Jump to content

Amaravati to Anantapur Expressway


Recommended Posts

విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య జాతీయ రహదారిపై రన్‌వే అసాధ్యం

 

ఈనాడు, దిల్లీ: అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులపై విమానాలు ఆగడానికి వీలుగా రన్‌వేలు ఏర్పాటు చేయాలని రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ యత్నిస్తోందని కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై సర్వే చేస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడ, రాజమహేంద్రవరం మధ్య విజయవాడకు సమీపంలో జాతీయ రహదారిపై విమానాలు ఆగడానికి రన్‌వే నిర్మాణం సాధ్యం కాదని కాంగ్రెస్‌ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి మాన్సుఖ్‌లాల్‌ మాండవియా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నెల్లూరు-ఒంగోలు మధ్య జాతీయ రహదారిపై రన్‌వే నిర్మాణానికి బిడ్‌లకు, ఒంగోలు- చిలకలూరిపేట మధ్య ప్రతిపాదనను అంగీకరించామని పేర్కొన్నారు. తడ-చిలకలూరిపేట మధ్యలో రన్‌వే సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పనులు వేగవంతం చేస్తాం 
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం-అమరావతిల మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేస్తామని కేంద్రం తెలిపింది. సుమారు 384 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి భూమిని ఉచితంగా బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, భూసేకరణలో 50శాతం భరిస్తామని పేర్కొందని తెదేపా సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

సకాలంలో మచిలీపట్నం-అవనిగడ్డ పనులు 
జాతీయరహదారి 216లో మచిలీపట్నం-అవనిగడ్డ మధ్య రెండు లేన్ల రహదారి, పునరావాసం, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తవుతాయని తెదేపా సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

రామాయపట్నం ఆర్థికంగా సరైనదే.. 
రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణం ఆర్థికంగా సరైనదేనని మెస్సర్స్‌ రైట్స్‌ సంస్థ తెలిపిందని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది.  కృష్ణపట్నం, ఎన్నూరు పోర్టులు సమీపంలో ఉన్నందున దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాదని ఏపీకి నీతిఆయోగ్‌ తెలిపిందని కేంద్రం పేర్కొంది.

గొలగమూడి జంక్షన్‌లో పై వంతెన నిర్మిస్తాం: కేంద్రం 
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గొలగమూడి జంక్షన్‌లో పైవంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం పేర్కొంది. సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎన్‌హెచ్‌ 18లోని కడప-మైదుకూరు-కర్నూలు నాలుగు లేన్ల రహదారి భూసేకరణ సమస్యల వల్ల ఆలస్యం అవుతోందని కేంద్రమంత్రి మాండవియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

 
Link to comment
Share on other sites

 • 1 month later...
 • 2 months later...
ఎక్స్‌ప్రెస్‌‌వేకు ‘ఎన్నిక’ మెలిక
20-04-2019 02:17:14
 
 • రాజకీయ నిర్ణయం తీసుకోవాలి
 • ఎన్నికలయ్యాక చూద్దాం లెండి
 • ‘అనంత-రాజధాని’పై నాన్చుడు
 • కీలక దశలోని ప్రాజెక్టుకు కొర్రీలు
 • 10రోజుల ముందంతా అద్భుతం
 • అంతలోనే మారిన కేంద్రం తీరు
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అనుసంధానించే అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను కేంద్రం నాన్చుతోంది. కీలకమైన అనుమతులు ఇచ్చే సమయంలోనే అసంబద్ధమైన కారణాలను తెరమీదకు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ‘ఎన్నికలయ్యాక రాజకీయ నిర్ణయం తీసుకుందాం. ఎన్నికలయ్యాక చుద్దాంలేండి’ అంటూ కొత్తగా మెలికపెట్టింది. రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లడానికి ముందు అదిగో అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే అంటూ ఊరించిన కేంద్రం...తీరా ఇప్పుడు ఎన్నికల తర్వాత చూద్దాంలే అని సరిపెడుతోంది. ఈ పరిణామంపై అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదేకాదు, రూ. 3200 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలను కూడా కేంద్రం పక్కనపెట్టినట్లు తెలియవచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే రహదారి నిర్మాణ ప్రతిపాదనలు ఇప్పుడు చాల కీలకదశకు చేరుకున్నాయి. రూ. 21వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో అతి కీలకమైన రహదారి నిర్మాణ అలైన్‌మెంట్‌కు (షార్టెస్ట్‌ స్ట్రెయిట్‌ అలైన్‌మెంట్‌) ఆరు నెలల క్రితమే ఆమోదం లభించింది.
 
