Jump to content

Amaravati to Anantapur Expressway


Recommended Posts

రియల్‌.. ‘ఎక్స్‌ప్రెస్‌’
 
636269555538802084.jpg
 • అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేతో రియల్‌ ఎస్టేట్‌లో కదలిక
 • రోడ్డుకిరువైపులా ఉన్న భూములపై రియల్టర్ల కన్ను
 • రెండు మూడు రెట్లు పెరిగిన భూముల ధర
 • కొన్ని జిల్లాల్లో బేరసారాలు.. అన్నదాతల్లో ఆశలు
 • వేగంగా సర్వే, భూసేకరణ పూర్తి చేస్తాం: దావ్రా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మళ్లీ కదలిక వచ్చింది. పలు ప్రాజెక్టులు పడకేయడం, పెద్ద నోట్ల రద్దు, నగదు లావాదేవీలపై ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యింది. క్రయవిక్రయాలు జరక్క.. వేలాది రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసిన భూములు అమ్ముడుపోక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు ప్రకటన ఈ రంగంలో మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నది. రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి వేగంగా చేరుకునేలా ఆరు వరుసలతో ఈ రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు పక్కనే భవిష్యత్తులో రైల్వే లైన్‌ కూడా నిర్మించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. రోడ్డుతోపాటు రైల్వే లైనుకూ భూసేకరణ చేపట్టాలని భావిస్తున్నది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం సాగనుండటంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములపై రియల్‌ వ్యాపారులు దృష్టి కేంద్రీకరించారు.
 
భారీగా పెరిగిన ధరలు
గుంటూరు జిల్లాలోని వినుకొండ, నూజెండ్ల, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, తాడికొండ మీదుగా ఈ రహదారిని నిర్మిస్తారు. జిల్లాలోని 33 గ్రామాల్లో 4,500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. జిల్లా యంత్రాంగం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించింది. దీంతో గుంటూరు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని మండలాల్లో ఎకరం రూ.25 లక్షలకు చేరుకోగా అమరావతికి సమీపంలో ఉండే తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరులో రూ.కోటి దాటి పోయింది. భూసేకరణపై ప్రాథమిక నోటిఫికేషన వెలువడే నాటికి ధరలు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలో ఉండే వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట పట్టణాల్లో భూముల ధరలు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 75 కిలోమీటర్ల మేర అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి ఇంజనీర్లు సర్వే చేపట్టారు. కర్నూలు నగరంలో బైపాస్‌ నుంచి ఈ రోడ్డు నిర్మాణం మొదలవుతుంది. ఎలాంటి వంకర్లు లేని ఈ రోడ్డు నిర్మాణం వస్తుందని తెలిసి ఆయా ప్రాంతాలు అప్పుడే భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. బేతంచెర్ల, నందవరం, రామళ్లకోట తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రధాన రోడ్లను ఆనుకుని ఎకరా రూ.10 లక్షల వరకు పలుకుతోంది. నేషనల్‌ హైవే రాకతో రూ.20 లక్షలకు పెరిగే అవకాశం ఉందని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు వివరించారు.
 
రైతులతో రియల్టర్ల మంతనాలు
ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి అనంతపురం జిల్లాలో సర్వే, మార్కింగ్‌ ప్రక్రియ 45 కిలోమీటర్ల మేరకు పూర్తయింది. జిల్లాలోని 6 మండలాల్లో 23 గ్రామాల మీదుగా 72 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారి నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే వెళ్లే ప్రాంతాల్లో బోరుబావుల కింద ఉన్న పొలాలు ఎకరా గతంలో రూ.5 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం 8 లక్షల వరకు పలుకుతోంది. ఎకరా రూ.లక్షన్నర వరకూ ఉన్న మెట్ట భూములు 4 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ప్రాంతంలో రియటర్లు చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు నష్ట పరిహారం విషయంపై రైతుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. ఎకరాకు రూ.10-12 లక్షల వరకు పరిహారం అందుతుందని భావిస్తున్నారు. పొలాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులతో రియల్టర్లు మంతనాలు జరుపుతున్నారు. భూసేకరణ ఇంకా జరగాల్సి ఉండటంతో రైతులు కూడా ఇప్పుడే ఏమీ చెప్పడం లేదు. ఈ రహదారి పుణ్యమా అని జిల్లాల్లో రియల్‌ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది.
 
