Jump to content

Recommended Posts

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
Posted
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
27-07-2017 02:16:54
 
636367186421170307.jpg
  • భూసేకరణ ఖర్చుపై కేంద్రం మెలిక
  • మొత్తం భారం రాష్ట్రంపైనే!
 
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమకు రాజధానిని చేరువ చేసే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి పడింది! ఈ మార్గం నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం తేల్చి చెప్పడమే దీనికి కారణం. అయితే, రాష్ట్ర విభజనతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఈ భారం భరించలేమని సగమైనా కేంద్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, భూసేకరణ చేసిస్తే ప్రాజెక్టుకు అవసరమైన నిధులిచ్చేందుకు సిద్ధమని కేంద్రం తెగేసి చెప్పింది.
 
ఈ అంశంపై ఏదో ఒకటి తేలితేనే ప్రాజెక్టు ముందుకెళ్లనుంది. మరోవైపు అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేకు సంబంధించిన సాంకేతిక ఫీజిబిలిటీ నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ఈ రహదారితో పాటు.. దానికి అనుసంధానంగా కర్నూలు, కడపల నుంచి వచ్చి కలిసే రోడ్లు.. అన్నింటిపైనా సమగ్ర సాంకేతిక ఫీజిబిలిటీ నివేదికను కేంద్రం ముందు పెట్టింది. కేంద్రం కూడా దీన్ని ఆమోదించింది. దీంతో పాటు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో మధ్య కొంత మేరకు ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా కర్నూలు నుంచి డోర్నాల వరకు ఉన్న భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను ఇవ్వాలని కేంద్రం అడిగింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత రావాలంటే తొలుత భూసేకరణ ఖర్చు విషయం తేలాల్సిందే. మొత్తంగా భూ సమీకరణ కోసం రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. భూసేకరణకు జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రె్‌సవే పక్కన భూసమీకరణ చేసి వాటిలో ఆర్థికమండళ్లు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.
Posted
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
28-07-2017 08:37:48
 
636368278967546802.jpg
  • నష్ట పరిహారంపై స్పష్టత ఇవ్వాలి..
  • అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయం
  • రాజధాని ప్రాంత రైతులకిచ్చిన తరహాలోనే ప్యాకేజీ ఇవ్వాలని కొందరి డిమాండ్‌
  • అసలు భూములు ఇవ్వబోం అంటున్న మరికొందరు
 
తాడికొండ/వినుకొండ: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్ట్‌కు భూములు ఇచ్చేందుకు రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతం రైతులు ఏ విధంగా ప్యాకేజీ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని కొంత మంది డిమాండ్‌ చేస్తున్నారు. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కొంత మంది అభిప్రయపడగా అవసరమైతే ఆందోళన చేస్తామని మరికొందరు రైతులు హెచ్చరిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చిన ప్యాకేజీ కంటే అదనంగా పరిహారం ఇచ్చినా తాము నష్టపోతామని చెబుతున్నారు. ప్రభుత్వ నుంచి ఇప్పటివరకు నష్టపరిహారంపై ఎలాంటి స్పష్టత రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచితే తమకు ఆమోదయోగ్యమేనని కొందరంటున్నారు. అటు వినుకొండ, ఇటు రాజధాని సమీపంలో హైవే వల్ల భూములు కోల్పోతున్న రైతులను ఆంధ్రజ్యోతి పలకరించింది. వారి అభిప్రాయాలివి..
 
చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి..
హైవే కింద భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం అందించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే నిర్మాణంలో నష్టపరిహారం ఇచ్చిన విధంగా అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోతున్న మాకు కూడా ఇవ్వాలి. భూములు పోతే మేము ఏం తినాలి. అందుకే మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి
- అరిగెల పాపయ్య, నూజెండ్ల
 
పరిహారం పెంచితే సిద్ధమే..
 
ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులకు పరిహారం పెంచాలి. నా కుటుంబానికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు రోడ్డు నిర్మాణానికి అవసరమని అధికారులు గుర్తించారు. పరిహారం పెంచి ఇస్తే భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే.
- కంచుమాటి నరేష్‌, మారెళ్లవారిపాలెం, నూజెండ్ల మండలం.
 
రాజధాని ప్యాకేజీ ఇవ్వాలి..
ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవేకు పొలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజధాని అభివృద్ధి జరుగుతుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పరిహారం విషయంలో రాజధాని రైతుకు ఇచ్చిన ప్యాకేజీ ఇస్తే బాగుంటుంది. ఎకరం పొలం రూ. కోటికి అడిగారు. అయినా మేము అమ్ముకోలేదు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి.
- మందడపు సురేష్‌, తాడికొండ
 
