నారు.
 
 
పొత్తుల పీట ముడి ప్రధాన సమస్య..
పొత్తుల పీటముడి విడిపోతేనే టికెట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని నాలుగు ని యోజక వర్గాలలో కాంగ్రెస్‌పార్టీ బలంగానే ఉం ది. గత ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా, సూర్యాపే ట,తుంగతుర్తి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజ యం సాధించింది. కోదాడలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొదటి స్థానంలో ఉండగా టీడీ పీ రెండో స్థానంలో ఉంది. అన్ని నియోజక వర్గాల్లో ఈ సారి హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. త్రిముఖ,చతుర్మఖ పోటీల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్‌ పార్టీ టికెట్లను వీలైనం త తొందరగా ప్రకటించాలని ఆపార్టీ ఆశావాహులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర పార్టీలు ప్రచారంలో ముందు ఉంటే తా ము వెనకబడాల్సి వస్తుందని వాపోతున్నారు.
 
ఊపందుకొని కాంగ్రెస్‌ ప్రచారం....
పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుండడంతో కాంగ్రెస్‌ ప్రచారంలో వెనకంజలో ఉంది. టికెట్ల కోసం ఎదురు చూస్తుండడంతో ప్రచారం వైపు ఆసక్తి చూపట్లేదు. ఎవరికి వారు హైదరాబాద్‌, ఢిల్లీకి వెళ్తూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాదాపు టికెట్‌ ఖరారైన పేర్లు సైతం ప్రకటించకపోవడంతో ప్రచారం ముమ్మరంగా కనిపించడంలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకే నష్టమన్న భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. పలు చోట్ల ఎన్నికల ప్రచారం కనిపించడంలేదు. ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు టికెట్‌ ఖరారయ్యే వరకు ప్రచారానికి దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర నేతల జిల్లా పర్యటనలు సైతం అభ్యర్థులను ప్రకటించే వరకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరికి కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చేస్తారనే ఆశతో ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

Kodad seat tyagam cheyadanki siddamga lemi-uttamKumareddy.

Inka endi TDP ki chance unna seats kuda Valle unchukuni Malakpet charminar Warangal east Secunderabad enduku poye seats :wall:

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Kodad seat tyagam cheyadanki siddamga lemi-uttamKumareddy.

Inka endi TDP ki chance unna seats kuda Valle unchukuni Malakpet charminar Warangal east Secunderabad enduku poye seats :wall:

 

vadichedendi...cbn direct ga rahul to dealing akkada

Link to comment
Share on other sites

కూటమిలో కుతకుతలు 

 

8 నుంచి 10కి పెంచాలని తెజస 14 నుంచి 16 కోసం తెదేపా 
5 ఇవ్వకుంటే బయటికే అంటున్న సీపీఐ స్థానాలు తేలక పలుచోట్ల సిగపట్లు! 
నేడు మహాకూటమి నేతల తుది చర్చలు

4hyd-main6a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో నామినేషన్‌ ఘట్టానికి తెరలేవనుంది. అయినా మహాకూటమిలో ‘సీట్ల ముడి’ ఇంకా వీడటంలేదు. ఇప్పటివరకూ పలుసార్లు భాగస్వామ్య పార్టీలన్నీ భేటీ అయినా ఫలితం తేలలేదు. సోమవారం మరోసారి 4 పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎవరికి ఏ సీటు అన్నది ఇంకా తేల్చకపోతే ఎన్నిసార్లు చర్చలు జరిపినా వృథా అని కాంగ్రెస్‌కు మిగతా పార్టీలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. పదేపదే చర్చలంటూ సమావేశమవ్వడంకన్నా.. నిర్దిష్ట అజెండాతో కూర్చుని ఏదో ఒకటి తేల్చేలా చర్చిద్దామని తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు. మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లన్నది వెంటనే చెప్పాలని కాంగ్రెస్‌ను మిగిలిన 3 పార్టీలూ కోరాయి. 
మహాకూటమి భాగస్వామ్య పార్టీలు సోమవారం మరోసారి కీలక చర్చలు జరపనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు తెజస అధ్యక్షుడు కోదండరాం మీడియా సమావేశం పెడుతున్నారు. తెజస ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేయడంతో పాటు, ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నారన్న అంశంపైనా ఆయన వివరణిచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ 8 సీట్లు తెజసకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మరో 2 ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదనపు సీట్లు రెండింటినీ సిద్దిపేట, చాంద్రాయణగుట్టగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 8 ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఎంచుకోవాలని తెజసకే కాంగ్రెస్‌ వదిలేసినట్లు చెబుతున్నారు. అవి మల్కాజిగిరి, వరంగల్‌ పశ్చిమ లేదా తూర్పు, మెదక్‌, దుబ్బాక, రామగుండం, మహబూబ్‌నగర్‌, చెన్నూరు, మేడ్చల్‌, షాద్‌నగర్‌, ఆసిఫాబాద్‌, అశ్వారావుపేట, ఆలేరు, మిర్యాలగూడ. వీటిలో సామాజిక వర్గాల ప్రకారం సీట్లను ఎంపిక చేయాలని తెజస నేతలు కసరత్తు చేస్తున్నారు.

