Jump to content

Recommended Posts

Posted
29 సంస్థలకు వెయ్యి ఎకరాలు
16-09-2017 02:40:33
 
  • రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • కేటగిరీ వారీగా ధరల నిర్ణయం.. ఎకరం 50 లక్షల నుంచి 4 కోట్లు
  • డబ్బు చెల్లించిన తర్వాతే భూమి అప్పగింత
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఆర్‌డీఏ అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వాణిజ్య సంస్థలకు భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. ఏఏ సంస్థలకు ఏ ధరలకు ఇవ్వాలో నిర్ణయించారు. 29 సంస్థలకు వెయ్యి ఎకరాల వరకు కేటాయించాలని ఉపసంఘం ప్రతిపాదించింది. ప్రభుత్వ శాఖల భవనాల సమీపంలో రెండు టవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
 
రాష్ట్రప్రభుత్వ సంస్థలకు, కార్పొరేషన్లకు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు, బ్యాంకులకు, విద్య, వైద్య సంస్థలకు, హోటళ్లకు.. ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ విశ్వవిద్యాలయాల భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు, వీటిలో తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రస్తావించారు. అమృత విశ్వవిద్యాలయం 2018-19 నుంచి తరగతులు ప్రారంభిస్తుందన్నారు. నిట్‌ భవనాల నిర్మాణ పనులు కూడా జరుగుత్నుట్లు చెప్పారు. భూములు ఇచ్చిన రైతులు అందరికీ ప్లాట్లు ఇచ్చినట్లు రిజిస్ర్టేషన్లు కూడా జరుగుతున్నట్లు చెప్పారు.
 
ఇండో యూకే వైద్యశాల(150 ఎకరాలు), బీఆర్‌ శెట్టి మెడికల్‌ కాలేజీ (వంద ఎకరాలు), నందమూరి బసవతారక రామారావు మెమోరియల్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌, కేంద్రీయ విద్యాలయం, రిజర్వు బ్యాంకు (11 ఎకరాలు) ఇవ్వాలని ప్రతిపాదించారు. నాబార్డ్‌(4.3 ఎకరాలు), ఆప్కాబ్‌, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌తో పాటు మరికొన్ని బ్యాంకులకు.. ఎల్‌ఐసీ, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ నేవీ(15 ఎకరాలు), కంట్రోలర్‌ అండ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(17 ఎకరాలు), రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీసె్‌స(ఒక ఎకరం), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌, ఏపీఎన్‌ఆర్టీ(4.5 ఎకరాలు) వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం(20 ఎకరాలు), స్టేట్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీ(3 ఎకరాలు), ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి(12.5 ఎకరాలు), కిమ్స్‌ వైద్యవిద్యాలయం, ఆస్పత్రికి(40 ఎకరాలు), జేవియర్‌ స్కూల్‌ ఆప్‌ మేనేజ్‌మెంట్‌(30 ఎకరాలు), పుల్లెల గోపీచంద్‌ అకాడమీ(12 ఎకరాలు)కి భూములు కేటాయించాలని ప్రతిపాదించారు.
 
సంస్థలు అడిగినంత కాకుండా అందుబాటులో ఉన్న భూమిని ఆయా సంస్థల అవసరాల మేరకు కేటాయించారు. రిజర్వుబ్యాంకు, నేవీ వంటి కొన్ని సంస్థలకు కార్యాలయాలతోపాటు.. ఉద్యోగుల నివాస భవనాల కోసం కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఇచ్చేవిధంగా భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. వీటిలో కొన్ని సంస్థలకు భూములను అప్పగించారు. నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. సంస్థల ప్రాతిపదికగా వాటికి ఇచ్చే భూముల ధరలు నిర్ణయించారు. విద్య, వైద్య సంస్థలు ఒక కేటగిరీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, హోటళ్ల వంటి వ్యాపార సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లను వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. ఎకరం కనీస ధర రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు నిర్ణయించారు. డబ్బు చెల్లించిన తరువాతే భూములు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ఆమోదించవలసి ఉంటుంది.
Posted
‘స్మార్ట్‌ అమరావతి’కి సింగపూర్‌ తోడ్పాటు
16-09-2017 09:58:48
 