నిరుద్యోగ భృతి ఇవ్వాలి..
ఉన్నది ఎకరం పొలం అది కూడా హైవే కింద పోతుంది. ఆటో నడుపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఎకరం పొలం పోతే మాకు ఆర్ధిక నష్టం జరుగుతుంది. మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి. అంతే కాకుండా నిరుద్యోగ భృతి కల్పించాలి. ప్రతి నెలా ఇస్తే కుటుంబం బతకడానికి ఆసరాగా ఉంటుంది. రాజధాని ప్యాకేజీ ఇస్తే ఇంకా మంచిది.
- ఆరె శ్రీనివాసరావు,తాడికొండ
 
రైతులకు న్యాయం చేయాలి..
అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోనున్న రైతులకు న్యాయం చేయాలి. నూజెండ్ల గ్రామంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పెద్దలు సంపాదించిన ఎనిమిది ఎకరాలు భూమిని కోల్పోవాల్సి వస్తోంది. గ్రామంలో మరొక చోట భూమిని కొనుగోలు చేసే విధంగా నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు.
- సోమేపల్లి ఉమామహేశ్వరరావు, నూజెండ్ల
 
భూములు లాక్కుంటే ఆత్మహత్యలే..
నాకు ఉన్న 6 ఎకరాల పొలం హైవే కింద పోతుంది. భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తిలేదు. ఇక్కడ ఉన్న భూముల విలువ ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ.3 కోట్లు పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి పరిహారం మాకు అక్కరలేదు. ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
- పింగళిశెట్టి బాలకృష్ణ, లాం
 
రైతులను మెప్పించేలా ఉండాలి..
ఎక్స్‌ప్రెస్‌ హైవేకి రైతులను మెప్పించి భూసేకరణ నిర్వహించాలి. మండలంలో ఏనుగుపాలెం, చెట్టుపల్లి, పెరుమాళ్లపల్లి గ్రామాల్లో 160ఎకరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం తగు నష్టపరిహారం చెల్లించాలి. వారి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
- గణపా వీరాంజనేయులు, ఏనుగుపాలెం, వినుకొండ మండలం
 
భూములు ఇచ్చే ప్రసక్తే లేదు..
నా భూములు ఇచ్చేప్రసక్తే లేదు. రాజధాని ప్యాకేజీ ఇచ్చినా మేము నష్టపోతాం. ముందు హైవే రోడ్డు ఎలాంటి మలుపులు లేకుండా ఉండాలన్నారు. ఇప్పుడు రూట్‌మ్యాప్‌ మారిపోయింది. ఎంత పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేము. బహిరంగ మార్కెట్‌ విలువ చాలా ఎక్కువ ఉంది. అయినా వ్యవసాయాన్ని నమ్ముకున్నాం గానీ భూములు అమ్ముకోలేము.
- రాయపూడి ప్రసన్నకుమార్‌
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ వే సర్వే
 
636389007456108242.jpg
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. పరిహారంపై రైతులు పట్టు పట్టడం.. బృందాలను అడ్డగిస్తుండడంతో అధికార యంత్రాంగం తాత్కాలికంగా సర్వే నిలిపివేసింది. మరోవైపు భూ సేకరణ ఏ చట్టానికి లోబడి చేయాలో స్పష్టత లేకపోవడంతో కేంద్ర నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
  • బృందాలను అడ్డగిస్తున్న రైతులు
  • 91 కిలోమీటర్లలో 34.5 సర్వే పూర్తి
  • నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతోన్న రైతులు
  • భూసేకరణకు ఎన్‌హెచ్‌ చట్టమా... 2013 చట్టమా?
  • స్పష్టత కోసం ఎదురు చూస్తున్న జిల్లా యంత్రాంగం
గుంటూరు: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణలో ప్రాథమిక ప్రక్రియ అయిన సర్వే పనులు గుంటూరు జిల్లాలో నిలిచిపోయాయి. సర్వేకు వెళుతున్న బృందాలను రైతులు అడ్డగిస్తూ నష్టపరిహారం తేల్చాల్సిందిగా కోరుతుండటంతో అధికార యంత్రాంగం తాత్కాలికంగా సర్వే నిలిపేసింది. మరోవైపు భూసేకరణ నేషనల్‌ హైవే యాక్టు ప్రకారం చేపట్టాలా లేక 2013 భూసేకరణ చట్టం కింద సేకరించాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. జిల్లాలో సుమారు 91 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం భూములను సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 34.5 కిలోమీటర్ల పొడవునా సర్వే పూర్తి అయింది. మరో 56 కిలోమీటర్ల మేరకు పెగ్‌ మార్కింగ్‌ చేసిన భూములను సర్వే చేయాల్సి ఉంది. ప్రధానంగా ఈ భూములు తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ఎక్కువగా ఉన్నట్లు సర్వే విభాగం అధికారులు తెలిపారు.
 
