Jump to content

Recommended Posts

Posted
ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్‌!
22-09-2018 03:29:04
 
  • డీపీఆర్‌ దశలోనే 50 శాతం భూసేకరణ పూర్తిచేస్తే వేగంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు
 
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): భూసేకరణ భారపు ఖర్చుల పద్దుల్లో ఇరుక్కొని మూలనపడిన జాతీయ రహదారి ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించేందు కు కేంద్రం.. రాష్ట్రాలకు ఆఫర్‌ ప్రకటించింది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) దశలోనే 50ు భూసేకరణ చేసి ఉంటే ఎక్స్‌ప్రె్‌సవేలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బైపా్‌సలను వేగంగా నిర్మిస్తామని, ఆర్థిక వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పింది. అంటే రహదారి ప్రాజెక్టుల్లో భూసేకరణ ఖర్చు రాష్ట్రాలు భరిస్తేనే ఈ ఆఫర్‌ను అందుకోవచ్చన్నమా ట! వందల నుంచి వేలకోట్ల ప్రాజెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. భారత్‌మాలలో చేపట్టే ఎక్స్‌ప్రె్‌సవేలు, ఓఆర్‌ఆర్‌లకు కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌) రాష్ట్రాలకు వర్తమానం పంపింది. ఇంకా, ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణంలో 25ు భూసేకరణ ఖర్చు రాష్ట్రాలు భరిస్తే ఆ ప్రాజెక్టులను ఫాస్ట్‌ట్రాక్‌ కింద చేపడతామని పేర్కొంది. అయితే, భూసేకరణ చట్టం-2013 అమ లు కారణంగా తాము ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చు భరించలేమని, రాష్ట్రాలే వాటిని భరించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఇదే పేరుతో ఇప్పటిదాకా అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే డీపీఆర్‌పై కొర్రీలు వేస్తూ వచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల విశాఖకు వ చ్చిన సమయంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాలపై భూసేకరణ భారం తగ్గించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎంఓఆర్‌టీహెచ్‌ నుంచి తాజాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు వచ్చాయి.
 
పెండింగ్‌లో 137 ఓఆర్‌ఆర్‌లు
ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణ ఖర్చు వేల కోట్లలో ఉంటోంది. సగటున 190 కి.మీ ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ ఖర్చే రూ.5 వేల కోట్లపైనే ఉంటోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కేంద్రమే ఈ ఖర్చులను రాష్ట్రాలకు చెల్లించాలి. మొత్తం ప్రాజెక్టు క న్నా భూసేకరణ వ్యయమే ఎక్కువగా ఉండటంతో కేంద్రం వద్ద 137 ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఔటర్‌ల నిర్మాణంలో డీపీఆర్‌ దశలోనే కనీసం 25 శాతం భూసేకరణ ఖర్చును భరిస్తే వాటిని ఎన్‌హెచ్‌ఏఏ తీసుకొని త్వరితగతిన నిర్మిస్తుందని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంఓఆర్‌టీహెచ్‌ రాష్ట్రాలకు ఆఫర్‌ ఇచ్చింది. ఈ ఆఫర్‌ వెనుక అనేక కోణాలున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు భూసేకరణకు సిద్ధంగా ఉన్నా కేంద్రం ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ ఖర్చుకు భయపడి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం లేదు. దీంతో సంవత్సరానికి 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మించాలన్న సంకల్పం నెరవేరడం లేదు.
 
డీపీఆర్‌కు ముందే 25 శాతం భూసేకరణ పూర్తిచేస్తే వాటిని త్వరితగతిన చేపడతామని వ్యూహాత్మక ఆఫర్‌ ఇచ్చినట్లుగా ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డీపీఆర్‌ సమర్పించాక మిగిలిన 75 శాతం భూసేకరణ ఖర్చును ఎవరు భరిస్తారు? కేంద్రమా? లేక రాష్ట్రాలే భరించాలా? అన్నదానిపై ఈ మార్గదర్శకాల్లో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలకు కేంద్రం సుముఖంగానే ఉంది. అయితే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు విషయంలో భూసేకరణ ఎలా? భూసేకరణా, సమీకరణా అన్నదానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. ఏపీ మాత్రం భూ సమీకరణకు వెళ్లే ఆలోచనలో ఉంది. ఇదిలావుంటే, అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే భూసేకరణ కోసం ఏపీ భూసేకరణ చట్టం-2018ని వర్తింపచేయనున్నారు. ఈ చట్టంలోని సెక్షన్‌-10ఏ కింద కీలక మినహాయింపులు ఇచ్చి నోటీఫికేషన్‌ ఇవ్వనున్నారు.
Posted
రాజధానికి దారేది?
25-09-2018 02:53:43
 