636411527453095873.jpg
అమరావతి: రాజధాని అమరావతిని స్మార్ట్‌, సస్టెయినబుల్‌ నగరంగా, అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడంలో భాగంగా అర్బన్‌ ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌, అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ తదితర అంశాల్లో సింగపూర్‌ సంస్థ అర్బన్‌ రీడెవల్‌పమెంట్‌ అథారిటీ (యూఆర్‌ఏ) ఏపీసీఆర్డీయేకు సహకరించనుంది. ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఎంవోయూను అనుసరించి సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ అయిన సింగపూర్‌ కోఆపరేషన్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఎస్‌సీఈ) సీఆర్డీయేకు అర్బన్‌ ప్లానింగ్‌లో తోడ్పడేందుకు అంగీకరించింది. ఆ బాధ్యతలను ఈ రంగంలో నైపుణ్యమున్న తమ దేశ కంపెనీ అయిన యూఆర్‌ఏకు అప్పగించింది. విజయవాడలో శుక్రవారం ఎస్‌సీఈ సీఈవో కాంగ్‌ వై మున్‌, ఐ.ఇ.సెంటర్‌ డైరెక్టర్‌ తిమోతీ సన్‌లతో సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రత్యేక కమిషనర్‌ వి.రామమనోహరరావు, అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ సమావేశమై చర్చలు జరిపారు.
Posted

పరిపాలన నగరంలో ప్రత్యేక శీతలీకరణ వ్యవస్థ

అంచనా వ్యయం రూ.110 కోట్లు

రుణం ఇచ్చేందుకు కేఎఫ్‌డబ్ల్యూ సంసిద్ధత

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన, న్యాయ నగరాల్లో నిర్మించే ప్రధాన భవనాల శీతలీకరణకు ప్రత్యేకమైన ‘డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ’ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.110 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు ముందుకు వచ్చింది. అమరావతిని పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే క్రమంలో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ వైపు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మొగ్గు చూపుతోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల శీతలీకరణకు ఈ వ్యవస్థను వినియోగిస్తారు. కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు ఇప్పటికే సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి దీనిపై అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంతో ఎంత శాతం రుణం ఇస్తారన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పంపించాలని, దాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది.

డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ అంటే..: పెద్ద పెద్ద మాల్స్‌, భారీ కార్యాలయ భవనాలు వంటి చోట్ల భవనానికి సరిపడా కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ ఉంటుంది. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థ కూడా అలాంటిదే..! కాకపోతే కొన్ని భారీ భవనాలకు అవసరమైన శీతలీకరణ వ్యవస్థను విడిగా ఒకచోట ఏర్పాటుచేస్తారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థలో కేంద్రీకృత శీతలీకరణ ప్లాంట్‌, పంప్‌హౌస్‌, శీతలీకరించిన జలాలను లేదా వాయువులను పంపించేందుకు పైప్‌లైన్లు, వీటిని ఆయా భవనాల ఎయిర్‌కండీషన్‌ సర్క్యూట్లతో అనుసంధానించే వ్యవస్థ వంటివి కీలకమైన అంశాలు. శీతలీకరణ కేంద్రం నుంచి ఆయా భవనాలకు వెళ్లే పైప్‌లైన్లు భూగర్భంలో వేస్తారు. సంప్రదాయ ఎయిర్‌కండీషన్‌ వ్యవస్థలతో పోలిస్తే డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ విధానంలో ఖర్చు బాగా తగ్గుతుందని, మన్నిక ఎక్కువని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్‌ అమరావతిలో చేపట్టే పర్యావరణహిత హరిత ప్రాజెక్టులు వేటికైనా ఆర్థిక సహకారం అందించేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది.

Posted
డిజైన్లపై సీఎం అసంతృప్తికి కారణాలేమిటి..?
17-09-2017 09:26:30
 
636412372069217144.jpg
  • అసెంబ్లీ శంకుస్థాపన వాయిదా ప్రభావంపై భిన్నాభిప్రాయాలు
  • తుది దశకు చేరిందనుకున్న డిజైన్ల ఖరారు ప్రక్రియ మళ్లీ మొదలవడంపై చర్చ
  • డిజైన్లపై ముఖ్యమంత్రి అసంతృప్తికి కారణాలేమిటన్న దానిపై ఊహాగానాలు
 