హైవే రూపం ఇదీ..
రాయలసీమ ప్రాంతాన్ని అమరావతి రాజధాని నగరంతో అనుసంధానం చేసేందుకు 598.78 కిలోమీటర్ల పొడవునా నాలుగు, ఆరువరుసల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇందుకోసం రూ.27,635 కోట్ల నిధులు అవసరమౌతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 120 కిలోమీటర్ల మేరకు వాహనాల వేగాన్ని తట్టుకొనేలా డిజైన్‌లు రూపొందించారు. అనంతపురం నుంచి అమరావతి వరకు నేరుగా ఈ రోడ్డు ఉంటుంది. కర్నూలు, కడప జిల్లాలకు కూడా కనెక్టివిటీని కల్పించేందుకు నాలుగు వరసల రహదారులను నిర్మిస్తారు. గిద్దలూరు వద్ద నుంచి అమరావతి వరకు ఈ రోడ్డు ఆరు వరసలుగా ఉంటుంది. జిల్లాలో నూజెండ్ల, వినుకొండ, చిలకలూరిపేట, నాదెండ్ల, మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు మండలాల మీదగా రోడ్డు నిర్మాణం ఎలైన్‌మెంట్‌ చేశారు. డిజైన్‌ ప్రకారం పెగ్‌ మార్కింగ్‌ పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఆ వెంటనే భూముల సర్వే ప్రారంభించింది. నూజెండ్ల, వినుకొండ, నాదెండ్ల మండలాల్లో సర్వేని పూర్తి చేశారు. మొత్తం 1,500 ఎకరాల్లో సర్వే జరిగినట్లు జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల తెలిపారు. సర్వే సమయంలో నష్టపరిహారం గురించి రైతలు ప్రశ్నిస్తోన్నందున తాడికొండ నుంచి చిలకలూరిపేట వరకు సర్వేని నిలిపేశారు.
 
నష్ట పరిహారంపై ...
ప్రధానంగా తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, చిలకలూరిపేటల్లో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఎకరం రూ.కోటికి పైగానే ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం ఎంతో చెప్పాల్సిందిగా ఏ పట్టుబడుతున్నారు. తాడికొండ మండలంలోని అన్ని పార్టీల రైతులు ఏకమై నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సహజంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువకు మూడు రెట్లకు తగ్గకుండా నష్టపరిహారం అందుతుంది. అయితే రైతులు రాజధాని ప్యాకేజ్‌ని కోరుతూ ఆందోళనలను నిర్వహిస్తోండటంతో సర్వేని నిలిపేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి ఇంకా నోటిఫికేషన్‌ కూడా రాని కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు. భూములను ఏ చట్టం కింద సేకరించాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా యాక్టు ఉన్నది. అలానే 2013లో యూపీయే ప్రభుత్వం మరో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ రెండింటిలో ఏ చట్టాన్ని అమలు చేయాలో తెలియక కేంద్ర నిర్ణయం కోసం అధికారులు లేఖలు రాశారు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే ముందుకు వెళతామని జిల్లా అధికారులు తెలిపారు.
Posted
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
21-08-2017 08:27:15
 
636389008403057730.jpg
విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆతిథి గృహ ప్రాంగణంలో ఆదివారం భూ సేకరణ పునరావాస కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం, సంస్థ ప్రిసైడింగ్‌ అధికారి, రిటైర్డ్‌ జడ్జి జగన్నాథం, విజయవాడ ఆర్డీవో ఎన్‌ హరీష్‌, అర్బన్‌ తహసీల్దార్‌ ఆర్‌.శివరావు, డిప్యూటీ కలెక్టర్‌ శారద, ఆర్‌ అండ్‌ బి ఈఈ ఏఎల్‌ మాధవస్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం మాట్లాడుతూ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం మేరకు అవార్డులు పాస్‌ అయిన తరువాత సివిల్‌ కోర్టులకు అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. టైటిల్‌, పరిహారం చెల్లింపు తదితర విషయాలలో ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే వాటిని ఈ కార్యాలయం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి వీలుంటుందని తెలిపారు. సంస్థ ప్రిసైడింగ్‌ అధికారి అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు అనుసంధానంగా వ్యవహరిస్తారని, భూములు, భవన యజమానులకు నష్టం వాటిల్లకుండా చట్టం మేరకు తీర్పులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కొత్తరోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ ఇంకా పలు పనులను చేపట్టడానికి భూమి అవసరం ఉందని తెలిపారు. భూ సేకరణకు సంబంధించి యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సంస్ధ చక్కటి పరిష్కార వేదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రిసైడింగ్‌ అధికారి చక్కని సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారని తెలిపారు.
Posted

రాజధానికి రాచమార్గాలు

కర్నూలు-గుంటూరు రోడ్డు విస్తరణ

నాలుగు వరుసలకు సర్వే మొదలు

అటవీ మార్గంలో విస్తరణకు ఇక్కట్లు

22ap-state5a.jpg

ఈనాడు, అమరావతి: కర్నూలు నుంచి రాజధాని నగరానికి చేరుకోవడానికి ఎనిమిది గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గాలు జాతీయ రహదారులే అయినా రాజధానికి వెళ్లడం రాయలసీమ వాసులకు పెద్ద ప్రహసనంగా మారింది. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ మార్గం కార్యరూపం దాల్చేలోగా అందుబాటులో ఉన్న జాతీయ రహదారులను విస్తరించడమే ఇందుకు పరిష్కారం. ఇందులో భాగంగానే కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ దిశగా సర్వే ప్రారంభించింది.