636734408249383120.jpg
  • నేరుగా చేరుకోడానికి సీమ వాసుల కష్టం
  • పనుల మీద వచ్చేవారికి భరోసానివ్వని మార్గాలు
  • ఎక్కువ భాగం డబుల్‌ రోడ్లే.. ఘాట్లో పడితే ఇక అంతే
  • మలుపుల్లో ముప్పు తిప్పలు.. ఎప్పటికి చేర్చేనో తెలీదు
  • రైల్వే సర్వీసూ అంతంతే.. ప్రయాణం నరకయాతనే
  • ‘అనంత- అమరావతి’ ఎక్స్‌ప్రెస్‌ వేతోనే ఊరట
(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)
రాజధాని వచ్చింది. అభివృద్ధికి దారిపడింది. ప్రభుత్వంలో పనుల కోసం హైదరాబాద్‌కు పరుగులు తీసే పని తప్పింది. ఇక్కడే మన ‘అమరావతి’లోనే అన్ని పనులు చక్కబెట్టుకొనే వెసులుబాటు పెరిగింది. నవ్యాంధ్ర ఏర్పాటయిన ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని జిల్లాలన్నింటి మనోగతం దాదాపు ఇదే! రాయలసీమ జిల్లాలు కూడా ‘అమరావతి మనదే’ అని అనుకొంటున్నాయి. కాకపోతే, ఈ జిల్లాల ప్రజలను రాజధానికి అనుసంధానించే సరైన దారులు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. రాజధాని నగరానికి చేరుకోవడం వారికి కష్టంగా, క్లిష్టంగా మారింది. ఆరు లేన్లు, ఎనిమిది లేన్ల రోడ్ల మీద మిగతా రాష్ట్రమంతా పరుగులు పెడుతుంటే, రాయలసీమ ప్రజలు మాత్రం, ఇప్పటికీ ఎక్కువభాగం ఘాట్‌ రోడ్లు, డబుల్‌ లేన్లపైనే ప్రయాణిస్తున్నారు.
 
ఎక్కడ ప్రయాణం స్తంభించిపోతుందో, ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పలేని పరిస్థితి! దీంతో కొత్త రాజధానితో సుఖం పెరగాల్సింది పోయి..‘హైదరాబాదే నయం’ అనే పరిస్థితికి సీమవాసులు చేరుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా నాన్చుతున్న ‘అనంతపురం- అమరావతి’ ఎక్స్‌ప్రెస్‌ వే త్వరగా రూపుదిద్దుకోవాలన్న డిమాండ్‌ ఈ ప్రాంతవాసుల నుంచి బలంగా వినిపిస్తోంది.
 
కర్నూలు: హైవే అయినా టెన్షనే!
కర్నూలు నుంచి హైదరాబాద్‌కు 212 కిలోమీటర్లు. బస్సులో వెళితే 3.30 గంటలు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళితే 2 నుంచి 2.30 గంటల్లోనే చేరిపోతారు. నేషనల్‌ హైవే కావడంతో ప్రయాణానికి ఇబ్బంది లేదు. అదేగనుక కర్నూలు నుంచి విజయవాడకు చేరుకోవాలంటే 348 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు ఎక్కితే 6.30 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. ప్రైవేటు వాహన సర్వీసులు 5.30 గంటల నుంచి 6 గంటల్లో కర్నూలువాసులను విజయవాడకు చేరుస్తాయి. దూరం మాత్రమే అయితే, ఏదోలా సర్దుకోవచ్చు. సమయం కొంచెం అటూఇటూ అయినా సరిపెట్టుకోవచ్చు. కానీ, ఈ మార్గంలో బస్సు ప్రయాణమే పెద్ద సవాల్‌. కర్నూలు నుంచి ఆత్మకూరు దాకా డబుల్‌ రోడ్డులో ప్రయాణం. ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు, అంటే 63 కిలోమీటర్లు నల్లమల అటవీ మార్గంలో ఘాట్‌ రోడ్డులో ప్రయాణించాలి.
 
