Jump to content

Recommended Posts

Posted
చింతలపూడిలో ముందడుగు 
 858.67 ఎకరాల అటవీ భూములకు రెండో దశ అనుమతులు

ఈనాడు, అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకంలో కాలువల పనులు ముందుకు సాగేందుకు వీలుగా అటవీ భూములకు రెండో దశ అనుమతులు లభించాయి. తొలిదశ పనులు చేపట్టేందుకు వీలుగా 858.67 ఎకరాల అటవీ భూములకు అనుమతులు లభించాయి. తొలిదశ అనుమతుల్లో అటవీశాఖ సూచించిన మేరకు జలవనరులశాఖ ఏర్పాట్లు చేయడంతో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ రెండో దశ అనుమతులు ఇచ్చింది. దీంతో ఆ అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడినట్లే. ఈ అనుమతుల కోసం జలవనరులశాఖ నుంచి కృషి చేసి నిరంతరం అనుశీలన చేయడంతోనే సాధ్యమైందని చింతలపూడి ఎస్‌ఈ రమేష్‌బాబు చెప్పారు. చిన్న చిన్న కారణాలతో దాదాపు మూడు సార్లు ఈ దస్త్రం వెనక్కు తిరిగి వచ్చింది. విశాఖ జిల్లాలో ప్రత్యామ్నాయంగా అటవిని అభివృద్ధి చేసేందుకు భూమి చూపించడంతో పాటు అవసరమైన చెల్లింపులు పూర్తిచేశారు. 
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో రూ.4909.80 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. మొత్తం 53.50 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగించేలా ఈ పథకాన్ని పునర్‌ ప్రణాళికతో మార్పులు చేసి పనులు చేపట్టారు.

* ప్రస్తుతం తొలి దశ పనులకు అవసరమైన 858.67 ఎకరాల అటవీభూములకు అనుమతులు లభించాయి. దీని వల్ల దాదాపు 11.2 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ, 1.5 కిలోమీటర్ల మేర పైపులు వేసేందుకు పనులు చేపట్టేలా అవకాశం ఏర్పడుతుంది. 
* రెండో దశ పనులకు సంబంధించి 172.05 ఎకరాల అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశ అనుమతులకు అనుగుణంగా అవసరమైన వివరాలను సమర్పించారు.

జల్లేరు 14 టీఎంసీలకే పరిమితం 
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలుత 8 టీఎంసీలు జల్లేరులో నిల్వ చేయాలని భావించారు. ఆ తర్వాత రెండు దశలుగా పథకాన్ని విస్తరించి ఆయకట్టు ప్రయోజనాన్ని విస్తరించిన నేపథ్యంలో జల్లేరు సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నిపుణులు దీన్ని పరిశీలించారు. జల్లేరు సామర్థ్యం పెంచితే అటవీ భూములు తెలంగాణ భూభాగం నుంచి కూడా అవసరమవుతుందని భావించారు. దీంతో జల్లేరు సామర్థ్యాన్ని తగ్గించాలని నిర్ణయించారు. మొత్తం 14 టీఎంసీలకు ఇది పరిమితం చేయనున్నారు. దీంతో 6670 ఎకరాల అటవీభూమి అవసరమవుతుందని తేల్చారు.

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
Posted
3 hours ago, sonykongara said:

g4Txgyw.jpgUFraRZJ.jpg

Somebody please take this up to Leadership and Lokesh. akkada yevaro nashta pariharam andaka pellillu aagipoyayi ani antunnaru yekamga

Posted
ఖరీఫ్‌కు చింతల పూర్తి
04-02-2019 09:46:22
 
636848704616440438.jpg
  • జూన్‌లో నీటి విడుదలకు సన్నాహాలు
  • జిల్లాలో 18 మండలాలు సస్యశ్యామలం
  • కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు
  • 410 గ్రామాలకు తాగునీరు
  • 9 నియోజకవర్గాలకు లబ్ధి
4.89 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 410 గ్రామాల్లోని 21 లక్షల జనాభాకు తాగునీరందించే ప్రతిష్టాత్మక చింతలపూడి ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఖరీఫ్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
 
