Jump to content

Amaravati to Anantapur Expressway


Recommended Posts

అమరావతి-అనంతకు రైల్వే లైన్‌?
 
 • ఎక్స్‌ప్రెస్‌ వే రహదారికి సమాంతరంగా ట్రాక్‌
 • ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం ముందుకు...
అమరావతి, న్యూఢిల్లీ, మే 9(ఆంధ్ర‌జ్యోతి): అమరావతి-అనంతపురం మధ్య మలుపులు లేకుండా ఎక్స్‌ప్రె్‌సవే రహదారిని నిర్మించే విషయం బుధవారం జరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ రహదారికి సమాంతరంగా ప్రత్యేకంగా రైల్వే లైను వేసే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైల్వేలైను ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలని రైల్వే శాఖను కోరారు. సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చాక ఆయనతో దీనిపై భేటీ కావాలని నిర్ణయించారు. మరోవైపు మదనపల్లె-చిత్తూరు రోడ్డు విస్తరణకు, చిత్తూరు-నాయుడుపేట రోడ్డును ఆరు వరుసలుగా చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని దావ్రా ఆదేశించారు.
 
ఇదిలాఉండగా, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు విజయవాడ-హైదరాబాద్‌ మధ్య మరో ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించాలనీ కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మధ్య మరో ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించనుంది. తద్వారా విజయవాడ నుంచి నాగ్‌పూర్‌ వరకూ రోడ్డు రవాణా వేగం పెరగనుంది. కాగా, దేశవ్యాప్తంగా సరుకు రవాణాను వేగంగా చేపట్టేందుకు 15 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు(ఎంఎంఎల్‌పీ)లను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా విజయవాడలో రూ.1300 కోట్లతో ఏర్పాటు చేయబోయే పార్కును భారత జాతీయ రహదారుల సంస్థ(ఎనహెచఏఐ), ఏపీఐఐసీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. విశాఖపట్నంలో రూ.1200 కోట్లతో ఏర్పాటు చేయబోయే పార్కును ఎనహెచఏఐ, విశాఖపట్నం పోర్టు ట్రస్టులు నిర్మిస్తాయి. ఈ మేరకు ఆయా సంస్థలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కాగా, విశాఖపట్నం నౌకాశ్రయానికి రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసేందుకు కూడా ఈ సదస్సులో ఎనహెచఏఐ, విశాఖపట్నం పోర్టు ట్రస్టు మధ్య ఒప్పందం జరిగింది.
Link to comment
Share on other sites

Shh railway line avasarama akkada... Road ki boomulu poyi railways ki boomulu poyi janalu dobbutaru idi matram confirm chala oorlu potayi madyalo :sleep:

road ki  tisukuna bhumi saripothundi annitiki kalipetisukutunaru madya lo townships vacche laga

Link to comment
Share on other sites

road ki tisukuna bhumi saripothundi annitiki kalipetisukutunaru madya lo townships vacche laga

Ala aithe ok bro endukante road poye way mottam tdp ki support chese oorle unayi ekkuva ga... Janala reaction eppudu ela untado chepalemu

Link to comment
Share on other sites

Ala aithe ok bro endukante road poye way mottam tdp ki support chese oorle unayi ekkuva ga... Janala reaction eppudu ela untado chepalemu

annay naaku telisina areas anne TDp core villages...max yevaru fodava cheyyadam ledhu ippatiki... they are happy ..