అమరావతి: అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని అసెంబ్లీ భవనానికి ఈ నెల 30న జరిగే శంకుస్థాపనతో రాజధాని నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆశించిన పలువురికి ఆ కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడడం తీవ్ర నిరాశ కలిగించింది! తామెన్నడూ అధికారికంగా ఈ శంకు స్థాపనోత్సవం గురించి చెప్పలేదని మంత్రు లు, ఉన్నతాధికారులు ఇప్పుడు అంటున్న ప్పటికీ కొన్నివారాలుగా ఈ కార్యక్రమం గురించిన వార్తలు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న సంగతి విదితమే. గురువారం నాడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విలేకరులతో సీఎం చంద్రబాబునాయుడు 30వ తేదీన అసెంబ్లీకి శంకుస్థాపన జరపబోవడం లేదని ప్రకటించడంతో వివిధ వర్గాల ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు హతాశులయ్యారు.
 
మోడీ వచ్చిన రెండేళ్లకు..
2015లో దసరా నాడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతికి శంకు స్థాపనోత్సవం జరిగిన తర్వాత రాజధాని నిర్మాణ కార్యకలాపాలు ఊపం దుకున్నాయి. అప్పటినుంచి రెండేళ్లలో అమరావతి రూపకల్పనకు సంబంధించిన లెక్కకు మిక్కిలి కార్యక్రమాలను సీఎం ఆధ్వ ర్యంలో సీఆర్డీయే, ఏడీసీ చేపట్టాయి. ఓపక్క ల్యాండ్‌పూలింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరగా, మరొకపక్క మాస్టర్‌ ప్లాన్లు, నిర్మాణ ప్రణా ళికలు, డిజైన్ల తయారీతోపాటు నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ ఇత్యాదివీ శరవేగంగా సాగుతున్నాయి. ఈ వ్యవధిలోనే, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం కూడా రికార్డు సమయంలో రూపుదిద్దుకుని, చూపరులను ఆశ్చర్య చకితులను చేస్తోంది.
 
           తిరిగి విజయదశమి పర్వదినానే అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన జరుపుతారన్న వార్త లతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్ట బోతున్నారని అంతా భావించారు. అసెంబ్లీకి జరిగే శంకుస్థాపనోత్సవం రాజధానిలోని శాశ్వ త కట్టడాలన్నింటికీ నాందీ ప్రస్తావన పలు కుతుందని, ఆ స్ఫూర్తితో మిగిలిన అన్ని నిర్మా ణాలూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఆశించిన విధంగా రూపుదిద్దుకుని, అమరావతిని ప్రపం చంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా చేయ డంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అను కున్నారు. దీంతోపాటు.. ఆశించిన విధంగా ధరలు పలుకకుండా, అంతగా లావాదేవీలు జర గకుండా నిస్తేజంగా ఉన్న రాజధాని రైతు లకిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల కొనుగోళ్లు, అమ్మ కాలకు అసెంబ్లీకి జరిగే శంకుస్థాపనోత్సవం ఉద్దీపననిస్తుందని పలువురు భావించారు. రాజధానిలో నిర్మాణ కార్యకలాపాలు ఊపం దుకుంటే వేలాదిమందికి మెరుగైన ఉపాధి లభించడంతోపాటు ఆర్థిక లావాదేవీలు ముమ్మరమై, అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరు తుందని భావించారు.
 