ఒకవైపు పాతాళాన్ని తాకే లోయలు, మరోవైపు ఎప్పుడు మీద పడతాయో తెలియని కొండచరియల నడుమ నుంచి వొరుచుకొంటూ ఈ ఘాట్‌ రోడ్డులో సాగాలి. ఏదైనా వాహనం ఈ రోడ్డులో మొరాయించినా, ప్రమాదానికి గురయినా, క్లియరెన్స్‌ చేయడానికే కొన్ని గంటలు పడుతుంది. దాదాపు పది కిలోమీటర్ల మేర పరుచుకొన్న సన్నటి, ప్రమాదకరమైన ఘాట్‌ మలుపుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నల్లమల రిజర్వుడ్‌ ఫారెస్ట్‌ కావడంతో రోడ్డు విస్తరణ, ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదు. ఈ గండం అధిగమించి దోర్నాల దాటితే.. అక్కడినుంచి జాతీయ రహదారి బాగుంటుంది. నరసరావుపేట, గుంటూరు మీదుగా హైవేపై విజయవాడకు చేరుకోవచ్చు. కర్నూలు నుంచి విజయవాడకు సూపర్‌ ఎక్స్‌ప్రె్‌సలు, ఆల్ర్టా డీలక్స్‌, ఇంద్ర, గరుడ సర్వీసులు నడుస్తున్నాయి. ఇక రైలు సర్వీసుల విషయానికి వస్తే.. రోజుకు నాలుగు ఎక్స్‌ప్రె్‌సలు అందుబాటులో ఉన్నాయి.
 
అనంతపురం: చేరేదాకా సవాలే!
అనంతపురం నుంచి హైదరాబాద్‌కు 359 కిలోమీటర్లు. దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల్లో చేరుకొంటారు. రాత్రి భోజనం చేసుకొని బస్సు ఎక్కితే ఉదయం కల్లా అక్కడికి చేరిపోతామన్న భరోసాను..ఆ మార్గంలోని ఆరు లేన్ల రోడ్లు కల్గిస్తాయి. అదే నవ్యాంధ్ర రాజధాని విషయానికి వస్తే.. అలాంటి అంచనాకు తావే ఉండదు. అనంతపురం నుంచి అమరావతికి 489 కిలోమీటర్లు ప్రయాణించాలి. సమస్య దూరం కాదు, రహదారి బాగుండి, వేళకు బస్సులు ఉంటే వెళ్లిపోవచ్చు. బస్సు సర్వీసుల షెడ్యూలూ ఫరవాలేదు. రహదారి కూడా.. కర్నూలు జిల్లా దాకా బాగానే ఉంటుంది. ఇక అక్కడనుంచి రాజధానికి దారితీసే రహదారి..ప్రయాణికులను ముప్పు...తిప్పలు పెడుతుంది. గుంతలమయమైన రోడ్లు ఒకవైపు, శ్రీశైలం ఘాట్‌లో రోడ్లు సరిగా లేకపోవడం మరోవైపు.. అడుగడుగునా ఇబ్బంది పెడతాయి.
 
అనంతపురం నుంచి నంద్యాల మీదుగా విజయవాడకు ఒక మార్గం; అనంతపురం నుంచి కర్నూలు మీదుగా మరో మార్గం ఉన్నాయి. సూపర్‌ లగ్జరీలు, ఇంద్ర, గరుడ ఈ మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ మార్గాల్లో బస్సుల్లో వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతుండగా, కార్లలో వెళ్లేవారికి 9 గంటల సమయం పడుతోంది. రైల్వే సర్వీసులే కొంతలో కొంత అనంత వాసులకు ఊరట. అయితే, ఈ సర్వీసులు పరిమితంగా ఉన్నాయి. ఇక్కడనుంచి రాజధానికి రోజుకు రెండు ఎక్స్‌ప్రె్‌సలే (ప్రశాంతి, కొండవీడు) ఉన్నాయి. పైగా రోజులో సగకాలం ప్రయాణానికే పోతుంది. సాయంత్రం ఏడు గంటలకు ప్రశాంతి ఎక్కితే.. అనంతపురం - గుంతకల్లు మీదుగా ఉదయం ఆరు గంటలకు విజయవాడకు చేరుస్తుంది. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ గుత్తి, తాడిపత్రి మీదుగా 11 గంటలు ప్రయాణించి విజయవాడకు చేరుతుంది.
 