Link to comment
Share on other sites

ముందడుగు
 
636300684801738070.jpg
 • అమరావతి-అనంత ఎక్స్‌ప్రె్‌సవే..
 • భూసేకరణకు ఐదు యూనిట్లు..
 • అటవీభూమి కోసం ప్రత్యేక యూనిట్‌
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున ఐదు ప్రత్యేక భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేసింది. తొలిసారిగా అటవీభూముల సేకరణకూ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలో సర్వే పనులు చేపట్టాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమకి న డుమ రహదారి సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.29 వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఆరు.. నాలుగు వరుసల రహదారులు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో భూసేకరణ కే రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎక్స్‌ప్రె్‌సవేపై ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారవుతోంది. అది పూర్తయి కేంద్రం దాన్ని పరిశీలించిన తర్వాత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. అయితే ఇదంతా లాంఛనప్రాయమే. దీనికన్నా ముందు అతిక్లిష్టమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్రం రాషా్ట్రనికి సూచించింది. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం భూసేకరణపై దృష్టి పెట్టింది. భూ సేకరణ కోసం ఐదు ప్రత్యేక భూ సేకరణ యూనిట్లను ఏర్పాటు చేసింది. ప్రతి యూనిట్‌కు డిప్యూటీ కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు. సూపరింటెండెంట్‌ కేడర్‌లో ఒక డిప్యూటీ తహశీసిల్దార్‌, సాధారణ డిప్యూటీ తహశీల్దార్‌లు నలుగురు ఉంటారు. అటవీ భూమి క్లియరెన్స్‌ సెల్‌లో డీఎ్‌ఫఓ కేడర్‌ అధికారి, ఇద్దరు ఫారెస్ట్‌ రేంజర్‌లు, ఇతర సిబ్బంది ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. సీనియర్‌ అసిస్టెంట్‌, సర్వేయర్‌ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని సర్కారు ఆదేశించింది.
 
భూసేకరణ - సమీకరణ!
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం కోసం భూమిని సమీకరణ, సేకరణ రెండు పద్ధతుల్లోనూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒక దశలో మొత్తం భూసేకరణ చేయాలన్న ఆలోచన చేశారు. అయితే గుంటూరులాంటి జిల్లాలో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు అధికంగా ఉండడంతో భూసేకరణ రైతులకు ప్రయోజనకరంగా ఉండదు. అదే సమయంలో ప్రభుత్వం వద్దా భూసేకరణకు తగినన్ని నిధులు లేవు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకు ఉభయతారకంగా ఉండేలా భూమిని తీసుకోవాలని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లేముందు కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌ వేకు భూమిని ఎలా తీసుకోవాలన్న దానిపై చర్చించారు. వేల ఎకరాల భూమి అవసరం ఉండడంతో భూసేకరణ కోసం కోట్ల రూపాయలు చెల్లించాలని, అలాగని వెనకడుగు వేస్తే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు రాదని ఆయన తన మనసులో మాటను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పలు దఫాలు చర్చించారు. భూమి విలువ తక్కువుగా ఉన్నచోట భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే, భూముల ధరలు ఎక్కువుగా ఉన్నచోట్ల సమీకరణ పద్ధతి మేలని భావిస్తున్నారు. అదే సమయంలో ఏ విధానంలో పరిహారం కావాలన్నది ఎంచుకునే అవకాశం రైతులకే ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా ఆలోచన చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేకు ఇరువైపులా పదుల సంఖ్యలో పారిశ్రామిక పార్కులు, ఎంఎ్‌సఎంఈ పార్కులు లాంటివి ఏర్పాటు చేసి ఆర్థిక, వ్యాపార కేంద్రాలను సృష్టించాలని భావిస్తున్నారు. దీంతో ఆయా చోట్ల భూములిచ్చిన రైతులకు ఇచ్చే స్థలాల విలువ పెరుగుతుందని, రైతులకూ ప్రయోజనకరంగా ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.
 
jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj.jpg
Link to comment
Share on other sites

అమరావతి కొత్త కారిడార్‌
పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చిత్తూరు, కర్నూలు, అమరావతిలను అనుసంధానం చేస్తూ ఒక కొత్త పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా ఒక సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్‌ను ఎక్కడెక్కడ, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలాంటి క్లస్టర్లు ఏర్పాటు చేయాలి తదితర అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించాలని, దాని ఆధారంగా స్థల సేకరణ జరిపి పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించారు. ఈ కారిడార్‌ అభివృద్ధి వల్ల ఒకేసారి రాయలసీమ నుంచీ కృష్ణా జిల్లా వరకు పారిశ్రామిక త్రిభుజంగా అభివృద్ధి చేసి పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Link to comment
Share on other sites

జూలై చివరికి అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవే భూ సేకరణ పూర్తి
 
