Jump to content

Amaravati to Anantapur Expressway


Recommended Posts

 • 2 weeks later...
అమరావతి టూ అనంతపురం గ్రీన్ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌
 
636178122258537936.jpg
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
రాయలసీమ జిల్లాలను నవ్య రాజధాని అమరావతితో అనుసంధానం చేసే గ్రీన్ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రక్రియని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ రహదారిపై రాష్ట్ర మం త్రివర్గం చర్చించి ఆమోదం తెలపగా ప్రక్రి యని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా వ్యహరించే ఈ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ), రవాణ, పర్యా వరణ, అటవీ శాఖ మంత్రులు, చీఫ్‌ సెక్రెటరీ, ఎన్ హెచ్ ఏఐ చైర్మన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సీసీఎల్‌ఏ సభ్యులుగా ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా రవాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీని నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం, గుం టూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల కలెక్టర్లను నియమించారు. ఈ కమిటీ ఇకపై నెలకొకసారి భేటీ అయి రహదారి భూసేకర ణ, ఎలైన్ మెంట్‌ని సమీక్షించి త్వరితగతిన ఖరారు చేస్తుంది. అమరావతికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ ఉండాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. ఎన్ హెచ-5 ద్వారా ఇటు చెన్నై, అటు కోల్‌కత్తా నుంచి కనెక్టివిటీ ఉంది. అలానే మరో హైవే ద్వారా హైదరాబాద్‌ నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉన్నది. బెంగళూరు నుంచి రోడ్డు ఉన్నప్పటికీ అది రెండు వరసలే కావడం వల్ల ఎన్నో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేని నిర్మించాలని నిర్ణయించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్ రూపొందించిన సింగపూర్‌ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ఎక్స్‌ప్రెస్‌ వే వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అలానే రాయలసీమవాసులకు రాజధానితో సంబంధం ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అమరావతికి సుమారు 500 కిలోమీటర్ల మేరకు రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. తొలి దశలో దీనిని నాలుగు వరసలుగా అభి వృద్ధి చేస్తారు. ఇందుకోసం ఎలైన్ మెంట్‌, భూసేకరణ చేపట్టాలి. ప్రాజెక్టులో ఈ రెండు కీలకమైనవి కావడంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని గత నెల 10న రవాణ శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు కొత్త కమిటీని నియమించారు. కమిటీలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు కూడా స్థానం కల్పిస్తే బావుండేదన్న అభి ప్రాయం వివిధ వర్గాల ద్వారా వ్యక్తమౌతోం ది. భూసేకరణ అంశం కీలకమైన ప్రక్రియ దృష్ట్యా స్థానిక మంత్రులైతే ప్రజలతో చొర వగా మాట్లాడి ఒప్పించడానికి అవకాశం ఉం టుంది. ఇందుకు అమరావతి రాజధాని నగర భూసమీకరణ నిదర్శనం. రైతులతో ఒప్పిం చేందుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎంపీలు గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారు.
Link to comment
Share on other sites

అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే వేగంగా భూసమీకరణ
 
 • ఆరునెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం
 • ఐదు జిల్లాల్లో.. భూసేకరణ యూనిట్లు
 • నాలుగు జిల్లాల్లో సేకరణ సులువే.. గుంటూరులో సమీకరణ ?
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అనంతపురం నుంచి రాజధాని అమరావతి వరకు నిర్మించతలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ వేకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ నాలుగు జిల్లాలను రాజధానికి కలపడం, గంటకు 120 కి.మీ. మేర ప్రయాణించేలా ఈ బృహత్తర రహదారిని నిర్మించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు రూ.29,557 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భూసేకరణ చేస్తే చాలు. మిగతా ప్రాజెక్టును బీవోటీ పద్ధతిలో చేపట్టే అవకాశాలున్నాయి. భూసేకరణ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితినగడ్కరీ సూచించారు. దీనికి అనుగుణంగా ఈ నెల 19వ తేదీన భూసమీకరణ కోసం సీఎం చంద్రబాబునాయుడు చైర్మనగా ఒక కమిటీని నియమించారు. రెవెన్యూ, ఆర్థిక, అటవీ, రవాణా శాఖమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులతోపాటు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. నాలుగు, ఆరు వరుసలుగా నిర్మించే ఈ ఎక్స్‌ప్రె్‌సవే అనంతపురం నుంచి ప్రారంభమై అమరావతి వరకు వస్తుంది. మధ్యలో కడప, కర్నూలుల నుంచి రెండు రహదారులు వచ్చి ఎక్స్‌ప్రె్‌సవేతో కలుస్తాయి. మొత్తం ఈ రహదారులన్నీ కలిసి దాదాపు 621 కి.మీ.పొడవున ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రె్‌సవే కోసం మొత్తం 8,692.52 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వస్తుంది. మరోవైపు 1603.75 ఎకరాల అటవీ భూమి కూడా అవసరం. అలైనమెంట్‌ ఖరారు, భూసేకరణ కోసం పెద్దఎత్తున భూమి అవసరం కావడంతో రాజధానిలో చేసినట్లుగా భూసమీకరణ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు. అయితే అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో భూమి విలువ తక్కువుగా ఉండడంతో ..సమీకరణ అయినా ఫర్వాలేదనే ఉద్దేశంతో ఉన్నారు. గుంటూరు జిల్లాలో మాత్రం ధరలు అధికంగా ఉండడంతో అక్కడ మాత్రం భూసమీకరణ తప్పనిసరి అని భావిస్తున్నారు. ఏదేమైనా రాబోయే ఆరునెలల్లోనే ఈ ఎక్స్‌ప్రె్‌సవేకు అవసరమయ్యే భూమిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ఉన్నారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా భూమిని సేకరిస్తారా? సమీకరిస్తారా? అన్నదానిపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని,ఐదు జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు. ఐదు జిల్లాల్లోను ఐదు ప్రత్యేక భూసేకరణ యూనిట్లను ఏర్పాటుచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎక్స్‌ప్రెస్‌ వే..ఏ జిల్లాలో ఎన్ని కి.మీ. ఉంటుంది, ఎంత భూమి అవసరం అన్నదానిపై ఇప్పటికే అంచనాలు రూపొందించారు.
Link to comment
Share on other sites

 • 1 month later...


అనంత-అమరావతి హైవే పనులు వేగిరం636213339486312641.jpg • 29,625 ఎకరాలు అవసరం
 • గుంటూరు పరిధిలో భూసమీకరణ
 • మిగతా జిల్లాల్లో భూసేకరణ
 • నేడు చంద్రబాబు సమీక్ష
అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతికి మూడున్నర గంటల్లోపే చేరుకునేలా నిర్మించాలని తలపెట్టిన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేయనుంది. అనంతపురం నుంచి అమరావతికి 371.03 కిలోమీటర్ల మేర ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించనున్నారు. కర్నూలు, కడపల నుంచి రెండు ఫీడర్‌ రహదారులు కూడా ఈ రోడ్డులో కలుస్తాయి. వీటిని కూడా కలిపితే మొత్తం 598.78 కిలోమీటర్ల రోడ్డు అవుతుంది. పూర్తి గ్రీనఫీల్డ్‌ ప్రాజెక్టుగా ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ రహదారికి సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ హైవే కోసం మొత్తం 29,625 ఎకరాల భూమి కావాలి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో భూముల ధరలు తక్కువగానే ఉండడంతో అధికారులు భూసేకరణకు మొగ్గు చూపుతున్నారు. గుంటూరు జిల్లాలో ధరలు అధికంగా ఉండడంతో అక్కడ సమీకరించే ఉద్దేశంతో ఉన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షిస్తారు. విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ సమీపం నుంచి రామవరప్పాడు వైపు వేయనున్న ఫ్లైఓవర్‌, కనకదుర్గమ్మ గుడి వద్ద ఇప్పటికే నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌పైనా సమీక్షిస్తారు.