కడప: దగ్గరయినా సుఖమేది?
హైదరాబాద్‌తో పోల్చుకొంటే విజయవాడే కడపకు కొంచెం దగ్గర. అయినా, రాజధాని చేరుకోవడానికే గంట ఎక్కువ సమ యం పడుతుంది. కడపనుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్‌ కు 425 కిలోమీటర్ల దూరం. మనం ఎక్కిన బస్సు 9 గంటల్లో అక్కడకు చేర్చేస్తుంది. కడప నుంచి పోరుమామిళ్ల-మార్కాపురం-గుంటూరు-విజయవాడకు దూరం 375 కిలోమీటర్లే. కానీ ప్రయాణానికి 10 గంటలు పడుతుంది. కర్నూలు నుంచి కావలి, ఒంగోలు మీదుగా ప్రయాణిస్తే గంట కలిసివస్తుంది.
 
కడప నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రహదారి కావడంతో ఇబ్బంది లేదు. కానీ, కడప నుంచి ఏ దారిలో వెళ్లాలన్నా కష్టంగానే ఉంటుంది. కడప వయా కావలి, ఒంగోలు మీదుగా విజయవాడకు రహదారి ఫరవాలేదు. కడప వయా పోరుమామిళ్ల, మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చేదారిలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మైదుకూరు నుంచి పోరుమామిళ్ల వరకు దారి దెబ్బతిని.. ప్రమాదాలకు నెలవుగా మారింది. కడప నుంచి విజయవాడకు నేరుగా రైలు సర్వీసులు లేకపోవడం కష్టంగా మారింది. ఇటీవ లే కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులు మొదలు కావడం పనుల మీద రాజధానికి వచ్చే వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు ఒకింత ఊరటే!
  • 1 month later...
Posted
ఎక్స్‌ప్రెస్‌ వే!
13-11-2018 03:37:03
 
636776770237280940.jpg
  • అనంత-అమరావతి రోడ్డు కసరత్తు వేగిరం
  • కేంద్రానికి ఇచ్చే డీపీఆర్‌ రెడీ
  • కొర్రీలతో 3 ఏళ్లు పెండింగ్‌లో
  • సీఎం చొరవతో తిరిగి కదలిక
  • త్వరలో ఢిల్లీలో ముఖ్య భేటీ
  • ఫలిస్తున్న ఆర్‌అండ్‌బీ కృషి
‘నవ్యాంధ్ర రాజధానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో అనుసంధానం’... ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీ! ఆ మేరకు రాయలసీమకు రాజధానిని చేరువ చేసేలా ‘అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే’ను రాష్ట్రం ప్రతిపాదించింది. కేంద్రం కొర్రీలు, మార్పులు, చేర్పుల అనంతరం ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొలిక్కి వస్తోంది!
 
అమరావతి, నవంబరు 12 (ఆంధ్ర‌‌‌‌జ్యోతి): రాయలసీమను రాజధానికి అనుసంధానించే అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై త్వరలో ముందడుగు పడనుంది. రూ. 23వేల కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టనున్న ఈ ఎక్స్‌ప్రె్‌సవే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) కొలిక్కి వచ్చింది. త్వరలోనే అది అధికారికంగా కేంద్రానికి చేరనుంది. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ ప్రయత్నాలు తొలి మైలురాయిని దాటతాయి. త్వరలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ( ఎంవోఆర్‌టీహెచ్‌), దాని పరిధిలోని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే ఎక్స్‌ప్రె్‌సవేకు సంబంధించిన భూసేకరణ అంశంపై విధాన నిర్ణయం తీసుకోనున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రయత్నాలతో కొలిక్కివస్తుండటం విశేషం. ఈ నెలాఖరులోగా ఎంవోఆర్‌టీహెచ్‌, ఎన్‌హెచ్‌ఏఐ నుంచి శుభవార్త వస్తుందని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి.
 
అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను కలుపుతూ అమరావతి రాజధానికి ఎనిమిది వరుసల వంపులు లేని రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ఎనిమిది వరుసలను కాస్తా తొలుత ఆరుకు, ఆ తరువాత నాలుగుకు కుదించారు. 557 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు రూ. 25వేల కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర సర్కారు, ఎన్‌హెచ్‌ఏ వర్గాలు అంచనావేశాయి. తొలుత మొత్తం ఖర్చు భరిస్తామన్న కేంద్రం, ఎనిమిది నెలల వ్యవధిలోనే మాటమార్చింది. భూసేకరణకయ్యే రూ. 2,200 కోట్లను రాష్ట్రమే భరించాలని, రోడ్డు వెడల్పు విషయంలో పలు మార్పులు చేయాలంటూ కొర్రీలు వేసింది. ఈ ఒక్క కారణంగా ఈ ఏడాది వరకు ఈ ప్రాజెక్టు కొలిక్కిరాలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నంగా సొంతంగానే భూసేకరణ ఖర్చును భరించేందుకు సన్నహాలు చేసుకుంది.
 
ఈ మేరకు రోడ్డు వెడల్పును కూడా తగ్గించింది. అయితే, ఇంకా కొన్ని సాంకేతిక కారణాలు, డీపీఆర్‌ ఇవ్వలేదనే కారణాలతో ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల జాబితాలో మన ఎక్స్‌ప్రె్‌సవేను కేంద్రం చేర్చలేదు. ప్రతిపాదిత ప్రాజెక్టుగానే చూపిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీతో అనేకసార్లు మంతనాలు జరిపారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఓ సమావేశంలో బహిరంగ వేదికపైనే కేంద్రమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో నితిన్‌ గడ్కరీ కొంతమేర వెనక్కు తగ్గారు. 50 శాతం భూసేకరణ ఖర్చును కేంద్రం భరిస్తుందని సభావేదికగా ప్రకటించారు. రెండు నెలల క్రితం ఇదే విషయాన్ని ఎంవోఆర్‌టీహెచ్‌ అధికారులు అధికారికంగా ఏపీకి తెలియజేశారు.
 
కుదించడమే ‘దారి’
అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణానికి 22,500 ఎకరాలకుపైనే భూమి అవసరం. భూసేకరణకు రూ. 2,250 కోట్లు కావాలి. రహదారిని రూ. 100 మీటర్ల వెడల్పునకు కుదించే పక్షంలో ఈ భారం రూ. రెండువేల కోట్లనుంచి రూ. 1,500 కోట్లకు తగ్గుతుందని అధికారులు అంచనావేశారు. అప్పుడు భూసేకరణలో రూ. 800 కోట్లు కేంద్రం భరిస్తే సరిపోతుంది. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇచ్చిన హామీ మేరకు ఏపీ ఆర్‌అండ్‌బీ ఈ మేరకు ఇటీవల ప్రతిపాదనలు కూడా పంపించింది. అయితే, ప్రభుత్వ భూములకు కేంద్రం సొమ్ములివ్వదు. కాబట్టి పూర్తిగా ప్రైవేటు భూములకే కేంద్రం నుంచి వచ్చే పరిహరం వెళ్లేలా ప్రతిపాదనలు సమర్పించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిచేసింది. పెగ్‌ మార్కింగ్‌, ట్రాఫిక్‌ సర్వే పూర్తిచేసింది.
 
ఢిల్లీకి చేరుకొన్న ప్రయత్నాలు
ఎక్స్‌ప్రె్‌సవే కోసం సేకరించే భూమిలో అటవీ భూములు ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించారు. నల్లమల అటవీప్రాంతంలో పెద్దఎత్తున అటవీ భూములు సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల పరిశీలన కూడా జరుగుతోంది. మరోవైపు ఎక్స్‌ప్రె్‌సవేపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక కొలిక్కివచ్చింది. కేంద్రం తిరిగి ఎలాంటి కొర్రీలు వేయడానికి అవకాశం లేకుండా దానికి తుదిరూపం ఇస్తున్నారు. అయితే, ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, ఈ నెలాఖరులోగా డీపీఆర్‌ ఇవ్వాలని, డిసెంబర్‌ నుంచి భూసేకరణ ప్రారంభించి 2019 జనవరి నుంచే రహదారి నిర్మాణ పనులను చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
 
దీనికి తగినట్లుగా ఇద్దరు ఆర్‌అండ్‌బీ అధికారులు ఢిల్లీలో మకాం వేసి ఎన్‌హెచ్‌, ఎంవోఆర్‌టీహెచ్‌ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూసేకరణలో కేంద్రం వాటా ముందుగా ఇచ్చేలా వారిని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ‘‘డీపీఆర్‌, భూసేకరణను త్వరగా కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమ్యాలను కేంద్ర అధికారులకు వివరించాం. వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. అయితే అది ఉత్తర్వుల రూపంలో బయటకు రావాలి. ఈనెలాఖరులోగా డీపీఆర్‌, భూసేకరణ ఖర్చు విడుదలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఈ ప్రాజెక్టు సాధనకోసం పనిచేస్తున్న సీనియర్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Posted
సంధానం సాకారం!
16-11-2018 02:25:54
 
