Jump to content

TTDP


sonykongara

Recommended Posts

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి అభ్యర్థుల ఖరారు?

123056BREAK75-TDP1.JPG

హైదరాబాద్‌ : తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యులతో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సమావేశాల్లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై నేతలతో చర్చించారు.

123046BREAK75-TDP2.JPG

 
Link to comment
Share on other sites

  • Replies 893
  • Created
  • Last Reply
సీట్ల సర్దుబాటు మాకు ప్రతిబంధకం కాదు: రావుల

01353502210RAVULA-BRK82A.JPG

హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపిందని ఆ పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ స్థానానికి ఏ అభ్యర్థి అనే అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఈ ఉదయం చంద్రబాబు పార్టీ నేతలతో వరుసగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం రావుల మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ తెదేపా నేతలు సరైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని చంద్రబాబు అభినందించారని ఆయన చెప్పారు. ఎన్నికల కోసం తెరాస విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతోందని రావుల ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా మహాకూటమి ముందుకెళ్తోందని వివరించారు. తెరాస నేతలు గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. భాజపా చెప్పుకోదగిన కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేకపోయిందని విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ఆ పార్టీ ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. తెలంగాణ తెదేపా రూపొందించిన మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, సీట్ల సర్దుబాటు తమకు ప్రతిబంధకం కాదని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

తెదేపా తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ

103949CHANDRABABU-TDP.JPG

హైదరాబాద్‌ : తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ముఖ్య నేతలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. మహాకూటమిలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఇతర పార్టీలతో జరిపిన చర్చలను చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు రమణ వివరించనున్నారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. తెదేపాకు 30సీట్లు కావాలని గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్ర నేతలు ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ అందులో సగమే ఇవ్వడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తెదేపా అడిగిన స్థానాల్లో కాకుండా కొన్ని ఇతర చోట్ల ఇస్తామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తెదేపా బలంగా ఉన్న సీట్లు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. ఆదివారం కొన్ని స్థానాల నేతల అనుచరులు తమ నేతలకే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నివాసం వద్ద ప్రదర్శన జరిపారు. ప్రచారం ప్రారంభించేందుకు రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. తెదేపా తరపున భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. అభ్యర్థులు ఖరారైన తర్వాత చంద్రబాబు సైతం రాష్ట్రంలో తెదేపా తరఫున కూటమి నిర్వహించే సభల్లో పాల్గొని ప్రచారం చేయాలని నేతలు కోరుతున్నారు.

Link to comment
Share on other sites

పొత్తు ముఖ్యం...సీట్ల విషయంలో సర్దుకుపోండి: చంద్రబాబు
22-10-2018 13:15:56
 
636758120610922494.jpg
 
హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో పొత్తు ముఖ్యమని.. సీట్ల విషయంలో సర్దుకుపోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోమవారం  టీ.టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు అడుగుదామన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుతానని నేతలకు బాబు తెలియజేశారు. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు కూడా దక్కుతాయని అన్నారు. తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నాలుగు సభలు పెట్టాలని చంద్రబాబును నేతలు కోరినట్లు సమాచారం.
 
మరోవైపు హైదరాబాద్‌లో ఆరు స్థానాలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్ స్థానాలు టీడీపీకేనంటూ చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. శేరిలింగంపల్లి స్థానాన్ని భవ్య సిమెంట్స్ ఆనందప్రసాద్‌కు కేటాయించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్ స్థానాల కోసం కాంగ్రెస్‌తో మాట్లాడుతానని టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు.
 
 
Tags : Chandrababu, TDP, Telangana, Mahakutami
Link to comment
Share on other sites

ఖైరతాబాద్‌ టికెట్‌ టీడీపీకేనా?.. ఓ నేతకు బాబు ఏమీ హామీచ్చారంటే!
23-10-2018 09:44:51
 
636758848589968108.jpg
హైదరాబాద్: ఖైరతాబాద్‌ నియోజకవర్గం సీటును టీడీపీకి కేటాయించేలా చూడాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు లంకల దీపక్‌రెడ్డి బంజారాహిల్స్‌ టీడీపీ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో టీడీపీ చాలా కింది స్థాయి నుంచి చాలా బలంగా ఉందన్నారు. 2014 ఎన్నికల పొత్తులో భాగంగా సీటును బీజేపీకి కేటాయించారనీ టీడీపీ బలంగా పనిచేయడంతోనే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపొందారనీ గుర్తుచేశారు.
 