కడప, మే 15 (ఆంధ్రజ్యోతి): అనంతపురం-అమరావతి గ్రీనఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రహదారికి అవసరమైన భూమిని జూలై చివరి నాటికి సేకరిస్తామని రోడ్లు భవనాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సుమితదావ్రా పేర్కొన్నారు. కడప జిల్లాలో రహదారికి అవసరమైన భూసేకరణపై స్థానిక స్టేట్‌గెస్ట్‌ హౌస్‌లో సోమవారం అధికారులతో ఆమె రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన విడుదల చేస్తామని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో సీమ నుంచి అమరావతికి ఐదు గంటల ప్రయాణం తగ్గుతుందన్నారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణ కోసం చేపట్టిన సర్వే 50 శాతం పూర్తయిందన్నారు. కడప జిల్లాలో 64.5 కిలోమీటర్ల మేర రహదారికి గాను 897 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు.
Link to comment
Share on other sites

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సర్వే బృందాలు
రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు మెరుగైన వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన చోట అవసరమైన భూమిని సేకరించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. మొత్తం 145 కి.మీ. జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ హైవే అభివృద్ధి కానుంది. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట, కంభం, మార్కాపురం, తర్లుపాడు, దొనకొండ, కురిచేడు, దర్శి, సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 23 మంది సర్వేయర్లను, డిప్యూటీ సర్వేయర్లను సర్వే పనులకు నియమించారు. గత బుధవారమే వీరికి నియామక ఉత్తర్వులను సర్వే ఏడీ జారీ చేశారు. 2,537.50 హెక్టార్లను వీరు సర్వే చేయాల్సి ఉంది. రిజర్వు ఫారెస్టులో 9.850 కిమీ, అటవీ ప్రాంతంలో 1.7 కిమీ, గానుగపెంట రిజర్వు ఫారెస్టులో 3.5 కిమీ, ఉప్పుమాగులూరు ఫారెస్టులో 0.900 కిమీ సర్వే చేయాల్సి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టు కోసం భూసేకరణ ఏ పాటిగా జరగనుందో.. జిల్లాలోని సర్వేయర్లందరినీ వేరే పనులకు పెట్టకుండా అత్యంత ప్రాధాన్యం కింద ఎక్స్‌ప్రెస్‌ హైవే సర్వేకు వినియోగించడం గమనార్హం.

Link to comment
Share on other sites

భూసేకరణ బాధ్యత సంయుక్త కలెక్టర్లదే!

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు 22వేల ఎకరాలు అవసరం

60మందితో అయిదు బృందాలు ఏర్పాటు

ఈనాడు, అమరావతి: అనంతపురం నుంచి అమరావతి వరకూ నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ రహదారికి అవసరమైన భూముల సేకరణకు రంగం సిద్ధమైంది. ఈ సేకరణ బాధ్యతను సంయుక్త కలెక్టర్లకు అప్పగించనున్నారు. అధీకృత అధికారులుగా నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అయిదు రెవెన్యూ బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో 12మంది సిబ్బంది ఉంటారు. అటవీ అనుమతులకు సంబంధించి మరో బృందం ఏర్పాటైంది. రాయలసీమ నుంచి రాజధానికి చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించడమే ఎక్స్‌ప్రెస్‌ వే ప్రధాన ఉద్దేశం. ఇందులో 394 కి.మీ. మేర నాలుగు వరుసలు, 208 కి.మీ. మేర ఆరు వరుసల రోడ్డు ఉంటుంది. ఇందుకోసం రూ.29వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి కోసం సుమారు 22వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. సేకరణకు సంబంధించిన ప్రకటన వచ్చేందుకు కొంత సమయంపడుతుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. అధీకృత అధికారిగా సంయుక్త కలెక్టర్లను గుర్తిస్తూ ప్రకటన వచ్చిన తరవాత సేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే సేకరించాల్సిన భూములకు సంబంధించిన పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియను కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చేస్తున్నారు. అనంతపురం జిల్లా పరిధిలో ఇప్పటికే పూర్తయింది. భూసేకరణ బృందాల ఏర్పాటుకంటే ముందుగానే మండలాలవారీగా తహసీల్దార్లు, సర్వేయర్లతో ఈ ప్రక్రియను ముగించారు. సేకరణ బృందాలు రంగంలోకి వచ్చేసరికి భూసేకరణ ప్రకటన, సామాజిక మదింపు, పరిహార నిర్ణయం లాంటివి చేస్తారు. దీని వల్ల సేకరణ వేగవంతమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాకో భూసేకరణ బృందాన్ని నియమించనున్నారు. ఉప కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేస్తాయి. డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిసెంట్లతో కలిపి 12 మంది ఉంటారు. అయిదు జిల్లాలకీ సంబంధించిన అటవీ అనుమతుల కోసం డీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో ఒక యూనిట్‌పెడుతున్నారు.

