Jump to content

Recommended Posts

Posted (edited)

గోదావరి వృథా జలాలు సాగర్‌ ఆయకట్టుకు

చింతలపూడి ఎత్తిపోతల ద్వారా మళ్లించే వీలు

ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అధికారుల ప్రతిపాదన

ఈనాడు, రాజమహేంద్రవరం: గోదావరికి వరదలు వచ్చినప్పుడు అందులో నుంచి మరో 38 టీఎంసీల నీటిని చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు మళ్లించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగిన కారణంగా నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రుణంలో సుమారు రూ.480 కోట్లు ఆదా అయింది. దీంతో ఆ మిగులు నిధులను మరిన్ని పనులకు కేటాయించాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ ప్రాజెక్టు పీడీ వెంకటరామయ్య కోరారు. రాజమహేంద్రవరానికి బుధవారం వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ పనుల ఇంజినీర్లు, నీటి పంపిణీ సంఘ ప్రతినిధులు ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు నిధులతో చేపట్టనున్న పనుల వివరాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు స్థిరీకరణతో పాటు కృష్ణా జిల్లాలో అదనంగా మరో 2.80 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు తమ వద్ద ఉన్న ప్రతిపాదనలు చూపారు. ఇందుకు రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న సగటు నీటిలో 1.5 శాతం మాత్రమే తాము సేకరిస్తామని, ఆ సమయంలో నాగర్జునసాగర్‌ పరిధిలో వరదలుంటే తీసుకోబోమని తెలిపారు. దీనిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను అందజేయాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు చెన్‌జుయూన్‌, బీకేడీ రాజు, ఎస్‌కే జైన్‌, పి.శ్రీనివాసరావు సూచించారు.

Edited by sonykongara
Posted

AP project adi poorthigaa AP ki share emiti, mothham water AP kosam. Chinthalapudi water ni N.Sagar Canals loki vaduluthaaru.

Posted

ippudu unna chintalapudi lift chivarana inkoka lift petti Krishna lo uplands ki, plus sagar left canal chivari boomulu ni stabilize cheyyalani planning

aite only lift dwara jarige pani kaadu.

West agency lo Jalleru reservoir okati undi around 5 TMC capacity. Daanini 25-30 TMC ki penchi, pago and krishna uplands ki vadukovalani trying

That reservoir will be key for this project

TFS BRO.

Jalletu penchethe its good idea ... Zilla ko 25-30 storage capacity chesukovali ... Its need of hour

  • 1 month later...
Posted
‘చింతలపూడి’ రెండోదశకు ప్రతిపాదనలు
 
ముఖ్యమంత్రి దృష్టికి పథకం ప్రణాళిక 
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో
ఎగువ ప్రాంతాల నీటి కష్టాలకు చెక్‌

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ఎగువ ప్రాంతాల నీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధమవుతోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండోదశపై రాష్ట్ర జల వనరుల శాఖ దృష్టి పెట్టింది. ఫేజ్‌-2లో 138.67 క్యూసెక్కుల నీటిని ప్రస్తుత చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పశ్చిమగోదావరి జిల్లా గుడ్డిగూడెం వద్ద 86 మీటర్ల ఎత్తులో పంప్‌హౌజ్‌ను ఏర్పాటు చేసి పంపింగ్‌ చేయడం ద్వారా నీటిని విడుదల చేయాలని జల వనరుల శాఖ యోచిస్తోంది. ఈ పథకం వల్ల కృష్ణా జిల్లా తిరువూరు, నందిగామ, గన్నవరం, నూజివీడు శాసనసభ నియోజకవర్గాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగుతుందని జల వనరుల శాఖ పేర్కొంటుంది. శుక్రవారం సీఎం కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రణాళికను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
  • 1 month later...
  • 4 weeks later...
  • 2 weeks later...
Posted

Nagarjuna Sagar Left canal kinda TG daati AP boarder segments of West Godavari & Krishna ki water asalu raanivvadam ledu last 2 years nunchi. Better to complete this project as it will benefit all those metta areas & also we can take water saved from Nagarjuna Sagar left canal directly into Nagarjuna Sagar right canal. TG meeda dependency vundadu. They can't stop water.

NS left canal lo AP vata entha vundi brother?

Posted

20-30 TMCs vuntadi mana share left canal lo. Total Left canal ki 130 TMC max.

good. aa 20 TMC saved water right canal ki divert cheste praksam district lo chivari bhumulaku baaga use vuntundi.

  • 2 weeks later...
Posted
చింతలపూడి ఎత్తిపోతలకి సీఎం పచ్చజెండా
 
  •  ఆర్థిక శాఖ కొర్రీలు వెనక్కి... నేడు ఉత్తర్వు జారీకి జల వనరుల శాఖ సిద్ధం 
హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టా ఎగువ ప్రాంత రైతులకు వర ప్రదాయినిగా భావిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణకు సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. తొలుత ఈ పథకం విస్తరణను 2017-18లో నిర్వహించాలంటూ ఆర్థిక శాఖ కొర్రీ వేసింది. అయితే.. చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ వల్ల కృష్ణా డెల్టా ఎగువ ప్రాంత రైతులకు కలిగే ప్రయోజనంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఎంకి వివరించారు. దీంతో ఈ విస్తరణ పనులకు సంబంధించిన ఫైలును పరిశీలించాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ టక్కర్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ ఫైలును పరిశీలించిన సీఎస్‌.. చింతలపూడి విస్తరణకు సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచే కొనసాగించాలని, అంచనాలు రూపొందించి టెండర్లను పిలవాలని ఆదేశించారు. దాంతో బుధవారం విజయవాడలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వుల జారీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Posted

Ee aavedana vyaktam cheyyadam yendo.. yemi cheyyaleka pothe aavedana vyaktam chestaru, chethilo adhikaram vunnappudu nayano bhayano vyathirekulni daari loki techukovaali

  • 3 weeks later...
Posted

విజయవాడ: ఈ ఏడాది రాయలసీమకు 24 టీఎంసీల నీరు ఇచ్చామని నీటీపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతలకు రూ.4,909 కోట్ల పాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. చింతలపూడి ద్వారా కృష్ణా, ప.గో జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...