కదలిక లేని... ప్రకాశం
ప్రకాశం జిల్లాలోని 14 మండలాల్లోని 66 గ్రామాల గుండా ఈ రహదారి నిర్మాణం కానుంది. అయితే ఈ ప్రాంతంలో రియల్‌ వ్యాపారం ఇంకా ఊపందుకోలేదు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌లో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో.. అక్కడ భూములు కొన్నవారు తిరిగి అమ్మేందుకు ఇబ్బంది పడుతున్నారు. వెలిగొండ నిర్మాణం జరగక.. ఆ భూముల విలువ పెరగలేదు. వీటికితోడు ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యింది. రోడ్డు పనులు ప్రారంభిస్తే భూముల క్రయ విక్రయాల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది.
 
వేగంగా సర్వే.. భూసేకరణ
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే సర్వే, భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. మంగళవారం కర్నూలులో ఆమె విలేకరులతో మాట్లాడారు. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా 393 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఏప్రిల్‌ 31లోగా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని, మూడు నెలల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సెప్టెంబరులో రహదారి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా నల్లమల అడవిలో 14 కిలోమీటర్లలో 9.1 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తామన్నారు. కర్నూలులో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

అనంతపురం-అమరావతి హైవేపై అధికారుల దృష్టి
 
636271480942672347.jpg
 • తొమ్మిది మండలాల్లో నాలుగు వేల ఎకరాలు సేకరణ 
 • భూముల ధరలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక
అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో నాలుగు వేల ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు అం చనా వేశారు. ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేతో పాటు సర్వీసు రోడ్లు, రైలు మార్గం నిర్మాణానికి కూడా వీలుగా ఒక్క సారే భూమి సేకరించనున్నారు. భవిష్యత్తులో ఎనిమిది లైన్ల రహదారి విస్తరణకు వీలుగా భూసేకరణకు కసరత్తు చేస్తు న్నారు. త్వరలోనే ఈ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
 
గుంటూరు, చిలకలూరిపేట : అనంతపురం - అమ రావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. అనంతపురం నుంచి అమ రావతి వరకు 371 కిలోమీటర్ల పొడవున ఎటువంటి వంపులు లేకుండా నిర్మించ తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవే జిల్లా పరిధిలో 81 కి.మీల మేరకు ఉంటుంది. జిల్లాలోని తొమ్మి ది మండలాల్లో 4 వేల ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా వేశారు. ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేతో పాటు సర్వీసు రోడ్లు, రైలుమార్గం నిర్మాణానికి కూడా వీలుగా ఒక్కసారే భూమి సేకరించను న్నారు. ఈ మార్గంలో 120 నుంచి 140 కి.మీల వేగంతో వాహనాలు వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు.
 
చిలకలూరిపేట పరిధిలో 1,476 ఎకరాలు
ఎక్స్‌ప్రెస్‌ హైవేకు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో 1,476 ఎకరాలు అ వసరమని నిర్ధారించారు. హైవే చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడుమండలాలలో సుమారు 33 కి.మీ పొడవున నిర్మాణం కానుంది. చిలకలూరిపేట - కోటప్పకొండ మార్గంలో చిలకలూరిపేట నియోజకవర్గం ప రిధిలో యడవల్లి వద్ద ప్రారంభమై గోవిందపు రం, కావూ రు మీదుగా వెళ్లి నాదెండ్ల మండలంలో ఇర్లపాడు, నాదెండ్ల, చిరుమామిళ్ల గుం డా వెళ్లి యడ్లపాడు మండలంలో సొలస పరిధిలో ముగుస్తుంది.

చిలకలూరిపేట మండలంలో మొత్తం 805 ఎకరాలు భూమి అవసరమవుతుందని అంచనా. యడవల్లి గ్రామ పరిధిలో 315 ఎకరాలు, గో విందపురం పరిధిలో 52ఎకరాలు, కావూరు పరిధిలో 438 ఎకరాలు అవసరమవుతుందని తేల్చారు. నాదెండ్ల మండ లంలో 514 ఎకరాలు అవ సరమవుతుందని తేలిం ది. ఇర్లపాడు పరిధిలో 140 ఎకరాలు, నాదెండ్ల పరిధిలో 268 ఎకరాలు, చిరుమామిళ్ల పరిధిలో 106 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. యడ్లపాడు మండలం సోలసలో 157 ఎకరాలు అవసరమవుతుందని తేలింది.
 