Link to comment
Share on other sites

ధర నిర్ణయం.. మార్గం సుగమం

ఎకరాకు రూ.8.50 లక్షల పరిహారం

యుద్ధప్రాతిపదికన అనంత - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం సర్వే

ఈనాడు, గుంటూరు

gnt-brk1a.jpg

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి భూసేకరణలో ముందడుగు పడింది. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించే భూమికి ధరపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెగ్‌మార్క్‌, సర్వే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జంక్షన్ల సంఖ్య పెరగడంతో ముందు అనుకున్న ప్రతిపాదన కంటే కొంత ఎక్కువగా భూమి సేకరించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయడంతో ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. వీలైనంత తొందరగా భూసేకరణ పూర్తిచేసి రైతుల ఖాతాలకు సొమ్ము జమచేయడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రోజువారీగా కొన్ని గ్రామాలు ఎంపికచేసుకుని ధర నిర్ణయంపై రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయిస్తున్నారు. జిల్లాలో భూసేకరణకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. మొత్తం జిల్లాలో 91.44కిలోమీటర్ల దూరం మార్గం ప్రయాణిస్తుంది. అత్యధికంగా తాడికొండ మండలంలో 1180 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇక్కడ పెద్ద జంక్షన్‌ కూడా ఏర్పాటుచేస్తారు. అమరావతి నగరం అనుసంధానం చేసే అంతర వలయ రహదారి, బాహ్యవలయ రహదారులతోపాటు మండల కేంద్రాలు, ప్రధాన రహదారులతో అనుసంధానం ఉన్న ప్రాంతాల్లో కూడళ్లు నిర్మిస్తారు. ఎక్స్‌ప్రెస్‌ మార్గం నుంచి ఇతర మార్గాల్లోకి వెళ్లడానికి, వివిధ ప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో వాహనాలు రావడానికి జంక్షన్లు ఉపయోగపడతాయి.

రహదారి విశేషాలు.....

మొత్తం రహదారి పొడవు : 598.830కిలోమీటర్లు

గుంటూరు జిల్లాలో మార్గం ప్రయాణించే దూరం: 91.44కిలోమీటరు

జిల్లాలో 281.100కిలోమీటరు నుంచి 303.350కిలోమీటర్ల వరకు నూజెండ్ల మండలంలోని పమిడిపాడు గ్రామం నుంచి మొదలై వినుకొండ మండలం శెట్టుపల్లి వరకు ప్రయాణిస్తుంది. తర్వాత ప్రకాశం జిల్లాలో కొంతదూరం ప్రయాణించి చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో జిల్లాలోకి ప్రవేశించి 324.700కిలోమీటరు నుంచి 393.595కిలోమీటర్లు వరకు ప్రయాణించి తుళ్లూరు మండలం పెదపరిమి నుంచి రాజధాని అమరావతి నగరంలోకి అనుసంధానం చేస్తారు. చి జిల్లాలో మొత్తం 9మండలాల ద్వారా ఎక్స్‌ప్రెస్‌ మార్గం ప్రయాణిస్తుంది. చి మొత్తం 29గ్రామాల పరిధిలో 6116.22 ఎకరాల భూసేకరణ చేయనున్నారు. మొత్తం భూసేకరణకు వెచ్చించే మొత్తం :సుమారుగా రూ.2వేల కోట్లు చి జిల్లాలో మొత్తం 35 కిలోమీటర్ల పరిధిలో పెగ్‌మార్క్‌ సర్వే పూర్తిచేశారు. ఈపరిధిలో 1580 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