 
ప్రతి సారి ఖైరతాబాద్‌ టీడీపీకి అన్యాయం జరుగుతోందన్నారు. క్యాడర్‌ వేరే పార్టీలకు పనిచేయాల్సి వస్తోందన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కేలా చూడాలన్నారు. ఖైరతాబాద్‌లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉన్నారన్నారు. తానుపార్టీకి చాలా సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించినట్టు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ శ్రేణులను కలుపుకుంటూ విజయం కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. తన అభ్యర్ధనకు బాబు సానుకూలంగా స్పందించారని, చర్చల్లో ఖైరతాబాద్‌ను అడుతామని చెప్పినట్టు తెలిపారు.
 
Tags : Chandrababu, Hyderabad
Link to comment
Share on other sites

అసెంబ్లీ బరిలో నామా నాగేశ్వరరావు!
23-10-2018 03:22:45
 
636758617657503125.jpg
  • ఖమ్మం నుంచి పోటీ చేసే చాన్స్‌
  • ఇంకా నిర్ణయం తీసుకోలేదు : నామా
హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారా? ఖమ్మం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారా? మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలవనున్నారా? అంటే ఇప్పటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులో భాగంగా నామా నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలు జనరల్‌ స్థానాలు కాగా మిగతావన్నీ రిజర్వుడు స్థానాలే. పాలేరుపై మొదట్నుంచి కాంగ్రె్‌సకు మంచి పట్టుంది. 2014లో అక్కడి నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. ఆయన ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖమ్మం స్థానాన్ని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌ కుమార్‌ గెలిచారు. ఆ తరువాత ఆయన టీఆర్‌ఎస్ లో చేరారు. ఇక కొత్తగూడెంను మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన ఖమ్మం ఒక్కటి టీడీపీకి కేటాయిస్తే... అక్కడి నుంచి నామాను బరిలోకి దింపుతారని తెలుస్తోంది.
 
 
2004లో తొలిసారి ఖమ్మం లోక్‌సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసిన నామా.. అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2009లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి 2014లో మళ్లీ ఎంపీగానే పోటీచేసి వైసీసీ అభ్యర్థి పొంగులేటి చేతిలో ఓటమి పాలయ్యారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ పోటీ చేసే అవకాశం ఉండటంతో నామా అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తాను మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని నామా చెబుతున్నారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

ఆ జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు ఏం చెప్పారో తెలిస్తే..
23-10-2018 09:41:14
 
636758847963719857.jpg
ఖమ్మం: ‘టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పార్టీ విజయానికి దోహదపడేలా చేయాలి.. దీనికోసం ప్రతి నాయకుడూ కష్టపడి పనిచేయండి.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టండి.. ప్రతి ఇంటికీ పార్టీని ప్రచారం చేయండంటూ’ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉద్భోదించారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవనంలో నిర్వహించిన రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో జిల్లాకు చెందిన రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలతో అడిగితెలుసుకున్నారు. పార్టీ విజయావకాశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో విజయానికి అంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
 
 
తేలని సీట్ల వ్యవహారం
చంద్రబాబుతో జరిగే సమావేశంలో జిల్లాలో పోటీచేసే సీట్ల జాబితా ఉంటుందని భావించినప్పటికీ ఆ వ్యవహారం తేలలేదు. కూటమి గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని, కూటమిలో కేటాయించిన సీట్లకే పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో నాలుగు సీట్లకు పోటీ చేయాలని టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు అడిగితే ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి నాయకులు అనుకున్నప్పటికీ ఎలాంటి ప్రస్తావన రాలేదు. చంద్రబాబు చెప్పిన సూచనలతో తాము ఎన్నికల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

తెలంగాణలో పొత్తు ఫైనల్‌!
24-10-2018 02:46:56
 
636759619980470067.jpg
  • కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి
  • రేపోమాపో 60 మందితో జాబితా
  • ఉమ్మడిగానే అభ్యర్థుల ప్రకటన
  • 90 కాంగ్రెస్‌
  • 15 టీడీపీ
  • 10 టీజేఎస్‌
  • 04 సీపీఐ
ఉంటుందా? లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ... ఉండకూడదనుకున్న ప్రత్యర్థులకు ఆశాభంగం కలిగిస్తూ... ఎట్టకేలకు మహాకూటమి పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ‘నెగ్గాలంటే తగ్గాల’నే సూత్రానికి అనుగుణంగా కూటమి పార్టీలన్నీ పట్టువిడుపులకు సిద్ధపడడం, కాంగ్రెస్‌, టీడీపీ అధిష్ఠానాలు కూడా రంగంలోకి దిగడంతో కథ సుఖాంతమైంది.
 