Link to comment
Share on other sites

అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు రైలు కనెక్టివిటీ ఉండాలన్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు రైలు కనెక్టివిటీ ఉండాలన్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

fly over atlast ki complete avutundi  :terrific:

Link to comment
Share on other sites

 

వారంలోగా అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్

 

Super User

 

 

30 January 2017

 

Hits: 1024

amaravati-anantapur-30012017.jpg

 

 

 

ప్రతిష్టాత్మక అమరావతి–అనంతపురం రహదారి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తున్న రహదారులు నిర్దిష్ట కాలపరిమిలో పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రహదారుల పనులకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకుశంగా చర్చించారు. సమావేశంలో ఎన్‌హెచ్ఏఐ నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతపురము నుంచి అమరావతి వరకూ నేరుగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మించ తలపెట్టామని, ఇది దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించి, వారం రోజుల్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలన్నారు. భూ సేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ రహదారి పక్కనే రైల్వే లైన్ కూడా ఉంటుందని అన్నారు. వీటన్నింటి సత్వర అనుమతుల కోసం సంబంధిత అధికారులకు, కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని తన అదనపు కార్యదర్శి రాజమౌళిని ఆదేశించారు.

ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియను త్వరతిగతిన పూర్తిచేయడం కోసం ఐదు జిల్లాలలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయాలని సీయం చెప్పారు. ఈ రహదారి వెంబడి ట్రాన్సిట్ డెవలెప్‌మెంట్ జరగాలని, అందుకు అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు. ఈ రహదారి వెంబడి పారిశ్రామిక పట్టణ సముదాయాలు వస్తాయని తెలిపారు. రెండేళ్లలో ఈ రహదారిని పూర్తిచేయాలని చెప్పారు.

 

రాష్ట్రంలో ఎన్‌హెచ్ఏఐ చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట కాల పరిమితిలోపు పూర్తి కావాలని సీయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ–భావనపాడు వరకు నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారిని ఎక్కువ మలుపులు తిప్పి దూరం పెంచకుండా వంపులు లేని సుందర రహదారిగా ఉండేలా చూడాలన్నారు.

ఈ సమీక్షలో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా, ఏపీయస్ ఆర్‌టీసీ ఎండీ మాలకొండయ్య సీయం అదనపు కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

మలుపుల్లేని రహదారులు

అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు 3 నెలల్లో భూసేకరణ

2019లోగా పూర్తి చేయాలన్నదే సంకల్పం

లాస్‌ఏంజెలస్‌-శాండియాగో తరహాలో విశాఖ బీచ్‌రోడ్డు

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఈనాడు - అమరావతి

07ap-main3a.jpg

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారిలోనే కాకుండా కొత్తగా ఎక్కడ ఏ రోడ్డు నిర్మించినా మలుపులు లేకుండా డిజైన్లు తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి, అమరావతి బాహ్య వలయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించే ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ చేపడితే ఆ ప్రక్రియ సులభతరమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రహదారి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రహదారికి 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2019లోగా ఎలాగైనా ఈ రహదారిని పూర్తి చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సమీక్షలో చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు..

* తక్కువ అటవీ భూభాగం వినియోగించుకునేలా కర్నూలు, కడపల నుంచి అనుసంధానమయ్యే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు కొత్త డిజైన్లు. కర్నూలు నుంచి వచ్చే మార్గం ఓర్వకల్లు మీదుగా నల్లమలలోని శిరివెల్ల దగ్గర అనుసంధానమవుతుంది. గత డిజైన్‌ ప్రకారం 10కి.మీ. మేర పులుల అభయారణ్యం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సమస్య లేదు. కడప నుంచి వచ్చే మార్గంలోనూ మార్పుల వల్ల గతం కంటే 20 కి.మీ. మేర దూరం తగ్గుతుంది.

Link to comment
Share on other sites

సూపర్‌ ఫాస్ట్‌ హైవే!
 
636221112797673072.jpg
 • 3 నెలల్లో భూసేకరణ
 • 15 రోజుల్లో తుది అలైన్‌మెంట్‌: సీఎం
 • అమరావతి-అనంత ఎక్స్‌ప్రెస్‌ వేపై ఆదేశం
 • 197.5 కి.మీ. మేర అమరావతి ఓఆర్‌ఆర్‌
 • పరిటాల, క్రోసూరు మధ్య ఆర్థిక నగరం
 • దాని కోసం 5 వేల ఎకరాల భూసమీకరణ
 • ఎన్‌హెచ్‌లుగా ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌!
 • అత్యద్భుతంగా విశాఖ- తడ బీచ్‌ రోడ్డు
 • 2 రోజుల్లో బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ డిజైన్‌
 • ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే, అమరావతి బాహ్య వలయ రహదారిని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులుగా గుర్తింపు వస్తే   అటవీ అనుమతులు త్వరగా వస్తాయని, జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ కూడా తేలిక అవుతుందన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం భూసమీకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటవీ భూమిని సాధ్యమైనంత తప్పిస్తూ రూపొందించే తుది అలైన్‌మెంట్‌ను 15 రోజుల్లో ఖరారు చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు భూసేకరణను వేగంగా పూర్తిచేయాలన్నారు. 2019లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహదారిని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేను భవిష్యత్తులో బెంగళూరు వరకు అనుసంధానం చేసే డిజైన్‌పై సీఎంకు కన్సల్టెంట్‌ వివరించారు. గత సమావేశంలో సీఎం చేసిన సూచనల మేరకు అలైన్‌మెంట్‌లో చేసిన మార్పులను వివరించారు.
 