పెగ్‌మార్క్‌ పూర్తయిన గ్రామాల వివరాలు: నూజెండ్ల మండలంలో 6గ్రామాల పరిధిలో పెగ్‌మార్క్‌ సర్వే పూర్తిచేసి 19.5కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 844.08 ఎకరాలు సేకరించాలని తేల్చారు. అదేవిధంగా వినుకొండ మండలంలో 3 గ్రామాల పరిధిలో 6కిలోమీటర్ల నిర్మాణానికి 150 ఎకరాలు సేకరించాలి. నూజెండ్ల మండలంలో 5.78కిలోమీటర్ల నిర్మాణానికి 268.58 ఎకరాలు, చిలకలూరిపేట మండలంలో 4.2కిలోమీటర్ల నిర్మాణానికి 316.12 ఎకరాలు సేకరించాలని గుర్తించారు. ఇందుకు నూజెండ్ల రెండుగ్రామాలు, చిలకలూరిపేట మండలంలో రెండు గ్రామాల్లో సర్వే, పెగ్‌మార్క్‌ పనులు కొనసాగుతున్నాయి.

gnt-brk1b.jpg

కూడళ్ల నిర్మాణంతో పెరిగిన భూసేకరణ: అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మాణంలో భాగంగా జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది కూడళ్లను నిర్మించాలని నిర్ణయించడంతో ముందు అనుకున్న దానికంటే కొంత భూమి అదనంగా సేకరించాల్సి వస్తోంది. ముందుగా 4600 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 6116.22 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎక్స్‌ప్రెస్‌ మార్గం వివిధ మార్గాలను దాటుకుంటూ వెళుతున్న క్రమంలో ప్రధాన రహదారులతో అనుసంధానానికి వీలుగా కూడళ్లను ఏర్పాటుచేస్తున్నారు. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లే రాష్ట్ర రహదారిని ఎక్స్‌ప్రెస్‌ మార్గం దాటుకుని వెళ్లే క్రమంలో కావూరు గ్రామం వద్ద జంక్షన్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడ వంద ఇళ్లు, అదేవిధంగా మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం వద్ద కొన్ని ఇళ్లు తొలగించాల్సి రావడంతో అలైన్‌మెంట్‌ కొంత మార్చి ఇళ్లు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూడళ్లు ఏర్పాటుచేసే ప్రాంతంలో 250 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి వస్తోంది. దీంతో భూసేకరణ విస్తీర్ణం పెరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్‌ü్స అనే సంస్థ రహదారి ప్రయాణించే మార్గంతో రహదారి రెండువైపులా హద్దులు నిర్ణయిస్తోంది. హద్దులో మధ్యలో ఉన్న భూమి ఏ సర్వేనంబరు, ఏ సబ్‌డివిజన్‌, ఎంత విస్తీర్ణం తదితర వివరాలను సర్వే, రెవెన్యూ విభాగం నిర్ణయిస్తున్నాయి. భూసేకరణ ప్రక్రియను సంయుక్త పాలనాధికారి క్రితికా శుక్లా పర్యవేక్షిస్తున్నారు.

రెండు గ్రామాల్లో ధర నిర్ణయం

అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతం చేశాం. నూజెండ్ల మండలంలోని పుచ్చనూతల, తలార్లపల్లె గ్రామాల రైతులతో చర్చలు జరిపాం. అక్కడ ఎకరాకు రూ.8.50లక్షల వరకు పరిహారం ఇస్తున్నాం. ఈమేరకు రైతులు అంగీకరించారు. మండలంలో మిగిలిన గ్రామాల్లోనూ ధర నిర్ణయించే కార్యక్రమం కొనసాగిస్తాం. వీలైనంత తొందరగా రైతులకు పరిహారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి సొమ్ము జమచేసేలా అన్ని వివరాలు సేకరిస్తున్నాం.

- క్రితికా శుక్లా, సంయుక్తపాలనాధికారి, గుంటూరు‘
Link to comment
Share on other sites

రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలి: జేసీ

gnt-brk6a.jpg

ములకలూరు (నూజండ్ల): అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణానికి రైతులు సహకారం అందించాలని జేసీ క్రితికాశుక్లా కోరారు. బుధవారం ములకలూరు, బుర్రిపాలెం, తలార్లపల్లె గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. బహిరంగ మార్కెట్‌ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని పేర్కొన్నారు. దీంతో రైతులు భూములు ఇవ్వలేమని వాదనకు దిగారు. వారి అభిప్రాయాలు తెలపాలని కోరారు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఇక్కడ రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎకరం భూమి ధర ఉందని వివరించారు. బహిరంగ మార్కెట్‌ ధర ఇస్తే రైతులు సంతోషంగా భూములు ఇస్తామని ప్రకటించారు. సన్న, చిన్నకారు రైతులు భూములు కోల్పోవడంతో జీవనోపాధిని కోల్పోతున్నారని రైతుల పరిస్థితిని కూడా ఆలోచించాలని కోరారు. అధికారుల ఇష్టానుసారంగా భూములు తీసుకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని ఆవేదనతో తెలిపారు. చట్టం ప్రకారం మాత్రమే పరిహారం అందించగలమని జేసీ పేర్కొన్నారు. జాతీయ రహదారి చట్ట ప్రకారం ఎకరం భూమికి రూ.7.68 లక్షలు మాత్రమే వస్తుందన్నారు. తనపరిధిలో ఉన్నత వరకు ఎకరానికి రూ.8.50 లక్షలు ఇవ్వగలమని ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరిహారానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు ప్రకటించారు. దీంతో వాదోపవాదనలు జరిగాయి. సహకారం అందించకపోతే చట్టప్రకారం పోవాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. రైతులను అడ్డు తొలగించుకొని రోడ్డు నిర్మాణాలు చేసుకోండని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇవ్వమని సమావేశం నుంచి రైతులు వెళ్లిపోయారు. దీంతో అర్థంతరంగా సమావేశాలు ముగిశాయి. ఆర్డీవో రవీంద్ర, తహశీల్దార్‌ పద్మాదేవి సిబ్బంది ఉన్నారు.

Link to comment
Share on other sites

too less compensation and too much land acquisition. what is this big junction "business"?

 

I think 'junction' means, routes along the way where other roads merge into the expressway. Probably they are planning in the similar lines to how we have in countries like the USA. All other roads having merge points into this expressway. Bangalore 'Hebbal flyover' junction could be an example i guess. It indeed needs lot of land if you have a lot of such junctions along the way. 

Link to comment
Share on other sites

I think 'junction' means, routes along the way where other roads merge into the expressway. Probably they are planning in the similar lines to how we have in countries like the USA. All other roads having merge points into this expressway. Bangalore 'Hebbal flyover' junction could be an example i guess. It indeed needs lot of land if you have a lot of such junctions along the way. 

 

junctions ante idea vundi brother. Hebbal flyover you mentioned takes up less than 20 acres. busiest freeway crossingover another freeway in US takes around 50-60 acres. Here we are talking about 200 acres each.

Link to comment
Share on other sites

అనంతపురం రహదారికి ఐదు భూసేకరణ యూనిట్లు

ఈనాడు-అమరావతి: అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి రాజధానికి దారితీసే వంకర్లు లేని నాలుగు, ఆరులైన్ల రహదారి భూసేకరణ ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. మూడు జిల్లాలకు ఐదు భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, గుంటూరు కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయి. ఐదు జిల్లాల మీదుగా సాగే రహదారిలో అటవీ భూముల వ్యవహారం చూసేందుకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఒంగోలు కేంద్రంగా ఏర్పాటయ్యే ఈ విభాగంలో డీఎఫ్‌ఓ స్థాయి సహాయ కన్సర్వేటర్‌తోపాటు ఇద్దరు రేంజి అధికారులు ఉంటారు.

Link to comment
Share on other sites

ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణపై మిశ్రమ స్పందన
 
 
636323323147339234.jpg
 • నూజెండ్ల, వినుకొండలో రైతులు సానుకూలం
 • తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు, నాదెండ్ల, చిలకలూరిపేటలో వెనకడుగు
 • రాజధాని తరహా ప్యాకేజి కోసం రైతుల డిమాండ్‌
ఆంధ్రజ్యోతి, గుంటూరు : అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణకు సంబంధించి గుంటూరు జిల్లాలో రైతుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రిమోట్‌ ఏరియాలైన నూజెండ్ల, వినుకొండ మండలాల్లోని రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నా చిలకలూరిపేట, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు, నాదెండ్ల మండలాల రైతులు వెనకడుగు వేస్తున్నారు. తొలుత భూసమీకరణ విధానంలో భూములు తీసుకొంటామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత భూసేకరణ అంటూ మాట మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న తాడికొండ మండలంలోని నాలుగు గ్రామాల రైతులు తమకు రాజధాని తరహా ప్యాకేజ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోన్న వేదికల వద్ద రైతులు తమ డిమాండ్లను రెవెన్యూవర్గాలకు నివేదిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజ్‌ తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఎకరం రూ. కోటి విలువ చేసే భూములను భూసేకరణ కింద రూ.22 లక్షలు ఇస్తామంటే తాము ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తాడికొండ మండలంలోని లాం గ్రామం వద్ద ఇటీవల రైతులు రోడ్డెక్కి నిరశన తెలిపారు.
 
