swas Posted November 24, 2016 Posted November 24, 2016 eee express way tho parallel ga oka double train tracks pedithe super untundi 200km/hr tracks vesthe state motham speed ga velochu
sonykongara Posted November 24, 2016 Author Posted November 24, 2016 27,600 కోట్లతో అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే: చంద్రబాబు విజయవాడ: ఆర్‌అండ్‌బీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుకు రూ.27,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కీలకమని చంద్రబాబు అన్నారు. ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
sonykongara Posted November 24, 2016 Author Posted November 24, 2016 రెండేళ్లలో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, ఇక నుంచి వారం వారం సమీక్ష రెండేళ్లలో అమరావతి-అనంతపురము ఎక్స్‌ప్రెస్ వే ఆరు మాసాలలో అవసరమైన భూమి సంప్రదింపులు, సమీకరణతో నిర్మాణ వ్యయంపై అదుపు 5 జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కీలకం కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రూ.27,600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దేశంలో ఈ తరహా రహదారి నిర్మాణాలలో ట్రెండు సెట్టర్‌గా నిలవనున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నా భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని 8 వరుసలకు సరిపడా స్థలాన్ని రిజర్వ్ చేసుకుని వుంచుకోవాలని గురువారం మధ్యాహ్నం పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 5 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ తరువాత అత్యంత ప్రాధాన్యం గల ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియ ఇవాళ్టి నుంచే ఆరంభమైనట్టు ఆయన ప్రకటించారు. రెండేళ్లలో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే ఈ తరహా రహదారిని నిర్మించారని, దానికి భిన్నంగా అనంతపురం-అమరావతి 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరగనున్నదని ముఖ్యమంత్రి వివరించారు. యూపీలో నిర్మించిన రహదారి 4 వరుసలతో 300 కిలోమీటర్ల మేర వుండగా, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే 598.830 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసలతో నిర్మాణం కానున్నది. అది కూడా ఎక్కడా ఎటువంటి మలుపులు లేకుండా, అక్కడక్కడ సొరంగ మార్గాలు, వంతెనలతో నిర్మించడం దేశంలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేకు సమాంతరంగా రైల్వే ట్రాక్ కూడా నిర్మించనుండటం అదనపు ఆకర్షణ అని అన్నారు. కేంద్రం ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇవ్వడానికి అంగీకరించిందని, సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నామని, రేపటి నుంచే సర్వే బృందాలను 5 జిల్లాలకు పంపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 5 జిల్లాలను నూతన రాజధానికి కలుపుతూ నిర్మించే ఈ రహదారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చనున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరవు ప్రాంతమైన రాయలసీమ దశ మారిపోగలదని చెప్పారు. ఈ రహదారి ద్వారా బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ ప్రధాన నగరాలకు అనుసంధానం కలుగుతుందని చెప్పారు. అంతేకాకుండా, డెడికేటెడ్ ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌గా అవతరించనున్న దొనకొండకు, రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుకు ఈ రహదారి దగ్గరగా వెళుతుందని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ మార్గానికి రెండువైపులా నీరు, ఖనిజ వనరులు పుష్కలంగా వున్న ప్రాంతాలలో చిన్నచిన్న పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ మార్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా వున్నాయో గుర్తించాలని ఆయన 5 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గుంటూరు జిల్లాలో 82.4 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 226.9 కిలోమీటర్లు, కర్నూలు జిల్లాలో 160.6 కిలోమీటర్లు, కడప జిల్లాలో 64.2 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 68.6 కిలోమీటర్లు చొప్పున ఎక్స్‌ప్రెస్ వేలో కలుస్తాయి. కర్నూలుకు ఒక లైన్, కడపకు మరో లైన్ విడిగా వెళతాయి. దేశంలోనే అతిపెద్దదైన ఈ రహదారి ప్రాజెక్టు కోసం మొత్తం 26,793 ఎకరాల భూమిని సేకరించాల్సి వుంటుంది. ఇందులో 9324 హెక్టార్ల భూమి అటవీభాగంలో వుంది. దీన్ని నోటిఫై చేయాలి. ఈ ప్రాజెక్టు కోసం ఆరు నెలల రికార్డు సమయంలో భూ సేకరణ లేదా సమీకరణ పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి 5 జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు. మొత్తం నిర్మాణాన్ని సాథ్యమైనంత తక్కువ ఖర్చుతో చేపట్టాల్సి వున్నదని చెప్పారు. ముఖ్యంగా భూ సేకరణ నిమిత్తం సాధ్యమైనంత తక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సివుంటుందన్నారు. భూముల ధరలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో భూ సమీకరణ విధానానికి వెళ్లాలని సూచించారు. రాజధాని తరహాలో భూ సమీకరణ చేపట్టడం ద్వారా ప్రాజెక్టు ఖర్చు తగ్గిపోతుందని చెప్పారు. దీనిపై కలెక్టర్లు శ్రద్ధ తీసుకుని ఆయా ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులతో మాట్లాడాలని సూచించారు. ఎవరూ నొచ్చుకోని రీతిలో నిరంతర సంప్రదింపులు జరిపి సమీకరణ పూర్తిచేయాలని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తరువాత తన తదుపరి ప్రాధాన్యం ఇదేనని చెబుతూ, ఇకనుంచి వారం వారం ఈ ఎక్స్‌ప్రెస్ వే పురోగతిపై సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తామని కూడా చెప్పారు. సమావేశంలో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి పాల్గొన్నారు.