విజయవాడ: కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని మెట్టప్రాంత భూములకు గోదావరి జలాలను అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ఏడాది జూన్‌కు ఆ ప్రాజెక్టు పరిధిలోని పంట భూములకు సాగునీటిని విడుదలచేసే లక్ష్యంతో రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం మూడు దశల్లో గోదావరి జలాలను ఎత్తిపోసి నిర్ధేశిత ఆయకట్టుకు నీటిని అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఏర్పాటుచేసిన మొదటి పంపుహౌస్‌లో రెండు పంపుల ట్రయల్‌ రన్‌ను పూర్తిచేశారు. తాడిపూడి వద్ద మొదటి లిఫ్ట్‌ ద్వారా గోదావరి నుంచి 89 అడుగుల ఎత్తుకు నీటిని తోడిపోసి గుడ్డిగూడెం వరకు తరలిస్తారు. అక్కడ ఏర్పాటుచేస్తున్న రెండో లిఫ్ట్‌ ద్వారా 305 అడుగుల ఎత్తున నీటిని తోడి చింతలపూడి ప్రధాన కాలువకు మళ్లిస్తారు. రౌతుగూడెం వద్ద మూడో పంపుహౌస్‌ను ఏర్పాటుచేసి గోదావరిలోకి వరదనీరు ఎక్కువగా చేరినప్పుడు ఆ నీటిని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా 14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జల్లేరు వద్ద రిజర్వాయరును నిర్మించ తలపెట్టారు.
 
 
శరవేగంగా పనులు
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 4.89 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 410 గ్రామాల్లో నివసిస్తున్న 21 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టును రూ.7,909 కోట్ల అంచనాతో చేపట్టింది. 2017, సెప్టెంబరు 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 6,923 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీల గోదావరి జలాలను చివరి ఆయకట్టు వరకు దాదాపు 130 కిలోమీటర్లు తరలించేందుకు మూడుచోట్ల శక్తిమంతమైన పంపుహౌస్‌లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా కోసం గుడ్డిగూడెం దగ్గర 400 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమ్మిలేరు మీద అక్విడెక్టు నిర్మాణం, గుడ్డిగూడెం దగ్గర రెండో పంపుహౌస్‌, నీటి పంపిణీకి వీలుగా పశ్చిమగోదావరి జిల్లాలో 82 కిలోమీటర్లు, కృష్ణాజిల్లాలో 24 కిలోమీటర్లపైగా ప్రధాన కాలువల తవ్వకం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
 
తాడిపూడి వద్ద ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మొదటి పంపుహౌస్‌లో మొత్తం 18 పంపులు, వాటికి మోటార్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. ఈ పంపుహౌస్‌ ద్వారా 6,923 క్యూసెక్కుల నీటిని తోడి 2.85 కిలోమీటర్ల దూరంలో ఉన్న లీడింగ్‌ చానల్‌కు తరలించేందుకు వీలుగా ఒక్కొక్కటి 10 అడుగుల వ్యాసంతో 11 వరుసలుగా పైపులైన్‌లను ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు మొదటి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదే ఒరవడిని కొనసాగిస్తూ గుడ్డిగూడెం వద్ద మొత్తం 14 పంపులతో కూడిన రెండు పంపుహౌస్‌లు, అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లడానికి వీలుగా ఒక్కొక్కటి 10 అడుగుల వ్యాసంతో 14 వరుసలుగా పైపులైన్‌లు ఏర్పాటు చేసే పనులను వెంటనే పూర్తిచేసేలా జలవనరులశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
 