నవ్యాంధ్రకే తలమానికంగా..
అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉండబోయే ప్రాజెక్టు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇది మూడో ఎక్స్‌ప్రెస్‌ హైవే కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు గుంటూరులో అవసరమైన భూములను జూలై నెలాఖరు లోపు సేకరించి ఇవ్వాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సుమిత దావ్రా జిల్లా యంత్రాంగాన్ని ఇటీవలే ఆదేశించారు. గత నెల 10వ తేదీన గుంటూరు వచ్చిన ఆమె కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, అటవీ, ఎనహెచఏఐ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతపురంలో 74.750 కిలోమీటర్లు, కర్నూలులో 80.800 కిలోమీటర్లు ప్రకాశంలో 145.800 కిలోమీటర్లు, గుంటూరులో 92.244 కిలోమీటర్ల పొడవునా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరుగుతుంది. కర్నూలులో మరో 75.650 కిలోమీటర్లు ఫీడర్‌ రోడ్డు ఇందులోకి వచ్చి కలుస్తుంది. అలానే కడపలో నుంచి 64.500 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఫీడర్‌ రోడ్డు కూడా ఇందులో అనుసంధానం అవుతుంది. ప్రకాశం జిల్లాలో 23.580 కిలోమీటర్ల ఫీడర్‌ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ పొడవు 393.594 కిలోమీటర్లు, ఇది రాజధానికి షార్టుకట్‌ రోడ్డు అవుతుంది.
 