అరగంటలో రాజధానికి ...
ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే చిలకలూరిపేట, నరసరావుపేట రాష్ట్ర రహదారి మీదుగా వెళుతుంది. హైవేకు ఆనుకుని రైలు మార్గం కూడా నిర్మించాలని తలపెట్టడంతో చిలకలూరిపేట వాసులకు రైలు సౌకర్యం కూడా కలుగనుంది. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, మార్టూరు తదితర ప్రాం తాల వారు అమరావతికి కేవలం అర్థగంటలోనే చేరుకునే వీలుంది.
 
ప్రత్యేక సిబ్బంది నియామకం ..
హైవేకు సంబంధించిన భూ సేకరణ వివరాలు సేకరించేందుకు సర్వేయర్లను ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది. ఎప్పటికప్పుడు వేగవంతంగా ఈ ప్రక్రియ కొనసాగేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులను నియమించారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు తహశీల్దార్‌ల మూడేళ్లలో ఆయా గ్రామాల పరిధిలో భూముల క్రయ, విక్రయాల వివరాలు, మార్కెట్‌ రేటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపారు. జేసీ వారానికి ఒకసారి సమీక్షించి పనులను వేగిర పరుస్తున్నారు.
Link to comment
Share on other sites

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేకు భూసేకరణ వేగిరం
 
636274945059791040.jpg
 • సెప్టెంబర్‌ లోపు భూములు ఎన్ హెచ్ ఏఐకి ఇవ్వాలి 
 • చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు సమస్యని పరిష్కరించండి 
 • ఆదేశించిన ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సుమిత్ర దావ్రా
ఆంధ్రజ్యోతి, గుంటూరు: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి గుంటూరు జిల్లాలో భూసేకరణ గడువు జూలై 31గా నిర్ణయించినట్లు ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సుమిత్ర దావ్రా వెల్లడించారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, అటవీ,జాతీయ రహదారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరులో 92.244 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరుగుతుందన్నారు. నూజెండ్లలో ఎనిమిది గ్రామాలు, వినుకొండలో మూడు, చిలకలూరిపేటలో రెండు, నాదెండ్లలో మూడు, ఫిరంగిపురంలో ఐదు, మేడికొండూరులో ఐదు, తాడికొండలో నాలుగు, తుళ్లూరులో ఒక గ్రామం నుంచి రోడ్డు నిర్మాణం ఎలైన్ మెంట్‌ చేశారని వివరించారు. నూజెండ్ల మండలంలో 380 హెక్టార్లు, వినుకొండలో 65 హెక్టార్లు, చిలకలూరిపేటలో 248 హెక్టార్లు, నాదెండ్లలో 206 హెక్టార్లు, ఫిరంగిపురంలో 276 హెక్టార్లు, మేడికొండూరులో 205 హెక్టార్లు, తాడికొండలో 407 హెక్టార్లు, తుళ్లూరులో 57.88 హెక్టార్ల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించాల్సి ఉందని చెప్పారు.
గడువు తేదీలు..
ఆర్‌వోడబ్ల్యూ పిల్లర్లను ఈ నెల 15 నుంచి మే 10వ తేదీ మధ్యన ఏర్పాటు చేయాలి. క్షేత్ర పరిశీలన కోసం సర్వేయర్లను ఈ నెల 20 నుంచి మే 20 మధ్యన చేపట్టాలి. భూమి రికార్డులను మే 21 నుంచి జూన 15 మధ్యన తయారు చేయాలి. డ్రాఫ్టు 3(ఏ)ని ఈ నెల 20 నుంచి 30వ తేదీ మధ్యన పూర్తి చేసి తమకు నివేదించాలి. 3(డీ) ప్రక్రియని మే 21 నుంచి జూన 20 మధ్యన పూర్తి చేయాలి. 3జీని జూన 30 నుంచి జూలై 31 మధ్యన పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో భూములను స్వాధీనపర్చుకొని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాకి అందజేయాలి.
వంపులు తక్కువగా..
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అతి తక్కువ వంపులతో నిర్మించబోయే మార్గం అని తెలిపారు. డీజీపీ సర్వే కోసం శాటిలైట్‌ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో ఎక్కడా అటవీ శాఖ భూమి ఉండదని, కట్టడాలు కూడా కోల్పోవడం జరగదన్నారు. పంట భూముల నుంచే రహదారి నిర్మాణం జరుగుతుందని చీఫ్‌ ఇంజనీర్‌ సుబ్బరాయ శర్మ తెలిపారు. చిలకలూరిపేట బైపాసు రోడ్డు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది. కోర్టులు కూడా బైపాస్‌ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశాయి. ఈ దశలో భూసేకరణ జాప్యం చేయడం సరికాదని నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ఆక్షేపించారు. 16 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ రోడ్డుకు సంబంధించి 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 85 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా రైతుల అభ్యంతరాలు పరిష్కరించి తమకు భూమిని స్వాధీనపరిస్తే బైపాసు రోడ్డు నిర్మాణ పనులను ప్రారం భిస్తామని తెలిపారు.
ఎన్ హెచ్-216 భూసేకరణ ప్రక్రియని పూర్తి చేయాలి
ఒంగోలు - దిగమర్రు జాతీయ రహదారి-216 విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సుమిత దావ్రా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల స్పందిస్తూ నెలరోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌కు సమీపంలో ఉన్న ఒక ఫ్యాక్టరీ తన వ్యర్థాలన్నింటిని ఎనహెచ మీదకు పంపిస్తోంది. పైగా ఆ సంస్థ కొత్తగా భ వన సముదాయాల నిర్మాణం చేపట్టింది. వాళ్లకి ఎవరు అనుమతులు ఇస్తున్నారో తెలియడం లేదని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌ అండ్‌ బీ, అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అనంతపురం-అమరావతి రహదారికి రూ. 24వేల కోట్లు
 