కర్నూలు నుంచి దోర్నాల వరకూ ఉన్న జాతీయ రహదారి 340సి తొలి దశలో నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా దోర్నాల వరకూ 150 కి.మీ. మేర ప్రస్తుతం రెండు వరుసల మార్గమే ఉంది. కుంట దగ్గర నుంచి ఎన్‌హెచ్‌ 544డిలో కలుస్తుంది. ఇది వినుకొండ-నర్సరావుపేట మీదుగా గుంటూరుకు చేరుతుంది. కుంట నుంచి గుంటూరు వెళ్లే రోడ్డు కూడా రెండు వరుసల్లోనే ఉంది. ఈ మార్గం అంతటినీ నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ రహదారి వెంట ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ సర్వే నిమిత్తం కొలతలు వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికల్ని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు అందజేశారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో సేకరించాల్సిన భూముల కోసం జిల్లా కలెక్టర్లకు సమాచారమిచ్చారు. సేకరణకు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు పరిధిలో ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది.

అటవీ మార్గంలో ఇబ్బందే

ఆత్మకూరు దాటిన తరువాత దోర్నాల వరకూ ఈ రోడ్డు నల్లమల అటవీ ప్రాంతంలోంచి వెళ్తుంది. విస్తరణలో ఈ భాగం కీలకమైనది. 60 కి.మీ. మేర ఉండే ఈ మార్గం 7 మీటర్ల వెడల్పులోనే ఉంది. ఈ మార్గాన్ని విస్తరించడం సాధ్యమయ్యే పని కాదని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. అటవీ శాఖ నుంచి రావల్సిన పర్యావరణ అనుమతులు పొందడం ఒక ఎత్తయితే.. విస్తరించేందుకు ఆస్కారం లేకపోవడం మరో కారణం. ఈ మార్గంలో పులుల అభయారణ్యం కూడా వస్తుంది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ అనుమతులూ అవసరమవుతాయి. ఇక్కడ రోడ్డుకి రక్షణ గోడలు నిర్మించేందుకు కూడా అనుమతులు దక్కడం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ 60 కి.మీ. మేర విస్తరణ ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్గంలో బలహీనంగా ఉన్న కల్వర్టులను గుర్తించి వాటిని పునర్నిర్మించడం, రహదారిని బలోపేతం చేయడం, రెయిలింగ్‌ ఏర్పాటులాంటివి చేపట్టాలని భావిస్తున్నారు.

ఈ మార్గంతో పాటు అనంతపురం నుంచి తాడిపత్రి-తోకపల్లి మీదుగా గుంటూరుకు చేరే 544డి జాతీయ రహదారి విస్తరణపైనా దృష్టిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గంలోనే కర్నూలు నుంచి వచ్చే 34సి ఎన్‌హెచ్‌ కలుస్తుంది. ఇందుకు సంబంధించిన సర్వే కూడా మొదలుపెట్టబోతున్నారు.

Posted

కొండమోడు-పేరేచర్ల రోడ్డుకు మోక్షం

ప్రాజెక్టుకు కేంద్రం చేయూత

20శాతం వీజీఎఫ్‌ ఇచ్చేందుకు అంగీకారం

ఈనాడు, అమరావతి: గుంటూరు-పిడుగురాళ్ల మధ్య ప్రయాణ ఇక్కట్లు తీరనున్నాయి. ఈ మార్గం విస్తరణకు చేయూత అందించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. రాజధాని కార్యకలాపాలు వూపందుకొన్నాక ఈ మార్గంలో వాహనాల రద్దీ బాగా పెరిగింది. 50కి.మీ. మేర ఇరుకుగా ఉన్న కొండమోడు-పేరేచర్ల రహదారిని విస్తరించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రణాళికలు రూపొందించారు. కానీ అవి కాగితాల దశను దాటలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. రూ.504 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులకు సర్దుబాటు నిధి(వీజీఎఫ్‌)ని కేంద్రం సింహభాగం ఇస్తుంది. ఈ రహదారి పనుల్ని పీపీపీ విధానంలో చేయాలని నిర్ణయించారు.