భూ సేకరణ ఇలా..
గుంటూరు జిల్లాలో నూజెండ్లలో ఎనిమిది గ్రామాలు, వినుకొండలో మూడు, చిలకలూరిపేటలో రెండు, నాదెండ్లలో మూడు, ఫిరంగిపురంలో ఐదు, మేడికొండూరులో ఐదు, తాడికొండలో నాలుగు, తుళ్లూరులో ఒక గ్రామం నుంచి రోడ్డు నిర్మాణం అలైన్ మెంట్‌ చేశారు. నూజెండ్ల మండలంలో 380 హెక్టార్లు, వినుకొండలో 65 హెక్టార్లు, చిలకలూరిపేటలో 248 హెక్టార్లు, నాదెండ్లలో 206 హెక్టార్లు, ఫిరంగిపురంలో 276 హెక్టార్లు, మేడికొండూరులో 205 హెక్టార్లు, తాడికొండలో 407 హెక్టార్లు, తుళ్లూరులో 57.88 హెక్టార్ల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించాల్సి ఉంది. ప్రతిపాదిత ఎలైన్ మెంట్‌ ప్రకారం ఈ రోడ్డుని రైతుల పొలాల్లో నుంచే వేయాలని నిర్ణయించారు. నూజెండ్ల, వినుకొండ మండలాల్లోని గ్రామాలు గుంటూరులో రిమోట్‌ ఏరియాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి విలువ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్యన ఉంటుంది. భూసేకరణ వలన ఇక్కడి రైతులకు ఇబ్బంది ఉండదు. చిలకలూరిపేట, నాదెండ్ల, ఫిరంగిపురం మండలాల్లో ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉన్నది. మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో ఎకరం భూమి రూ. కోటి పైమాటే. దీంతో ఈ ఆరు మండలాల రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్‌ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంకా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్లు, సిబ్బందిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పెగ్‌ మార్కింగ్‌ జరుగుతోంది. అలానే సబ్‌ రిజిస్ర్టార్ ల ద్వారా భూముల పూర్వపు రిజిస్ట్రేషన్లను తెప్పించుకున్నారు. భూమి రికార్డులను ఈ నెల 21 నుంచి జూన్ 15 మధ్యన తయారు చేయాలని గడువు నిర్దేశించారు. డ్రాఫ్టు 3(ఏ)ని ఈ నెల 20 నుంచి 30వ తేదీ మధ్యన పూర్తి చేసి తమకు నివేదించాలి. 3(డీ) ప్రక్రియని మే 21 నుంచి జూన 20 మధ్యన పూర్తి చేయాలి. 3జీని జూన 30 నుంచి జూలై 31 మధ్యన పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో భూములను స్వాధీనపర్చుకొని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాకి అందజేయాలి. ఈ ప్రాజెక్టుకు అన్ని శాఖలు ప్రథమ ప్రాధాన్యం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
రైతుల డిమాండ్లు...
 అమరావతి రాజధానికి ఏ విధంగా అయితే భూములు తీసుకొన్నారో అలానే ల్యాండ్‌ పూలింగ్‌ కింద తమ భూములు తీసుకోవాలి. తీసుకొన్న భూమికి వేరొక చోట సమాన భూమిని ఇవ్వాలి. వీలుకాని పక్షంలో రాజధానిలో రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలి. భూసేకరణ ప్రకారం అయితే ఎకరానికి రూ.కోటికి తగ్గకుండా పరిహారం చెల్లించాలి.  ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో భాగంగా తాడికొండ మండలంలో 320 ఎకరాల విస్తీర్ణంలో భారీ జంక్షన్ ప్రతిపాదించారు. దీనివలన 80 మంది రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున దానిని తీసేయాలి. సీఎం తొలి నుంచి ఎక్స్‌ప్రెస్‌ వే రోడ్డు నేరుగా ఉంటుందని చెబుతున్నారు.
 పొన్నెకల్లు - నిడుముక్కల - పెదపరిమి నుంచి చేసిన ఎలైన్ మెంట్‌ని ఒక ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త భూముల కోసం బండారుపల్లి - పొన్నెకల్లు - లాం- తాడికొండ నుంచి మార్చారు. ఈ ఎలైన్ మెంట్‌ని అంగీకరించబోం.
 రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం సేకరించిన భూములకు రాజధాని మంచి ప్యాకేజ్‌ ఇచ్చారు. రాజధానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమకు ఆ ప్యాకేజ్‌ ఎందుకు ఇవ్వరు.
 తాడికొండలో మొత్తం 10 వేల ఎకరాల పంట భూములున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ వే కోసం 25 శాతం భూములు పోతాయి. అలానే రోడ్డుకు ఇరువైపులా సాగు జరిగే పరిస్థితి ఉండదు. దీని దృష్ట్యా మొత్తం భూములు తీసేసుకొని రాజధాని తరహా ప్యాకేజ్‌ ఇవ్వాలి.
Link to comment
Share on other sites

 • 2 weeks later...

ఎక్స్‌ప్రెస్‌ దారిలో టౌన్‌షిప్‌లు!

అమరావతి-అనంతపురం మార్గంపై కసరత్తు

ఈనాడు, అమరావతి: అనంతపురం నుంచి అమరావతికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌ రహదారి వెంబడి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి 100 కి.మీ. ఒకచోట చిన్నచిన్న వూళ్లు (టౌన్‌షిప్‌లు) అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. టౌన్‌షిప్‌లు తీసుకొస్తే జనజీవనంతోపాటు, వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి సాధ్యమని అంచనా వేశారు. అనంతపురం నుంచి అమరావతి వరకూ 373 కి.మీ. మేర వంపులు లేని ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.27500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 25వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణ యూనిట్లు ఏర్పాటు చేశారు. జులై నెలాఖరుకి భూయజమానులతో చర్చలు, సేకరణకు అంగీకారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 70శాతం అంగీకారం వస్తే టెండర్లకు మార్గం సుగమం అవుతుంది. ఇళ్లు కోల్పోయేవాళ్లకి ప్రభుత్వం అభివృద్ధి చేసే టౌన్‌షిప్‌ల్లో ఇళ్లను కేటాయిస్తారు. తద్వారా ఈ మార్గం వెంబడి ఉన్న భూముల విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రహదారి వెంబడే రైలు మార్గాన్నీ నిర్మించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. రైల్వే అవసరాల్నిదృష్టిలో ఉంచుకొనే భూములు సేకరించనున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...