ఎందుకిలా జరిగింది..?
చంద్రబాబే స్వయంగా ప్రకటించిన విధంగా భవిష్యత్తు తరాల కోసం లోపరహితం, అత్య ద్భుతం అయిన అమరావతిని నిర్మించేందుకు ప్రభుత్వం కంక ణబద్ధు రాలవడాన్ని ఎవరూ ఆక్షేపించడం లేదు. సమస్యల్లా దాదాపుగా చివరికి వచ్చిందనుకున్న అసెంబ్లీ డిజైన్ల ఖరారు ప్రక్రి య మళ్లీ కొనసాగి, కనీసం కొన్ని వారాల తర్వాతనే ముగియనుండడమే! సీఎం ఆశిం చిన విధంగా అసెంబ్లీ డిజైన్లు రూపొందకపోవడమే ఇందుకు కారణమని అంటున్నప్పటికీ పూర్తిగా ఇదొక్కటే వాయిదాకు హేతువు కాకపోవచ్చునన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
         బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడిన మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ మాటలుగానీ, అదేరోజున విడు దలైన ప్రభుత్వ అధికారిక ప్రకటనగానీ మా స్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించి, ఆ రోజు సమా వేశంలో ప్రదర్శించిన అసెంబ్లీ డిజైన్లను సీఎం సహా అంతా దాదాపుగా ఆమోదించారన్న అభిప్రా యం కలిగించాయి. అసెంబ్లీ బాహ్య, అంతర డిజైన్లతోపాటు హైకోర్టు అంతర్‌ డిజైన్లు బాగున్నాయని, ఒక్క హైకోర్టు బాహ్య స్వరూపం మాత్రమే మార్చాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారన్న వార్తలు వినిపించాయి. గురువారం జరిగే మంత్రుల సమా వేశంలో అసెంబ్లీ డిజైన్లకు అధికారిక ఆమోద ముద్ర పడడం లాంఛనప్రాయమేనని భావించారు.
        కానీ.. తద్విరుద్ధంగా ఈ డిజైన్లపై సీఎం అసంతృప్తి ప్రకటించారని, ఈ ప్రక్రియలో భాగస్వాములైన మంత్రులు, ఉన్నతా ధికారులపై ఆగ్రహం ప్రకటించారని వార్తలొ చ్చాయి. అంతేకాకుండా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు వచ్చేనెల 25న తానే స్వయంగా లండన్‌ వెళ నున్నట్లు ప్రకటించిన సీఎం డిజైన్ల రూప కల్పన కమిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ను నియమించడం చర్చకు తా విచ్చింది. సినీ దర్శకులు రాజమౌళి, బోయపాటి శ్రీనుల సహాయ సహకారాలను తీసుకుని అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లు ప్రభుత్వం ఆశించిన విధంగా రూపొందేలా చూడాలని కూడా సీఎం సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ను ఆదేశించడమూ తెలిసిందే.
 
కారణాలపై చర్చలు..
అసెంబ్లీ డిజైన్లపై ముఖ్యమంత్రి అసంతృ ప్తికి వేరే కారణాలేవీ లేవని, కేవలం అవి మరింత బాగా రావాలన్న తపనతోనే ఆయన వాటి మెరుగుదలకు ఆదేశించారని రాజ ధానిలోని పలువురు రైతులు నమ్ముతున్నా ఇంకొందరు మాత్రం వేరే బలమైన కారణా లేవో ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై గురు, శుక్ర, శనివారాల్లో రాజ ధాని గ్రామాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ చర్చలు జరిగాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఆశించినంతగా రాక పోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదన పూర్తిగా అసంబద్ధమని, హడ్కో, ప్రపంచ బ్యాంక్‌, బాండ్ల విడుదల వనరుల ద్వారా రాజధాని నిర్మాణానికి అవ సరమైన నిధులు ఇప్పటికే సమకూరాయని పలువురు గుర్తు చేస్తున్నారు.
 
      ఇదే సమయంలో తాను రుణమందిస్తున్న రాజధాని ప్రాజెక్టుల విషయంలో నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారా, లేదా అనే విషయమై ప్రపంచ బ్యాంక్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం బుధ, గురువారాల్లో రాజధాని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం, పలువురు రైతు లతో సమావేశమవడం ఏమన్నా ప్రభావం చూపి ఉంటుందా అనే అనుమానాలూ వ్యక్త మవుతున్నాయి. కాగా.. రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగు తుండడంతోపాటు కొన్ని రాజధాని గ్రామా ల్లోని ప్లాట్లకు ఆశించినంతగా ధరలు పలకని నేపథ్యంలో అసెంబ్లీకి జరిగే శంకుస్థాపనతో వాటికి ఊపు లభిస్తుందనుకుంటున్న పలువు రు ఆ కార్యక్రమం వాయిదా పడడంతో డీలా పడ్డారు. కొందరు మాత్రం అసెంబ్లీ శంకు స్థాపన కేవలం కొద్ది వారాలపాటు వాయిదా పడడం రాజధాని ప్లాట్ల గిరాకీని ఏమాత్రం తగ్గించలేదంటున్నారు. సీఆర్డీయే, ఏడీసీ వరుసగా అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ లోని పరిపాలన, నివాస సముదా యాలతోపాటు పలు రహదారులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన టెండర్లను పిలుస్తున్న దృష్ట్యా ప్లాట్ల డిమాండ్‌కు ఏమాత్రం ఢోకా ఉండబోదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
Posted
94 రోజులు.. 350 ఎకరాలు!