అమరావతి: అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి రూ. 24వేల కోట్లు ఖర్చవుతుందని ఏపీ కేబినెట్ అంచనా వేసింది. కేబినెట్ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్బంగా పలు తీర్మానాలను కేబినెట్ ఆమోదించింది. అమరావతి-అనంతపురం రహదారి నిర్మాణానికి 20 వేల ఎకరాలు భూసేకరణ జరపాల్సి ఉంటుందని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అలాగే జాతీయ రహదారికి ఇరు వైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతేగాక రహదారికి ఇరువైపులా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే రహదారికి సమాంతరంగా రైల్వేలైన్‌ వేస్తే బాగుంటుందన్న కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

Ananthapur to amaravathi ro guntur district lo ye route lo velutundi village names to kochem information unte veyandi... Narasaroapet nunchi velutunda chilakaluripeta nunchi velutunda ee route

Link to comment
Share on other sites

Ananthapur to amaravathi ro guntur district lo ye route lo velutundi village names to kochem information unte veyandi... Narasaroapet nunchi velutunda chilakaluripeta nunchi velutunda ee route

This road goes between NarasaraoPeta and Chialakaluripeta but slightly closer to Chilakaluripeta.

 

నూజెండ్ల: పమిడిపాడు, పుచ్చనూతల, నూజెండ్ల, వి.అప్పాపురం, తలార్లపల్లె, కొండప్రోలు, ములకలూరు,

వినుకొండ : పెరుమాళ్లపల్లె, ఏనుగుపాలెం, శెట్టిపల్లి

చిలకలూరిపేట: యడవల్లి, కావూరు, గోవిందాపురం

నాదెండ్ల : ఈర్లపాడు, నాదెండ్ల, చిరుమామిళ్ల

ఫిరంగిపురం: రేపూడి, నదురుపాడు, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు,

యడ్లపాడు: సొలస

మేడికొండూరు: మేడికొండూరు, వెలవర్తిపాడు, విశదల, మందపాడు

తాడికొండ: బండారుపల్లి, పొన్నెకల్లు, లామ్‌, తాడికొండ

తుళ్ళూరు: పెదపరిమి

 

Tullur Mandal          : 150 acres

Tadikonda Mandal       : 1178 

Medikondur Mandal      : 905

Yedlapadu Madaal       : 157

Phirangipuram Mandal   : 521

Nadendla Mandal        : 514

Chilakaluripeta Mandal : 805

Vinukonda Mandal       : 160

Nuzendla Mandal        : 1122 acres

    Pucchanutala  - 295 acres

    Appapuram     - 59 

    Nuzendla      - 364

    Talarla palle - 132

    Kondaprolu    - 139

    Mulakaluru    - 133

Link to comment
Share on other sites

This road goes between NarasaraoPeta and Chialakaluripeta but slightly closer to Chilakaluripeta.