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కర్నూలు, కడప నుంచి రెండు రోడ్లు వచ్చి కలుస్తాయి. ఈ రెండు రహదారులు అటవీ మార్గంలో వస్తుండడంతో అలైన్‌మెంట్‌ మార్చాలని సీఎం సూచించిన విషయం విదితమే. దీంతో కర్నూలు నుంచి వచ్చే రహదారి ఓర్వకల్లు మీదుగా సాగి నల్లమల ప్రాంతంలోని సిరివెల్ల నుంచి వచ్చి అమరావతి - అనంతపురం ప్రధాన రహదారికి అనుసంధానం అవుతుంది. ఈ కొత్త అలైన్‌మెంట్‌ వల్ల రోడ్డు పొడవు 75 కిలోమీటర్లు పెరిగినా నల్లమల టైగర్‌ జోన్‌ నుంచి రహదారి వెళ్లదు. దీంతో అటవీశాఖను అనుమతుల కోసం అడగాల్సిన అవసరం అంతగా ఉండదు. అదేవిధంగా కడప నుంచి వచ్చే రోడ్డుకు సూచించిన కొత్త అలైన్‌మెంట్‌ వల్ల 20 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. అయితే ఈ రెండింటి కొత్త అలైన్‌మెంట్‌ వల్ల రోడ్లు అనేక మలుపులతో వస్తాయని.. అవి సాధ్యమైనంత తక్కువుగా ఉండేలా అలైన్‌మెంట్‌ ఉండాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు 15 రోజుల్లో తుది అలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో భూసమీకరణ అంశంపై సీఎం ఈ సమావేశం నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూసేకరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వేకు సమాంతరంగా స్పీడ్‌ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులకు సీఎం సూచించారు.
 
Link to comment
Share on other sites

 • 4 weeks later...
 • 2 weeks later...

సీమకిలా.. సాగిపోదామా!

భూసేకరణ దిశగా అడుగులు

9 మండలాల్లో 4 వేల ఎకరాల భూసేకరణ

amr-gen1a.jpg

నూజెండ్ల: పమిడిపాడు, పుచ్చనూతల, నూజెండ్ల, వి.అప్పాపురం, తలార్లపల్లె, కొండప్రోలు, ములకలూరు,