20శాతం కేంద్రం నుంచి

గుంటూరు-హైదరాబాద్‌ల మధ్య 290 కి.మీ. రహదారి ఉంది. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి మీదుగా పిడుగురాళ్ల దగ్గర విస్తరించబోయే మార్గానికి కలుపుతారు. నార్కట్‌పల్లి నుంచి అద్దంకి వరకూ నాలుగు వరుసల రహదారి ఉంది. అయితే కొండమోడు నుంచి పేరేచర్ల వరకూ రెండు వరుసల రోడ్డే ఉంది. ఇది గుంటూరు చేరేందుకు కీలకమైన మార్గం. అటు తెలంగాణ, ఇటు పల్నాడు వైపు నుంచి గుంటూరు వెళ్లాలంటే ఈ రహదారిపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. వాహన రద్దీ పెరిగాక ప్రయాణం కష్టమవుతోంది. సత్తెనపల్లి, మేడికొండూరు వూళ్ల నుంచి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందికరంగా మారింది. ఈ రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి, మేడికొండూరుల దగ్గర బైపాస్‌ మార్గాలు వేయనున్నారు. 27.5శాతం వీజీఎఫ్‌తో ఈ పనులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ 20శాతం వీజీఎఫ్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అంటే రూ.101 కోట్లు కేంద్రం సర్దుబాటు చేయనుంది. మరో 7.5శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇటీవలే రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి.. కేంద్ర ప్రభుత్వ వర్గాలతో చర్చించారు. కేంద్రం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం లభించడంతో పనులు వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గం విస్తరణకు 361.39 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. భూసేకరణకు రూ.230 కోట్లు వ్యయం కానుంది. సత్తెనపల్లిలో 3 కి.మీ., మేడికొండూరులో 3కి.మీ. మేర బైపాస్‌ రానుంది. ప్రధానంగా ఆ ప్రాంతంలోనే భూసేకరణ అవసరమవుతుందని అధికారులు గుర్తించారు.

  • 4 weeks later...
Posted

అమరావతి-అనంత’ వేగం పెరగాలి
 
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమరావతి-అనంతపురం జిల్లాల మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రహదారి నిర్మాణ వేగం పెరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి భూసేకరణ ఎంతవరకూ వచ్చిందని గురువారం కలెక్టర్ల సదస్సులో ఆరా తీశారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియలో వేగం ఉన్నప్పటికీ, గుంటూరులో కొంత జాప్యం జరుగుతున్న విషయంలో సీఎం దృష్టికి వచ్చింది. భూముల ధరలపై స్పష్టత విషయంలో కొంత ఆలస్యం జరిగిందని గుంటూరు కలెక్టర్‌ శశిధర్‌ తెలిపారు.
 
అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పనులు కూడా వేగంగా జరగాలని, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చే సమయానికి లైడర్‌ సర్వే పూర్తికావాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు నెల్లూరులో ఎన్‌హెచ్‌, నంద్యాల రహదారి, బెంగళూరు-చిత్తూరు రోడ్లపైనా చర్చ జరిగింది. నంద్యాల రహదారి పనుల పూర్తికి ఇంకెంతకాలం తీసుకుంటారని సీఎం ప్రశ్నించారు. ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సుమితాదావ్రా ప్రజెంటేషన్‌ ఇచ్చారు.
  • 4 weeks later...
Posted
ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణకు డిప్యూటీ కలెక్టర్‌
 
  • జిల్లాకు కొత్తగా మరో ముగ్గురు అధికారులు
ఆంధ్రజ్యోతి, గుంటూరు : అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణకు జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను ఎట్టకేలకు ప్రభుత్వం నియమించింది. నాలుగు నెలల క్రితమే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా ప్రభుత్వ సాదారణ పరిపాలన శాఖ స్పందించి తాజాగా చర్యలు చేపట్టింది. ఎస్‌డీసీ ఎం వెంకటేశ్వర్లును జిల్లా పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ హైవేకి భూసేకరణ అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో భూసేకరణ కార్యాలయాన్ని కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణ జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల నేతృత్వంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. పెగ్‌మార్కింగ్‌తో పాటు కొన్ని గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో భూముల ధర అధికంగా ఉండటంతో అక్కడి రైతులు మెరుగైన నష్టపరిహారం కోరుతున్నారు. ఎకరాకు రూ.60 లక్షలకు పైగా పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే అమరావతి రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజ్‌ని అమలు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తాడికొండ మండలంలో రైతులు ఆందోళనలు కూడా నిర్వహించడంతో ఎక్స్‌ప్రెస్‌ వే సర్వే నిలిచిపోయింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే గురించి ప్రస్తావించారు.
 
గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. అదొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, రాయలసీమ ప్రజలు వేగవంతంగా అమరావతి రాజధానికి చేరుకోవడానికి నిర్దేశించిందని చెప్పారు. భూసేకరణ పూర్తి చేస్తే ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సంసిద్ధతను తెలియజేసిందన్నారు. భూసేకరణ విషయంలో శ్రద్ధ వహించాలని ఆదేశించారు. దానికి కొనసాగింపుగానే భూసేకరణ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ని నియమించారు. ఇదిలావుంటే జిల్లాకు మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా నియమించింది. సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్లుగా ఎస్‌.విజయలక్ష్మి, టీ చిరంజీవిలను పోస్టింగ్‌ చేసింది. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ సెల్‌ గుంటూరు-2 యూనిట్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా వై.ప్రసన్నలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వు లు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 66 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేయగా జిల్లాలో కీలకమైన నలుగురు ఆర్డీవోలు, డీఆర్‌వో వారి స్థానాలను పదిలం చేసుకోవడం విశేషం.
  • 1 month later...
Posted