 

నూజెండ్ల: పమిడిపాడు, పుచ్చనూతల, నూజెండ్ల, వి.అప్పాపురం, తలార్లపల్లె, కొండప్రోలు, ములకలూరు,

వినుకొండ : పెరుమాళ్లపల్లె, ఏనుగుపాలెం, శెట్టిపల్లి

చిలకలూరిపేట: యడవల్లి, కావూరు, గోవిందాపురం

నాదెండ్ల : ఈర్లపాడు, నాదెండ్ల, చిరుమామిళ్ల

ఫిరంగిపురం: రేపూడి, నదురుపాడు, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు,

యడ్లపాడు: సొలస

మేడికొండూరు: మేడికొండూరు, వెలవర్తిపాడు, విశదల, మందపాడు

తాడికొండ: బండారుపల్లి, పొన్నెకల్లు, లామ్‌, తాడికొండ

తుళ్ళూరు: పెదపరిమి

 

Tullur Mandal          : 150 acres

Tadikonda Mandal       : 1178 

Medikondur Mandal      : 905

Yedlapadu Madaal       : 157

Phirangipuram Mandal   : 521

Nadendla Mandal        : 514

Chilakaluripeta Mandal : 805

Vinukonda Mandal       : 160

Nuzendla Mandal        : 1122 acres

    Pucchanutala  - 295 acres

    Appapuram     - 59 

    Nuzendla      - 364

    Talarla palle - 132

    Kondaprolu    - 139

    Mulakaluru    - 133

:shakehands:

Link to comment
Share on other sites

This road goes between NarasaraoPeta and Chialakaluripeta but slightly closer to Chilakaluripeta.

 

నూజెండ్ల: పమిడిపాడు, పుచ్చనూతల, నూజెండ్ల, వి.అప్పాపురం, తలార్లపల్లె, కొండప్రోలు, ములకలూరు,

వినుకొండ : పెరుమాళ్లపల్లె, ఏనుగుపాలెం, శెట్టిపల్లి

చిలకలూరిపేట: యడవల్లి, కావూరు, గోవిందాపురం

నాదెండ్ల : ఈర్లపాడు, నాదెండ్ల, చిరుమామిళ్ల

ఫిరంగిపురం: రేపూడి, నదురుపాడు, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు,

యడ్లపాడు: సొలస

మేడికొండూరు: మేడికొండూరు, వెలవర్తిపాడు, విశదల, మందపాడు

తాడికొండ: బండారుపల్లి, పొన్నెకల్లు, లామ్‌, తాడికొండ

తుళ్ళూరు: పెదపరిమి

 

Tullur Mandal : 150 acres

Tadikonda Mandal : 1178

Medikondur Mandal : 905

Yedlapadu Madaal : 157

Phirangipuram Mandal : 521

Nadendla Mandal : 514

Chilakaluripeta Mandal : 805

Vinukonda Mandal : 160

Nuzendla Mandal : 1122 acres

Pucchanutala - 295 acres

Appapuram - 59

Nuzendla - 364

Talarla palle - 132

Kondaprolu - 139

Mulakaluru - 133

Ma ooru undi kuda chilakaluripeta and narasaroapet madya lone... govinda puram dati ma ooriki vellali :run_dog:

Link to comment
Share on other sites

ఈ దారి.. రహదారి
 
636291185098703329.jpg
 • రాజధానికి- సీమకు ఎక్స్‌ప్రెస్‌ వే
 • నాలుగైదు గంటల్లోనే రాజధానికి!
 • 29,625 ఎకరాలు అవసరం
 • భూసేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. భారీ రోడ్డు మార్గం నిర్మించి సీమను రాజధానితో అనుసంధానం చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం రాజధాని నుంచి రాయలసీమకు భారీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల సీమ నుంచి రాజధాని అమరావతి చేరుకునేందుకు ఇప్పుడు ఎనిమిది గంటలకుపైగా ఉన్న ప్రయాణ సమయం నాలుగైదు గంటలకు తగ్గిపోనున్నది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి భూసేకరణ పనుల్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
 