636779319558430236.jpg
  • అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం
  • రోడ్డు వెడల్పు 100 మీటర్లు
  • 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి
  • సీఎం ప్రతిపాదనకు అంగీకారం
  • కేంద్రం నుంచి చల్లటి కబురు
  • 25 వేల ఎకరాలు అవసరం
  • 2013 చట్టం మేరకే భూసేకరణ
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి వంపులు, మలుపులు లేకుండా అనంతపురం-అమరావతి జాతీయ రహదారిని నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎంవోఆర్‌టీహెచ్‌) ఆమోదం తెలిపింది. సుదీర్ఘ సంప్రదింపులు, చర్చోపచర్చలు, నివేదికల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన షార్టెస్ట్‌ స్ట్రెయిట్‌ అలైన్‌మెంట్‌ (ఎస్‌ఎ్‌సఏ)కు ఎలాంటి ఆంక్షలు లేకుండా అంగీకరించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంలో కీలక ముందడుగు పడినట్లయింది. ఇక రహదారి డిజైన్లు, ఇతరత్రా ఆమోదం సులువుగానే జరిగిపోతాయని, అలైన్‌మెంట్‌కు కేంద్రం ఒప్పుకోవడమే అతిపెద్ద పురోగతి అని రోడ్లు-భవనాల శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నరపాటు అప్రతిహతంగా కొనసాగిన ప్రయత్నాలకు ఇది తొలి ఫలితమని అధికారులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడపలను నవ్యాంధ్ర రాజధాని అమరావతితో అనుసంధానించేందుకు అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను రాష్ట్రప్రభుత్వం 2016లోనే ప్రతిపాదించింది.
 
ఎలాంటి మలుపులు, వంకలు లేకుండా ఏకరీతిన ఉండేలా దీని నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అమరావతి నుంచి అనంతపురానికి ప్రయాణం సాఫీగా ఉండాలని, రహదారిలో ప్రమాదకరమైన, ఇబ్బందికరమన మలుపులు, వంకలు ఉండకూడదని.. ఆరు గంటల వ్యవధిలోనే ప్రయాణం పూర్తవ్వాలని ఆయన దిశానిర్దేశం చే శారు. ఈ దిశగా ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదికలు తయారు చేశారు. దీని ప్రకారం 502 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ వే కొనసాగనుంది. అమరావతి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం వరకు 394 కి.మీ. మేర ఏకరీతిన రహదారి నిర్మాణం ఉంటుంది. ఇదికాకుండా కర్నూలు నుంచి అదనంగా మరో 19 కి.మీ., కడప నుంచి 64.50 కి.మీ., ప్రకాశం నుంచి 23.50 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధిచేసి ఈ రహదారికి అనుసంఽధానిస్తారు. అంటే మొత్తం ప్రాజెక్టు 502 కి.మీ. మేర ఉండనుంది. చిత్తూరు నుంచి వచ్చే మార్గం ప్రకాశం జిల్లా గాలికొండ వద్ద ఈ రోడ్డుకు కలవనుంది. తొలుత ఆరు వరసలకు ప్రతిపాదనలు రూపొందించారు.
 
రహదారి వెడల్పు 200 మీటర్లు ఉండాలన్నారు. దీనిపై కేంద్ర రవాణా శాఖ ఆందోళన చెందింది. కారణం.. నిర్మాణ వ్యయం అంచనా రూ.30 వేల కోట్లపైన ఉండడమే. డిజైన్లు మార్చుకోవాలని, రహదారి వెడల్పును 70 మీటర్లకు కుదించాలని గట్టిగా ఒత్తిడి తెచ్చింది. రాష్ట్రం కొంత మేర తగ్గింది. రహదారి వెడల్పును 100 మీటర్లకు ఖరారు చేయాలని.. ఆరు వరుసలను నాలుగు వరుసలకు కుదించాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎంవోఆర్‌టీహెచ్‌కు పంపింది. ఇదే సమయంలో భూసేకరణ ఖర్చును ఎవరు భరించాలన్న సమస్యను కేంద్రం తెరపైకి తెచ్చింది. తొలుత రాష్ట్రమే భరించాలని చెప్పింది. దీన్ని రాష్ట్రం తిరస్కరించింది. సీఎం అనేక ప్రయత్నాలు, ఒత్తిళ్ల తర్వాత భూసేకరణ ఖర్చును 50 శాతం మేర కేంద్రం భరిస్తుందని స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారు.
 