అడుగు పడని.. హైవే
22-11-2017 07:08:53

    ఎక్స్‌ప్రెస్‌ హైవేకి నెంబర్‌ ఇవ్వకుండా భూసేకరణ ఎలా?
     కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి
     ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా నివేదించేందుకు ప్రయత్నాలు
     భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం భరిస్తామని హామీ

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణ ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. జిల్లాలో ఐదు గ్రామాల రైతులను భూసేకరణకు ఒప్పించి అన్ని సిద్ధం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడటంతో అధికార యంత్రాంగం మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా 2013 భూసేకరణ చట్టం, కొత్త ఎన్‌హెచ్‌ చట్టం ప్రకారం ఏ జాతీయ రహదారికి అయినా నెంబర్‌ కేటాయించి గజిట్‌లో ప్రచురించనిదే భూసేకరణ చేపట్టడానికి వీల్లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి నెంబర్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తోండటంతో భూసేకరణ ప్రక్రియ జిల్లాలో ముందుకు కదలడం లేదు.
 
(ఆంధ్రజ్యోతి, గుంటూరు ): రాయలసీమ ప్రాంత ప్రజలు అమరావతి రాజధానికి వేగవంతంగా చేరుకొనేందుకు వీలుగా 393 కిలోమీటర్ల పొడవునా అనంతపురం నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ హైవేని ప్రతిపాదించారు. ఇందుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ప్రాజెక్టుని అప్పగించింది. ఈ రోడ్డుకు కర్నూలు జిల్లా నుంచి 75.650 కిలోమీటర్లు, కడప నుంచి 88.080 కిలోమీటర్ల పొడవునా ఫీడర్‌ రోడ్లను కూడా ప్రాజెక్టులో చేర్చారు. ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలి. ఇందుకోసం ఇటీవలే ఆయా జిల్లాలకు స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. గుంటూరుకు ఎం.వెంకటేశ్వర్లుని ఎస్‌డీసీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ కార్యాలయం ప్రారంభించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించి పెగ్‌మార్కింగ్‌ పూర్తి చేసింది. భూములు కోల్పోయే సర్వే నెంబర్లను తెప్పించుకొని గత మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించింది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇప్పటికే పలుమార్లు రైతులతో సంభాషించారు. నూజెండ్ల, వినుకొండ, చిలకలూరిపేట, నాదెండ్ల, ఫిరంగిపురం, మేడికొండూరు, తాడికొండ రైతులతో సంప్రదింపులు జరిపారు. నూజెండ్ల, వినుకొండ మండలాల్లో రైతులను భూసేకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు ఒప్పించారు. తాడికొండ మండల రైతులు ఎక్కువ నష్టపరిహారాన్ని కోరుతున్నారు. సాధ్యమైనంత వరకు తమకు రాజధాని ప్యాకేజ్‌ కావాలని పట్టుబడుతున్నారు.
 
ఇదిలావుంటే ప్రభుత్వ స్థాయిలో నిధులు విడుదల కాక పోవడానికి గల కారణాలను జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్‌ హైవేకి నెంబర్‌ని కేంద్ర ప్రభుత్వం కేటాయించకుండా కొర్రీల మీద కొర్రీలు వేస్తోందని తేలింది. ఇటీవలే సీఎం చంద్రబాబు ఈ విషయంపై కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కూడా సంభాషించారు. అయినా కేంద్రం నుంచి ఇంకా నెంబర్‌ కేటాయింపు జరగలేదు. దీని వలన భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. సహజంగా ఏ జాతీయ రహదారి ప్రాజెక్టు అయినా భూసేకరణకు అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి 50 శాతం బడ్జెట్‌ని తాము సమకూరుస్తామని చెప్పినా కేంద్రం నుంచి ఆశించినంత వేగంగా సహకారం లభించకపోతుండటంతో అధికార వర్గాలు అసహనానికి గురవుతున్నాయి. మరో నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికల సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. 

Posted

 కీలకం.... కదలని దస్త్రం
పెగ్‌మార్క్‌ సర్వే పూర్తితో ఆగిన పనులు
జాతీయ రహదారి నెం. ప్రకటనకు ఎదురు చూపులు
ఈనాడు, అమరావతి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రాయలసీమ ప్రాంతంతో అనుసంధానం చేయడానికి అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనిని కేంద్రప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించి నిధుల విడుదలకు సుముఖత వ్యక్తం చేయగా ఆరు వరుసలు, వంకర్లు లేకుండా నిర్మించి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేలా రూపుదిద్దనున్నారు. ప్రధాన కూడళ్లలో వాణిజ్య సముదాయాల అభివృద్ధికి క్లస్టర్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. పనులు పూర్తయ్యే నాటికి రహదారి వెంబడి స్థానికంగా లభించే ముడిపదార్థాల ఆధారంగా పారిశ్రామిక మండళ్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం నిర్మించే రహదారితోపాటు భవిష్యత్తులో రైల్వే ట్రాక్‌ వేయడానికి కూడా ఒకేసారి భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి ఆకృతులు, పెగ్‌మార్క్‌ సర్వే, ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయాలనే తదితర వివరాలతో నివేదిక తయారు చేయించింది. కీలక మార్గం కావడంతో భూసేకరణ వేగంగా చేయడానికి ప్రత్యేకంగా భూసేకరణ యూనిట్లు ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో భూసేకరణకు సంబంధించి రైతులకు అవగాహన సమావేశాలు ఏర్పాటుచేసి ధర నిర్ణయించే దశకు అధికారులు వచ్చారు. అయితే కేంద్రం నుంచి జాతీయ రహదారి నెంబరు కేటాయిస్తూ ప్రకటన ఇస్తేనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాల్సివుంది. కొన్నాళ్లుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నా ప్రకటన జారీలో జాప్యం జరుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో భూసేకరణ పనులు ఆగిపోయాయి.