 
హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సీట్లు కాదు పొత్తే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేయడం, భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరుస్తూ పొత్తు ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించడంతో గెలుపే ప్రాతిపదికగా పొత్తు చర్చలు, సీట్ల పంపిణీ ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటులో జాప్యం నేపథ్యంలో టీజేఎ్‌సతో పొత్తుకోసం బీజేపీ.. కోదండరాంతో టచ్‌లోకి వెళ్లినట్టు ఉప్పందడంతో కాంగ్రెస్‌, టీడీపీలు అప్రమత్తమై వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అవి వెల్లడించిన సమాచారం ప్రకారం... మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయనుంది. తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్‌ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి. అంతేకాదు; ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటిస్తారు.
 
నాలుగు పార్టీల రాష్ట్ర శాఖల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే కాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది. అందుకే కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వాలు స్వయంగా పరిశీలిస్తూ, వివిధ సర్వేల ఆధారంగా ప్రతి సీటునూ ఆచితూచి ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ సీట్లు, సామాజిక వర్గాలు ప్రాతిపదికగా అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరిగింది. సర్దుబాటును త్వరగా తేల్చాలని శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో నెలకొన్న ఉత్కంఠకు వీలైనంత త్వరలో తెరదించాలని భాగస్వామ్యపక్షాల నాయకత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే ఒకే వేదిక నుంచి కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
 
తొలి జాబితాలో 60 పేర్లు ఉండే అవకాశం ఉంది. కూటమిలో ప్రతి భాగస్వామ్య పక్షానికి కేటాయించే సీట్లలో సగం మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చు. కాంగ్రెస్‌ నుంచి 40-50 మంది, టీడీపీ నుంచి 8, టీజేఎస్‌ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తారని సమాచారం. మొత్తమ్మీద జాబితాలో 35 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, మిగిలిన వారు ఓసీలు ఉండే అవకాశం ఉంది. 60 మందిలో 35 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించడం ద్వారా కూటమి వారికిచ్చే ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం రచించారు. ప్రజల మనోగతాన్ని ప్రతిబింబించేలా మహా కూటమి పేరును కూడా మార్చి, జనంలోకి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కూటమి వ్యవహారం కొలిక్కి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మంగళవారం వెల్లడించారు. తొలి జాబితాను త్వరలో ప్రకటిస్తామని టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు రమణ తెలిపారు.
 
కూటమి నుంచి వైదొలగబోమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తాను హుస్నాబాద్‌లోనే బరిలోకి దిగుతాననీ, లేకుంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. కాగా ఉత్తమ్‌, ఖుంటియా, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌, మధుయాష్కీగౌడ్‌ తదితరులతో కూడిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమై సీట్ల పంపిణీకి తుది మెరుగులు దిద్దింది. బుధవారం సీపీఐ నేతలతో చర్చలు జరిగే అవకాశం ఉంది.
 
గతంలో గెలిచిన స్థానాలపై టీడీపీ ఆసక్తి
కూటమికి కీలకంగా మారిన తెలుగుదేశం.. 2014లో తాను గెలిచిన స్థానాల్లోనే ఇప్పుడూ పోటీ చేయటానికి ఆసక్తి చూపింది. దీంతో భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేకపోతే, ఆయా సీట్లు టీడీపీకే దక్కనున్నాయి. తెలుగుదేశం వర్గాల సమాచారం ప్రకారం.. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టీడీపీకి దక్కబోతున్నట్టు తెలిసింది. ఈ 8 సీట్లకూ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖాయమైంది. మిగతావాటిలో కోదాడ, మహబూబ్‌నగర్‌, దేవరకద్రల్ని టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేయనున్నందున, దానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. వీలైతే కుత్బుల్లాపూర్‌, మహేశ్వరం, మక్తల్‌ సీట్లను తీసుకోవటానికి టీడీపీ ఆసక్తి చూపుతోంది. నామా నాగేశ్వరరావు పోటీ చేయటానికి సిద్ధపడితే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
 