ఈ దిశగా ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ఎంవోఆర్‌టీహెచ్‌ ఆమోదించింది. ఇటీవల ఢిల్లీలో ఆ శాఖ అధికారులతో ఆర్‌ అండ్‌ బీ అధికారులు భేటీ అయ్యారు. భూసేకరణ ఖర్చును సగం భరించేందుకు అంగీకరించినందున ఈ దిశగా ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. అతి కీలకమైన ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కూ సరేనంది. అనేక అభ్యంతరాలు, సందేహాలు, కొర్రీలు వేసినా ఆర్‌ అండ్‌ బీ అధికారులు వాటన్నిటినీ నివృత్తి ్తచేసినట్లు తెలిసింది. ఈ రహదారి నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకుందని వాపోతూనే ప్రాజెక్టు వల్ల వచ్చే ప్రయోజనాలు, రహదారి ప్రాంతంలో జరిగే ఆర్ధికాభివృద్ధి ఫలితాలను పరిగణలోకి తీసుకొని ఎంవోఆర్‌టీహెచ్‌ ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
ఫలించిన సీఎం కృషి..
దేశంలో ఇంతవరకు 394 కిమీ. మేర మలుపుల్లేని తిన్నని రహదారిని ఎక్కడా నిర్మించలేదు. తక్కువ దూరంలో కొన్ని రహదారులున్నా అవి జాతీయ రహదారులు కావు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌గా ఉండేలా ప్రతిపాదించారు. స్ట్రెయిట్‌ అలైన్‌మెంట్‌ కారణంగానే రహదారి నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లపైనే ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే 9 గంటల ప్రయాణం ఆరు గంటలకు తగ్గిపోతుంది. ప్రస్తుతం అనంతపురం నుంచి అమరావతికి 463 కి.మీ. మేర రెండు వరుసల రహదారి ఉంది. ఎక్స్‌ప్రె్‌సవే వల్ల 70 కిమీ దూరం తగ్గడంతోపాటు మూడు గంటల ప్రయాణ సమయం పూర్తిగా తగ్గుతుంది.
 
ఇన్ని ప్రయోజనాలున్న రహదారి నిర్మాణంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. 50కి పైగా భారీ వంతెనలు, 21 కి.మీ. పరిధిలో అనేక పొడవైన సొరంగాలు ప్రతిపాదించారు. అన్నిటికీ మించి దట్టమైన నల్లమల అటవీమార్గంలో టన్నెళ్ల నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో దీని ఆమోదానికి కేంద్రం వద్ద సీఎం అనేక ప్రయత్నాలు చేశారు. కేంద్రం లేవనెత్తే అనేకానేక సందేహాలకు ఓపికగా సమాధానమివ్వాలని ఆర్‌అండ్‌బీకి దిశానిర్దేశం చేశారు దీంతో వారు ఎంవోఆర్‌టీహెచ్‌ను ప్రసన్నం చేసుకుని అలైన్‌మెంట్‌కు ఆమోదం సంపాదించారు.
 
భూసేకరణ ప్రక్రియ 90% పూర్తి!
అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే కోసం 25 వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో అటవీ భూమి 2వేల ఎకరాలకు పైనే ఉంది. 2013లో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని ఎంవోఆర్‌టీహెచ్‌ ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియను 90 శాతం మేర అధికారులు పూర్తిచేశారు. అటవీ అనుమతులు వస్తే మిగిలిన 10 శాతం పెగ్‌మార్కింగ్‌, మట్టి పరీక్షలు, ఇతర ప్రక్రియలను కూడా పూర్తిచేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
Posted
7 hours ago, swarnandhra said:

meters ye.

502 km x 100m wide == 12404 acres. mari 25000 acre land acquisition enduko. 

true... don't understand the need for 25k acres. Also each lane is 4m... so 4 lanes on each side requires 32-35m. so don't understand why they only want 2 lanes each side.

Posted

I hope this will be done asap. Saying that 90% land acquisition is completed, which is a great thing. If Govt can call tenders and start ground braking before general elections, it would be a great achievement.