  • రాజధానిలో భూసమీకరణ జరిగిన తీరు!
  • గత 3 రోజుల్లోనే 25 ఎకరాలు
  • వ్యతిరేకించిన రైతుల్లోనూ పునరాలోచన

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి తమ భూములిచ్చేది లేదని దాదాపు రెండేళ్లుగా భీష్మించుకుని కూర్చున్న ఆయా గ్రామాల్లోని కొందరు రైతుల్లో పునరాలోచన ప్రారంభమైంది. భూ సమీకరణ ప్రక్రియ కింద తమ తోటివారికి అందుతున్న ప్రయోజనాలను, పొందుతున్న లాభాలను బేరీజు వేసుకుని.. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు ముందడుగు పడడంతో వారిలో మార్పు కనబడుతోంది. తమ భూములు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 12 నుంచి శనివారం వరకు.. అంటే మూడు నెలల వ్యవధిలో 381 మంది.. 350 ఎకరాలను భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ, సంబంధిత పత్రాలు అప్పగించారు.

 

ఇప్పటికే భూసమీకరణ దాదాపుగా పూర్తయిన గ్రామాలే కాకుండా.. పూలింగ్‌కు వ్యతిరేకంగా బలంగా గళమెత్తిన కొన్ని గ్రామాల రైతులూ వీరిలో ఉండడం గమనార్హం! రాజధానికి అవసరమైన భూములను బలవంతంగా లాక్కున్నారంటూ కొందరు రైతులు చేసిన ఫిర్యాదులపై నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రపంచబ్యాంకు తనిఖీ బృందం ఈ నెల 13 నుంచి 15 వరకు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే.. నాడు వ్యతిరేకించిన వారిలో 19 మంది సంతోషంగా, స్వచ్ఛందంగా 25 ఎకరాలకుపైగా భూములను అప్పగించడం అధికారవర్గాల్లో ఆనందం నింపింది. ఈ ఏడాది జూన్‌ 12 నాటికి మొత్తం 26,150 మంది రైతులు 32,683 ఎకరాలను భూసమీకరణ కింద ఇవ్వగా.. అప్పటి నుంచి శనివారంనాటికి వారి సంఖ్య 26,531కి, సమకూరిన భూమి 33,033 ఎకరాలకు చేరింది.

 

రైతుల్లో పెరుగుతున్న భరోసా..

భూసేకరణ, భూసమీకరణలను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు రాజధానికి తమ భూములిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. వీరికి నచ్చజెప్పి.. భూసమీకరణ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు విస్తృతంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే భూములిచ్చిన వారు పొందుతున్న ప్రయోజనాలను చూసిన మరింత మంది భూములిస్తున్నారని అధికారులు అంటున్నారు.

Posted

రాజధాని ఆకృతులపై రాజమౌళితో చర్చ

18ap-state5a.jpg

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు నిర్మాణాల ఆకృతుల(డిజైన్ల)పై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సినీ దర్శకుడు రాజమౌళి సుముఖత చూపారు. వారం రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముంది. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌లు సోమవారం హైదరాబాద్‌లో రాజమౌళితో సమావేశమయ్యారు. రాజధాని డిజైన్లను ఆయనకు అందించి గంటపాటు చర్చించారు. ఆకృతుల ప్రతుల్ని తీసుకున్న రాజమౌళి వాటిపై తన బృందంతో కలిసి అధ్యయనం చేస్తానని తెలిపారు. వీలైనంతగా తానీ ప్రక్రియలో పాలుపంచుకుంటానని, చేతనైన సాయం చేస్తానని పేర్కొన్నారు. డిజైన్లు రూపొందించిన నార్మన్‌, ఫోస్టర్‌ సంస్థ ప్రధాన కార్యాలయమున్న లండన్‌కి రాజమౌళిని తీసుకెళ్లి ఆ సంస్థ సాంకేతిక నిపుణులతో చర్చించాలని సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో... అవసరమైతే ఎక్కడికైనా వస్తానని కూడా రాజమౌళి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Posted