జిల్లాలో 91 కిలోమీటర్ల దూరం
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం జిల్లాలో 91.44 కిలోమీటర్ల దూరం ఆరు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. నూజెండ్ల మండలం పమిడిపాడులో ఇది తొలుత ప్రవేశించి 281.100 నుంచి 303.350 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. తర్వాత ప్రకాశం జిల్లా మీదుగా చిలకలూరిపేట మండలం గోవిందాపురం వద్ద మళ్లీ జిల్లాలో ప్రారంభమవుతుంది. 324.700 నుంచి 393.594 కి.మీ. వరకు నిర్మించాల్సివుంది. మొత్తం 9 మండలాల్లో 29 గ్రామాల్లో భూసేకరణ చేయడానికి పెగ్‌మార్క్‌ సర్వే పూర్తయింది. నిర్మాణానికి 6116.22 ఎకరాలు సేకరించాల్సివుంది. ప్రకాశం జిల్లా సరిహద్దు నూజెండ్ల మండలం నుంచి భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రైతులకు అవగాహన సమావేశాలు ఏర్పాటుచేసి ఎకరాకు ప్రభుత్వం తరఫున ఎంత పరిహారం వస్తుందన్న అంశాలపై తెలియజేసి సేకరణకు సిద్ధమయ్యారు. భూమి ధర నిర్ణయించే క్రమంలో పనులు అర్ధా´ంతరంగా ఆగిపోయాయి. ఇటీవల ఒక డిప్యూటీ కలెక్టర్‌తో యూనిట్‌ ఏర్పాటు చేసినా కేంద్రం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. వినుకొండ మండలంలో మూడు, నూజెండ్ల మండలంలో ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయింది. రహదారి నిర్మాణంలో భాగంగా భూసేకరణ ప్రక్రియలో వచ్చే సమస్యలు, అటవీశాఖ నుంచి అనుమతుల కోసం జాతీయ రహదారుల నుంచి కార్యనిర్వాహక ఇంజినీర్‌ను ఒకరిని నియమించారు.

భూసేకరణ నిధులపై రాని స్పష్టత
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం భరిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. ఒక్క గుంటూరు జిల్లాలో భూసేకరణకు రూ.2 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి సహకారాన్ని రాష్ట్రం కోరుతోంది. ప్రాజెక్టు నివేదిక, భూసేకరణకు అవసరమైన ప్రాథమిక ప్రక్రియ వేగవంతంగా పూర్తయినా కేంద్రం నుంచి స్పందన లేక అడుగు ముందుకు పడటం లేదు. రాయలసీమకు సింగిల్‌ ట్రాక్‌ రైలు మార్గం ఉండటంతో రైళ్లతో విపరీతమైన రద్దీ ఉంటోంది. రహదారి మార్గాన పది గంటలకుపైగా ప్రయాణించాల్సిరావడంతో రాజధానికి రాకపోకలు సాగించడానికి సీమవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. అమరావతి-అనంతపురం మార్గం అందుబాటులోకి వస్తే ఆరు గంటల్లో చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టుగా భావించి కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం వైపు నుంచి భూసేకరణకు ప్రాథమిక ప్రక్రియ పూర్తిచేసి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం జాతీయరహదారి నెంబరు కేటాయిస్తూ ప్రకటన ఇచ్చిన వెంటనే భూసేకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Posted
10 hours ago, sonykongara said:

Worst ga behave chestunnaru Modi and Amit Shah. Prati chinna vishayanni lagadame...permissons ivvaru. isthe next yekkadekka delay cheyyalo akkada chestaru.