 
తమ్మిలేరుపై చురుగ్గా అక్విడెక్టు నిర్మాణం
చింతలపూడి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు 82 కిలోమీటర్ల మేర ప్రవహించి తమ్మిలేరు వాగును దాటి కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తాయి. దీంతో తమ్మిలేరుపై అక్విడెక్టు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ అక్విడెక్టును దాటిన గోదావరి జలాలు 13 కిలోమీటర్ల పొడవున లింకు కాలువ ద్వారా చాట్రాయి మండలంలోని బూరుగగూడెం వద్ద నాగార్జునసాగర్‌ 21వ బ్రాంచి కెనాల్‌కు సంబంధించిన వేంపాడు మేజర్‌కు చేరతాయి. అక్కడి నుంచి దిగువన ఆయకట్టును సస్యశ్యామలం చేయడంతోపాటు 10.40 కిలోమీటర్ల ఎగువకు ప్రవహించి రామచంద్రాపురం రెగ్యులేటర్‌ ద్వారా నూజివీడు, మైలవరం బ్రాంచి కాలువల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు తెలిపారు. రూ.4,909 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.2,700 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 7,397 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇంతవరకు 6,651 ఎకరాల భూమిని అప్పగించారని, ఇంకా 746 ఎకరాల భూమికి వివిధ ప్రభుత్వ శాఖలు, న్యాయస్థానాల నుంచి క్లియరెన్స్‌లు రావాల్సి ఉందని తెలిపారు.
 
 
సస్యశ్యామలమే..
గోదావరి నుంచి చింతలపూడి ప్రధాన కాలువకు మళ్లించే జలాలు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల పరిధిలోని గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, పెదవేగి, దెందులూరు, పెదపాడు మండలాల పరిధిలో భూములకు చేరుతుంది. అక్కడి నుంచి తమ్మిలేరు వాగు దాటి చీపురుగూడెం వద్ద గోదావరి జలాలు కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఈ జిల్లాలోని మైలవరం, తిరువూరు, గన్నవరం, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్‌ మండలాల పరిధిలోని భూములు సస్యశ్యామలమవుతాయని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 
Posted

చింతలపూడి ఎత్తి పోతుల పధకం లొ భాగం గా తమ్మిలెరు లొ నిర్మిస్తున్న బ్రిడ్జి దీని ద్వారా మైలవరంలో కి నీరు వస్తది మార్చి నెలలో నీరు ఇవ్వడానికి సిద్దం చేస్తున్నారు.

https://pbs.twimg.com/media/Dyn8aqwVsAAndPm.jpg

https://pbs.twimg.com/media/Dyn8wQ2VYAI4ECW.jpg

  • 1 month later...
Posted
23 minutes ago, RKumar said:

June ki ready avuthunda project?

Nope lot of pending work and land acquisition payments are not done yet for many villages in WG

  • 3 years later...
Posted
51 minutes ago, Sunny@CBN said:

What is the status of the project now? Ma jailanna em peekadu 3 years ga.

Akkada guntalu poorcha daanike President medal doraka ta ledu. Inka irrigation projects ante district ki 2 distalaries pettali emo  

Posted

cbn unte ayipoyundedi , bad luck..

 

last time cbn vision in irrigation super .

 

keeping this aside last time , krishna river meda 2 barrage plan chesaru , left canal nundi macherla , piduguralla atu nundi Prakasam daka water tesuku velali ani design chesaru .. now it's shelved .. e barrage ki polavaram canal ni divert chesi water pump chedam ani kuda design chesaru with minimal cost.. ani ataka ekayi

Posted (edited)
20 minutes ago, PP SIMHA said:

cbn unte ayipoyundedi , bad luck..

 

last time cbn vision in irrigation super .

 

keeping this aside last time , krishna river meda 2 barrage plan chesaru , left canal nundi macherla , piduguralla atu nundi Prakasam daka water tesuku velali ani design chesaru .. now it's shelved .. e barrage ki polavaram canal ni divert chesi water pump chedam ani kuda design chesaru with minimal cost.. ani ataka ekayi

Next time :no1:

Edited by akhil ch

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...