గత ఏడాది అక్టోబరులో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ( ఎంవోఆర్‌టీహెచ్‌) అనుమతి ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రిగా ఉన్న నితిన్‌గడ్కరీ అధికారికంగా వెల్లడించారు కూడా. అంతేకాదు, ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో 50 శాతం తాము భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దిశగా మన రాష్ట్రం నుంచి వడివడిగా నివేదికలు వెళ్లాయి. భూసేకరణ పనులను ప్రారంభించారు. ఆ వివరాలను భూమిరాశి పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేశారు. ఇక, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుకు (డీపీఆర్‌) సంబంధించిన కసరత్తు ఎప్పుడో ఆరు నెలల క్రితమే ముగిసింది. అయితే, దాన్ని కేంద్రానికి సమర్పిస్తే, ఏ కారణాలతోనయినా తిరస్కరిస్తుందేమోనన్న ఆందోళనతో అధికారులు ఆచితూచి అడుగులేశారు. డీపీఆర్‌లో పేర్కొన్న అనేకానేక అంశాలకు ఒక్కటొక్కటిగా అనుమతులు సాధించారు. ఆపై డీపీఆర్‌ నకలు ప్రతిని కూడా ఎంవోఆర్‌టీహెచ్‌ అధికారులకు పంపించారు.
 
సరిగ్గా పది రోజుల క్రితం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కీలక నివేదికను ఏపీ అధికారులు ఆ మంత్రిత్వశాఖ పెద్దలకు సమర్పించారు. అంతా అద్భుతంగా ఉందని, త్వరగా అటవీ అనుమతులు, ఎకో జోన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి తలకిందులయినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు పనిలోభాగంగా వెళ్లినవారికి ఆ పెద్దలు షాక్‌ ఇచ్చారు. ‘‘దాని గురించి ఇప్పుడేం తొందర! మీ రిపోర్టును మేం ఇంకా పూర్తిగా చూడాలి. అటవీ శాఖ నుంచి మీరు కోరుతున్న ఆ రెండు కిలోమీటర్లకు సెన్సిటివ్‌ ఎకోజోన్‌ పర్మిషన్‌ రాలేదుకదా! అయినా దీనిపై ఇంకా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యాక పరిశీలన చేద్దాం. ఆ తర్వాత రండి’’ అని బదులిచ్చినట్లు తెలిసింది. అంతా సవ్యంగా సాగిపోతుంది....రహదారికి ఎన్‌హెచ్‌ నంబర్‌ కేటాయించడం, నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకి (ఎన్‌హెచ్‌ఏఐ) అప్పగించవచ్చని చాలా ఆశలుపెట్టుకున్న రాష్ట్రానికి, కేంద్రం కొత్తగా పెట్టిన మెలికలు షాక్‌నిస్తున్నాయి. ప్రజాప్రయోజన ప్రాజెక్టులపై ఇలా కూడా చేస్తారా అంటూ అధికారవర్గాలు విస్తుపోతున్నాయి.
 
నాలుగేళ్లుగా ఇదే తీరు..
రహదారి ప్రాజెక్టుల విషయంలో కీలక దశలో కొర్రీలువేసి, మెలికలుపెట్టడంలో కేంద్రం తీరు నాలుగేళ్లుగా ఇలాగే ఉందన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణ ప్రతిపాదన చర్చకొచ్చినప్పుడు ప్రధాని అద్భుతమైనదంటూ ప్రశంసించారు. స్ట్రెయిటెస్ట్‌ అలైన్‌మెంట్‌ చాలా సేఫ్‌ అంటూ కేంద్ర మంత్రి గడ్కరీ పొగిడారు. ఆరుకాదు ఎనిమిది వరుసల రహదారి నిర్మాణమైనా సహకరిస్తామంటూ ఊదరగొట్టారు. తీరా ప్రతిపాదనల దశలో ఆరు వరుసల ఎక్స్‌ప్రె్‌సవే కుదరదని తేల్చారు. ఆ తర్వాత రెండు వందల మీటర్ల రహదారి వెడల్పునకు అంగీకరించమన్నారు.
 
అప్పటికీ అనేక అంశాల్లో వెనక్కు తగ్గి 100 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇస్తే...భూసేకరణకు అయ్యే ఖర్చును ఏపీ సర్కారే భరించాలంటూ భరించలేని మెలికపెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చాక కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఓ మెట్టు దిగారు. భూసేకరణ వ్యయంలో సగం కేంద్రం భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు భూసేకరణ కీలక దశకు చేరుకున్న సమయంలో రాష్ట్ర అధికారులు పలు నివేదికలు పంపించారు. అనుమతులు, ఇతర సాంకేక అంశాల మంజూరు వద్దకు వచ్చేసరికి ....రాజకీయ నిర్ణయం తీసుకునే అంశమని, ఎన్నికల తర్వాత చుద్దామంటూ మెలికపెట్టడం గమనార్హం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...