వినుకొండ : పెరుమాళ్లపల్లె, ఏనుగుపాలెం, శెట్టిపల్లి

చిలకలూరిపేట: యడవల్లి, కావూరు, గోవిందాపురం

నాదెండ్ల : ఈర్లపాడు, నాదెండ్ల, చిరుమామిళ్ల

ఫిరంగిపురం: రేపూడి, నదురుపాడు, ఫిరంగిపురం, 113 తాళ్ళూరు,

యడ్లపాడు: సొలస

మేడికొండూరు: మేడికొండూరు, వెలవర్తిపాడు, విశదల, మందపాడు

తాడికొండ: బండారుపల్లి, పొన్నెకల్లు, లామ్‌, తాడికొండ

తుళ్ళూరు: పెదపరిమి

అమరావతి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన అనంతపురం-అమరావతి మార్గం నిర్మాణానికి క్షేత్రస్థాయిలో కార్యాచరణ కసరత్తు మొదలైంది. మార్గం నిర్మాణంలో భాగంగా తొలుత రైతుల నుంచి భూసేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులపై పనిఒత్తిడి ఉన్నందున భూసేకరణ తొందరగా పూర్తిచేయడానికి ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను మంజూరుచేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రహదారి నిర్మాణంలో భాగంగా 9 మండలాల్లో 31గ్రామాల పరిధిలో 4వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఏయే సర్వేనంబర్లలో ఎంత విస్తీర్ణం సేకరించాలన్న విషయమై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఇప్పటికే ఒక ఏజెన్సీ ద్వారా సర్వే చేయించి పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను గ్రామాల వారీగా జిల్లా యంత్రాంగానికి అందించిన వెంటనే సర్వే చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సర్వే వేగవంతంగా అనుకున్న సమయానికి పూర్తిచేయడానికి వీలుగా ఒక్కొక్క గ్రామపరిధికి ఇద్దరు సర్వేయర్లతో బృందాన్ని ఏర్పాటుచేశారు.

ప్రత్యేక భూసేకరణ యూనిట్‌కు ప్రతిపాదనలు

రాయలసీమ ప్రాంతం నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి అనుసంధానం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని నిర్మిస్తోంది. అనంతపురం నుంచి అమరావతి నగరానికి మార్గం నిర్మించే క్రమంలో కడప, కర్నూలు జిల్లా కేంద్రాలను కలుపుతూ అనుసంధాన మార్గాలను సైతం నిర్మిస్తోంది. మొత్తం 598.78కిలోమీటర్ల మేర నూతనమార్గం నిర్మాణానికి నివేదిక సిద్ధమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈమార్గం 80.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మార్గం ప్రాధాన్యత దృష్ట్యా భూసేకరణ తొందరగా పూర్తిచేయడానికి ప్రత్యేక భూసేకరణ యూనిట్‌ను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చిన మేరకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఇందులో ఒక డిప్యూటీ కలెక్టర్‌, ముగ్గురు తహశీల్దార్లు, ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లు, నలుగురు సర్వేయర్లతో ఒక యూనిట్‌ ఏర్పాటుచేయాలని కోరారు. తొమ్మిది మండలాల పరిధిలో జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ చేయనున్నారు. రహదారి నిర్మాణంతోపాటు భవిష్యత్తులో రైలుమార్గం నిర్మాణానికి కూడా ఇప్పుడే భూసేకరణ చేయనున్నారు. తుళ్ళూరు మండలంలోని నూతన రాజధాని అమరావతి నగరం నుంచి ప్రారంభమై తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట, వినుకొండ, నూజెండ్ల మీదుగా ప్రయాణిస్తూ ప్రకాశం జిల్లాలోకి రహదారి ప్రవేశిస్తుంది. ఈక్రమంలో రహదారి 31గ్రామాల గుండా ప్రయాణించనుంది. సర్వేను తొందరగా పూర్తిచేయడానికి సంబంధిత మండల సర్వేయరుతోపాటు ఇతర మండలాల నుంచి ప్రతిగ్రామానికి ఇద్దరు సర్వేయర్లను డిప్యూటేషన్‌పై పంపనున్నారు.

భూసేకరణకు కసరత్తు

జిల్లాలో అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి సర్వేనంబర్ల వారీగా భూసేకరణ విస్తీర్ణం వివరాలు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తారు. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం రైతులకు వచ్చే పరిహారం వివరాలను వివరించి భూసేకరణకు సమాయత్తమవుతారు. ఈమేరకు తొమ్మిది మండలాల తహశీల్దార్లకు భూసేకరణకు సంబంధించిన వివరాలను పంపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని సూచించారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం ఏగ్రామంలో ఎకరం భూమికి ఎంత చెల్లించాల్సి వస్తుందన్న వివరాలు ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ నుంచి సర్వేనంబర్ల వారీగా విస్తీర్ణం వివరాలు అందిన వెంటనే గ్రామాల్లో సర్వే చేయడానికి ఏర్పాట్లుచేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి సూచించారు. ఈవిషయమై జిల్లా సంయుక్త పాలనాధికారి క్రితికా శుక్లా ‘ఈనాడు’తో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టు కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టినందున యుద్ధప్రాతిపదికన భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రత్యేక భూసేకరణ యూనిట్‌ ఏర్పాటుచేయాలని కోరామన్నారు. గ్రామాల వారీగా సర్వేయర్ల బృందాలను ఏర్పాటుచేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. జాతీయ రహదారుల సంస్థ నివేదిక ఇచ్చిన వెంటనే భూసేకరణ పనులు వేగవంతం చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...