Nfan from 1982 Posted November 24, 2016 Posted November 24, 2016 2 years lo intha big project aa....is it possible!!!
sonykongara Posted November 24, 2016 Author Posted November 24, 2016 2 years lo intha big project aa....is it possible!!!
AbbaiG Posted November 24, 2016 Posted November 24, 2016 2 years lo intha big project aa....is it possible!!! Avvaka pothe Modi gaadi meeda toseddam
Nfan from 1982 Posted November 24, 2016 Posted November 24, 2016 Avvaka pothe Modi gaadi meeda toseddam Hmmm
NFans NRT Posted November 24, 2016 Posted November 24, 2016 Avvaka pothe Modi gaadi meeda toseddam Endukavvadu.., already state ki 2 years lo 2.5 lac crore ichcharu ga.., ilanti chinna chinna projects ki direct ga IMPS lo transfer chestharu money..!
sonykongara Posted November 24, 2016 Author Posted November 24, 2016 Avvaka pothe Modi gaadi meeda toseddam ivvalasinavi isthe chalu le brother, cbn meda thoyyakunda
KaNTRhi Posted November 24, 2016 Posted November 24, 2016 2 years lo intha big project aa....is it possible!!!
OnlyTDP Posted November 24, 2016 Posted November 24, 2016 27,600 crores in 2 years? Modi nammukuni dates iste inka anthe sangathulu
Dravidict Posted November 24, 2016 Posted November 24, 2016 Endukavvadu.., already state ki 2 years lo 2.5 lac crore ichcharu ga.., ilanti chinna chinna projects ki direct ga IMPS lo transfer chestharu money..!
swarnandhra Posted November 24, 2016 Posted November 24, 2016 26k is only for construction(Central govt). Land acquistion costs(State Govt) extra. andulo 10k acres forest land. ee 2 years lo Center okka paisa ivvadu, 1 acre kuda denotify cheyyadu. By the way, Uttar Pradesh expressway CBN mentioned was indeed finished under 2 years except few patches here and there due to land acquisition issues. Agra-Lucknow expressway. However there are important differences 1)Agra-Lucknow expressway is around half the size 2)funded by state 3)neglisible forest land
sonykongara Posted November 25, 2016 Author Posted November 25, 2016 ఆ ప్రాజెక్టు ట్రెండ్ సెట్టర్! అమరావతి-అనంత రోడ్డు 6 వరుసలు 598 కిలోమీటర్లు... 27,600 కోట్లు 6 నెలల్లో భూసేకరణ.. రెండేళ్లలో పూర్తి ఎక్స్‌ప్రెస్ వే వెంట చిన్న తరహా పరిశ్రమలు ప్రతి వారం దీనిపై సమీక్షిస్తా: సీఎం అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతి, పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా భావిస్తున్న అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రహదారిని రెండేళ్లలో పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీని నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్ వేతో సంబంధమున్న ఐదు జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఈ రహదారి ఎంతో కీలకమవుతుందని చెప్పారు. రూ.27,600 కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టు దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తొలుత ఆరు వరుసల రహదారి నిర్మిస్తున్నా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది వరుసల రహదారికి అవసరమయ్యేటట్లు భూసమీకరణ/సేకరణ చేయాలని, ఇది కూడా 6 నెలల్లో పూర్తికావాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘యూపీలో ఇటీవల ఈ తరహా రహదారి నిర్మించారు. కానీ దానికి ఇది భిన్నంగా ఉంటుంది. అక్కడ నాలుగు వరుసలతో 300 కి.మీ. మేర నిర్మిస్తే... ఇది ఆరు లేన్లతో 598 కి.మీ మేర నిర్మాణం కానుంది. ఎక్కడా మలుపులు లేకుండా మధ్యమధ్యలో సొరంగ మార్గాలు, వంతెనలతో నిర్మించడం దేశంలో ఇదే ప్రథమం. దీనికి సమాంతరంగా రైల్వే ట్రాక్ కూడా నిర్మిస్తుండడం అదనపు ఆకర్షణ. ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. నిర్మాణ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నాం. శుక్రవారం నుంచే సర్వే బృందాలను పంపుతాం’ అని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్నే మార్చేస్తుందని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు. డెడికేటెడ్ ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌గా అవతరించే దొనకొండకు, ప్రధాన ఓడరేవుకు సమీపంగా ఇది వెళ్తుందని చెప్పారు. ‘ఈ మార్గానికి ఇరువైపులా నీరు, ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న తరహా పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గుంటూరు జిల్లాలో 82.4 కి.మీ., ప్రకాశం జిల్లాలో 226.9 కి.మీ., కర్నూలులో 160.6 కి.మీ., కడప జిల్లాలో 64.2 కి.మీ., అనంతపురం జిల్లాలో 68.6 కి.మీ. మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది. కర్నూలుకు, కడపలకు వేర్వేరు లైన్లు వెళ్తాయి. దేశంలోనే అతిపెద్దదైన ఈ ప్రాజెక్టు కోసం 26,793 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 9324 హెక్టార్ల అటవీ భూమి ఉంది. దీన్ని డీనోటిఫై చేయాల్సి ఉంది. భూసేకరణకు సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తం వెచ్చించాలి. భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూ సమీకరణకు వెళ్లాలి. దానివల్ల ఖర్చు తగ్గిపోతుంది. దీనిపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులతో మాట్లాడి సమీకరణ పూర్తిచేయాలి. ఇకపై ప్రతివారం ఈ ప్రాజెక్టుపై సమీక్షిస్తాను. అత్యున్నతస్థాయి కమిటీని కూడా నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్, తదితరులు పాల్గొన్నారు.