అనంతపురం-అమరావతి రహదారి పొడవు 371.05 కిలోమీటర్లు కాగా.. ఈ రహదారికి కర్నూలు, కడప రోడ్లు వచ్చి కలుస్తాయి. కర్నూలు రోడ్డు 123.7 కిలోమీటర్లు కాగా, కడప రోడ్డు 104.05 కిలోమీటర్లు. ఈ రెండు రోడ్లతో కలిపి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం ఖర్చు అంచనా రూ.27,625 కోట్లు. ప్రజా సరుకు రవాణాతోపాటు.. ఈ రహదారి వెంబడి పారిశ్రామిక కారిడార్లను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉండడంతో.. మొత్తంగా ఈ రహదారి అభివృద్ధి మార్గంగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు కీలకమైంది భూసేకరణే. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ రహదారి కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొంతమేర అటవీ భూములను కూడా తీసుకోవాల్సి వస్తన్నది. భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక భూసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. నల్లమల అడవుల నుంచి ఈ రహదారి రానుండడంతో.. అక్కడ కొంత అటవీ భూమిని సేకరించాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు భూమి ఇచ్చి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే కోసం 29,625 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా. కొంత నాలుగు వరుసలు, మరికొంత ఆరు వరుసల రహదారిని నిర్మించాల్సి రావడంతో భూమి ఎక్కువగానే కావాల్సి వస్తోంది. ఇందులో కొంత అటవీ భూమి కూడా ఉంది. భూసేకరణ కోసం రూ.2వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
 
నాలుగైదు గంటల్లో చేరిపోవచ్చు..
గంటలకు 120-130 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ రహదారిని నిర్మించాలన్నది ప్రతిపాదన. అమరావతి చేరుకునేందుకు ప్రస్తుతం 8 గంటలకుపైగా పడుతున్న ప్రయాణ సమయం.. ఈ రహదారి పూర్తయితే నాలుగైదు గంటలకు తగ్గిపోతుంది. ఎక్కడా వంకర్లు లేకుండా.. నేరుగా చేరుకునేలా రోడ్డు నిర్మాణం ఉంటుంది. కొండలు అడ్డుగా ఉన్నచోట సొరంగాలు తవ్వుతారు. ఈ రహదారిలో 10కిలోమీటర్ల మేర సొరంగం కూడా ఉంటుంది. కడప, కర్నూలు నుంచి వచ్చే మార్గంలోనూ టన్నెల్స్‌ ఉంటాయి. కర్నూలు నుంచి వచ్చి కలిసే రహదారిలో 16 కిలోమీటర్లు, కడప నుంచి వచ్చి కలిసే రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర టన్నెల్స్‌ ఉండనున్నాయి. ఈ రహదారిలో నిర్మాణంలో భాగంగా ప్రధాన వంతెనలు 43, ఓవర్‌ బ్రిడ్జిలు 6, ఇంటర్‌ ఛేంజెస్‌ 22 నిర్మించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

There is a Big confusion ...in Kurnool link...road....& ....there is no clarity on this....some papers will write Kurnool link will join after Nandal( it is already 4 lane ...nothing much needed...)..some papers will tell after dornala.......for which existing 2 lane( K G road) need to extend to 4 lane.......Any Idea....which one they are focusing...?

Link to comment
Share on other sites

There is a Big confusion ...in Kurnool link...road....& ....there is no clarity on this....some papers will write Kurnool link will join after Nandal( it is already 4 lane ...nothing much needed...)..some papers will tell after dornala.......for which existing 2 lane( K G road) need to extend to 4 lane.......Any Idea....which one they are focusing...?

 

Latest is dornala. This is not going to be just an expansion. existing one is full of sharp turns and curves. after all those turns are removed, new road may probably not use the existing one at most places.

Link to comment
Share on other sites

Latest is dornala. This is not going to be just an expansion. existing one is full of sharp turns and curves. after all those turns are removed, new road may probably not use the existing one at most places.

 

Thanks Bro....But there is no sign of survey in that line..... :dream:

Link to comment
Share on other sites

Thanks Bro....But there is no sign of survey in that line..... :dream:

 

I think there will be soon. most of the action now is at Amaravati end (Guntur Dist). It makes sense to build from Amaravati side, as it is common to all 3 sections (Anantapuram, Kadapa and Kurnool).

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...