  • 4 weeks later...
Posted
On Tuesday, October 18, 2016 at 5:57 PM, koushik_k said:

:dream:  private odega kattedi elano. tolls petti elano vasul cheskontadu. poyedemunda ani .. land acquisition elano chestharu future ni mind lo pettukoni 8 liner ki

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై పీటముడి 
భూసేకరణ వ్యయంపై  తేలని వ్యవహారం 
ఎన్‌హెచ్‌ సంఖ్య కేటాయింపులో జాప్యం 
‘భారత్‌మాల గ్రాండ్‌ ఛాలెంజ్‌’లోకి తీసుకువెళ్లే యోచన 
ఈనాడు - అమరావతి 
24ap-main3a.jpg

రాజధానిని రాయలసీమకు చేరువ చేసే రహదారి విషయంలో పీటముడి వీడే పరిస్థితి కనిపించడం లేదు. ఆరు, నాలుగు వరుసలతో నిర్మితమయ్యే ఎక్స్‌ప్రెస్‌ మార్గానికి సంబంధించి భూసేకరణ వ్యయం భరించేందుకు కేంద్రం సుముఖంగా లేదు. అనంతపురం నుంచి అమరావతి వరకూ నిర్మితమయ్యే ఎక్స్‌ప్రెస్‌ మార్గానికి నిధుల కేటాయింపుపైనా వేర్వేరు మార్గాలను కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. భారత్‌మాల పథకంలోని రహదారిని ఇటీవల తీసుకువచ్చిన గ్రాండ్‌ఛాలెంజ్‌ విధానంలోకి చేర్చాలని భావిస్తోంది. ఈ కొత్త పద్ధతిలోకి చేర్చే రహదారులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం ఈ పద్ధతిలో చేపడితే భూసేకరణ వ్యయం భరించడంతోపాటు పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఎన్‌హెచ్‌ నెంబర్‌ ఎప్పుడొస్తుంది? 
అనంతపురం నుంచి అమరావతి వరకూ 395 కి.మీ.మేర ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. ఈ మార్గానికి కర్నూలు, కడప నుంచి వచ్చే రహదారులు కలుస్తాయి. అనంతపురం నుంచి గిద్దలూరు వరకు నాలుగు వరుసలుగా ఈ రహదారి ఉంటుంది. అక్కడినుంచి ఆరు వరుసల రహదారి వస్తుంది. ఈ మార్గం నిర్మాణానికి రూ.24 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8562 హెక్టార్ల భూమి, 838 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. భూసేకరణకు రూ.2వేల కోట్లపైనే ఖర్చవుతుందని అంచనా. జాతీయ రహదారిగా ప్రకటిస్తే భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరించాలి. జాతీయ రహదారుల చట్టం మేరకు భూమి సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ శాఖ చేయాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినా కేంద్రం చేయాల్సిన     విధివిధానాలు మాత్రం అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇందులో భాగంగా తొలుత ఆ మార్గానికి ఎన్‌హెచ్‌ నెంబర్‌ను ప్రకటించాల్సి ఉంది. జాతీయ రహదారుల చట్టం ప్రకారం నెంబర్‌ను అధికారికంగా ప్రకటించాక ఈ రహదారి నిర్మాణానికి వ్యయమంతా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. అందుకే ముందుకు వెళ్లడం లేదని రహదారులు, భవనాల శాఖ భావిస్తోంది. మరోవైపు ఈ మార్గాన్ని భారత్‌మాల ప్రాజెక్టులో చేర్చాలనే యోచన ప్రతిబంధకమవుతోంది. ఇందులో భాగంగా ఒక రాష్ట్రానికి ఒక ఆర్థిక సంవత్సంలో వంద కి.మీ. చొప్పున రెండు మార్గాలకు మించి ఇవ్వరు. ఈ మార్గం ఇచ్చిన ఏడాదికి 200 కి.మీ.చొప్పున ఇచ్చినా అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గానికి కనీసం మూడేళ్లు పట్టనుంది. అనంతపురం నుంచి అమరావతి రోడ్డుతోపాటు కర్నూలు, కడప నుంచి వచ్చే మార్గాలు కలిపితే మొత్తం ఈ రోడ్డు 557 కి.మీ.మేర వస్తుంది.

అటవీ భూముల మళ్లింపూ కీలకమే..ఈ మార్గానికి సంబంధించి అటవీ భూముల మళ్లింపులోనూ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి. 838 హెక్టార్ల మేర భూమి అవసరం. నల్లమల, శిరువెళ్ల, గానుగపెంట, బేతంచర్ల, పాణ్యం, ఉప్పుమాగులూరు తదితర రక్షిత అటవీ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. అలాగే నల్లమల అటవీ ప్రాంతాలలోనే పులుల అభయారణ్యం ఉంది. అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం కీలక అనుమతులు అవసరం. నిర్మాణంపై రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం విషయంలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నాం. ఎన్‌హెచ్‌ నెంబర్‌ కేటాయింపు అంశాన్ని ఇటీవల మరోసారి ప్రస్తావించాం. గతంలో ఎన్‌హెచ్‌డీపీగా పిలిచే ప్రాజెక్టుల్నే ఇప్పుడు భారత్‌మాలగా చేపడుతున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం ప్రాజెక్టును అందులోకి చేర్చే అంశంపై స్పష్టత రాలేదు’ అని అన్నారు.

it is better to  complete godavari penna link first then amaravati anantpur expressway , or atleast acquire land for both projects simultaneously . otherwise land acquisition cost for godavari penna link canal will increases abnormally.  

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...