మరో రెండయినా దక్కాలి 
సీట్ల విషయంలో తెదేపా పట్టువిడుపు ధోరణితో ఉంది. అధిక సీట్లు తీసుకోవడంకన్నా కచ్చితంగా గెలిచేవి తీసుకోవాలన్నది ఈ పార్టీ ప్రధాన వ్యూహం. సీట్ల కోసం సామరస్యంగా వ్యవహరించి పొత్తుపై ప్రజల్లో సదభిప్రాయం కలిగేలా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే 14 సీట్లను కాంగ్రెస్‌ ఇవ్వజూపడంతో మరో 4 అడిగింది. రెండయినా కచ్చితంగా కేటాయించాలంటోంది. తెదేపా సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి వరంగల్‌ తూర్పు స్థానాన్ని అడుగుతున్నారు. ఇదే సీటు తెజసకు వెళితే ఆయనకు వరంగల్‌ పశ్చిమ సీటునైనా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బాల్కొండ, నల్గొండ జిల్లాలో ఆలేరు, కోదాడ, నకిరేకల్‌ స్థానాలనూ కోరుతోంది. వీటిలో నకిరేకల్‌ సీటును తెలంగాణ ఇంటి పార్టీ కోరుతోంది. ఆ పార్టీకి ఇస్తారా లేదా అన్నది తేలలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వనపర్తి లేదా దేవరకద్ర సీటును తొలుత అడిగారు. కానీ వనపర్తి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమైనందున ఇవ్వడం లేదని చెబుతున్నారు. దేవరకద్ర ఇచ్చినా అక్కడ పోటీ చేయాలా వద్దా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తేల్చుకోలేదు. ఆయన పోటీకి దిగకపోతే ఈ రెండు సీట్లను వదిలేసి మహబూబ్‌నగర్‌ స్థానాన్ని తీసుకోవాలన్నది తెదేపా వ్యూహం. ఈ జిల్లాలో మక్తల్‌ ఆ పార్టీకే ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తెదేపాకు ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్‌ లేదా ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌ లేదా సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మలక్‌పేట, చార్మినార్‌ సీట్లూ రానున్నాయని తెలుస్తోంది. వీటిలో జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ల కోసం తెదేపా పట్టుపడుతోంది. ఎల్‌బీనగర్‌, ఇబ్రహీంపట్నంలలో ఒకటి అడిగినా కాంగ్రెస్‌ అంగీకరించడం లేదని పార్టీవర్గాలు తెలిపాయి.

నల్గొండలో ఒకటి.. ఖమ్మంలో రెండు 
తమకు కేటాయించే సీట్ల విషయంలో సీపీఐ పట్టుదలగా ఉంది. పది సీట్లను అడిగిన ఈ పార్టీ కచ్చితంగా అయిదింటినైనా ఇవ్వాల్సిందేనని గట్టిగా కోరుతోంది. సీపీఐ అడిగిన 10 సీట్లు ఇవే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు, మునుగోడు, దేవరకొండ, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి. వీటిలో ఏవైనా ఐదు ఇవ్వాల్సిందేనంది. తమపార్టీ బలంగా ఉన్నందున నల్గొండలో ఒకటి, ఖమ్మం జిల్లాలో రెండు కలిపి తప్పనిసరిగా మొత్తం 5 కేటాయించాలనేది డిమాండు. కానీ రెండింటినే ఇస్తామని కాంగ్రెస్‌ సంకేతాలిచ్చింది. అవి బెల్లంపల్లి, వైరా అని తేల్చింది. తమకు 5 సీట్లు ఇవ్వకపోతే మరో ప్రణాళిక ప్రకారం ముందుకెళతామని సీపీఐ పేర్కొంది.

ఆశావహుల్లో గందరగోళం 
‘‘పొత్తులుండాలి.. సీటు మాత్రం మాకే దక్కాలి..’’ అన్నట్లుగా ఉంది మహాకూటమిలో భాగస్వామ్య పార్టీల తీరు. గత కొన్ని వారాలుగా ఆ పార్టీలన్నీ చర్చలు కొనసాగిస్తున్నా...ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఎవరికి వారు టికెట్లపై నమ్మకంతో తామే అభ్యర్థులం అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా స్థానాలు పొత్తులో ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చినప్పుడల్లా అక్కడి నాయకులు, వారి అనుచరులు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. శేరిలింగంపల్లి స్థానాన్ని తెలుగుదేశానికి ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ గాంధీభవన్‌ వద్ద ధర్నాకు దిగారు. ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ ఎదురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...