అమరావతి: రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్ల విషయమై ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బుధవారం విజయవాడకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆకాశమార్గంలో ఉదయం విజయవాడ చేరుకోనున్న ఆయన... ఆ వెంటనే సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో కలసి, ఈ డిజైన్లు ఎలా రూపుదిద్దుకోవాలని సీఎం ఆశిస్తున్నారో తెలుసుకుంటారని సమాచారం. వాస్తవానికి విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సమావేశాల్లో పాల్గొనాల్సిన దృష్ట్యా ఆ 2 రోజులూ ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. అందువల్లనే రాజధాని నిర్మాణాంశాలపై ప్రతి బుధవారం క్రమం తప్పకుండా నిర్వహించే ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశాన్ని కూడా రద్దు చేశారు. కానీ, డిజైన్ల ప్రధాన్యత దృష్ట్యా... కలెక్టర్ల సమావేశం కంటే ముందే సీఎంతో రాజమౌళి భేటీ అవుతారని తెలిసింది. కాగా, వచ్చేనెల తొలి వారంలో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్‌ వెళ్తారని సమాచారం.

Posted
చంద్రబాబును కలిసిన డైరెక్టర్ రాజమౌళి
20-09-2017 08:41:37
 
636414937175190323.jpg
అమరావతి: అమరావతిలో డిజైన్లపై సీఎం చంద్రబాబును దర్శకుడు రాజమౌళి కలిశారు. ప్రభుత్వం భవనాల విషయంలో సలహాలివ్వాలని ప్రభుత్వం కోరడంతో ఆయన సీఎంను కలిశారు. ఈ భేటీలో అమరావతి డిజైన్లపై చర్చిస్తున్నారు. ఈ నెలాఖరులో లండన్ రాజమౌళి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలిస్తారు. ఇప్పటికే రాజమౌళిని కలిసిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కలిశారు.
 
వాస్తవానికి విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సమావేశాల్లో పాల్గొనాల్సిన దృష్ట్యా ఆ 2 రోజులూ ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. అందువల్లనే రాజధాని నిర్మాణాంశాలపై ప్రతి బుధవారం క్రమం తప్పకుండా నిర్వహించే ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశాన్ని కూడా రద్దు చేశారు.
Posted
ప్లయిట్ ఆలస్యం వల్ల చంద్రబాబుతో ఎక్కవసేపు మాట్లాడలేదు: రాజమౌళి
20-09-2017 09:52:06
 
636414979458828667.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో సీఎం చర్చించారు. సమావేశం అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఫ్లయిట్ ఆలస్యం అవడం వల్ల చంద్రబాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదని చెప్పారు. అమరావతి నిర్మాణాల డిజైన్లపై పూర్తి స్థాయిలో చర్చించలేదని తెలిపారు. మధ్యాహ్నం మరోసారి సీఎంతో భేటీ అవుతానని పేర్కొన్నారు. నర్మన్ పోస్టర్ ఇచ్చిన డిజైన్లు పరిశీలించిన తర్వాత స్పందిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చారు. డిజైన్ల ప్రధాన్యత దృష్ట్యా... కలెక్టర్ల సమావేశం కంటే ముందే సీఎంతో రాజమౌళి భేటీ అయ్యారు. వచ్చేనెల తొలి వారంలో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్‌ వెళ్లనున్నారు.
Posted

ఏడాదిలో అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం

అభిప్రాయాలు, సలహాల స్వీకరణకు త్వరలో వెబ్‌సైట్‌

ప్రజాభిప్రాయ సేకరణలో మంత్రి ఆనందబాబు వెల్లడి

గుంటూరు జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే

19ap-main6a.jpg

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశిష్ఠత అందరికీ తెలిసేలా.. రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో 125 అడుగుల విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను ఏడాది కాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఈ నిర్మాణాలపై గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 20 ఎకరాల్లో అంబేడ్కర్‌ స్మృతి వనం నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. మూడు రోజుల్లో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఈ నిర్మాణాలపై ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, సలహాలు, ఆకృతులు స్వీకరిస్తామని ప్రకటించారు.

19ap-main6b.jpg

సచివాలయానికి దగ్గరలో 5 ఎకరాల్లోనైనా నిర్మించాలి: డీసీ రోశయ్య

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డీసీ రోశయ్య మాట్లాడుతూ దళితులు అనాదిగా వూరికి దూరంగా ఉంటున్నారని, ఇప్పుడు అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని కూడా రాజధానికి వెలుపల నిర్మించాలనే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. సచివాలయానికి దగ్గరలో 5 ఎకరాల్లోనైనా నిర్మించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్‌ మాల్యాద్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు పలు సూచనలు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ, రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ జె.ఆర్‌.పుష్పరాజ్‌, గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, 13 జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...