Posted
57 minutes ago, ravikia said:

I hope this will be done asap. Saying that 90% land acquisition is completed, which is a great thing. If Govt can call tenders and start ground braking before general elections, it would be a great achievement.

Central govt has to call for tenders.Its a national highway

Posted
9 hours ago, Jaitra said:

Central govt has to call for tenders.Its a national highway

Central Govt tenders pilichi, money release chesi and work start & complete avvali ante......we can forget about this as long as BJP is in the Central Government 

Posted
రహదారుల సంస్థకే భూసేకరణ బాధ్యత
25-11-2018 02:39:46
 
  • అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌‌‌‌వేపై కేంద్రం ఆదేశం
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అనుసంధానించే అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌‌‌‌వే ప్రాజెక్టులో భూసేకరణకు మార్గం సుగుమం అయింది. 384 కిలోమీటర్ల పొడవైన షార్టెస్ట్‌ స్ట్రెయిట్‌ అలైన్‌మెంట్‌(ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ)కి కేంద్రం ఆమోదం తెలపడంతో అధికారికంగా భూసేకరణ పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఏపీ భూసేకరణచట్టం-2018 (2013 కేంద్ర చట్టానికి రాష్ట్రం సవరణ) దీనికి వర్తించడం లేదు. కేంద్ర చట్టం మేరకే ఈ ప్రాజెక్టుకు భూములు సేకరించాలని కేంద్రం ఆదేశించింది. భూసేకరణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాథికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి అప్పగించారు.
 
ఇక ఈ సంస్థే భూసేకరణకు అవసరమైన నోటిఫికేన్లు జారీ చేయడం, నిర్వాసితులకు పరిహారం చెల్లించడం, పునరావాస ప్యాకేజీల ఖరారు, అమలు వంటి కీలక బాధ్యతలను చూసుకుంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు భూసేకరణ నిర్వహణ బాధ్యతలు ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలిపింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, భూసేకరణ ప్రక్రియపై ఇప్పటిదాకా చేసిన కసరత్తు, రూపొందించిన షెడ్యూళ్లు, ఇతర సమాచారం మొత్తం ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించాలని ఏపీ ఆర్‌అండ్‌బీలోని జాతీయ రహదారుల విభాగాన్ని ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండేలా ప్రతి చర్య, చిన్న కాగితం నుంచి పెద్ద నివేదికల వరకు అన్ని వివరాలను ‘భూమిరాశి’ అనే ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో పొందుపరుస్తారు.
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
అనుమతుల బాధ్యత ఏపీదే   

 

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధిపై కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: భూసేకరణకయ్యే వ్యయంలో 50శాతం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాలన్న షరతుతో అమరావతి-అనంతపురం మధ్య 400 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధికి కేంద్ర రహదారులు, రోడ్డు రవాణాశాఖ అంగీకరించినట్లు ఆ శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయ తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు సుజనాచౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర తెలిపిందన్నారు. అయితే ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులన్నింటినీ రాష్ట్రప్రభుత్వమే తెచ్చుకోవాలన్న ముందస్తు షరతుతో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జాతీయ రహదారుల చట్టం(ఎన్‌హెచ్‌యాక్ట్‌) 1956లోని సెక్షన్‌ 3ఏ కింద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించకముందే ఆ మూడు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 

  • 3 weeks later...
Posted
8 లైన్లుగా అమరావతి-అనంత రహదారి
08-01-2019 03:53:13
 
  • అవసరాన్ని బట్టి విస్తరణ: గడ్కరీ
న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భాగంగా ప్రస్తుతానికి నాలుగు లైన్ల రోడ్డును నిర్మించి, ట్రాఫిక్‌ రద్దీని బట్టి భవిష్యత్తులో 8 లైన్లకు విస్తరించే వెసులుబాటును కల్పించినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక ఈ సమాధానమిచ్చారు. అమరావతి-అనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి 2018లో రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై 384 కిమీ మేర రోడ్డుకు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశామని చెప్పారు. అలాగే, దుగరాజపట్నం పోర్టుకు బదులుగా మరో ప్రాంతంలో పోర్టు అభివృద్ధికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ప్రతిపాదించాలన్న విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు అడిగిన ఓ ప్రశ్నకు మాండవీయ సమాధానం ఇచ్చారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...