Raaz@NBK Posted November 25, 2016 Posted November 25, 2016 27,600 crores in 2 years? Modi nammukuni dates iste inka anthe sangathulu
Lakshman NTR Posted November 25, 2016 Posted November 25, 2016 Nitish Gadkari promise chesaadu mari.. R&B ki nidhula dhoka ledu.. Project detailed plan pampistey funds release chestaamu ani.. Gadkari ni nammochu ley
sonykongara Posted November 25, 2016 Author Posted November 25, 2016 598.83 kms. six- lane expressway to connect Amaravati with Anantapuramu district CBN yesterday unveiled a roadmap for building a six- lane expressway of 598.83 kms, connecting the state's new capital Amaravati with Anantapuramu district, at a cost of Rs 27,600 crore. The proposed expressway would pass through Guntur, Prakasam, Kurnool, Kadapa and Anantapuramu districts with interlinking roads to Chennai, Hyderabad and Bengaluru. A separate road each to Kadapa and Kurnool would cut the expressway. A railway line would also be built parallel to the expressway. "This will be a unique straight road with no twists or turns. It will have many bridges and tunnels along the way for a seamless flow of traffic. Presently, it will be a six-lane road but in future, it could be expanded to eight lanes, so keep adequate land in reserve," CBN said. With the expressway, CBN aims to change the face of backward regions in the state. He also intends to build industrial townships along the road in places where water and mineral resources were available.
swas Posted November 25, 2016 Posted November 25, 2016 598.83 kms. six- lane expressway to connect Amaravati with Anantapuramu district CBN yesterday unveiled a roadmap for building a six- lane expressway of 598.83 kms, connecting the state's new capital Amaravati with Anantapuramu district, at a cost of Rs 27,600 crore. The proposed expressway would pass through Guntur, Prakasam, Kurnool, Kadapa and Anantapuramu districts with interlinking roads to Chennai, Hyderabad and Bengaluru. A separate road each to Kadapa and Kurnool would cut the expressway. A railway line would also be built parallel to the expressway. "This will be a unique straight road with no twists or turns. It will have many bridges and tunnels along the way for a seamless flow of traffic. Presently, it will be a six-lane road but in future, it could be expanded to eight lanes, so keep adequate land in reserve," CBN said. With the expressway, CBN aims to change the face of backward regions in the state. He also intends to build industrial townships along the road in places where water and mineral resources were available. 2019 ki 2 lines complete chesina chalu
mahesh1987 Posted November 26, 2016 Posted November 26, 2016 2 years lo intha big project aa....is it possible!!! durga gudi flyover complete ainatte idi kuda
sonykongara Posted December 3, 2016 Author Posted December 3, 2016 అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పై డీపీఆర్ హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అనంతపురం-అమరావతి జాతీయ రహదారి(ఎక్స్‌ప్రెస్‌వే)పై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారవుతోంది. ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ దీనిని శరవేగంగా రూపొందిస్తోంది. డీపీఆర్ ఖరారైతేనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ముందడుగు పడుతుందని జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ)కూడా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో డీపీఆర్‌ను ఎలాంటి లోపాలు రాకుండా, సమస్యలకు తావులేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ(ఆర్ అండ్ బీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామ్‌బాబ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఎదురయ్యే చిక్కులు, భూ సేకరణ సమస్యలను ముందుగా పరిష్కరించుకునేలా ఆర్‌అండ్‌బీ చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఉన్నతస్థాయి పర్యవేక్షణ క మిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్ శ్యామ్‌బాబ్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠా, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణంలో సాధారణ అటవీ భూములతోపాటు రిజర్వ్ అటవిని కూడా సేకరించాల్సి వస్తోంది. దీనికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి లేదా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆర్‌అండ్‌బీ ప్రతిపాదించింది. కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు పొందడం అంత సులువైన పనికాదు. కాబట్టి రాష్ట్రస్థాయిలో అటవీ శాఖ అధికారులే ఈ బాధ్యతను తీసుకుంటే బాగుంటుందని ఆర్‌అండ్‌బీ భావించింది. తొలుత భూ సేకరణ అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే కోసం దాదాపు 26,890 ఎకరాల భూమి అవసరమని అంచనావేశారు. భూ సేకరణ ఖరీదే రూ.2500 కోట్ల పైమాటే అని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. తొలుత భూ సమీకరణపై దృష్టిపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే సాంకేతికంగా అది సాధ్యంకాదని తేలడంతో భూ సేకరణకు వెళ్లాలని తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం కోరుతున్నట్లుగా భూ సేకరణ బాధ్యతను ఏపీ ప్రభుత్వమే తీసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా ఎన్‌హెచ్‌ఏఐకి తెలియజేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో భూ సేకరణపై నెలకొన్నసందిగ్ధత తొలగిపోయింది. కేంద్రం తీరుపై అసంతృప్తి అనంత-అమరావతి జాతీయ రహదారి ప్రతిపాదనలో లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణానికి అంగీకారం కుదిరిందని, ఈ మేరకు తీర్మానం జరిగిందని, అయినా ఆ ప్రాజెక్టు జాబితాలో లేదని ఎలా ప్రకటిస్తారంటూ ఏపీ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశంపై అర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామ్‌బాబ్ కూడా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడారు. ‘నవంబరు 10న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ నివాసంలో సమావేశం జరిగింది. గడ్కరీ, రోడ్డు రవాణా శాఖ, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఐదుగురు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతోపాటు ఏపీకి చెందిన ముగ్గురు అధికారులు ఈ భేటిలో పాల్గొన్నారు. అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను చేపడతామని గడ్కరీ స్పష్టంగా చెప్పారు. దీనికి భిన్నంగా ఎలా ప్రకటిస్తారు?’ అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ఎలాంటి సందేహాలులేవని, ప్రస్తుతం డీపీఆర్ తయారవుతోందని శ్యామ్‌బాబ్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని 4 నెలల క్రితమే గడ్కరీ అంగీకరించారని చెప్పారు.
minion Posted December 3, 2016 Posted December 3, 2016 Avvaka pothe Modi gaadi meeda toseddam inkokari meeda those manastatvam CBN ki ledule ... you should know that ... despite your recent bjp angle.
swarnandhra Posted December 3, 2016 Posted December 3, 2016 కేంద్రం తీరుపై అసంతృప్తి అనంత-అమరావతి జాతీయ రహదారి ప్రతిపాదనలో లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణానికి అంగీకారం కుదిరిందని, ఈ మేరకు తీర్మానం జరిగిందని, అయినా ఆ ప్రాజెక్టు జాబితాలో లేదని ఎలా ప్రకటిస్తారంటూ ఏపీ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశంపై అర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామ్‌బాబ్ కూడా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడారు. ‘నవంబరు 10న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ నివాసంలో సమావేశం జరిగింది. గడ్కరీ, రోడ్డు రవాణా శాఖ, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఐదుగురు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతోపాటు ఏపీకి చెందిన ముగ్గురు అధికారులు ఈ భేటిలో పాల్గొన్నారు. అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను చేపడతామని గడ్కరీ స్పష్టంగా చెప్పారు. దీనికి భిన్నంగా ఎలా ప్రకటిస్తారు?’ అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ఎలాంటి సందేహాలులేవని, ప్రస్తుతం డీపీఆర్ తయారవుతోందని శ్యామ్‌బాబ్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని 4 నెలల క్రితమే గడ్కరీ అంగీకరించారని చెప్పారు. veella verbal assurances/promises ni inka ela nammutunnaru CBN?
Guest Urban Legend Posted December 5, 2016 Posted December 5, 2016 good days for rayalaseema Sri @srithh 13h13 hours ago G.O 2716 issued GOI to develop Busy Kadapa-Renigunta road into 4Lane national highway(NH716) #Rayalaseema #andhrapradesh
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now