 
మా వెంట పడుతున్నారు
టీఆర్‌ఎస్ పై రమణ, చాడ, కోదండ ధ్వజం
విపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మహాకూటమి నాయకులు ధ్వజమెత్తారు. తమ వాహనాలను అక్రమంగా తనిఖీ చేస్తున్నాయని, తమను షాడో పార్టీలు వెంబడిస్తున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వైఖరిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఉత్తమ్‌తోనూ ఫోన్‌లో చర్చించారు. తన కుటుంబసభ్యులు ఉన్న వాహనాన్ని కరీంనగర్‌ వద్ద నిర్బంధంగా ఆపి తనిఖీ చేశారని రమణ తెలిపారు. కోదండరాం వాహనాన్ని హైదరాబాద్‌లో తనిఖీ చేశారని, వాహనాన్ని షాడోపార్టీ వెంబడించిందని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌, ఖమ్మంలో బాబు ప్రచారం!
24-10-2018 04:10:30
 
హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రచారం వ్యూహాత్మకంగా ఉండబోతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తారని భావిస్తున్నారు.
 
‘‘గత ఎన్నికల్లో మాకు గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువ సీట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో పార్టీ ఇప్పటికీ పటిష్ఠంగానే ఉంది. పైగా, బలమైన సామాజికవర్గం అండగా కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఇటు హైదరాబాద్‌, అటు ఖమ్మం జిల్లా కేంద్రంలో చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది’’ టీడీపీ సీనియర్‌ నాయకుడు ఒకరు విశ్లేషించారు. హైదరాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణ పరిధిలో కూడా పార్టీకి లాభిస్తుందని తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో చంద్రబాబు సభలను ఒక రోజే ఏర్పాటు చేయాలా? రెండు రోజుల్లో నిర్వహించాలా? అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.
 
మరోవైపు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు అందుకు దీటుగా స్పందించబోతున్నారని మరో సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందో, పాలకులు ఎందుకు చేయలేకపోయారో చెబుతూ చంద్రబాబు పరోక్షంగా టీఆర్‌ఎ్‌సపై విమర్శలు సంధించబోతున్నారని ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

పోటి చేసే స్థానాలు శేర్ లింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్ కుకట్ పల్లి - పెద్ది రెడ్డి ఉప్పల్ - వీరేంద్ర గౌడ్ కుద్బుల్లాపూర్ -అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్ రాజేంద్ర నగర్- గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి

Link to comment
Share on other sites

జూబ్లిహీల్స్ - అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి ఖమ్మం - నామా నాగేశ్వరరావు సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య అశ్వరావు పేట -మచ్చ నాగేశ్వరరావు మక్తల్ - కొత్త కోట దయాకర్ రెడ్డి దేవరకద్ర - సీతా దయాకర్ రెడ్డి

Link to comment
Share on other sites

జడ్చర్ల - ఎర్ర శేఖర్ వనపర్తిరావుల చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు కోరుట్ల - ఎల్ రమణ

Link to comment
Share on other sites

36 minutes ago, sonykongara said:

జడ్చర్ల - ఎర్ర శేఖర్ వనపర్తిరావుల చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు కోరుట్ల - ఎల్ రమణ

Ee 15 confirm aa ?

Link to comment
Share on other sites

పోటి చేసే స్థానాలు శేర్ లింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్

కుకట్ పల్లి - పెద్ది రెడ్డిలేదా భవ్య ఆనంద్ ప్రసాద్

ఉప్పల్ - వీరేంద్ర గౌడ్

కుద్బుల్లాపూర్ -అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్

రాజేంద్ర నగర్- గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి

జూబ్లిహీల్స్ - అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి

ఖమ్మం - నామా నాగేశ్వరరావు

సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య

అశ్వరావు పేట -మచ్చ నాగేశ్వరరావు

మక్తల్ - కొత్త కోట దయాకర్ రెడ్డి

దేవరకద్ర - సీతా దయాకర్ రెడ్డి

జడ్చర్ల - ఎర్ర శేఖర్

వనపర్తిరావుల చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు

కోరుట్ల - ఎల్ రమణ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...