Jump to content

Phone Tapping


Recommended Posts

*అష్టదిగ్బంధం..!*

*కెసిఆర్ కుటుంబం పై ఈడీ కత్తి..!*

*లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్..!*

*అత్యంత విశ్వసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు.!*

*ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరి బిక్కిరి.!*

*అల్లుడు అనిల్ నీ ఏక్షణమైనా అరెస్టు చేయొచ్చని వార్తలు.!*

*అవసరమైతే కెసిఆర్ కు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్..??!*

*లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు వరకు ఉన్నాయా??..!*

*ఫోన్ ట్యాపింగ్ లో మరో బ్రాంచ్ గా పత్రిక అధిపతి.!*

*ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల పాత్ర పై నిఘా !*

*ఇప్పటికే పార్టీని విడుతున్న కీలక నేతలు.!*

*మసక బారుతున్న బిఆర్ఎస్ ప్రభావం.!*

అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను అల్లకల్లోలం చేస్తుంది ముప్పేట జరుగుతున్న విచారణ సంస్థల దాడులతో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలని ఆయన కళ్ళముందే కుప్పకూలిపోతున్నాయి....

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ ప్రభావం మసకబారుతుంది ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు అయ్యారు ఆమె భర్త అనిల్ కూడా అరెస్టు ?అయ్యే ఛాన్స్? ఉందనే ప్రచారం సాగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి ఒకవైపు కవితను విచారించిన ఈడి ఆమె భర్త అనిల్ ఆర్థిక లావాదేవులపై గురి పెట్టింది అనిల్ రావు సోదరి అఖిల వారి బంధువులైన మేక చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్ము ను  పంజాబ్ గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే  ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను  ఈడి సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు  రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది కేజ్రీవాల్  విచారణ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగునుందని అంటున్నారు అల్లుడు అనిల్ తో పాటు ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరావు కి సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో ఈడి ఆరా తీసింది ఇప్పుడు కవిత ఆమె భర్త అనిల్ అల్లుడు చరణ్ పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తుండడంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతుంది..

*ఫోన్ ట్యాపింగ్ లో ఇంకో లైన్ ను టచ్ చేస్తారా.!*

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి విచారణలో ప్రణీత్ రావు చెప్పింది గోరంత సమాచారం అని తెలుస్తుంది ఓ చానల్ ఎండి ఒకవైపు మిస్ యు చేస్తే మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజు కోసం మరో లైన్ ని వాడకం జారీపారని సమాచారం అందుకు ప్రభాకర్ రావు బావమరిది అశ్విని రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని విచారణలో తేలుతుంది మరో లైన్ లో మన రాష్ట్రం మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తా గిరి చేసిన ఓనర్ పాత్ర పై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు సొంత కుటుంబ సభ్యుల భార్యల ఫోన్స్ ట్యాపింగ్ కూడా ఈ బ్రాంచ్ ముందే జరిగాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే శ్రవణ్ రావు లండన్ వెళ్లిపోగా అతను మామతో పాటు మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు రాధాకృష్ణారావు అమెరికా వెళ్లినట్లు గుర్తించారు ప్రభాకర్ రావుని విచారిస్తే అప్పటి ముగ్గురు రావూలు అప్పటి బీసీ మంత్రి పాత్ర పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి..

*అమెరికా నుంచి ప్రణీత్ కుటుంబానికి ఫోన్స్..!*

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే అప్పటి ఎస్ఐబీ చీప్  ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు ఆ వెంటనే ఓ న్యూస్ ఛానల్ వ్యక్తితో పాటు మాజీ పోలీసు అధికారి రాధాకృష్ణ అమెరికాకు చెక్కేశారు అయితే ప్రణీత్ రావు ను నేరుగా  కాంటాక్ట్ అయ్యేందుకు అతని తండ్రికి ఫోన్స్ చేస్తున్నారు ప్రణీత్ తండ్రి కిషన్ రావు గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్లో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో  రెండో బ్రాంచ్ ను  టచ్ చేసి విచారిస్తే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతాయని సమాచారాన్ని కిషన్ రావు కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు సమాచారం...

*బిక్కుబిక్కుమంటున్న అప్పటి సన్నిహితులు..!*

ప్రభుత్వము ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే  అత్యాశ ఇప్పుడు వారి కుటుంబాలను నిద్రలేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు  కేసీఆర్ ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లు సమాచారం డబ్బులు రియల్ ఎస్టేట్ వాటాలతో చాలామంది నేతలు బాగా సంపాదించారని వారందరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక పోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అంతేకాదు కేసీఆర్ కు దగ్గరగా ఉండే కంపెనీల పైన దృష్టి సాధించినట్లుగా సమాచారం..

Link to comment
Share on other sites

1 hour ago, naresh1243 said:

Karma is bitch

Ye tapping chesi TDP ni babu ni TG nunchi exit ayyettu chesaado vaadi party strengthen kosam....ippudu ade case tho....veedi party kosam almost exit ayyettundi🤣

😂😂

Link to comment
Share on other sites

Praneeth Rao case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నేరం అంగీకరించిన నిందితులు!

ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది.

Updated : 25 Mar 2024 17:17 IST
 
 
 
 
 
 

124058574_250124phonetapping1a.jpg

హైదరాబాద్‌: ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మంగళవారం కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతోపాటు, ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్‌డిస్క్‌ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావు, రాధాకిషన్‌ పేర్లను నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వారిని కూడా విచారించాల్సి ఉన్నందున వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. 

తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...